shivani Rajashekar
-
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగులో ప్రతి ఏడాది 200-300 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వాటిలో హిట్ కొట్టి నిలబడేవి పదుల సంఖ్యలో ఉంటాయి. కొన్ని చిత్రాలైతే ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా పెద్దగా గుర్తుండదు. అలా గతేడాది థియేటర్లలో విడుదల ఓ మూవీ.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)అప్పట్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్.. చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. కొడుకు శ్రీ కమల్ని హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.ఆహా ఓటీటీలో జూలై 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే.. హాస్టల్ లో చదువుకునే స్టూడెంట్ కమల్ (శ్రీ కమల్). అనుకోని పరిస్థితుల్లో ఈ హాస్టల్లోకి లక్ష్మీ భారతి అలియాస్ జిలేబీ వస్తుంది. అసలు బాయ్స్ హాస్టల్లోకి అమ్మాయి ఎందుకొచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా మైదాన్.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్) -
శివావీ రాజశేఖర్ బర్త్‌డే స్పెషల్.. క్యూట్ అండ్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
-
Shivani Rajashekar: శివాని రాజశేఖర్ క్యూట్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
టైటిల్: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్ఎడిటర్ : అఖిల్ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్ సినిమా మాదిరి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్ విజయ్) ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్టైనింగ్ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎంటర్టైన్ కావడానికి వీకెండ్లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్ విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం ‘విద్య వాసుల అహం’.
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో మణికాంత్ గెల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘విద్య వాసుల అహం’ రూపొందింది. వెంకీ అద్భుతమైన కథ రాయడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను’’ అన్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ (అహం) ఉండే ఫన్ ఫిలిం’’ అన్నారు. ‘‘రాహుల్ మంచి రైటర్ కూడా. ఈ స్క్రిప్ట్‌ని తను ఒప్పుకున్నాడంటే కథ బాగుంటుందని అనిపించి నేను కూడా ఓకే చేశాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. -
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో జతకట్టిన టాలీవుడ్ హీరో కూతురు!
తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్న దర్శకుడు పా.రంజిత్. ఆయన చిత్రాల్లో సామాజిక దృక్ప థం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు. ఒకవైపు దర్శకుడిగా రాణిస్తూనే నీలం ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి.. తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. ఇంతకుముందు దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి సక్సెస్ పుల్ దర్శకులను పరిచయం చేశారు. తాజాగా తన మరో శిష్యుడు అకిరన్ మోసెస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. శ్రీనాథ్ బాజీ, లింగేష్, విశ్వంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్నారంటే ఆ చిత్రానికి కచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి కథ, తదితర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తంగలాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. A start to a new chapter✨ The shoot for our next production begins today with bright smiles and fond memories🎆 Written and directed by @AkiranMoses Produced by @beemji #NeelamProductions Starring @gvprakash @Rshivani1@sreenathbhasi @PasupathyMasi @LingeshActor @EditorSelva… pic.twitter.com/P5KrELtXGX — Neelam Productions (@officialneelam) February 29, 2024 -
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
ఇంటికి నేనే దరిద్రం.. నా వల్లే మా నాన్న ఐసీయూలో..: శివానీ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ జంట జీవిత- రాజశేఖర్ల కూతుర్లిద్దరూ వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. శివానీ రాజశేఖర్ ఈ మధ్యే కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో హిట్ అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. 'www సినిమా షూటింగ్లో నాకు కరోనా సోకింది. అంతలోనే ఇంట్లో అందరికీ వ్యాపించింది. నేను త్వరగానే కోలుకున్నాను. అమ్మ, చెల్లికి కూడా కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది. నా వల్ల కుటుంబానికి గండం! కానీ నాన్నకు మాత్రం సీరియస్ అయింది. వెంటిలేటర్ వరకు వెళ్లి వచ్చాడు. నాన్నకు నా వల్ల కరోనా రావడంతో నా జాతకం బాలేదని, నా వల్ల కుటుంబానికి గండం ఉందని చాలామంది ఏవేవో మాటలు చెప్పారు. మొదట నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నాన్న వెంటిలేటర్‌పైకి వెళ్లాడో అప్పుడు చాలా బాధపడ్డాను. నా వల్లే ఇదంతా జరుగుతుందేమో.. ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నా జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, నా వల్ల మా నాన్నకు ఏమవుతుందోనని భయపోడిపోయాను. నాకు అనారోగ్య సమస్య అప్పుడు నాకు ఓ అనారోగ్య సమస్య ఉండేది. దానివల్ల ఉన్నట్లుండి గుండెదడ ఎక్కువయ్యేది. గుండెచప్పుడు సడన్‌గా 170-200 వరకు వెళ్లేది. నాన్న డాక్టర్ కాబట్టి గుండె దడ మొదలవగానే మందులు ఇచ్చేవాడు. అది నెలకోసారి వచ్చిపోతూ ఉండేది. నాన్నకు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ రెండుమూడుసార్లు గుండెదడ వచ్చేది. నాన్న పక్కనే ఐసీయూ బెడ్లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు అతడి పరిస్థితి మరీ సీరియస్ అయింది. ప్రార్థనలే బతికించాయి అందరూ ప్రార్థించండి, ఇక అదే మిగిలింది అని పేపర్ మీద రాశాడు. నీకేమైనా అయితే నేను కూడా చనిపోతాను.. నువ్వు పోరాడు అని చెప్పాను. ఆయన్ని అభిమానుల ప్రార్థనలే బతికించాయి' అని చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమాను చేజార్చుకోవడంపై స్పందిస్తూ.. 'ఉప్పెన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. కానీ ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో చేయనని చెప్పాను. కానీ నాకు చెప్పిన కథకు, సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది' అని తెలిపింది శివానీ రాజశేఖర్. చదవండి: తెలుగులో హీరోయిన్గా, పనిమనిషిగా నటించిన బ్యూటీ.. కొట్టి మరీ ఏడిపించారు.. గుర్తుపట్టారా? -
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు. -
నటుడికి సంతృప్తి అనేది ఉండదు
‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్‌ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ. ►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి. ►దాదాపు 32 ఏళ్ల కెరీర్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్‌తో ‘దేవర’, మోహన్‌లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను. -
Kotabommali PS Pre Release Photos: ‘కోట బొమ్మాళి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా, ఫైట్ మాస్టర్‌గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది'.. శివాని క్రేజీ కామెంట్స్!
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివాని రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. గ్లామరస్ పాత్రల గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే వాటి గురించి ఆలోచించడం లేదు. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతా. నచ్చింది చేసుకుంటూ పోవడమే నా పని. రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. మా కథల విషయంలో అమ్మా, నాన్న జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది.' అని అన్నారు. శ్రీకాంత్ సార్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారని తెలిపింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని తెలిపింది. -
Shivani Rajashekar: శివాని రాజశేఖర్ అద్భుతమైన లుక్ చూశారా? (ఫోటోలు)
-
ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా కోట బొమ్మాళి పాట
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సినిమా నుంచి ‘ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ్మ తల్లి సన్నిధానంలో ఈ పాటను విడుదల చేశారు. రంజన్ రాజ్ సంగీతం అందించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, తేజా మార్ని, చిత్రసహ నిర్మాత భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
Kota Bommali Ps Teaser Launch: 'కోట బొమ్మాళి పి.ఎస్' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'గన్ కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్'
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'కోట బొమ్మాళి పి.ఎస్'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!) టీజర్ చూస్తే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలే కథాంశంగా తీసినట్లు కనిపిస్తోంది. సస్పెన్స్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. అసలు ఈ కోట బొమ్మాళి పీఎస్ కథేంటో తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే. Haunting tale from the rustic lands of Srikakulam 🔥🔥#KotabommaliPS teaser out now! - https://t.co/GrvWpLzMBL Grand release worldwide on November 24th ❤🔥@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/TG1Pq39zV3 — GA2 Pictures (@GA2Official) November 6, 2023 -
బొమ్మాళి డేట్ ఫిక్స్
శ్రీకాంత్ మేకా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. ‘‘ఓ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే ‘లింగి లింగిడి..’ పాట కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, సహనిర్మాతలు: భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్: అజయ్ గద్దె. -
’కోట బొమ్మాళి పీ ఎస్’వచ్చేస్తోంది
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ నాయాట్టుకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన శ్రీకాకుళం మాస్ జానపద పాట ‘లింగి లింగి లింగిడి’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించింది చిత్రబందం. నవంబరు 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నేడు విడుదల తేది పోస్టర్ నువిడుదల చేశారు. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
జిలేబి సినిమా రివ్యూ
స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.. కథ జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం ఏర్పడింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు. విశ్లేషణ విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్లో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్లోకి హీరోయిన్ వచ్చిన దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రథమార్దంలో పాత్రల పరిచయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ.. బాగున్నాయి కానీ సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఎక్కువ సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. చదవండి: Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
నటి శివాని రాజశేఖర్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ఆ విషయం ఇప్పటిదాకా అమ్మానాన్నలకు తెలియదు : శివానీ రాజశేఖర్
శివాని రాజశేఖర్.. సినీ జంట డాక్టర్ రాజశేఖర్, జీవితల తనయ. ఆ ఐడెంటిటీ కొంచెం ప్లస్ అయినా నటిగా నిలదొక్కుకోవడానికి మాత్రం అభినయాన్నే నమ్ముకుంది. చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అని చూసుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం ముఖ్యమని భావించింది. అనుసరిస్తోంది. స్టార్‌గా వెబ్ తెరను ఏలుతోంది. తండ్రి లాగే ఎమ్‌బీబీస్ పూర్తిచేసి యాక్టర్ అయిన డాక్టర్ శివాని.. చెల్లి శివాత్మిక కంటే కొంచెం లేట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రపంచం గురించి పూర్తి అవగాహన ఉండటంతో మొదట నిర్మాతగా మారి తెలుగులో ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘ కల్కి’ సినిమాలు నిర్మించింది. మోడల్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ ఫైనలిస్ట్‌గా నిలిచింది. తర్వాత ‘అద్భుతం’సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘టూ స్టేట్స్’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తన సినిమాలు అన్నీ ఓటీటీలోనే విడుదలయినప్పటికీ వెండితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్‌తో వినోదాన్ని పంచుతోంది. చిన్నప్పుడు బొంగరాలు కొట్టేసేదాన్ని. ఇంటికి తెచ్చి ఎవరికీ తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనందపడిపోయేదాన్ని. ఈ విషయం ఇప్పటిదాకా అమ్మనాన్నలకు తెలియదు. – శివాని రాజశేఖర్ -
పట్టుచీరలో బుట్టబొమ్మలా పూజాహెగ్డే.. పూజిత స్టన్నింగ్ లుక్స్
► పట్టుచీరలో బుట్టబొమ్మలా పూజాహెగ్డే ► వెకేషన్ ఫోటోలు షేర్ చేసిన అనన్య పాండే ► చందమామ కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ ఫోటోలు ► పొడుగు కాళ్ల సుందరిలీ ఫోటోలకు ఫోజులిచ్చిన శివానీ ► ఆరేంజ్ డ్రెస్‌లో పూజిత పొన్నాడ స్టన్నింగ్ స్టిల్స్ View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఆ హీరోతో డేటింగ్.. దుబాయ్‌కు పారిపోయానన్నారు : శివానీ రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్‌కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్‌సిరీస్‌లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్‌ను నాకు తగిలేసి శివానీ బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు. దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్‌ఫ్రెండ్‌తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్‌కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరో రాజ్‌తరుణ్‌తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్‌తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది. -
అహ నా పెళ్లంట టీమ్ తో స్పెషల్ " చిట్ చాట్ "
-
‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్ టైటిల్ : అహ నా పెళ్ళంట (8 ఎపిసోడ్స్) నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, 'గెటప్' శ్రీను, భద్రమ్, తదితరులు నిర్మాతలు: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి దర్శకత్వం: సంజీవ్ రెడ్డి సంగీతం : జుడా శాండీ నేపథ్య సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ ఎడిటర్: మధు రెడ్డి విడుదల తేది: నవంబర్ 17, 2022(జీ5) కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ విజయాలు అందుకొని టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు. ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’. శివానీ రాజశేఖర్ హీరోయిన్. నేటి(నవంబర్ 17) నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి రాజ్ తరుణ్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అహ నా పెళ్లంట’ కథేంటంటే.. నారాయణ అలియాస్ నో బాల్ నారాయణ( హర్ష వర్ధన్), సుశీల(ఆమని) దంపతులు ముద్దుల కొడుకు శ్రీను (రాజ్ తరుణ్). చాలా అల్లరిగా ఉండే శ్రీను.. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఇకపై అమ్మాయిలతో మాట్లాడనని, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని తల్లి సుశీలకు ప్రామిస్ చేస్తాడు. చెప్పినట్లే శ్రీను అమ్మాయిల జోలికి వెళ్లడు. చూడ చూడక ఒక అమ్మాయిని చూస్తే.. ఆ రోజు నాన్న నారాయణకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. దీంతో శ్రీను తను అమ్మాయిలను చూడడం వల్లే నాన్నకు ప్రమాదాలు జరుగుతున్నాయని, పెళ్లి చేసుకుంటే ఇవేవి ఉండవని భావిస్తాడు. తనకు పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడుగుతాడు. వారు చూసిన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా పెళ్లి రోజు ఆ అమ్మాయి ‘ప్రేమించిన అబ్బాయితో లేచిపోతున్నాను’అని లేఖ రాసి పారిపోతుంది. పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగడంతో శ్రీనుతో పాటు కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. తన పెళ్లి ఆగడానికి కారణం మహా(శివానీ రాజశేఖర్) అని శ్రీను తెలుసుకుంటాడు. తన కుటుంబం లాగే ఆమె ఫ్యామిలీ కూడా బాధపడాలని పెళ్లికి ఒక్కరోజు ముందు మహాను కిడ్నాప్ చేస్తాడు. అసలు శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మహా ఎలా కారణమైంది? కిడ్నాప్ తర్వాత శ్రీను, మహా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండడానికి కారణమేంటి? మహా ప్యామికీ వచ్చిన ఓ సమస్యను శ్రీను ఎలా పరిష్కరించాడు? ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు? తనను కిడ్నాప్ చేసింది శ్రీనునే అని మహాకు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత మహా తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే వరుసగా ఎనిమిది ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'అహ నా పెళ్ళంట' ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. పెళ్లి పీటల దగ్గరు వరుడిని వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ వధువు కథ ఇది. వరుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో కథ ముందుకు సాగుతుంది. వెబ్ సిరీస్‌లా కాకుండా సినిమాలా కథనం సాగుతుంది. దీనికి కారణం దర్శకుడు సంజీవ్ రెడ్డి టేకింగ్ అనే చెప్పాలి. వెబ్ సిరీసే అయినప్పటికీ.. సినిమాలోలాగా పాటలు, కామెడీ, రొమాన్స్..అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. తొలి ఎపిసోడ్ నిడివి ఎక్కువైనప్పటికీ సరదాగా సాగుతుంది. పాటలు, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. రెండో ఎపిసోడ్ కాస్త నెమ్మగా, రొటీన్‌గా సాగుతుంది. మహా కిడ్నాప్‌తో మూడో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. కిడ్నాప్ సమయంలో, ఆతర్వాత వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. నాలుగో ఎపిసోడ్ రొటీన్‌గా సాగినప్పటికీ.. శ్రీను, మహా ఒకే ఫ్లాట్‌లోకి రావడంతో ఆసక్తి పెరుగుతుంది. ఐదో ఎపిసోడ్ కూడా కామెడీగానే సాగుతుంది. ఆరో ఎపిసోడ్ నుంచి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చాలని శ్రీను నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్లిపోవడం.. శ్రీనుతో ప్రేమలో పడడం ఇలా ఎమోషనల్‌గా మిగతా ఎపిసోడ్స్ సాగుతాయి. క్లైమాక్స్ కూడా కాస్త డిఫరెంట్‌గా, చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు ఈ సిరీస్‌లో ఉంటాయి. రొటీన్ స్టోరీనే అయినా.. ఫ్రెష్‌గా, ఎలాంటి అశ్లీలత లేకుండా ఈ వెబ్సిరీస్ని తెరకెక్కించాడు సంజీవ్ రెడ్డి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ని ఎంచుకొని, తెరపై అనుకున్న విధంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. శ్రీను పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన శైలీలో కామెడీ పండించాడు. మహా పాత్రకు శివానీ రాజశేఖర్ న్యాయం చేసింది. ఆమె పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. రాజ్‌తరుణ్, శివానీ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. హీరో తల్లిదండ్రులుగా ఆమని, హర్షవర్ధన్ బాగా నటించారు. రాజ్ తరుణ్ స్నేహితులుగా రవి శివతేజ, త్రిశూల్ జీతూరి బాగానే నవ్వించారు. పెళ్లికి ముందు లేచిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, సీఐగా రఘు కారుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీల సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
రాజ్ తరుణ్ 'అహ నా పెళ్లంట' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. కాగా ఈ సిరీస్‌లో నరేష్,పోసాని కృష్ణమురళి, ఆమని కీలక పాత్రలు పోషించారు. -
యంగ్ హీరోతో జతకడుతున్న శివానీ రాజశేఖర్
‘స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ‘జిలేబి’ సినిమా షురూ అయింది. శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ కథానాయిక. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో ఎస్ఆర్కే బ్యానర్‌పై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి హీరో రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ స్క్రిప్‌్టని యూనిట్‌కి అందించారు. కె. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘చాలా విరామం తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జిలేబి’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సతీష్ ముత్యాల. -
Vidya Vasula Aham First Look: ఇగో వెనుక ఇంత చరిత్ర ఉందా?
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్య వాసుల అహం’. ‘తెల్లవారితే గురువారం’ఫేం మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోని వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదల చేశారు. (చదవండి: డైరెక్టర్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు) టైటిల్ చాలా ఢిఫరెంట్‌గా, యూత్‌ని అట్రాక్ట్ చేసేలా ఉంది. అహం వెనుక ఉన్న చరిత్రను యానిమేషన్ రూపంలో చెబుతూ వినూత్నంగా ఫస్ట్‌లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. పెళ్లైన ఓ నూతన జంట మధ్య ఉన్న ఇగోలలో నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ ఇల్లు సెట్ వేశామని, ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. -
పెద్ద బ్యానర్లో శివానీ రాజశేఖర్ సినిమా!
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమైంది. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. Some journeys are worth waiting for… this one is going to be special :)#AlluAravind garu Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨Produced by #BunnyVas & #VidhyaMadhuri Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 #Shivani pic.twitter.com/u76XITcrnY— Rahul Vijay (@ActorRahulVijay) June 30, 2022 చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి -
మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న శివానీ, ఎందుకంటే?
ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల కోసం ఎంతగానో కష్టపడింది శివానీ రాజశేఖర్. ఇటీవలే మిస్ తమిళనాడుగానూ ఎంపికైంది. మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల శివానీ మలేరియా బారిన పడింది. దాంతో మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్ మిస్ అయింది. అంతేకాదు, అనారోగ్యంతో తను మరింత సన్నబడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తన మెడికల్ థియరీ పరీక్షలు కూడా మొదలయ్యాయని, మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే రోజు అంటే జూలై 3న తనకు ఎగ్జామ్ ఉందని తెలిపింది. ఈ పరీక్ష మిస్ అవ్వకూడదనే ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేసింది. దీంతో చదువు కోసం అంత పెద్ద త్యాగం చేస్తున్న శివానీని కొందరు అభినందిస్తుంటే, అంత మంచి అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటున్నావని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివానీ.. అద్భుతం, శేఖర్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం తన పరీక్షల మీద పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఎగ్జామ్స్ పూర్తవగానే రాజ్ తరుణ్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటించనుంది. View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) చదవండి: శాస్త్రవేత్తపై దోశద్రోహి కేసు.. 50 రోజులు జైల్లో నరకం.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ -
Jeevitha Rajasekhar: తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ..
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేప్టటిన ఓ ఈవెంట్లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది. అదే సమయంలో తమ కుటుంబం గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది జీవిత. గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 'నా మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్లమీద బహుశా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందని దుష్ప్రచారం చేశారు. ఓసారి శివాత్మిక అంటారు, కాదు శివానీ ప్రియుడితో పారిపోయిందంటారు. తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ శీర్షికకు, లోపల రాసున్నదానికి సంబంధమే ఉండదు. మా ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్‌కు వెళ్లాం. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉంది. కోర్టులో తేలకముందే ఏదేదో చెబుతున్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరమూ కాదనం. కానీ తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయకండి' అని సూచించింది. చదవండి 👇 హీరోయిన్‌తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత
టాలీవుడ్లో యాంగ్రీ ఎంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా నటించింది. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా మే 20న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో డైరెక్టర్ జీవిత రాజశేఖర్ ముచ్చటించారు. 'కొన్ని పరిస్థితుల వల్ల దర్శకురాలిగా మారాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయలానే ఆసక్తి ఎప్పుడూ లేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ శేషు మూవీని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా కథను మార్చకుండా తీయాలని అనుకున్నాం. అలా చేసేందుకు ఏ డైరెక్టర్ ముందుకు రాలేదు. దీంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం. మలయాళంలో హిట్ సాధించిన జోసెఫ్ సినిమాను శేఖర్ పేరుతో తెరకెక్కించాం. 'పలాస' డైరెక్టర్ కరుణ కుమార్, నీలకంఠను కలిశాం. వారు బిజీగా ఉండటంతో నేనే డైరెక్షన్ చేశాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'శేఖర్' ఉంటాడు అనేలా ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ.. యూట్యూబ్ వారే థంబ్‌నేయిల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.' అని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ 'వన్ వీక్‌లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియస్ కావడంతో తను బతుకుతాడా.. లేదా అనే పరిస్థితి ఏర్పడింది. అందరి ఆశీర్వాదంతో తను రికవరీ అయి ఈ సినిమా చేశారు. ఇందులో డాటర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివానినే కూతురిగా చేయిస్తే బాగుంటుందని చేయించాం. అందరూ రాజశేఖర్ నెగెటివ్ రోల్స్ చేస్తారా.. అని అడుగుతున్నారు. మొదట్లో తన జర్నీ విలన్ గానే మొదలైంది. బారతి రాజా దర్శకత్వంలో విలన్‌గా నటించారు. తర్వాత హీరోగా చేయడంతో బిజీ అయ్యారు. అయితే రామ్ చరణ్ సినిమా "ధ్రువ" లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్‌టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తారు. అలాగే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారు. అలాగే నన్ను కూడా సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.' అని పేర్కొన్నారు. -
Nenjuku Needhi: ఈ చిత్రానికి టైటిల్ మా తాత ఇచ్చారు:ఉదయనిధి స్టాలిన్
తమిళసినిమా: నెంజుక్కు నీతి చిత్ర టైటిల్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశామని నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి శివాని రాజశేఖర్, తాన్య రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రొజెక్ట్స్ సంస్థలతో కలిసి రెమో పిక్చర్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌రాజ్ కామ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. దీపునీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సోమవారం సాయంత్రం నిర్వహించిన చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన తాత కరుణానిధికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రం టైటిల్ ఆయన ఇచ్చిందేనని పేర్కొన్నారు. నిర్మాత బోనీ కపూర్ ఫోన్ చేసి ఆర్టికల్ 15 హిందీ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేద్దామని చెప్పగా దర్శకత్వం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. అలాంటి సమయంలో ‘కణా’ చిత్రాన్ని చూసి అరుణ్‌రాజ్ కామరాజును పిలిపించగా ఆయన వెంటనే చేద్దామని చెప్పారన్నారు. నెంజుక్కు నీతి టైటిల్ గురించి తన తండ్రి స్టాలిన్‌కు చెప్పగా జాగ్రత్తగా చేయండని అన్నారన్నారు. -
ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం : రాజశేఖర్ ఎమోషనల్
‘‘శేఖర్’ సినిమా స్టార్టింగ్‌లో కరోనా బారిన పడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకుల ప్రార్థనలు నన్ను బతికించింది ఈ సినిమా కోసమేనేమో! మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం’’ అన్నారు రాజశేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో అడివి శేష్ ‘శేఖర్’ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, మాట్లాడుతూ – ‘‘రాజశేఖర్‌గారి ‘మగాడు’ చిత్రం నా ఫేవరెట్. ‘శేఖర్’ సినిమా ట్రైలర్ బాగుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించినందు వల్ల ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. మహిళలు ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువమంది ప్రోత్సహించరు. ‘శేఖర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమాయే ‘శేఖర్’. నేను మిస్ ఇండియా పోటీకి అర్హత సాధించడానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంటే తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వగా, నేను తమిళనాడు కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. -
Miss India: మిస్ తమిళనాడుగా శివాని, వివరణ ఇచ్చిన హీరోయిన్
Shivani Rajashekar About Her Miss India Selection: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరోవైపు మోడల్‌గా మిస్ ఇండియా పోటీల్లో రాణిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న జరిగిన ఈ పోటీలో శివాని మిస్ తమిళనాడుగా ఎంపికైంది. దీంతో ఆమెను విమర్శలు చుట్టుముట్టాయి. తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడుకు రిప్రజెంట్ చేయడమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై తాజాగా స్పందించింది ఆమె. తన తండ్రి రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివాని మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీపై స్పందించింది. ‘తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకున్నాను. అయితే నిర్వాహకులు అప్లికేషన్లో మల్టిపుల్ అప్షన్స్ ఇచ్చారు. దీంతో నేను తమిళనాడును కూడా అప్షన్‌గా పెట్టా. ఎందుకంటే నేను పుట్టింది చెన్నైలోనే కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడును కూడా అప్షన్లో ఇచ్చాను. చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి కానీ, పోటీ నిర్వాహకులు నన్ను తమిళనాడు కేటగిరి నుంచి ఎంపిక చేశారు. అందువల్ల ‘మిస్ తమిళనాడు’గా ఎంపికయ్యా’ అని వివరించింది. అయితే ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషపడే దాన్ని అని, తమిళనాడు కూడా తనకు సొంత రాష్ట్రం వంటిదేనని పేర్కొంది. అన్నింటినీ మించి తాను భారత దేశాన్ని రిప్రజెంట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని శివాని చెప్పుకొచ్చింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1621343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మిస్ ఇండియా పోటీల్లో దూసుకెళ్తున్న శివాని రాజశేఖర్
Shivani Rajasekhar Has Top 8 Place In Miss India 2022: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొననున్నట్లు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నేను కొత్త సాహసం చేస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ టు ది లవ్లీ లేడీస్' అంటూ రాసుకొచ్చింది. అలాగే శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టాప్ 8 ఫైనలిస్టులో ఉంది. తాను ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు ఇన్‌స్టాలో వెల్లడించింది. శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగా.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఈ ఫైనలిస్టులో ఉన్నారు. 2021లో తేజ సజ్జా నటించిన అద్భుతం చిత్రంతో శివాని రాజశేఖర్ వెండితెరకు పరిచయమైంది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
'మిస్ ఇండియా' పోటీకి ప్రముఖ హీరో కుమార్తె
ప్రముఖ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె, నటి శివాని 'ఫెమినా మిస్ ఇండియా 2022' పోటీలో పాల్గొనబోతోందని సమాచారం. ఈ మేరకు సోమవారం ఆడిషన్స్‌కు హాజరైనట్టు సోషల్ మీడియా ద్వారా శివాని తెలియజేసింది. దానికి సంబంధించి తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చినట్టు తెలిపింది. దాంతో పాటు తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాని దానికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. ‘ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు సైతం ఆల్ ది బెస్ట్’ అని శివాని తెలిపింది. గత ఏడాది 'అద్భుతం' అనే చిత్రంతో శివాని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా 'శేఖర్' చిత్రంతో వెండితెరపై తండ్రి రాజశేఖర్‌తో కలిసి శివాని కనిపించనుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. -
ప్రియుడితో లేచిపోయింది నేనా? మా అక్కనా?: హీరోయిన్ ఫైర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు ప్రియుడితో దుబాయ్‌కు చెక్కేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ వార్త రాజశేఖర్ ఫ్యామిలీ కంట పడినట్లు కనిపిస్తోంది. ఇంకేముంది రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక సదరు వార్తపై మండిపడ్డారు. ఈ మేరకు శివాత్మిక రాజశేఖర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. 'ప్రియుడితో పారిపోయామని వార్తలు రాస్తున్నారు. ఇంతకీ పారిపోయింది నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరో? నెక్స్ట్ లెవల్ న్యూస్ రాస్తున్నారు. కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి. బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి' అంటూ ఫైర్ అయింది. కాగా శివాత్మిక ప్రస్తుతం 'పంచతంత్రం' సినిమా చేస్తోంది. జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'శేఖర్' సినిమాలో శివానీ ఓ ముఖ్యపాత్ర పోషించింది. చదవండి: ఏడేళ్ల లవ్.. చూడకూడని స్థితిలో బావను చూశాను: అరియానా బ్రేకప్ స్టోరీ -
రాజ'శేఖర్'లో శివానీ రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో... సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం" అని చెప్పారు. -
శేఖర్ : జీవితా రాజశేఖర్ దర్శకత్వం.. శివానీ కీలక పాత్ర
Shekar: Shivani Shares Screen Space With Her Father Rajasekhar: రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ హీరోగా నటించిన 91వ సినిమా ‘శేఖర్’. ఇందులో రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించింది శివాని. తండ్రి, కుమార్తె వెండితెరపై కలిసి కనిపించనున్న తొలి చిత్రం ఇదే. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. -
ఓటీటీకి శివాని రాజశేఖర్ తమిళ చిత్రం అన్బరివు, ఆరోజే స్ట్రీమింగ్
సాక్షి, చెన్నై: హిప్ హాప్ ఆది కథానాయకుడిగా తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అన్బరివు. అశ్విన్ రామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రంలో నటి కశ్మిరా పర్దేశి, శివాని రాజశేఖర్ కథానాయికలుగా నటించారు. చదవండి: నాకింకా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి హిప్ హాప్ ఆదినే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం(జనవరి 7) డిస్నీ ప్లస్ హట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ఆది మాట్లాడుతూ... ఇందులో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. చక్కని సందేశంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. సత్య జ్యోతి వంటి ప్రముఖ సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని అశి్వన్ రామ్ పేర్కొన్నారు. -
ఆ పదాలు ఇక జీవితంలో వినిపించొద్దు
2022 గురించి ఏం చెబుతారు? అని అందాల తారలను అడిగితే అందరూ కామన్‌గా చెప్పిన పాయింట్ ‘పాజిటివ్‌గా ఉందాం’ అని. ఇంకా ఎవరేమన్నారో చదివేద్దాం. వ్యక్తిగా, నటిగా ఈ ఏడాది ఇంకా బెటర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 2021 సంతృప్తికరంగా అనిపించింది. అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. 2022లో ఆ సినిమాలను ప్రేక్షకులకు చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ ఏడాది వీలైనంత ఉన్నతంగా జీవించాలని అనుకుంటున్నాను. మనకు దక్కినవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలనుకుందాం. అలాగే ప్రపంచం పట్ల మరింత పాజిటివ్‌గా, బాధ్యతగా ఉండటానికి ప్రయత్నిద్దాం. – రాశీ ఖన్నా కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోను. కానీ 2022లో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను. 2022పై నాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముందుగా ఈ నెల 14న ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. ఈ ఇయర్లో ప్రేక్షకులు కొత్త పూజను చూస్తారు. ‘పూజ 2.0’ అనుకోవచ్చు. నా నుంచి 2022లో సినిమాల పరంగానే కాక, కొన్ని కొత్త అనౌన్స్మెంట్స్ వస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నెగిటివిటీ కనిపిస్తోంది. అందుకే మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవాలి. – పూజా హెగ్డే నేను హ్యాపీగా ఉంటూ, నా చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటున్నాను. మనం సంతోషంగా ఉండటానికి సక్సెస్ కూడా కొంత కారణం. సో.. కష్టపడి మరింత సక్సెస్ కావాలనుకుంటున్నాను. తోటివారితో పోలికలు పెట్టుకోకూడదు. పోలికలు మన సంతోషాన్ని మనకు దూరం చేస్తాయి. 2021లో నేను డిఫరెంట్ సినిమాలు చేశాను. నటిగా 2022లోనూ మరింత కొత్తగా ఎంటర్టైన్ చేయడానికి కష్టపడతాను. – లావణ్యా త్రిపాఠి 2020తో పోల్చితే 2021 నాకు బాగానే గడిచింది. నేను హీరోయిన్గా చేసిన రెండు సినిమాలు 2021లో విడుదలయ్యాయి. 2022లో ఇంకా ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతం, భవిష్యత్‌ల గురించి అతిగా ఆలోచించడం కన్నా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. మనకున్న వాటితోనే మనం సంతోషంగా, పాజిటివ్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. – నభా నటేశ్ జీవితంలో ఓ ఫ్లోతో పాజిటివ్‌గా వెళ్లిపోవడమే నా న్యూ ఇయర్ రిజల్యూషన్. 2021లో నేను నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇంకా విడుదల కావాల్సిన చిత్రాలు ఉన్నాయి. 2022లో విడుదలయ్యే ఆ చిత్రాల్లో నా పెర్ఫార్మెన్స్ను ప్రేక్షకులు అభినందిస్తారనే నమ్ముతున్నాను. 2022లో కరోనా, డెల్టా, ఒమిక్రాన్ వంటి పదాలు మన జీవితాల్లో ఇకపై వినిపించకూడదనే కోరుకుంటున్నాను. కరోనాతో ఇబ్బంది పడ్డ అందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలని ఆశిస్తున్నాను. – నిధి అగర్వాల్ సమయాన్ని అస్సలు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాను. 2021 నాకు ఉగాది పచ్చడిలా సాగింది. 2021లో మా తాతగారు మాకు దూరమయ్యారు. అందుకే 2021 నాకు అంతగా ఇష్టం లేదు. కానీ నేను హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘అద్భుతం’, మలి చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’లు విడుదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. జీవితం అనేది ఊహించలేనిది. మనం ఎన్ని అనుకున్నా జరగాల్సిందే జరుగుతుంది. అందుకే 2022పై నేనంతగా అంచనాలు పెట్టుకోవడం లేదు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ నా పనిలో నేను వంద శాతం కష్టపడతాను. – శివానీ రాజశేఖర్ కోవిడ్ కారణంగా 2019 నుంచి మనం చాలా బాధలు, ఇబ్బందులు పడుతున్నాం. అందుకే మానసికంగా, ఆర్థికంగా ఇలా ప్రతి విషయంలోనూ 2022లో అందరూ ఓ స్థిరత్వాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. 2022లో మంచి సినిమాలు చేసి, ఇంకా బాగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాలన్నది నా ఆశయం. కులం, మతం, ధనిక, పేద అనే తేడాలు లేవని కోవిడ్ మనకు మరోసారి గుర్తు చేసింది. సో.. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ అందరం హ్యాపీగా ఉందాం. – శివాత్మిక రాజశేఖర్ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది నా నూతన సంవత్సరం నిర్ణయం. వృత్తి, వ్యక్తిగత జీవితం.. రెండూ ముఖ్యం కాబట్టి రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. కళ్ల ముందు కరోనా సవాల్ ఉన్నప్పటికీ 2021లో చిత్రపరిశ్రమ నిలదొక్కుకుంది. అందులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ 2022లో మనందరం పాజిటివిటీతో ముందుకు సాగుదాం. – నేహా శెట్టి వృత్తిని, ఆరోగ్యాన్ని బ్యాలెన్డ్స్‌గా చూసుకోవాలనుకోవడమే నా 2022 రిజల్యూషన్. ఏ విషయంలో అయినా అతి అనేది అనర్థమే. జీవితంలో ఏదైనా సమతూకంగా ఉండాలి. అందుకే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. కోవిడ్ పరిస్థితులు, అనారోగ్యానికి గురి కావడం, వర్క్ పరంగా కొన్ని బ్యాక్లాక్స్ ఉండిపోవడం.. ఇలా 2021 నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. అయితే జీవితంలో ఏ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, నిజమైన స్నేహితులు ఎవరు, మనతో నిజాయితీగా ఉండేవారు ఎవరు అని తెలిసొచ్చింది. – మీనాక్షీ చౌదరి -
‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ మూవీ రివ్యూ
టైటిల్: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు సమర్ఫణ: సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ: రామంత్ర క్రియేషన్స్ నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల దర్శకత్వం: కె వి గుహన్ సంగీతం: సైమన్ కె. కింగ్ ఎడిటింగ్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 24, 2021(సోనిలీవ్) సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 24న సోనిలీవ్‌లో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావడం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) అనే నలుగురు సాఫ్ట్వేర్ టెకీలు మంచి స్నేహితులు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోకి మిత్ర వస్తుంది. చిష్ట్రీ ద్వారా విశ్వకి మిత్ర పరిచయమవుతుంది. దీంతో వీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అదికాస్త ముదిరి ప్రేమగా మారుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు?, విశ్వని ఎందుకు ఉరివేసుకుని చావమన్నాడు. ఆ వ్యక్తి నుండి విశ్వ మిత్ర, చిష్ట్రిలను కాపాడాడా లేదా అనేది మిగతా సినిమా కథ.. ఎవరెలా చేశారంటే...? ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువ. వాళ్లు కూడా నేరుగా కలుసుకోరు. అంతా వెబ్ కెమెరాల ద్వారానే కలుసుకుంటారు. ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ విశ్వగా అదిత్ అరుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. . ‘అద్భుతం’తర్వాత శివానీ రాజశేఖర్ నటించిన మరో చిత్రం ఇదే. ఈ చిత్రంలో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో బాగానే నటించింది. తెరపై చాలా క్యూట్‌గా కనిపించింది. ఇక ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అసలు సిసలు థ్రిల్ ను పరిచయం చేశాడు. వైవా హర్ష… తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు. ఎలా ఉందంటే..? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటా సైబర్ ఎటాక్. మనకు తెలియకుండా.. మన డేటాని హ్యాకర్లు దొంగిలించి ఇతరులకు అమ్ముకుంటున్నారు. దాని వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇదే కాన్సెప్ట్‌ని తీసుకొని ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కె.వి. గుహన్. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని అందరికి తెలిసేలా ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విషయమే. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది. ఓ దుండగుడు చిష్ట్రీ, మిత్రలు ఉంటున్న అపార్ట్మెంట్కి రావడం.. చిష్ట్రీని కత్తితో దాడి చేయడంతో సినిమాపై ఆసక్తి పెరుగుంది. ఆ ఆగంతకుడు ఎవరు? అతనికి విశ్వకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే దానికి దర్శకుడు చూపించిన రీజన్ మాత్ర చాలా పేలవంగా ఉంది. ఆగంతకుడి నేపథ్యాన్ని సాదాసీదాగా మాటల రూపంలో చెప్పించాడు అంతే. ఆగంతకుడి ప్లాష్ బ్యాక్‌ని ఇంకాస్త బలంగా చూపిస్తే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సైమన్ కె. కింగ్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు చాలా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ గూజ్బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు. రామంత్ర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రయత్నం మాత్రం బాగుంది. -
ఆకట్టుకుంటోన్న `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్టర్ పోస్టర్స్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభించగా.. తాజాగా ఈ చిత్రంలోని నటీనటుల పాత్రలకు సంబందించి క్యారెక్టర్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ `విశ్వ`గా నటిస్తుండగా, శివాని రాజశేఖర్ `మిత్ర` పాత్ర పోషిస్తుంది. వారి మిత్రులుగా `అష్రఫ్` పాత్రలో ప్రియదర్శి, `చిష్ట్రి` పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారు. వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా నటుడు రియాజ్ ఖాన్ `ఖాన్`పాత్రధారిగా కనిపించనున్నారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. -
‘ఆ భయంలో నుంచి పుట్టిన కథే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈ చిత్రం’
‘‘కేవీ గుహన్గారివంటి అద్భుతమైన టెక్నీషియన్‌తో నా కుమార్తె శివానీ వర్క్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివానీకి కరోనా సోకింది. ఆ తర్వాత నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. తన వల్ల నాకు కరోనా వచ్చిందని శివానీ ఏడ్చింది. తను హీరోయిన్గా నటించిన ‘అద్భుతం’ సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో..ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాకు అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ అన్నారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు.. ఎక్కడ.. ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవి ప్రసాద్‌రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుహన్‌గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. సినిమా చూశాను. పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘పూర్తిగా వెబ్‌క్యామ్‌తో సినిమా తీశాం. కరోనా సమయంలో అసలు బతుకుతామో లేదో అనే భయంకలిగింది. ఈ భయంలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. అదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యాను. శివానీ అమాయకత్వం నచ్చింది. యాక్ట్రస్‌గా నిరూపించుకోవాలనే కసి ఆమెలో కనిపించింది’’ అన్నారు కెవీ గుహన్. ‘‘నిర్మాత సురేష్‌బాబుగారు ప్రోత్సహిస్తున్నారు. మరో నిర్మాత ‘దిల్’ రాజు మా సినిమాను చూసి మెచ్చుకున్నారు’’ అన్నారు రవి. ‘‘ఇది నా 17వ సినిమా. నా కెరీర్ కొంచెం తగ్గినప్పుడు రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ నాకు బూస్ట్ ఇచ్చింది.’’ అన్నారు అదిత్. ‘‘ఈ ప్రాజెక్ట్ నాకు అదిత్ వల్లే వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కేవీ గుహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు శివానీ. ఈ కార్య క్రమంలో సంగీత దర్శకుడు సైమన్ కింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలోకి 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' చిత్రం
WWW Movie Release In Sony Liv OTT: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేకర్ జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు విశేష ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' సినిమా డిజిటల్ రైట్స్‌ని ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం 'సోని లివ్'లో స్ట్రీమ్ అవనుంది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'మా మొదటి చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోని వంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సోని లివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్ మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. -
మంచి కాన్సెప్ట్ లేకపోతే సినిమా తీయను
‘‘పంపిణీ రంగం నుంచి నిర్మాతగా మారినందుకు హ్యాపీగా ఉంది. ఓవర్సీస్లో సినిమాలను విడుదల చేయడంవల్ల కొన్నిసార్లు నిర్మాతలకంటే మాకే ఎక్కువ డబ్బులు వచ్చేవి. నాకు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటే ఇష్టం. మంచి కాన్సెప్ట్ లేకపోతే సినిమా తీయను’’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ‘అద్భుతం’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సృజన్ మాట్లాడుతూ– ‘‘నేనుయూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. జాబ్ చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్నాను. ‘‘కంచె’ చిత్రాన్ని ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడంతో నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’, ‘మహానటి’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. ఇలా దాదాపు ముప్ఫై సినిమాలను ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ తర్వాత నిర్వాణ బ్యానర్లో భాగమై తీసిన ‘మను’, ‘సూర్య కాంతం’ ఆడలేదు. ఇప్పుడు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ స్టార్ట్ చేశాను. మా బ్యానర్లో ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘పంచతంత్రం’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బ్రహ్మానందంగారి తనయుడు గౌతమ్‌తో సినిమా చేస్తున్నాం. సంతోష్ శోభన్‌తో సినిమా ఉంది. ‘గతం’ దర్శకుడు కిరణ్‌తో ఆల్రెడీ ఓ సినిమా తీశాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ‘స్కైలాబ్’ చిత్రాన్ని ఓవర్ సీస్లో పంపిణీ చేస్తున్నాం. కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే ఓవర్ సీస్ మార్కెట్ కోలుకుంటోంది. పెద్ద చిత్రాలు రిలీజైతే మరింత మెరుగుపడుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. -
మా కుమార్తెలు మేం గర్వపడేలా చేశారు: రాజశేఖర్, జీవిత
‘‘శివానీ హీరోయిన్గా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. నేనే నిర్మాతగా శివానీతో ఓ సినిమా చేయాలనుకున్నాను. వీలుపడలేదు. కానీ ఇప్పుడు ‘అద్భుతం’ లాంటి మంచి సినిమాతో శివానీ హీరోయిన్గా పరిచయం అయింది. శివానీ నటనను మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక మేం గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. తేజా సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘అద్భుతం’. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ను కొనలేం. కష్టపడి సాధించుకోవాలి. ‘అద్భుతం’లాంటి సినిమాతో శివానీకి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘నేను హీరోయిన్గా అంగీకరించిన సినిమాలు ఏదో కారణం చేత ఆగిపోతూనే ఉన్నాయి. ‘అద్భుతం’ సినిమాతో నా కల నిజమైంది. నా తొలి సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు శివానీ. ఈ కార్యక్రమంలో శివాత్మిక, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, లక్ష్మీభూపాల్, సృజన్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
జీవితా రాజశేఖర్ కూతురి సినిమాపై చిరంజీవి కామెంట్
Megastar Chiranjeevi Review On Adbutham Movie: తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం అద్భుతం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 19న నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్ నంబర్ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్న నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'నిన్న రాత్రే హాట్‌స్టార్‌లో అద్భుతం మూవీ చూశాను. ఇది ఒక న్యూ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జా, శివానీల నటన చాలా ఇంప్రెసివ్‌గా ఉంది' అంటూ చిరు ట్వీట్లో పేర్కొన్నారు. మూవీ సక్సెస్‌పై చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ చెప్పారు. Watched #AdbhutamOnHotStar last night.A new age film with engaging novel concept.Very Impressive performances by young team @tejasajja123 @Rshivani_1 They surely hv bright futures ahead! Congratulating & wishing entire team Great Success! @MallikRam99 @MahatejaC @PrasanthVarma — Chiranjeevi Konidela (@KChiruTweets) November 23, 2021 -
నటి శివానీ రాజశేఖర్ అందం ‘అద్భుతం’
-
ఆ బాధలో డిప్రెషన్‌కు వెళ్లిపోయా: శివాని రాజశేఖర్
‘సినీ నేపథ్యం ఉంటే అవకాశాల కోసం అప్రోచ్ అవ్వొచ్చు. కానీ, ఫిల్మ్ మేకర్స్‌ను కలిసిన తర్వాత కొత్త వారికైనా, స్టార్ కిడ్స్ అయినా ఉండే విధానం ఒక్కటే. కొత్తవారిలానే నేను, చెల్లి (శివాత్మిక) అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చాం. నా మూడేళ్ల యాక్టింగ్ కెరీర్లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. నేర్చుకోవడానికి అవధుల్లేవు’ అని శివానీ రాజశేఖర్ అన్నారు. తేజా సజ్జా, శివానీ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో విడుదల కానుంది. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దుండగుడి దాడి ఈ నేపథ్యంలో శివాని మాట్లాడుతూ.. ‘‘హిందీ సినిమా ‘2 స్టేట్స్’ రీమేక్‌తో తెలుగులో నా ఎంట్రీ ఉండాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తమిళంలో నా తొలి సినిమా విష్ణువిశాల్‌తో ఓకే అయ్యింది.. ఆ సినిమా కూడా వాయిదా పడింది. 2020 జనవరిలోనే ‘అద్భుతం’ షూటింగ్ పూర్తయింది. కోవిడ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఓ దశలో నేను చేసిన సినిమాలు ఎందుకు రిలీజ్ కావడం లేదనే డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌ను ఫీలయ్యాను. అప్పుడు నాన్న(రాజశేఖర్), అమ్మ(జీవిత) సపోర్ట్ ఇచ్చారు. ఇటీవల మా తాత వరద రాజన్‌గారు చనిపోయారు. నా చెల్లి మూవీస్ చూసిన ఆయన నావి చూడలేదని బాధగా ఉంది. నేను చేసిన ‘డబ్ల్యూ.. డబ్ల్యూ..డబ్ల్యూ’(తెలుగు), ఉదయనిధి స్టాలిన్, హిప్ హాప్ తమిళతో(తమిళం) చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి’’ అన్నారు. చదవండి: క్రేజీ అప్డేట్: ‘పుష్ప’రాజ్‌తో సమంత ఐటెం సాంగ్? -
రాజశేఖర్ పెద్ద కూతురితో జాంబిరెడ్డి హీరో 'అద్భుతం'
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన తేజ సజ్జా 'జాంబరెడ్డి' చిత్రంతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే ప్రయోగం చేసి హిట్ అందుకున్నాడు తేజ. కానీ తర్వాత చేసిన 'ఇష్క్: ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ'తో అపజయాన్ని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 'అద్భుతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్ నంబర్ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నదే కథ. ఈ ట్రైలర్ సినీప్రియులను ఆకట్టుకుంటోంది. అద్భుతం సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ఈ నెల 19న విడుదలవుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. మరి ఈ సినిమాతో తేజ హిట్ అందుకుంటాడేమో చూడాలి! -
టైటిల్‌కి తగ్గట్టే ‘అద్భుతం’ గా శివాని, తేజ సజ్జల ఫస్ట్ లుక్
హీరో రాజశేఖర్, నటి జీవితల కుమార్తె శివాని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జ హీరో. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. గురువారం (జూలై 1న) శివాని పుట్టినరోజు సందర్భంగా ‘అద్భుతం’ మూవీ ఫస్ట్ లుక్‌ని హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘అ, కల్కి, జాంబిరెడ్డి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.‘‘అద్భుతం’ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్ లుక్‌ని వినూత్నంగా సిద్ధం చేశారు మల్లిక్ రామ్’’ అన్నారు చంద్రశేఖర్ మొగుళ్ల. ఈ చిత్రానికి సహనిర్మాత: సృజన్ యార్లభోలు, సంగీతం: రాదన్, కెమెరా: చింతా విద్యాసాగర్. -
WWW Movie: శివాని రాజశేఖర్ స్పెషల్ పోస్టర్ విడుదల
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). `118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా ఇది. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె స్పెషల్ బర్త్‌డే పోస్టర్ ని విడుదలచేసి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్రలో శివాని నటిస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఆహ్లాదకరంగా ఉన్న ఈ స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగాచిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ - ``ముందుగా మా హీరోయిన్ శివాని రాజశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్రలో నటించారు. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయినప్పటికీ తన నటనతో పూర్తిన్యాయం చేశారు. గుహన్ గారి స్టైలిష్ మేకింగ్, అదిత్, శివానిల అద్భుతమైన నటన డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి`` అన్నారు. చదవండి: కొడుకుతో రోజా డ్యాన్స్.. వీడియో వైరల్ -
వణికిపోయిన మెహరీన్, అర్జంట్‌గా బ్యాంకాక్ వెళ్లాలన్న చార్మీ
► సోదరి శివానీ రాజశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన శివాత్మిక ► వ్యాక్సిన్ వేసేటప్పుడు ముడుచుకుపోయిన మెహరీన్ ► ఈ పాట అందరికీ అంకితమంటోన్న ఆండ్రియా ► లావణ్య త్రిపాఠి బ్లాక్ అండ్ వైట్ ఫొటో ► అర్జంట్‌గా తన కుక్కను బ్యాంకాక్ తీసుకెళ్లాలంటున్న చార్మీ కౌర్ ► మాస్టర్ చెఫ్ షూటింగ్లో తమన్నా భాటియా View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Jennifer Garner (@jennifer.garner) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
యూట్యూబ్‌లో సత్తా చాటుతోన్న శివాని రాజశేఖర్ సాంగ్
ఆదిల్ అరున్, శివాని రాజాశేఖర్ హీరోహీరోయిన్లుగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే’ లిరికల్ వీడియో సాంగ్‌ను నటుడు అడివి శేష్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రేండ్ అవుతోంది. ‘కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే...’ అంటూ సాగే ఈ లవ్ మెలోడి సాంగ్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట శ్రోతలని ఆకట్టుకుంటూ యూట్యూజ్‌లో 1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ , యాజిన్ నిజార్ గాత్రం.. సైమన్ కె కింగ్ బాణీ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఇప్పటికే ఈ వీడియో సాంగ్ విడదల కార్యక్రమంలో అడవి శేష్ మాట్లాడుతూ పాట అద్భుతంగా ఉందంటూ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా తమ పాట ఇంతటి ఆదరణను దక్కించుకున్నందుకు చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘మా రామంత్ర క్రియేషన్స్ బేనర్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ఇది. అలాగే ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ. ఇప్పటికే విడుదలైన టీజర్, నైలునది, లాక్డౌన్ ర్యాప్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా `మేజర్` అడివిశేష్ రిలీజ్ చేసిన `కన్నులు చెదిరే..` లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 1 మిలియన్‌కి పైగా ఆర్గానిక్ వ్యూస్‌ని సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పాట విడుదల చేసిన అడివిశేస్‌కు, ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేషన్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అంటు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారని, గుహన్ అద్బుతంగా తెరకెక్కించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సమన్ కె. కింగ్ సంగీతం అందించారు. -
WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్ రిలీజ్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు? ఎక్కడ? ఎందుకు?). ‘118’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి పి రాజుదాట్ల నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ధరణ్ దాట్ల సహనిర్మాత. ఈ చిత్రంలోని 'కన్నులు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూశానే..' లిరికల్ సాంగ్ వీడియోను హీరో అడివి శేష్ విడుదల చేశాడు. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, యాసిమ్ నిజార్ ఆలపించారు. సైమన్ కె సింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. థ్రిల్లర్ జానర్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని కేవీ గుహన్ పేర్కొన్నాడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. చదవండి: Shah Rukh Khan: ఓటీటీలోకి బాలీవుడ్ బాద్షా! -
సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్
సీనియర్ హీరో జీవిత రాజశేఖర్ల ముద్దుల తనయ శివానీ రాజశేఖర్ తాజాగా తమిళంలో క్రేజీ ఛాన్స్‌ను కొట్టేసింది. ఇప్పటికే గుహన్ దర్శకత్వంలో ఆమె ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదిత్ అరుణ్ సరసన చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనా కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ గ్యాప్‌లోనే ‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జతో మరో మూవీకి సైన్ చేసింది శివానీ. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫాంటసీ లవ్ స్టోరీ మూవీని మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్ 15’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో శివానీ సరసన తమిళనాడు సీఎంగా మొదటిసారి ఎన్నికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నటించనున్నారు. అరుణ్‌రాజ కామరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను బోనీకపూర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు. చదవండి : ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన నయనతార ? గజిని తమిళ నిర్మాత కన్నుమూత -
ఫుల్ స్పీడ్‌లో రాజశేఖర్.. 92వ సినిమా అదేనట
హీరో రాజశేఖర్ వరుసపెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానులని ఖుషి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా 91వ సినిమాగా రాబోతున్న శేఖర్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసందే. తాజాగా తన 92వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేశారు రాజశేఖర్. ‘గతం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మేకర్స్ దర్శకత్వంలో రాజశేఖర్ 92వ సినిమా చేయనున్నారు. కిరణ్ కొండమడుగల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. Here's #RS92ThemePoster🔥 After #Shekar, @ActorRajasekhar teams up with the makers of the super hit film #Gatham for #RS92. Banners: @off_beat_films @SOriginals1 @PegasusCineC 🎬: @kkondamadugula @Rshivani_1 @ShivathmikaR @bpoldaz @nooble451 @HarshaPratap pic.twitter.com/w7XAtWKiI9 — BARaju (@baraju_SuperHit) February 6, 2021 శివాణి-శివాత్మిక, సృజన్, భార్గవ, హర్ష సంయుక్తంగా నిర్మించనున్నారు. 2021లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. తాజాగా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో మందు గ్లాసు, కళ్ళద్దాలు, బుల్లెట్స్, గన్ , న్యూస్ పేపర్ ఇవన్నీ చూస్తుంటే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుందని, ఇందులో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు అర్ధమవుతుంది. (చదవండి: రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’.. ఫస్ట్‌లుక్) -
'నైలూ నది'' పాటను రిలీజ్ చేసిన తమన్నా
సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం హీరోయిన్ తమన్నా ఈ సినిమాలోని 'నైలూ నది' అనే పాటను రిలీజ్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషించారు. (డియర్ కామ్రేడ్ నా ఫస్ట్ సినిమా అయ్యుండేది) ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి..) Team #WWWMovie Thanks @tamannaahspeaks for launching Melodious #NailuNadi Telugu song 💕 ICYMI, ▶️https://t.co/6reYS6uMoi 🎵 @simonkking ✍️ @ramjowrites 🎤 @sidsriram@kvguhan @AdithOfficial @Rshivani_1 @RamantraCreate @DrRaviPRaju @VijayDharan_D @baraju_SuperHit @adityamusic pic.twitter.com/DactvRXdyT — BARaju (@baraju_SuperHit) January 29, 2021 -
‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’(ఎవరు.. ఎక్కడ.. ఎందుకు) అనే ట్యాగ్‌లైన్‌తో మరో థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. (చదవండి: చెక్ మాస్టర్) 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా సైబర్ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నువ్వు నవ్వినప్పుడు డబుల్ అందంగా ఉంటావ్ తెలుసా.. నిన్ను వచ్చి కలిసేవరకు ఈ కాల్ కట్ చేయను అంటూ సరదగా సాగిన టీజర్ ఆ తర్వాత నా సిస్టమ్ పని చేయడం లేదు.. బ్రూట్ ఫోర్స్ ఎటాక్ అంటూ థ్రిల్లర్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక రామంత్ర క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
విజువల్స్ బాగున్నాయి– రానా
‘‘గుహన్‌గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫర్. ఆయనతో కలిసి పనిచేశాను. ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ పోస్టర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమాలో విజువల్స్ సరికొత్తగా ఉంటాయి. గుహన్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు రానా. ‘118’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రానా విడుదల చేశారు. కేవీ గుహన్ మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేశాను. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మా చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా గుహన్‌గారు ఈ సినిమాని బాగా తీశారు’’ అన్నారు డా. రవి పి.రాజు ధాట్ల. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు గుహన్‌గారు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘కేవీ గుహన్‌గారి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన రానాగారికి థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ నిర్మాత విజయ్‌ధరన్ ధాట్ల. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్. -
రాజశేఖర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మికకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రాజశేఖర్ ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని గురువారం ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. ‘ప్రియమైన ప్రతి ఒక్కరికి కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ అతను గట్టిగా పోరాడుతున్నాడు. మీ ప్రార్థనల ప్రేమ శుభాకాంక్షలు మమ్మల్ని రక్షిస్తాయని అనుకుంటున్నాను. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అడుగుతున్నాను. మీ ప్రేమతో, అతను త్వరగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను’ అని శివాత్మిక ట్వీట్ చేసింది. (చదవండి : నాన్న కోవిడ్‌తో పోరాడుతున్నారు: శివాత్మిక) ఆతర్వాత కాసేపటికే నాన్న బాగానే ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్ త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక రాజశేఖర్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి సిబ్బంది హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్లో ఉన్నప్పటికీ వైద్యానికి హీరో రాజశేఖర్ స్పందిస్తున్నారని తెలిపారు. Dear @ShivathmikaR Wishing your loving dad and my colleague and friend #DrRajashekar a speedy recovery. All our best wishes and prayers are with him and your family. Stay Strong. https://t.co/7vorNZ8VMK — Chiranjeevi Konidela (@KChiruTweets) October 22, 2020 -
మేం బాగానే ఉన్నాం
రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘జీవితాకి, పిల్లలకి, నాకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం. పిల్లలిద్దరికీ పూర్తిగా తగ్గిపోయింది. నేను, జీవిత ప్రస్తుతం బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి వెళ్లనున్నాం’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్. -
తేజ సజ్జతో శివానీ రాజశేఖర్ మూవీ..
‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జ, హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌తో హీరో, హీరోయిన్లులా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నఈ మూవీ నుంచి హీరో తేజ లుక్ రిలీజైంది. ఆదివారం తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి అతని లుక్ ను రివీల్ చేసారు.(చదవండి : సాయిధరమ్ తేజ్ పెళ్లి ప్రకటన!) ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’అన్నారు. లక్ష్మీ భూపాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య,మిర్చి కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. -
చిక్కుల్లో ‘2 స్టేట్స్’.. ఆగిపోయిన షూటింగ్
చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘2 స్టేట్స్’. అడవి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లు. వెంకట్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ అర్థాంతరంగా ఆగిపోయింది. స్టోరి విషయంలో దర్శకునికి, నిర్మాతకు మధ్య విబేధాలు తలెత్తడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ రెడ్డి.. చిత్ర నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణపై కోర్టులో కేసు వేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన నేను ‘2స్టేట్స్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాను. షూటింగ్ ప్రారంభిచడానికి ముందే హీరో, హీరోయిన్, నిర్మాతకు కథను పూర్తిగా వినిపించి అందరి అనుమతి తీసుకున్నాను. ఆ తర్వాతే షూటింగ్ మొదలు పెట్టాను. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్‌పుట్ విషయంలో మా టీం చాలా సంతృప్తిగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ పేపర్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు’ అన్నారు. అయితే ‘సినిమా బాగా వస్తున్న సమయంలో కథలో మార్పులు చేయాల్సిందిగా నిర్మాత నన్ను కోరాడు. అందుకు నేను తిరస్కరించాను. దాంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నన్ను తప్పించేందుకు నిర్మాత నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి నన్ను తొలగించే ప్రయత్నం జరుగుతుందని తెలిసి నేను నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణపై కోర్టులో కేసు వేశాను. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు నిర్మాతను ఆదేశించింది. ఈ సినిమాకు నేను దర్శకత్వంతో పాటు.. భాగస్వామి, ప్రాఫిట్ హోల్డర్ని కూడా. ‘2స్టేట్స్’ రిమేక్ రైట్స్‌లో భాగంగా చేసుకున్న అగ్రిమేంట్ ప్రకారం ఈ సినిమాకు దర్శకత్వం వహించే హక్కులు పూర్తిగా నాకే ఉన్నాయ’న్నారు. మిగిలిన 30 శాతం షూటింగ్‌ను తాను కాకుండా.. మరేవరైనా పూర్తి చేయాలని ముందుకు వస్తే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కోర్టుతో సంప్రదించిన తర్వాత మిగతా విషయాలు బయటపెడతానని దర్శకుడు వెంకట్ రెడ్డి తెలిపారు. -
అమెరికా పోదాం చలో చలో
హైదరాబాద్‌లో ఒకసారి, కోల్‌కత్తాలో రెండు సార్లు చిత్రీకరణను జరపుకున్న ‘2 స్టేట్స్’ చిత్రబృందం ఇప్పుడు అమెరికా వెళ్లడానికి రెడీ అవుతోంది. చేతన్ భగత్ రాసిన నవల హిందీలో రూపొందిన ‘2 స్టేట్స్’కి ఇది రీమేక్. వెంకట్ రెడ్డి దర్శకుడు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎల్వీ సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘60 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకు జరిగిన రషెస్ చూసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. వీసాల సమస్య ఉండటం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు వీసాలు వచ్చేశాయి. నెక్ట్స్ షెడ్యూల్ కోసం వచ్చే నెలలో టీమ్ అమెరికా వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌తో 90శాతం చిత్రీకరణ ముగుస్తుంది. మిగిలిన 10 శాతం ప్యాచ్ వర్క్‌ను హైదరాబాద్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్ కుమార్. -
ఈ నలుగురు భామలు భలే లక్కీ!
సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి నేమ్కార్డ్ చూసుకోక ముందే రెండో సినిమాకి అవకాశం వస్తే.. ఆ మజానే వేరు. ఒక సినిమా సెట్లో ఉండగానే ఇంకో అవకాశం వచ్చేస్తే గెట్ సెట్ గో అంటూ హుషారుగా పని చేస్తారు. ఇప్పుడు అలా జోరు మీద ఉన్న నలుగురు ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సినిమానే సెకండ్ సినిమా! కథానాయికగా నటించిన తొలి సినిమా ‘కేదార్నాథ్’ రిలీజ్ కాకముందే బంపర్ చాన్స్ కొట్టేశారు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఏకంగా రణ్వీర్ సింగ్ సరసన నటించే చాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ‘సింబా’ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే సారా ఫస్ట్ నటించింది ‘కేదార్నాథ్’ చిత్రంలోనే అయినా ‘సింబా’ చిత్రం ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ చిత్రం 80 శాతం కూడా పూర్తయింది. డిసెంబర్లో రిలీజ్ ఉంది. అటువైపు ‘కేదారనాథ్’ పలు వాయిదాల తర్వాత మార్చిలో రిలీజ్ అంటున్నారు. లెక్క ప్రకారం ఏ సినిమా ముందు రిలీజైతే అదే ఆ ఆర్టిస్ట్‌కి ఫస్ట్ సినిమా అంటారు. సో.. ‘సింబా’ని తన తొలి చిత్రంగా సారా చెబుతారేమో. ఏది ఏమైనా ఒక్క సినిమాతో కూడా వెండితెరపైకి రాకముందే రెండో సినిమాకి అవకాశం దక్కించేసుకున్నారు సారా. తారానందం ప్రస్తుతం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో కథానాయికగా బిజీగా ఉన్న తారా సుతారియా‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లోనూ నటించాల్సి ఉంది. బిజీగా ఉండి, డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయారంతే. అలా ఒక సినిమా కోసం వేరే సినిమా వదులుకున్న బాధ తారకు ఇక లేదు. ఎందుకంటే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సెట్స్‌లో ఉండగానే రెండో అవకాశం ఆమె డోర్ తట్టింది. ఈ రెండో సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి డైరీలో డేట్స్ ఖాళీగా ఉన్నాయట. అందుకని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సిద్ధార్ధ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా మిలప్ జవేరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో తారకు మంచి రోల్ కూడా దక్కిందట. ఇక కరణ్ జోహర్ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో టైగర్ ప్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో తారాతో పాటు కొత్తమ్మాయి అనన్య పాండే మరో కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది మేలో రిలీజ్ కానుంది. అటు సాంబార్.. ఇటు గోంగూర ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో సినిమా రిలీజైన తర్వాత అందులో హీరోయిన్ బాగా యాక్ట్ చేసిందని పేరు వస్తే కానీ వేరే ఇండస్ట్రీలో చాన్స్ రాదు. కానీ రాజశేఖర్–జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేశారు. తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘2 స్టేట్స్’ రిలీజ్ కాకముందే కోలీవుడ్ పిలుపు అందుకున్నారామె. తమిళ నటుడు విష్ణు విశాల్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు శివాని. వెంకటేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక తెలుగు ‘2 స్టేట్స్’ విషయానికి వస్తే.. ఇటీవల ‘గూఢచారి’ సినిమాతో మంచి హిట్ సాధించిన అడవి శేష్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో హిట్ సాధించిన ‘2 స్టేట్స్’ సినిమాకు ఇది రీమేక్. మేజర్‌గా కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలో రిలీజ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి చిత్రబృందం రెడీ అవుతున్నారు. ఇలా ఇటు తెలుగు అటు తమిళ చిత్రం చేస్తూ కొన్ని రోజులు గోంగూర, కొన్ని రోజులు సాంబార్ టేస్ట్ చేస్తున్నారు శివాని. అరుదైన అవకాశం బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత సౌత్ ఇండస్ట్రీకి వచ్చి... ఇక్కడ ఒక్క సినిమా రిలీజ్ కాకపోయినా సెకండ్ సినిమా చాన్స్‌ను దక్కించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ బాలీవుడ్లో ఒకే సినిమాలో నటించి, అదీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు సౌత్‌లో తొలి సినిమా రిలీజ్ కాకుండానే రెండో చాన్స్ కొట్టేసిన హీరోయిన్స్ లిస్ట్‌ను తయారుచేస్తే అందులో కథానాయిక నిధి అగర్వాల్ ఉంటారు. సాబిర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’లో నటించారు నిధి అగర్వాల్. కానీ సరిగ్గా ఆడలేదు. వెంటనే సౌత్ డోర్ కొట్టారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘సవ్యసాచి’ ద్వారా సౌత్‌లో హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. ఈ బొమ్మ థియేటర్లో పడకముందే ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటిస్తున్నారు నిధి అగర్వాల్. విశేషం ఏంటంటే.. ముందు నాగచైతన్య సరసన నటించిన నిధి రెండో సినిమాలో అతని తమ్ముడు అఖిల్‌తో జతకట్టారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ని కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను ’సినిమా డిసెంబర్లో విడుదల కానుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో నిధి నటనకు మంచి మార్కులు పడితే ఆమె ఖాతాలో మరిన్ని సినిమాలు వచ్చి పడే అవకాశం లేకపోలేదు. -
అందమైన ప్రేమకథ
చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘2 స్టేట్స్’. అడవి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లు. వెంకట్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విజయదశమికి విడుదల చేస్తున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘అందమైన రొమాంటిక్ ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే కోల్‌కతాలో రెండు షెడ్యూల్స్, హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. వెంకట్‌రెడ్డిగారు ఈ సినిమాను ఆద్యంతం చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆహ్లాదకరంగా సాగిపోయే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఓ పెళ్లి పాటను జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తాం. తర్వాత విదేశాల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దీంతో టాకీ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు వెంకట్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: షానియల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్. -
క్రేజీ కాంబినేషన్
ఒకరేమో క్రేజ్‌లో ఉన్న హీరో తమ్ముడు, మరొకరేమో స్టార్ కిడ్. అది మాత్రమే కాదు.. తెలుగు, తమిళంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న హీరోయిన్ చెల్లెలు. ఇప్పుడు వీళ్లిద్దరి జోడీ కుదిరింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె, శివానీ చెల్లెలు శివాత్మిక ఓ చిత్రంలో జంటగా నటించనున్నారని సమాచారం. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో మధుర ఎంటర్ౖటైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్, యష్ రంగినేనీలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందనే విషయాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. జీవితారాజశేఖర్లకు ఇది మెమరబుల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఒకవైపు పెద్ద కుమార్తె శివానీ నటిస్తున్న ‘2 స్టేట్స్’ సినిమా రీమేక్ సెట్స్‌లో ఉండగానే, తమిళంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇప్పుడు శివాత్మిక ఎంట్రీ కూడా షురూ అయింది. -
ఇటు నమస్కారం... అటు వణక్కం
తొలి సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను నమస్కారం అని పలకరించక ముందే తమిళ ఆడియన్స్‌కు కూడా వణక్కం చెప్పడానికి సిద్ధమయ్యారు శివానీ రాజశేఖర్.. డాటరాఫ్ జీవితా రాజశేఖర్. అడవి శేష్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘2 స్టేట్స్’ రీమేక్ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు శివానీ. కానీ, ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఓ తమిళ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేశారు. విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. విష్ణు విశాల్ సొంత ప్రొడక్షన్ సంస్థ వీవీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధురైలో ఫుల్ స్పీడ్‌తో జరుగుతోంది. సో.. ఇటు నమస్కారంతో పాటు అటు వణక్కం ఒకేసారి చెప్పడానికి రెడీ అయ్యారన్నమాట శివానీ. -
కోలీవుడ్‌కు రాజశేఖర్ కూతురు..!
సినీరంగంలో తారల వారసుల ఎంట్రీకి ఎప్పుడూ రెడ్‌కార్పెటే ఉంటుంది. ఆ తరువాత నిలదొక్కుకోవడం అన్నది వారి ప్రతిభ, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలా మరో వారసురాలి కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. దక్షిణాదిలో నట దంపతులుగా పేరొందిన వారిలో రాజశేఖర్, జీవిత జంట ఒకటి. ముందుగా వీరు కోలీవుడ్‌లోనే నటనకు శ్రీకారం చుట్టారు. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఈ నట దంపతుల వారుసురాలు శివాని రాజశేఖర్ కథానాయకిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఓకెసారి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు శివాని. ఇప్పటికే ‘2 స్టేట్స్’చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విష్ణువిశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో శివాని నాయకిగా ఎంపికయ్యారు. ఇది జల్లికట్టు నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. మలయాళంలో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్మోహన్లాల్కు కూడా జంటగా ఎంపికైందని మరోవార్త. మొత్తం మీద ఒక చిత్రం కూడా తెరపైకి రాకుండానే మరో రెండు భాషల్లో ఎంట్రీకి రెడీ అయిపోతోంది ఈ బ్యూటీ. ఏ భాషలో శివానిని సెక్సెస్ వరిస్తుందో?.. ముద్దుగుమ్మ లక్కు ఎలా ఉంటుందో! వేచిచడాల్సిందే. వైద్యవిద్యను అభిసించిన శివాని సినిమాలపై మక్కువతో డాన్స్, నటనలో శిక్షణతీసుకుంది. ఇలా నటిగా అన్ని అర్హతలు పొందిందింది. ఇక తన నట విశ్వరూపాన్ని నిరూపించుకోవడమే తరువాయి. -
ప్రారంభమైన ‘2 స్టేట్స్’
హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 2 స్టేట్స్. చేతన్ భగత్ నవల 2 స్టేట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ కుంచెం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. శనివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు భాగ్యశ్రీ, రజ్జత్ కపూర్, లిజి, ఆదిత్యమీనన్, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలకపాత్రల్లో నటించనున్నారు. -
నటన మాత్రం అస్సలు నేర్చుకోలేదు
సాక్షి, సినిమా : సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ టూ కంట్రీస్ రీమేక్‌లో అడివి శేష్ సరసన ఆమె నటించబోతోంది. అయితే నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆమె సిద్ధమైపోతుండటం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు తమ తమ వారసులను నటనతోపాటు మిగతా వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, శివానీ మాత్రం కేవలం డాన్సుల్లో మాత్రమే శిక్షణ తీసుకుందంట. బెల్లీ డాన్సులు, కథక్‌లో ఆమె ప్రావీణ్యం సంపాదించేసుకుంది. మరి నటనలో ఎందుకు శిక్షణ తీసుకోలేదని ఆమె ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? తన పేరెంట్స్ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే నటనలో రాణించి స్టార్లు అయ్యారని.. చిన్నప్పటి నుంచి వారినే చూస్తూ పెరిగా కాబట్టి తనకు ఆ అవసరం లేదు అని ఆమె చెబుతోంది. మరి జీవితా-రాజశేఖర్ లాగే ఆమె కూడా సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకుంటుందేమో! చూద్దాం.