పోలీసుల అదుపులో తెలుగు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌! | Cyber Crime Police Questiones Bigg Boss Fame RJ Sekhar Basha | Sakshi
Sakshi News home page

RJ Sekhar Basha: పోలీసుల అదుపులో ఆర్జే శేఖర్ భాషా!

Oct 18 2024 9:50 PM | Updated on Oct 19 2024 9:53 AM

Cyber Crime Police Questiones Bigg Boss Fame RJ Sekhar Basha

తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్‌ ఆర్జే శేఖర్ ‍భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో విచారణ చేస్తున్నట్లు సమాచారం. హర్షసాయి తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగి పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.

(ఇది చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)

అయితే బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ ‍కంటెస్టెంట్‌ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు. కాగా.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆర్జే శేఖర్ భాషా రెండోవారంలోనే ఎలిమినేట్ అయి బయటకొచ్చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement