తెలుగులో ప్రతి ఏడాది 200-300 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వాటిలో హిట్ కొట్టి నిలబడేవి పదుల సంఖ్యలో ఉంటాయి. కొన్ని చిత్రాలైతే ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా పెద్దగా గుర్తుండదు. అలా గతేడాది థియేటర్లలో విడుదల ఓ మూవీ.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)
అప్పట్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్.. చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. కొడుకు శ్రీ కమల్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఆహా ఓటీటీలో జూలై 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే.. హాస్టల్ లో చదువుకునే స్టూడెంట్ కమల్ (శ్రీ కమల్). అనుకోని పరిస్థితుల్లో ఈ హాస్టల్‌లోకి లక్ష‍్మీ భారతి అలియాస్ జిలేబీ వస్తుంది. అసలు బాయ్స్ హాస్టల్‌లోకి అమ్మాయి ఎందుకొచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా మైదాన్.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్)
Comments
Please login to add a commentAdd a comment