దశరధ్తో మళ్లీ Mr. పర్ఫెక్ట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ...దూకుడు కొనసాగిస్తున్నాడు. 'మిర్చి' తర్వాత గ్యాస్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు వరుస పెట్టి సినిమాలపై దృష్టి పెట్టాడు. గత రెండేళ్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బహుబలి'తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది తన అభిమానులకు ట్రిపుల్ థమాకా అందించబోతున్నాడు. ఇప్పటికే 'రన్ రాజా రన్' దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించిన ప్రభాస్ తాజాగా 'మిస్టర్ పర్ఫెక్ట్' దర్శకుడు దశరధ్తో మరోసారి పని చేయబోతున్నాడు.
ఇప్పటికే దశరధ్...ప్రభాస్ను కలిసి కథను వినిపించినట్లు సమాచారం. కథ నచ్చిన ప్రభాస్ ఆ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హీరో సన్నిహతులు వెల్లడించారు. ప్రభాస్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి -2 చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం విడుదలయిన వెంటనే దశరథ్ దర్శకత్వంలో త్ర షూటింగ్ ప్రారంభం కానుంది. దశరధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఫిలిం నగర్ వర్గాలు భావిస్తున్నాయి. 2011లో వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన Mr. పర్ఫెక్ట్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.