బిగ్ బాస్ రియాలిటీ షో టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. తమిళంలో స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఆసక్తికరంగా సాగుతున్న కన్నడ బిగ్‌బాస్ షోలో ఊహించని సంఘటన ఎదురైంది. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్- 10 కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ షోలో పాల్గొన్న సంతోష్ పులి పంజా ఉన్న లాకెట్‌ను ధరించి కనిపించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అటవీశాఖ అధికారులు బిగ్ బాస్ సెట్స్‌కు చేరుకుని లాకెట్‌ను పరిశీలించారు.
(ఇది చదవండి: ప్రభాస్ పుట్టినరోజు.. కన్నప్ప చిత్రబృందం స్పెషల్ పోస్టర్!)
లాకెట్‌ను పరిశీలించిన అనంతరం.. అది అసలైన పులిదేనని అని నిర్ధారణకు వచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు వర్తూర్ సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్నీ వివరాలు రాబట్టేందుకు లాకెట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ విషయంపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ని అతను ఉల్లంఘించారని.. నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల శిక్ష పడుతుందని తెలిపారు.
కాగా.. వర్తూరు సంతోష్ కర్ణాటకలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అఖిల భారత గోసంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఫేమస్ అయ్యారు. అక్టోబర్ 8న 2023న బిగ్ బాస్ కన్నడ సీజన్- 10 హౌస్‌లో అడుగుపెట్టారు.
(ఇది చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!)
Comments
Please login to add a commentAdd a comment