
మార్కెట్లు మళ్లీ పెరుగుతాయి
ఎస్‌బీఐ రీసెర్చ్ విశ్లేషణ
ఇటీవలి దేశీయ స్టాక్ మార్కెట్ పతనాన్ని ‘సూచీలు దారి తప్పడంగా’ ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. దేశీయంగా స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ... ఈ నేపథ్యంలో తిరిగి మార్కెట్ పుంజుకోవడం ఖాయమని తన తాజా నివేదికలో అంచనావేసింది. దీని ప్రకారం... ఆగస్టు 31న ఏప్రిల్-జూన్ స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. దీంతోపాటు ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలకు సంబంధించిన సానుకూల గణాంకాలు మార్కెట్ తిరిగి పుంజుకునేట్లు చేస్తాయి.