కేరళ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి 100: 109
మేఘాలయ, మణిపూర్, గోవాలలో 100: 108
మన రాష్ట్రంలోనూ ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 103 మంది మహిళా ఓటర్లు
అతి తక్కువగా గుజరాత్, ఢిల్లీలో 100: 84
దేశవ్యాప్త సగటు మాత్రం 100:95
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా రాష్ట్రాల వారీగా స్త్రీ, పురుష ఓటర్ల వివరాలను ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది.
కేరళ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ప్రతీ 100 మంది పురుష ఓటర్లకు, 109 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మేఘాలయ, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 108 మంది, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతి 100 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 103 మంది ఉన్నారు.
గుజరాత్, ఢిల్లీలలో మాత్రం ప్రతి 100 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు కేవలం 84 మంది మాత్రమే ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అయితే, దేశం మొత్తం మీద చూస్తే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 95 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment