దర్శకుడు రాజేష్ జైకర్ రూపొందించిన 'కుందనాల బొమ్మ' వీడియో పాటని ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ గీతంలో విరాజ్, సంస్కృతి నటించారు. ప్రకృతి సౌందర్యాన్ని, మహిళా ఆత్మసౌందర్యాన్ని కలుపుతూ సందేశాన్ని ఇచ్చేలా పాటని తెరకెక్కించారు. ఈ పాటని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన 'శేఖర్ మ్యూజిక్' ఛానెల్ ద్వారా విడుదల చేశారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. ఈ గీతాన్ని తీనిన రాజేష్ జైకర్, శ్రవణ్ జి కుమార్.. ప్రకృతిని ఆత్మబలానికి ప్రతిరూపంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి లిరిక్ మనసుని తాకేలా రూపుదిద్దుకుంది. విరాజ్, సంస్కృతి ఈ పాటకు ప్రాణం పోశారు అని ప్రశంసించారు. బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


