
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీని అనేక వాయిదాల తర్వాత మే 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమా సెట్లో చిత్రబృందానికి చుక్కలు చూపించింది నాగరత్తమ్మ అలియాస్ 'ఫ్రస్టేటెడ్ ఉమెన్' ఫేమ్ సునయన. అయితే ఎఫ్-3 చిత్రం రిలీజయ్యే వరకూ నీడలా వెంటాడతానని ఇదివరకు శపథం చేసిన నాగరత్తమ్మ.. అన్నట్లే చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ ఇతర టీం సభ్యులతో ఆమె కొంతసేపు ముచ్చటించి సరదాగా గడిపింది. అనంతరం వాళ్లతో ఫొటోలు దిగింది. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment