Female voters
-
ఆమే కీలకం
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, గోవా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మహిళలదే ప్రధాన భూమిక అని నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంగా మహిళా ఓటర్లు ఎలా నిర్ణయాత్మకంగా మారుతున్నారనే అంశంపై ఎస్బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుత సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఎన్నికల్లో కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, సిక్కిం రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగి ఫలితాలను నిర్ణయిస్తారని నివేదిక పేర్కొంది. మహిళా ఓటర్లలో చైతన్యం ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో 83 లక్షల మంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని, 2019 ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాని మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 41 లక్షలకు తగ్గిపోయిందని, మహిళలు ఓటింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారనడానికి ఇదే సంకేతమని స్పష్టం చేసింది. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, తద్వారా ఫలితాలు గణనీయంగా మారిపోతాయని అంచనా వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జెండర్ రేషియో పెరుగుతోందని, లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఎన్నికల్లో పురుష, మహిళ ఓటర్ల రేషియో 1:1.02 ఉండగా భవిష్యత్‌లో 1:1.06కు పెరుగుతుందని వెల్లడించింది. గత ఓటింగ్ శాతాలు, మార్పులను విశ్లేíÙంచడం ద్వారా 2024లో పోలింగ్ 68 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 కోట్లు మహిళా ఓటర్లే ఉంటారని, ఇది 49 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ రేటు ప్రకారం 2029 నాటికి పోలింగ్ 73 కోట్లకు చేరుతుందని, ఇందులో 37 కోట్లు మహిళా ఓటర్లు ఉంటారని అంచనా వేసింది. 2047 నాటికి దేశంలో 115 కోట్ల మంది ఓటర్లుగా నమోదు కావచ్చని, ఓటింగ్‌లో 92 కోట్ల మంది పాల్గొంటారని నివేదిక తెలిపింది. 2047లో అత్యధికంగా మహిళా ఓటర్లు 50.6 కోట్ల మంది పాల్గొననుండగా పురుష ఓటర్లు 41.1 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల పోలింగ్ 67.01 శాతం ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ 67.18 శాతం ఉందని పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో అదనంగా 13 కోట్ల మంది మహిళలు ఓటు వేయవచ్చని, ఇది గేమ్ చేంజర్‌గా మారవచ్చని వ్యాఖ్యానించింది. -
ఓట్లు పెరిగాయి మరి సీట్లేవీ?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : తొట్టతొలి ఎన్నికల నుంచి నేటి వరకూ ప్రతి ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. ఓటుహక్కుని వినియోగించుకొంటోన్న స్త్రీల సంఖ్య క్రమేణా పెరుగుతోన్నా, రాజకీయ భాగస్వామ్యం మాత్రం స్త్రీలకు అందనంత దూరంలోనే ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మహిళలకి సీట్ల కేటాయింపులో కొంత పరిణతి కనపడుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా దీదీ మహిళలకు 41 శాతం సీట్లిచ్చి తాను మహిళా పక్షపాతినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. శతాబ్దాలుగా రాజకీయాల్లో మహిళలకు వారి వాటా వారికి దక్కని పరిస్థితుల్లో ఈ రెండు ప్రకటనలూ భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి పునాదిగా నిలవబోతున్నాయి. మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంకాగాంధీ వాద్రా భారత రాజకీయాల్లో బాగా రాణిస్తోన్న నేటి తరుణంలో కూడా క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వానికి ఆమోదం అంతంతగానే ఉంది. ప్రత్యక్షంగా స్త్రీలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్త్రీల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. 1962 నుంచీ దేశంలో స్త్రీల ఓట్ల శాతం మొత్తం ఓట్లలో దాదాపు సగభాగంగా ఉన్నా 47 నుంచి 48 శాతమే పోలవుతున్నాయి. పురుషులకన్నా ఓటుహక్కును వినియోగించుకునే స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. 2014లో పోలైన మొత్తం ఓట్లలో మహిళా ఓటర్లు 65 శాతం ఉన్నారు. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 1967 నుంచి ఇంత అధికసంఖ్యలో మహిళలు ఓటుహక్కుని వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 2014లోనే పురుషుల పోలింగ్ శాతం 67గా ఉంది. జమ్మూ కశ్మీర్లో 2014లో అతి తక్కువగా 48 శాతం మాత్రమే మహిళల ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్, లక్షద్వీప్‌లో అత్యధికంగా 88 శాతం మహిళల ఓట్లు పోలయ్యాయి. పెరుగుతున్న స్త్రీల ఓటింగ్ శాతం ప్రణయ్‌రాయ్, దోరబ్ సుపారీవాలా ఇటీవల విడుదల చేసిన పుస్తకంలో పెరిగిన మహిళల ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. 2017, 18 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ శాంతి సంస్థ కార్నేగీ ఎండోమెంట్ ప్రకారం ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి మహిళల నిర్ణాయకశక్తి, అక్షరాస్యత పెరగడం. భారత ఎన్నికల కమిషన్ సైతం ఎక్కువమంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ప్రత్యేక వరుసలు, ప్రత్యేక పోలింగ్ బూత్‌లు, పింక్ బూత్‌ల పేరుతో సౌకర్యాలు కల్పిస్తోంది. ఓటూ లేదు.. సీట్లూ లేవు.. 2014లో 65 శాతం మహిళల ఓట్లు పోలైనా.. ఇంకా అధికసంఖ్యలో స్త్రీలు ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. 2011 సెన్సెస్ ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి 943 మంది మహిళా ఓటర్లున్నారు. 2019 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకి కేవలం 925 మంది మహిళా ఓటర్లే ఉన్నట్టు తేలింది. ఇదే వివక్ష పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని సైతం ప్రతిబింబిస్తోంది. లోక్‌సభలోని మొత్తం 524 సీట్లలో 66 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో ఎక్కువమంది (32) బీజేపీ నుంచే ఉన్నారు. 1952లో లోక్‌సభలో మహిళల సంఖ్య 22. 2014 ఎన్నికల నాటికి ఇది 61కి పెరిగింది. ప్రతి పది మంది లోక్‌సభ సభ్యుల్లో 9 మంది పురుషులుండటం లింగవివక్షకు నిదర్శనం. ప్రపంచ స్థాయిలో చట్టసభల్లో మహిళల సగటు భాగస్వామ్యం 20 శాతం ఉంది. అయితే మన దేశంలో 1952లో 4.4 శాతం ఉండగా, 2014 నాటికి 11 శాతానికి చేరింది. సీట్ల పంపకంలో జాతీయ రాజకీయ పార్టీలు వివక్షను పాటిస్తూనే ఉన్నాయి. మహిళలు గెలవలేరనే భావంతో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్త్రీలకు సీట్లు కేటాయించడం లేదు. అయితే, మహిళలకు సీట్ల కేటాయింపులో కొంతలో కొంత కాంగ్రెస్ ముందుంది. 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 355 మంది మహిళలు పోటీ చేయగా 45 మందే (కాంగ్రెస్–12, బీజేపీ–10, ఇతరులు– 23 మంది) గెలిచారు. 2009 ఎన్నికల్లో 556 మంది పోటీచేయగా 59 మంది (కాంగ్రెస్–23, బీజేపీ–13, ఇతరులు–23) గెలిచారు. 2014 ఎన్నికల్లో 668 మంది మహిళలు పోటీచేయగా 61 మంది (కాంగ్రెస్–4, బీజేపీ–28, ఇతరులు–29) గెలిచారు. -
నిర్ణయాత్మక శక్తి.. మహిళ
సాక్షి, ఆదిలాబాద్ : రాబోయే ఎన్నికల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఐదింట మహిళలే అధికంగా ఉండగా, మిగతా ఐదు చోట్ల సైతం పురుషుల కన్నా మహిళా ఓటర్లలో తేడా స్వల్పమే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ మహిళా అభ్యర్థుల చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధి, కుటుంబ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మహిళలు ప్రజలకు ఉపయోగపడే అభ్యర్థిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో భర్త అభిప్రాయం ఎలా ఉన్నా, అభ్యర్థి గుణగణాలను పరిగణనలోకి తీసుకొని ఓటేయడంలో భార్య ముందుంటుంది. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు ఈసారి ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 19,26,927 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళా ఓటర్లు 9,69,951 మంది కాగా, పురుషులు 9,56,689, ఇతరులు 287 మంది ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ తుది జాబితా విడుదల చేసింది. 2014 కన్నా 32వేలు తగ్గిన ఓటర్లు సాధారణంగా ఏయేటికాయేడు ఓటర్ల సంఖ్య పెరగాలి. 18 సంవత్సరాల వయస్సు గల వారందరికీ ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పిస్తున్న నేపథ్యంలో 2014 ఎన్నికలకు ఇప్పటికి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగాలి. ఉమ్మడి జిల్లాలో ఓటర్ల సంఖ్య నాలుగున్నరేళ్లలో 32,733 తగ్గింది. 2014 ఎన్నికల్లో 19,59,660 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 19,26,927గా ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 20వేలకు పైగా ఓట్లు తగ్గగా, మంచిర్యాల ఆ తరువాత స్థానంలో ఉంది. ఓటర్ల జాబితా సవరణలతో పెరిగిన ఓటర్లు సెప్టెంబర్‌లో వెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 17,67,165 మంది మాత్రమే. అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే 2,05,174 మంది ఓటర్లు తగ్గారు. అధికార యంత్రాంగం ఇష్టానుసారంగా బోగస్ ఓటర్ల పేరుతో తొలగింపు కార్యక్రమం చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండు నెలల నుంచి రెండుసార్లు ఓటర్ల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆన్లైన్ ఓటరు దరఖాస్తుల విషయంలో శ్రద్ధ చూపడం, ప్రత్యేకంగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టడంతో రెండు నెలల్లో సుమారు లక్షన్నర ఓటర్లు ఉమ్మడి జిల్లాలో పెరిగారు. నిర్మల్‌లో పురుషుల కన్నా 11,607 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. గట్టిపోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో 11వేల ఓట్లు కీలకం కానున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పశ్చిమ జిల్లాలోని ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, ముథోల్‌లలో కూడా పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఈసారి థర్డ్‌జెండర్(ఇతరులు) ఓట్లు 287 నమోదు కాగా, అత్యధికంగా మంచిర్యాల, ఆదిలాబాద్‌లలో వరుసగా 49, 46 ఓట్లు ఉన్నాయి. మరిన్ని వార్తలు... -
మహిళా పోలింగ్ కేంద్రాలివే..
సాక్షి, ఖమ్మంసహకారనగర్: జిల్లాలో మహిళా సిబ్బందితో పోలింగ్ నిర్వహించే కేంద్రాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. తొలుత నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, అనంతరం పరిణామాల్లో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్(ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్), రఘునాథపాలెం ఉండగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా ఖమ్మం రూరల్మండలంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైరా నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా కారేపల్లి మండలం, కొణిజర్ల మండలాల్లోని మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధిర నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా మధిర, ముదిగొండ, చింతకాని మండలాల్లోని ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా సత్తుపల్లి మండలలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళా సిబ్బందితో పని చేసే పోలింగ్ కేంద్రాలు: నియోజకవర్గం పోలింగ్‌బూత్ నం ప్రాంతం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఖమ్మం 207 262 172 కెఎంసీ కెఎంసీ కెఎంసీ 513 662 646 900 765 750 1 - 1 1414 1427 1397 పాలేరు 129 120 105 కొత్త నారాయణపురం పెద్దతండ దానవాయిగూడెంకాలనీ 599 591 608 680 678 659 1 –– 2 1280 1269 1269 మధిర 170 19 63 మధిర లక్ష్మీపురం అనంతసాగర్ 75 517 567 672 613 606 1 –– –– 1248 1130 1173 వైరా 42 131 40 మణిక్యారం తనికెళ్ళ గాంధీనగర్ 620 540 602 588 588 586 –– –– –– 1208 1128 1188 సత్తుపల్లి 197 178 170 గుర్వాయిగూడెం అయ్యగారిపేట అయ్యగారిపేట 734 629 586 758 704 638 1 –– –– 1493 1333 1224 -
నారీమణులే అధికం
సాక్షి, సుపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న నేతల తలరాతలు మార్చడంలో మహిళలు కూడా కీలకపాత్ర పోషించనున్నారు. జిల్లాలో అత్యధికంగా కొత్తగూడెంలో, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు కొత్తగూడెం 2,11,279 1,03,527 1,07,713 39 ఓటర్ల సంఖ్యలో జిల్లాలోమొదటి స్థానంలో ఉంది, పురుషుల కంటే మహిళా ఓటర్లు 4186 మంది ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుషులు మహిళా ఓటర్లు ఇతరులు ఇల్లెందు 1,96,793 97,552 99,230 16 ఓటర్ల సంఖ్యలో జిల్లాలో ద్వితీయస్థానంలో ఉంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1,670 మంది అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు, ఇతరులు పినపాక 1,75,469 87,537 87,923 8 ఓటర్ల సంఖ్యలో జిల్లాలో మూడవ స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 386 మంది మాత్రమే అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు అశ్వారావుపేట 1,43,617 70,463 73,142 12 ఓటర్ల సంఖ్యలో నాల్గవ స్థానంలో ఉంది. పురుష ఓటర్ల కంటే 2,679 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు భద్రాచలం 1,36,726 66,321 70,381 24 ఓటర్ల సంఖ్యలో చివరిస్థానంలో ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 4060 అధికంగా ఉండటం గమనార్హం. 5 నియోజకవర్గాలు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు 4,25,400 4,38,389 పురుష ఓటర్ల కంటే జిల్లాలో 12,989 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వీరి ఓట్లు అభ్యర్థుల జయాపజయాలలో కీలకంగా మారనున్నాయి. -
ప్రజాస్వామ్య పండగలో పదనిసలు
మన దేశంలో జరగబోయే ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు. మన దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 81.5 కోట్లు. ఇది అమెరికా ఓటర్ల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. అమెరికాలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 21.9 కోట్లే. భారతదేశం తరువాత ఎక్కువ ఓటర్లున్న దేశాలు అమెరికా, ఇండోనీసియా, బ్రెజిల్, రష్యా, బంగ్లాదేశ్ లు. ఈ అయిదు దేశాల మొత్తం ఓటర్లు కలిపినా మన దేశంలోని ఓటర్ల కన్నా తక్కువే. ఈ అయిదు దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య 74.9 కోట్లే. *ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 38.8 కోట్లు. పురుష ఓటర్ల సంఖ్య 42.7 కోట్లు. ఆడ, మగ కాక ఇతర క్యాటగరీలో 28,341 మంది ఓటర్లున్నారు. * గత లోకసభ ఎన్నికలు 2009 లో జరిగాయి. అప్పటికీ ఇప్పటికీ దేశంలో 9.7 కోట్ల మంది కొత్త ఓటర్లు వచ్చి చేరారు. ఈ సంఖ్య ఫిలిప్పీన్స్ మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువ. 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 17.3 కోట్లే. అంటే 1952 నుంచి ఇప్పటికి ఓటర్ల సంఖ్య అయిదింతలు అయ్యిందన్నమాట. *ఈ ఎన్నికల్లో తొలిసారి వోటు వేయబోతున్న యువ ఓటర్ల సంఖ్య 2.30 కోట్లు. వీరంతా 18-21 ఏళ్ల వయసున్న వారు. * భారతదేశంలో ఎన్నికలంటే మాటలు కాదు. మొత్తం ఓటర్లలో 96 శాతం మందికి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ బూత్ లు ఏర్పాటయ్యాయి. ఇందులో 17 లక్షల ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు ఏర్పాటవుతాయి. ఎన్నికలను నిర్వహించడానికి 11 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఎన్నికలు నిజంగా ప్రజాస్వామ్యపు పండుగ! -
మహిళా ఓటర్ల శాతం తగ్గింది: భన్వర్‌లాల్
మహిళల ఓటర్ల శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. పురుషుల ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు నాలుగు లక్షలమంది తగ్గినట్టు శనివారం వెల్లడించారు. 19, 18 ఏళ్ల వయసు వారు 38 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డులు తీసుకోలేదని భన్వర్‌లాల్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనవరి 1లోగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తిరస్కరణ ఓటు కూడా ఉంటుందని చెప్పారు. అన్ని పార్టీలు ఉత్తమ అభ్యర్థులనే ఎన్నికల బరిలో నిలపాలని భన్వర్‌లాల్ పేర్కొన్నారు.