
మన దేశంలోనే లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక జనాభా
మిగతా దేశాల్లో అతి తక్కువ జనాభా
భారత్‌లో 25.7 లక్షల జనాభాకు ఒక లోక్‌సభ సీటు
యుఎస్‌లో 7.3 లక్షల జనాభాకు 1
ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షలే
మిగతా దేశాలతో పోల్చితే మహిళల ప్రాతినిధ్యం భారత్‌లో తక్కువ
ఓటింగ్ శాతం అన్ని దేశాల్లో దాదాపు సమానం
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్ శాతాలను ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది.
భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమెరికాలో 7.3 లక్షలే ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షల జనాభానే ఉందని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది.

అయితే భారత్ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్ శాతంలో త్వరలోనే భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరవచ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్ శాతం జర్మనీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, భారత్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Comments
Please login to add a commentAdd a comment