voting percentage
-
పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్ శాతాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమెరికాలో 7.3 లక్షలే ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షల జనాభానే ఉందని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది. అయితే భారత్ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్ శాతంలో త్వరలోనే భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరవచ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్ శాతం జర్మనీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, భారత్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
పోలింగ్ ముగిశాక 7 శాతం ఓటింగ్ ఎలా పెరిగింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిపోయాక ఏకంగా 7 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్ చేశారు. నవంబరు 20వ తేదీన వివిధ సమయాల్లో విడుదల చేసిన పోలింగ్ శాతంలో తేడాలుండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పటోలే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని డిమాండ్ చేశారు. ఈ అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని పటోలే అన్నారు. ‘ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’ అని పటోలే పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటల దాకా పోలింగ్ జరిగిన కేంద్రాల ఫోటోలను ఈసీ విడుదల చేయాలన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇక్కడ సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించడమే ముఖ్యమని పేర్కొన్నారు. -
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్‌లోని ‘గో ఓట్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్‌పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్‌లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్‌కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్‌లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్‌తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్‌ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్ఆఫ్(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్ 28నాటి అత్యల్ప ఓటింగ్ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. తొలి రౌండ్లో ఏం జరిగింది? మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పిడివాదుల్లో పొరపొచ్చాలు? అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు, అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్‌కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్లో పోటీపడి ఓడిన గలీబాఫ్కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్‌కే తన ఓటు అని ప్రకటించారు. మసూద్ గెలిస్తే? తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్‌ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.జలిలి గెలిస్తే? సయీద్ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్‌పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లో శనివారం 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా గణాంకాల ప్రకారం పోలింగ్ 63.36 శాతానికి పెరిగింది. పశ్చిమబెంగాల్ పరిధిలోని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో 82.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి ఆదివారం వెల్లడించారు. ఇప్పటివరకు ముగిసిన ఆరు దశలను పరిశీలిస్తే అన్నింటికన్నా తక్కువగా ఐదో దశలో 62.2 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశ కింద 2019లో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి దశలోని తుది పోలింగ్ శాతాలు ఓట్ల లెక్కింపు తర్వాతే అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించడం వల్లే పోలింగ్ శాతాలు పెరుగుతాయని గుర్తుచేసింది. -
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్‌రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్‌లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్‌కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్‌లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్‌లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్‌లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లోనూ జరుగుతుంది. 17సి ఫామ్‌లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్‌గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం. -
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
-
సెన్స్‌క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్‌ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్‌పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్‌టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్‌సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్‌పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. పెరిగినది పాజిటివ్ ఓటింగేనంటున్న కాంగ్రెస్.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్ టాక్ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్‌కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు. బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర ఊపుతో.. లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు. -
Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
అవును! పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసి.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే చాలు. ఉచితంగా ఇంటికి తీసుకెళ్లి దింపేస్తారు. ఓహో సూపరని ఆనందిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మన రాష్ట్రంలో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ సంస్థలు పాటుపడుతున్నాయి. ర్యాపిడో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. ఓటర్లు ఓటేసిన అనంతరం పోలింగ్ బూత్‌ల నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలి్పంచింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బైక్ టాక్సీ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 25న ఢిల్లీ లోక్‌సభ పోలింగ్ రోజున జరగనుంది. ఆ రోజు ఓటేసిన అనంతరం ప్రయాణికులు బైక్ బుక్ చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీలో 80 లక్షల మంది ర్యాపిడో సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆ సంస్థకు ఎనిమిది లక్షల మంది బైక్ డ్రైవర్లు ఉన్నారు. -
Lok Sabha Election 2024: ఇండోర్‌లో ఉచిత పోహా, జిలేబీ..
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్‌క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది. -
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
-
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ఓటెయ్యండి బాబూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండమ్మా.. ఓటు విలువ తెలుసుకో యువతా అంటూ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు చెవిలో ‘ఈవీఎం’ కట్టుకుని పోరుతున్నా ఓటర్లలో మాత్రం ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు! ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. సుదీర్ఘ షెడ్యూల్, మండుటెండలతో పాటు పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణాలుగా కని్పస్తున్నాయి. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది...ఈసారి సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మూడు అంకాలు ముగిశాయి. మే 7న మూడో విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33 శాతంతో పోలిస్తే 1.65 శాతం తగ్గినట్లు ఈసీ డేటా చెబుతోంది. తొలి రెండు విడతల్లోనూ ఇదే తంతు. 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్‌లో 66.71 శాతం ఓటింగే నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2 శాతం ఓటింగ్ జరిగింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే నాలుగో దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి మూడింట్లో పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే. 2019లో రికార్డు ఓటింగ్... 2019లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951–52 తొలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 45.67 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70 శాతాన్ని కూడా చేరకపోవడం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవడం గమనార్హం. బిహార్ (57.33%), ఉత్తరప్రదేశ్ (59.21), ఢిల్లీ (60.6%), మహారాష్ట్ర (61.02), ఉత్తరాఖండ్ (61.88%), తెలంగాణ (62.77%), గుజరాత్ (64.51%), పంజాబ్ (65.94%), రాజస్థాన్ (66.34%), జమ్మూ కశీ్మర్ (44.97%), జార్ఖండ్ (66.8%) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 2014లో 66.44 శాతం ఓటింగ్ నమోదైంది. 2009లో నమోదైన 58.21 శాతంతో పోలిస్తే ఏకంగా 8.23 శాతం పెరిగింది! మన దేశంలో ఓటింగ్ ఒకేసారి అంతలా ఎగబాకడం కూడా రికార్డే.ఎందుకు తగ్గుతోంది...! ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా నాలుగు విడతల్లో ఓటర్లు భారీగా బాగా బారులు తీరితేనే కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంటుంది. లేదంటే భారీగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి... ⇒ పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మూడు విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగే ఇందుకు నిదర్శనం. ⇒ యూపీలోని గాజియాబాద్‌లో 2019లో 55.88 శాతం ఓట్లు పడగా ఈసారి 49.88 శాతానికి దిగజారింది. కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్లో 54.31 శాతం నుంచి 54.06 శాతానికి; బెంగళూరు సౌత్‌లో 53.69 శాతం నుంచి 53.17 శాతానికి తగ్గింది. ⇒ 2019లో కూడా పట్టణ ఓటర్లలో ఇదే ధోరణి కనబడింది. అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన 50 లోక్‌సభ స్థానాల్లో 17 మెట్రోపాలిటన్, పెద్ద నగరాల్లోనే కావడం గమనార్హం. ⇒ తక్కువ ఓటింగ్‌కు వలసలు కూడా కారణమే. పొట్టకూటి కోసం వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఓటింగ్ తగ్గుతున్నట్లు తేలింది. ⇒ వచ్చి ఓటేసేంత స్థోమత లేకపోవడం, కూలి డబ్బులను వదులుకోలేని అశక్తత వల్ల వారు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతున్నారు. ⇒ దేశంలో అత్యధిక ఓటర్లున్న ఉత్తరప్రదేశ్‌లో అతి తక్కువ ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం. ⇒ మండుటెండలు కూడా ఓటింగ్‌కు గండికొడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ⇒ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగేలా ఉండటంతో మిగతా నాలుగు విడతల ఓటింగ్‌పైనా తీవ్ర ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.ఫలితాలపై ప్రభావం.. ఎప్పుడెలా...?! 1951 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే భారీగా ఓటింగ్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు అనూహ్య ఫలితాలే వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో ఓటింగ్ 5 శాతం పైగా పెరిగి 60 శాతం దాటింది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయం పాలై జనతా కూటమికి అధికారం దక్కింది. 1980లో ఓటింగ్ మళ్లీ భారీగా పడిపోయింది. అధికార జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 ఎన్నిక్లలో ఓటింగ్ 7 శాతం పైగా పెరగడం ఇందిర మరణంపై వెల్లువెత్తిన సానుభూతికి నిదర్శనంగా నిలిచింది. రాజీవ్‌గాంధీ ఘన విజయం సాధించారు. 1989లో మళ్లీ ఓటింగ్ తగ్గింది. కాంగ్రెస్ ఏకంగా సగానికి పైగా సీట్లను కోల్పోయింది. 1991 ఎన్నికల్లోనూ ఓటింగ్ 6 శాతానికి పైగా తగ్గింది. మళ్లీ అధికార పక్షానికి షాక్ తగిలి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2004లో ఓటింగ్ స్వల్పంగానే తగ్గినా ఐదేళ్ల వాజ్‌పాయి సర్కారు ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువుదీరింది. 2009 ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వమే కొనసాగింది. 2014లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 8 శాతానికి పైగా పెరిగింది. బీజేపీ తొలిసారి ఘనవిజయం కొట్టింది. పెరిగిన ఓటింగ్ మోదీ వేవ్‌కు అద్దం పట్టింది. 2019లోనూ 1 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మెజారిటీ మరింత పెరిగింది. ఆ లెక్కన ఈసారి ఓటింగ్ భారీగా తగ్గితే కచి్చతంగా అనూహ్య ఫలితాలే రావచ్చంటున్నారు రాజకీయ పండితులు.అధికార పార్టీకే నష్టమా? 2019లో 67.4 శాతం ఓటింగ్ జరిగినా వాస్తవంగా చూసుకుంటే 30 కోట్ల మంది ఓటే వేయలేదు! ఇదే నిరాసక్తత ఈసారి కూడా కొనసాగితే ఓటింగ్‌కు దూరంగా ఉండేవారి సంఖ్య 35 కోట్లకు పెరగవచ్చు. ఓటింగ్ భారీగా తగ్గడం దేనికి సంకేతమన్న దానిపైనా పలు రకాలు వాదనలున్నాయి. ఓటింగ్ పడిపోవడం అధికార పారీ్టకే ఎక్కువ నష్టమని చరిత్ర చెబుతోంది, అయితే ఇది అన్నివేళలా నిజం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఓటింగ్ తక్కువగా నమోదైనప్పుడు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓటింగ్ తగ్గుదల 5 శాతం లోపుంటే ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, పెద్దగా స్తబ్ధత లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. ఏదైనా జరగొచ్చు’’ అంటున్నారు రాజీకీయ విశ్లేషకుడు నోమిత పి.కుమార్. ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్ల మెజారిటీలకు గండిపడి ఒక్కోసారి ఫలితాలు భారీగా తారుమారవుతాయన్నది మరికొందరి వాదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్‌తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్‌ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్‌కు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు. బెంగాల్లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.పశ్చిమబెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్‌లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు. -
Election commission: హౌసింగ్ సొసైటీల్లోనూ పోలింగ్ బూత్‌లు
లక్నో: కేంద్ర రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీల్లో సైతం 200కు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. ‘యూపీలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం స్వల్పంగా ఉంటోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతంలో మొదటి స్థానం సంపాదించాలనేదే మా లక్ష్యం’అని ఆయన వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఓటింగ్ శాతం 59.11 మాత్రమేనన్నారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘తక్కువ ఓటింగ్ నమోదయ్యే గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల హౌసింగ్ సొసైటీల్లో ఈసారి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మొత్తం 200పైగా బూత్‌లలో ఎక్కువ భాగం నోయిడాలోనే ఉంటాయి. ఆ తర్వాత లక్నో, కాన్పూర్, బరేలీ, మథురలోనూ ఇవి ఉంటాయి. ఈసారి ఓటింగ్ శాతం 60పైగా ఉంటుందన్న నమ్మకముంది’’ అని అన్నారు. -
ఈవీఎం తరహాలో ఆర్వీఎం.. ఈసీ సరికొత్త ప్లాన్!
ఢిల్లీ: దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం బాగా కనిపించింది. సాంకేతికతంగా అభివృద్ధి చెందినా.. వలస ఓటర్లు దూరం అవుతుండడం సరికాదనే అభిప్రాయంలోకి ఉంది కేంద్రం ఎన్నికల సంఘం. ఎన్నికల సమయంలో ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం, డబ్బు.. రెండూ వృథా అవుతాయనే ఆలోచనతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో.. వాళ్ల ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(RVM)పద్ధతిని తీసుకురాబోతోంది. తద్వారా సొంత ఊళ్లకు వెళ్లకుండానే ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఓటింగ్ టూల్ ద్వారా వలస ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒక రిమోట్ పోలింగ్ బూత్ నుంచి ఆర్వీఎం ద్వారా 72 నియోజకవర్గాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ కొత్త సాంకేతిక విధానాన్ని రాజకీయ పార్టీలకు వివరించేందుకు ఇప్పటికే ఈసీ ఆహ్వానించింది కూడా. ఈ నమునాను వివరించే కార్యక్రమం 2023 జనవరి 16వ తేదీన జరగనుంది. ఈ విధానంతో పాటు టూ వే మెథడ్ ఫిజికల్ ట్రాన్సిట్ పోస్టల్ బ్యాలెట్, ప్రాక్సి ఓటింగ్, స్పెషల్ ఎర్లీ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పోస్టల్ బాలెట్స్(వన్ వే లేదంటే టూ వే), ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్.. ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలను పరిశీలించింది కూడా. దేశంలో రాష్ట్రాల మధ్యే 85 శాతం అంతర్గత వలసలు సాగుతున్నట్లు ఒక అంచనా. కేంద్రం వద్ద ఈ వలసల లెక్కలు లేకపోయినా.. పనులు, వివాహాలు, చదువు తదితర కారణాలతో ఇలాంటి వలసలు కొనసాగుతున్నాయన్నది పలు విశ్లేషణల ద్వారా తేలింది. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్
సాక్షి, కరీంనగర్: పోలింగ్ 95.11 శాతమేంటీ అనుకుంటున్నారా.. మీరు చదివేది నిజమండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓ పోలింగ్ బూత్‌లో నమోదైన ఓటింగ్ శాతమిది. జిల్లా ఎన్నికల చరిత్రలో హుజూరాబాద్ ప్రత్యేకత చాటుతుండగా ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదైంది. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంట 67.13 శాతం(పోలింగ్ బూత్ 170), పోలింగ్ బూత్ 172), హుజూరాబాద్‌లోని పోలింగ్ కేంద్రం 40లో 69.10 శాతం ఓటింగ్ నమోదవగా మిగతా అన్ని పోలింగ్ బూత్‌ల్లో 80శాతం దాటడం ఆహ్వానించదగ్గ పరిణామం. చదవండి: Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు! ఆ 30 గ్రామాలు.. 90 శాతంపైనే ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటడం శుభపరిణామం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఓటుపై మమకారం చాటారు. మల్యాల పోలింగ్ బూత్ 235లో 93.57శాతం నమోదవగా, 1,011 మంది ఓటర్లకు గాను 946 మంది ఓటేశారు. గునిపర్తి 282 పోలింగ్ కేంద్రంలో 93.41శాతం నమోదవగా 607కు 567 మంది ఓటు వేశారు. నేరెళ్ల (284)లో 92.96 శాతం నమోదవగా 582కు 541 మంది ఓటు వేశారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ సిరిసేడులో 92.94 శాతం, చిన్నకోమట్పల్లి (223)లో 92.81 శాతం, హుజూరాబాద్(27)లో 92.70 శాతం, దేశ్రాజ్పల్లి (302)లో 92.51 శాతం, టేకుర్తి (222)లో 92.31 శాతం, గంగారాం(125)లో 91.92 శాతం, మల్లన్నపల్లి(119)లో 91.87 శాతం, సీతంపేటలో 91.86 శాతం, నాగంపేట, కందుగులలో 91.68 శాతం, వంతడ్పుల 91.61 శాతం, శాయంపేట 91.41 శాతం, నాగారం 91.32 శాతం, వంగపల్లి, పంగిడిపల్లి, కనగర్తి, భీంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, అంబాల, వంతడ్పుల, గూడూరు, కేశవపూర్, గండ్రపల్లి, బేతిగల్, బొంతుపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. -
Badvel By Election: ఓటింగ్ శాతం పెరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెరగాలని, ఓటు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. 2019లో 77 శాతం ఓటింగ్ జరిగిందని, ఇప్పుడు అంత కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం పెరగాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టర్ అని, మన పార్టీ తరఫున ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామని ప్రకటించారు. బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడున్న (సమావేశంలో పాల్గొన్న) వారందరిమీదా ఉన్నాయని స్పష్టం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. 2019లో వెంకసుబ్బయ్యకు వచ్చిన 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ కన్నా.. డాక్టర్ సుధకు ఇప్పుడు ఎక్కువ మెజార్టీ రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం ఏమన్నారంటే.. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి ► ఉప ఎన్నికలో ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి. ప్రతి మండలాన్ని బాధ్యులకు అప్పగించాలి. గ్రామ స్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించాలి. ► ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాలి. వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్య పరచాలి. నెల రోజుల పాటు మీ సమయాన్ని కేటాయించి, ఈ ఎన్నికపై దృష్టి పెట్టాలి. ► బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలి. ► ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్ బాషా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈ ఏడాది మార్చిలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం (నేడు) నోటిఫికేషన్ జారీ కాగానే, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
పోలింగ్ తగ్గినా వైఎస్సార్సీపీకి పెరిగిన ఓట్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2019లో జరిగిన ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గినా వైఎస్సార్సీపీకి లభించిన మెజారిటీ భారీగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 79.76 శాతం పోలింగ్ నమోదైంది. వైఎస్సార్సీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ లభించింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కోవిడ్ నేపథ్యంలో 15 శాతానికిపైగా పోలింగ్ తగ్గింది. అయినా వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలకంటే వైఎస్సార్సీపీకి 1.64 శాతం మేర ఓట్లు పెరిగాయి. తాజా ఎన్నికల్లో 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది. -
అంతటా బెట్టింగుల హోరు !
సాక్షి, గురజాల : మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగుల హోరు జోరుగా నడుస్తున్నాయి. రూ.కోట్లలో బెట్టింగ్‌లు పెట్టారని సమాచారం. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఫలితాలు వెలవడనున్నాయి. 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లబ్ధిచేకూరుతుందోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడ విన్నా ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న చర్చే జరుగుతుంది. పోలింగ్ తర్వాత సుమారుగా నెల రోజులు పాటు స్తబ్ధత రాజ్యమేలింది. ఈ నెల 23వ తేదీన కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడటంతో ఇటు రాజకీయ పక్షాలు, అటు ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారని అన్ని సామాజిక వర్గాలు వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపి ఓట్లు వేశారని తప్పనిసరిగా అధికారంలోకి వస్తామనే ధీమా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తుంది. పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. చేతులు మారిన రూ.కోట్ల నగదు పోలింగ్ పూర్తయిన తరువాత నియోజకవర్గంలో ఒక్కసారిగా బెట్టింగ్ బాబులు బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని కొందరు, టీడీపీ అధికారం ఖాయమని కొందరు ఈ విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కాసినట్లు తెలిసింది. ప్రస్తుతం కౌంటింగ్ తేదీ సమీపించడంతో బెట్టింగ్ పెట్టిన వారిలో ఆందోళన మొదలైంది. ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో అని అలోచనలో ఉన్నారు. ఓటింగ్ జరిగిన మూడు రోజుల నుంచి వైఎస్సార్ సీపీ గెలుస్తుందని అధికంగా బెట్టింగ్‌లు వచ్చిన ఆ సమయంలో టీడీపీ నుండి బెట్టింగ్ పెట్టెందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై పలువురు విశ్లేషకులు తప్పనిసరిగా వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం... సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎండలు ముదరకముందే పోలింగ్ జరగ్గా ఓట్ల్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా ఉండటంతో ఎండలు మండిపోతున్నా, రాజకీయ వాతావరణం కాస్త చల్లబడిందనే చెప్పాలి. లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో మళ్లీ కొద్ది రోజుల నుంచి వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయోనని గ్రామస్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు చర్చించుకుంటున్నారు. ఏ గ్రామంలో ఏ వర్గం ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపారో అన్న అంశాలపై రచ్చబండల వద్ద రోజూ చర్చకు వస్తుండటంతో పల్లెలో వాతావరణం వేడెక్కింది. ప్రజల తీర్పు ఎటు ఉందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు. -
యాదాద్రి ఫస్ట్, వికారాబాద్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6, 10, 14 తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మొత్తం 77.46 శాతం ఓటింగ్ నమోదవగా అందులో మహిళలు 77.68 శాతం, పురుషులు 77.24 శాతం, ఇతరులు 7.64 శాతం ఓటేశారు. జిల్లాలవారీగా చూస్తే 87.02 శాతం పోలింగ్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా తొలిస్థానం లో నిలవగా వికారాబాద్ జిల్లా అత్యల్పంగా 70.40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 534 జెడ్పీటీసీ స్థానాలకు(ఏకగ్రీవమైన 4 స్థానాలు మినహా) 2,426 మంది, 5,659 ఎంపీటీసీ స్థానాలకు (158 ఏకగ్రీవా లు మినహా) 18,930 మంది పోటీపడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు సగటున ఐదుగురు, ఎంపీటీసీ స్థానాలకు సగటున ముగ్గురు ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలవారీగా పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 32,045 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 2,488 పోలింగ్ బూత్ లలో ఎస్ఈసీ వెబ్ కాస్టింగ్ నిర్వహించింది. మొత్తం 2,879 రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఎన్నికల విధుల కోసం 1.86 లక్షల మంది సిబ్బంది ని ఎంపిక చేసింది. 54,604 మంది భద్రతా సిబ్బంది ని సేవల వినియోగించుకుంది. సాధారణ పరిశీలకులుగా 15 మందిని, వ్యయ పరిశీలకులుగా 37 మందిని, సహాయ వ్యయ పరిశీలకులుగా 528 మందిని, మైక్రో అబ్జర్వర్లుగా 2,832 మందిని నియమించింది. మొత్తం 65 వేల బ్యాలెట్ బాక్సులు, దాదాపు 3.5 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఓటేసినందుకు గుర్తుగా వేసే నల్లటి సిరా రంగు కోసం 42 వేల ఇండెలిబుల్ ఇంక్ ఫాయల్స్ ఉపయోగించారు. 1.6 లక్షల పేపర్ సీళ్లను ఉపయోగించారు. -
నాలుగు దశల దిశ ఎటు..?
న్యూఢిల్లీ: పదిహేడో లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 543 సీట్లు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 373 సీట్లకు ఓటింగ్ పూర్తయింది. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకుగాను 19 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని సీట్లకు పోలింగ్ ముగిసింది. 68.5 శాతానికి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తవడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల నాయకత్వంలోని కూటముల గెలుపోటములపై అంచనాలు మొదలయ్యాయి.దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాలు (మొత్తం 129 సీట్లు), తూర్పు రాష్ట్రం ఒడిశా, పశ్చిమాన ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ (రెండూ కలిపి 74), లోక్‌సభ సీట్ల రీత్యా అతి పెద్ద రాష్ట్రం యూపీలోని దాదాపు సగం (39) సీట్లలో ఎన్నికలు ముగియడంతో మే 23న జరిగే ఓట్ల లెక్కింపులో వచ్చే ఫలితాలపై ఇప్పుడే ఓ అంచనాకు రావడానికి రాజకీయ పండితులు ప్రయత్నిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోగా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో సైతం కాషాయపక్షం దాదాపు 90 శాతనికి పైగా సీట్లు గెలుచుకుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలు పూర్తిగా అమలు చేయకపోవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచిచూడాల్సి ఉంది. నిరుద్యోగం పెరగడం, మతపరమైన అసహనం పెరుగుతోందనే భావన కలిగే రీతిలో దేశంలో ఈ ఐదేళ్లలో జరిగిన సంఘటనలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. గత నవంబర్–డిసెంబర్లో మూడు హిందీ రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారం కైవసం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ కశ్మీర్లో పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేయడంతో హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ముఖ్యంగా ప్రధాని మోదీకి మళ్లీ జనాదరణ పెరిగిందని కొన్ని సర్వేలు సూచించాయి.మొదటి దశ ఎన్నికల నాటికి (ఏప్రిల్ 11) అనేక మీడియా సంస్థలు జరిపిన సర్వేలు సైతం బీజేపీకి గతంలో మాదిరిగా (282) సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సీట్లు రాకపోయినా, ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి మెజారిటీ తప్పక సాధిస్తుందని తేల్చాయి. బీజేపీకి 200–230 సీట్లు దక్కుతాయని కూడా కొన్ని సర్వేలు సూచించాయి. ఈ పార్టీకి రెండు వందలకు లోపే అంటే 180–190 మధ్యనే సీట్లు వస్తాయని వాదించేవారూ లేకపోలేదు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఈసారి వంద సీట్లకు మించి (2014లో 44 సీట్లు) రావని కొందరు ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే తమ పార్టీ బలం గతంతో పోల్చితే మూడు రెట్లు అంటే 132కి పెరుగుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఇటీవల జోస్యం చెప్పారు. మొత్తం మీద పోలింగ్ పూర్తయిన ఈ 373 లోక్‌సభ స్థానాల్లో ప్రజలిచ్చే తీర్పే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చేదీ, లేనిదీ తేల్చివేస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం కావడం గమనార్హం. ఒక్క కర్ణాటకలో మినహా మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 2014లో బీజేపీ నామమాత్రంగానే సీట్లు సాధించింది. కర్ణాటకలో 17 సీట్లు సాధించిన బీజేపీ ఏపీలో రెండు, తమిళనాడు, తెలంగాణలో ఒక్కొక్క స్థానాన్నే గెలుచుకుంది. కేరళలో ఒక్క సీటూ దక్కలేదు. పాతిక సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20కి పైగా లోక్‌సభ సీట్లు, మెజారిటీ అసెంబ్లీ సీట్లు లభిస్తాయని అత్యధిక సర్వేలు తేల్చిచెప్పాయి. అసెంబ్లీ ఎన్నికలు కిందటి డిసెంబర్లోనే జరిగిన తెలంగాణలో మొత్తం 17 సీట్లలో డజనుకు పైగానే పాలకపక్షమైన టీఆర్ఎస్ సాధిస్తుందని అనేక మీడియా సంస్థలు అంచనావేశాయి. యూపీలో మహాకూటమి ప్రభావమెంత? పోలింగ్ పూర్తయిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల్లో మహాగట్బంధన్ పార్టీల మధ్య పొత్తు బాగానే పనిచేసిందనీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ దాదాపు సంపూర్ణంగా జరిగిందని వార్తలొస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు గట్టి మద్దతుదారులైన యాదవులు, జాటవులు(దళితులు), ముస్లింలు ఇతర బడుగువర్గాలు కూటమి అభ్యర్థులకు అనుకూలంగా సమీకృతమయ్యారని తెలుస్తోంది. ఇదే నిజమైతే యూపీలో మహా కూటమికి 35–40 సీట్లు రావచ్చని, బీజేపీ బలం కూడా అదే స్థాయిలో ఉండవచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలపడుతుందా? బెంగాల్‌లోని 42 సీట్లలో 18 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కిందటి ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ బలం పెరగవచ్చని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ దూకుడు విధానాలు, జనంలో మతాలవారీగా వచ్చిన చీలికల వల్ల సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్, కాంగ్రెస్ బలహీనపడ్డాయి. ఫలితంగా ప్రధాన ప్రత్యామ్నాయంగా బెంగాలీలకు బీజేపీ కనిపిస్తోందని సర్వేలు పేర్కొంటున్నాయి. ►నాలుగు విడతల్లో పోటీ పడిన అభ్యర్థులు 5,473 ►పోలింగ్ పూర్తయినవి/ మొత్తం స్థానాలు 373 / 543 (దాదాపు 69 శాతం) -
పోలింగ్ శాతం ఏం చెబుతోంది?
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటేసిన వారు ఎంత మంది? అన్న చర్చ ప్రతిసారీ జరిగేదే. వీటికి అనుగుణంగా రాజకీయ పండితులు ఫలానా పార్టీ గెలిచేస్తుందని.. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోనుందని లెక్కలు కట్టేస్తూంటారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఓట్లశాతం భారీగా పెరిగితే అధికార పార్టీకి గండమనే వీళ్లే.. తక్కువ నమోదైనప్పుడు ప్రతిపక్షానికి చేటు అనేస్తారు. ఇందులో నిజమెంత? అబద్ధమెంత? వాస్తవం ఏమిటంటే.. ఓట్ల శాతానికి అధికార ప్రతిపక్షాల గెలుపు ఓటములకూ మధ్య సంబంధం పిసరంతే. ఇప్పటికే అనేక శాస్త్రీయ అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాలుగోదశతో ఉన్న 543 స్థానాల్లో 373కు పోలింగ్ పూర్తయినా.. ఓట్ల శాతం 2014 నాటి స్థాయిలో (66.4)లోనే ఉన్నాయి. ఏప్రిల్ 11న జరిగిన తొలిదశలో గతం కంటే కొంచెం తక్కువ పోలింగ్ నమోదు కాగా.. ఏప్రిల్ 29 నాటి నాలుగోదశతో మార్పు వచ్చేసింది. మూడో, నాలుగోదశల్లో గుజరాత్, కేరళ, కర్ణాటక, బిహార్‌లోని కొన్ని స్థానాల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ పరిణామాలు తమకు అనుకూలమని అటు ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్షాలు ప్రకటించుకున్నా.. ఇవి అపోహలు మాత్రమే. ఎందుకంటే.. ఈ తర్కాన్ని రెండువైపులా వాడుకోవచ్చు. పోలింగ్ శాతం పెరిగితే.. ‘‘ప్రజలు అధికార పక్షంపై అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కసిగా ఓటేశారు’’ అంటారు. అదే తగ్గిందనుకోండి.. ‘‘ప్రతిపక్షాల వద్ద సరైన ప్రణాళిక లేని కారణంగా ప్రజలు ఓటేసేందుకు నిరాసక్తత చూపారు’’ అని అనేస్తారు. బీజేపీకి లాభించిన గత ఎన్నికలు.. . 2014 ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో ఓటింగ్ శాతం పెరగడం బీజేపీకి బాగా లాభించింది. 1990లో పోలింగ్ శాతంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ.. బడుగు, బలహీన వర్గాల వారు పోలింగ్‌లో పాల్గొనడం పెరుగుతూ వచ్చింది. ఇది కాస్తా ప్రజాస్వామ్య ప్రస్థానానికి కారణమైందని యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు అంటారు. 1970 నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించినా దిగువ తరగతుల వారు, మైనార్టీలు, మహిళలు ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఓటింగ్‌లో పాల్గొనడం ఎక్కువవుతూ వచ్చిందని.. దేశ రాజకీయాలపై దీని ప్రభావం ఎక్కువేనని ఆయన విశ్లేషించారు. అంటే గెలుపు ఓటములు పోలింగ్ ఎంత జరిగిందన్న అంశంపై కాకుండా ఏఏ వర్గాల వారు ఓటింగ్‌లో పాల్గొన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట. అగ్రవర్ణాల వారు ఓటేస్తే.... 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుదలకు, బీజేపీ గెలుపునకూ మధ్య సంబంధం స్పష్టంగా కనిపించింది. ఓటింగ్ శాతం 15 శాతం కంటే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ 96 శాతం విజయాలు నమోదు చేయగా.. పది నుంచి 15 శాతం పెరుగుదల ఉన్న స్థానాల్లో విజయాల శాతం 86గా ఉంది. పది శాతం కంటే తక్కువగా ఉన్న చోట్ల 46 శాతం, పెద్దగా తేడాల్లేని స్థానాల్లో 34 శాతం సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. 2019 తొలి నాలుగు దశల్లో పోలింగ్ గత ఎన్నికల స్థాయిలో పెరగలేదు. 2014లో అగ్రవర్ణాల వారు ఎక్కువగా... పేద, మైనార్టీ వర్గాల వారు తక్కువగా ఓట్లేయడం గమనార్హం. సీఎస్డీఎస్ సర్వే... ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) జరిపిన ఓ సర్వే సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని ప్రకారం.. మోదీ మద్దతుదారుల్లో కొందరు పాలనపై అసంతృప్తి కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఇంకో లెక్క ప్రకారం.. ఈసారి మైనార్టీలతోపాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు కూడా ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదు. మొత్తమ్మీద తొలి నాలుగుదశల తరువాతి పరిస్థితులను గమనిస్తే.. పరిస్థితి ప్రతిపక్షాలకు కొంత అననుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల యంత్రాంగం బలంగా ఉన్న బీజేపీ, డీఎంకే లాంటి పార్టీలు మద్దతుదారులను పోలింగ్‌కు తీసుకురావడం ద్వారా తక్కువ పోలింగ్ జరిగే సందర్భాల్లోనూ లాభపడతాయని అంచనా. కార్యకర్తల బలం లేని పార్టీలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తమ్మీద చూస్తే.. ఈసారి ఎవరు ఓటేశారన్నది కాకుండా.. ఏఏ సామాజిక వర్గాల వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్న అంశం బీజేపీ గెలుపు ఓటములను నిర్ణయిస్తుందని అంటున్నారు. -
లా అండ్ ఆర్డర్ తప్పినా సమీక్షించకూడదా?
తిరుపతి (అలిపిరి) : రాష్ట్రంలో లా అండ్ అర్డర్ తప్పినా ప్రభుత్వం రివ్యూ చేయకూడదని ఈసీ ఆంక్షలు విధించడం ఏమిటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌పై తనకు ఎటువంటి ఆక్రోశం లేదని, అది అవలంబిస్తున్న విధానాలపై మాత్రం రాజీలేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తిరుపతిలో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. తిరుపతి సభ సాక్షిగా రాష్ట్రానికి విభజన హామీతో పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. వీవీ ప్యాట్, ఈవీఎంలను పరిశీలించాలన్నారు. వీవీ ప్యాట్లను లెక్కించడానికి ఈసీకి ఇబ్బందేంటో అర్థం కావడం లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దని, మోది కోసమో, ఇంకొకరి కోసమో పని చేయడం ఏమిటని మండిపడ్డారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి కొందరు రౌడీయిజం చేసి భయంకర వాతావరణం సృష్టించారన్నారు. తన పిలుపుతోనే రాష్ట్ర ప్రజలు ముందుకు వచ్చి అర్ధరాత్రి వరకు ఓటింగ్‌లో పాల్గొన్నారని, మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మోదీ సమీక్ష నిర్వహిస్తే పట్టించుకోలేదు.. తిరుపతితో పాటు 4 వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడితే సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే తాను ఫాలో అవుతానని, కేవలం రాష్ట్రంలో తమపై మాత్రమే ఆంక్షలు విధిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. మోదీ రివ్యూ నిర్వహిస్తే పట్టించుకోలేదని, ఇతర రాష్ట్రాల్లో హెలికాప్టర్ల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసినా పట్టించుకోని ఈసీ, ఏపీపై మాత్రమే ఆంక్షలు విధించిందన్నారు. మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఫొటో తీసినందుకు ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారన్నారు. సస్పెండ్ చేసే అధికారం ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 65 మంది రిటైర్డ్ ఐఏఎస్‌లు ఎన్నికల కమిషన్ విధానాలను వ్యతిరేకించి తనకు సపోర్ట్ చేయకుండా ఇంకోవిధంగా వ్యవహరించి కుల ప్రాతిపదికన పని చేశారని మండిపడ్డారు. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని 23 రాజకీయ పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో డిమాండ్ చేశామన్నారు. ఎన్నికల ఫలితాలు రాకమునుపే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం బోర్డు రాయించుకున్నారని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీ ఇంటికి పోవడం ఖాయమని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుందని, ఓటింగ్ తగ్గించాలని ప్రయత్నించిందని చెప్పారు. రాష్ట్రంలో ఆంక్షలు విధించడానికి మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలే కారణమన్నారు. -
బెజవాడ.. ఓటుకు దూరం, దూరం
ఓటు.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. మన భవిష్యత్‌ను.. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో శక్తిమంతమైన ఆయుధం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆత్మలాంటిది. అటువంటి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు దేశ, విదేశాల నుంచి స్వస్థలాలకు వస్తూ ఉంటే.. ఇక్కడ ఉన్న వాళ్లు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్మికశాఖ దుకాణాలను, చిరు వ్యాపార సంస్థలను కూడా మూయించింది. అయినా నగరంలో అనేక మంది ఓటును వినియోగించుకో లేదు. ఓ పక్క గ్రామీణ ఓటర్లు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేసి తమ వంతు బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తిస్తుంటే.. హక్కులు, విలువలు, నైతికత, బాధ్యతలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే.. నగర ఓటర్లు మాత్రం ప్చ్! సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల పోలింగ్ సగటు 81.10 శాతం కాగా విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల సగటు కేవలం 66.48 శాతం మాత్రమే. జిల్లా ఓటింగ్ సరాసరి కంటే 14.62 శాతం తక్కువ. నగరంలోనూ 80 శాతం పోలింగ్ అయి ఉంటే జిల్లా పోలింగ్ శాతం మరింతగా పెరిగేది. పట్టణ ప్రాంతాల కంటే ప్రజల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఓటు తమ ఆయుధంగా భావిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ సెలవు ఇచ్చి, విస్తృతంగా ప్రచారం చేసినా నగరవాసులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక్కడే తక్కువ ఓటింగ్.. జిల్లాలో అతి తక్కువ ఓటింగ్ 65.78 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నమోదైంది. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అంతకంటే గొప్పగా ఏమీ లేదు. విజయవాడ తూర్పులో 67.55, పశ్చిమంలో66.12 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. సుమారు 35శాతం మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన ఓట్లే ఎక్కువ.. నగరంలో 35శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఓటింగ్‌పై అనేక మందికి ఆసక్తి లేకపోవడం, నేను ఓక్కడినే ఓటు వేయకపోతే ఏమీ కాదులే.. అనే నిర్లప్తత ఎక్కువగా కనపడుతోంది. కాగా కొంతమంది ఆసక్తిగా ఎన్నికల బూతు వరకు వెళ్లి అక్కడ వారి ఓటు కనపడలేదు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓట్లు ఈసారి గల్లంతయ్యాయి. ముఖ్యంగా వైఎ స్సార్ సీపీ అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు టీడీపీ వాళ్లు తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎన్నికలకు ముందు అనేక వేల మంది తమ ఓటును జాబితాలో ఉందో లేదో చూసుకోలేదు. అలాగే కొత్తగా చేర్చిన ఓట్లను కూడా ఒకేచోట లేవు. ఒకే కుటుంబంలో ఓట్లు వేర్వేరు చోట్ల వచ్చాయి. దీంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడగా.. మహిళలు ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. పేదల బస్తీలోనే ఓటింగ్ ఎక్కువ.. విద్యావంతులు, ధనవంతులు ఉన్న ప్రాంతాల కంటే పేదల బస్తిలోనే ఓటింగ్ ఎక్కువగా జరిగింది. మండుటెండలో క్యూలో నిలబడానికి ఇష్టపడక చాలా మంది ఓటుకు దూరంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. అభ్యర్థులు ఆలోచనలు తారుమారు.. ఓటింగ్ ఎక్కువగా జరిగితే గెలిచిన అభ్యర్థులకు మెజార్టీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే అభ్యర్థుల విజయావకాశాలు స్పష్టంగా తెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తక్కువ పోలింగ్ జరిగితే అభ్యర్థుల ఆలోచనలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. -
ప్రకాశం ప్రథమం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు సిటీ: ప్రకాశం ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆరంభంలో యంత్రుడు మొరాయించినా.. పోలింగ్ ఆలస్యమైనా.. భానుడు తన ప్రతాపం చూపినా.. ఉక్కపోత సహనాన్ని పరీక్షించినా ఓటరు వెనక్కి తగ్గలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూలో ఓపిగ్గా వేచి చూసి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా ప్రజలు. ఓటేయాలన్న సంకల్పం ముందు చిన్నపాటి సమస్యలు ఓడిపోయాయి. గురువారం జరిగిన ఓట్ల పండగలో ఉదయం ఏడు గంటలకే గుంపులు గుంపులుగా పోలింగ్ కేంద్రాలకు చేరారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పట్టణాలు, పల్లెలు.. చివరికి మారుమూల తండా వాసులు సైతం ఓటేసేందుకు ఉత్సాహం కనబర్చారు. 85.92 శాతం పోలింగ్‌తో ప్రకాశం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అద్దంకి నియోజకవర్గంలో పోలింగ్ భారీ ఎత్తున 89.82 శాతంగా నమోదైంది. దర్శిలో 89.62 శాతం నమోదైంది. జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు రాష్టంలో ప్రథమ, తృతీయ స్ధానాల్లో నిలవడం గమనార్హం. ఏ నియోజకవర్గంలోనూ 80 శాతానికి తక్కువగా పోలింగ్ నమోదు కాలేదు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జిల్లాలోనూ ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన్నికలలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 84.25 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా 2019 ఎన్నికల్లో 85.92 శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.67 శాతం ఓటింగ్ పెరిగింది. విమర్శలకు తావిచ్చిన చంద్రబాబు వ్యాఖ్యలు.. ఓటింగ్ సరళిలో వచ్చిన ఈ మార్పు చూసి టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగట్టుకొని విమర్శలు చేయడం ప్రారంభించారు. జిల్లాలోని ఓటర్లందరూ పారదర్శకతతో ఓటు హక్కును వినియోగించుకున్నామని సంబర పడుతుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం వీవీఎంలు పనిచేయలేదని, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుండడం విడ్డూరంగా ఉంది. ఈ ఎన్నికలు ఒక ఫార్స్ అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించి విశ్లేషకులు, మేధావుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆయనే కల్పించుకుంటున్నారు. అసలు సాంకేతికతను తీసుకొచ్చిందే తానని చెప్పే చంద్రబాబు ఈ వీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై పనిగట్టుకొని విమర్శలు చేయడంపై సర్వత్రా విమర్శలున్నాయి. అసలు వేసిన ఓటు ఎవరికి పడిందో ఏమో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం మరింత దిగజారుడు తనమని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి భయంతోనే అడ్డగోలు విమర్శలు చేస్తున్నట్లే ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఈసారి కొత్త టెక్నాలజీ.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో ఓటింగ్ పెట్టారు. ఓటర్లు నచ్చిన వారికి ఓటేశారు. కానీ వేసిన ఓటు సక్రమంగా పడిందా.. తాము వేసిన వారికి పడిందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. వేసిన ఓటు చూసుకొనే అవకాశమొస్తే బాగుండేదన్న అభిప్రాయం కలిగింది. 2019 ఎన్నికలలో ఆ కోరికా తీరింది. తాము వేసిన ఓటు ఎవరికి వేశామో స్పష్టంగా తెలిసేలా ఎన్నికల అధికారులు వీవీప్యాట్లు ఏర్పాటు చేశారు. ఓటు మీట నొక్కగానే పక్కన స్క్రీన్‌పై ఓటు వేసిన అభ్యర్థి పేరు, ఆ పార్టీ గుర్తుతో సహా కనిపించింది. తాము అనుకున్న వారికి ఓటు వేశామన్న సంతృప్తి ఓటర్లలో కనిపించింది. అందుకే గురువారం నాటి పోలింగ్ లో తొలుత కొన్ని పోలింగ్ బూతులలో వీవీఎంలు మొరాయించినా ఓటర్లు ఓపిగ్గా వేచిఉండి ఓటు వేటేశారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిందో చూశామన్న సంతృప్తితో పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. -
నేనంటే నేను
సార్వత్రిక సమరం ముగిసింది. ప్రజాతీర్పు స్ట్రాంగ్‌రూంలలోని ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ‘జడ్జిమెంట్ డే’కు మరో 40 రోజుల సమయం ఉంది. అయితే పోలింగ్ ముగియడం, భారీగా పోలింగ్‌శాతం నమోదు కావడంతో సర్వత్రా పోలింగ్ జరిగిన తీరుపైనే చర్చ సాగుతోంది. ఎప్పుడూలేని విధంగా రాత్రి వరకూ ఓటర్లు క్యూలో నిల్చొని ఓటేశారు. ఇప్పుడు ఈ అంశం కేంద్రంగానే పోలింగ్ సరళిని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, టీడీపీ వాదన అందుకు భిన్నంగా ఉంది. మొత్తం మీద ఎవరికి వారు పోలింగ్ తీరును విశ్లేషించుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాజకీయ పార్టీల నేతలు ‘రిలాక్స్ మూడ్’లో ఉన్నప్పటికీ గెలుపోటములపై లెక్కలు వేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? ఏ డివిజన్, పంచాయతీల్లో తమకు ఎక్కువగా వచ్చాయి? ఎక్కడ తక్కువ వచ్చి ఉంటాయి? ఏ లీడర్ మనకు సహకరించారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు అని రకరకాల అంశాలను చర్చిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి, పెరిగిన పోలింగ్ శాతంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో 79.65శాతం నమోదైతే, ఇప్పటి ఎన్నికల్లో 82.22 శాతం నమోదైంది. అంటే 2.57 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఊహించని విధంగా ఓటెత్తిన ‘అనంత’ ఓటర్లు: జిల్లా వ్యాప్తంగా 3,884 పోలింగ్ బూత్‌లలో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 9,330 ఈవీఎంలు వినియోగించారు. ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. అయితే 97 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యమైంది. వీటిలో 10 నుంచి 30 నిమిషాల్లోపు 50 ఈవీఎంల సమస్య పరిష్కారమై పోలింగ్ మొదలైంది. ఆపై మరో 30–60 నిమిషాల్లోపు తక్కిన ఈవీఎంలు కూడా పనిచేశాయి. అంటే జిల్లాలో అన్ని పోలింగ్ సెంటర్లలోని ఈవీఎంలు సక్రమంగా పనిచేశాయి. వీటికి ఉపయోగించిన 9,993 వీవీ ప్యాట్స్ కూడా పనిచేశాయి. పైగా ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి ఫొటో కూడా ఈవీఎంపై స్పష్టంగా ఉంది. ఈవీఎం బటన్ నొక్కగానే పెద్దగా లైటింగ్, బీప్ శబ్దం రావడంతో పాటు ఏ గుర్తుపై ఓటేశారో ప్రింట్ కూడా వచ్చింది. వీటిని ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఇలా వీవీప్యాట్ ద్వారా ప్రింట్ వచ్చే ప్రక్రియతో ఒక్కో ఓటర్ ఓటు వేసేందుకు పట్టే సమయం కాస్త ఎక్కువైంది. పైగా వేసవి కావడం, ఎండలు మండిపోవడంతో మధ్యాహ్నం ఓటర్ల సంఖ్య తగ్గింది. సాయంత్రం భారీగా వచ్చారు. ఈ మొత్తం పరిణామాలతో పోలింగ్ సమయం ముగిసే గడువు 6గంటలకు అధికశాతం పోలింగ్స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. అయితే క్యూలో నిల్చున్న వారందరూ ఓటేసేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాత్రి 10.30గంటల వరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మొదట్లో నెమ్మదించి.. తర్వాత జోరందుకున్న పోలింగ్ ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలైనా.. 9గంటల వరకూ పోలింగ్ మందగించింది. అందుకే 9గంటల వరకూ 10.62శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11గంటలకు 21.47శాతం నమోదైంది. 11 నుంచి పోలింగ్‌శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.86శాతం నమోదైతే, 3 గంటలకు 54.96 శాతానికి చేరింది. 5గంటలకు 67.08శాతం నమోదైంది. 5 నుంచి పోలింగ్ ముగిసే సమయానికి ఏకంగా 15.14శాతం నమోదై 82.22శాతంతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ శాతం పెరగడంపై ఎవరికి వారు ధీమా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. దీంతో పోలింగ్‌శాతం పెరిగిన తీరును ఇరుపార్టీలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, అది ఓట్ల రూపంలో చూపించారని వైఎస్సార్సీపీ అంటోంది. అందుకే ఇంత భారీగా పోలింగ్ పెరిగిందని, ‘మార్పు’ కోరుతూ ప్రజలు తీర్పు ఇచ్చారని చెబుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణులు ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, పసుపు కుంకుమ, పింఛన్ డబ్బుల ప్రభావం ఉందని అందుకే ప్రజలు తరలివచ్చి టీడీపీకి ఓటేశారనేది వారి వాదన. అయితే టీడీపీ చేసిన గిమ్మక్కులను ప్రజలు నమ్మరని, పసుపు–కుంమ, పింఛన్లు ఎన్నికల ముందు తాయిళాలు వేసినట్లుగా ప్రజలు భావించారని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఈ రెండుపార్టీలు కాకుండా రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు తీర్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా రెండుపార్టీల్లో ఎవరి వాదన నిజం అనేది తేలాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. ఈవీఎంలపై అనుమానం తగదు ఈవీఎంలలో ఎలాంటి పొరబాట్లు ఉండవు. ఎన్నికల కమిషన్ ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయాన్ని చంద్రబాబు మరిచి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా గొప్పది. సంస్థ దృష్టిలో అందరూ సమానమే. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంలనే వినియోగిస్తున్నారు. – భాస్కరరెడ్డి, న్యాయవాది, పెనుకొండ 2014 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? ఈవీఎంలపై నిందలు వేస్తూ ఓ సీఎం స్థాయిలో చంద్రబాబు మా ట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈవీఎంలు వాడారు. మరీ ఆ ఎన్నికల్లో ఇదే తరహాలోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారా? అప్పట్లో వీవీ పాట్లు లేవు. ఓటు ఎవరికి వేసింది తెలియక తికమకపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి ఓటు వేసిందీ చాలా స్పష్టంగా అందరూ వీవీపాట్లలో చూసి తెలుసుకున్నారు. ఓటమి భయంతో తప్పును ఈవీఎంలపై నెట్టేయడం సబబు కాదు. – నాగిరెడ్డి, విశ్రాంత ఎంఈఓ, పుట్టపర్తి -
మార్పునకు సంకేతం!
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే కీలకం. వారి ఓటుపైనే నాయకుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తమకు మేలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో నాయకులకు ఓట్లేసి గెలిపిస్తుంటారు. గెలిచిన తర్వాత వారి ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. అయితే.. ఆ బాధ్యతను విస్మరించి, సొంత ‘వ్యాపకాల’కే పరిమితమైతే మాత్రం దాని పర్యవసానాలు ఆలస్యంగానైనా ఎదుర్కోక తప్పదు. తమలోని అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపెడతారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగిందంటే అది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను సూచిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈసారి మండు వేసవిలో ఎన్నికలు జరిగాయి. సూరీడు నిప్పులు కక్కుతున్నప్పటికీ జనం మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఓటింగ్ జాప్యమైనా జనంలో మాత్రం ఓటు వేయాలన్న సంకల్పం సడలలేదు. ఓపికతో వేచివుండి, తమకు ఇష్టమైన అభ్యర్థికి ఈవీఎంలో ఓటేసి..అది కరెక్ట్‌గా పడిందా, లేదా అనే విషయాన్ని వీవీప్యాట్ ద్వారా నిర్ధారించుకుని మరీ వెళ్లారు. ఓటర్లలో ఇంత పెద్దఎత్తున చైతన్యం రావడం స్పష్టమైన ‘మార్పు’నకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెరిగిన ఓటింగ్ 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో జిల్లాలో 30,56,867 మంది ఓటర్లకు గాను 22,57,975 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 74గా నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 31,72,413 మంది ఓటర్లు ఉండగా.. 24,64,492 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 77.73కు పెరిగింది. అంటే 3.73 శాతం పెరుగుదల కన్పించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా పోల్ కావడం వల్లే ఇది సాధ్యమైందన్న అభిప్రాయం ప్రజలు, మేధావుల్లో వ్యక్తమవుతోంది. కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఆశాజనకంగానే ఉంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో కేవలం 58 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి దీన్ని 65 శాతానికి పెంచాలనుకున్న అధికారులు.. స్వీప్ కార్యక్రమాలను చేపట్టారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. 59.53 శాతానికే పరిమితమైంది. ఎంపీ అభ్యర్థులకు ఓటేయని వైనం ఈ సారి ఓటర్లు భిన్నంగా వ్యవహరించారు. సాధారణంగా పార్లమెంటు, అసెంబ్లీకి ఒకే విధంగా పోలింగ్ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం అసెంబ్లీకి ఒక రకంగా, పార్లమెంటుకు మరో రకంగా ఓట్లు పోల్ అయ్యాయి. కర్నూలు పార్లమెంటు పరిధిలోని కోడుమూరు అసెంబ్లీ సెగ్మెంటులో పార్లమెంటు అభ్యర్థులకు ఒక రకంగా, అసెంబ్లీ అభ్యర్థులకు మరో రకంగా ఓట్లు పోల్ కావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి 79.52 శాతం ఓట్లు పోల్ కాగా.. పార్లమెంటుకు వచ్చేసరికి 78.77 శాతానికి పరిమితం కావడం గమనార్హం. అసెంబ్లీకి సంబంధించి పురుషులు 87,178 మంది ఓటు వేయగా.. పార్లమెంటుకు మాత్రం 86,465 మంది వేశారు. మహిళల్లో అసెంబ్లీకి 84,665 మంది, పార్లమెంటుకు 83,740 మంది మాత్రమే ఓటు వేశారు. దీన్నిబట్టి చూస్తే 1,638 మంది ఓటర్లు కేవలం అసెంబ్లీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేసి.. పార్లమెంటు అభ్యర్థులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలోనూ స్వల్పంగా ఈ పరిస్థితి ఉంది. పోలింగ్ సిబ్బంది విధిగా ప్రతి ఓటరుతో ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంటుకు ఓట్లు వేయించాల్సి ఉంది. అయితే.. ఈ విషయాన్ని పట్టించుకున్నట్లుగా లేదు. నంద్యాల పరిధిలో ఓటెత్తారు! నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 16,00,459 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 7,89,553, మహిళలు 8,10,572 మంది, ఇతరులు 334 మంది ఉన్నారు. ఇందులో 80.15 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 6,36,213 మంది, మహిళలు 6,46,432 మంది , ఇతరులు 71 మంది..మొత్తంగా 12,82,716 మంది ఓట్లు వేశారు. 2014లో ఇక్కడ 76 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. కర్నూలు పరిధిలోనూ వెల్లువెత్తిన చైతన్యం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 72 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఇది 75.93 శాతానికి పెరిగింది. పార్లమెంటు పరిధిలో 7,85,694 మంది పురుషులు, 7,86,061 మంది మహిళలు, 199 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో పురుషులు 5,96,991, మహిళలు 5,84,764 మంది, ఇతరులు 21 మంది ఓటు వేశారు. మొత్తం 11,81,776 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం సెగ్మెంట్లలో పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్యూ పీజీ పరీక్షలు వాయిదా కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి జరగాల్సిన పీజీ రెండో సెమిస్టర్, ఎల్ఎల్బీ 4,6,8,10 సెమిస్టర్, ఎమ్ఎసీఏ 4, పీజీ డిప్లమా ఇన్ యోగా రెండు, ఎమ్బీఏ 2,4,6 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆర్యూ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ సి.వి. కృష్ణారెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేసుకోవడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నింటినీ జూన్ 4వ తేదీ నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల తేదీలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు. -
లెక్క మారెన్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పోలింగ్ శాతం లెక్క మారింది. లెక్కింపులో గందరగోళం నెలకొంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలకు గాను తొలుత తక్కువ పోలింగ్ శాతం ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత సరిదిద్దారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు గురువారం జరిగిన విషయం విదితమే. ఆ రోజు రాత్రి వరకు అధికారులు అందించిన సమాచారం ప్రకారంహైదరాబాద్‌లో 39.20 శాతం, సికింద్రాబాద్‌లో 44.99 శాతం, మల్కాజిగిరిలో 49.21 శాతం పోలింగ్ నమోదైంది. అయితేఅధికారులు మళ్లీ శుక్రవారం తుది గణాంకాలు విడుదల చేశారు. దీని ప్రకారం హైదరాబాద్‌లో 44.75 శాతం, సికింద్రాబాద్‌లో 46.26 శాతం, మల్కాజిగిరిలో 49.40 శాతంపోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ పెరిగినప్పటికీ... గతంతో పోలిస్తే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువే నమోదైంది. సికింద్రాబాద్‌లో 39.20 శాతం పోలింగ్ నమోదైందని తొలుత ప్రకటించిన అధికారులు.. గురువారం రాత్రికి దాన్ని 44.99 శాతంగా పేర్కొన్నారు. మళ్లీ శుక్రవారం 46.26 శాతంగా ప్రకటించారు. అదే విధంగా హైదరాబాద్ విషయంలోనూ తొలుత 39.49 శాతం పేర్కొనగా.. అంతిమంగా 44.75 శాతంగా తేల్చారు. దీంతో ప్రజలు కొంత అయోమయానికి గురయ్యారు. తుది లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ జరిగిన గురువారం రాత్రి వరకు హైదరాబాద్‌లో 39.49శాతం, సికింద్రాబాద్‌లో 44.99శాతం పోలింగ్‌తో వెరసీ జిల్లాలో 42.24శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే తుది లెక్కల అనంతరం హైదరాబాద్‌లో 44.75శాతం, సికింద్రాబాద్‌లో 46.26శాతం పోలింగ్ జరగడంతో జిల్లాలో మొత్తం 45.51శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ♦ హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 19,57,772 మంది ఓటర్లుండగా... 8,76,078 మంది ఓటు వేశారు. వీరిలో 4,77,929 మంది పురుషులు, 3,98,145 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. ♦ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 19,68,147 మంది ఓటర్లుండగా... 9,10,437 మంది ఓటు వేశారు. వీరిలో 4,85,913 మంది పురుషులు, 4,24,520 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. ♦ మల్కాజిగిరిలో మొత్తం ఓటర్లు 31,49,710 మంది ఉండగా... 15,60,108 ఓటు వేశారు. వీరిలో 8,22,098 మంది పురుషులు, 7,37,975 మంది మహిళలు, ఇతరులు 35 మంది ఉన్నారు. ♦ హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 53.51శాతం పోలింగ్ నమోదు కాగా...అత్యల్పంగా మలక్‌పేట సెగ్మెంట్లో37.40 శాతం నమోదైంది. ♦ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 52.70 శాతం పోలింగ్ నమోదవగా... అత్యల్పంగా నాంపల్లిలో 38.77శాతం పోలింగ్ జరిగింది. ♦ మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 56.58 శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యల్పంగా ఎల్బీనగర్లో 44.49 శాతం నమోదైంది. ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో (హైదరాబాద్, సికింద్రాబాద్ రెండూ కలిపి) సగటున 45.51 శాతం పోలింగ్ నమోదైంది. ♦ ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు 39,25,919 మంది ఉండగా... 17,86,515 మంది ఓటు వేశారు. వీరిలో 9,63,842 మంది పురుషులు, 8,22,665 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. హైదరాబాద్ లోక్‌సభ మొత్తం ఓటర్లు: 19,57,772 పోలైన ఓట్లు: 8,76,078 పోలింగ్ శాతం: 44.75 సికింద్రాబాద్ లోక్‌సభ మొత్తం ఓటర్లు: 19,68,147 పోలైన ఓట్లు: 9,10,437 పోలింగ్ శాతం: 46.26 మల్కాజిగిరి లోక్‌సభ మొత్తం ఓటర్లు: 31,49,710 పోలైన ఓట్లు: 15,60,108 పోలింగ్ శాతం: 49.40 -
79.64 శాతం ఓటింగ్
సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 78.41 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా.. గురువారం నాటి ఎన్నికల్లో 79.64 శాతం మేరకు ఓట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకుగాను 2.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశంజిల్లాలో 85.98 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి 89.82 శాతంతో అత్యధిక ఓటింగ్ జరిగిన నియోజకవర్గంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట 89.64 శాతం, ప్రకాశం జిల్లా దర్శి 89.62 శాతం ఓట్ల పోలింగ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
నిజామాబాద్‌లో 68 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పోలింగ్ సజావుగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 68.10 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 15,52,838 మంది ఓటర్లకు గాను 10,57,483 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్‌పోలింగ్ ప్రక్రియను చేపట్టిన అధికారులు, 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. 185 మంది అభ్యర్థులు ఉండటంతో మాక్‌పోలింగ్‌కు అధిక సమయం పట్టింది. పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో తొలి గంట సమయం.. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 3.60 శాతమే పోలింగ్ నమోదైంది. 11 గంటల వరకు 13.80 శాతానికి చేరుకున్న పోలింగ్ తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.10 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఎండ కారణంగా రెండు గంటల పాటు పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయా యి. మధ్యాహ్నం 3 గంటల వరకు 45.29 శాతాని కి పెరిగింది. మళ్లీ సాయంత్రం 4 తర్వాత పోలింగ్ పుంజుకుంది. 5 గంటల వరకు 54.20 శాతానికి చేరుకుంది. బాల్కొండ నియోజకవర్గం వడ్యాట్, సుంకెట్, నల్లూరు, కొడిచర్ల, హాసకొత్తూరు, జక్రాన్‌పల్లి మండలం పడకల్ 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. బోధన్ మండలం చెక్కి క్యాంపులో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ కార్తికేయ పరిశీలించారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పోలింగ్ సజావు గా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రత్యేకంగా ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించి పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు అధికారులు నిర్విరామంగా పనిచేశారు. కొందరు అధికారులు, సిబ్బంది రాత్రీపగలు తేడా లేకుండా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు పోలింగ్ కేంద్రాలకు తరలింపు., అదనపు పోలింగ్ సిబ్బంది.. ఇలా అన్ని రకాలుగా అదనపు ఏర్పాట్లు చేయాల్సి రావడంతో అధికారులు నిర్విరామంగా పనిచేయాల్సి వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ జరిగింది. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు.. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్టాం గ్రూంలకు తరలించారు. డిచ్పల్లి మండలం సు ద్దపల్లిలోని సీఎంసీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంల లెక్కింపు ఈ సీఎంసీలో నిర్వహించాలని ని ర్ణయించారు. మిగిలిన కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్లను జగిత్యాలలో లెక్కించనున్నారు. ఓట్లేసిన అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ కుటుంబసభ్యుల తో కలిసి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత తన కుటుంబసభ్యులతో కలిసి నవీపేట్ మండలం పోతంగల్లో ఓటు వేశారు. బీజేపీ అ భ్యర్థి ధర్మపురి అర్వింద్ తన సతీమణి ప్రియాంక తో కలిసి నగరంలోని కాకతీయ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ గంగాస్థాన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. వేల్పూర్ మండ ల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సతీమణితో కలిసి వచ్చి ఓటేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు.. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల సంఘం చరిత్రలోనే తొలిసారిగా ఎం–3 ఈవీ ఎంలతో పోలింగ్ నిర్వహించారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఇంజనీర్లు వాటిని సరిచేసి, పోలింగ్‌ను ప్రారంభించారు. భీంగల్ మండలం పల్లికొండ, బోధన్ మండలం సాలూర, నవీపేట్ మండలం పోతంగల్, ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి, ఆర్మూర్ మండలం పెర్కిట్, మోర్తాడ్ మండలం వడ్యాడ్, నందిపేట్, మెండోరా, ఇందల్వాయి, ధర్పల్లి, భీంగల్ మండల కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బోధన్ పట్టణంలోని నాలుగు పోలింగ్ కేంద్రాలు, సిరికొండ మండలం చీమన్‌పల్లి, రావుట్లలో, నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్‌లో, నందిపేట్ మండలం వెల్మల్, కుద్వాన్పూర్లలోనూ ఈవీఎంల మొరాయింపు కారణంగా కాస్త ఆలస్యంగా పోలింగ్ షురువైంది. మోపాల్ మండలం సిర్పూర్లో, మెండోరా మండలంలో వెల్గటూరు, డిచ్పల్లి మండలం సాంపల్లిలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే ఇంజనీర్లు సరిచేశారు. హాసకొత్తూర్‌లో 75మంది పోలింగ్ ఏజెంట్లు 175 మంది రైతులు బరిలో ఉండగా, పలు పోలిం గ్ కేంద్రాల్లో ఈ అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ పోలింగ్‌బూత్‌లో 75 మంది ఏజెంట్లు పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా రైతులు ఉన్నారు. ఇదే గ్రామంలో మరో బూత్‌లో 35 మంది ఏజెంట్లు ఉన్నారు. అధిక సంఖ్యలో ఏజెంట్లు ఉండటంతో ఇక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌బూత్ బయట టెంట్లు, కుర్చీలు వేసి అందులో కూర్చోబెట్టారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. బాల్కొండ, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని పోలింగ్ బూతుల్లోనే రైతు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. బెట్టు చేసిన చెక్కిక్యాంపు వాసులు.. బోధన్ మండలం తమ గ్రామాన్ని బోధన్ మున్సి పాలిటీలో విలీనం చేయవద్దని చెక్కి క్యాంపు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలని మొదట నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరూ పోలింగ్‌కేంద్రానికి రాలేదు. దీంతో పలు పార్టీల అభ్యర్థులు వెళ్లి గ్రామస్తులకు సర్ది చెప్పడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో స్వల్ప లాఠీచార్జి.. నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీచార్జి చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
ఆదిలాబాద్..తగ్గిన పోలింగ్
సాక్షి, ఆదిలాబాద్ : ఓట్ల పండగ ముగిసింది.. తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్‌లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగియగా, ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ముథోల్, ఖానాపూర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నిర్దేశిత సమయానికి పోలింగ్ కేంద్రాల్లో వరుసలో ఉన్నవారిని సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. రాత్రి 8.30 గంటల వరకు కూడా పోలింగ్ శాతం వివరాలు అన్ని నియోజకవర్గాల నుంచి రాలేదు. సాయంత్రం 5గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం 66.76 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. దేశంలో ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా తొలి విడతలో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం మరో 42 రోజులు వేచి చూడాల్సిందే. తగ్గిన పోలింగ్ శాతం.. గత 2014 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోలింగ్ శాతం తగ్గింది. అదే సమయంలో గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతానికంటే ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం తక్కువగా నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 10 శాతం తక్కువ నమోదైంది. ఇక శాసనసభ ఎన్నికలకంటే 13 శాతం తక్కువగా నమోదైంది. పోలింగ్ సరళి.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఉండడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయమే ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సమయంలోనే కేంద్రాల్లో ఓటర్లు వరుస కట్టిన దృశ్యాలు కనిపించాయి. అయితే ఉదయం ఆశించిన స్థాయిలో ఓటర్లు తమ ఓటును వేయలేకపోయారు. 11గంటల వరకు 30 శాతం లోపల పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఎండకు ఓటర్లు బయటకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనబడలేదు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల్లోపు పలువురు ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడంతో కొద్దిగా పోలింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరైతే వరుసలో ఉన్నారో వారిని ఓటేసేందుకు అనుమతించి పోలింగ్ కేంద్రాల గేట్లు మూయించారు. ఓటు వేసిన ప్రముఖులు.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ బజార్హత్నూర్ మండలం జాతర్లలో ఓటు వేశారు. బోథ్ మండలం ఘన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ ఉట్నూర్‌లో సాయంత్రం 4.50 గంటలకు ఓటు వేశారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆయన సహాయకుడితో కలిసివచ్చి ఓటు వేశారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ముథోల్ నియోజకవర్గం దేగాంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప, ఖానాపూర్‌లో రేఖానాయక్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తిర్యాణి మండలం లక్మీపూర్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అధికారుల పరంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివ్యదేవరాజన్ దంపతులు, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, జేసీ సంధ్యారాణి ఆదిలాబాద్‌లో ఓటు వేశారు. నిర్మల్‌లో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ సి.శశిధర్‌రాజు, కుమురంభీం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి ఓటు వేశారు. ఆదిలాబాద్‌కు ఈవీఎంలు.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను పోలింగ్ అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించి స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తున్నారు. రాత్రి వరకు కొన్ని నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు చేరుకున్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి అర్ధరాత్రి వరకు ఈవీఎంలు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరుస్తున్నారు. మే 23న ఫలితాలు వెలవడనున్నాయి. ఎక్కువ రోజుల వ్యవధి ఉండడంతో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత వ్యవస్థను కల్పించారు. డీఎస్పీ స్థాయి అధికారితో భద్రతను పర్యవేక్షించనున్నారు. సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఓటరు ఎటువైపో.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆ సరళిని బట్టి పార్టీలు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల్లో పార్టీల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమై చర్చించారు. ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయోనని వారిలో ఉత్కంఠ ఉంది. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చారు. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గోడం నగేశ్, సోయం బాపూరావులు గిరిజనుల్లోని ఒక తెగకు చెందినవారు కావడంతో ఈ ఓట్లు చీలిపోయి మరో తెగకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ లాభం చేకూర్చవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొందన్న చర్చ సాగుతోంది. మరో పార్టీకి నామమాత్రంగా ఓట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మే 23 వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సిందే. మహిళలే అధికం.. పోలింగ్ సరళిని పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ వందశాతం పోలింగ్ లక్ష్యం పెట్టుకున్నప్పటికీ నెరవేరలేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడల్, మహిళ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళ పోలింగ్ కేంద్రాలతో పాటు జనరల్ పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలే అధికంగా ఓటు వేస్తూ కనిపించారు. -
ఎవరి ఆశలకు గండి..?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరి విజయావకాశాలకు గండికొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్‌కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే పోలింగ్ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కొందరు సెటిటర్లు వారి స్వస్థలాలకు వెళ్లడంతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు వరుస సెలవులు ఉండటంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్ని కలు రావడంతో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్‌సభ ఎన్నికలు రావడంతో.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపలేదని తెలుస్తోంది.ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్ శాతం నమోదైంది. -
ఓట్లు పెరిగాయి.. శాతం పెరిగింది
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్లు పెరిగాయి. దీంతో పోలింగ్ శాతం 85.7 నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికలలో 2,11,396 ఓట్లుకు గాను మ్తొతం 1,70,166 పైగా ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ అధికారి సీ.రేణుక ప్రకటించారు. పోలైన ఓట్లు మొత్తం ఓట్లలో 85.7 శాతంగా నమోదయింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లు పెరగడంతో శాతం పెరిగింది. 2014లో మొత్తం ఓట్లు 2,01,813 ఓట్లుకు గాను 1,67,590 ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో 83 శాతంగా నమోదయింది. రాత్రి 11 గంటల వరకు కూడా రాని ఓట్లు వివరాలు సంతనూతలపాడు మండలం సెక్టార్ 14లో 8 పోలింగ్ స్టేషన్లకు సంబందించిన ఓట్ల వివరాలు గురువారం రాత్రి 11.30 గంటల వరకు కూడా చీమకుర్తి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోలేదు. సంతనూతలపాడులోని తక్కెళ్లపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఘర్షణల కారణంగా ఆయా ప్రాంతాలలోని పీఓల నుంచి ఓట్ల వివరాలను సెక్టార్ ఆఫీసర్ స్వరూపకు అందని కారణంగా వివరాలను అందించలేకపోయారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు దాదాపు 5 వేల ఓట్లు ఉండొచ్చని రెవెన్యూ అధికారులు అంచనా వేసి మొత్తం ఓట్లును లెక్కగట్టి 85.7 శాతం పోలై ఉండొచ్చని అంచనా వేశారు. -
తూర్పున శివమెత్తిన ఓటర్లు
సాక్షి, కాకినాడ : పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు గురువారం జరిగాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి జిల్లాలో మొత్తం 74.21 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడువు ముగిసిన తరువాత కూడా జిల్లాలోని 240 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని, ఇది కూడా పూర్తయితే జిల్లాలో మొత్తం ఓటింగ్ 77 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఆ తరువాత నుంచి ఈవీఎంలు సక్రమంగా పని చేయడంతో ఓటింగ్ ప్రక్రియ వేగం అందుకుంది. పెద్దలు, మహిళలతో పాటు యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగులు, వృద్ధులు ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల అధికారులు ప్రత్యేక రవాణా సదుపాయం, వీల్చైర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచీ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల ఆవరణలో షామియానాలు, తాగునీటి సదుపాయాలు కల్పించారు. మొరాయించిన ఈవీఎంలుఈసారి పోలింగ్‌లో ఈవీఎంలతో పాటు కొత్తగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీ ప్యాట్) యంత్రాలను వినియోగించారు. 193 కేంద్రాల్లో ఈవీఎంలు దాదాపు రెండేసి గంటల పాటు మొరాయించాయి. దీంతో అప్పటికే బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి క్యూలో ఉండలేక ఓట్లు వేయకుండా వెనుతిరిగి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో సెక్టార్, రూట్ అధికారులు తక్షణం స్పందించారు. భెల్ ఇంజినీర్లతో ఈవీఎంలకు మరమ్మతులు చేయించి, పోలింగ్ వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు 168వ నంబర్ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఈవీఎం పని చేయలేదు. మండపేట నుంచి తెచ్చిన ఈవీఎం కూడా పని చేయకపోవడంతో మరో ఈవీఎం తెచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జేసీ మల్లికార్జున వచ్చి ఈవీఎం సెట్ చేయించారు. పోలింగ్ శుక్రవారం నిర్వహించాలని ప్రజలు కోరినా అధికారులు అంగీకరించలేదు. దీంతో అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్‌కుమార్‌గాంధీలు సెక్టార్ అధికారుల నుంచి పోలింగ్ వివరాలు తెలుసుకుంటూ, మొరాయించిన యంత్రాలు మళ్లీ పని చేయించేందుకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా కలెక్టర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలను తక్షణం చక్కదిద్దారు. కాకినాడ నగరం, రూరల్ పరిధిలోని దుమ్ములపేట, ఏటిమొగ, జగన్నాథపురం, ఇంద్రపాలెంలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సిబ్బందికి ఇబ్బందులు కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, మరుగు సౌకర్యాలు లేక పోలింగ్ ఎన్నికల సిబ్బంది ఇక్కట్లు పడ్డారు. వారికి అందించిన భోజనాలు, టిఫిన్లు సక్రమంగా లేవన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేవు. వాటిల్లో వాడకానికి నీరు లేకపోవడంతో మహిళా సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. ఓటు వేసిన కలెక్టర్ దంపతులు కాకినాడలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా దంపతులు కాకినాడ శ్రీనగర్‌లోని నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల 22వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఉదయం 9.30 గంటల సమయంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా దంపతులు, కాకినాడ ఆర్డీవో జి.రాజకుమారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ దంపతులు ఓటర్లతో పాటు క్యూలైన్లలో నిలబడి తమవంతు వచ్చే వరకూ నిలబడి ఓటు వేశారు. అదే బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లు కలెక్టర్ దంపతులతో సెల్ఫీలు దిగారు. తొలిసారిగా ఓటు వేసిన తన భార్యను కలెక్టర్ కార్తికేయ మిశ్రా అభినందించారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులకు కలెక్టర్ గౌరవ పూర్వకంగా నమస్కరించి, వారి ప్రజాస్వామ్య స్ఫూర్తి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. అదే సమయానికి అదే బూత్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ఆయన సతీమణి కూడా కలెక్టర్ దంపతులతో పాటు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటు వేసిన 31,19,907 మంది జిల్లాలో 2014 ఎన్నికల్లో 34,17,155 మంది ఓటర్లకుగాను 26,45,470 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పట్లో 77.42 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 42,04,436 ఓటర్లకు గాను రాత్రి 9 గంటల వరకూ ఉన్న సమాచారం మేరకు 31,19,907 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఈసారి 74.21 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కొనసాగుతున్న 240 పోలింగ్ కేంద్రాలను కూడా కలుపుకొంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్ట్రాంగ్‌రూముల్లో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన అనంతరం జిల్లాలోని ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూములకు తరలించినట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. రంగరాయ వైద్య కళాశాల, జేఎన్టీయూకే, జిల్లా క్రీడా మైదానం, నన్నయ యూనివర్సిటీ క్యాంపస్ తదితర ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో వీటిని భద్రపరుస్తామని చెప్పారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గుర్తేడు పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ యంత్రాలను రెండు హెలికాప్టర్లలో కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ పీజీ క్యాంపస్‌కు తరలించామన్నారు. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని, అప్పటివరకూ ఆయా స్ట్రాంగ్ రూములకు సెంట్రల్ రిజర్వు ఫోర్స్ భద్రతలో ఉంటాయని చెప్పారు. -
విజయనగరంలో...ఓటెత్తిన జనం
ఎన్నికల క్రతువులో కీలకమైన పోలింగ్ ఘట్టం గురువారం ముగిసింది. ఓట్లు వేసేందుకు ఉదయం ఏడుగంటలనుంచే జనం బారులు తీరారు. గిరిజన ప్రాంతాలకు చెందిన వారైతే ముందురోజు రాత్రే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్‌కు సన్నద్ధం అయ్యారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినా... అప్పటికప్పుడు వాటిని చక్కదిద్దడంతో పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల అధికార పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు పెచ్చుమీరడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. విజయనగరం గంటస్తంభం: జిల్లాలో పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 76.04 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసేం దుకు ఈ సారి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాక్ పోలింగ్ నుంచి సాయంత్రం వరకు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగుకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్ది పోలింగు జరిపారు. జిల్లా ఎన్నికల అధికారి హరి జవహర్లాల్ వెబ్కాస్టింగు ద్వారా మొత్తం పోలింగు పక్రియను పర్యవేక్షించగా జిల్లా ఎస్పీ దామోదర్ శాం తి భద్రతలను పర్యవేక్షించారు. జిల్లాలో విజయనగరం, అరకు, విశాఖపట్నం పార్లమెంటు స్థానా నికి, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గురువారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5.30గంటలకు అధికారులు మాక్పోలింగు నిర్వహించారు. అనంతరం 7గంటల నుంచి పోలింగు ప్రారంభమై ఓటర్లు ఓటు వేసే అవకాశం కల్పిం చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగు నిర్వహించగా బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోట నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు నిర్వహించారు. ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు పోలింగు కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ఓటు వినియోగంపై అధికారులు చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చినట్టయింది. ఈసారి అన్ని వర్గాల ఓటర్లు వచ్చి ఓటుహక్కు వినియోంచుకున్నారు. గతంలో ఓటింగు కు యువత, వలస ఓటర్లు దూరంగా ఉండేవారు. ఈసారి వారు కూడా తరలిరావడం విశేషం. గతం కంటే తగ్గిన పోలింగ్ జిల్లాలో అధికారులకు సాయంత్రం 6గంటలకు అందిన సమాచారం మేరకు జిల్లాలో 76.04శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నట్లు అంచనా. పోలింగు కేంద్రాల వారీగా పూర్తిగా పోలింగు ముగిసిన తర్వాత పీఓలు ఇచ్చే సమాచారం మేరకు పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం పోలింగు శాతంలో కొంతవరకు మార్పు ఉండవచ్చు. రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం పోలింగు శాతం చూస్తే మాత్రం 2014 సార్వత్రిక ఎన్నికల కంటే తగ్గిందని చెప్పాలి. అప్పట్లో 79.5శాతం నమోదైంది. ఏదైనా పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పోలింగు ప్రక్రియకు పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పలు మార్లు అంతరాయం ఏర్పడింది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు మాక్ పోలింగు సమయంలోనే కొన్ని మొరాయించగా పోలింగు ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురైంది. అధికారిక సమాచారం ప్రకారం మా క్ పోలింగు సమయంలో 9అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 బ్యాలెట్ యూనిట్లు, 38 కంట్రోల్ యూనిట్లు, 71 వీవీ ప్యాట్లు పని చేయకపోవడంతో మార్చారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబం«ధించి 31 బ్యాలెట్ యూనిట్లు, 38 కంట్రోల్ యూనిట్లు, 70 వీవీ ప్యాట్లు మొరాయించడంతో మార్చారు. పోలింగు ప్రారంభమైన తర్వాత 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 51 బ్యాలెట్ యూనిట్లు, 57 కంట్రోల్ యూనిట్లు, 109 వీవీ ప్యాట్లు పని చేయలేదు. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 62 బ్యాలెట్ యూనిట్లు, 63 కంట్రోల్ యూనిట్లు, 108 వీవీ ప్యాట్లు మొరాయించాయి. వీటన్నింటినీ అధికారులు మార్చారు. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డంతో అనేక చోట్ల ఈవీఎంలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలు మొరాయిం చడం వల్ల జిల్లాలో 60కు పైగా పోలింగు కేంద్రాల్లో గంట నుంచి 2గంటల ఆలస్యంగా పోలింగు ప్రారంభమైంది. 100కుపైగా పోలింగు కేంద్రాల్లో పోలింగు నిలిచిపోయింది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగు పక్రియను పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో పోలింగు పక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నుంచి పరిస్థితిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈవీఎంలు మొరాయించిన చోట వాటిని రీప్లేస్ చేయడం, సరి చేయడం వంటి విషయాలపై మార్గదర్శకం చేశారు. అదేవిధంగా ప్రతి గంటగంటకు పోలింగు తీరును పరిశీలిస్తూ పోలింగు శాతం తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మధ్యలో కలెక్టర్ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న చెల్లూరు పోలింగు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌తో కలిసి పరిశీలించారు. పోలింగును పర్యవేక్షించిన నేతలు పార్టీ నాయకులు కూడా పోలింగు తీరును నిరంతరం పర్యవేక్షించికుని ఎప్పటికప్పుడు ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ చీపురుపల్లితోపాటు పలు నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితిని పరిశీలించారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగతా అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల పరిధిలో పోలింగు తీరును తెలుసుకున్నారు. తెలుగుదేశంపార్టీ ఎంపీ అభ్యర్ధి ఆశోక్‌గజపతిరాజు పలు నియోజకవర్గాల్లో పర్యటించగా మిగతా అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో వారు ఉన్నారు. ఓటు వినియోగించుకున్న ప్రముఖులు పోలింగు సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ హరి జవహర్లాల్ దంపతలు, ఎస్పీ దామోదర్ దంపతులు విజయనగరంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతర ముఖ్య అధికారులు కూడా జిల్లా కేంద్రంలోనే ఓటు వేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ముఖ్యనాయకులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎం.ఆర్.కాలేజీలో ఓటు వేయగా మిగతా అభ్యర్ధులు ఎవరి నియోజకవర్గాల్లో వారు వేశారు. ఎస్.కోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గజపతినగరం నియోజకవర్గంలో ఓటు వినియోగించుకున్నారు. తెలుగుదేశం నాయకులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మందకొడిగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ (2019 సార్వత్రిక ఎన్నికలకు సబంధించి) తొలుత మందకొడిగా ప్రారంభమైంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. దీంతో ఓటర్లు అక్కడక్కడ కొంత తడపడ్డారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచి సాయింత్రం వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు పూర్థి స్థాయిలో వసతులు కల్పించలేకపోయారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఇబ్బందిపడ్డారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి సాయంత్రం వచ్చి ఓటు వేశారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఓటర్లు విసిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అధికార పార్టీ ఆగడాలు పలుచోట్లు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని గుర్తించిన చోట ఘర్షణలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఓటింగ్‌కు సహకరించారు. పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం ప్రారంభంలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చినా అక్కడ ఓటింగ్ యంత్రాలు ఇబ్బంది పెట్టడంతో చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. జిల్లాలో సుమారుగా 357 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు ఇరత మిషన్లు సమకూర్చడం జరిగినా, అప్పటికే ఎండలు ప్రారంభం కావడంతో ప్రధానంగా వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు రాలేదు. పది నుంచి మూడు గంటల వరకు తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళి ఇలా.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 11 గంటల వరకు కేవలం 19.78 శాతం మాత్రమే నమోదు అయింది. పది గంటల నుంచి పలుచోట్ల ఈవీఎంలు పనిచేయడంతో ఒంటి గంటకు 37.92 శాతానికి చేరింది. మూడు గంటలకు 52.11 శాతానికి చేరింది. నాలుగు గంటలకు 59.18 శాతం 5 గంటలకు 63.77 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత జిల్లాలో 186 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. రాత్రి ఎనిమిది గంటల వరకు 45 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. -
మహబూబ్‌నగర్ లో 65.30శాతం పోలింగ్
సాక్షి , మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా టెక్నికల్ సిబ్బంది వెంటనే స్పందించి వాటిని సరిచేస్తూ అవసరమైన చోట ఈవీఎంలు మారుస్తూ ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసుశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నా పోలింగ్ కు ఇబ్బంది లేకుండా వ్యవహరించారు. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో 7.95 శాతం, నాగర్‌కర్నూల్ పరిధిలో 12.49 శాతం పోలింగ్ తగ్గింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు రెండు లోక్‌సభ స్థానాల్లోనూ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరచలేదు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోత తట్టుకోలేక చాలామంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి సమస్యలను ఎప్పటికప్పుడు అదిగమించారు. మహబూబ్‌నగర్‌లో 1,871, నాగర్‌కర్నూల్‌లో 1,936 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ల ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పరిశీలించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7,53,935 మంది మహిళా ఓటర్లు ఉండగా 4,89, 453 మంది ఓటేశారు. అలాగే 7,51,216 మంది పురుషుల్లో 4,93,435 మంది ఓటేశారు. బహిష్కరణల పర్వం ఒక్క జడ్చర్ల మండలంలోనే ప్రజలు మూడు చోట్ల ఎన్నికలు బహిష్కరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు తమకు సరైన పరిహారం ఇవ్వలేదని, ఇచ్చే పరిహారం రూ.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలను బహిష్కరించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. మహబూబ్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటంతో 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అదే మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ సునితలు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్పీ రెమా రాజేశ్వరి అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రానికి అడ్డుగా కూర్చోవటం చట్టరిత్యా నేరమని, సమస్యలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని మహిళలకు సముదాయించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించటంతో ధర్నా విరమించారు. దీంతో బూరెడ్డిపల్లిలో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని, తమ సమస్యలను ఎవరు పట్టించుకోవటం లేదంటూ జడ్చర్ల మండల కేంద్రం బాదేపల్లి గంజ్ పోలింగ్ కేంద్రంలో బుడగజంగం కులస్తులు ఎన్నికను బహిష్కరించి పోలింగ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడారు. దీంతో అక్కడ గంటసేపు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటి స్ధానంలో ఇతర ఈవీఎంలు అమర్చారు. దీంతో పలు చోట్లా పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. -
పశ్చిమ గోదావది జిల్లాలో పోలింగ్ 70.59%
సాక్షి, ఏలూరు : జిల్లాలో ఫ్యాన్ హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ దాడులకు తెగబడినా, ప్రలోభాలకు తెరలేపినా ప్రజల చైతన్యం జిల్లాలో ఫ్యాన్‌కు ఓటేశాలా చేసింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, దోపిడీ, దౌర్జన్యాలను నిరసిస్తూ ప్రజలు కసితో ఓటు వేశారు. జిల్లా వ్యాప్తంగా 3417 పోలింగ్ కేంద్రాల్లో 11074 ఓటింగ్ యంత్రాలు, 8842 వీవీ ప్యాట్లు ఉపయోగించారు. అయితే సమారు 400 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించి గంట, రెండు గంటల అనంతరం తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు 8శాతం ఓటింగ్ నమోదయితే సాయంత్రం 5 గంటలకు 67.28శాతం ఓటింగ్ నమోదయ్యింది. రాత్రి 9 గంటల సమయానికి అందిన సమాచారం మేరకు 70.59 శాతం పోలింగ్ నమోదైంది. గతంకంటే తక్కువ గత సార్వత్రిక ఎన్నికలలో 84శాతం పోలింగ్ నమోదయితే ఈ సారి ఎన్నికల్లో 70.59 శాతం రాత్రి 9 గంటల వరకూ అందిన సమాచారం మేరకు నమోదైంది. అయితే ఇది మరింత పెరిగినా 80 శాతం లోపే పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గత సార్వత్రిక ఎన్నికలకంటే తక్కువగానే పోలింగ్ శాతం నమోదయ్యినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జిల్లా అధికారులు పోలింగ్‌శాతాన్ని 90శాతం కంటే ఎక్కువగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా వ్యాప్తంగా 32,18,407 ఓటర్లు ఉంటే 22,72,032 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పనిచేయని ‘మైక్యూ’యాప్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన మైఓట్‌క్యూ యాప్ ఆశించిన మేరకు జిల్లా ప్రజలకు ఉపయోగపడలేదు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు “మైఓట్‌క్యూ’ యాప్ ద్వారా తమ పోలింగ్ స్టేషన్లో ఓటర్ల బారులు ఏవిధంగా ఉన్నాయో పరిశీలించేందుకు ప్రయత్నించారు. కానీ ఏ విధంగానూ ఈ యాప్ పనిచేయలేదు. మైఓట్‌క్యూ యాప్ ప్రారంభిస్తే కనీసం సిగ్నల్ లేదనీ, ఓటరు లైన్ ప్రిపేర్ కాలేదనే సమాధానమే కనిపించింది తప్ప ఏ విధంగానూ క్యూ పరిస్థితి ఓటరుకు తెలీలేదు. ఉదయం పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో చాలా దూరం వరకు క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికితోడు భానుడు ప్రతాపం చూపడంతో ఓటర్లు ఎండదెబ్బ, ఉక్కబోతకు ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, వికలాంగులు కూడా అవస్ధలు పడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద ఓటర్లకు మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నాలుగైదు నియోజకవర్గాల్లో రాత్రి పదకొండు గంటల వరకూ ఓటింగ్ జరుగుతోంది. అర్ధరాత్రి అయినా ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలో నిలబడ్డారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ మూడోస్థానానికి పరిమితం అయ్యింది. భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య పోటీ నడిచింది. దీంతో జిల్లాలో పలుచోట్ల తెలుగుదేశం నేతలు దాడికి తెగబడ్డారు. నిడదవోలు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు అరాచకం సృషించారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పెన్నాడ గ్రామంలోని 177వ నంబర్‌గల పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రాలు తారుమారయ్యాయి. మొదటి పార్లమెంట్ అభ్యర్థికి చెందిన ఓటింగ్ యంత్రం తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఓటింగ్ యంత్రం బూత్‌లో అమర్చాల్సి ఉంది. ఓటరు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసుకుంటాడు. అయితే 177వ నెంబరు బూత్‌లో ముందు ఎమ్మెల్యే అభ్యర్థికి, తర్వాత ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఓటింగ్ యంత్రాలను అమర్చారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ పోలింగ్ సిబ్బందిగాని, పోలింగ్ ఏజెంట్లుగాని గమనించలేక పోయారు. మాజీ సర్పంచ్ వైఎస్సార్సీపీ నాయకుడు మంతెన సుబ్రహ్మణ్యం రాజు గమనించి ఈ విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ దష్టికి తీసుకువెళ్లారు. ఆయన తప్పయిపోయింది క్షమించండని సమాధానం చెప్పడంతో మాజీ సర్పంచ్ నర్సాపురం ఆర్డీఓకు, ఆర్వోకు, ఎన్నికల అబ్జర్వర్‌కు ఫిర్యాదు చేశారు. రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 112లో ఈవీఎం మొరాయించింది. అవగాహన లేకపోవడంతో వీఆర్ఏ ఈవీఎం బాక్స్‌ని తెరవడంతో అందులో అప్పటి వరకూ వేసిన ఓట్లకు సంబంధించిన డేటా ఎరేజ్ అయ్యింది. సమాచారం తెలియడంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆర్డీఓ చక్రధరరావు. మరొక ఈవీఎం ఏర్పాటు చేయడంతో తిరిగి ప్రారంభం అయ్యింది. అప్పటికే 80 కి పైగా ఓట్లు పోలైనట్లు నిర్దారణకు వచ్చిన అధికారులు పోలైన వీవీప్యాట్ స్లిప్పుల ఆధారంగా కౌంటింగ్ చేస్తామని, ఈవీఎం బాక్సు తెరిచిన వీఆర్ఎను విధుల నుండి తొలగిస్తున్నామని ఆర్డీఓ తెలిపారు. అధికార పార్టీకి చెందిన నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్దంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బౌండరీలను టీడీపీకి చెందిన ద్విచక్ర వాహనదారులు దాటడంతో పాటు పోలీసు, ఇతర సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఏలూరు రూరల్ మండలం మహేశ్వరపురం ఆర్సీఎం భూత్‌లో ఈవీఎం మూడుసార్లు మొరాయించింది. ఫలితంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 3–00 గంటలకు తిరిగి ఈవీఎం పనిచేయడంతో పోలింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగింది. -
ఎన్నికల పండగ చేసుకున్నారు..!
సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. తుది సమాచారం మేరకు సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 68.75 శాతం పోలింగ్ జరిగింది. పలు నియోజక వర్గాల్లో సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో రాత్రి 12 గంటల వరకూ ఓటు వేశారు. మొత్తం మీద 75 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు సిటీలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టు తెలిసింది. మొత్తంగా ఎండల తీవ్రత ఉన్నా.. ఈ దఫా పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్ల పండగ వాతావరణం కనిపించింది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడడంతో అక్కడక్కడ పోలింగ్ మందకొడిగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 2,833 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి నిరీక్షించారు. సుమారు 400 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయకపోవడంతో పోలింగ్ ప్రక్రియ రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి 8 గంటల వరకు ఓటర్లు క్యూలైన్లలోనే ఉన్నారు. నెల్లూరు నగరం, రూరల్, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడం, మరమ్మతులకు గురి కావడంతో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కూడా 7.83 శాతం పోలింగ్ దాటలేదు. 6 కేంద్రాల్లో రీపోలింగ్? పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 6 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ వివరాలు నమోదు చేయకపోవడం, డిలిట్ చేయకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే రెండు రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ శాతం సేకరణలో జాప్యం జిల్లాలో 23,92210 మంది ఓటర్లు ఉన్నారు. 2,833 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రతి రెండు గంటలకు ఒక పర్యాయం పోలింగ్ శాతం వివరాలు ప్రకటించాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు అందజేయాల్సిన పోలింగ్ వివరాలు 11 గంటలు దాటిన ప్రకటించలేదు. రెండు గంటల ఆలస్యంగా పోలింగ్ వివరాలు ప్రకటించారు. పోలింగ్ వివరాలు సేకరించే యాప్ విఫలమైంది. దీంతో రిజర్వ్‌లో ఉండే ఎన్నికల ఉద్యోగులను కలెక్టరేట్‌కు పిలిపించి మాన్యువల్‌గా వివరాలు సేకరించారు. దీంతో పోలింగ్ శాతం సేకరణలో జాప్యం జరిగింది. పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల రాత్రి వరకు ఓటర్లు క్యూలైన్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల విధుల్లో ఉన్న మైక్రో అబ్జర్వర్ (సిండికేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్) జావెద్ పొదలకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది ఆకలితో అలమటించారు. ఆహారం సరిగా లేదని వాసన వస్తుందని దింతో ఇబ్బందులు పడ్డామని నెల్లూరు నగరంలోని ఏసీనగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఆయన భార్య సింధూర ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం దర్గామిట్టలోని సెయింట్‌జోసెఫ్ హైస్కూల్లో కలెక్టర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయుధ బలగాల బందోబస్తులో ఈవీఎంలు కౌంటింగ్ తేదీ వరకు ఈవీఎంల్లో అభ్యర్థుల భవిత నెల్లూరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల పరిధిలో 2,833 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎం మిషన్లలో 42 రోజులు భద్రపరచనున్నాయి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు భారీ భద్రత నడుమ గురువారం అర్ధరాత్రి నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన శాసనసభ, పార్లమెంటు పోలింగ్‌లకు సంబంధించిన ఈవీఎంలతో పాటు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లోని ఎంపీ పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు అధికారులు నెల్లూరు రూరల్ మండల పరిధిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. కౌంటింగ్ రోజు వరకు రెండు స్ట్రాంగ్ రూమ్‌లకు కేంద్ర సాయుధ బలగాలు భద్రత కల్పించనున్నాయి. -
ప్రకాశంలో ఓటెత్తిన జనం
ఊరు వాడా కదిలొచ్చింది. ప్రజా చైతన్యం ఓటెత్తింది. పూటకో మాట, రోజుకో వేషం వేసే వంచన రాజకీయానికి..అవినీతి, అక్రమాలతో జనాన్ని దోచుకుని నిరంకుశ పాలన సాగించిన నేతల దాష్టీకానికి చరమగీతం పాడేందుకు ముందుకొచ్చింది. దగాపడిన బడుగు జీవుల తలరాతను మార్చే నేత కోసం.. మార్పు కోసం.. విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువత ఓపిగ్గా గంటల తరబడి క్యూలలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాక్షి, ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గురువారం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. స్వచ్ఛందంగా ఓటు వేసుకోవడానికి కేంద్రాల వద్ద బారులుతీరారు. ఈవీఎంల ఓటింగ్ సజావుగా సాగింది. అక్కడక్కడా చెరుదుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వినయ్‌చంద్, బాపట్ల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మిలు పోలింగ్ సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. వీరు మధ్యలో కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ టెలికాస్ట్ అనుసంధానం కావడంతో జిల్లా ఎన్నికల అధికారి మీడియా సెంటర్ నుంచి పరిశీలించారు. అక్కడికక్కడే సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోటెత్తిన ఓటర్లు జిల్లాలో మొత్తం 26,32,407 మంది ఓటర్లు ఉన్నారు. 3269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్‌ను ప్రారంభించారు. ఏజెంట్లు, అధికారులు ఉదయం మాక్‌పోలింగ్‌లో పాల్గొన్నారు. సుమారు 300 పోలింగ్ కేంద్రాల్లో మాక్‌పోలింగ్ సమయంలోనే సమస్యలు వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు మరి కొన్ని కేంద్రాల్లో 9 గంటలకు కొలిక్కి వచ్చాయి. ఒంగోలు కేంద్రంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ మూడు గంటల ఆలస్యంగా మొదలైంది. అప్పటి దాకా ఓటర్లు ఓపికగా వేచి ఉన్నారు. జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం - 85.82 శాతం నియోజకవర్గం నమోదైన పోలింగ్ శాతం వై పాలెం 86.4 చీరాల 83.98 మార్కాపురం 85.31 దర్శి 90.54 కొండపి 83.29 పర్చూరు 87.28 గిద్దలూరు 82.22 ఎస్.ఎన్.పాడు 85.7 కనిగిరి 82.51 ఒంగోలు 82.09 కందుకూరు 89.66 అద్దంకి 90.06 మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ మొదలు కావడంతోనే ఈవీఎంలు మొరాయించాయి. జిల్లా వ్యాప్తంగా 154 పోలింగ్ కేంద్రాల్లో ఈ సమస్య వచ్చింది. కొన్ని కేంద్రాల్లో వెంటనే ఈవీఎంలను పునరుద్ధరించారు. ఒంగోలు కేంద్రంలోని బండ్లమిట్ట కేంద్రంలో ఈవీఎంలు పని చేయకపోవడంతో వెంటనే వేరొక ఈవీఎంలను తెప్పించారు. వాటిని అనుసంధానం చేసిన తర్వాత పీవో తడబాటుతో తప్పులు చేయడంతో 138 పోలింగ్ కేంద్రంలో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచింది. ఓటర్లలో అసహనం ఎదురై సిబ్బందిపై తిరగబడ్డారు. పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. జిల్లా వ్యాప్తంగా మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు చాలా చోట్ల మొరాయించాయి. దీంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఒంగోలు రామ్‌నగర్ రెండోలైన్లోని 167 పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. ఇక్కడే ఓటు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి చాలా సేపు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లో నిలుచున్న ఓటర్లు ఈవీఎంలు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యర్రగొండపాలెం పోలింగ్‌బూత్ నెం 59 నర్సాయపాలెంలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. త్రిపురాంతకం పోలింగ్‌బూత్ నెం. 122లోనూ ఇదే పరిస్థితి. గిద్దలూరు నియోజకవర్గంలో దద్దవాడ పోలింగ్ బూత్ నం. 251, 252లలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం గంగపాలెం పోలింగ్ బూత్ నం.51లో రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెం. 204 ఉప్పలపాడులో ఈవీఎంలు పనిచేయలేదు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందకు పైగా పోలింగ్ బూత్‌ల్లో ఉదయం రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. మిగిలిన చోట్ల సైతం ఈవీఎంలు తరుచూ ఆగిపోతూ ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారు. క్రమంగా పెరిగిన ఓటింగ్ శాతం: గత ఎన్నికల్లో 84 శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దానికన్నా ఎక్కువగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ఆలస్యంగా మొదలైనా జిల్లాలో ఓటింగ్ నెమ్మదిగా ఊపందుకుంది. మొదటి రెండు గంటల వ్యవధిలో జిల్లా సరాసరి పోలింగ్ శాతం 9 గంటలకు 7.96గా నమోదైంది. 11 గంటలకు 22 శాతం, ఒంటి గంటలకు 41.48 శాతం, 3 గంటలకు 56.47 శాతం, 5 గంటలకు 63.36 శాతం నమోదైంది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారు పూర్తిగా ఓటేసేవరకు పోలింగ్ కొనసాగింది. మీడియా కేంద్రం నుంచి పర్యవేక్షణ ఒంగోలు ప్రకాశం భవన్‌లోని మీడియా కేంద్రం నుంచి జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌చంద్, బాపట్ల ఆర్వో ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 95 ఫిర్యాదులు హెల్ప్ లైన్, ఫిర్యాదుల విభాగానికి అందాయి. వీటిలో మొదటి రెండు మూడు గంటల వరకు ఈవీఎంల సమస్య, ఆ తర్వాత పోలింగ్ అక్రమాలు, సాయంత్రం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల దురాగతాలపై ఫిర్యాదులు అందాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. మర్రిపూడి మండలం శివరాయునిపేటలో టీడీపీ ఏజెంటు వేము రమేష్‌కు పీవో మాల్యాద్రి పోలింగ్ సమయంలో సహకరిస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి మానిటరింగ్‌లో చూశారు. స్వయంగా ఆయనే గుర్తించినందున పీవోపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక పీవోకు విధులను కేటాయించారు. వైఎస్సార్ సీపీదే విజయం మీడియాతో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈవీఎం రాజకీయాన్ని చేయాలన్న కుట్రతో ఉన్నారని అన్నారు. ప్రజలు సైకిల్‌కు ఓటు వేస్తుంటే టెక్నికల్‌గా ఫ్యాను గుర్తుకు పడ్తున్నాయని చెప్పడం ఆయన అవివేకమని అన్నారు. వైఎస్సార్ సీపీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. జిల్లాలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపు సాధిస్తారని అన్నారు. ముగిసిన పోలింగ్ పర్వం ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం సజావుగా ముగిసింది. సాయంత్రం 6గంటలకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతించారు. గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 84.25 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు దాదాపు ఒకటిన్నర లక్ష మంది పెరిగారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లు కొన్నిచోట్ల రాత్రి 11 గంటల తరువాత కూడా ఓటు వేశారు. మొత్తం పోలింగ్ ముగిసే సరికి 85.82 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా అధికారులు వెల్లడించారు. సరైన శిక్షణ లేకనే.. పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన అంశాలపై సరైన శిక్షణ లేనందు వల్ల సిబ్బంది తడబడ్డారు. పీవోలు ఓటర్ల సహనాన్ని పరీక్షించారు. ఉదయం ఏడు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు వచ్చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ పూర్తి కాకపోవడంతో ఓటర్లు గంటల కొద్ది నిల్చుండిపోయారు. పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేక మాక్‌పోలింగ్ చేసిన తర్వాత ఈవీఎం ఫార్మెట్లను ఒక సారికి బదులు రెండు పర్యాయాలు, ఇలా పలురకాల తప్పులు చేయడం వల్ల తిరిగి సీలు వేసిన ఈవీఎంలకు సీలు తొలగించి మొదటి నుంచి ఈవీఎంను సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలింగ్ రెండు నుంచి మూడు గంటల ఆలస్యంగా మొదలైంది ఓటు హక్కు ఉపయోగించుకున్న అభ్యర్థులు ♦ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి బాలినేని శచీదేవి, తనయుడు బాలినేని ప్రణీత్రెడ్డిలతో కలిసి లాయరుపేట వద్ద ఉన్న ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలో తమ ఓటు వేశారు. ♦ ఒంగోలు వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుటుంబ సభ్యులతో రాంనగర్ రెండో లైనులోని మున్సిపల్ హైస్కూలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గద్దలగుంట పోలేరమ్మ దేవస్థానం వీధిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ♦ తెలుగుదేశం అభ్యర్ధి శిద్దా రాఘవరావు తన కుటుంబ సభ్యులతో ఒంగోలు ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాల పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఒంగోలు రాంనగర్ హైస్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ♦ జనసేన పార్లమెంట్ అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబా కంభం మండలం తురిమెళ్లలో ఓటు వేశారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి రియాజ్ ఒంగోలులో ఓటు వేశారు. ♦ కలెక్టర్ వినయ్‌చంద్ డీఆర్ఆర్ఎం పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేసీ ఎస్.నాగలక్ష్మి ఈ కేంద్రంలోనే ఓటు వేశారు. -
ఓటెత్తని గ్రేటర్ సీన్ రిపీట్
సాక్షి, సిటీబ్యూరో: ప్చ్ మళ్లీ అంతే... సీన్ రిపీట్ అయింది.గ్రేటర్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. గతఎన్నికలతో పోలిస్తే మరింత పడిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల.. నాలుగు నియోజకవర్గాల్లోనూ గురువారం జరిగిన లోక్‌సభఎన్నికల్లో గతం కంటే తక్కువ స్థాయిలో పోలింగ్‌నమోదైంది. హైదరాబాద్‌లో 39.49 శాతం,సికింద్రాబాద్‌లో44.99 శాతం, మల్కాజిగిరిలో 49.21 శాతం, చేవెళ్లలో 54.83 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో హైదరాబాద్ లోక్‌సభనియోజకవర్గం ఉండడం గమనార్హం. గ్రేటర్లో గతఎన్నికల్లోనూ తక్కువ పోలింగ్ నమోదు కావడంతో ఈసారి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఓటింగ్‌పై విస్తృతంగా ప్రచారం చేశారు. అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలుకల్పించారు. అయినా నగరవాసుల్లో మార్పు రాలేదు. సిటీజనులు పోలింగ్‌పై ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోనే హైదరాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. గురువారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా చెప్పుకోదగ్గ రద్దీ కనిపించలేదు. ఉదయం 11గంటల లోపు ఆయా పోలింగ్ బూత్‌లలో సందడి కనిపించినప్పటికీ ఆ తర్వాత కనిపించలేదు. తిరిగి పోలింగ్ ముగిసే గంటన్నర ముందు మళ్లీ సందడి నెలకొంది. ♦ హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఉదయం 9గంటల వరకు 6.34 శాతం, 11గంటల వరకు 12.12 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 20.59 శాతం, 3గంటల వరకు 27.79 శాతం నమోదైంది. సాయ ంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసే నాటికి 39.49 శాతానికి పరిమితమైంది. ♦ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉదయం 9గంటల వరకు 6.50 శాతం, 11గంటల వరకు 12.12 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 23.85 శాతం, 3గంటల వరకు 30.20 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసే నాటికి 44.99 శాతానికి పరిమితమైంది. ♦ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 6.71 శాతం, 11 గంటల వరకు 15.77 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 27.07 శాతం, 3గంటల వరకు 33.39 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 42.75 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే నాటికి 49.21 శాతానికి పరిమితమైంది. ♦ చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు 9.08 శాతం, 11గంటల వరకు 21.02 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 29.69 శాతం, 3గంటల వరకు 45.06 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 54.83 శాతానికి పరిమితమైంది. హైదరాబాద్ జిల్లాలో ఇలా... హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలుండే హైదరాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 48.89 శాతం నమోదు కాగా... ఈసారి మరింత దిగజారి 42.24 శాతానికి పరిమితమైంది. అంటే అప్పటితో పోలిస్తే 6.65శాతం పోలింగ్ తగ్గింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇంత తక్కువ పోలింగ్ నమోదు కావడం ఇదే ప్రథమమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసినా, మొబైల్ వాహనాల్లో ప్రచారం చేసినా, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినా పోలింగ్ శాతం మాత్రం పెరగలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఓటర్లు పెరిగినప్పటికీ... పాత జాబితాలో డూప్లికేట్ ఓట్లను తొలగించడంతో పెరిగిన ఓటర్ల ప్రభావం కూడా కనిపించలేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో చాలామంది అక్కడికి తరలివెళ్లారు. ఇది పోలింగ్‌పై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీలు తమవంతుగా అవగాహన కల్పించినప్పటికీ... వివిధ కారణాలతో పోలింగ్ శాతం తగ్గింది. పార్టీ విధానాలు నచ్చితే అభ్యర్థి నచ్చక... అభ్యర్థి నచ్చితే పార్టీ నచ్చని విచిత్ర పరిస్థితి సిటీజనులకు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఓట్లేసేందుకు ఉత్సాహం చూపలేదని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు కలసి రావడంతో నగరం విడిచి వెళ్లినవారూ ఉన్నారు. కొత్త ఓటర్లు పెద్దగా నమోదు కాకపోవడం, చాలామంది ఇతర ప్రాంతాల్లో, స్వగ్రామాల్లో ఓట్లేసేందుకు వెళ్లడం, కొందరు సెలవుగా తప్ప ఓటేద్దామనుకోకపోవవడం తదితర కారణాలతో ఎప్పటిలాగే హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తగ్గింది. బస్తీలే బెటర్... ఎప్పటిలాగే పేదలు, బస్తీల్లోని ప్రజలే పోలింగ్‌కు వచ్చిన వారిలో ఎక్కువగా ఉన్నారు. డూప్లికేట్ ఓట్లను భారీగా తొలగించినప్పటికీ, ఓటరు జాబితాలో ఇంకా డూప్లికేట్ ఓట్లు ఉండటం కూడా పోలింగ్ శాతం పెరగకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. డూపికేట్ ఓట్లు తొలగించే ప్రయత్నాల్లో కొందరివి ఒక్క చోట కూడా ఉంచకుండా పూర్తిగా తీసేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చేవెళ్లలో ఇలా... సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఈసారి పోలింగ్ తగ్గింది. ఇక్కడ 54.83 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 60.51శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం 6శాతం తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల స్పందన చాలా తక్కువగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ రాష్ట్రంలోనూ గురువారం ఎన్నికలు జరగడంతో అక్కడికి వెళ్లారు. ఈ కారణంగా ఇక్కడ పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. అత్యధికంగా చేవెళ్ల శాసనసభ నియోజకవర్గంలో 70.42 శాతం, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 35.52 శాతం పోలింగ్ నమోదైంది. మందకొడిగా.. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు ఇదే వరుస కనిపించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ.. పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓ మోస్తారుగా ఓటర్లు కనిపించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 2:30 గంటల వరకు చాలా పోలింగ్ బూత్‌లు వెలవెలబోయాయి. పోలింగ్ శాతం ఇలా... -
‘దివ్యం’గా ఓటేయొచ్చు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంద శాతం పోలింగ్‌పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందులో భాగంగా దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. పోలింగ్ స్టేషన్లను దివ్యాంగుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతోంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులు సులభతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వారు పోలింగ్ కేంద్రానికి చేరుకుని.. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,386 మంది దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేలా ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మెరుగుపడుతున్న ఓటింగ్ శాతం.. గతంలో వికలాంగులు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉండేవారు. శరీరం సహకరించక, రవాణా సౌకర్యంలేక తదితర కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఇలా కనీసం 50 శాతం దివ్యాంగులు కూడా పోలింగ్ స్టేషన్‌కు వచ్చే పరిస్థితులు లేకపోయేవి. దీన్ని గుర్తించిన ఎన్నికల సంఘం.. వారు ఓటు వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి దీనికి శ్రీకారం చుట్టగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 76 శాతం మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార వర్గాల అంచనా. అంతేగాక గతంలో ఏడు రకాల వికలాంగులు, వ్యక్తుల కోసమే పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, మినహాయింపులు చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 21కి పెంచారు. ఈ జాబితాలోని వారు ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చు అంధత్వం, తక్కువ దృష్టి, వినికిడి లోపం, చలన/శారీకర వైకల్యం, మానసిక వైకల్యం/బుద్ధిమాంధ్యం మానసిక రుగ్మత, యాసిడ్ దాడి బాధితులు, తలసేమియా, హెమోఫిల్ల (రక్తం గడ్డకట్టని స్థితి). మెదడు పక్షవాతం, ఆటిజం, బహుళ వైకల్యం, కుష్టువ్యాధి నయమైనవారు, మరుగుజ్జు, దీర్ఘకాలిక నరాల సమస్య, నరాల బలహీనత, కండరాల క్షీణత, నాడీ వ్యవస్థలో సమస్యలున్నవారు. ప్రత్యేక సదుపాయాలు ఇలా.. పోలింగ్‌బూత్‌ల వరకు దివ్యాంగులను తీసుకొచ్చి.. వారు ఓటు వేసిన తర్వాత తిరిగి వాహనంలో ఇంటికి చేర్చుతారు. ఈ రవాణా సదుపాయం ఉచితమే. ప్రతి పోలింగ్ కేంద్ర వద్ద ట్రైసైకిల్ అందుబాటులో ఉంటుంది. మూగ, చెవిటి ఓటర్లకు సైన్ లాంగ్వేజీ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లోకి సులువుగా రాకపోకలు జరిపేందుకు ర్యాంప్‌లు నిర్మిస్తారు. అంధులకు సహాయంగా పోలింగ్ కేంద్రంలోకి ఒకరిని అనుమతిస్తారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలకు అతి సమీపంలో వాహనాల పార్కింగ్ , గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒకరు చొప్పున వలంటీర్‌ను అందుబాటులో ఉంచుతారు. -
ఉండమ్మా.. బొట్టుపెడుతా
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ‘ఉండమ్మా.. బొట్టుపెడుతా’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలింగ్ జరిగే 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు మించి.. డిసెంబర్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.95శాతం ఓటింగ్ నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. ఈనెల 11న జరిగే పార్లమెం ట్ ఎన్నికల్లో అంతకుమించి ఓటింగ్ శాతం పెంచాలని ఎన్నికల యంత్రాంగం పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ 20 పోలిం గ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిం ది. ప్రధానంగా భువనగిరి వంటి పట్టణ ప్రాం తాల్లో పోలింగ్ శాతం తగ్గడంతో వాటిపై యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 20 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ‘ఉం డమ్మా.. బొట్టుపెడతా..’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమభావన సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓటు వేయాలని కోరుతున్నారు. వేసవి ప్రభావం పడకుండా.. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లాలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. పార్టీల ప్రచారం ఆ స్థాయిలో లేకపోవడంతో పాటు ఎం డ తీవ్రత కూడా ఓటర్లపై ప్రభావం చూపనుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో ఓటింగ్ శాతం తగ్గకుండా ఉండేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో సమభావన సంఘాల సభ్యులతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మానవహారాలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఓటర్లు ఓటు వేయడమే కాకుండా ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తానని శపథం, ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. అలాగే పోలింగ్ రోజున ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని జోరుగా ప్రచారం చేపడుతున్నారు. పోలింగ్ శాతం పెంపు కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెట్రోల్‌బంక్‌లు, ప్రభు త్వ స్థలాల్లో ఓటరు చైతన్యంపై కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేశారు. మార్నింగ్ వాక్, 2 కె, 3 కె రన్లు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు ఓటరు స్లిప్‌లతో పాటు ఓటరు కరదీపికలను అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను జారీ చేశారు. అదే విధంగా దివ్యాంగ ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేసిన అనంతరం తిరిగి ఇంటి వద్దకు చేర్చడానికి వాహనాలను సమకూరుస్తున్నారు. అంతేకాకుండా వీరికి సహాయకులుగా వలంటీర్లను నిమిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ర్యాంప్‌లో ఏర్పాటు చేశారు. -
ఓటింగ్ శాతం ‘పెరిగేనా’..!
సాక్షి, అడ్డాకుల: ఈసారి గ్రామాల్లో పెద్దగా ఎన్నికల సందడి కనిపించడం లేదు. గత శాసనసభ, సర్పంచ్ ఎన్నికల్లో పదిహేను రోజుల పాటు గ్రామాల్లో హడావుడి కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామాల్లో సందడి కరువైంది. వేసవికాలం ఎండల ప్రభావమో...వరుస ఎన్నికల ప్రభావమో కాని గ్రామాల్లో స్తబ్ధత కనిపిస్తోంది. పోలింగ్‌కు ఇంకా వారం రోజులే ఉంది. నియోజకవర్గంలో ఇంకా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టలేదు. ఒకటి రెండు గ్రామాల్లో మినహా ఎక్కడ డోర్ టూ డోర్ ప్రచారం మొదలైంది లేదు. పార్లమెంట్ ఎన్నికలపై గ్రామాల్లో నేతలు పెద్ద ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. జిల్లాలో దేవరకద్రనే టాప్..! నియోజకవర్గంలో 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. 2014 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. 2014లో 71.67శాతం పోలింగ్ నమోదైతే 2018లో 84.6శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. హైదరాబాద్‌లో ఒకటి, రెండు సార్లు అక్కడున్న ఓటర్లతో ‘ఆత్మీయ’ సమావేశాలు ఏర్పాటు చేశాయి. వలస ఓటర్లు ఊర్లకు వచ్చి ఓటు వేసి వెళ్లేలా నేతలు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలోనే ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనడంతో జిల్లాలోనే రికార్డు స్థాయిలో దేవరకద్ర నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 జనవరి 30న సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. అప్పుడు కూడా పోలింగ్ శాతం పెరిగింది. అడ్డాకుల మండలంలో 88శాతం పోలింగ్ నమోదైంది. శాసనసభ ఎన్నికల కంటే కొంత ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. సర్పంచ్ అభ్యర్థులు శక్తి మేర ప్రయత్నం చేసి ఓటింగ్ శాతం పెంచారు. పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 11న జరుగనున్నాయి. దీంతో 11న సెలవు రోజైతే 12వ తేదీ మినహా 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వరుస సెలవులు వచ్చాయి. అందులోనూ పాఠశాలలకు వేసవి సెలవులు తోడు కావడంతో వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉండే ఓటర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొంటారా లేదా అన్నది పార్టీల నేతలను కలవర పెడుతోంది. ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వలస ఓటర్లను అప్పుడు గ్రామాలకు రప్పించుకోవచ్చన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు హక్కుపై చైతన్యం పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్ శాతం పెరిగితే అది దేశానికి శుభసూచకం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు పిలుపునిచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ప్రధాని బుధవారం వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్ రాశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా, బెంగాల్ సీఎం మమత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నాగార్జున, మోహన్‌లాల్ తదితరుల పేర్లు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, దీపికా పదుకొణె తదితరులను ట్యాగ్ చేశారు. మీడియా రంగ ప్రముఖులు వినీత్ జైన్, సంజయ్ గుప్తా, అరుణ్ పూరీలతో పాటు సంస్థలు పీటీఐ, ఏఎన్‌ఐలను జతచేస్తూ ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకమన్నారు. ఓటేయకుంటే ఆ నొప్పి తెలియాలి ‘అధిక ఓటింగ్ శాతంతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అది దేశానికి శుభసూచకం కూడా. పటిష్ట ప్రజాస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. గత కొన్నేళ్లుగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు విలువను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులను కోరుతున్నా. దేశ ప్రగతి పథంలో భాగస్వామి అయ్యేందుకు పౌరుడి ఇష్టాన్ని ఓటు సూచిస్తుంది. పోలింగ్ బూతులకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోని వారికి ఆ బాధ తెలియాలి. భవిష్యత్తులో మీరు కోరుకోని, అవాంఛనీయ పరిస్థితి రావాలని అనుకుంటున్నారా? మీరు ఆ రోజు ఓటేయనందుకే ఈ పరిస్థితి తలెత్తిందని చింతిస్తారా?’ అని మోదీ బ్లాగ్‌లో ప్రశ్నించారు. -
ఓడిపోతున్న ఓటు
హైదరాబాద్: మెట్రో నగరాల్లో ఓటరు చైతన్యం కొడిగడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారు కనీసం తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కూడా బద్దకిస్తున్నారు. నెట్స్‌అవే సంస్థ ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించి ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు చెందిన యువతీయువకుల అభిప్రాయాలను ఆన్లైన్ మాధ్యమం ద్వారా సేకరించింది. ఆ వివరాల్లోకెళ్తే.. 53 శాతమే అత్యధికం.. ఓటు చైతన్యంలో బెంగళూరు ముందంజలో నిలిచింది. ఈ సిటీలో ఓటరు నమోదు, ఐడీ కార్డులను పొందడంతోపాటు క్రమం తప్పకుండా ఓటు వేస్తున్నవారు 53 శాతం మంది ఉన్నారట. మిగతా నగరాలతో పోలిస్తే ఇదే అత్యధికం కావ డం విశేషం. ముంబై, పుణే నగరాలు 52 శాతం ఓటరు చైతన్యంతో రెండోస్థానంలో నిలిచాయి. ఢిల్లీలో 47 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణ రాజధా ని హైదరాబాద్ ఈ విషయంలో మరింత వెనుకబడింది. ఇక్కడ కేవలం 45 శాతం మంది మాత్రమే ఓటుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కారణాలివే.. నగరాల్లో స్థిరపడుతున్నవారంతా వలస వచ్చినవారే కావడంతో ఓటు నమోదుపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. యువతలో 75 శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహనే లేదు. పట్టణాల్లో స్థిరపడినా పుట్టిన గ్రామాల్లోనే ఓటు వేయడానికి 60 శాతం మంది ఆసక్తి చూపడం. ఇక 40 శాతం మంది ఓటర్ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని విశ్వసిస్తున్నారు. ఈసారి తప్పకుండా వేస్తాం.. కనీసం ఈసారైనా ఓటు వేస్తారా? త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారా? అని సర్వే సంస్థ అడిగిన ప్రశ్నలకు 75 శాతం మంది ‘ఈసారి తప్పకుండా వేస్తామ’ని చెప్పారు. మరో 20 శాతం మంది మాత్రం వేయాలనే ఉన్నా కుదరదేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఐదు శాతం మంది మాత్రం తాము ఓటు వేయబోమని కచ్చితంగా తేల్చేశారు. వేసినా పెద్దగా మారేదేమీ లేనప్పుడు ఎందుకు వేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. -
73.2% రికార్డు పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన పూర్తి పోలింగ్ శాతాల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ శనివారం రాత్రి ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 67.7% పోలింగ్ జరిగిందని శుక్రవారం రాత్రి ప్రాథమిక అంచనాలను ప్రకటించారు. కాగా.. 2014 శాసనసభ ఎన్నికల్లో నమోదైన 69.5% పోలింగ్‌తో పోల్చితే ఈసారి ఎన్నికల్లో 3.7% పోలింగ్ పెరిగింది. అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65% నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చార్మినార్‌లో అత్యల్పంగా 40.18% పోలింగ్ జరగ్గా ఆ తర్వాతి స్థానాల్లో 41.24 శాతంతో యాకుత్‌పురా, 42.74 శాతంతో మలక్‌పేట, 44.02 శాతంతో నాంపల్లి, 45.61 శాతంతో జూబ్లీహిల్స్, 46.11 శాతంతో చాంద్రాయణగుట్ట, 49.05 శాతంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే 90.95% పోలింగ్‌తో యాదాద్రి–భువనగిరి జిల్లా తొలిస్థానంలో నిలవగా 48.89% ఓటింగ్‌తో హైదరాబాద్ జిల్లా చివరన నిలిచింది. అత్యల్ప ఓటింగ్ స్థానాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి . 103 స్థానాల్లో పెరిగిన ఓటింగ్ ! 2014 శాసనసభ ఎన్నికలతో పోల్చితే తాజాగా జరిగిన ఎన్నికల్లో 103 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోల్చితే కేవలం 16 స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్ పెరగగా, జీహెచ్ఎంసీతో పాటు ఇతర మరి కొన్ని పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గింది. దేవరకద్ర నియోజకవర్గంలో అత్యధికంగా 99.74% మహిళలు ఓటేసి రికార్డు సృష్టించారు. ఇక్కడ పురుషుల పోలింగ్ శాతం కేవలం 69.32 మాత్రమే కావడం గమనార్హం. మధిరలో పురుషలు అత్యధికంగా 92.54% ఓటేయగా, ఇక్కడి మహిళలు కూడా పురుషులతో పోటాపోటీగా 90.8% ఓట్లు వేయడంతో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గంగా మధిర నిలిచింది. పురుషులతో పోలిస్తే మహిళలు 44 నియోజకవర్గాల్లో అధికసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. 32 స్థానాల్లో పురుషులు 85% ఓటు హక్కు వినియోగించుకోగా, 39 చోట్లలో మహిళలు పోలింగ్ 85% కన్నా అధికంగా జరిగింది. అదేవిధంగా ఇతరులు (ట్రాన్స్జెండర్లు) ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోని కేవలం 55 నియోజకవర్గాల్లో వీరు మాత్రమే ఓటు వేయగా, రెండు చోట్ల వారి ఓట్లు లేవు. మిగిలిన 62 స్థానాల్లో ఓటు నమోదు చేసుకున్నప్పటికీ ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. బహదూర్‌పుర, బోథ్, మానకొండూరు, నియోజకవర్గాల్లో ట్రాన్స్జెండర్లు 100% ఓటు వేయడం గమనార్హం. -
పోలింగ్ శాతంపై ఈసీ అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదయిందని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 శాతం నమోదవగా ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ 72.54 శాతం కాగా.. మహిళల పోలింగ్ 73.88 గా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ శాతం కంటే మహిళల ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా (85.97 శాతం) పోలింగ్ నమోదవగా.. చార్మినార్ నియోజకవర్గంలో అత్యల్పంగా (40.18 శాతం) పోలింగ్ నమోదయిందన్నారు. జిల్లాల వారిగా ఓటింగ్ శాతం ఆదిలాబాద్- 83.37 కరీంనగర్- 78.20 మంచిర్యాల- 78.72 పెద్దపల్లి - 80.58 కామారెడ్డి- 83.05 నిర్మల్ - 81.22 నిజామాబాద్- 76.22 జగిత్యాల- 77.89 రాజన్న సిరిసిల్ల- 80.49 సంగారెడ్డి- 81.94 మెదక్- 88.24 సిద్దిపేట- 84.26 రంగారెడ్డి- 61.29 వికారాబాద్- 76.87 మేడ్చల్, మల్కాజ్గిరి- 55.85 మహబూబ్‌నగర్- 79.42 నాగర్ కర్నూలు- 82.04 వనపర్తి- 81.65 జోగులాంబ- 82.87 నల్గొండ- 86.82 సూర్యాపేట- 86.63 యాదాద్రి భువనగిరి- 90.95 జనగామ- 87.39 మహబూబాబాద్- 89.68 వరంగల్ అర్బన్- 71.18 జయశంకర్ భూపాలపల్లి- 82.31 భద్రాద్రి కొత్తగూడెం- 82.46 ఖమ్మం- 85.99 వరంగల్ గ్రామీణం- 89.68 హైదరాబాద్- 48.89 -
తీర్పు ఎటువైపు?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అంచనాలకు మించి పెరిగిన ఓటింగ్ ఎవరి కొంప ముంచుతుందో తెలియక అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది నియోజకవర్గాల్లో కేవలం మంచిర్యాలలోనే 70 శాతం కన్నా తక్కువ ఓటింగ్ శాతం నమోదు కాగా, బెల్లంపల్లి, చెన్నూరులలో 70 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. మిగతా ఏడు నియోజకవర్గాల్లో సగటున 80 శాతానికన్నా ఎక్కువే ఓట్లు నమోదు కావడంతో అభ్యర్థులకు సైతం ఓటరు తీర్పు అర్థం కావడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో అత్యధికంగా 85.38 శాతం, ఆదిలాబాద్‌లో 81.6 శాతం ఓట్లు నమోదు కావడం కొత్త రికార్డు. నిర్మల్ జిల్లాలో ఏకంగా 80 శాతం పోలింగ్ జరిగింది. పోటెత్తినట్లు ఓటర్లు పోలింగ్‌బూత్‌లకు రావడంతో వారు ఎవరికి అండగా నిలిచారనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటు నిర్మల్‌లో సైతం దాదాపు 80 శాతం ఓట్లు పోలవడం ఫలితాలను ప్రభావితం చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. గిరిజనుల ఓట్లన్నీ పోలరైజేషన్ ఏడాదిన్నర క్రితం నుంచే ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనుల్లోని రెండు వర్గాల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది. స్వయం పాలన కోసం ఆదివాసీలు ఉద్యమించడమే గాక, తమ హక్కులను లంబాడాలు కైవసం చేసుకున్నారని, వారిని ఎస్టీల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో గిరిజనుల్లోని రెండు వర్గాలు తమ తమ వర్గాల నేతలకే మద్ధతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించిన సోయం బాపూరావు, ఆత్రం సక్కు కాంగ్రెస్ అభ్యర్థులుగా బోథ్, ఆసిఫాబాద్ నుంచి పోటీ చేశారు. ఆదివాసీలు ఈ రెండు నియోజకవర్గాల్లో వీరికే మద్ధతు పలికినట్లు ఓటింగ్ సరళిని బట్టి స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా తమ వర్గీయులు పోటీలో ఉన్న చోట పార్టీతో సంబంధం లేకుండా మద్ధతు తెలిపారు. ఖానాపూర్‌లో బీజేపీ అభ్యర్థి సట్ల అశోక్‌కు ఆదివాసీలు అండగా నిలిచారు. ఇక్కడ ప్రధాన పోటీదారులుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి లంబాడా వర్గానికే చెందిన రేఖానాయక్, రాథోడ్ రమేష్ ఉండడంతో లంబాడా ఓట్లతో పాటు గిరిజనేతర ఓట్లు ప్రభావం చూపనున్నాయి. ఓటింగ్ సరళిని బట్టి ఇక్కడ రేఖా నాయక్‌కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనరల్ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, ముథోల్, సిర్పూరులలో ఆదివాసీలు ఎక్కువగానే ఉండగా, వీరి ఓట్లు ఎవరికి పోలయ్యాయనేది అంతుబట్టడం లేదు. మైనారిటీల ప్రాబల్యంతో పెరిగిన బీజేపీ బలం ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్ నియోజకవర్గాలలో మైనారిటీల ప్రాబల్యం నేపథ్యంలో బీజేపీ ఓటు బ్యాంకు కూడా పెరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో సైతం 80 శాతం పోలింగ్ జరిగింది. మైనారిటీలతో పాటు హిందూ భావజాలం గల యువత, ఇతరులు కూడా భారీగానే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆదిలాబాద్, భైంసా పట్టణాల్లో ఈ విభజన స్పష్టంగా కనిపించింది. ఆదిలాబాద్‌లో మైనారిటీలు టీఆర్ఎస్ వెంట ఉండగా, భైంసా, నిర్మల్‌లలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్‌కు కూడా మద్ధతుగా నిలిచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పట్టణాల్లో హిందూ భావజాలం గలవారు బీజేపీకి ఓటేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాగా ఉమ్మడి జిల్లాలో మైనారిటీ ముస్లింల మెజారిటీ ఓట్లు కారుకే పడ్డట్టు స్పష్టమవుతోంది. సింగరేణి కుటుంబాలు ఎటువైపు..? మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే బలమున్న వర్గం సింగరేణీయులది. ఈ నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న కార్మికులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఎక్కువే. మంచిర్యాలకు శ్రీరాంపూర్, నస్పూర్, చెన్నూరుకు మందమర్రి, బెల్లంపల్లికి బెల్లంపల్లి, కాసిపేట, ఆసిఫాబాద్‌కు గోలేటి ప్రాంతాల్లో ఉన్న కార్మిక కుటంబాల ఓట్లు కీలకం. సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపారనేది కూడా అర్థం కావడం లేదు. ఈ నాలుగు ప్రాంతాల్లో టీఆర్ఎస్కు మెజారిటీ సింగరేణి మద్ధతిచ్చినట్లు ట్రెండ్స్ చెపుతున్నాయి. బెల్లంపల్లిలో చిన్నయ్యకు సింగరేణి కార్మికులే తిరిగి ఊపిరి పోయనున్నట్లు తెలుసోంది. బీఎస్పీ నుంచి పోటీ చేసిన గడ్డం వినోద్‌కు సింగరేణి ఓట్లు మైనస్ అయినట్లుగా సమాచారం. మంచిర్యాలలో నస్పూరు, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావుకు కూడా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే ధీమా.. పెరిగిన ఓటింగ్ శాతంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు టీఆర్ఎస్ పాలనలో ఇబ్బంది పడ్డ అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం వల్లనే పోలింగ్ శాతం పెరిగిందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి ప్రభావితమై ఓట్లేస్తే నష్టమని భావించిన యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓటింగ్ రావడంతోనే 80 శాతం పోలింగ్ నమోదైనట్లు టీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. ఎవరి ధీమాలో వారున్నప్పటికీ... 11వ తేదీన ఫలితాలు వెల్లడయ్యేంత వరకు సస్పెన్స్ కొనసాగాల్సిందే. -
మేమింతే.. ఎంత ప్రచారం చేసినా పోలింగ్ అంతంతే
సాక్షి, సిటీబ్యూరో :గ్రేటర్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణ కోసం రెండు నెలల ముందు నుంచే పోలీసులు అమలు చేసిన వ్యూహం ఫలించింది. శుక్రవారం ఎలాంటి చిన్న సంఘటన లేకుండా ఎన్నికలు ముగిశాయి. మరోపక్క మహానగరంలో పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే తగ్గిపోయింది. ఓటు హక్కు ప్రాముఖ్యం గురించి ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా ఓటర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. వరుస సెలవులు రావడంతో పలువురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆన్లైన్ సదుపాయంతో పాటు జాబితాలో పేరు నమోదు చేయించుకునేందుకు ఎన్నో పర్యాయాలు గడువు పెంచినా, పేరు నమోదు చేయించుకోవడంపై చూపిన శ్రద్ధ పోలింగ్‌లో చూపించలేదు. పాతబస్తీలోని పోలింగ్‌పై ‘శుక్రవారం’ ప్రభావం పడింది. ప్రార్థనల నేపథ్యంలో ఇక్కడా తక్కువ శాతమే నమోదైంది. మరోపక్క పలు నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేసేందుకు వచ్చిన వారు జాబితాలో పేరు లేదని తెలిసి ఆగ్రహంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘పోయినసారి ఎన్నికల్లో ఓటు వేశాం.. మరి ఇప్పుడెందుకు పేరు తొలగించార’ని నిలదీశారు. కొన్నిచోట్ల కుటుంబంలో ఒకరి పేరుంటే మరొకరి పేరు కనిపించలేదు. సాధారణ ఓటర్లతో పాటు పలువురు సెలబ్రిటీల ఓట్లు కూడా గల్లంతవడం గమనార్హం. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే శుక్రవారం సాయంత్రం ఆయా పార్టీలు గెలుపు తమదంటే..తమదేనని ప్రకటించాయి. పోలింగ్ శాతం, ఓటింగ్ సరళి మేరకు బూత్‌ల వారీగా ఓట్లను అంచనా వేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, 2014తో పోలిస్తే నగరంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోవడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం చేకూరుతుందన్న అంశం చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, ముషీరాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి స్థానాలపై పూర్తి ధీమాతో ఉంది. కాంగ్రెస్ కూటమి ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మేడ్చల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, కంటోన్మెంట్, ముషీరాబాద్ స్థానాలపై నమ్మకం పెట్టుకుంది. బీజేపీ అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, మల్కాజిగిరి స్థానాల్లో తప్పక గెలుస్తామని లెక్కలు వేస్తోంది. బీజేపీకి అంబర్‌పేట, ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఇక ఎంఐఎం పాతబస్తీలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నా, నాంపల్లి, మలక్‌పేటలో తీవ్రమైన పోటీ తప్పలేదు. ఈసారి తమకు రాజేంద్రనగర్ బోనస్‌గా వస్తుందని భావిస్తున్నా, నాంపల్లి, మలక్‌పేటలో ఏమవుతుందోనన్న ఆందోళన కూడా ఆ పార్టీలో ఉంది. పోలింగ్ శాతం హైదరాబాద్ జిల్లా48.96 శాతం రంగారెడ్డి జిల్లా (గ్రేటర్ పరిధి) 50.81 శాతం మేడ్చల్ జిల్లా 55.75 శాతం గోషామహల్లో అత్యధికం 58.59 శాతం మలక్‌పేట్‌లో అత్యల్పం 40 శాతం కూకట్పల్లి భరత్‌నగర్ 159 బూత్‌లో100 శాతం ఈసీ తుది ప్రకటన మేరకు పోలింగ్ ఇలా.. హైదరాబాద్ జిల్లా నియోజకవర్గం శాతం నాంపల్లి 44.14 యాకుత్‌పురా 41.75 చార్మినార్ 48.94 చాంద్రాయణగుట్ట 47.81 కంటోన్మెంట్ 49.01 బçహదూర్పురా 50.49 గోషామహల్ 58.59 కార్వాన్ 51.37 ముషీరాబాద్ 47.62 సనత్‌నగర్ 52.18 ఖైరతాబాద్ 50.54 జూబ్లిహిల్స్ 45.47 అంబర్పేట్ 52.85 మలక్‌పేట్ 40.00 సికింద్రాబాద్ 53.60 మొత్తం 48.96 మేడ్చల్ జిల్లా నియోజకవర్గం శాతం ఉప్పల్ 51.04 మల్కాజిగిరి 51.68 కుత్బుల్లాపూర్ 55.77 కూకట్పల్లి 57.72 మేడ్చల్ 62.56 మొత్తం 55.75 రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం శాతం శేరిలింగంపల్లి 48.00 ఎల్బీనగర్ 42.00 మహేశ్వరం 48.05 రాజేంద్రనగర్ 53.50 ఇబ్రహీంపట్నం 62.51 మొత్తం 50.81 -
పోలింగ్ పెరగాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేలా చర్యలు తీసు కోవాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదేశించారు. నియోజక వర్గాల్లో ఎక్కువ మంది ఓటు వేసేలా పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమన్వయం చేసు కోవాలని సూచించారు. ఓటింగ్ శాతం పెరి గితే టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు పెరుగు తాయని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోలింగ్ ముందు రోజు సరళిపై సేకరించిన సమాచారాన్ని పరిశీలించారు. ఈ నివేదికల ఆధారంగా అభ్యర్థులకు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా ఓటింగ్‌లో పాల్గొనేలా గ్రామస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఓటింగ్‌లో పాల్గొంటే గెలుపు సునాయాసం అవుతుందని చెప్పారు. పోలింగ్ శాతం ఎంత పెరిగితే టీఆర్ఎస్కు అంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందరు అభ్యర్థులు పోలింగ్ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు, ద్వితీయశ్రేణి నేతల నుంచి వచ్చే సమాచారంపై ఎప్పటికప్పడు స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో పోలింగ్ ఊహించినట్లుగానే ఉంటుందని... పట్టణాలు, నగరాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించేలా అభ్యర్థులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రచారం పూర్తి చేసిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. కాగా పోలింగ్ పరిస్థితులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. అభ్యర్థులతో ఈ బృందం ఎప్పటికప్పుడు సమన్వయం చేయనుంది. -
హైటెక్ బాబూ.. ఓటే జవాబు
సాక్షి,సిటీబ్యూరో: అక్షరాస్యత.. చైతన్యం అధికంగా ఉండే మహానగరంలోని ప్రజలు ఓటు వేసేందుకు వెనుకే ఉంటున్నట్టు గత అనుభవాలు చెబుతున్నాయి. కారణమేదైనా గానీ గతంలో పలు మార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయి సగటుతో పోలిస్తే పోలింగ్ శాతం గ్రేటర్ పరిధిలో తక్కువగా నమోదవడం పట్ల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లుగా మారిన మెజార్టీ హైటెక్ సిటీజన్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు బల్దియా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరూ ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉండకుండా ఈసారి పరిస్థితిలో సమూలంగా మార్పు తీసుకొచ్చేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక యాప్‌లను సిద్ధం చేశారు. గ్రేటర్లో సుమారు 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపేనని గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బల్దియా ఎన్నికలు నిరూపించాయి. పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర అసంఘటిత రంగాల ఉద్యోగులు,వేతనజీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని సమాజంలో మార్పును తీసుకొచ్చే గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఈ సారి ఓటర్లలో చైతన్యం నింపి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ పలు యాప్‌లను, చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అనుభవ పాఠాలు నేర్చుకోవాల్సిందే గ్రేటర్ పరిధిలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 58 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే.. మహానగరంలో మాత్రం కేవలం 53 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తేలింది. అంటే రాష్ట్ర స్థాయి సగటు కంటే గ్రేటర్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో 46 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఓటు హక్కుపై చైతన్యం పెరగాల్సిందే.. ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు నగర వ్యాప్తంగా విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఇటీవల శ్రీకారం చుట్టారు. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. అయితే, ఓటర్లుగా నమోదైన వారు పోలింగ్ జరిగే డిసెంబరు 7న విధిగా తమ ఓటే వేసేలా చూడాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం, కండబలం, ధనబలం వంటి అవలక్షణాలను సమాజం నుంచి పారదోలేందుకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని మెజార్టీ గ్రేటర్ సిటీజన్లు వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఓటర్లలో చైతన్యం నింపే చర్యలివీ.. వాదాయాప్: అంధులు, వృద్ధులు, గర్భిణులు రద్దీగా ఉండే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్‌ను ఈ యాప్ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్ సిబ్బంది సహకరిస్తారు. మై జీహెచ్ఎంసీ యాప్: గ్రేటర్ పరిధిలో ఓటర్లు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా.. తెలుసుకోవడంతో పాటు ఏ పోలింగ్‌బూత్‌లో తాము ఓటుహక్కు వినియోగించుకోవాలి.. ఆ బూత్‌కు తాను ఎలా వెళ్లాలన్న అంశాలు ఈ యాప్‌లో పొందుపరిచారు. నమూనా పోలింగ్ కేంద్రాలు: జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలో.. వీవీప్యాట్ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. సి–విజిల్(సిటిజన్ విజిల్): ఎన్నికల అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఫొటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలుతథ్యం. సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అవసరమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
మెదక్‌లో తగ్గిన పోలింగ్
ఉప ఎన్నిక ప్రశాంతం... 65.74 శాతం పోలింగ్ నమోదు సాధారణ ఎన్నికల్లో పోలైన 77.35 శాతం కంటే 11.4 శాతం తక్కువ అత్యధికంగా నర్సాపూర్‌లో 77%.. తక్కువగా పటాన్చెరులో 52 శాతం ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికలో 67.5% పోలింగ్ సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. సాధారణ ఎన్నికల్లో ఇక్కడ 77.35 శాతం పోలింగ్ నమోదుకాగా... శనివారం జరిగిన ఉప ఎన్నికలో 11.4% తగ్గిపోయి 65.74 శాతమే నమోదైంది. మొత్తంగా మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. రైతులు, మహిళలు, వలస జీవులు దూరంగా ఉండటం వల్లే మెదక్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ పడిపోయినట్లు అధికారుల అంచనా. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 77%, అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 52% పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గటం టీఆర్ఎస్ శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఓటర్లు ఆసక్తి చూపలేదు: భన్వర్‌లాల్ నందిగామ అసెంబ్లీ, మెదక్ ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగి శాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. ఆయన శనివారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, రీ పోలింగ్ ప్రస్తావన కూడా లేదన్నారు. ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశాజనకంగా లేదని, ఇరు ప్రాంతాల్లోని పట్టణ ప్రాంత ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి, నందిగామలో రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 16న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మెదక్ స్థానానికి హైదరాబాద్‌లోని గీతం వర్సిటీలో, నందిగామకు అదే ప్రాంతంలోని కేవీఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓటు వేసిన కేసీఆర్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలో తన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం: బీజేపీ మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే చొప్పున ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
తగ్గిన ఓటింగ్‌తో పార్టీల్లో కలవరం!
సాక్షి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నిక విషయంలో ఓటరు నిరాసక్తత చూపాడు. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే శనివారం జరిగిన ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఎన్నికలో 65.74శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 11 శాతం మేర పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గటంతో రాజకీయపార్టీలను కొంత కలవరపాటుకు గురిచేయగా, అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వందశాతం ఓటింగ్ సాధించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఫలించలేదు. దీంతో ఓటింగ్ తగ్గుదలకు గలకారణాలను వెతికే పనిలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఓటరును పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో ఓటింగ్ శాతం తగ్గి, తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అంచనా వేసే పనిలో ప్రధాన రాజకీయపార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నిమగ్నమయ్యాయి. విజయంపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడం కొంత కలవరపెడుతోంది. ఆ పార్టీకి పట్టు ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలోనూ ఓటింగ్ శాతం 70 శాతం లోపే ఉంది. భారీ మెజార్టీయే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఓటింగ్ శాతం తగ్గటంతో మెజార్టీ తగ్గవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికలో మెదక్ ఎంపీగా పోటీ చేసిన కె.చంద్రశేఖర్‌రావుకు 3.97 లక్షల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఓటింగ్ శాతం తగ్గటంతో ఊహించిన స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఓటింగ్ శాతం తగ్గడంతో తమ విజయావకాశాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నాయి. తమకు అండగా నిలుస్తారనుకున్న సాంప్రదాయ ఓటర్లు, ఎస్సీ,ఎస్టీలు ఓటింగ్‌లో ఎంత మేర పాల్గొన్నారో అంచనా వేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మరోవైపు బీజేపీ సైతం ఓటింగ్ సరళిని విశ్లేషించే పనిలో ఉంది. ఓటింగ్ శాతం తగ్గుదల ప్రభావం తమపై ఎలా ఉంటుందోనని బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం. ఏడు నియోజకవర్గాల్లోనూ అదే తీరు... మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం తగ్గింది. గత ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్చెరు, నర్సాపూర్ నియోజవకర్గాల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా శనివారం నాటి ఉప ఎన్నికల్లో 65.74శాతం నమోదైంది. ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నర్సాపూర్‌లో అత్యధికంగా 77 శాతం పోలింగ్ కాగా పటాన్చెరు నియోజకవర్గంలో 52 శాతం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం నమోదు ఇలా ఉంది. -
సీమాంధ్ర పోలింగ్‌పై ఆసక్తి
వార్ వన్ సైడే.. గంట గంటకూ ఓటింగ్ శాతంపై వాకబు ‘విభజన’ నేపథ్యంలో కాంగ్రెస్ దుస్థితిపై ఆరా ‘ఫ్యాన్’ హవా వల్లే ఓటింగ్ పెరిగిందని అంచనా టీడీపీ నేతలు అధిక శాతం ఇటు వైపే మొగ్గు! వైఎస్ఆర్ సీపీ నాయకుల్లో ఉత్సాహం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న జగన్ అభిమానులు తాడిపత్రి, హిందూపురంపై ప్రత్యేక ఆసక్తి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సీమాంధ్రలో బుధవారం నాటి పోలింగ్‌పై నగరంలో ప్రవాసాంధ్రులు, నివాసాంధ్రులు, కన్నడిగులు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. గంట గంటకు ఓటింగ్ శాతం గురించి వాకబు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదవుతుందనే అంశంపై ముందుగానే ఓ అంచనాకొచ్చారు. కాస్త అటు ఇటుగా సుమారు 80 శాతానికి చేరుకుంటుందని మధ్యాహ్నానికే నిర్ణయానికొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజించడంపై సీమాంధ్రులతో పాటు ఇక్కడి ప్రవాసాంధ్రుల నుంచీ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కన్నడిగులూ ఆంధ్రప్రదేశ్‌ను విభజించకూడదనే వాదిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలను ఇక్కడి వారు ఆది నుంచీ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఓటు వేయడానికి చాలా మంది ప్రవాసాంధ్రులు ఇప్పటికే సొంత ఊర్లకు వెళ్లిపోగా, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతరత్రా వ్యాపకాల వల్ల వెళ్ల లేని వారు తరచూ తమ వారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు. ఫలానా గ్రామం వారు ఏ వైపు ఓటు వేశారు, ఫలానా బూత్‌లో ఓటింగ్ సరళి ఎలాగుందంటూ గంట గంటకు సమాచారాన్ని సేకరించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, హిందూపురం శాసనసభ పోలింగ్‌పై ప్రత్యేక ఆసక్తి చూపారు. ఈ స్థానాల్లో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, సినీ నటుడు బాలకృష్ణ బరిలో ఉన్నారు. కాగా, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఏ పార్టీకి అనుకూలిస్తుందనే విషయమై కూడా ఆసక్తికరమైన చర్చ సాగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా సాగుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. జగన్, షర్మిల, విజయమ్మల సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చిన సందర్భాల్లో, వీరంతా ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తే, పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది. సంప్రదాయక తెలుగుదేశం ఓటర్లలో ఎక్కువ మంది ఈసారి వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గారని వారికి సమాచారం అందింది. దీనికి కారణాలను కూడా పలువురు ఆరా తీశారు. పక్కా ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు ప్రధాన కారణాలు కాగా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు కూడా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయని పల్లెల నుంచి ఇక్కడి వారికి వర్తమానం అందింది. వెరసి ఈసారి ఫలితాలు తమ రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా ఉంటాయని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. -
ఇసి ప్రయత్నాలు సీమాంధ్రలోనైనా ఫలించేనా?
మన దేశంలో తెల్లారి లెగిస్తే ప్రభుత్వాన్ని, అధికారులను, వ్యవస్థను తిట్టిపోసేవారే ఎక్కువ. ఎన్నికలు వస్తే అటువంటివారు ఓటు మాత్రం వేయరు. ఓటుతో వ్యవస్థను మార్చవచ్చని తెలిసినా వారు మాత్రం ఓటు వేయడానికి ఆసక్తి చూపరు. ఉద్యోగులు ఓటు వేసేందుకు ప్రభుత్వం సెలవు ప్రకటించినా వారు దానిని ఉపయోగించుకోరు. ఓటు వేసేందుకు ఆసక్తి చూపనివారిలో చదువుకున్నవారే ఎక్కువగా ఉండటం బాధాకరం. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండటంలేదు. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు....అన్న వేమన పద్యాన్ని మన రాజధాని వాసులు బాగా వంటపట్టించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈసీ ఎంత ఊదరగొట్టినా అవి వారి చెవికెక్కలేదు. సెలవు ప్రకటించినా, వాతావరణం చల్లబడినా వారిలో మాత్రం చలనం కలగలేదు. ఫలితంగా పేరుకే విద్యావంతులు కానీ ఆలోచన లేని వారిగా మిగిలిపోయారు. మొన్న హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికలలో కేవలం 53 శాతం ఓటింగ్ నమోదైంది. తెలంగాణ మొత్తంమీద ఇది అతి తక్కువ పోలింగ్ శాతం. చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది హైదరాబాద్ ఓటర్ల పరిస్ధితి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ ఈసీ చేపట్టిన ప్రచారం, చేసిన ప్రయత్నాలు నగర ఓటరును మాత్రం పోలింగ్ కేంద్రాలకు తీసుకురాలేకపోయాయి. పోలింగ్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ సెలవు ప్రకటించింది. వాతావరణం కూడా అనుకూలించింది. అయినా అవేవీ హైదరాబాద్ ఓటరుకు పట్టలేదు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోని ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుంటే, రాజధాని వాసులు మాత్రం వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు. నగర ఓటర్లు నామమాత్రంగానే ఓటింగ్‌లో పాల్గొనడం విచారకరం. రేపు సీమాంధ్రలో జరిగే ఎన్నికలకు కూడా పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తన వంతు ప్రయత్నాలు, ప్రచారం చేస్తూనే ఉంది. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు, బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయడం అలవరుచుకోవలసిన అవసరం ఉంది. పట్టణవాసులు విజ్ఞతతో వ్యవహరించి రేపు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిద్దాం.