ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది.
అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్‌క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment