న్యూఢిల్లీ: భారత్ ప్రమాదకర హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు.. తప్పుడు భావనతో, పక్షపాతంతో, అపరిపక్వంగా ఉన్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ సంస్థ పేర్కొంది.1950 నుంచి 1980 వరకు భారత్ జీడీపీ వృద్ధి అత్యంత తక్కువగా, సగటున 3.5 శాతంగా కొనసాగింది. దీన్ని హిందూ వృద్ధి రేటుగా భారత ఆర్థికవేత్త అయిన రాజ్ కృష్ణ సంబోధించారు. దీంతో తక్కువ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment