సాక్షి, కరీంనగర్: పోలింగ్ 95.11 శాతమేంటీ అనుకుంటున్నారా.. మీరు చదివేది నిజమండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓ పోలింగ్ బూత్‌లో నమోదైన ఓటింగ్ శాతమిది. జిల్లా ఎన్నికల చరిత్రలో హుజూరాబాద్ ప్రత్యేకత చాటుతుండగా ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదైంది. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంట 67.13 శాతం(పోలింగ్ బూత్ 170), పోలింగ్ బూత్ 172), హుజూరాబాద్‌లోని పోలింగ్ కేంద్రం 40లో 69.10 శాతం ఓటింగ్ నమోదవగా మిగతా అన్ని పోలింగ్ బూత్‌ల్లో 80శాతం దాటడం ఆహ్వానించదగ్గ పరిణామం.
చదవండి: Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు!
ఆ 30 గ్రామాలు.. 90 శాతంపైనే ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్
నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటడం శుభపరిణామం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఓటుపై మమకారం చాటారు. మల్యాల పోలింగ్ బూత్ 235లో 93.57శాతం నమోదవగా, 1,011 మంది ఓటర్లకు గాను 946 మంది ఓటేశారు. గునిపర్తి 282 పోలింగ్ కేంద్రంలో 93.41శాతం నమోదవగా 607కు 567 మంది ఓటు వేశారు. నేరెళ్ల (284)లో 92.96 శాతం నమోదవగా 582కు 541 మంది ఓటు వేశారు.
చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్
సిరిసేడులో 92.94 శాతం, చిన్నకోమట్‌పల్లి (223)లో 92.81 శాతం, హుజూరాబాద్(27)లో 92.70 శాతం, దేశ్‌రాజ్‌పల్లి (302)లో 92.51 శాతం, టేకుర్తి (222)లో 92.31 శాతం, గంగారాం(125)లో 91.92 శాతం, మల్లన్నపల్లి(119)లో 91.87 శాతం, సీతంపేటలో 91.86 శాతం, నాగంపేట, కందుగులలో 91.68 శాతం, వంతడ్పుల 91.61 శాతం, శాయంపేట 91.41 శాతం, నాగారం 91.32 శాతం, వంగపల్లి, పంగిడిపల్లి, కనగర్తి, భీంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, అంబాల, వంతడ్పుల, గూడూరు, కేశవపూర్, గండ్రపల్లి, బేతిగల్, బొంతుపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment