జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేప్టటిన ఓ ఈవెంట్‌లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది. అదే సమయంలో తమ కుటుంబం గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది జీవిత.
గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 'నా మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్లమీద బహుశా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారు. తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ శీర్షికకు, లోపల రాసున్నదానికి సంబంధమే ఉండదు. మా ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్‌కు వెళ్లాం. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉంది. కోర్టులో తేలకముందే ఏదేదో చెబుతున్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరమూ కాదనం. కానీ తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయకండి' అని సూచించింది.
చదవండి 👇
హీరోయిన్‌తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్
నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా..
Comments
Please login to add a commentAdd a comment