కలకత్తా: పశ్చిమ బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్ సురక్షితమా అని బీజేపీ నేతలను ఆమె ప్రశ్నించారు. కూచ్‌బెహార్‌లో శుక్రవారం(ఏప్రిల్ 12) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత మాట్లాడారు. ‘బీజేపీకి ఒక ప్రొపగాండా స్పెషలిస్ట్ ఉన్నాడు.
రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగింది బెంగళూరులో. నిందితులు కర్ణాటకకు చెందిన వారు. బెంగాల్ వాసులు కాదు. వారు పారిపోయి వచ్చి బెంగాల్‌లో దాక్కున్నారంతే. అయినా మేం వారిద్దరినీ కేవలం రెండు గంటల్లోనే పట్టుకున్నాం’అని మమత తెలిపారు.
కాగా, బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను ఎన్‌ఐఏ బెంగాల్‌లో శుక్రవారం అరెస్టు చేసింది. దీంతో బెంగాల్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని బీజేపీ బెంగాల్ కో ఇంఛార్జ్ అమిత్ మాలవీయ, బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పోస్టు చేశారు. ఈ పోస్టులపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదీ చదవండి.. రామేశ్వరం పేలుడు.. ఇద్దరు నిందితుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment