ఏలూరు సెంట్రల్ : చిన్నతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకాతిరుమలలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కల్యాణ మండప ట్రస్ట్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. శ్రీవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చే ఆర్యవైశ్య భక్తుల కోసం దాతల సాయంతో కల్యాణ మండపం నిర్మించగా, నిధుల వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ట్రస్ట్ పరిరక్షణ కమిటీ పేరిట కొందరు నిధుల భక్షణకు పూనుకున్నారంటూ ట్రస్ట్ మాజీ కార్యదర్శి ఓబులశెట్టి గంగరాజు కుమార్ (శేఖర్), ఫౌండర్ ట్రస్టీ యిమ్మడి రామ్మోహనరావు తనయుడు, దాత యిమ్మడిరత్నాజీ ఆరోపించారు. ట్రస్ట్‌కు సంబంధించి ఆంధ్రాబ్యాంక్‌లో ఉన్న ఖాతాను స్తంభింప చేయూలంటూ బ్యాంక్ మేనేజర్‌కు లేఖ కూడా పంపించారు.
ఇందుకు సంబంధించి గంగరాజుకుమార్, రత్నాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. ఆర్యవైశ్య కల్యాణ మండపం నిర్వహణకు సంబంధించి 1999 జనవరి 1న దాతలంతా కలసి ఏకగ్రీవ ఆమోదంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత మరింతమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడంతో అక్కడ నిత్యాన్నదాన పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఏడాది క్రితం సుమారు రూ.30లక్షల మేర అవినీతి జరిగిందని, ట్రస్ట్ మేనేజర్ ఆ మొత్తాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చా రుు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ట్రస్ట్ సభ్యులు, దాతలు పట్టుబట్టడం, అనుమానితులపై కోర్టులో కేసులు వేయడం వంటి పరిణామాలు అప్పట్లో చోటుచేసుకున్నారుు.
దీంతో ఆర్యవైశ్య కల్యాణ మండపం ట్రస్ట్ ప్రతిష్ట మసకబారిందని భావించిన దాతలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడు అంబికా కృష్ణ ఎదుట పంచారుుతీ పెట్టారు. ఆయన సల హాతో ట్రస్ట్ స్థానంలో ఏడాదిన్నర క్రితం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత కల్యాణ మండప కార్యక్రమాలను సక్రమంగానే సంస్కరిస్తూ వచ్చిన పరిరక్షణ కమిటీ కాలక్రమంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్రస్ట్ మాజీ కార్యదర్శి గంగరాజు కుమార్, దాత యిమ్మడిరత్నాజీ ఆరోపిస్తున్నారు. చివరకు అన్నదానం నిధులు కూడా కైంకర్యం చేసేందుకు పరిరక్షణ కమిటీ సిద్ధమైందని వారు పేర్కొంటున్నారు.
అందుకే కొత్త ట్రస్ట్ ఏర్పాటు
అన్నదానం కోసం ఉద్దేశించిన సుమారు రూ.2 కోట్లకు పైగా ధనం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉంది. ఆ మొత్తాన్ని బ్యాంకునుంచి విత్‌డ్రా చేయడం అంత తేలికైన పని కాదని, అది ట్రస్ట్ వల్ల మాత్రమే అవుతుందని గుర్తించిన పరిరక్షణ కమిటీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేశారని గంగరాజుకుమార్, రత్నాజీ ఆరోపించారు. కోట్ల సాయివెంకట రాజా చైర్మన్‌గా, గాదంశెట్టి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా ఈ ట్రస్టు ఏర్పాటైంది. వారు అన్నదానం నిధులను విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిం చగా, పాత ట్రస్ట్ సభ్యులు అప్రమత్తం అవడంతో కథ అడ్డం తిరిగిందని వారు తెలిపారు. పాత ట్రస్ట్‌ను రద్దు చేయకుండా రెండో ట్రస్టు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని పాత ట్రస్ట్ కార్యదర్శి శేఖర్, దాత రత్నాజీ వాదిస్తున్నారు.
వాసవీ ట్రస్ట్‌లో పరి‘భక్షణ’ కమిటీ
Published Sat, Sep 6 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement