SBI Research
-
గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు, కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపార్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్‌లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. -
'వృద్ధి'ల్లుతోంది
సాక్షి, అమరావతి: ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో జనాభా వృద్ధి 15% ఉండగా 2024 అంచనాల మేరకు జనాభా వృద్ధి 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.ఉత్తరాది రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా వృద్ధి 27 శాతం ఉండగా 2024 అంచనాల మేరకు అది 29 శాతానికి పెరిగిందని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఏపీ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా పెరుగుతోందని వెల్లడించింది. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 50 లక్షలు ఉండగా ఇది మొత్తం జనాభాలో 10.1%గా ఉంది. 2024 అంచనాల మేరకు వృద్ధుల జనాభా 70 లక్షలకు పెరిగింది. ఇది మొత్తం జనాభాలో 12.4%గా ఉంది. అంటే 2011–24 నాటికి వృద్ధుల సంఖ్య 2.3% పెరిగింది. 2011 జనాభాతో పోల్చి చూస్తే 2024 అంచనాల మేరకు కేరళలో 16.5 శాతం, తమిళనాడు 13.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 13.1 శాతం, పంజాబ్ 12.6 శాతం వృద్ధులు పెరిగారు. అతి తక్కువగా వృద్ధుల జనాభా 2024 అంచనా మేరకు బిహార్‌లో 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.1 శాతం, అసోంలో 8.2 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
వైఎస్ జగన్ ఘనత.. 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి మెరుగుపడింది. తద్వారా వారి పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైంది. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించింది. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణనీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలిపింది. ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలతో పేదరికం తగ్గడంతో పాటు గ్రామీణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది. -
వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, మేలుపై దేశవ్యాప్తంగా చర్చ
-
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
సార్వత్రిక సమరంలో ఎన్నికల ‘వేడి’ పరాకాష్టకు చేరుతోంది. ఇప్పటికే 3 విడతల్లో పోలింగ్ పూర్తికాగా, మరో నాలుగు విడతలు మిగిలి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గడం అటు పారీ్టలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా కలవరపెడుతోంది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. అయితే ఓట్ల శాతం తగ్గినా, పోలైన మొత్తం ఓట్ల సంఖ్య మాత్రం 2019తో పోలిస్తే ఎక్కువగానే ఉందని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషకులు వెల్లడించారు. అంతేగాక రానున్న విడతల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. 2019లో తొలి దశలో 69.4 శాతం, రెండో దశలో 69.3 శాతం, మూడో దశలో 67.3 శాతం చొప్పన ఓటింగ్ నమోదైంది. ఈసారి మొదటి విడతలో 66.1 శాతం, రెండో దశలో 66.7 శాతం, మూడో విడత 65.7 శాతం ఓటింగ్ జరిగింది. శాతాల్లో చూస్తే 2019 కంటే తగ్గినట్టు కన్పిస్తున్నా వాస్తావానికి తొలి రెండు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యలో 8.7 లక్షలు పెరుగుదల నమోదైంది. 2019లో తొలి రెండు విడతల్లో 20.61 కోట్ల మంది ఓటేయగా, 2024లో 20.7 కోట్లకు పెరిగింది. పెరిగిన ఓట్లలో మహిళ సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఓట్లు పెరగడం మరో కీలకాంశం. రాష్ట్రాల్లో ఇలా... రాష్ట్రాల విషయానికొస్తే ఈసారి తొలి రెండు దశల్లో కర్నాటకలో 12.9 లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్ ఏడు విడతల్లో జరిగింది. తొలి మూడు విడతల్లో ఓటింగ్ అధికంగా నమోదై ఆ తర్వాత విడతల్లో తగ్గింది. ఈసారి అందుకు భిన్నంగా తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గింది. కనుక మిగతా నాలుగు విడతల్లో పోలింగ్ భారీగా పుంజుకుంటేనే కనీసం గత ఎన్నికల స్థాయిని అందుకోగలుగుతుంది. అయితే 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.2 కోట్లు కాగా 2024లో 96.9 కోట్లకు పెరిగింది. అందుకే ఈసారి ఓటింగ్ తొలి మూడు విడతల్లో శాతాల్లో తగ్గినా సంఖ్యపరంగా పెరిగిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమే కీలకం
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, గోవా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మహిళలదే ప్రధాన భూమిక అని నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంగా మహిళా ఓటర్లు ఎలా నిర్ణయాత్మకంగా మారుతున్నారనే అంశంపై ఎస్బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుత సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఎన్నికల్లో కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, సిక్కిం రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగి ఫలితాలను నిర్ణయిస్తారని నివేదిక పేర్కొంది. మహిళా ఓటర్లలో చైతన్యం ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో 83 లక్షల మంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని, 2019 ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాని మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 41 లక్షలకు తగ్గిపోయిందని, మహిళలు ఓటింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారనడానికి ఇదే సంకేతమని స్పష్టం చేసింది. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, తద్వారా ఫలితాలు గణనీయంగా మారిపోతాయని అంచనా వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జెండర్ రేషియో పెరుగుతోందని, లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఎన్నికల్లో పురుష, మహిళ ఓటర్ల రేషియో 1:1.02 ఉండగా భవిష్యత్‌లో 1:1.06కు పెరుగుతుందని వెల్లడించింది. గత ఓటింగ్ శాతాలు, మార్పులను విశ్లేíÙంచడం ద్వారా 2024లో పోలింగ్ 68 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 కోట్లు మహిళా ఓటర్లే ఉంటారని, ఇది 49 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ రేటు ప్రకారం 2029 నాటికి పోలింగ్ 73 కోట్లకు చేరుతుందని, ఇందులో 37 కోట్లు మహిళా ఓటర్లు ఉంటారని అంచనా వేసింది. 2047 నాటికి దేశంలో 115 కోట్ల మంది ఓటర్లుగా నమోదు కావచ్చని, ఓటింగ్‌లో 92 కోట్ల మంది పాల్గొంటారని నివేదిక తెలిపింది. 2047లో అత్యధికంగా మహిళా ఓటర్లు 50.6 కోట్ల మంది పాల్గొననుండగా పురుష ఓటర్లు 41.1 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల పోలింగ్ 67.01 శాతం ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ 67.18 శాతం ఉందని పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో అదనంగా 13 కోట్ల మంది మహిళలు ఓటు వేయవచ్చని, ఇది గేమ్ చేంజర్‌గా మారవచ్చని వ్యాఖ్యానించింది. -
‘ఆసరా’తో అగ్రపథం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పొదుపు సంఘాలు ఆదాయపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలోని సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం అత్యధికంగా ఉందని, 2019 నుంచి 2024 నాటికి వారి రోజువారీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. పొదుపు సంఘాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక సగటు ఆదాయం కలిగిన 20 జిల్లాల్లో 15 గ్రామీణ జిల్లాలే కాగా ఇందులో తొమ్మిది జిల్లాలు ఏపీలోనే ఉండటం గమనార్హం. డిజిటల్ లావాదేవీల్లోనూ ఆంధ్రప్రదేశ్ మహిళా పొదుపు సంఘాలు ముందు వరుసలో నిలిచాయి. పొదుపు సంఘాల సభ్యులు సాధికారతతో లక్షాధికారులుగా అవతరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. ఇటీవల వారి ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యుల క్రెడిట్ ఆదాయాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పొదుపు మహిళలను ప్రోత్సహిస్తూ అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలు, బ్యాంకు రుణాలతో తోడ్పాటు, మల్టీ నేషనల్ కంపెనీలతో అనుసంధానం లాంటివి సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టమవుతోంది. తద్వారా ఎన్పీఏల రేటు గణనీయంగా తగ్గిపోయి రికవరీ బాగుండటంతో పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సకాలంలో చెల్లింపులు కారణంగా వారి రుణ పరపతి సైతం పెరిగింది. గత సర్కారు హయాంలో ఏపీలో పొదుపు సంఘాల ఎన్పీఏలు ఏకంగా 18.36 శాతం ఉండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా ఆదుకుని జీవం పోయడంతో ఇప్పుడు ఎన్పీఏలు గణనీయంగా 0.17 శాతానికి తగ్గిపోయాయి. ♦ ఆంధ్రప్రదేశ్ తరువాత అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యుల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. మరో ఏడాదిలోగా హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేం‘ద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులై గేమ్ ఛేంజర్‌గా నిలుస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులుగా అవతరించడమే కాకుండా వారి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సంపదను సృష్టించి పునఃపంపిణీ చేస్తున్నారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని 72.7 శాతం మహిళా పొదుపు సంఘాల లావాదేవీలు ఇప్పుడు మెట్రో ప్రాంతాలకు, బయట జిల్లాలకు విస్తరించాయి. 20 కి.మీ. నుంచి 2,000 కి.మీ. పరిధిలో రాష్ట్రం లోపల, బయట కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా 65 శాతం మంది ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 30.5 శాతం గ్రామీణ ఏటీఎం లావాదేవీలు పట్టణాలు, మెట్రో ప్రాంతాలు, ఆయా జిల్లాల వెలుపల జరుగుతున్నాయి. ♦ పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులు వారి సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి వ్యయం చేయడం పెరిగిన వారి కొనుగోలు శక్తిని సూచిస్తోంది. ♦ విజయనగరం జిల్లాకు చెందిన పొదుపు సంఘాల సభ్యులు 68 కి.మీ. ప్రయాణించి విశాఖలో వ్యయం చేయగా శ్రీకాకుళం జిల్లా సంఘాల సభ్యులు 1,115 కి.మీ. ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో వ్యయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 1,647 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో వ్యయం చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 2,074 కి.మీ.ప్రయాణించి ఢిల్లీలో వ్యయం చేశారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వ్యాపారాల నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించి ఉంటారని పేర్కొంది. -
భారత్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకటించింది. ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం. క్యూ1, క్యూ2 శాతాలు అప్.. 2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్ఎస్ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. 8.4 శాతం వృద్ధి ఎలా అంటే.. 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది. జనవరిలో మౌలిక రంగం నిరాశ 8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. తలసరి ఆదాయాలు ఇలా... మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి. -
పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా విస్తరిస్తుండటమే కాక అవి ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 2019–20 నుంచి 2022–23 మధ్య కాలంలో రాష్ట్రంలో కొత్తగా 18.3 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం.. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేస్తుండడం ఐటీ రిటర్నుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత గడిచిన మూడేళ్ల కాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా 13.9 లక్షలు, ఉత్తరప్రదేశ్ 12.7 లక్షలు, గుజరాత్ 8.8 లక్షలు, రాజస్థాన్ 7.9 లక్షలు చొప్పున ఐటీఆర్ పెరిగాయి. కానీ, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్నుల సంఖ్య 11.7 లక్షలు తగ్గడం గమనార్హం. ఎంఎస్ఎంఈలు 1.93లక్షల నుంచి 6.6 లక్షలకు.. ఇక అసంఘటిత రంగంగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని సంఘటితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2020న ఎంఎస్ఎంఈ యూనిట్ల నమోదు కోసం ఉద్యమ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ వంటి అనేక సౌలభ్యాలు ఉండటంతో ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530గా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు 6.6 లక్షలు దాటినట్లు ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా 2.18 కోట్ల ఎంఎస్ఎంఈలు కొత్తగా రిటర్నులు దాఖలు చేయడానికి దోహదపడినట్లు ఎస్బీఐ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఇక మొత్తం పెరిగిన ఐటీఆర్‌ల్లో 60 శాతం తొలి ఐదు రాష్ట్రాల నుంచే వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య 4.1 లక్షలకు దాటడం కూడా రిటర్నులు దాఖలు పెరగడంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలవల్ల రానున్న కాలంలో ఈ రిటర్నులు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం.. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ రిస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో చేయిపట్టి నడిపించడం ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి పునరుజ్జీవం కల్పించడంతో కొత్త యూనిట్లు ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి వాటిని ఆదుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీపడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.118 కోట్లతో ‘ర్యాంప్’కార్యక్రమాన్ని చేపట్టింది. -
ఈఎంఐలు తగ్గుతాయా? రేపటి నుంచే ఆర్బీఐ మీటింగ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. మళ్లీ యథాతథమే! ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తగ్గింపు అప్పుడే.. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
మహిళా ‘ముద్ర’
సాక్షి, అమరావతి: దేశ ఎన్నికల క్షేత్రంలో మహిళల పాత్ర పెరుగుతోంది. స్త్రీ శక్తి మద్దతు లేనిదే ఏ పార్టీ లేదా ఏ నాయకుడూ విజయం సాధించలేరన్నంతగా ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఆ తర్వాత 2029 నుంచి స్త్రీలదే ఆధిపత్యం. ఇది మహిళలు సాధించిన సాధికారత. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించిన విషయమిది. 1951 నుంచి ఎన్నికల పోలింగ్ శాతం సరళితో 2047 వరకు పోలింగ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుందో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వివరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో పురుషులకన్నా మహిళా ఓటర్లు తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో పురుష ఓటర్లు 67.01 శాతం ఓట్లేయగా, మహళా ఓటర్లు 67.18 శాతం పాల్గొన్నట్లు ఆ నివేదిక తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్లతో మహిళా ఓటర్లు దాదాపుగా సమానంగా ఉంటారని పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి 2047 ఎన్నికల వరకు మహిళా ఓటర్లదే హవా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే వారి సంఖ్య 68 కోట్లకు చేరుతుందని, అందులో 33 కోట్ల మహిళా ఓటర్లుంటారని అంచనా. ఇది మొత్తం పోలింగ్‌లో 49 శాతం. 2029 ఎన్నికల నుంచి పోలింగ్‌లో పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతూ పోతుందని, పురుష ఓటర్ల సంఖ్య తగ్గుతుందని నివేదిక వెల్లడించింది. 2024లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 67.6 శాతం ఓట్లు వేస్తారని, –2029లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 71.4 శాతం ఓట్లు వేస్తారని, 2047లో ప్రతి వంద మంది మహిళా ఓటర్లలో 86.3 శాతం ఓట్లు వేస్తారని నివేదిక తెలిపింది. 1951 ఎన్నికల్లో 8 కోట్ల మంది మాత్రమే ఓట్లు వేసినట్లు నివేదిక పేర్కొంది. 2009 ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య 42 కోట్లకు పెరగ్గా, ఇందులో 19 కోట్ల మంది మహిళలున్నారు. 2014 ఎన్నికల్లో 55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా అందులో 26 కోట్ల మంది మహిళలున్నారని నివేదిక తెలిపింది. 2019 ఎన్నికల్లో 62 కోట్ల మంది ఓట్లు వేయగా అందులో 30 కోట్ల మంది మహిళలని తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 68 కోట్ల మంది ఓట్లు వేస్తారని, అందులో 33 కోట్ల మంది మహిళా ఓటర్లుంటారని నివేదిక పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే 2029 ఎన్నికల్లో 73 కోట్ల మంది ఓట్లు వేస్తారని, ఇందులో 37 కోట్లు మహిళలుంటారని అంచనా వేసింది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు నమోదవుతారని అంచనా వేయగా అందులో 80 శాతం మంది.. అంటే 92 కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొంటారని అంచనా వేసింది. ఇందులో మహిళల ఓటింగ్ 55 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. మహిళా ఓటర్లదే పెద్ద పాత్ర భారత దేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, అలాగే లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నివేదిక వ్యాఖ్యానించింది. గతంలోకంటే ఇప్పడు ఎన్నికల్లో మహిళా ఓటర్లు చాలా పెద్ద పాత్ర పోషిస్తారని నివేదిక పేర్కొంది. 1991 నుంచి పురుష, మహిళా ఓటర్ల మధ్య అంతరం తగ్గుతూ వస్తోందని తెలిపింది. 1991లో ఈ అంతరం పది శాతానికి పైగా ఉండగా 1996 నుంచి 2004 వరకు నాలుగు ఎన్నికల్లో 8.4 శాతానికి తగ్గిందని తెలిపింది. గత ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో 23 ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 18 రాష్ట్రాల్లో పురుష ఓట్ల పోలింగ్ శాతం కన్నా మహిళా ఓట్ల పోలింగ్ శాతం అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ 18 రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో అవే ప్రభుత్వాలు తిరిగి ఎన్నికయ్యాయని నివేదిక పేర్కొంది. -
పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు
ముంబై: భారత్‌లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్‌హోల్డ్ సెక్టార్) ఆర్థిక పరిస్థితులపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్) పొదుపు రేటు 2022 ఏప్రిల్– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి. 2020–21లో ఈ రేటు 11.5 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఈపీఎఫ్ఓ వంటివి) పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ చెబుతున్న అంశాలు క్లుప్తంగా... ► 2022–23లో పెరిగిన హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది. ► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. ► హౌస్‌హోల్డ్ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్‌లో ఇది 36.5 శాతానికి పడింది. ► ఫైనాన్షియల్ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం. ► సంవత్సరాలుగా హౌస్‌హోల్డ్ సెక్టార్లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి. ► వాస్తవానికి, 2011–2012లో హౌస్‌హోల్డ్ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం. నివేదిక పరిధి ఇదీ... పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ ‘హౌస్‌హోల్డ్ సెక్టార్’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్ అకౌంట్స్)కు సంబంధించి వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి. -
నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో), ఎన్పీఎస్ పథకాల్లో సభ్యుల చేరిక గణాంకాల ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో 5.2 కోట్ల మందికి ఉపాధి లభించినట్టు ఎస్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇందులో 47 శాతం మందికి కొత్తగా ఉపాధి లభించగా, మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఈపీఎఫ్‌వో పేరోల్ డేటాను విశ్లేషించినప్పుడు నికర ఈపీఎఫ్ సభ్యుల చేరిక 2019–20 నుంచి 2022–23 మధ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ‘ఎకోరాప్’ పేర్కొంది. ఇందులో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 2.27 కోట్లు ఉన్నట్టు, నికర పేరోల్ డేటాలో వీరు 47 శాతంగా ఉన్నట్టు ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. ఈ సంవత్సరాల్లో సంఘటిత రంగంలో 42 లక్షల మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలు మరింత ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే 44 లక్షల మంది నికర సభ్యులు ఈపీఎఫ్‌లో భాగమయ్యారని, ఇందులో మొదటిసారి ఉపాధి పొందిన వారు 19.2 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇదే ధోరణి 2023–24 పూర్తి ఆర్థిక సంతవ్సరంలో కొనసాగితే అప్పుడు నికర సభ్యుల చేరిక 160 లక్షలుగా ఉండొచ్చు. మొదటిసారి చేరిన వారు 70–80 లక్షలుగా ఉండొచ్చు’’అని తెలిపింది. ఎన్పీఎస్ డేటా ప్రకారం 2022–23లో 8.24 లక్షల మంది కొత్త సభ్యులు చేరగా, ఇందులో రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి 4.64 లక్షలు, కేంద ప్రభుత్వం నుంచి 1.29 లక్షలు, ప్రభుత్వేతర సంస్థల నుంచి 2.30 లక్షల మంది ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్‌పీఎస్‌లో సభ్యుల చేరిక 31 లక్షలుగా ఉంది. 1.31 లక్షల ఒప్పంద ఉద్యోగాలు: ఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా తమ సభ్య కంపెనీలు 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో 1.31 లక్షల ఒప్పంద కారి్మకులను చేర్చుకున్నట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్‌లో 5.6 శాతం పెరిగాయని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. ఈ–కామర్స్, సరుకు రవాణా, తయారీ, ఆరోగ్యం, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్ విభాగాల రిక్రూట్మెంట్ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. 2023 జూన్ 30 నాటికి ఐఎస్ఎఫ్ సభ్య కంపెనీలు చేర్చుకున్న ఒప్పంద కారి్మకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందన్నారు. -
15 రాష్ట్రాల్లోనే 90 శాతం డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: డిజిటల్ చెల్లింపుల విలువ, పరిమాణంలో 90 శాతం వాటా దేశంలో టాప్ 15 రాష్ట్రాలదేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.2,000 నుంచి రూ.2,200 వరకు ఉందని తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉంది. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, హరియాణాల్లో డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.1,600 నుంచి రూ.1,800 వరకు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. డిజిటల్ చెల్లింపుల్లో ఏపీ వాటా 8–12 శాతం డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా 8–12 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో జిల్లాల వారీగా యూపీఐ డిజిటల్ చెల్లింపుల పరిమాణం, విలువల్లో టాప్ 100 జిల్లాలే 45 శాతం వాటా కలిగి ఉన్నట్లు తేలింది. దేశ జీడీపీలో 2017లో ఏటీఎంల నుంచి 15.4 శాతం నగదు ఉపసంహరణలు జరగ్గా.. 2023లో 12.1 శాతానికి ఇవి తగ్గిపోయాయి. గతంలో ఒక వ్యక్తి ఏడాదిలో ఏటీఎంలకు 16 సార్లు వెళ్తే ఇప్పుడు 8 సార్లుకు పడిపోయింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 60 శాతం వాటా.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ప్రభావం చూపలేదని నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 414 బ్యాంకుల్లో యూపీఐ ద్వారా 890 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.14.1 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. దీన్నిబట్టి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు కూడా ఆశ్చర్యకరంగా 60 శాతం వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 767 శాతానికి పెరిగిన డిజిటల్ చెల్లింపులు.. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి 2016లో ప్రారంభించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందని ఎస్బీఐ నివేదిక తెలిపింది. మొత్తం డిజిటల్ చెల్లింపులు 2016లో దేశ జీడీపీలో 668 శాతం ఉండగా 2023 నాటికి 767 శాతానికి పెరిగాయి. రిటైల్ డిజిటల్ చెల్లింపులు (ఆర్టీజీఎస్ మినహా) 2016లో దేశ జీడీపీలో 129 శాతం ఉండగా 2023లో 242 శాతానికి పెరిగాయి. దేశంలో వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ విలువ 73 శాతం ఉంది. ఈ లావాదేవీల్లో దేశం కొత్త మైలురాళ్లను అందుకుంది. యూపీఐ లావాదేవీల పరిమాణం 2017లో 1.8 కోట్ల నుంచి 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ రూ.6,947 కోట్ల నుంచి రూ.139 లక్షల కోట్లకు చేరింది. అంటే.. 2004 రెట్లు పెరిగింది. -
పాతికేళ్ల లోపే రూ.50 లక్షలకు భారతీయుల సగటు ఆదాయం
భారతదేశంలో మధ్య ఆదాయ వర్గం ఎదుగుదలపై 77వ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా విభాగం ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఎంతో ఆశావహంగా ఉంది. ఆర్థిక సంవత్సరాలు 2011, 2022 మధ్య పదేళ్ల కాలంలో దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్స్ ఆధారంగా దేశంలోని మధ్య తరగతి ఆదాయాలు పెరిగిన తీరును ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది. ఈ నివేదికలోని గణాంకాల ప్రకారం ఆర్థిక సంవత్సరాలు 2013, 2022 మధ్య కాలంలో మధ్య తరగతి భారతీయుల సగటు ఆదాయం మూడు రెట్లు పెరిగింది. అంటే వారి ఆదాయం ఈ 11 సంవత్సరాల్లో రూ.4.4 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెరిగింది. 21వ శతాబ్దం మొదటి దశాబ్దం తర్వాత భారతీయుల ఆదాయం పెరగడం గణనీయ పరిణామం. గడచిన పది సంవత్సరాల్లో దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నత ఆదాయ వర్గం స్థాయికి ఎలా ఎదిగినదీ ‘కొత్త మధ్య తరగతి ఎదుగుదల’ అనే శీర్షికతో వచ్చిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వివరించారు. అలాగే ఇదే కాలంలో అసలు ప్రభుత్వానికి పన్నే చెల్లించాల్సిన అవసరం లేని విధంగా దాఖలు చేసే ఆదాయపన్ను రిటర్న్స్ సంఖ్య ఎలా పూర్తిగా మాయమైనదీ ఈ నివేదికలో పొందుపరిచారు. పట్టుదలతో లక్ష్య సాధనే భారతీయుల ప్రత్యేకత! 2047 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు ఇండియా పూర్తిగా అభివృద్ధిచెందిన దేశంగా అవతరిస్తుందన్న ఆకాంక్షను ప్రధానమంత్రి తన ఆగస్ట్ 15 ప్రసంగంలో ఢిల్లీ ఎర్రకోటపై వ్యక్తంచేశారు. మరో 24 ఏళ్లలో ‘వికసిత్ భారత్’ను చూస్తామన్న ప్రధాని కోర్కె 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులందరి మనసుల్లో ఉందంటే అతిశయోక్తి లేదు. ఆర్థిక సంవత్సరం 2047 నాటికి ఇండియాలో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య 85.3 శాతం పెరిగి 48 కోట్ల 20 లక్షలకు చేరుకుంటుందని కూడా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ లెక్కన భారత్ ఒక మోస్తరు సంపన్నదేశంగా అవతరిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2023లో రూ 2 లక్షలు ఉందని భావిస్తున్న భారత ప్రజల తలసరి ఆదాయం 2047 నాటికి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని అంచనా. అలాగే, మధ్య తరగతి భారతీయుల ప్రస్తుత సగటు ఆదాయం రూ.2 లక్షలు 24 ఏళ్ల తర్వాత 49.7 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ పరిశోధనా బృందం అంచనా వేసింది. ఈ సంఖ్యా వివరాలు లేదా అంచనాలన్నీ భారీగా, అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి. పెరుగుతున్న భారత జనసంఖ్య, ముఖ్యంగా పనిచేసే వయసులో ఉండే యువత జనాభా ఎక్కువ ఉన్న కారణంగా పై అంచనాలను నిజం చేయడం అసలు కష్టమే కాదు. మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఎదగాలనే ఆకాంక్ష, సంపన్న దేశాల సరసన నిలబడాలనే బలమైన కోర్కె ఫలితంగా దేశాభివృద్ధితోపాటు జనం ఆదాయాలు పై స్థాయిలో పెరగడం కష్టమేమీ కాదు. 1947లోనే స్వాతంత్య్రం సంపాదించిన మన సోదర దేశం పాకిస్తాన్ తో పాటు, ఇతర దక్షిణాసియా, ఆసియా దేశాల పరిస్థితులతో పోల్చితే భారతదేశంలో అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. దేశంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సుస్థిరత, చట్ట ప్రకారం సాగే పరిపాలన వంటి అంశాలు వచ్చే పాతికేళ్లలో ఇండియాను సంపన్న దేశాల జాబితాలో చేర్చుతాయనడంలో సందేహం లేదు. అనేక ఆటుపోట్లు, అననుకూల సంకేతాలు, పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమకాలీన ప్రపంచంలో భారతదేశం ఏకైక ఆశాజనక ప్రాంతమని అంతర్జాతీయ నిపుణులు, ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
నాలుగేళ్లలో రెట్టింపు కానున్న ఏపీ స్థూల ఉత్పత్తి
-
ఏపీ స్థూల ఉత్పత్తిపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక.. నాలుగేళ్లలో రెట్టింపు
ఏపీ జీఎస్డీపీ 2022–23లో 16 శాతం వృద్ధితో రూ.13 లక్షల కోట్లకు చేరింది. 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. సాక్షి, అమరావతి: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరం నుంచి ఏపీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2027 నాటికి దేశ ఆర్థిక పరిస్థితితోపాటు ఏపీ సహా 15 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నులపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదికను విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. ‘ఎస్బీఐ రీసెర్చ్’ ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2022 నుంచి వృద్ధి వేగం పుంజుకుంది. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ► దేశ ప్రస్తుత వృద్ధి రేటును పరిగణలోకి తీసు కుంటే 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమిస్తుంది. ప్రపంచ జీడీపీలో భారత్ వాటా నాలుగు శాతాన్ని దాటుతుంది. ప్రపంచ దేశాల జీడీపీలో భారత్ 2014లో పదో ర్యాంకులో ఉండగా 2015లో 7వ ర్యాంకులో నిలిచింది. 2019లో ఆరో ర్యాంకులో ఉంది. 2022లో ఐదో ర్యాంకులో ఉండగా 2027 నాటికి మూడో ర్యాంకులో నిలిచే అవకాశం ఉంది. ► 2027 నాటికి భారత్ జీడీపీ రూ.420.24 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో 15 రాష్ట్రాల నుంచే దేశ జీడీపీకి రూ.358.40 లక్షల కోట్లు సమకూరనుండటం గమనార్హం. దీనికి సంబంధించి అత్యధికంగా 13 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవనుంది. ఉత్తర్‌ప్రదేశ్ 10 శాతం వాటాతో రెండో స్థానంలో, ఐదు శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలవనున్నాయి. ► 2027 నాటికి భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఏకంగా కొన్ని దేశాలకు మించి వృద్ధి నమోదు చేస్తాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. -
హిందూ వృద్ధి రేటు అనడం అపరిపక్వమే: ఎస్బీఐ
న్యూఢిల్లీ: భారత్ ప్రమాదకర హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు.. తప్పుడు భావనతో, పక్షపాతంతో, అపరిపక్వంగా ఉన్నాయని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ పేర్కొంది.1950 నుంచి 1980 వరకు భారత్ జీడీపీ వృద్ధి అత్యంత తక్కువగా, సగటున 3.5 శాతంగా కొనసాగింది. దీన్ని హిందూ వృద్ధి రేటుగా భారత ఆర్థికవేత్త అయిన రాజ్ కృష్ణ సంబోధించారు. దీంతో తక్కువ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణిస్తుంటారు. -
మల్టీప్లెక్స్‌ను దాటనున్న ఓటీటీ
ముంబై: దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్ త్వరలో మల్టీప్లెక్స్ పరిశ్రమను అధిగమించనుంది. 2018లో రూ. 2,590 కోట్లుగా ఉన్న ఓటీటీల మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకు పెరగనుంది. ఏటా 36 శాతం వృద్ధి సాధించనుంది. తద్వారా ఒకప్పుడు వీసీఆర్‌లు, వీసీపీ, వీసీడీలను కనుమరుగయ్యేలా చేసిన మల్టీప్లెక్స్‌లను దెబ్బతీయనుంది. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 1980లలో తెరపైకి వచ్చిన వీసీఆర్, వీసీపీలు ఆ తర్వాత డీవీడీల్లాంటివి .. 2000ల తొలినాళ్లలో మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు కుప్పతెప్పలుగా వచ్చే వరకూ హవా కొనసాగించాయి. ఆ తర్వాత సాంకేతికాంశాలు, మల్టీప్లెక్స్‌ల ధాటికి అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవాతో మల్టీప్లెక్స్‌లకు కూడా అదే గండం పొంచి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఓటీటీలు ఇప్పటికే వినోద రంగంలో 7–9 శాతం వాటాను దక్కించుకున్నాయని, అన్ని భాషల్లోనూ ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ 40 పైచిలుకు సంస్థలు నిలకడగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 45 కోట్ల పైచిలుకు ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారని, 2023 ఆఖరు నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరవచ్చని గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి ఆప్షన్లు సంప్రదాయ సినీ వినోదంపై గణనీయంగా ప్రభావం చూపాయని పేర్కొన్నారు. చౌక ఇంటర్నెట్ .. డిస్కౌంట్ల ఊతం.. ఇంటర్నెట్ వినియోగించే వారు పెరుగుతుండటం, చౌకగా వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ లభిస్తుండటం, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు ఓటీటీల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా సంస్థలు డిస్కౌంటు రేటుకే సర్వీసులు అందిస్తుండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. డిస్నీ+హాట్‌స్టార్ (14 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్), అమెజాన్ ప్రైమ్ వీడియో (6 కోట్ల మంది), నెట్‌ఫ్లిక్స్ (4 కోట్లు), జీ5 (3.7 కోట్లు), సోనీలివ్ (2.5 కోట్లు) తదితర సంస్థలు అమెరికాతో పోలిస్తే 70–90 శాతం చౌకగా తమ ప్లన్స్ అందిస్తున్నాయి. వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హోయ్‌చోయ్ లాంటి స్థానిక, ప్రాంతీయ ఓటీటీలకు కూడా డిమాండ్ బాగా ఉంటోంది. 50 శాతం మంది ఓటీటీలను నెలకు 5 గంటల పైగా వినియోగిస్తుండటంతో ఆ మేరకు థియేటర్ల లాభాలకు గండిపడనుంది. సాంప్రదాయ విధానాల్లో సినిమాల నిర్మాణంతో పోలిస్తే ఓటీటీల కోసం స్ట్రీమింగ్ సిరీస్‌లు, సినిమాలను తీయడమే లాభసాటిగా ఉంటోందని పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి. తమ సొంత ఓటీటీలు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేని విధంగా కోవిడ్ కాలంలో థియేటర్లు మూతబడటం.. ఓటీటీలకు లాభించింది. ఈ వ్యవధిలో 30 పైగా హిందీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ జరుపుకున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా మరింతగా దృష్టి పెడుతున్నాయి. ►ఇప్పటికీ ఉచితంగా సర్వీసులు అందిస్తున్న ఓటీటీలే (యాడ్ ఆధారిత) ముందంజలో ఉంటున్నాయి. 2017లో వీటి వినియోగదారుల సంఖ్య 18.4 కోట్లుగా ఉండగా ఇది ఈ ఏడాది 35.1 కోట్లకు, 2027 నాటికి 46.6 కోట్లకు చేరనుంది. ►పే–పర్–వ్యూ సెగ్మెంట్లో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 3.5 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది 8.9 కోట్లకు, 2027లో 11.7 కోట్లకు చేరనుంది. ►రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విద్య, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర రంగాల్లోకి కూడా విస్తరించనున్నాయి. తద్వారా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. ఓటీటీలతో కంటెంట్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి -
రూపాయిపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తక్కువే
కోల్‌కతా: రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం రూపాయిపై పెద్దగా ఉండకపోవచ్చని .. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే ఫారెక్స్ అస్థిరతలు డాలర్/రూపాయికి సంబంధించి ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్టు ఎస్బీఐకి చెందిన ఎకోరాప్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెండు దేశాల మధ్య వివాదం తాత్కాలికంగా రూపాయిని కిందకు తీసుకెళ్లొచ్చంటూ.. రూ.76–78 శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో రూపాయి 2008 జనవరి నుంచి 2011 జూలై మధ్య కాలంలో 13 శాతం నష్టపోయింది. సంక్షోభం తర్వాత రూపాయిలో అస్థిరతలు పెరిగిపోయాయి. 2011 జూలై నుంచి 2013 నవంబర్ మధ్య 41 శాతం పడిపోయింది. కానీ ఈ విడత రూపాయిలో అస్థిరతలు చాలా తక్కువగా ఉన్నాయి’’ అని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక వివరించింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తోందని, రూపాయికి మద్దతుగా నిలుస్తోందని తెలిపింది. చదవండి: రూపాయికి క్రూడ్ కష్టాలు -
భారత్ జీడీపీ వృద్ధి 8.1 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా కట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా 9.5 శాతం. క్యూ2లో 7.9 శాతం, క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేస్తోంది. తాజాగా దేశ ఎకానమీపై ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్‌లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - రెండవ త్రైమాసికంలో 8.1 శాతం వృద్ధి నమోదయితే, అది ప్రపంచంలోనే సంబంధిత క్వార్టర్లో అత్యధిక వృద్ధి రేటుగా ఉంటుంది. త్రైమాసికంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ పొందుతుంది. - మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ ప్రకటించారు. అయితే ఈ బిల్లులు లేకపోయినప్పటికీ, కేంద్రం అమలు చేస్తామని పేర్కొంటున్న ఐదు వ్యవసాయ సంస్కరణలు ఈ రంగంలో మంచి ఫలితాలకు దారితీస్తాయి. - వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)ల విషయంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో ధరల విధానాన్ని పర్యవేక్షించే ప్రత్యేక యంత్రాంగంతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో స్థాపించడానికి చర్యలు కొనసాగాలి. - వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ప్రొక్యూర్మెంట్ విధానం వ్యవస్థాగతం కావాలి. ద్రవ్యలోటు తగ్గే అవకాశం: ఫిచ్ ఇదిలావుండగా, 2021–22లో ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలకన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనావేసింది. అంచనాలకు మించి ఆదాయాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. బడ్జెట్లో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలు నెలవేరకున్నా, ద్రవ్యలోటు 6.6 శాతం అంచనాలకన్నా తక్కువగానే ఉండే వీలుందని పేర్కొంది. 2021–22లో 1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరం మొత్తంగా 15.06 లక్షల కోట్లుండాలన్నది బడ్జెట్ నిర్దేశం.జీడీపీలో ఈ నిష్పత్తి అంచనా 6.8 శాతం. అయితే సెప్టెంబర్ నాటికి బడ్జెట్ అంచనాల్లో 35 శాతానికి ఎగిసింది. చదవండి: ఎకానమీ రికవరీ వేగవంతం: పీహెచ్‌డీసీసీఐ -
భారత్ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్– ఎకోరాప్ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్ ఎఫెక్ట్ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్ నమూనా’ ప్రాతిపదికన ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది. ►తుది ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది. ►మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది. ►4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ. ►కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్‌లో పుంజుకుంది. ►బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది. ►ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ►కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం. ►2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ►2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి -
కుటుంబాలపై అప్పుల భారం
ముంబై: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయని ఎస్బీఐ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, 2017 జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటి ఆర్థిక పరిణామాలు చోటుచేసుకున్న కాలం నుంచి జీడీపీలో కుటుంబాల రుణ భారాల నిష్పత్తి పెరుగుతూ వస్తోంది. రుణాల్లో ఏమున్నాయంటే... బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు, నాన్ బ్యాంకింగ్ ఫై నాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వం టి ఫైనాన్షియల్ సంస్థల నుంచి రిటైల్‌సహా వ్యవ సాయ, వ్యాపార రుణాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. అగ్ర దేశాలకన్నా తక్కువే! జీడీపీలో కుటుంబ రుణ భారాల నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనావేస్తోంది. ఆరోగ్య భద్రతా వ్యయాలు కూడా గణనీయంగా పెరుగుతుండడం గమనించాల్సిన అంశమని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ పేర్కొన్నారు. అయితే జీడీపీలో కుటుంబాల రుణ నిష్పత్తి 37 శాతం అంటే మిగిలిన పలు దేశాలకన్నా ఇది తక్కువేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొరియా (103.8 శాతం), బ్రిటన్ (90 శాతం), అమెరికా (79.5 శాతం), జపాన్ (65.3 శాతం), చైనా (61.7 శాతం)లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెక్సికోలో ఇది కనిష్ట స్థాయిలో 17.4 శాతం. డిపాజిట్ల తీరు ఇలా... 2020–21లో బ్యాంక్ డిపాజిట్లు తగ్గడం ఇక్కడ ప్రస్తావనాశం. 2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో కుటుంబాల పొదుపు రేటు (జీడీపీలో) 10.4 శాతంగా ఉంది. అయితే ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.2 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కుటుంబాల బ్యాంక్ డిపాజిట్ల రేషియో 7.7 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. ఇక కుటుంబాల రుణ భారం జీడీపీ విలువతో పోల్చితే 37.1 శాతం నుంచి 37.9 శాతానికి పెరిగింది. డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్స్, ప్రావిడెంట్ అండ్ పెన్షన్ ఫండ్స్, కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఈక్విటీలు, స్మాల్ సేవింగ్స్సహా ఫైనాన్షియల్ అసెట్స్ విలువ 7,46,821.4 కోట్ల నుంచి 6,93,001.8 కోట్లకు పడిపోయింది. ఇక మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇటీవల నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంది. ప్రైవేటు రంగం 80 శాతం ఆర్థిక నష్టం ఎదుర్కొంటే, ఇందులో కార్పొరేట్ రంగానికి కేవలం 12 నుంచి 16 శాతం. మిగిలినది కుటుంబాలు భరించాయి. -
కొత్త వేరియంట్ వస్తే ముందుగానే మూడో వేవ్
సెప్టెంబర్ నెల మధ్య నాటికే కరోనా మూడో వేవ్ పతాక స్థాయికి చేరొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్త ట్రెండ్స్‌ను బట్టి చూస్తే.. రెండో వేవ్ కన్నా మూడో వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు రావొచ్చని పేర్కొంది. అంటే రోజువారీ కేసులు 6 లక్షల వరకూ వెళ్లొచ్చని తెలిపింది. ఆగస్టు మధ్యలోనే మూడో వేవ్ మొదలై.. అక్టోబర్–నవంబర్ నెలల్లో కేసులు పతాక స్థాయికి చేరొచ్చని కాన్పూర్ ఐఐటీ అంచనా వేసింది. కొత్తగా వచ్చే వేరియంట్ల సామర్థ్యాన్ని బట్టి.. రోజువారీ కేసులు రెండు లక్షలకుపైగా నమోదుకావొచ్చని తెలిపింది. కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే ఆగస్టు చివరినాటికి కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని పేర్కొంది. ఎస్బీఐ, కాన్పూర్ ఐఐటీ మోడళ్లు రెండూ కూడా మూడో వేవ్‌లో కరోనా ప్రమాదకరంగా మారకపోవచ్చని పేర్కొన్నాయి. ఒకవేళ కేసులు భారీగా పెరిగినా ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా వేశాయి. సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా రెండో వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. 2 నెలల కింద రోజుకు 4 లక్షల దాకా వెళ్లిన కేసులు.. ఇప్పుడు 30–40 వేల మధ్య నమోదవుతున్నాయి. ఇలాగే మరో 3, 4 వారాలు తగ్గుతాయని.. ఆ వెంటనే మూడో వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాన్పూర్ ఐఐటీల అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. లాక్డౌన్లు, ఆంక్షలు సడలించడంతో జనం బయటికి రావడం పెరిగిందని.. వారు కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే ఆగస్టు మధ్యలోనే మూడో వేవ్ మొదలవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు నివేదికలు విడుదల చేశాయి. రెండో వేవ్ పూర్తిగా తగ్గకముందే.. గత ఏడాది జనవరిలో కరోనా పంజా విసరడం మొదలైంది. తొలిదశలో మెల్లమెల్లగా కేసులు పెరిగాయి. అక్టోబర్ నాటికి పతాక స్థాయికి చేరి.. తర్వాత తగ్గిపోయాయి. ఇక రెండో వేవ్ ఈ ఏడాది మార్చిలో మొదలుకాగా.. మే ఏడో తేదీన ఏకంగా 4.14 లక్షల కేసులతో గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం కేసులు తగ్గుతూ వస్తున్నాయి. రెండో వేవ్‌లో కేసులు భారీగా పెరగడం, లక్షలకొద్దీ యాక్టివ్ కేసులు ఉండటంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కోసం తీవ్ర సమస్య ఎదురైంది. రోజూ 3, 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే త్వరలోనే మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో వేవ్ ఎప్పుడు రావొచ్చు, పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇదే తరహాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటీ కాన్పూర్ వేర్వేరుగా అధ్యయనం చేసి నివేదికలు విడుదల చేశాయి. రెండూ కూడా ఆగస్టు మధ్యలో కరోనా మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని పేర్కొన్నాయి. నెల రోజుల్లోనే గరిష్ట స్థాయికి.. దేశంలో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘కోవిడ్ 19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరిట సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తున్న వేళ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించకపోతే.. ఆగస్టు రెండో వారంలోనే మూడో వేవ్ మొదలవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. కేవలం నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్ మధ్య నాటికే కేసులు పతాక స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కేసులు తగ్గుతూ వెళ్తాయని, ఈ నెల మూడో వారానికి రోజుకు పది వేలకు పడిపోతాయని పేర్కొంది. ఆ తర్వాత కేసులు పెరగడం మొదలవుతుందని.. మూడు, నాలుగు వారాల్లోనే గరిష్ట స్థాయికి చేరుతాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేవ్‌లు, నమోదైన కేసులను బట్టి.. రెండో వేవ్ కంటే మూడో వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు నమోదు కావొచ్చని పేర్కొంది. వ్యాక్సిన్‌తోపాటు జాగ్రత్తలూ తప్పనిసరి కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక మార్గమని, కానీ అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి అని స్టేట్ బ్యాంక్ రీసెర్చ్ నివేదికలో ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం 4.6 శాతం మందికి రెండు డోసులు, 20.8 శాతం మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని.. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. 59.8 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేసిన ఇజ్రాయెల్, 48.7 శాతం వ్యాక్సినేషన్ చేసిన బ్రిటన్ దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్త వేరియంట్ల సామర్థ్యాన్ని బట్టి.. ఐఐటీ కాన్పూర్ కూడా తాము రూపొందించిన ‘సూత్ర’ మోడల్‌తో దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేసింది. రెండో దశలో దేశాన్ని వణికించిన డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించగల కొత్త వేరియంట్ వస్తే మూడో దశలోనూ కోవిడ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం.. కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే ఆగస్టు చివరికల్లా రెండో దశ పూర్తి నియంత్రణలోకి చేరుకుంటుంది. ఒక వేళ కొత్త వేరియంట్ వస్తే.. ఆగస్టు మధ్యలోనే మూడోదశ మొదలై.. అక్టోబర్, నవంబర్ నెలల మధ్య పతాక స్థాయికి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో రోజువారీ కేసులు యాభై వేల నుంచి లక్ష వరకూ ఉండొచ్చు. ఒకవేళ డెల్టా కంటే 25 శాతం వేగంగా వ్యాప్తి చెందగల కొత్త వేరియంట్ పుట్టుకొస్తే.. రోజువారీ కేసులు 1.5 లక్షల నుంచి రెండు లక్షలకుపైగా నమోదయ్యే అవకాశం ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. జనం రోగ నిరోధక శక్తిని కోల్పోవడం, టీకాల ప్రభావం, తీవ్రమైన కొత్త వేరియంట్ వచ్చే అవకాశాలను ఈ అంచనాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నామని ఐఐటీ కాన్పూర్ అధ్యాపకుడు మణిందర్ అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఏమవుతుంది?, డెల్టా వైరస్ కంటే పాతికశాతం ఎక్కువ వేగంగా (డెల్టా ప్లస్ వ్యాపించే వేగం డెల్టా కంటే తక్కువని అంచనా) వ్యాప్తి చెందగల వేరియంట్ వస్తే జరిగే పరిణామాలను పరిశీలించామన్నారు. డెల్టా వైరస్ అప్పటికే ఇతర వేరియంట్లతో జబ్బుపడ్డ వారిపై ఎక్కువగా దాడి చేస్తోందని, ఈ లెక్కన చూస్తే మూడో దశలో కేసులు మునుపటి స్థాయిలో ఉండవని అగర్వాల్ వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4.6 శాతం మందికి రెండు దశల టీకాలు ఇవ్వడం, మరో 20.3 శాతం మంది కనీసం ఒక్క డోసుతో రక్షణ కలిగి ఉండటం వల్ల.. మూడు, నాలుగో దశల తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. మూడో వేవ్‌లో ఆస్పత్రిలో చేరే కోవిడ్ బాధితుల సంఖ్య తక్కువగా ఉంటుందని వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ ఏడాది జనవరిలో రోజుకు అరవై వేల కేసులు, 1,200 మరణాలు నమోదు కాగా.. తర్వాతి దశలో గరిష్ట కేసులు 21 వేలకు, మరణాలు 14కు పడిపోయాయని సూత్ర మోడల్ తయారీలో పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ గణిత శాస్త్రవేత్త ఎం.విద్యాసాగర్ తెలిపారు.