Dasaradh
-
అది 'తేరీ' రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)రీసెంట్గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్‌ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్‌లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)Abba Sairam 🙏#UstaadBhagathSingh pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024 -
లిరిక్స్ మారిస్తే కానీ షూట్ చేయమన్నారు : ఆర్పీ పట్నాయక్
నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'సంతోషం'. గ్రేసీ సింగ్, శ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. 2002లో విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంతోషం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దేవుడే దిగివచ్చినా' సాంగ్ కంపోజింగ్ చాలా విచిత్రంగా జరిగింది. ముందు వేరే పాట ఇచ్చాను. కానీ ఆ పాటకి ఎలా కంపోజ్ చేయాలో తెలియడం లేదని రాజు సుందరం మాస్టర్ షూటింగ్ ఆపేశారు. లిరిక్స్ మారిస్తేనే చేస్తానని చెప్పారు. దీంతో చాలా టెన్షన్ పడిపోయాను. నేను వాష్ రూమ్‌కి వెళ్తే డైరక్టర్ దశరద్ బయటి నుంచి గడియ పెట్టి బంధించాడు. పల్లవి చెబితేనే గడియ తీస్తానన్నాడు. అదే టెన్షన్లో 'దేవుడే దిగివచ్చినా' అనే పల్లవి చెప్పాను. దీంతో మిగతా లైన్స్ వచ్చేస్తాయిలే అని దశరధ్ గడియ తీశాడు. అలా లిరిక్స్ మార్చి షూటింగ్ చేశాం' అంటూ చెప్పుకొచ్చారు. -
దశరధ్తో మళ్లీ Mr. పర్ఫెక్ట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ...దూకుడు కొనసాగిస్తున్నాడు. 'మిర్చి' తర్వాత గ్యాస్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు వరుస పెట్టి సినిమాలపై దృష్టి పెట్టాడు. గత రెండేళ్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బహుబలి'తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది తన అభిమానులకు ట్రిపుల్ థమాకా అందించబోతున్నాడు. ఇప్పటికే 'రన్ రాజా రన్' దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించిన ప్రభాస్ తాజాగా 'మిస్టర్ పర్ఫెక్ట్' దర్శకుడు దశరధ్తో మరోసారి పని చేయబోతున్నాడు. ఇప్పటికే దశరధ్...ప్రభాస్‌ను కలిసి కథను వినిపించినట్లు సమాచారం. కథ నచ్చిన ప్రభాస్ ఆ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హీరో సన్నిహతులు వెల్లడించారు. ప్రభాస్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి -2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం విడుదలయిన వెంటనే దశరథ్ దర్శకత్వంలో త్ర షూటింగ్ ప్రారంభం కానుంది. దశరధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఫిలిం నగర్ వర్గాలు భావిస్తున్నాయి. 2011లో వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన Mr. పర్ఫెక్ట్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.