మహిళా ఓటర్లు
సాక్షి, సుపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న నేతల తలరాతలు మార్చడంలో మహిళలు కూడా కీలకపాత్ర పోషించనున్నారు. జిల్లాలో అత్యధికంగా కొత్తగూడెంలో, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గం | మొత్తం ఓటర్లు | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు | ఇతరులు |
కొత్తగూడెం | 2,11,279 | 1,03,527 | 1,07,713 | 39 |
ఓటర్ల సంఖ్యలో జిల్లాలోమొదటి స్థానంలో ఉంది, పురుషుల కంటే మహిళా ఓటర్లు 4186 మంది ఎక్కువగా ఉన్నారు.
నియోజకవర్గం | మొత్తం ఓటర్లు | పురుషులు | మహిళా ఓటర్లు | ఇతరులు |
ఇల్లెందు | 1,96,793 | 97,552 | 99,230 | 16 |
ఓటర్ల సంఖ్యలో జిల్లాలో ద్వితీయస్థానంలో ఉంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1,670 మంది అధికంగా ఉన్నారు.
నియోజకవర్గం | మొత్తం ఓటర్లు | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు, | ఇతరులు |
పినపాక | 1,75,469 | 87,537 | 87,923 | 8 |
ఓటర్ల సంఖ్యలో జిల్లాలో మూడవ స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 386 మంది మాత్రమే అధికంగా ఉన్నారు.
నియోజకవర్గం | మొత్తం ఓటర్లు | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు | ఇతరులు |
అశ్వారావుపేట | 1,43,617 | 70,463 | 73,142 | 12 |
ఓటర్ల సంఖ్యలో నాల్గవ స్థానంలో ఉంది. పురుష ఓటర్ల కంటే 2,679 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
నియోజకవర్గం | మొత్తం ఓటర్లు | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు | ఇతరులు |
భద్రాచలం | 1,36,726 | 66,321 | 70,381 | 24 |
ఓటర్ల సంఖ్యలో చివరిస్థానంలో ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 4060 అధికంగా ఉండటం గమనార్హం.
5 నియోజకవర్గాలు | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు |
4,25,400 | 4,38,389 |
- పురుష ఓటర్ల కంటే జిల్లాలో 12,989 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వీరి ఓట్లు అభ్యర్థుల జయాపజయాలలో కీలకంగా మారనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment