sets
-
కొత్త హీరోయిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో ఆయన ఉన్నారంటే చాలు.. అక్కడ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లను ప్రభాసే చూసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. పాన్ ఇండియా స్టార్‌గా ఆయన ఎదిగినప్పటికీ చిత్ర యూనిట్ వారికి ఆతిథ్యమివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభాస్ ఇంటి భోజనమంటే బాలీవుడ్ స్టార్స్ కూడా లొట్టలేసుకుని ఆరగించేస్తారు. అయితే, తాజాగా తన హీరోయిన్‌కు ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి ప్రభాస్ ఆతిథ్యం ఇచ్చారు. తన ఇంటి నుంచి ఆమెకు క్యారేజీ పంపారు. భోజనం చాలా బాగుంది అంటూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రభాస్ (Prabhas) హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో (Hanu) ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' (Fauji) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌తోనే ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టార్‌గా నెటిజన్లకు ఆమె సుపరిచితురాలు. ఇన్‌స్టాలో ఆమె డ్యాన్స్ రీల్స్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఆమెకు సినిమా అవకాశం దక్కింది. ఈ సినిమానే ఆమెకు తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. కొత్త హీరోయిన్లకు కూడా ప్రభాస్ ఆతిథ్యం ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ఆయన ఎంత రేంజ్‌కు చేరుకున్నా కూడా ఇలాంటి విషయంలో ఏంత మాత్రం తగ్గడంటూ ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) -
చిన్నారులకు గోల్డెన్ ఛాన్స్.. ప్రకటించిన కల్కి డైరెక్టర్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో నాగ్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.చిన్నారులకు కల్కి మూవీ సెట్ చూసే అవకాశం కల్పించనున్నట్లు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. అయితే చిన్నారికి సంబంధించి కల్కి సినిమాపై ఓ వీడియోను పంపించాలని ఆయన కోరారు. వీటిలో ఎంపికైన వారికి కల్కి సెట్ చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ చిన్నారుల వీడియోలు పంపి.. అరుదైన ఛాన్స్ కొట్టేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
కల్యాణ్‌రామ్ 'డెవిల్'.. ఆ సీన్ల కోసం భారీ సెట్స్!
అమిగోస్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం డెవిల్. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్) ఈ మూవీ షూటింగ్ కోసం భారీ సెట్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1940 కాలం స్టోరీ కావడంతో అందుకు తగినట్లుగానే షూటింగ్ సెట్‌ను రూపొందించారు. ఆ కాలం నాటి పరిస్థితులు కళ్లముందు కనిపించేలా డిజైన్ చేశారు. బ్రిటీష్ కాలంలో సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. మన దేశం ఉన్నసయమానికి చెందిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ కోసం కావాల్సిన సామాగ్రిని ప్రత్యేకంగా తెప్పించారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. 'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు... * 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్ * బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు * బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు * 1940 కాలానికి చెందిన కార్గో షిప్ * 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో) అయితే ఈసెట్స్ వేయడానికి మొత్తం 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ను ఉపయోగించారు. -
భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్‌కు భారీ ప్రమాదం తప్పింది. తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదంలో అమీన్ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేపోతున్నట్లు ఆమీన్ తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ''నా టీంతో కలిసి ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు.. భారీ లైట్లు కింద పడ్డాయి.ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను వాటికి కొద్ది దూరంలోనే ఉన్నాను. పైనుంచి కిందపడిన వాటిలో ఓ భారీ షాండిలియర్ కూడా ఉంది. ఏమాత్రం కాస్త అటుఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో మా టీం అంతా షాక్‌కి గురయ్యాం. ఇప్పటికీ దాన్నుంచి తేరుకోలేకపోతున్నా. ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, అభిమానుల ఆశీర్వాదం వల్లే ఆరోజు నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. లేదంటే చాలా ఘోరం జరిగి ఉండేది'' అంటూ ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్చేశాడు అమీన్. View this post on Instagram A post shared by “A.R.Ameen” (@arrameen) -
సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
సినిమా సెట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదమే తాజగా మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ ద్వీపకల్పంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోగా, ఆరుగురు గాయాల పాలయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్ 'ది చూసెన్ వన్'. ఈ సిరీస్ చిత్రీకరణకు సంబంధించిన పనులు బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ప్రాంతంలో జరుగుతున్నాయి. అయితే ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువెళ్లింది. దీంతో ఇద్దరు నటులు రేముండో గుర్డానో, జువాన్ ఫ్రాన్సిస్కో అగ్యిలర్ మరణించగా, అక్కడ పని చేస్తున్న ఆరుగురికి గాయాలైనట్లు బాజా కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తెలిపింది. ఈ సంఘటన గురువారం (జూన్ 16) జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం (జూన్ 18) వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. చదవండి:👇 వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ కాగా 'ది చూసెన్ వన్' బ్రెజిలియన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదలైంది. ఇప్పటివరకు రెండు సీజన్లు రిలీజ్ అవ్వగా, ప్రస్తుతం మూడో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ సిరీస్ అమెరికన్ జీసస్ కామిక్ బుక్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్ తాను తిరిగి వచ్చిన యేసు క్రీస్తు అని, మానవజాతిని రక్షించడానికి పుట్టినవాడుగా భావిస్తున్న 12 ఏళ్ల బాలుడి కథగా తెలుస్తోంది. చదవండి:👇 సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
‘టైగర్ నాగేశ్వరరావు’ కోసం భారీ సెట్:వామ్మో.. అన్ని కోట్లా!
ఏడు కోట్ల రూపాయలతో స్టూవర్టుపురం రూపుదిద్దుకుంటోంది. రవితేజ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ సినిమా కోసం 1970 కాలం నాటి స్టూవర్టుపురం విలేజ్ సెట్‌ను రెడీ చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఏడు కోట్ల రూపాయలతో ఐదెకరాల విస్తీర్ణంలో ఈ సెట్ వర్క్ జరుగుతోంది. ‘మహానటి, జెర్సీ, ఎవరు, శ్యామ్ సింగరాయ్’ వంటి సినిమాలకు వర్క్ చేసిన ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పర్యవేక్షణలో ఈ సెట్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహనిర్మాత. -
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్ పైకి సాయి ధరమ్ తేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవలె ఓ వీడియో రిలీజ్ చేసి అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్న సాయితేజ్ తాజాగా తన కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్సిడెంట్లో కోలుకున్న అనంతరం ఆయన నటిస్తున్న తొలి చిత్రం కావడంతో చిత్ర యూనిట్ సహా అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. దీంతో థ్యాంక్యూ చెబుతూ సాయితేజ్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. ఇక సాయితేజ్ తిరిగి షూటింగ్లో పాల్గొనడం పట్ల వరుణ్ తేజ్ స్పందిస్తూ.. 'నిన్ను సెట్స్‌పై మళ్లీ చూడటం చాలా సంతోషంగా ఉంది బావా. లవ్ యూ' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. So happy to see you back on sets bava! Love you.🤗 More power to you! Good luck for #SDT15 🤜🏽🤛🏽 https://t.co/EW5z3rOmTH — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 29, 2022 -
వెంకీ, వరుణ్ తేజ్‌లను ఆడేసుకున్న నాగరత్తమ్మ.. ట్రెండింగ్‌లో వీడియో
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీని అనేక వాయిదాల తర్వాత మే 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా సెట్లో చిత్రబృందానికి చుక్కలు చూపించింది నాగరత్తమ్మ అలియాస్ 'ఫ్రస్టేటెడ్ ఉమెన్' ఫేమ్ సునయన. అయితే ఎఫ్-3 చిత్రం రిలీజయ్యే వరకూ నీడలా వెంటాడతానని ఇదివరకు శపథం చేసిన నాగరత్తమ్మ.. అన్నట్లే చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ ఇతర టీం సభ్యులతో ఆమె కొంతసేపు ముచ్చటించి సరదాగా గడిపింది. అనంతరం వాళ్లతో ఫొటోలు దిగింది. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. -
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలివే..
విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్, మదర్ హౌస్, బిర్లా ప్లానిటోరియం, కాళీ మాత టెంపుల్, పార్క్ స్ట్రీట్, ఎకో టూరిజం పార్క్... ఏంటీ కోల్‌కతాలోని ఫేమస్ ప్లేసెస్‌ను వరుసగా చెబుతున్నాం అనుకుంటున్నారా! ఇప్పటికే పలు చిత్రాల్లో వీటన్నింటినీ చూసి ఉంటారు. మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూసేయండి.. -
‘సెట్స్’ గడువు మళ్లీ పెంపు
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువును మరోసారి ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎంసెట్ సహా అన్ని సెట్స్ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు, ఇంటర్నెట్ సెంటర్లు బంద్ కావడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో దరఖాస్తుల గడువును మొదట మే 7 వరకు పొడిగించగా మే 7 తరువాత కూడా లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి కనిపించని నేపథ్యంలో మే 15 వరకు దరఖాస్తుల గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మరోవైపు మే 15 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసినా పరీక్షల నిర్వహణకు అవసరమైన కేంద్రాల గుర్తింపు, నిర్వహణ సంస్థ చేయాల్సిన ఆన్లైన్ పరీక్షల ఏర్పాట్లకు సమయం పట్టనుంది. అలాగే విద్యార్థుల ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాల్సి వస్తుంది. పైగా హాస్టళ్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లో దరఖాస్తుల గడువు ముగిసి మే 2న ఈసెట్, 5 నుంచి ఎంసెట్ ఆ తర్వాత నుంచి ఇతర సెట్స్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. పరీక్షల షెడ్యూల్ సిద్ధం చేస్తున్నాం: పాపిరెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 10 నుంచి ప్రవేశపరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వివరించారు. జూన్ నెలాఖరు లేదా జూలై రెండో వారంలోగా ఎంట్రన్స్‌లు పూర్తి చేస్తామన్నారు. జూన్ నెలాఖరులో లేదా జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. -
బిగ్‌బాస్ హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, బెంగళూర్ : కన్నడ బిగ్ బాస్ సెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం వేకువ ఝామున ఈ ఘటన చోటు చేసుకోగా.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. బిగ్ బాస్ సీజన్ 5 కోసం బిదాడిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ హౌజ్ కోసం స్పెషల్ సెట్ వేశారు. గత నెల చివర్లో సీజన్ ముగిసింది కూడా. ఈ క్రమంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే రామానగర్, చన్నపట్న నుంచి అగ్ని మాపక దళాలు ఘటనా స్థలానికి వచ్చాయి. మంటలను ఆర్పేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదని.. ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని షో నిర్వాహకులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో 5వ సీజన్లో చందన్ శెట్టి విజేతగా నిలిచాడు. -
అన్ని సెట్స్ ఆన్లైన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) ఆన్లైన్లోనే నిర్వహించాలన్న ఆలోచనకు ఉన్నత విద్యా మండలి వచ్చింది. దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యే ఎంసెట్, ఈసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర సెట్స్ అన్నింటిని రాత పరీక్ష రూపంలో కాకుండా, ఆన్లైన్లోనే నిర్వహిం చేందుకు కసరత్తు చేస్తోంది. 2017–18 విద్యా సంవత్సరంలోనే ఈ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలని భావించినా అమలు చేయ లేదు. ఒక్క ఈసెట్‌ను ఆన్లైన్లో నిర్వహిం చినా గందరగోళం నెలకొంది. ఆన్లైన్ ప్రాసెస్ సంస్థ పొరపాట్లు, అధికారుల సమన్వయ లోపంతో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పకడ్బందీగా నిర్వహించే సంస్థకే ఆన్లైన్ పరీక్షల బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అన్ని సెట్స్‌నూ విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో 2018–19లో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సెట్స్‌ను ఆన్లైన్లో నిర్వహించే బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగిం చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జేఈఈ మెయిన్ ద్వారా భర్తీపై చర్చ రాష్ట్రంలో కొన్ని టాప్ కాలేజీల్లో మినహా మిగతా వాటిల్లో ఇంజనీరింగ్‌కు డిమాండ్ పడి పోయింది. లక్షకు పైగా సీట్లకు ఆమోదం తెలిపినా 80 వేలకు మించి భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహణ అవసరమా అన్న ఆలోచనలను అధికారులు చేశారు. దానికంటే జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తే బాగుంటుందని భావించారు. అయితే జాతీయ స్థాయి సిలబస్ కలిగిన జేఈఈ మెయిన్‌కు సిద్ధం అయ్యే విద్యార్థుల స్థాయి, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల స్థాయి మధ్య తేడా చాలా ఉంటుందన్న అంచనాకు వచ్చా రు. దీంతో ఎంసెట్ నిర్వహణ తప్పనిసరి అన్న ఆలోచనకు వచ్చారు. వచ్చే ఏడాదీ ఎంసెట్‌తోనే.. రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా ఇంజనీరింగ్ ప్రవే శాలను ఎంసెట్ ద్వారానే చేపట్టను న్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఇంజనీరింగ్ పరీక్ష అంశం ఖరారు కానందున.. ఎంసెట్ ద్వారానే రాష్ట్రంలో 2018–19లో ప్రవేశా లను చేపడతామని వెల్లడించారు. -
రేపు ‘సెట్స్’ కన్వీనర్ల ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి ఈనెల 20న ప్రకటించనుంది. ఒక్కో సెట్‌కు ముగ్గురి చొప్పున పేర్లను ఆయా యూనివర్సిటీలు బుధవారం ఉన్నత విద్యా మండలికి పంపించాయి. వాటిపై 19న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఒక్కో సెట్‌కు వచ్చిన ముగ్గురి పేర్లలో ఒక్కరిని సెట్ కన్వీనర్‌గా నియమించనున్నారు. ఎంసెట్ బాధ్యతలను జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్యకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
జపాన్ కేంద్ర బ్యాంక్ కీలక నిర్ణయం
టోక్యో: జపాన్ బ్యాంక్ తన ద్రవ్య పరపతి విధానంలో ఊహించని నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం అమల్లో ఉన్న నెగిటివ్ ఇంటరెస్ట్ రేటును యథాతథంగా అమలు చేసేందుకు బుధవారం నిర్ణయించింది. మంగళవారం మొదలైన రెండు రోజుల బీవోజే పరపతి సమీక్ష సమావేశంలో ప్రస్తుత -0.1 శాతం చొప్పున అమలు చేయడానికి నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. "ఈల్డ్ కర్వ్ కంట్రోల్" పథకం కింద దాదాపు 10 సంవత్సరాల దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడానికి, తద్వారా సున్నా శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్నిఅధిగమించాలని యోచిస్తోంది. అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న స్టిములస్ ప్యాకేజీకి అదనంగా మరింత భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. సెక్యూరిటీల కొనుగోలు ద్వారా ప్యాకేజీని అమలు చేయనుంది. భారీ ఉద్దీపన కార్యక్రమం కింద సమగ్ర దీర్ఘకాలిక వడ్డీ రేట్లు లక్ష్యంగా స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు 800 బిలియన్ యెన్ల నిధులను ఫిక్స్డ్ రేటుకే అందించేందుకు నిర్ణయించింది. మరోవైపు బీవోజే కీలక నిర్ణయం నేపథ్యంలో డాలరు మారకపు విలువతో పోలిస్తే జపనీస్ కరెన్సీ యెన్ కోలుకుంది. దాదాపు 2 శాతానికి పైగా లాభపడింది. -
వచ్చే వారంలో సెట్స్ నోటిఫికేషన్లు!
♦ అంతకంటే ముందుగా కన్వీనర్ల నియామకం ♦ ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలపై ఉత్కంఠ! ♦ ఉన్నత విద్యా మండలి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నోటిఫికేషన్లను వచ్చే వారంలో జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్ నిర్వహణ తేదీలను, పరీక్ష నిర్వహించే యూనివర్సిటీలను ఎంపిక చేసిన మండలి ప్రస్తుతం సెట్స్ కన్వీనర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు లేఖలు రాసింది. ఒక్కో సెట్ నిర్వహణకు ముగ్గురి పేర్లను సూచించాలని ఆదేశించింది. ఇప్పటికే కన్వీనర్ల ఎంపికకు కొన్ని సెట్లకు కొందరి పేర్లను సూచించగా, మరికొన్ని సెట్లకు పేర్లు రావాల్సి ఉంది. వాటిని రెండు మూడు రోజుల్లో అందజేయాలని విశ్వవిద్యాలయాలను మండలి ఆదేశించింది. అవి రాగానే ఈనెల 8 లేదా 9న ఒక్కో సెట్‌కు ఒక్కో కన్వీనర్‌ను ఎంపిక చేసి, వెంటనే ఆయా కన్వీనర్లు నోటిఫికేషన్లు జారీచేసేలా చర్యలు చేపట్టింది. మే 19న ఐసెట్ ను, 24న మూడేళ్ల, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్‌ను నిర్వహించే బాధ్యతలను కాకతీయ వర్సిటీకి అప్పగించింది. గత ఏడాది కూడా వాటిని కాకతీయనే నిర్వహించినందున అప్పుడు కన్వీనర్లుగా చేసిన వారికే ఈసారీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే వర్సిటీ ఇచ్చే జాబితాలోని మూడు పేర్లలో వారుంటే వారికే అప్పగించే అవకాశం ఉంది. ఇక మే 11 నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, 27న ఎడ్‌సెట్, 29న పీజీఈసెట్‌లను నిర్వహించే బాధ్యతలను ఈసారి కూడా ఉస్మానియాకే అప్పగించింది. అందువల్ల వీటికి కూడా గత ఏడాది కన్వీనర్లుగా వ్యవహరించిన వారినే మళ్లీ నియమించే అవకాశం ఉంది. తేలాల్సింది ఎంసెట్ వ్యవహారమే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2న జరిగే ఎంసెట్-2016 నిర్వహణ బాధ ్యతలు ఎవరికి అప్పగిస్తారన ్న దానిపై ఉత్కంఠ నెల కొంది. గతంలోలాగే ఈసారి కూడా ఎంసెట్ నిర్వహణను హైదరాబాద్ జేఎన్టీయూకే అప్పగించినప్పటికీ, కన్వీనర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. గత ఏడేళ్లు ఎంసెట్ కన్వీనర్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు దీన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈసారి కూడా ఆయనకే అప్పగిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల విషయంలో కొన్ని యాజమాన్యాలు రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయనపై పలు ఆరోపణలు చేశాయి. ఆ వ్యవహారంతో ఎంసెట్ నిర్వహణకు సంబంధం లేనప్పటికీ 2016-17లో ఆబా ధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది ఉత్కం ఠగా మారింది. అలాగే మే 12న ఈసెట్ నిర్వహణను కూడా జేఎన్టీయూకే అప్పగిం చింది. దీనికి గత ఏడాది కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ యాదయ్యకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!
-
తెలంగాణ సెట్స్ కన్వీనర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ సెట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్లను నియమించింది. ఎంసెట్ కన్వీనర్‌గా ఎన్వి రమణారావు (జేఎన్టీయూహెచ్), లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్‌గా ఎంవీ రంగారావు (కేయూ), ఈసెట్ కన్వీనర్‌గా ఎం.యాదయ్య (జేఎన్టీయూహెచ్), ఐసెట్ కన్వీనర్‌గా కె.ఓంప్రకాశ్ (కేయూ), ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రసాద్ (ఓయూ), పీఈసెట్ కన్వీనర్‌గా జె.ప్రభాకర్‌రావు (ఓయూ), పీజీ ఈ సెట్ కన్వీనర్‌గా వేణుగోపాల్‌రెడ్డి (ఓయూ) నియమితులయ్యారు. -
సెట్స్ షెడ్యూల్‌కు చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌కు సంబంధించిన పనులు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలిని విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారం సచివాలయంలో మంత్రితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. పదో షెడ్యూల్లో ఉన్న మండలి విభజనలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని టీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఏపీ ఉన్నత విద్యామండలి విభ జనకు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. పదేళ్లపాటు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశాల విధానం అయినందున పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలా? కలిపి నిర్వహిద్దామా? అనేది తరువాత తేల్చుకుందామని, ముందుగా తెలంగాణలో షెడ్యూలుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. -
బాహుబలి సెట్ లో విక్టరీ వెంకటేష్