కొత్త హీరోయిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్‌ | Prabhas Treats Actress Imanvi With Home Food | Sakshi
Sakshi News home page

కొత్త హీరోయిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్‌

Jan 31 2025 11:33 AM | Updated on Jan 31 2025 12:05 PM

Prabhas Treats  Actress Imanvi With Home Food

టాలీవుడ్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లో ఆయన ఉన్నారంటే చాలు.. అక్కడ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లను ప్రభాసే చూసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చే  ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలోని స్టార్స్‌ అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. పాన్‌ ఇండియా స్టార్‌గా ఆయన ఎదిగినప్పటికీ చిత్ర యూనిట్‌ వారికి ఆతిథ్యమివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభాస్‌ ఇంటి భోజనమంటే బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా లొట్టలేసుకుని ఆరగించేస్తారు. అయితే, తాజాగా తన హీరోయిన్‌కు ప్రభాస్‌ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది.

ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి ప్రభాస్‌ ఆతిథ్యం ఇచ్చారు. తన ఇంటి నుంచి ఆమెకు క్యారేజీ పంపారు. భోజనం చాలా బాగుంది అంటూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో (Hanu) ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. షూటింగ్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' (Fauji) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌తోనే ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా నెటిజన్లకు ఆమె సుపరిచితురాలు. ఇన్‌స్టాలో ఆమె డ్యాన్స్‌ రీల్స్‌కు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలా ఆమెకు సినిమా అవకాశం దక్కింది. ఈ సినిమానే ఆమెకు తొలి ప్రాజెక్ట్‌ కావడం విశేషం. కొత్త హీరోయిన్లకు కూడా ప్రభాస్‌ ఆతిథ్యం ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ఆయన ఎంత రేంజ్‌కు చేరుకున్నా కూడా ఇలాంటి విషయంలో ఏంత మాత్రం తగ్గడంటూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement