
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు.
బెంగాల్‌లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.
పశ్చిమబెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్‌లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు.