sekhar
-
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణ రంజన్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 29కి చేరింది. దీంతో మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు ఉత్తరాఖండ్ సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.పంపింది ఆరుగురి పేర్లు..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే15న ఆరుగురు న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసి, ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారి నుంచి కూడా కొలీజియం అభిప్రాయాలు తీసుకుంది. అనంతరం హైకోర్టు ప్రతిపాదించిన ఆరుగురిలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌కు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. వారిని న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. వీరి నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. వారి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ముగ్గురు ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణరంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈయనకు సోదరుడి వరుస అవుతారు. గుణరంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడైన కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కోదండరామ్ జడ్జి అయిన తరువాత ఆయన ఆఫీసును గుణ రంజన్ విజయవంతంగా నడిపించారు.సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు పలు కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో లా పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. -
పోలీసుల అదుపులో తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్!
తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో విచారణ చేస్తున్నట్లు సమాచారం. హర్షసాయి తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగి పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.(ఇది చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)అయితే బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు. కాగా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆర్జే శేఖర్ భాషా రెండోవారంలోనే ఎలిమినేట్ అయి బయటకొచ్చేశాడు. -
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు
సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణ రంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోదరుడి వరుస అవుతారు. గుణ రంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనసాగుతున్న నలుగురి అభిప్రాయాలు కూడా అంతకు ముందే తీసుకుంది. వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొలీజియం సమావేశంలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయవాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు. -
బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం.. దోమకు అర్థమేంటో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ -8 బుల్లితెర ప్రియులను సరికొత్తగా అలరిస్తోంది. ఒకటి, రెండు తెలిసిన మొహాలు మినహాయిస్తే.. అంతా కొత్త వారే ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓ వారం ముగిసింది. ఎప్పటిలాగే ఆనవాయితీని కొనసాగిస్తూ లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బెజవాడ బేబక్క వారం రోజుల్లోనే ఇంటిదారి పట్టింది. అప్పుడే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయితే ఈ సారి అంతా కొత్త ముఖాలే కావడంతో హౌస్‌లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. లిమిట్లెస్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో హౌస్‌లో అంతో, ఇంతో మెప్పిస్తోన్న కంటెస్టెంట్ మాత్రం ఒకరు ఉన్నారు. అతని వల్లే హౌస్‌లో నవ్వులు పూస్తున్నాయి. అతను మరెవరో కాదు.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ భాషా.(ఇది చదవండి: విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు)రేడియో జాకీగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శేఖర్ భాషా హౌస్‌లోనూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. తన ఫన్నీ పంచ్‌లతో హౌస్‌ను ఫుల్ కామెడీని ఎంటర్టైనర్గా మార్చేశాడు. ఏకంగా జబర్దస్త్ కామెడీ షోను మించిన పంచ్‌లతో అదరగొడుతున్నాడు. దీంతో ఆర్జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా శేఖర్ భాషా కామెడీ క్లిప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆణిముత్యాల్లాంటి జోకులను చూసి ఎంజాయ్ చేయండి. Arey ha #ShekharBasha ni ala vadileyakandra evarikaina chupettandraOka onion,oka I love you,Oka spirit,oka Chapathi Oka pindakudu,Oka shardham#BiggBossTelugu8 pic.twitter.com/eUuYjcygyy— Vamc Krishna (@lyf_a_zindagii) September 2, 2024 #ShekharBasha animutyalu part - 90Omlette = Ame + Late #BiggBossTelugu8 pic.twitter.com/7V2GC7MNQi— Vamc Krishna (@lyf_a_zindagii) September 7, 2024 #ShekharBasha is such a sport 😂❤️Shekhar Basha Animutyam part-100😂😭Doma = Dho (Two) + Maa (Amma) anta 😭#BiggBossTelugu8 pic.twitter.com/RS4kbwXBvQ— Hungry Cheetah (@Aniljsp1) September 8, 2024#Shekharbasha and his diamonds 🤣😂#BiggBossTelugu8 pic.twitter.com/1g7lyHjnoN— ALTDHFM (@altSsmb5) September 8, 2024#ShekharBasha animutyalu part -3Magajathi animuthyam nundi inkonni animutyalu 😂😭 meekosam meekosam meekosam Oka Bangaram,oka Puttakamundu 😭#BiggBossTelugu8 pic.twitter.com/2z6ewd1suu— Vamc Krishna (@lyf_a_zindagii) September 5, 2024 Chiraku = Chee Raku 😂😂😭😭Ayya ayya 😂😂😭😭#ShekharBasha animutyalu part-100 #BiggBossTelugu8 pic.twitter.com/luztkgZq9O— stylish Star Lakshmi (@Stylisstarlaxmi) September 9, 2024 -
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం
టాలీవుడ్ లీడింగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తోడబుట్టిన తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..?)'నిన్ను మిస్ అవుతున్నాం సుధా. ఎక్కడికెళ్లినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావ్. నువ్వు చనిపోయావనే చేదు నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావ్. మిస్ యూ రా తమ్ముడు' అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు.'ఢీ' డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టరగా కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్ తరుణ్ రియాక్షన్) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) -
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం
టాలీవుడ్ ప్రస్తుత జనరేషన్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. టీవీ షోలతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. తర్వాత తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్) 'వదిన మిస్ యూ. ఎంతో బాధని అనుభవించావు. అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావ్. నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావ్. పాజిటివిటీని పెంచావ్. నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడైనా స్వర్గంలో ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడు మాతోనే ఉంటావ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని శేఖర్ మాస్టర్ రాసుకొచ్చాడు. శేఖర్ మాస్టర్ వదిన అని చెప్పిన ఈమె.. తన భార్యకు అక్క అని తెలుస్తోంది. అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతానికైతే శేఖర్ మాస్టర్.. డ్యాన్స్ షోలో పెద్దగా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) -
ఛత్రపతి శేఖర్.. పెద్దలను ఎదురించి పెళ్లి.. కానీ తర్వాతే!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా గుర్తుందా?.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా మెప్పించిన నటుడు చంద్రశేఖర్. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే చంద్రశేఖర్ ఆర్ఆర్ఆర్లోనూ కీలక పాత్ర పోషించారు. ఛత్రిపతి సినిమాతోనే అతన్నిఅందరూ ఛత్రపతి శేఖర్ అని పిలుస్తుంటారు. కానీ ఆయన గురించి చాలామందికి తెలియని ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి. చంద్రశేఖర్ మాజీ భార్య నీల్యా భవానీ కూడా నటి అన్నసంగతి చాలామందికి తెలియదు. ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. చంద్రశేఖర్ భార్య అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్మెన్.. లాంటి చాలా సినిమాల్లో ఆమె నటించింది. కోలీవుడ్‌లోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. చంద్రశేఖర్‌తో ప్రేమ పెళ్లి.. ఖమ్మం జిల్లాకు చెందిన నీల్యా భవానీ చంద్రశేఖర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ వివాహాబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ప్రస్తుతం నీల్యా భవాని ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. ఆ సమయంలో చంద్రశేఖర్ నటుడిగా నిలదొక్కుకోకపోవడంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. -
మెగాస్టారికి కొరియోగ్రాఫర్ గా చేస్తుంటే మా ఆవిడా చూసి ఏడ్చింది..!
-
Sekhar Master Daughter Sahithi Birthday: శేఖర్ మాస్టర్ కూతురు బర్త్ డే.. ఫోటోలు వైరల్!!
-
డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. హీరో ఎవరో తెలుసా..?
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న శేఖర్‌మాస్టర్ కూతురు?
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఓ ప్రముఖ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు సినిమాల్లో పనిచేస్తూనే మరెవైపు బుల్లితెరపై కూడా పలు షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయెప్ట్ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్‌కి పేరుంది. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే దీని కోసం ఓ కొత్త దర్శకుడు కథ చెప్పగా, శేఖర్ మాస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరోను ఈ సినిమాలో భాగం చేసేందుకు శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్(40) స్వీట్‌స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది. బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కీలేడీ మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్‌కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
శేఖర్ మూవీ కోసం రూ.15 కోట్లు పెట్టాను, ఎవరిస్తారు?: నిర్మాత
జీవిత దర్శకత్వంలో ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న సమయంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేయాలని తాము చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో నిర్మాత సుధాకర్ రెడ్డి మంగళవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను శేఖర్ సినిమా నిర్మించాను. నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్ ప్రొవైడర్స్‌కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను, కానీ వాళ్లు శేఖర్ సినిమాను చంపేశారు. ఏడెనిమిది సినిమాలకు నిర్మాతగా పని చేశాను, ఫైనాన్స్ కూడా ఇచ్చాను. ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి లేదు. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. సినిమాలో శివానీ, శివాత్మికల పేపర్లు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే మా సినిమా ఆగిపోయింది. అసలు శేఖర్ సినిమాను ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓలపై న్యాయపోరాటం చేస్తాం. రేపు కోర్టులో తుది తీర్పు వచ్చాక పరందామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం. నిజానికి నాకు ఆ పరందామరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. నాకు కలిగిన నష్టాన్ని పరందామరెడ్డి ఇస్తారా? డిజిటల్ ప్రొవైడర్స్ ఇస్తారా? ఇది రాజశేఖర్ సినిమా కాదు, రాజశేఖర్ నటించిన సినిమా మాత్రమే! అలాగే జీవిత సినిమా కూడా కాదు, కేవలం జీవిత దర్శకత్వం చేసిన మూవీ. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ నా పేరు మీదే ఉంది. శేఖర్ సినిమాకు నేను రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాను. జీవిత వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి 👇 విజయ్, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదు.. నీ బాంచన్, జర ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వరాదే.. -
Jeevitha Rajasekhar: తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ..
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేప్టటిన ఓ ఈవెంట్లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది. అదే సమయంలో తమ కుటుంబం గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది జీవిత. గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 'నా మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్లమీద బహుశా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారు. తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ శీర్షికకు, లోపల రాసున్నదానికి సంబంధమే ఉండదు. మా ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్‌కు వెళ్లాం. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉంది. కోర్టులో తేలకముందే ఏదేదో చెబుతున్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరమూ కాదనం. కానీ తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయకండి' అని సూచించింది. చదవండి 👇 హీరోయిన్‌తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
‘శేఖర్’ సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం : రాజశేఖర్ ఎమోషనల్
‘‘శేఖర్’ సినిమా స్టార్టింగ్‌లో కరోనా బారిన పడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకుల ప్రార్థనలు నన్ను బతికించింది ఈ సినిమా కోసమేనేమో! మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం’’ అన్నారు రాజశేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో అడివి శేష్ ‘శేఖర్’ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, మాట్లాడుతూ – ‘‘రాజశేఖర్‌గారి ‘మగాడు’ చిత్రం నా ఫేవరెట్. ‘శేఖర్’ సినిమా ట్రైలర్ బాగుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించినందు వల్ల ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. మహిళలు ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువమంది ప్రోత్సహించరు. ‘శేఖర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమాయే ‘శేఖర్’. నేను మిస్ ఇండియా పోటీకి అర్హత సాధించడానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంటే తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వగా, నేను తమిళనాడు కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్రెస్టింగ్గా రాజ'శేఖర్' ట్రైలర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్' .ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స ఆకటుకుంటున్నాయి. మే20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. మర్డర్ మిస్టరీని తన స్టైల్లో విచారణ జరపడం వంటివి ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్గా నటించింది. Very happy to launch the #ShekarTrailer My best wishes to@ActorRajasekhar garu on this new look film. Seems like an interesting #ShekarOnMay20 in Theaters. Kudos & luck to #JeevithaRajashekar garu, @Rshivani_1, @ShivathmikaR & team #Shekarhttps://t.co/m0Z304OyAT pic.twitter.com/1LrfXq94GX — Adivi Sesh (@AdiviSesh) May 5, 2022 -
చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేశారు
‘‘ధర్మపురి పేరుతో జగత్గారు సినిమా తీశారని తెలియగానే ఆశ్చర్యం కలిగింది. గోదావరి తీరాన పురాతనమైన ధర్మపురి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం పేరుతో వస్తున్న ‘1996 ధర్మపురి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1996 ధర్మపురి’. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి దర్శకుడు మారుతి, నిర్మాతలు వై.రవి శంకర్, యస్.కె.యన్, సెవెన్ హిల్స్ సతీష్, రచయిత డార్లింగ్ స్వామి, నటుడు జీవీ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి, గీతా ఆర్ట్స్ వారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్ర నిర్మాత భాస్కర్. ‘‘ప్రస్థానం’తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ‘1996 ధర్మపురి’ చాలా బాగా వచ్చింది’’ అన్నారు జగత్. ‘‘చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి, నా ప్రతిభని బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు గగన్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: మాటల్లో చెప్పలేని తిట్లు, భౌతిక దాడి చేసింది.. వాపోయిన హీరో నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! -
సురుచిలో శేఖర్ మాస్టర్ దంపతుల సందడి
సాక్షి, మండపేట (కోనసీమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, టీవీ డాన్స్‌షోల జడ్జి శేఖర్ మాస్టర్ సోమవారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో సందడి చేశారు. తన సతీమణి సుజాతతో కలిసి జిల్లాలోని ఆలయాల సందర్శనకు వచ్చిన ఆయన మార్గమధ్యంలో సురుచిలో ఆగారు. శేఖర్ మాస్టర్ దంపతులకు బాహుబలి కాజాను కానుకగా అందించి సత్కరించారు. చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం) -
సింగిల్ హ్యాండ్ సచిన్
సాధించాలనే తపన.. సాధిస్తాననే నమ్మకం.. సాధించగలననే ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నాడు చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని వేదాంతపురం పంచాయతీకి చెందిన పాలమంగళం మునిశేఖర్. అవమానాలనే పునాదులుగా చేసుకుని ఒంటిచేత్తో క్రికెట్లో వండర్స్ సృష్టిస్తూ..సింగిల్ హ్యాండు సచిన్‌గా గుర్తింపు సాధిస్తున్నాడు. ఒంటి చేత్తోనే సిక్స్‌లు, ఫోర్లను అవలీలగా కోట్టేయడమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ రాణిస్తూ అద్భుత క్యాచ్‌లను ఒడిసి పట్టేస్తూ అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్నాడు. ఓ పక్క ఆవులను మేపుతూనే మరోవైపు డీఎస్సీకి ప్రిపేరు అవుతూ.. తనకు ఇష్టమైన క్రికెట్లో రాణిస్తున్నాడు. ప్రభుత్వం, దాతలు సహకరించి మెరుగైన శిక్షణ అందిస్తే క్రికెట్లో రాణించి దేశానికి ఆడాలని తన జీవిత లక్ష్యమని చెబుతున్నాడు. చేతిని మింగిన కోతి కొమ్మచ్చి మునిశేఖర్ చిన్ననాటి నుంచి బాగా చురుగ్గా ఉండేవాడు. 12 ఏళ్ల వయస్సులో స్కూల్లో పిల్లలందరూ కలసి కోతి కొమ్మచ్చి ఆట ఆడుతున్నారు. పక్కనున్న విద్యార్థి తోసేయడంతో 12 అడుగుల ఎత్తున్న చెట్టు కొమ్మపై నుంచి కిందకు పడ్డాడు. దీంతో ఎడమ చేతి మణికట్టు వద్ద విరిగింది. పక్కనే గ్రామంలో ఉన్న వైద్యుడు వద్దకు వెళ్లితే పసరు కట్టు వేసి పంపించాడు. సరైన వైద్యం అందక పోవడంతో చేతి నరాలు దెబ్బతిన్నాయి. రక్త ప్రసరణ ఆగిపోయింది. చేతి మీద పెద్ద పెద్ద బొబ్బలు వచ్చి నల్లగా మారింది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నరాలు దెబ్బతిన్నాయని, ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిందని, చేతిని మోచేతి వరకు తీయాల్సిందేనని, లేకుంటే ప్రాణానికే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మునిశేఖర్ ఎడమ చేతిని మోచేతి వరకు తొలగించారు. మామ శిష్యరికంలో.. క్రికెట్లో ఓనమాలు చేయి తొలగించాక నగరి దగ్గర ఉన్న దామరపాకంలోని మేనమామ సుబ్రమణ్యం ఇంట్లో ఉండి 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకున్నాడు. తర్వాత తిరుపతి ఎస్జీయస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత డీఎడ్ కూడా పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం తండ్రి రామయ్య విద్యుత్ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో తల్లి లలితమ్మ ఆవులను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. అమ్మకు చేదోడువాదోడుగా ఉండేందుకు మునిశేఖర్ తండ్రికి చెందిన బైక్‌ను ఒంటిచేత్తో నడపడం నేర్చుకున్నాడు. బైక్ పైనే కసువు కోసుకురావడం, ఆవుల కోసం నీళ్లు తీసుకురావడం వంటి పనులను చేస్తున్నాడు. ఆవులను మేపుతూ కుటుంబ పోషణలో పాలుపంచుకుంటూనే, ప్రస్తుతం డీఎస్సీ కోసం ప్రిపేరు అవుతున్నాడు.మామ సుబ్రమణ్యంకు క్రికెట్ అంటే ఇష్టం. అతనితో పాటు మునిశేఖర్ కూడా ఆటను చూసేందుకు వెళ్లేవాడు. దీంతో ఆటపై ఆసక్తితో నేర్చుకోవాలని ఆశ పడ్డాడు. రెండు చేతులు ఉండే వాళ్లే ఆడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.. ఒంటి చేత్తో నువ్వు ఏం సాధిస్తావు.. అంటూ హేళనగా మాట్లాడారు. కళాశాల స్థాయిలో కూడా చిన్నపాటి అవకాశాలు ఇవ్వలేదు. దాంతో క్రికెట్‌పై మునిశేఖర్‌కు మరింత కసి పెరిగింది. ఎలాగైనా క్రికెట్‌ను ఆడాలి..తాను ఫోర్లు, సిక్స్‌లు కొట్టాలి.. మంచి పేరు తెచ్చుకోవాలని పట్టుదల పెంచుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇంటి వద్దనే మామ సుబ్రమణ్యం దగ్గర బ్యాట్ పట్టుకోవడం, బ్యాటింగ్ చేయడం సాధన చేశాడు. బ్యాటింగ్‌లో మంచి ప్రతిభ చూపడంతో గ్రామ స్థాయిలో టీమ్‌లోకి ఎంటర్ అయ్యాడు. గ్రామీణ టోర్నమెంట్‌తో గుర్తింపు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ మునిశేఖర్ ప్రతిభకు జిల్లా స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మునిశేఖర్ కొట్టిన సిక్స్‌లు, ఫోర్లకు అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. ఇప్పటి వరకు 18 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని బెస్ట్ స్కోరు 93 నాటౌట్. 2016 టోర్నమెంట్లో కేవలం 18 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో అతను సాధించిన 62 పరుగులు అతని దూకుడైన బ్యాటింగ్‌కు నిదర్శనం. కేవలం బ్యాట్స్‌మెన్‌గా ఉంటే సరిపోదని బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన మునిశేఖర్, ప్రస్తుతం జరుగుతున్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి, బెస్ట్ బౌలర్ అవార్డును అందుకున్నాడు. ఇప్పటి వరకు 16 టోర్నమెంట్లు ఆడిన అతను 9సార్లు బెస్ట్ బ్యాట్స్‌మెన్, ఐదు సార్లు బెస్ట్ బౌలర్, మరో ఆరు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. అతని ఆట తీరు చూసిన ప్రతి ఒక్కరూ ‘ఒంటి చేయి సచిన్’ అంటూ పిలుస్తుంటారు. ప్రోత్సాహం కరువు క్రికెట్లో అద్భుత ప్రతిభ చూపుతున్న మునిశేఖర్‌కు ప్రభుత్వం నుంచి కానీ వికలాంగులశాఖ నుంచి కానీ ప్రోత్సాహం కరువైంది. పారా గేమ్స్‌లోను అవకాశం కల్పించడం లేదని ఈ ప్రతిభావంతుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు కానీ, ప్రభుత్వం కానీ తనకు మెరుగైన శిక్షణ తీసుకునేందుకు సహాయం చేయాలని కోరుతున్నాడు. – సౌపాటి ప్రకాష్‌బాబు, సాక్షి, తిరుపతి -
పుట్లూరులో దారుణం
- పాఠశాల తరగతి గదిలో కిరాతక చర్య - యువకుడిని హతమార్చి, ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం - హతుడు చోరీ, హత్య కేసులో నిందితుడు? - బళ్లారిలో కాంట్రాక్టర్ హత్య కేసు విచారణ కోసం వస్తే.. వెలుగు చూసిన హత్య కేసు పుట్లూరు (శింగనమల) : అనంతపురం జిల్లా పుట్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదిలో దారుణం వెలుగు చూసింది. పుట్లూరుకు చెందిన పెరవలి శేఖర్(27)ను బండరాయితో కొట్టి, హతమార్చారని పోలీసులు తెలిపారు. ఆపై గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చివేశారన్నారు. మూడ్రోజుల తరువాత ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది. హతుడు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... శేఖర్ చెడు వ్యసనాలకు బానిసై, ఒంటరిగా జీవిస్తున్నాడు. 2015లో తక్కళ్లపల్లిలోని ఆలయంలో హుండీని చోరీ చేసిన కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. గత నెల 29న కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ కాంట్రాక్టర్ హత్య కేసు విచారణలో భాగంగా అక్కడి పోలీసులు ఈ నెల 2న పుట్లూరుకు వచ్చారు. శేఖర్ గుర్తింపు కార్డుతో సిమ్‌కార్డు పొందిన అతని స్నేహితుడు జయరామ్‌కు బళ్లారిలో జరిగిన కాంట్రాక్టర్ హత్య కేసులో ప్రమేయం ఉంది. హత్యకు గురైన కాంట్రాక్టర్ కాల్‌డేటా ఆధారంగా అక్కడి పోలీసులు పుట్లూరుకు రాగా, ఈ విషయం తెలిసి జయరాంతో శేఖర్ ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. దీంతో విషయం బయటకు పొక్కుతుందనే కుట్రతో శేఖర్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుర్వాసన రావడంతో... ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు వదిలారు. ఈ క్రమంలో తరగతి గది నుంచి భరించరాని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికెళ్లి పరిశీలిస్తే.. హత్య కేసు వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఐ సురేశ్‌బాబు తమ సిబ్బందితో నేర స్థలాన్ని పరిశీలించారు. శేఖర్‌ను హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జయరాం సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
సమయం లేదు మిత్రమా
- వారం రోజుల్లో పీఏ శేఖర్‌ను సాగనంపాల్సిందే - లేకుంటే ఎన్టీఆర్ విగ్రహంవద్ద నిరాహార దీక్ష - విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీసీ, అంబికా హిందూపురం అర్బన్ : ‘‘వారం రోజులే గడువు. బాలకృష్ణ ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ను సాగనంపాల్సిందే. లేదంటే హిందూపురం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలకు దిగుతాం’’ అని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం ముక్తకంఠంతో చెప్పారు. సినీనటుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వారం రోజులుగా టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) చంద్రశేఖర్ (శేఖర్)ను హిందూపురం నుంచి వారం రోజుల్లోగా తప్పించాలని అసమ్మతి వర్గం అల్టిమేటం ఇచ్చింది. 30 యాక్ట్, 144 సెక్షన్ చిలమత్తూరులో అసమ్మతి నాయకులు ఆదివారం పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే పోలీసు అధికారులు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేయడంతో చిలమత్తూరు సమీపంలోని ఏడో నంబరు జాతీయ రహదారిలో నడుచుకుంటూ కృష్ణారెడ్డి తోటకు చేరుకున్నారు. కానీ అక్కడికీ పోలీసులు చేరుకుని సమావేశాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాగేపల్లి సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద సమావేశం నిర్వహిస్తుండగా కర్ణాటక పోలీసులు వచ్చి భగ్నం చేశారు. దీంతో టీడీపీ అసమ్మతి నాయకులు సమావేశ స్థలాలు మూడుసార్లు మార్చుకోవాల్సి వచ్చింది. అడ్డుకోవడం సిగ్గుచేటు అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ సమావేశాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘మేం రాడికల్స్ కాదు. దేశద్రోహులు అసలే కాదు. పార్టీకి, ప్రభుత్వానికీ వ్యతిరేకమూ కాదు. కార్యకర్తల సమస్యలు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. వారం రోజులు డైడ్‌లైన్ ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ అధిష్టానంపై గౌరవంతో తమ నిర్ణయం (మూకుమ్మడి రాజీనామా) వారం రోజులు వాయిదా వేస్తున్నట్టు అసమ్మతి నేతలు ప్రకటించారు. వారంలోపు పీఏ శేఖర్‌ను సాగనంపకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. -
మిన్నంటిన ‘అసమ్మతి’ రాగం
- బాలకృష్ణ ఇలాకాలో తీవ్రమైన వర్గపోరు - ఎమ్మెల్యే పీఏను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం తీవ్ర ప్రయత్నాలు - ఉనికిని కాపాడుకునేందుకు పీఏ శేఖర్ పాట్లు - ‘తమ్ముళ్ల’ విభేదాలతో టీడీపీ కంచుకోటకు బీటలు హిందూపురం అర్బన్ : టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉంటున్న హిందూపురంలో ‘తమ్ముళ్ల’ మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ వర్గీయులు, మరోవైపు అసమ్మతిని లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు, బలనిరూపణలతో ‘పురం’ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వీరి కుమ్ములాటలతో పార్టీ కంచుకోటకు బీటలు కూడా వారాయి. ‘చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడొద్దు.. తట్టుకోలేవు’ అని సినిమా డైలాగులతో హూకరించే ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ వైపు చూస్తారోనన్న ఆసక్తి నెలకొంది. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడి పెత్తనమంతా పీఏ శేఖర్‌కు అప్పగించారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన అవినీతికి తెరలేపారని, భారీఎత్తున వసూళ్లు పర్వం కొనసాగిస్తున్నారని అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. పీఏను ఇక్కడి నుంచి పంపించి వేయకపోతే తాము రాజీనామా చేస్తామని అల్టివేటం ఇచ్చారు. అందులో భాగంగానే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ శనివారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా అసమ్మతినాయకులు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి.. పార్టీ నాయకులను కూడగడుతున్నారు. పోటాపోటీగా బలప్రదర్శన ర్యాలీలు అసమ్మతి నాయకులు నాలుగురోజులుగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ర్యాలీలు చేపట్టారు. ర్యాలీలు, సమావేశాలు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని, సస్పెండ్ చేస్తుందని హెచ్చరిస్తూ వచ్చిన పీఏశేఖర్ వర్గీయులు కూడా తమకు బలం ఉందని నిరూపించుకోవడానికి శుక్రవారం లేపాక్షి మండలకేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అయితే.. వందమంది కూడా లేక అభాసుపాలయ్యారు. కొన్ని గ్రామాలకు వాహనాలు పంపినా కార్యకర్తలు రాలేదని సమాచారం. లేపాక్షి నంది విగ్రహం నుంచి మొదలైన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పీఏ శేఖర్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరుకు చెందిన కొందరు నాయకులు మాత్రమే పాల్గొన్నారు. డప్పు వాయ్యిదాల మధ్య పురవీధుల గుండా వచ్చి ప్రధాన రహదారిలో ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి.. జోరుగా ప్రసంగాలు చేశారు. పీఏతో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, ఎంపీపీ హనోక్, నాయకులు నాగరాజు తదితరులు మాట్లాడుతూ అందరూ పార్టీకి విధేయతగా ఉండాలన్నారు. బాలకృష్ణ అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించి.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. తçక్కువ జనం ఉండడం చూసి తాము ర్యాలీ చేయడానికి రాలేదని, కేవలం ఎమ్మెల్యే పీఏకు స్వాగతించడానికి వచ్చామని చెప్పుకొచ్చారు. చిలమత్తూరులో హైటెన్షన్ చిలమత్తూరులో శనివారం çభారీర్యాలీతో పాటు సమావేశం నిర్వహించి తీరుతామని అసమ్మతి నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, సీసీవెంకటరాముడు తదితరులు చెబుతున్నారు. అవసరమైతే కర్ణాటక సరిహద్దులో చేస్తామంటున్నారు. పోలీసులతో అడ్డుకుంటే నిరహారదీక్షలు చేస్తామని, అరెస్టులు చేస్తే జైలులో కూడా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే.. సమావేశం ఎలా జరుగుతుందో చూస్తామని ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సవాల్ చేస్తున్నారు. కాగా.. చిలమత్తూరులో భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. 144సెక్షన్‌తో పాటు 30యాక్ట్ అమలు చేశారు. సభలు, సమావేశాలు చేయరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
ఆరని జ్యోతిలా.. ఆత్మీయ స్మృతిలా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి..ఆ పేరు వింటేనే నిరుపేదల హృదయాలు పులకిస్తాయి. పేదల గుండె చప్పుడును ఆలకించిన నాయకుడు కాబట్టే అనితర సాధ్యమైన అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీతో లక్షల ప్రాణాలు నిలబెట్టారు. వైఎస్ అమితంగా ఇష్టపడే జిల్లాల్లో తూర్పు గోదావరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన దివంగతులై ఏడేళ్లయినా ఇప్పటికీ ప్రతి పేదవాని గుండెల్లో గూడుకట్టుకునే ఉన్నారు. ‘తూర్పు’ సెంటిమెంట్‌ను బలంగా విశ్వసించే వైఎస్ అధికారం చేపట్టాక తన మానసపుత్రిక అయిన ‘ఇందిరమ్మ’ పథకానికి 2006 ఏప్రిల్ 1నlకపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే వైఎస్ ప్రారంభించారు. డెల్టా రైతులకు వరప్రదాయినిలాంటి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. జిల్లాకు రూ.1,697.24 కోట్లు కేటాయించారు. తూర్పు, మధ్య డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్లో సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.1,170.21 కోట్లు, మురుగునీటి కాలువలకు రూ.486.45 కోట్లు కేటాయించారు. 2008లో ఆరంభమై హయాంలో శరవేగంగా సాగిన ఆధునికీకరణ పనులను ఆయన మరణానంతరం పాలకులు అటకెక్కించారు. పొలాలకీ, గళాలకూ నీరు.. ఏటిగట్ల అభివృద్ధికి రూ.540 కోట్ల వ్యయంతో 31 ప్యాకేజీలుగా నిర్ణయించి 2007లో పనులను ప్రారంభించి 2010 లోపు పూర్తి చేయాలని వైఎస్ తలపోశారు. 2009 వరకూ వేగంగా జరిగిన ఏటిగట్టు పనులు ఆయన హఠాన్మరణం తరువాత నిలిచిపోయాయి. జలయజ్ఞంలో భాగంగా మహానేత చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ 11 ఏళ్లు అవుతున్నా 60.4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.10 కోట్లతో పథకం నిర్మించి తమ దాహార్తి తీర్చిన వైఎస్‌ను జన్మజన్మలకు మరిచిపోలేమని రాజోలు ప్రాంతవాసులంటున్నారు. 2009లో రామచంద్రపురం వాసులకు గుక్కెడు నీరందించేందుకు రూ.21 కోట్లతో రక్షిత మంచినీటి పథకానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. కానీ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు మంచినీటి కొరతతో అల్లాడుతున్నారు. రాజానగరం నియోజకవర్గం కలవచర్ల వద్ద రూ.18 కోట్లతో పుష్కరలిఫ్ట్ను ఏర్పాటు చేసింది కూడా మహానేతే. 2003 మేలో వైఎస్ జరిపిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలోనే ‘ఉచిత విద్యుత్తు’ పథకానికి బీజం పడింది. తీవ్ర అస్వస్థతతో యాత్రకు విరామమిస్తూ బూరుగుçపూడిలో ఆగిపోయిన వైఎస్ వద్ద మెట్టరైతులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చలించిన ఆయన సీఎం కాగానే ఉచిత విద్యుత్తు ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. మెట్టకు వరం పుష్కర పథకం మెట్టలో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు అంది సస్యశామలమైంది. జలయజ్ఞంలో భాగంగా మెట్టప్రాంతానికి రూ.600 కోట్లు కేటాయిచారు. 2008లో సోనియా చేతుల మీదుగా పుష్కర పథకాన్ని వైఎస్ ప్రారంభింపచేసి మెట్ట రైతులకు అపర భగీరథుడయ్యారు. రాజమండ్రిరూరల్లో రూ.100 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(నేక్)ను తీసుకువచ్చింది ఆ మహానేతే. రూ.800 కోట్లతో గోదావరిపై నాలుగో వంతెనకు అంకురార్పణ చేసిందీ ఆయనే. ఏజెన్సీలో గిరిజనుల భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో వైఎస్ ముసురుమిల్లి, భూపతిపాలెం ప్రాజెక్టులను మంజూరు చేశారు. కాకినాడలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు సుమారు రూ.50 కోట్లతో వైఎస్ హయాంలో పేర్రాజుపేట రైల్వే క్రాసింగ్‌పై వైఎస్ఆర్ వారధి పేరుతో ఒక ఫ్లై ఓవర్‌ను, సాంబమూర్తినగర్ రైల్వే క్రాసింగ్‌పై మల్లిపూడి శ్రీరామసంజీవరావు వారధి పేరుతో మరో ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఆయన హయాంలోనే కొండయ్యపాలెం, పోర్టు ప్రాంతంలో మరో రెండు ఫ్లై ఓవర్ల కోసం శంకుస్థాపన చేసినప్పటికీ ఆకస్మిక మరణంతో పురోగతి లేకపోయింది. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్లో సుమారు రెండువేల రాజీవ్‌గృహకల్ప సముదాయాలను పూర్తి చేసి ఎంతో మంది పేదల సొంతింటి కల నెరవేర్చారు. జీవితంలో వెలుగులు నింపిన ఆ మహనీయుని ప్రాణజ్యోతి మలిగిపోయినా.. ఆయన స్మతి ఆరనిజ్యోతిగా సదా ప్రజ్వలిస్తూనే ఉంటుంది. -
ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట
తిరువళ్లూరు: ప్రేమ వివాహం చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించిన ఓ ప్రేమజంట భద్రత కల్పించాలని కోరుతూ ఎస్పీ శ్యామ్‌సన్‌ను ఆశ్రయించింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని కున్నత్తూరు గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు సునీల్‌దేవ్, అరక్కోణంలోని ఇచ్చిపుత్తూరు గ్రామానికి చెందిన కీర్తనలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను కీర్తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు రావడంతో వీరు ఎస్పీ శ్యాంసన్‌కు వినతి పత్రం సమర్పించారు. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.