Economic issues
-
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్‌లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్‌లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇవ్వడం ఆలస్యమైందని
సాక్షి, అనంతగిరి(రంగారెడ్డి): మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత(21) స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో 3 తులాల బంగారం పెడతామని మమత తండ్రి భాగయ్య హామీ ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత ఇస్తామని చెప్పాడు. భాగయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. కూతురికి బంగారం ఇవ్వడంలో ఆలస్యమైంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన మమత బంగారం విషయమై తల్లిదండ్రులను అడిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొన్నిరోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 15న మధ్యాహ్నం గుళికల(తిమ్మెట) మందు మింగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మమత సోమవారం రాత్రి 10గంటలకు చనిపోయింది. వికారాబాద్ తహసీల్దార్ రవీందర్ శవ పంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి భర్త నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: యజమాని షాక్.. నగల దుకాణం గోడకు కన్నం.. -
భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం
న్యూఢిల్లీ: భారత్ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని వివరించింది. ‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5%కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ, రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది. -
మార్కెట్లు మళ్లీ పెరుగుతాయి
ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషణ ఇటీవలి దేశీయ స్టాక్ మార్కెట్ పతనాన్ని ‘సూచీలు దారి తప్పడంగా’ ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. దేశీయంగా స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ... ఈ నేపథ్యంలో తిరిగి మార్కెట్ పుంజుకోవడం ఖాయమని తన తాజా నివేదికలో అంచనావేసింది. దీని ప్రకారం... ఆగస్టు 31న ఏప్రిల్-జూన్ స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. దీంతోపాటు ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలకు సంబంధించిన సానుకూల గణాంకాలు మార్కెట్ తిరిగి పుంజుకునేట్లు చేస్తాయి. -
మదుపరుల కోసం సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్
ఆదివారం కడపలో తొలి అవగాహన సదస్సు ⇒ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారం... ⇒ఆర్థిక ప్రణాళికలపై సూచనలు, సందేహాల నివృత్తి; ప్రవేశం ఉచితం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక విషయాల పట్ల పాఠకుల్లో అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ నడుంబిగించింది. ఇందుకోసం ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ను ఏర్పాటు చేసింది. ఈ క్లబ్లో సభ్యులుగా చేరిన వారికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పించడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్, బీమా, పిల్లల చదువు, వివాహం, సొంతింటి కల నెరవేర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడం ఎలా వంటి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలన్న విషయాలపై ఆర్థిక నిపుణులు సూచనలను అందిస్తారు.అంతేకాకుండా మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్లో చేరిన వారి ఆర్థిక పరమైన సందేహాలను నిపుణులు తీరుస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి మదుపరుల అవగాహన సదస్సుకు కడప వేదిక కానుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారంతో ఏప్రిల్ 19(ఆదివారం)న కడపలోని మయూరా గార్డేనియాలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుంది. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 9505555020 అనే నెంబర్‌కు ఫోన్ చేసి, మీ పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది.