jilebi
-
ఎన్నికల ఫలితాల మధ్య బీజేపీ కార్యాలయంలో సిద్ధమవుతున్న జిలేబీలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్ల మధ్య ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జోరుగా జిలేబీలు తయారు చేస్తున్నారు. VIDEO | Jalebis being prepared at BJP headquarters in New Delhi, ahead of the counting of votes in Maharashtra and Jharkhand. #MaharashtraElection2024 #JharkhandElection2024 #ElectionResults2024WithPTI pic.twitter.com/RD4kKmB5Xx— Press Trust of India (@PTI_News) November 23, 2024మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి 'మహాయుతి', కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)ల మహావికాస్ అఘాడి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల్లో తమదే విజయమని రెండు కూటములు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్‌లో, మహారాష్ట్రలో మహాయుతి ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడి వెనుకబడింది. జార్ఖండ్‌లో, జేఎంఎం ప్లస్ ట్రెండ్స్‌లో మెజారిటీలో కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగులో ప్రతి ఏడాది 200-300 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వాటిలో హిట్ కొట్టి నిలబడేవి పదుల సంఖ్యలో ఉంటాయి. కొన్ని చిత్రాలైతే ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా పెద్దగా గుర్తుండదు. అలా గతేడాది థియేటర్లలో విడుదల ఓ మూవీ.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)అప్పట్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్.. చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. కొడుకు శ్రీ కమల్ని హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.ఆహా ఓటీటీలో జూలై 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే.. హాస్టల్ లో చదువుకునే స్టూడెంట్ కమల్ (శ్రీ కమల్). అనుకోని పరిస్థితుల్లో ఈ హాస్టల్లోకి లక్ష్మీ భారతి అలియాస్ జిలేబీ వస్తుంది. అసలు బాయ్స్ హాస్టల్లోకి అమ్మాయి ఎందుకొచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా మైదాన్.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్) -
Lok Sabha Election 2024: ఇండోర్‌లో ఉచిత పోహా, జిలేబీ..
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్‌క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది. -
ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ
ఇండోర్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు స్థానిక దుకాణాదారులు ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. సాధారణంగా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పారీ్టలు ఉచితాలు ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ మధ్యప్రదేశ్‌లో పారీ్టలకు బదులు దుకాణాదారుల సంఘం ఉచితం ఆఫర్‌తో ముందుకొచి్చంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ముందుగా ఓటేసే అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే తమ ఆఫర్లోని అంతరార్థమని ఆ సంఘం అసలు విషయం బయటపెట్టింది. 230 ఎమ్మెల్యే నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకేదఫాలో నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. పోహా, జిలేబీ ఆఫర్‌పై ‘56 దుకాణ్ ట్రేడర్స్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజాన్ శర్మ పీటీఐతో మాట్లాడారు. ‘ నగర స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఇండోర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓటింగ్ శాతంలోనూ తొలిస్థానంలో నిలవాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఓటర్లను ఉచిత పోహా, జిలేబీతో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ 17వ తేదీన ఉదయం తొమ్మిది గంటల్లోపు ఎవరైతే ఓటు వేసి వేలికి సిరా గుర్తు చూపిస్తారో వారికే పోహా, జిలేబీ ఉచితంగా ఇస్తాం. ఉదయం తొమ్మిది తర్వాత సిరా గుర్తు చూపిస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తాం’ అని శర్మ వివరించారు. ఇండోర్ నగరంలో ఉన్న ఈ ‘56 దుకాణ్’కు స్వచ్ఛమైన వీధి ఆహార హబ్ గుర్తింపునిస్తూ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికెట్ జారీచేసింది. ఇండోర్ అర్బన్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మొత్తంగా ఇక్కడ 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 15.55 లక్షలకు పెరిగింది. జిలేబీ ఆఫర్‌ను ఇక్కడి ఓటర్లు ఏ మేరకు సది్వనియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. -
జిలేబి సినిమా రివ్యూ
స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.. కథ జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం ఏర్పడింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు. విశ్లేషణ విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్లో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్లోకి హీరోయిన్ వచ్చిన దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రథమార్దంలో పాత్రల పరిచయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ.. బాగున్నాయి కానీ సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఎక్కువ సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. చదవండి: Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
ఇంట్లోనే పనీర్ జిలేబీ చేసుకోండి ఇలా..
పనీర్ కార్న్ జిలేబీ తయారీకి కావల్సినవి: పనీర్ తురుము 300 గ్రాములు పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా కార్న్ పౌడర్ పావు కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి పావు టీ స్పూన్, బేకింగ్ సోడా అర టీ స్పూన్, నెయ్యి సరిపడా, నీళ్లు కొన్ని పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు గార్నిష్‌కి తయారీ విధానమిలా.. ముందుగా పెద్ద బౌల్లో కార్న్ పౌడర్, మైదాపిండి, బేకింగ్ సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పనీర్ తురుము వేసుకుని బాగా కలిపి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్‌ని ఒక కవర్లో వేసుకుని, ఆ కవర్ని కోన్‌లా తయారు చేసుకోవాలి. మరుగుతున్న నేతిలో జిలేబీల్లా చుట్టుకుని, దోరగా వేయించుకోవాలి. ఈ లోపు మరో స్టవ్ మీద పంచదార, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, సరిపడా నీళ్లు పోసుకుని లేతపాకం పెట్టుకుని.. వేడివేడిగా ఉన్న జిలేబీలను అందులో వేసుకుని పాకం పట్టించాలి. అనంతరం ప్లేట్లోకి తీసుకుని, పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా..
మంత్ర తంత్రాల మాటున మహిళలను చెరబట్టిన ‘జిలేబీ బాబా’ పాపం పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడు ఎట్టకేలకు దోషిగా తేలాడు. ఆ వివరాలు.. జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్ అమర్‌వీర్. అతనిది పంజాబ్‌లోని మాన్సా ప్రాంతం. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. ఈక్రమంలో భార్య కన్నుమూయడంతో అమర్‌వీర్ రెండేళ్లు పత్తాలేకుండా పోయాడు. తర్వాత తొహనాకు తిరిగొచ్చి తాంత్రిక విద్యలు తెలుసంటూ నాటకానికి తెరతీశాడు. సమస్యలేవైనా తొలగించేస్తా అంటూ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు. ఆధ్యాత్మిక చింతన పేరుతో కొందరిని బురిడీ కొట్టించి బాబా బాలక్‌నాథ్ గుడిలో పూజారిగా కూడా పని చేయడం ప్రారంభించాడు. ఆత్మలు ఆవహిస్తాయని... మాయమాటలు చెప్పి ఎందరో మహిళలను లొంగదీసుకున్నాడు. తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఆత్మలు వారిని ఆవహిస్తాయని నమ్మించేవాడు. తర్వాత వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ లేకుండా చేసేవాడు. తర్వాత వారిపై అకృత్యానికి ఒడిగట్టేవాడు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు. ఆ వీడియోలను సదరు బాధితులకు చూపించి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము రాబట్టేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. అయితే, ఒక వీడియో బాబా బాగోతాన్ని బట్టబయలు చేసింది. జిలేబీ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే అదనుగా కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా నివాసముంటున్న చోట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో 120కి పైగా వీడియోలు, కొన్ని మత్తు పదార్ధాలు లభించాయి. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన హరియాణా కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. -
Recipe: బెల్లం, గోధుమ రవ్వతో ఓట్స్ జిలేబి తయారీ ఇలా!
వెరైటీగా ఓట్స్‌తో ఇలా జిలేబి ట్రై చేయండి! కావలసినవి: ►ఓట్స్ – 1 కప్పు ►గోధుమ రవ్వ – అర కప్పు ►నీళ్లు – సరిపడా ►బెల్లం కోరు – 2 కప్పులు ►ఉప్పు – చిటికెడు ►ఫుడ్ కలర్ – కొద్దిగా (జిలేబీ కలర్) ►నూనె లేదా నెయ్యి – 1 కప్పు తయారీ: ►ముందుగా ఓట్స్, గోధుమ రవ్వలను మిక్సీ బౌల్లో వేసుకుని.. ఒక కప్పు నీళ్లు పోసుకుని.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు, కొద్దిగా ఫుడ్‌కలర్ వేసుకోవాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని కోన్ లాంటి ఖాళీ టొమాటో సాస్ టిన్‌లో నింపి పెట్టుకోవాలి. ►ఈ లోపు స్టవ్ మీద కళాయిలో బెల్లం కోరు, ఒక కప్పు నీళ్లు పోసుకుని.. లేత పాకం వచ్చే వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►మరో స్టవ్ ఆన్ చేసుకుని.. మరో కళాయిలో నెయ్యి లేదా నూనెలో ఓట్స్ మిశ్రమాన్ని జిలేబీల్లా వేస్తూ దోరగా వేయించుకోవాలి. ►వెంటనే వాటిని బెల్లం పాకంలో వేసి దేవుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Oats Walnut Cutlets: ఓట్స్– వాల్నట్స్ కట్లెట్ తయారీ ఇలా.. ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! -
ఆపిల్ జిలేబి.. తింటే వావ్ అనాల్సిందే..!
ఆపిల్ జిలేబి కావలసినవి: మైదా – 1 కప్పు, శనగ పిండి – 1 టేబుల్ స్పూన్, ఆపిల్ – 2 (తొక్క, గింజలు తొలగించి, ముక్కలు కట్ చేసుకుని మిక్సీపట్టి గుజ్జులా చేసుకోవాలి), గడ్డ పెరుగు, పంచదార – 1 కప్పు చొప్పున నీరు – సరిపడా, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నెయ్యి – సరిపడా, ఫుడ్ కలర్ – కొద్దిగా (ఆరెంజ్ కలర్/ అభిరుచిని బట్టి) తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్లోకి మైదా పిండి, శనగపిండి, పెరుగు తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో ఆపిల్ గుజ్జు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని, పాన్‌లో పంచదార, అర కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ తీగ పాకం రాగానే.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో ఆపిల్–మైదా మిశ్రమంతో జిలేబీలు వేసి.. దోరగా వేగిన వెంటనే పాకంలో వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ టొమాటో కప్స్ కావలసినవి: టొమాటో – 6 (పైభాగం కొద్దిగా కట్ చేసుకుని, లోపల గుజ్జు అంతా తొలగించి బౌల్ / కప్పు మాదిరి చేసుకోవాలి), గుడ్లు – 6, మోజెరెల్లా చీజ్ తురుము – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాలపొడి – 1 టీ స్పూన్, కొత్తిమీర తురుము –కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు – 1 టేబుల్ స్పూన్, మాయోనైజ్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ప్రతి టొమాటో కప్‌లో కొన్ని ఉల్లికాడ ముక్కలు, కొద్దిగా చీజ్ తురుము, మాయోనైజ్ క్రీమ్ వేసుకుని, ఒక్కో గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి గుడ్డు వేసుకునే ముందు కానీ తర్వాత కానీ చీజ్ తురుము వేసుకోవచ్చు. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వంటివి కూడా అదనంగా కలుపుకుని బేక్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ మిల్క్ కావలసినవి: కార్న్ పౌడర్ – అర కప్పు+ 4 టేబుల్ స్పూన్లు, పంచదార – అర కప్పు, పాలు – 2 కప్పులు, మైదా పిండి – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా కళాయిలో కార్న్ పౌడర్, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పాలు పోసుకుని పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. వెంటనే స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట మీద.. అది దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసిన బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. 2 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు అది మెత్తటి స్పాంజీలా తయారవుతుంది. దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత రెండు బౌల్స్ తీసుకుని.. ఒకదానిలో మైదాపిండి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని నీళ్లతో పలుచగా కలుపుకోవాలి. మరో బౌల్లో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి.. 10 నిమిషాల పాటు మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంతరం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మన -
కోలీవుడ్‌కు రియా
నటి రియా చక్రవర్తి కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఈ బెంగళూర్ బ్యూటీ మొదట్లో మోడలింగ్ రంగంలో విజృంభించింది. తరువాత బుల్లితెరపై నటించి, 2012లో హీరోయిన్గా టాలీవుడ్లో తూనీగ తూనీగా చిత్రంతో పరిచయం అయ్యింది. తరువాత బాలీవుడ్లో మకాం పెట్టి అక్కడ నటిస్తోంది. ప్రస్తుతం జిలేబి అనే హింది చిత్రంలో నటిస్తున్న రియా చక్రవర్తికి కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. యువ నటుడు హరీశ్ కల్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది రియా. ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత హరీశ్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ధనుసు రాశి నేయర్గళే. సంజయ్ భారతీ దర్శకత్వం వహిస్తున్న త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఇందులో హరీశ్కల్యాణ్కు జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని చిత్ర వర్గాలు ఇంతకు ముందే వెల్లడించాయి. కాగా అందులో ఒకరిగా నటి రియా చక్రవర్తిని ఎంపిక చేశారు. ఇతర నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పాయి. శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోతిష్యంపై అపార నమ్మకం కలిగిన ఒక యువకుడి ఇతివృత్తంగా ధనుసు రాశి నేయర్గళే చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా పెళ్లికి సిద్ధం అయిన ఆ యువకుడికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న పలు ఆశక్తికరమైన అంశాలతో వినోదమే ప్రధానంగా చిత్రం ఉంటుందన్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారని దర్శకుడు సంజయ్ భారతీ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. టాలీవుడ్లో తూనీగ తూనీగా చిత్రం నటి రియా చక్రవర్తికి పెద్దగా ఉపయోగపడలేదు. తాజాగా కోలీవుడ్‌లో ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
అమ్మో! ఎంత పేద్ద జిలేబీయో!!
ముంబై: స్వీటు ప్రియులకు సంతోషం కలిగించే వార్త ఇది. ప్రపంచంలోనే పెద్ద జిలేబీ మనదేశంలోనే తయారైంది. ముంబైలోని సంస్కృతి రెస్టారెంట్ భారీ జిలేబీ తయారు చేసింది. దీని బరువు అక్షరాల 18 కేజీలు. 9 అడుగుల వ్యాసార్థంతో దీన్ని రూపొందించారు. 12 మంది దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఇందుకోసం 1000 లీటర్ల పంచదార పాకం, 3500 కేజీల నెయ్యి వినియోగించారు. దీంతో 8.2 అడుగుల వ్యాస్థారంతో గతంలో రూపొందించిన జిలేబీ రికార్డు బద్దలైంది. ఇదే బృందం 37 కిలోల జాంగ్రీ తయారు చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ఈ రికార్డును స్వయంగా వీక్షించారు. భారీ స్వీట్లు తయారు చేసేందుకు 100 రోజుల పాటు రోజుకు 20 గంటల పాటు సాధన చేశామని సంస్కృతి రెస్టారెంట్ ముఖ్య వంటగాడు గౌరవ్ చతుర్వేది వెల్లడించారు.