మదుపరుల కోసం సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ | Sakshi Maitri Investor Club | Sakshi
Sakshi News home page

మదుపరుల కోసం సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్

Published Fri, Apr 17 2015 2:25 AM | Last Updated on Wed, Sep 19 2018 8:44 PM

మదుపరుల కోసం సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ - Sakshi

మదుపరుల కోసం సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్

ఆదివారం కడపలో తొలి అవగాహన సదస్సు
⇒ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారం...
⇒ఆర్థిక ప్రణాళికలపై సూచనలు, సందేహాల నివృత్తి; ప్రవేశం ఉచితం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక విషయాల పట్ల పాఠకుల్లో అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ నడుంబిగించింది. ఇందుకోసం ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ను ఏర్పాటు చేసింది.

ఈ క్లబ్‌లో సభ్యులుగా చేరిన వారికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పించడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్, బీమా, పిల్లల చదువు, వివాహం, సొంతింటి కల నెరవేర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడం ఎలా వంటి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలన్న విషయాలపై ఆర్థిక నిపుణులు సూచనలను అందిస్తారు.అంతేకాకుండా మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్‌లో చేరిన వారి ఆర్థిక పరమైన సందేహాలను నిపుణులు తీరుస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి మదుపరుల అవగాహన సదస్సుకు కడప వేదిక కానుంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారంతో ఏప్రిల్ 19(ఆదివారం)న కడపలోని మయూరా గార్డేనియాలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుంది. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్‌లో సభ్యత్వం పొందడానికి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 9505555020 అనే నెంబర్‌కు ఫోన్ చేసి, మీ పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement