బిగ్‌బాస్‌ హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident in Kannada Bigg Boss House | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 12:34 PM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

Fire Accident in Kannada Bigg Boss House - Sakshi

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

సాక్షి, బెంగళూర్‌ : కన్నడ బిగ్‌ బాస్‌ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం వేకువ ఝామున ఈ ఘటన చోటు చేసుకోగా.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కోసం బిదాడిలోని ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ సిటీలో బిగ్‌ బాస్‌ హౌజ్‌ కోసం స్పెషల్‌ సెట్‌ వేశారు. గత నెల చివర్లో సీజన్‌ ముగిసింది కూడా. ఈ క్రమంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే రామానగర్‌, చన్నపట్న నుంచి అగ్ని మాపక దళాలు ఘటనా స్థలానికి వచ్చాయి. మంటలను ఆర్పేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదని.. ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని షో నిర్వాహకులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ తోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో 5వ సీజన్‌లో చందన్‌ శెట్టి విజేతగా నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement