2014 లోక్‌సభ ఎన్నికల కన్నా 2024లో ఎక్కువ మంది ఓటింగ్
ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్యా పెరుగుదల..
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
సాక్షి, అమరావతి: మహిళలు ఆర్థిక సాధికారత సాధించడం ద్వారా రాజకీయాల్లోనూ తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. గత పదేళ్లలో ఓట్లేసిన మహిళలు పెరగడం.. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల సంఖ్య పెరగడం ఇందుకు నిదర్శనం. ఈ విషయాలను ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 2024 ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు ఓట్లు వేశారని తెలిపింది.
అదేవిధంగా అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కూడా మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లోని మహిళల్లో అత్యధిక మంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై), మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ (ముద్ర) ఖాతాలు కలిగి ఉన్నారని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది.
అందువల్ల వారు ఆర్థిక సాధికారత సాధించారని, దాని ఫలితంగానే రాజకీయాలపైనా అవగాహన పెరిగిందని తెలిపింది. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హరియాణ రాష్ట్రాల్లో 2014 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో ఓట్లు వేసిన మహిళల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment