jammikunta
-
Karimnagar: సీఐ బాత్రూం బకెట్లో 3లక్షలు.. ఫోన్ కాల్ వైరల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నేను మీ తమ్ముడిని.. ఇవన్నీ పిట్టకథలు వద్దు... బాజప్తా మీ బాత్రూంలో రూ.3 లక్షలు పెట్టిన.. అని ఆడియో లీక్‌కాగా, మరునాడు సామాజిక కార్యకర్త సదరు సీఐని విచారణ చేయాలంటూ వీడియో విడుదల చేయడం రెండు రోజులుగా జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట టౌన్ సీఐ, సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీతో డబ్బుల విషయంలో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. సదరు ఆడియోలో ఎస్సీ, ఎస్టీ కేసులో సీఐకి మూడు లక్షల రూపాయలు లంచంగా సీఐ ఛాంబర్లోని వాష్‌రూమ్‌లో పెట్టి అందజేసినట్లు ఆడియోలో ఉంది. తాజాగా ఆడియోలో మాట్లాడిన సామాజిక కార్యకర్త షేక్‌సాబీర్ అలీ మరిన్ని వివరాలతో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో షేక్‌సాబీర్ అలీ మాట్లాడుతూ.. ‘జెర్రంశెట్టి కృష్ణారావు, గోవిందరెడ్డి, మర్రుతో పాటు ఎస్ఆర్కే డెయిరీ చైర్మన్ బండారు మాధురి మధ్య ఉన్న వివాదాల్లో మధ్యవర్తిత్వం కోసం కృష్ణారావు నన్ను ఆశ్రయించారు. గత అక్టోబర్ 28 నుంచి 30 వరకు వివాదం పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లో సీఐ రవితో మాట్లాడటం జరిగింది. కృష్ణరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొద్దంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులతో మాట్లాడి రూ.3 లక్షలు తీసుకొచ్చి సీఐ వద్దకు వెళ్లగా, సీఐ ఛాంబర్లోని బాత్రూంలోని బకెట్లో పెట్టాలని సూచించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. దీంతో గత ఏడాది డిసెంబర్ 30న సీఐకి ఫోన్‌చేసి, రూ.3 లక్షలు తీసుకొని బాధితుడిపైనే కేసు ఎలా నమోదు చేస్తారని సూటిగా అడిగిన. దానికి అతడు తడబడ్డాడు కానీ.. పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్పై కెమెరాతో రికార్డు చేశానని చెప్పడంతో నిన్ను నమ్మటం తప్పా అని సీఐ అన్నాడని అందులో చెప్పాడు. తర్వాత ఆరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మారేపల్లి రాజుతో రోడ్డుపై నడిచి వెళ్తుండగా నా మొబైల్‌ను పల్సర్ బైక్‌మీద వచ్చిన ఇద్దరు ప్రైవేట్ యువకులు లాక్కోనిపోయారు. అప్పటికే సదరు ఆడియోను మా మిత్రులకు షేర్చేసి చేసిన కాబట్టి ఆ ఆడియోను మీడియాకు లీక్ చేయగలిగాను. గతంలో ఇలా ప్రశ్నించినప్పుడు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు బనాయించే అవకాశం ఉంది. బాధితులను బెదిరించి డబ్బులు ఇవ్వలేదని చెప్పించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు గత ఏడాది అక్టోబర్ 28 నుంచి 30 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు వీడియోలో షేక్ సాబీర్ అలీ పేర్కొన్నారు. పోలీసుల మౌనం వెనక అనుమానాలురెండు రోజులుగా జిల్లాలో ఆడియో, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నా... పోలీస్ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. మధ్యవర్తి తేదీ, సమయంతో పాటు పూర్తివివరాలు చెబుతుండడం, లీకైన ఆడియోలో సామాజిక కార్యకర్త సీఐను ఏకవచనంతో సంభోదించటం, పదేపదే డబ్బులు ఇచ్చానని చెప్పుతున్నా... సీఐ మాత్రం స్టేషన్‌కి రా మాట్లాడుకుందాం అంటూ సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మాట్లాడటం.. నిన్ను నమ్మడం తప్పా అని సీఐ అనటంలో అంతర్యం ఏంటని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ జమ్మికుంట ఎపిసోడ్లో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులు మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో ఆడియో, వీడియోలోని మాటలను ఖండించకుండా కేవలం సాబీర్ అలీ బ్లాక్‌మెయిలర్, అతడిపై గతంలో చాలా కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొనడం గమనార్హం. రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలిజమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమింగలంగా మారి రూ.3లక్షలు లంచం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గం. తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీపీ, కరీంనగర్ సీపీలు ఇలాంటి అవినీతి పురుగులను రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలి. ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్‌కి మచ్చ తెచ్చే వారిని వదిలిపెట్టవద్దు.– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేషాక్కు గురయ్యా సాబీర్ నా మీద అంత పెద్ద ఆరోపణ చేసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్న. అందుకే, కాస్త వెనక్కి తగ్గినట్లు మాట్లాడాను. అతన్ని పట్టుకునేందుకు రప్పిద్దామని అనుకున్నా. సాబీర్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ ఘటన విషయంలో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం.– వి.రవి, జమ్మికుంట టౌన్ సీఐ -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్‌క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!
సాక్షి, కరీంనగర్: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ఫ్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. -
తెలంగాణ ఎందుకు అభివృద్ధి కాలేదు?: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతమైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ అభివృద్ధి మాత్రమే జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అధికారాన్ని చేలాయిస్తున్నారని.. అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాజ్‌పేయి ప్రభుత్వ హాయంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోందని, మరి తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? అని రాజ్‌నాథ్, బీఆర్ఎస్ సర్కార్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ మాత్రం 10 ఏళ్లలో వెనకబడిపోయిందని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీజేపీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కృష్టి కూడా ఉంది. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పడలేదు. కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. హైదరాబాద్ తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు. దేశానికి గుజరాత్ అభివృద్ధి మోడల్. అభివృద్ధి మంత్రంతోనే గుజరాత్లో 27 ఏళ్లుగా గెలుస్తోంది. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ తీరే కారణం’ అని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. -
జమ్మికుంట సభలో హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
కరీంనగర్: జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హుజురాబాద్‌లో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ విశ్వాసం కల్పించారని చెప్పి పరోక్షంగా ఆయనే అభ్యర్థి అని ప్రకటించారు. ఎన్నికలు వచ్చే వరకూ ప్రజల్లోనే ఉండాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, అదే డీఎన్ఏ అని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో మళ్లీ పొరపాటు జరగొద్దన్నారు. అందరికీ భరోసా ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? మోసం చేసే పార్టీలు కావాలా? రైతన్నలారా ఆలోచించండి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి, దేశానికి ఏ పార్టీ అరిష్టమో ఆలోచించండి అన్నారు. మోదీ ఎవరికి దేవుడు? 'మోదీ ఎవరికి దేవుడు? ఎవనికి దేవుడు? రూ.400 సిలిండర్‌ను రూ1,200 చేసిన మోదీ దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా యువతకు మోసం చేసిన మోదీ దేవుడా? పెట్రోల్ ధరలు పెంచారు. మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేయలేదా? దమ్ముంటే చెప్పు ఈటల రాజేందర్. చేనేతపై ఏ ప్రధాని వేయని పన్ను మోదీ వేశారు. పద్మశాలీలు ఆలోచించాలి. బండి సంజయ్ దమ్ముంటే కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకు రావాలి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. '14 నెలల కిందట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాను తీసుకొస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఒక్క రూపాయి వచ్చిందా? మాటలు కోటలు దాటాయి. చేతలు గడప కూడా దాటలేదు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల అన్నారు. బాధ అనిపించింది. అసలు ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌కు పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు కాదా? 33 మంది పోటీ పడితే ఈటలకు టికెట్ ఇవ్వలేదా?' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ని కరీంనగర్ నుంచి ఎందుకు గెలిపించాని కేటీఆర్ ప్రశ్నించారు. మసీదులు తవ్వడం కాదు, దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా.. అని సవాల్ విసిరారు. మాట్లాడితే పాకిస్తాన్, హిందూస్తాన్ అంటారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కు గుజరాతీల చెప్పులు మోసే సోకు ఉండొచ్చని ఎద్దేవా చేశారు. 14 నెలల్లో ఈటల, బండి హుజూరాబాద్‌కు చిల్లిగవ్వ కూడా తేలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చదవండి: పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ -
క్లాస్మేట్ అని జాబ్ ఇప్పించి.. లవ్యూ అంటూ సహజీవనం.. తర్వాత..
జమ్మికుంట: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తోంది. ఈ ఘటన జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆస్మాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన రాచపల్లి మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి చెల్పూర్ గ్రామానికి చెందిన ఎండీ.ఆస్మాబేగం కలిసి 2017 వరకు వర్ధన్నపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఈ సమయంలో మధు, ఆస్మాబేగం ప్రేమించుకున్నారు. తరువాత హైదరాబాద్‌లోని మధు స్నేహితుడి రియల్ ఎస్టేట్ అఫీస్‌లో ఆస్మాబేగంకు ఉద్యోగం ఇప్పించాడు. ఈ సమయంలో రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది రోజుల క్రితం వ్యవసాయం చేసుకుంటానని బీజిగిరిషరీఫ్కు వచ్చిన మధు మరో యువతితో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన ఆస్మాబేగం ముడు రోజులుగా మధు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేసింది. కాగా.. మధు కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి పరారీలో ఉన్నారు. -
పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ
సాక్షి, కరీంనగర్(జమ్మికుంట): సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. కూలీ పని చేసుకుంటే కాని పూటగడవని ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకుంటున్నారు. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారం గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మోతే అశోక్– రాణి దంపతుల కుమారుడు మోతే జయంత్. అశోక్ నాలుగు రేకులు వేసుకొని, చుట్టూ పరదాలు కప్పుకొని, ఆటో అద్దెకు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జయంత్ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడు. 1 నుంచి 6వ తరగతి వరకు ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాల, పదో తరగతి వరకు మానకొండూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించి, హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మెడిసిన్ సీటు వచ్చిందని ఆ తల్లితండ్రులు ఎంతో సంబరపడ్డా.. కుమారుడి చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో కూడా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికం అతడిని వెంటాడుతున్నా పట్టుదలతో చదివి ఇటీవల నిర్వహించిన నీట్లో 463 మార్కులతో 2,700 ర్యాంక్ సాధించాడు. ఈనెల 8న నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలి. మెడిసిన్ చదువుకు ఏడాదికి రూ.1లక్షకు పైగా ఖర్చువుతుంది. పేద తల్లిదండ్రులు అంత మొత్తంలో ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేదంటున్నారు. దాతలు పెద్ద మనసుతో ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయండి సారు.. డాక్టర్ చదువుకొని, భవిష్యత్‌లో పేదలకు సేవ చేస్తానని అంటున్నాడు జయంత్. కేటీఆర్ హామీ అయితే నీట్లో మంచి ర్యాంకు సాధించి.. యువకుడి ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయిన పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. మరికొంతమంది యువకుడిని ఆదుకోవాలంటూ ‘సాక్షి కథనాన్ని’ ట్విటర్లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. దగ్గరుండి అతనికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సమన్వయం చేసుకోవాల్సిందిగా మంత్రి కార్యాలయానికి సూచించారు. Will take care personally @KTRoffice please coordinate https://t.co/eYx0boCgYC — KTR (@KTRTRS) November 4, 2022 దాతలు సాయం చేయాల్సిన అడ్రస్ మోతే జయంత్ అకౌంట్ నం : 026312010000566 ఐఎఫ్ఎస్సీ కోడ్ UBI0802638, యూనియన్ బ్యాంకు, జమ్మికుంట బ్రాంచ్ -
పాడెపై తల్లి.. తనయుల ఆస్తి లొల్లి
జమ్మికుంట: అనారోగ్యంతో తల్లి చనిపోతే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన తనయులు శవాన్ని ఇంటిముందే ఉంచుకుని పంపకాల పంచాయితీ మొదలుపెట్టారు. కన్నతల్లి శవాన్ని కాటికి పంపక ముందే ఖర్చుల విషయంలో గొడవపడ్డారు. ఈ అమానవీయ ఘటనను చూడలేకపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నివసించే సూదం అనసూర్య (85)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన భర్త రాజవీరు గతంలోనే చనిపోయారు. అప్పటినుంచి డిపెండెంట్ పింఛన్ అధారంగా అనసూర్య జీవనం సాగిస్తోంది. కొన్నినెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో జమ్మికుంటలోని చిన్నకొడుకు వద్ద ఉంటూ.. బుధవారం సాయంత్రం చనిపోయింది. వీణవంక మండలం గన్ముకులలో స్థిరపడిన మిగతా ముగ్గురు కొడుకులు జమ్మికుంటకు చేరుకున్నారు. తల్లి అంత్యక్రియలు, కర్మకాండలకు అయ్యే ఖర్చు, తల్లికి వస్తున్న పింఛన్, నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆస్తుల విషయం గురువారం నలుగురు కొడుకుల మధ్య గొడవకు దారితీసింది. చిన్నకొడుకు మిగతా ముగ్గురిని అంత్యక్రియల తరువాత వెళ్లిపోవాలని సూచించడంతో నలుగురి మధ్య పంచాయితీ ఏర్పడింది. తల్లి మృతదేహాన్ని ఇంటిముందు ఉంచుకుని గొడవలేంటని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సతీశ్ అక్కడకు చేరుకుని మృతురాలి కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి కార్యక్రమం పూర్తిచేసేలా చూశారు. -
జమ్మికుంట క్రీడాకారుడికి బంగారు పతకం
Asia Youth Sports CHampionship 2021: Jammikunta Prashanth Wins Gold: జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన పాతకాల ప్రశాంత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. హైదరాబాద్ నాంపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ నేపాల్‌లోని పోక్రాలో నవంబర్ 22 నుంచి 25 వరకు నిర్వహించిన ఆసియా యూత్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 2021లో పాల్గొన్నాడు. 3000 మీటర్ల రన్నింగ్‌లో సీనియర్ కేటగిరిలో బంగారు పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణానికి ఖ్యాతి తీ సుకువచ్చాడని ప్రశాంత్‌ను జమ్మికుంట పోలీసులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, కేశవపూర్ గ్రామస్తులు అభినందించారు. చదవండి: Krunal Pandya: కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం... తప్పుకొంటున్నా.. అయితే.. -
గిట్లెట్లాయే: జితేందర్ వర్సెస్ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే
సాక్షి, కరీంనగర్: బీజేపీ తరఫున మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికకు.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. అన్నీ తామై వ్యవహరించిన ఆ ఇద్దరు నేతల్లో జితేందర్దే పైచేయి అయ్యింది. వాస్తవానికి దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, జితేందర్ తన వ్యూహాలతో చక్రం తిప్పారు. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో తొలిసారిగా మంత్రి హరీశ్‌రావుకు భంగపాటు ఎదురైంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం ఈటల రాజేందర్ విజయం సాధించడంలో జితేందర్ మరోసారి హరీశ్‌పై పైచేయి సాధించారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే గిట్లెట్లాయే.. హుజూరాబాద్: ఉప ఎన్నిక ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. 90 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో ఉన్నా.. చివరికి ప్రజలు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 191ఓట్ల ఆధిక్యం రావడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో దాదాపు ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. చదవండి: Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే.. వీణవంకలో.. వీణవంక మండలం ఎలబాక గ్రామంలో బీజేపీకి 417 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే గ్రామంలో టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ మాడ వనమాల–సాదవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మవురం విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు టీఆర్ఎస్ నుంచి ఇన్‌చార్జీలుగా వ్యవహరించినా కనీస ఓట్లు రాబట్టలేకపోయారు. అలాగే ఎంపీపీ ముసిపట్ల రేణుక స్వగ్రామం దేశాయిపల్లిలో టీఆర్ఎస్ ఘోర ఓటిమి పాలయింది. హుజూరాబాద్‌లో.. ఎంపీపీ ఇరుమల్ల రాణి సొంత గ్రామం చెల్పూర్లో 86 ఓట్లు, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి స్వగ్రామం కందుగులలో బీజేపీకి 467 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాజాపల్లిలోపీఏసీఎస్ చైర్మన్ శ్యాసుందర్‌రెడ్డి పరిధిలో టీఆర్ఎస్ 36 ఓట్లతో లీడింగ్ సాధించింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక వార్డులో 36, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వార్డులో బీజేపీకి 33 ఓట్ల మెజార్టీ వచ్చింది. జమ్మికుంటలో.. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ స్వగ్రామం ఇల్లందకుంటలో బీజేపీకి 265 ఓట్లు, జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ స్వగ్రామం ఆబాది జమ్మికుంటలో 28 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇల్లందకుంట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పింగిళి రమేశ్ స్వగ్రామం విలాసాగర్లో, లక్ష్మాజిపల్లి సింగిల్ విండో చైర్మన్ ఉప్పుల తిరుపతిరెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఇలాఖాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ప్రముఖ నేతలైన పాడి కౌశిక్‌రెడ్డి (వీణవంక 884) కెప్టెన్ లక్ష్మీకాంతరావు గ్రామాల్లో (సింగాపూర్ 133) టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కింది. -
జమ్మికుంటలో విషాదం: పోలీస్ సైరన్ విని.. పరిగెత్తి
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పోలీస్ సైరన్ ఓ వ్యక్తిని మృత్యుఒడికి చేర్చింది. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా సైరన్ వినిపించడంతో పరిగెత్తి, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోత్కులగూడెంకు చెందిన పొన గంటి వేణు(34) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోని దుర్గా కాలనీలో ఉంటున్నాడు. ఇతనికి భార్య స్వాతి, ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు అద్విక, కృత్రిక ఉన్నారు. వేణు ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నాడు. దీంతోపాటు తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి, జమ్మికుంట ప్రధాన రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంట్ ఎదురుగా మద్యం తాగుతున్నాడు. పెట్రోలింగ్ చే స్తున్న పోలీసులు సైరన్ మోగించడంతో నలుగురు నాలుగు దిక్కులకు పురుగులు పెట్టారు. దీంతో వేణు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో ఉన్న పలువురికి బావిలో ఏదో పడిన శబ్ధం వినిపించడంతో వెంటనే వెళ్లారు. చదవండి: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి చీకట్లోనే ప్రమాదకరంగా ఉన్న బావిలో ముగ్గురు దూకి, గాలించారు. అయినా అతని ఆచూకీ లభించలేదు. కొక్కేలతో ఉన్న బకెట్‌కు తాగు కట్టి, వెతకగా వేణుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో చాలాసేపు వెతికి అతన్ని బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వేణు (ఫైల్), వేణు కూతుళ్లు డాడీ.. లే డాడీ.. సోమవారం వేణు మృతదేహం ఇంటికి చేరింది. డాడీ.. లే డాడీ.. ఫోన్ చేస్తే వస్తున్న అన్నావు.. మమ్మీ.. డాడీ లేస్తలేడు చెప్పు.. అంటూ వేణు పెద్ద కూతురు తండ్రి మృతదేహంపై పడి, విలపించడం చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. తండ్రి చితికి పెద్ద కూతురు అద్విక నిప్పంటించింది. ఇదే మండలంలో గతంలోనూ ఓ ఘటన ఇల్లందకుంట మండలంలోని మల్యాల శివారులో గతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మద్యం సేవిస్తుండగా పోలీస్ సైరన్ వినబడటంతో పరిగెత్తి, బావిలో పడి మృతిచెందాడు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా పోలీసులు సైరన్ వేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పలువురు అంటున్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్
సాక్షి, కరీంనగర్: పోలింగ్ 95.11 శాతమేంటీ అనుకుంటున్నారా.. మీరు చదివేది నిజమండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓ పోలింగ్ బూత్‌లో నమోదైన ఓటింగ్ శాతమిది. జిల్లా ఎన్నికల చరిత్రలో హుజూరాబాద్ ప్రత్యేకత చాటుతుండగా ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదైంది. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంట 67.13 శాతం(పోలింగ్ బూత్ 170), పోలింగ్ బూత్ 172), హుజూరాబాద్‌లోని పోలింగ్ కేంద్రం 40లో 69.10 శాతం ఓటింగ్ నమోదవగా మిగతా అన్ని పోలింగ్ బూత్‌ల్లో 80శాతం దాటడం ఆహ్వానించదగ్గ పరిణామం. చదవండి: Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు! ఆ 30 గ్రామాలు.. 90 శాతంపైనే ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటడం శుభపరిణామం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఓటుపై మమకారం చాటారు. మల్యాల పోలింగ్ బూత్ 235లో 93.57శాతం నమోదవగా, 1,011 మంది ఓటర్లకు గాను 946 మంది ఓటేశారు. గునిపర్తి 282 పోలింగ్ కేంద్రంలో 93.41శాతం నమోదవగా 607కు 567 మంది ఓటు వేశారు. నేరెళ్ల (284)లో 92.96 శాతం నమోదవగా 582కు 541 మంది ఓటు వేశారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ సిరిసేడులో 92.94 శాతం, చిన్నకోమట్పల్లి (223)లో 92.81 శాతం, హుజూరాబాద్(27)లో 92.70 శాతం, దేశ్రాజ్పల్లి (302)లో 92.51 శాతం, టేకుర్తి (222)లో 92.31 శాతం, గంగారాం(125)లో 91.92 శాతం, మల్లన్నపల్లి(119)లో 91.87 శాతం, సీతంపేటలో 91.86 శాతం, నాగంపేట, కందుగులలో 91.68 శాతం, వంతడ్పుల 91.61 శాతం, శాయంపేట 91.41 శాతం, నాగారం 91.32 శాతం, వంగపల్లి, పంగిడిపల్లి, కనగర్తి, భీంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, అంబాల, వంతడ్పుల, గూడూరు, కేశవపూర్, గండ్రపల్లి, బేతిగల్, బొంతుపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. -
హుజురాబాద్: కౌన్సిలర్ ఇంటిముందు బీజేపీ కార్యకర్తల బైఠాయింపు
-
హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?
సాక్షి, కరీంనగర్: ఏ ఎండకు ఆ గొడుగు చందంగా రాజకీయ నాయకులు పార్టీల గోడలు దూకడం తెలిసిందే. ప్రస్తుత హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఆయా పార్టీలు ఓ అడుగు ముందుకేసి, జనాలనూ మార్చేస్తున్నాయి. అభ్యర్థుల ముందు ఆ సమయానికి కండువా కప్పుకుంటే చాలంటున్నారు నేతలు. ఫొటోలు క్లిక్‌మనిపిస్తూ ఆ జనసమూహాన్ని తమ సైన్యంగా చూపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సామాన్యులకూ లాభదాయకంగా మారింది. ఆ రోజుకు బీరు, బిర్యానీతోపాటు రూ.500 ఇస్తున్నారు. తమ అధినేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు గల్లీ నాయకులు పక్క వీధిలోని అపరిచితుల్నీ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిస్తున్నారు. తామే ఎక్కువ మందిని పార్టీలో చేర్పించామని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒకరిచేత కండువా కప్పించుకున్న గల్లీ కార్యకర్తలు మరుసటిరోజు మరో పార్టీ కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్ అని బేరాలాడుతున్నారు. ఇదో ఎన్నికల చిత్రం! చదవండి: హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్ గరిటె తిప్పేటోళ్లు కావాలండోయ్ కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమాని వంట తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ప్రచారపర్వంలో భాగంగా సమావేశాలకు హాజరయ్యే వారికి అభ్యర్థులు ఉదయం అల్పాహారంతోపాటు రెండుపూటలా భోజనం ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో గరిటె తిప్పేటోళ్లకు భలే గిరాకీ లభిస్తోంది. అభ్యర్థులు వంటవారిని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు తమ వద్దే పనిచేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఏదేమైనా ఉపఎన్నిక పాక ప్రావీణ్యులకూ కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతటా ఒకే బ్రాండ్ మద్యం కరీంనగర్‌టౌన్: హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకొని, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, మాంసం, డబ్బును ఎరచూపి ఓట్లు వేయించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం గ్రామగ్రామాన తమ అనుచరగణాన్ని దింపి, పోలీసుల కంటపడకుండా ఇంటింటి పంపిణీకి శ్రీకారం చుట్టాయి. అయితే ప్రజలు మాత్రం పార్టీలు పంచే మందుపై ఆసక్తి చూపడం లేదు. గత కొద్ది రోజులుగా అందరూ ఒకే బ్రాండ్ మందు బాటిళ్లను ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది. ఇదెలా సాధ్యమని ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు టికెట్ ఆశించి, భంగపడినట్లు సమాచారం. సదరు నాయకుడు గతంలోనూ హుజూరాబాద్ టికెట్ ఆశించినట్లు తెలిసింది. ఆయనను శాంతింపజేసేందుకు సదరు పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఏకంగా విస్కీ డీలర్షిప్ దక్కేలా కృషి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నాయకుడు తమ పార్టీతోపాటు ఇతర పార్టీలకు కూడా ఒకే బ్రాండ్‌కు చెందిన మందు బాటిళ్లు సరఫరా చేస్తున్నట్లు పలువురు అనుకుంటున్నారు. ఇతర బ్రాండ్లు తెచ్చే ప్రయత్నం చేసినా పోలీసులకు దొరికే ఛాన్స్ ఉండటంతో అన్ని పార్టీల నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అదే బ్రాండ్ మందు పంపిణీ చేయక తప్పడం లేదని సమాచారం. మొత్తమ్మీద హుజూరాబాద్ పోరులో పార్టీల మధ్య తేడాలున్నా మద్యం విషయంలో మాత్రం అందరూ ఒకే బ్రాండ్‌ను నమ్ముకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రిటైర్డ్ పోలీసులు పాలిటిక్స్‌లోకి.. కరీంనగర్‌టౌన్: ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు సేవ చేసే అవకాశం పోలీసులకు, పొలిటీషియన్లకు మాత్రమే దక్కుతుంది. అయితే రాజకీయ నాయకులు జీవితకాలం తమ సేవలను కొనసాగిస్తే, పోలీసులు మాత్రం ఉద్యోగ విరమణ పొందేవరకు మాత్రమే సేవలందించగలుగుతారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉండాలంటే పొలిటీషియన్‌గా మారడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారు. పూర్తిగా భిన్న ధృవాలుగా ఉండే ఈ రెండు వర్గాలు పోలీసుల రిటైర్మెంట్ తర్వాత ఒక్కటవుతున్నాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నో సిత్రాలు చోటుచేసుకుంటున్నారు. మాజీ పోలీసు అధికారి దాసరి భూమయ్య గత నెలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో వరంగల్‌కు చెందిన రిటైర్డ్ ఎస్సై ఉపేందర్‌రావు సోమవారం కిట్స్ కళాశాలలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గతంలో చాలా మంది పోలీసు అధికారులు పొలిటీషియన్లుగా మారి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్లో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరికొంత మంది రిటైర్డ్ పోలీసులు కూడా పొలిటికల్ కేరీర్‌ను ఎంచుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం
హుజూరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణగడ్డపై పుట్టగతులు ఉండవని, 2023లో పార్టీ పతనం ఖాయమని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులను టీఆర్ఎస్లో చేరకుంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోబోనివ్వమని బెదిరించినట్లు తనదృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు. 18 ఏళ్లు హుజూరాబాద్ నాయకుడిగా సమర్థవంతమైన పాలన అందించానని తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? ‘బండ కొట్టుకునే వడ్డెరులను అటవీ అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. రూ.5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలి. వడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, పేదలందరికీ దళితబంధులాంటి పథకం వర్తింపజేయాలి. టీఆర్ఎస్ మీటింగుల్లో పసలేదని, నేను ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను రాజీనామా చేస్తేనే హుజూరాబాద్‌లో పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్ కమిషన్ సభ్యుడు నరసింహ, బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు, రమేశ్‌రాథోడ్, యెండల లక్ష్మీనారాయణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక -
మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్ పత్తి ధర రూ.7,800
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడ్డారు. నాణ్యంగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.7,800 గరిష్ట ధర పలికింది. అలాగే కనిష్టంగా రూ.6,000 వరకు వేలం పాటలో రైతులకు చెల్లించారు. నారాయణపేట జిల్లాలో కూడా మంచి ధర వచ్చింది. ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి సమీపంలోని విజయ్ కాటన్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,300 ధర చెల్లించారు. అలాగే కనిష్టంగా రూ.6,500 చెల్లించారు. – జమ్మికుంట/నారాయణపేట -
Etela Rajender: సీఎం కుర్చీకి ఎసరు పెట్టేది మీరే!
హుజూరాబాద్: ‘సీఎంను గద్దె దింపేందుకు నేను కుట్ర చేశానని, సీఎం కుర్చీకి ఎసరు పెట్టానని హరీశ్‌రావు అంటున్నారు. ఆ ఎసరు పెట్టేది అల్లుడిగా నువ్వు.. కొడుకుగా కేటీఆర్.. బిడ్డగా కవిత చేస్తుందేమో. నాలాంటి వాడు కాదు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఈటల క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, తనను మంత్రిగా తొలగించినప్పుడు భూ ఆక్రమణ ఆరోపణలు అన్నారని.. ఇప్పుడు సీఎం కుర్చీ కోసం కుట్ర చేశానని అంటున్నారని.. ఇందులో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఏం మాట్లాడినా ప్రజల కోసమేనని అన్నారు. తనను వైద్య, ఆరోగ్య శాఖలో పడేస్తే పనిచేయలేక కొట్టుకుపోతాడని అనుకున్నారని.. అయితే అక్కడ కూడా కంటి మీద కునుకు లేకుండా కష్టపడి పని చేశానని తెలిపారు. ఫామ్ హౌస్‌లో కుట్రచేసి తనను తొలగించారని ఆయన ఆరోపించారు. -
TS: 50 వేల మెజార్టీతో గెల్లు గెలుపు ఖాయం
హుజూరాబాద్/సిద్దిపేటరూరల్: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 50 వేల మెజార్టీతో గెలుస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని జమ్మికుంట రోడ్లో ఆదివారం మున్నూరుకాపు భవనానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి భూమిపూజ చేసిన అనంతరం వారి ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ప్రజలకు చేసిందేమీ లేకనే హుజూరాబాద్‌లో బొట్టు బిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమెషీన్లు, గ్రైండర్లు పంచుతున్నారని, ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం మున్నూరుకాపు సంఘం నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానపత్రాన్ని మంత్రికి అందజేశారు. కేంద్రానికి రైతుల ఉసురు రైతు వ్యతిరేక చట్టాల అమలు, దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం, డీజిల్ ధరల పెంపు, మార్కెట్ల ఎత్తివేత వంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం మొండిపట్టుదలకు పోతుందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక మధిర గ్రామం అంకంపేటలో నిర్మించిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి వరకు మల్లన్నసాగర్ జలాలను తరలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావు, సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు పాల్గొన్నారు. -
బీజేపీని గెలిపిస్తే.. వంటగ్యాస్ రూ.1,500 దాటుతుంది
జమ్మికుంట (హుజూరాబాద్): హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో గమనించి ఓటు వేయాలని, ఈటల రాజేందర్ స్వార్థం కోసమే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈటల ప్రధాన అనుచరుడైన కేడీసీసీ బ్యాంక్ జిల్లా ఉపాధ్యక్షుడు పింగిళి రమేశ్, మాజీ ఎంపీపీ చుక్క రంజిత్ బీజేపీకి రాజీనామా చేసి బుధవారం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలకు చెందిన దాదాపు 2వేల మంది పార్టీలో చేరగా వారిని మంత్రి హరీశ్‌రావు కండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు వ్యక్తి లాభం కావాలో, ప్రజాలాభం కావాలో ఆలోచించాలని, ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే ప్రస్తుతం రూ.వెయ్యి ఉన్న వంట గ్యాస్ ధర రూ.1,500, పెట్రోల్ రూ.150 అవుతుందని తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయని రాజేందర్, ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం పనులు చేస్తాడో ఆలోచించాలని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ప్రజలు ఓటు వేసి అశీర్వదించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కోరుకంటి చందర్, జెడ్పీటీసీ శ్రీరాంశ్యామ్, పురపాలక సంఘం చైర్మన్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. -
మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం
సాక్షి, హుజురాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎదుట కొందరు యువకులు గడియారాలు ధ్వంసం చేశారు. ఈటల రాజేందర్ ఇచ్చినవాటిగా పేర్కొంటున్న గడియారాలను ఆదివారం పగులగొట్టారు. జమ్మికుంటలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో టీఆర్ఎస్ యువ నాయకులు వేదికపైకి వచ్చారు. ఈటల రాజేందర్ ప్రజలకు పంపిణీ చేస్తున్నారని గడియారాలు, గొడుగులు తీసుకువచ్చారు. గడియారాన్ని నేలకేసి కొట్టాడు. గొడుగులను చింపేశాడు. ఇవి ఆర్ధిక భరోసానిస్తాయా? అని ప్రశ్నించారు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచాలని ఈటల చెప్పాడని అయితే తాము నిరాకరించినట్లు యువకులు ఆరోపించారు. అతడి చర్యను చూస్తూ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి -
హుజూరాబాద్‌లో దళితబంధు సర్వే పూర్తి.. ఎంత మందికంటే
హుజూరాబాద్ రూరల్: దళితబంధు సర్వే గురువారంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ముగిసింది. ఆగస్టు 27 నుంచి ఏడురోజుల పాటు ఐదు మండలాల్లో అధికారులు ఇంటింటా తిరుగుతూ.. సర్వే నిర్వహించారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు సేకరించారు. 17,166 కుటుంబాలకుగానూ.. 16,370 కుటుంబాల వివరాలు యాప్‌లో అప్లోడ్ చేశారు. మరో 2,775 కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. సర్వేలో నియోజకవర్గంలో మొత్తంగా 18,619 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. హుజూరాబాద్ పట్టణంలో 1,794 కుటుంబాల వివరాలు యాప్‌లో నమోదు చేశారు. మరో 611కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. హుజూరాబాద్ మండలంలోని 19 పంచాయతీల్లో 3,387 కుటుంబాల వివరాలు ఆప్‌లోడ్ చేశారు. మరో 295 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట మున్సిపాలిటీలో 2,313 కుటుంబాలను పొందుపర్చారు. 446 కుటుంబాలవి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట రూరల్ పరిధిలో 2,428 కుటుంబాలను గుర్తించగా 464 దరఖాస్తులను స్వీకరించారు. ఇల్లందకుంట మండలంలో 2,951కుటుంబాలను ఆప్లోడ్చేశారు. వీణవంక మండలంలో 3,497 కుటుంబాల వివరాలు యాప్‌లో, 955 దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. చదవండి: ‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్
-
దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్
సాక్షి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. శాలపల్లిలోని దళిత బంధు ప్రారంభోత్సవ సభకు చేరుకున్న సీఎం కేసీఆర్.. జై భీమ్ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల్లో ధీమా పెరిగింది రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు. 21 వేల దళిత కుటుంబాలు ఇంకా మాట్లాడుతూ.. ‘దళితబంధుకు మొత్తం 22 వేల కోట్లు ఇస్తాం. నేను హుజురాబాద్‌లో స్వయంగా తిరిగి దళితబంధు అమలును పరిశీలిస్తా. దళిత బంధుకు కిస్తీలు కట్టే కిరికిరి అవసరం లేదు. దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలి. హుజురాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లుసమగ్ర సర్వేలో తేలింది. ఏ పథకం ప్రారంభించినా విపక్షాలకు అనమానులు, అపోహలే. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుంది. రాబోయే 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు విడుదల చేస్తాం: నూటికి నూరుశాతం అమలు దళితబంధు వచ్చినా రేషన్, పెన్షన్లు కొనసాగుతోంది. వచ్చే నెల, రెండు నెలల్లో అందరికి దళితబంధు వస్తుంది. ప్రభుత్వ పథకాల్లో, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం. నూటికి నూరుశాతం దళితబంధు అమలు చేస్తాం. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. ఎస్సీల్లో పేదలకు ముందుగా దళితబంధు వర్తిస్తుంది.’ అని పేర్కొన్నారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. -
రేవంత్‌రెడ్డి ఓ దొరికిన దొంగ: ఎమ్మెల్యే బాల్క సుమన్
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఓటుకు నోటు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనంలో బాల్క సుమన్ మాట్లాడుతూ, ఈటల రాజేందర్‌ను పెద్ద కొడుకులా కేసీఆర్ చూశాడని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించిన వ్యక్తి ఈటల అంటూ ఆయన దుయ్యబట్టారు. బీజేపీ చెప్పే అబద్దాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మధ్య హుజురాబాద్‌లో పోటీ జరుగుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం చేయడంలో బీజేపి దిట్ట, వాటిని తిప్పి కొట్టడంలో ముందు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. -
రాచరిక పాలనకు చరమగీతం
ఇల్లందకుంట (కరీంనగర్): ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి, రాచరిక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2023లో జరిగే ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక రిహార్సల్ లాంటిదన్నారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత గురువారం తొలిసారి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటకు వచ్చారు. ముందుగా నాగారంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘అన్నా.. నీకు అన్యాయం జరిగింది. కాపాడుకునే బాధ్యత మాదంటూ ప్రజలు దీవించారని’ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలను పెట్టి కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నారని, పోలీసు నిర్బంధాలు, ప్రలోభాలకు గురిచేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అసలు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి నాంది పలికిన హుజూరాబాద్ గడ్డ.. నేడు మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను పక్కకు పెట్టి ఎమ్మెల్యేలు, వారి పీఏలు అరాచకాలు చేస్తున్నారని, ప్రగతిభవన్‌లో రాసిన స్క్రిప్ట్‌లు ఇక్కడ చదువుతున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ఆట మొదలైందని, నేడో రేపో వేటగా మారవచ్చన్నారు. డబ్బు సంచులతో ప్రజల అభిమానాన్ని కొనలేరని ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టం చేశారు. అంతకుముందు ఈటలకు హుజూరాబాద్‌లో బీజేపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. కాట్రపల్లికి చెందిన 100 మంది యువకులు బీజేపీలో చేరారు. చదవండి: ‘ఈటలకు తొలిరోజే అవమానం’ -
Etela Rajender: ఈటలను దెబ్బకొట్టేందుకు వ్యూహరచన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే పక్షంలో హుజూరాబాద్‌లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలను కలుస్తున్న ఈటల కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తరువాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించడంతోపాటు తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తొలుత టార్గెట్ చేసింది. బర్తరఫ్ సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచిన నాయకులను వెనుదిరిగేలా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మండలాల్లోని మెజారిటీ నాయకులను టీఆర్ఎస్ వైపు తిప్పడంలో గంగుల కొంత విజయం సాధించారు. ప్రజాప్రతినిధులే తొలి టార్గెట్.... హుజూరాబాద్‌లో ఐదు మండలాలతోపాటు రెండు మున్సిపాలిటీలున్నాయి. కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ ఈ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం నుంచే జడ్పీటీసీగా గెలిచారు. ఈటల సహకారంతోనే ఆమె జడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికైనా, ఈటల ఎపిసోడ్లో ఆమె కనిపించలేదు. కోవిడ్ బారిన పడటంతో ఆమె బయటకు రాకపోయినా, టీఆర్ఎస్లోనే కొనసాగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. హుజూరాబాద్ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి పార్టీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాదవరెడ్డి, కమలాపూర్ జడ్పీటీసీ ఎల్.కళ్యాణి భర్త లక్ష్మణ్‌రావు ఈటల వెంట ఉన్నారు. అయితే.. గంగుల ఇప్పటివరకు హుజూరాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతోనే చర్చలు జరిపారు. వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలపై కూడా తదుపరి దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల చైర్పర్సన్లు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుతోపాటు కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్ వెంటే ఉంటామని శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు. హుజూరాబాద్‌లో పార్టీ వైపు ఎవరు ఉంటారనే దానిపై సంతకాల సేకరణ జరగగా, తిరుమల్‌రెడ్డి అనే కౌన్సిలర్ మినహా మిగతా వారంతా సంతకాలు చేసినట్లు సమాచారం. ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కూడా ఈటలకు దూరం చేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్య నాయకులు పార్టీ వెంటే.. వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ ముఖ్య నాయకుడిగా ఎదిగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి, కమలాపూర్ మండలంలో ఈటల తరువాత అన్నీ తానై వ్యవహరించే సంపత్‌రావు పార్టీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సంపత్‌రావు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు బంధువు కూడా. ఆయన ప్రభావం ఈటల సొంత మండలమైన కమలాపూర్‌పై ఉండే అవకాశాలున్నాయి. కాగా.. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు ప్రభావం ఇక్కడ ఉంది. దీంతో గంగులతోపాటు కెప్టెన్ సైతం హుజూరాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే ఆలోచనతో ఉన్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక కేటీఆర్ పర్యటన... కరోనా ప్రభావం తగ్గిన తరువాత నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం తనను కలిసిన పార్టీ హుజూరాబాద్ మండల, స్థానిక నాయకులకు చెప్పారు. హుజూరాబాద్‌లో పార్టీ జెండా కిందనే ఎవరైనా విజయం సాధించేది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పార్టీ తరువాతే వ్యక్తులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. -
కరీంనగర్లో అమానుషం: పగవాడికి కూడా ఈ కష్టం వద్దు
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను ఇంట్లోకి రానివ్వలేదు యజమాని. దాంతో మార్కెట్ యార్డ్‌లో తలదాచుకున్నది. ఈ విషయం తెలిసిన మార్కెట్ యార్డు అధికారులు ఆ మహిళను అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆదిరించేవారు లేక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. రోడ్డుపై ఉన్న తోపుడు బండిపై సేదతీరే దుస్థితి ఏర్పడింది. ఈ విషాధకర ఘటన వివరాలు.. జమ్మికుంట అంబేడ్కర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయించి జీవనం సాగించే మహిళ కరోనా బారిన పడింది. విషయం తెలిసిన ఇంటి యజమాని ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో స్థానిక మార్కెట్ యార్డులో రాత్రంతా జాగరణ చేసింది. సదరు మహిళ కోవిడ్ బాధితురాలు అని తేలడంతో మార్కెట్ అధికారులు ఆమెను ఉదయం అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఇక ఉండటానికి స్థలం లేక పాత అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో సులబ్ కాంప్లెక్స్ ముందు తోపుడు బండి మీద నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. బాధితురాలి గురించి తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు దిలీప్ ఆమె గురించి వైద్యాధికారులకు సమాచారం అందించడంతో.. వైద్య సిబ్బంది అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. రెండు రోజులుగా రోడ్డుపై అవస్థ పడిన మహిళను చూసి చలించిపోయిన స్థానికులు, స్థానికంగా ఐసోలేషన్ హోం క్వారంటైన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. చదవండి: లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్ -
కరోనా: ఫీజు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తాం!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతకు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే విద్యార్థిని ఇంటికి పంపిస్తామని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి గణేశ్-శ్రీదేవి దంపతుల కూతురు శృతి. జమ్మికుంట పట్టణంలోని న్యూమిలీనియం స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. పాఠశాలల వేసివేత నేపథ్యంలో తమ కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు గణేశ్–శ్రీదేవి దంపతులు బుధవారం స్కూల్‌కు వచ్చారు. అయితే ఫీజు రూ. 20 వేలు చెల్లిస్తేనే శృతిని ఇంటికి పంపిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఇంటిదారి పట్టారు. గురువారం మళ్లీ పాఠశాలకు రాగా, యాజమాన్యం అలాగే చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేదని బాధితులు చెప్పినా వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు బాధితులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై ప్రవీణ్‌రాజ్ పాఠశాల వద్దకు చేరుకుని ఇరువురితో మాట్లాడడంతో యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపిచేందుకు అంగీకరించింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు కారంకొండ శ్రావణ్‌కుమార్, శివకుమార్, కొల్లూరి ప్రశాంత్, కల్లపెళ్లి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జమ్మికుంట సీఐపై హెచ్చార్సీలో ఫిర్యాదు
సాక్షి, నాంపల్లి: భూ తగాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తూ మానసికంగా వేధిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ముచ్యంతల సమ్మిరెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో (హెచ్చార్సీ) ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజిరెడ్డి పేరిట 2.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన తమ్ముడు సదాశివరెడ్డి జమ్మికుంట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీఐ సృజన్‌రెడ్డి 17 జూలై 2019న అన్నదమ్ములిద్దరిని పిలిపించి రాజీ కుదిర్చినట్లు వివరించారు. ఇరువురి సమక్షంలో తనకు 1–07 ఎకరాలు, తన తమ్ముడు సదాశివరెడ్డికి 1–01 ఎకరాల భూమిని పంచి ఒప్పందం కుదిర్చారని తెలిపారు. అనంతరం అట్టి భూమిని తన తండ్రి సమక్షంలో అన్నదమ్ములిద్దరి పేరిట విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. అయితే తనకు 3 గుంటల భూమిని ఎక్కువగా ఇప్పించినందుకు గాను సీఐ సృజన్‌రెడ్డి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో సీఐ తన తమ్ముడితో కుమ్మక్కై అసభ్య పదజాలంతో దూషిస్తూ, కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనపై మూడు తప్పుడు కేసులు బనాయించి బైండోవర్ చేశాడన్నారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, సీఐ సృజన్‌రెడ్డి, తన తమ్ముడు సదాశివరెడ్డి తదితరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
జమ్మికుంట సీఐకి ‘ఉత్తమ్ జీవన్ రక్ష’
సాక్షి, న్యూఢిల్లీ: సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందులో ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి కూడా ఉన్నారు.. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకం, ఉత్తమ్ జీవన్ రక్ష పతకం, జీవన్ రక్ష పతకం విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు. వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్ హుష్రీన్ (మరణానంతర)కు సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది. ఇద్దరిని కాపాడినందుకు.. ఇక 2019 మే 28న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో చేద బావి పూడిక కోసం బావిలోకి దిగి స్పృహ కోల్పోయిన ఇద్దరు గ్రామస్తులను జమ్మికుంట టౌన్ సీఐ సృజన్‌రెడ్డి కాపాడారు. ఘటనపై సత్వరమే స్పందించిన ఆయన బావిలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. దీనిని గుర్తించిన కేంద్రం సృజన్‌రెడ్డిని 2020 సంవత్సరానికి గాను ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపిక చేసింది. -
తెలంగాణకు 2 విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు. ఇక ప్రతిభా పతకాలకు రాజేశ్ కుమార్ (ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, హైదరాబాద్), షరీపుద్దీన్ సిద్దిఖీ (కమాండెంట్, టీఎస్ఎస్ఎస్పీ బెటాలియన్ హైదరాబాద్), కందుకూరి నర్సింగరావు (డీఎస్పీ, నిర్మల్), సూర్యనారాయణ సోమగాని (డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి), గోవర్ధన్ తన్నీరు (ఏసీపీ, హైదరాబాద్), గుంజ రమేశ్(డిప్యూటీ అసల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్), ఎం.ఉద్ధవ్ (కానిస్టేబుల్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల), బృంగి గోవర్దన్ (సబ్ఇన్స్పెక్టర్, ఇంటెలిజెన్స్ హైదరాబాద్), కొత్తపల్లి కరుణాకర్ రెడ్డి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్, షీ టీం), భట్టురాజు మోహన్‌రాజు (అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల), దేవులపల్లి మోహన్‌రెడ్డి (కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్, మహమ్మద్ నయీముద్దీన్(కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అత్యుత్తమ సేవా పురస్కారానికి..: ఇటు తెలంగాణలోని జైళ్ల శాఖలో పనిచేస్తున్న చీఫ్ హెడ్ వార్డర్లు అయిన వి.చంద్రయ్య, గడ్డం సోమశేఖరరెడ్డి, జి.దైనమ్మలు ఖైదీల్లో సత్ప్రవర్తనకు దోహదపడినందుకు గానూ అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఇద్దరికి ఫైర్ సర్వీస్ ప్రతిభా పురస్కారాలు..: దేశవ్యాప్తంగా 73 మందికి ఫైర్ సర్వీస్ మెడల్స్‌ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ శౌర్య పతకాన్ని 8 మందికి, ఫైర్ సర్వీస్ శౌర్య పతకాన్ని ఇద్దరికి ప్రకటించింది. అలాగే రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ విశిష్ట సేవా పురస్కారాన్ని 13 మందికి, ఫైర్ సర్వీస్ ప్రతిభా పురస్కరాన్ని 50 మందికి ప్రకటించింది. కాగా ఫైర్ సర్వీస్ ప్రతిభా పురస్కారాలకు రాష్ట్రంలోని యజ్ఞనారాయణ అన్నపురెడ్డి (డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్), కట్ట జగదీశ్వర్ (లీడింగ్ ఫైర్‌మ్యాన్ ) లు ఎంపికయ్యారు. రాష్ట్ర పరిధిలో ఇతర బలగాల్లో పనిచేస్తున్న అధికారులకు..: బి.వెంకట్‌రెడ్డి (డిప్యూటీ కమాండెంట్, సీఆర్పీఎఫ్ ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్), మొలుగు రాజా (సీఆర్పీఎఫ్, జీసీ రంగారెడ్డిలో ఇన్స్పెక్టర్), పుల్లల చెరువు నారాయణ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఎన్ఎఫ్సీ యూనిట్, సీఐఎస్ఎఫ్ హైదరాబాద్), జైపాల్‌రెడ్డి (జేఐఓ–1, ఎంహెచ్ఓ, హైదరాబాద్ యూనిట్), టీవీ రాజేశ్ (డీఎస్పీ, ఎన్ఐఎ హైదరాబాద్), సత్వీర్ సింగ్ (డిప్యూటీ కమాండెంట్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ), సెందమంగళం రామస్వామి గాంధీ (సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్, రైల్వే శాఖ), కరుణానిధి మధుసూధన్ (ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్, ఖమ్మం), ఎస్.పవన్ సింగ్ (ఇన్స్పెక్టర్, రైల్ నిలయం, సికింద్రాబాద్)లకు పోలీస్ ప్రతిభా పురస్కారాలు వరించాయి. జమ్మికుంట సీఐకి ‘ఉత్తమ్ జీవన్ రక్ష’ జీవన్ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం.. సాక్షి, న్యూఢిల్లీ: సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందులో ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి కూడా ఉన్నారు.. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకం, ఉత్తమ్ జీవన్ రక్ష పతకం, జీవన్ రక్ష పతకం విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు. వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్ హుష్రీన్ (మరణానంతర)కు సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది. సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి ఇద్దరిని కాపాడినందుకు..: ఇక 2019 మే 28న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో చేద బావి పూడిక కోసం బావిలోకి దిగి స్పృహ కోల్పోయిన ఇద్దరు గ్రామస్తులను జమ్మికుంట టౌన్ సీఐ సృజన్‌రెడ్డి కాపాడారు. ఘటనపై సత్వరమే స్పందించిన ఆయన బావిలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. దీనిని గుర్తించిన కేంద్రం సృజన్‌రెడ్డిని 2020 సంవత్సరానికి గాను ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపిక చేసింది. -
బెస్ట్ ఠాణాగా జమ్మికుంట
సాక్షి, హైదరాబాద్/హుజూరాబాద్/ఇల్లందకుంట : కరీంనగర్ పోలీసు కమిషనరేట్ జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సంపాదించింది. దీని పరిధిలోని జమ్మికుంట పోలీసుస్టేషన్ పదో ఉత్తమ ఠాణాగా ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన పది ఉత్తమ ఠాణాల జాబితాను కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) గురువారం విడుదల చేసింది. గతేడాది ఇదే కమిషనరేట్‌లో ఉన్న చొప్పదండి పోలీస్‌స్టేషన్ ఎనిమిదో స్థానం కైవసం చేసుకుంది. ఇటు జమ్మికుంట ఠాణా సిబ్బందిని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఠాణాను ఇతర పోలీస్స్టేషన్లు ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ సూచించారు. 2017 నుంచి ప్రారంభం.. 2016లో జరిగిన డీజీపీల సదస్సులో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో 2017 నుంచి ‘ఉత్తమ పోలీస్స్టేషన్ల’గుర్తింపు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ఏడాది హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసుస్టేషన్ రెండో స్థానంలో నిలి చింది. ఆ తర్వాతి ఏడాది రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ టాప్–10లో స్థానం సంపాదించలేకపోయినా.. 14వ స్థానంలో నిలిచింది. వివిధ కోణాల్లో అధ్యయనం.. దేశ వ్యాప్తంగా పది ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ ఏ.. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇం డియాకు అప్పగించింది. కేంద్రం అధీనంలోని ఈ విభాగం ప్రతి ఏడాదీ దేశంలోని అన్ని రా ష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. ఈసారి వంద ల సంఖ్యలో వచ్చిన ఎంట్రీలను పరిగణనలో కి తీసుకున్న ఈ విభాగం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. వాటిలో జమ్మికుంట కూడా ఉంది. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం ఈ ఏడాది ఆయా ప్రాంతాలకు చేరుకుని దాదాపు నెలన్నర పాటు రహస్యంగా షార్ట్‌లిస్ట్ చేసిన ఠాణాల పనితీరు, వాటిలోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పీఎస్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల వారు, పోలీ స్‌స్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది. క్లిష్టమైన ఎంపిక విధానం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన బృందం ఆ ఠాణాకు సంబంధించి ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఆకస్మికంగా ఆ పోలీస్ స్టేషన్‌ను సందర్శించే బృంద సభ్యులు మౌలిక వసతులు, వాటి నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్లకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంతో అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరు, ఫైళ్ల నిర్వహణ తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా చేపట్టిన సమగ్ర అధ్యయనం తర్వాత దేశంలో ఉత్తమంగా నిలిచిన 10 పోలీస్ స్టేషన్ల జాబితాను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా కేంద్ర హోంశాఖకు అందిస్తుంది. -
ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం..
-
అప్రమత్తంగా ఉండండి: ఈటల రాజేందర్
సాక్షి, జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో వర్షం కురిసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే చెరువులు కుంటలు జలాశయాల నిండాయని పలు చోట్ల చెరువులకు, కాలువలకు గండ్లు పడి రోడ్లు దెబ్బతిని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయిని చెప్పారు. కలెక్టర్ శశాంక, జడ్పి చైర్ పర్సన్ విజయతో కలిసి మంత్రి జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాలో వరదల పరిస్థితిని పరిశీలించారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీఎం కేసీఆర్ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. (మూసీలో చిక్కుకున్న యువకులు) గ్రామాల వారిగా పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు తెగిన చెరువు కుంట కట్టలు, జలాశయాల పరిస్థితిని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని అందులో భాగంగా తాను హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయక చర్యలు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. (ప్రమాదకరంగా హుస్సేన్‌సాగర్ నాలా..) సీఎం కేసీఆర్ వర్షం, వరదల పై ఈరోజు సమీక్ష ఏర్పాటు చేశారని తెలిపారు. పంట నష్టంపై రైతులను ఆదుకునే విషయం పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సీఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారని అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల కోరారు. -
60 ఏళ్లుగా ఎస్సీ, బీసీలదే ప్రాతినిథ్యం
సాక్షి, జమ్మికుంటటౌన్ (హుజూరాబాద్): జమ్మికుంట పురపాలక సంఘం అధ్యక్ష పీఠంపై అందరి అంచనాలు పటాపంచలు అయ్యాయి. కొన్నాళ్లుగా జోరందుకున్న ఊహాగానాలకు తెరదింపుతూ మున్సిపల్ చైర్మన్ పదవి ‘జనరల్’కు రిజర్వు అయ్యింది. ఫలితంగా బల్దియా ఎన్నికలు రసవత్తరంగా మారేట్లు కనిపిస్తోంది. చైర్మన్ కుర్చీకి పోటీ తీవ్రం కానుండగా, ప్రతిష్టాత్మక పదవిని ఈసారి అగ్రకులాలు ఆశిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత జమ్మికుంటకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కనుంది. ఊహించని పరిణామం.. 1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మికుంట గ్రామపంచాయతీ సర్పంచ్ పీఠాన్ని జనరల్‌కు కేటాయించారు. అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి చొరవతో çపదవిని బీసీ నాయకుడు పొనగంటి మల్లయ్య కైవసం చేసుకున్నారు. 2001లో బీసీ జనరల్‌కు రిజర్వు కాగా, సర్పంచ్‌గా ఎర్రంరాజు సురేందర్‌రాజు ఎన్నికయ్యారు. 2006లో ఎస్సీ జనరల్‌కు దక్కడంతో కుర్చీపై మద్దూరి శంకరయ్య కొలువు తీరారు. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా, అధ్యక్షుడిగా మంత్రి ఈటల రాజేందర్ అనుచరుడు పోడేటి రామస్వామి ఎన్నికయ్యారు. ప్రస్తుతం జమ్మికుంట పురపాలక సంఘంగా మారడంతో చైర్మన్ పదవికి పోటీ తీవ్రమైంది. అయితే.. గత రెండు దఫాలు ప్రతిష్టాత్మక పదవి ఎస్సీలను వరించడంతో ఈసారి బీసీలను దక్కుతుందని అందరూ భావించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పుటి నుంచి ఇవే ఊహాగానాలు జోరందుకోగా, ముందుగానే రంగంలోకి దిగిన కొందరు బీసీ నాయకులు ప్రచారం కూడా చేపట్టారు. అనుచరులతో మంతనాలు జరుపుతూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే బల్దియా పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడం, జమ్మికుంట చరిత్రలో ఇప్పటి వరకు మహిళల ప్రాతినిథ్యమే లేకపోవడంతో అధ్యక్ష పీఠం అతివలకు అనుకూలంగా రావొచ్చని కూడా భావించారు. బీసీ మహిళ లేదా జనరల్ మహిళకు అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అందరి అంచనాలకు భిన్నంగా చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో జమ్మికుంట “పుర’పోరు రసవత్తరంగా మారనుంది. తీవ్రం కానున్న పోటీ.. మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ తీవ్రం అయ్యేట్లు కనిపిస్తోంది. ప్రధానంగా జనరల్‌కు రిజర్వు అయిన స్థానాల్లో అత్యధికులు పోటీలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈమేరకు 1, 6, 17, 21, 23, 26, 29 వార్డుల్లో పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. బీసీలకు కేటాయించిన వార్డుల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంటుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే గడిచిన 60 ఏళ్లలో జమ్మికుంటకు అగ్రకులాల నాయకులు ప్రాతినిథ్యం వహించిన దాఖలాలే లేవు. 1988, 1995లో సర్పంచ్ పీఠం జనరల్‌కు కేటాయించినా, అధికారాన్ని బీసీలే చేజిక్కించుకున్నారు. ఎట్టకేలకు ఈ దఫా అవకాశం రావడంతో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అగ్రకులాలు ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తున్నాయి. జమ్మికుంట అభివృద్ధిలో తమదైన ముద్ర వేసేందుకు వీలు కల్పించాలని రెడ్డి, వెలమ, వైశ్య సామాజికవర్గాల నుంచి మంత్రి ఈటల రాజేందర్‌పై ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇతర పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ సీటు జనరల్‌కు రిజర్వు అయినా.. తామూ బరిలోనే ఉన్నామని బీసీ నాయకులు చెబుతున్నారు. పోటీలో వెనక్కి తగ్గేది లేదని, అవకాశాన్ని అందిపుచ్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రధాన పార్టీల దృష్టి.. జమ్మికుంట పురపాలక సంఘంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో బలమైన నాయకులు చైర్మన్ పదవిపై గురిపెట్టుకుని కూర్చున్నారు. జనరల్ కేటగిరీ అందరికీ అనుకూలంగా ఉండడంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అవకాశాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. బడా నేతలు సైతం జమ్మికుంట బల్దియాలో పాగా వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ కంచుకోటను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అత్యధిక వార్డుల్లో పాగా వేయాలని, మున్సిపాల్టీలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ మాత్రం ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో కనిపిస్తోంది. -
జమ్మికుంటలో కాంగ్రెస్-బీజేపీ నాయకుల ఘర్షణ
-
కుండపోత.. గుండెకోత
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్) : మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నేదురు చంద్రమౌళి. ఇతనికి మూడున్నర ఎకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేశాడు. ఇప్పటికే సుమారుగా ఎకరాకు రూ.25 వేల చొప్పున ఖర్చు చేశాడు. ఖరీఫ్ సీజన్లో ఆఖరికి కాలం కావడంతో తీవ్ర కష్టాలకోర్చి సాగు చేశాడు. మరో రెండు రోజుల్లో వరి కోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శుక్ర, శనివారం కురిసిన వర్షంతో వరి మొత్తం నేలవాలింది. కోయరాకుండా పొలం అంతా నీటితో నిండింది.’ ఇది ఒక్క చంద్రమౌళి పరిస్థితి కాదు జిల్లాలోని రైతులందరూ వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలు అన్నదాతకు గుండెకోత మిగను మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత కుదేలవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి సాగుచేసి పంట చేతికొచ్చేవేల నేలపాలు కావడంతో దిక్కుతోచరి స్థితిలో పడ్డారు. మూడేళ్లుగా వరుణుడు తమను పగబడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 మండలాల్లో అత్యధిక వర్షపాతం... ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు కురువక పంటల సాగు ఆలస్యమైంది. సీజన్ ముగింపుదశలో కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు, కుంటలన్ని నిండి జలకళను సంతరించకున్నాయి. ఈ నెలలో తొమ్మిది రోజుల్లో రికార్డుస్ధాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని రామడుగు, శంకరపట్నం, మానకొండూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 13 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. శనివారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు నీటమునిగాయి. ప్రధానంగా శంకరపట్నం, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరిపంటకు ఎక్కువగా నష్టం జరిగింది. సైదాపూర్ మండలంలో అత్యధికంగా 103.2మి.మీ, జమ్మికుంటలో 80.2, వీణవంకలో 70.2, చిగురుమామిడిలో 65.6మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 45.5 మిమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మికుంట మండలంలో వాలిన పొలాన్ని చూపుతున్న రైతులు 4,627 హెక్టార్లలో వరి పంట నష్టం.. జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 52 వేల హెక్టార్లు కాగా, ఈ ఖరీఫ్‌లో 79,327 హెక్టార్లు సాగైంది. 4.25 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 119 గ్రామాల్లో 6,298 రైతులకు చెందిన 4,627 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న పంటలను ఆదివారం ఏవోలు, ఏఈవోలు గ్రామాలవారీగా సర్వే చేసి వివరాలను సేకరిస్తున్నారు. దూది రైతుకు దుఃఖం.. పత్తి రైతుకు మళ్లీ కష్టమొచ్చింది. అవసరం లేని సమయంలో కురుస్తున్న వర్షం తీరని నష్టాల్ని మిగిలిస్తుంది. ప్రస్తుతం పత్తి పంట కాయ దశకు రాగా, కొన్ని ఏరియాల్లో మొదటి సారి ఏరుతున్నారు. ఎకరాలకు కనీసం పది క్వింటా ళ్లు రావాల్సిన దిగుబడి పంట కీలక సమ యం లో అకాల వర్షాలతో నష్టం వాటిల్లి ఆశించిన మేరకు దిగుబడి రాకపోగా, పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పత్తి సాధారణ విసీ ్తర్ణం 42,918 హెక్టార్లు కాగా, ఈసారి 36,762 హెక్టార్లు సాగైంది. హెక్టారుకు కనీసం 14 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచ నా వేశారు అధికారులు. అయితే అకాల వర్షాలతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చే పరి స్థితి కనిపించడం లేదు. వానలతో పత్తి కాయ నల్లబడగా, పలిగే దశలో ఉన్న కాయ మురిగిపోయే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
రేషన్ బియ్యం దందా
సాక్షి, జమ్మికుంట: పేదల బియ్యం గద్దల పాలవుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన రూపాయికి కిలో బియ్యం దొడ్డిదారిన దళారులకు దక్కుతున్నాయి. దొడ్డు బియ్యాన్ని చౌకగా చేజిక్కించుకుంటున్న మాయగాళ్లు రాత్రికి రాత్రే హోటళ్లు, వ్యాపార సంస్థలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. భారీగా చీకటి దందా సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. నిద్రావస్థలో జోగుతున్న సర్కారు నిఘాతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. పేదలకు కడుపునిండా తిండి పెట్టాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బియ్యం కోటా పెంచారు. 2014 నుంచి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకు 16,800 టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు 4,890 టన్నులు, జగిత్యాలకు 5,240, పెద్దపల్లికి 3,576, సిరిసిల్ల జిల్లాకు 3,093 టన్నులు తరలుతున్నాయి. వీటి విలువ రూ.50.40 కోట్లు ఉంటుంది. కిలోకు రూ.8 చొప్పున కొంటున్న దళారులు.. సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదోవ పడుతూనే ఉన్నాయి. వివిధ మార్గాల్లో గుట్టుగా దళారులకు చేరుతున్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో అధికశాతం లబ్ధిదారులు రేషన్ బియ్యం తినడం లేదు. చౌకధరల దుకాణంలో రూపాయికి కిలో చొప్పున పొందుతున్న దొడ్డు బియ్యాన్ని చౌకగా అమ్ముకుంటున్నారు. దీన్ని అదునుగా తీసుకుంటున్న దళారులు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు కొంటున్నారు. సేకరించిన బియ్యాన్ని హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. కొందరికి రైలుమార్గం అనువుగా ఉండడంతో బియ్యాన్ని ప్యాసింజర్ రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల సరుకులను విరూర్, నాగపూర్ వ్యాపారులకు అక్రమంగా చెరవేస్తూ, కిలోకు రూ.28 నుంచి రూ.35 దాకా గిట్టుబాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దొడ్డు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో అక్కడికి పెద్దఎత్తున రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం కావడం, సర్కారు పర్యవేక్షణ పెద్దగా లేకపోవడం.. వెరసి అక్రమార్జనతో దళారుల జేబులు నిండుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈయేడు ఇప్పటి వరకు అడపా దడపా జరిగిన తనిఖీల్లో 4,583 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. ఈ మేరకు రూ.1.37 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు 183 కేసులు నమోదు చేశారు. దీన్ని బట్టి రేషన్ బియ్యంతో మాయగాళ్లు నడిపిస్తున్న చీకటి దందా ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. కిలో బియ్యం తయారీకి రూ.30 ఖర్చు.. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటోంది. వాటిని మిల్లుల్లో మర పట్టించి, ఛౌకధరల దుకాణాలకు పంపుతోంది. ఈమేరకు వివిధ చార్జీలు, పన్నులు కలుపుకొని కిలో బియ్యంపై రూ.30 వరకు ఖర్చు చేస్తోంది. కాగా.. చాలామంది లబ్ధిదారులు దొడ్డు బియ్యం తినేందుకు విముఖత చూపుతున్నారు. వాటిని కిలోకు రూ.8 నుంచి రూ.10 చొప్పున అమ్ముతూ, రూ.40 లకు లభిస్తున్న సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రేషన్ బియ్యం కొంటున్న దళారులకు కిలోపై రూ.10 నుంచి రూ.25 దాకా లాభం చేకూరుతోంది. అంటే.. పేదల కోసం సర్కారు కల్పిస్తున్న రాయితీతో దళారులకే ప్రయోజనం కలుగుతోంది. -
సీసీఐకి మిల్లర్ల షాక్!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ పత్తి మిల్లర్లు షాకిచ్చారు. 2019–20 సీజన్‌కు సంబంధించి జిన్నింగ్, బేళ్ల తయారీకి సీసీఐ ఇటీవల టెండర్లు ఆహ్వానించగా.. రాష్ట్రం నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. సీసీఐ అమలు పరుస్తున్న నిబంధనలను నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టెండర్లకు గడువు ముగియడంతో ఆ సంస్థ ఇప్పుడు పునరాలోచనలో పడింది. సీజన్ సమీపిస్తుండడంతో వ్యవహారం రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. మద్దతు ధరల కోసం.. తెలంగాణలో పత్తి క్రయవిక్రయాల సీజన్ అక్టోబర్‌లో మొదలవుతుంది. నవంబర్ నుంచి కొనుగోళ్లు ఊంపదుకుని మార్చి వరకు నడుస్తాయి. ప్రధాన మార్కెట్లలో ఏడాది పొడవునా అమ్మకాలు సాగుతాయి. యార్డులో తొలుత ప్రైవేటు వ్యాపారులే పత్తి కొంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నూలు, దూది డిమాండ్‌ను బట్టి స్థానికంగా పత్తి ధరలు నిర్ణయిస్తారు. రైతులు తెచ్చే సరకుల్లో తేమ, పింజ పొడవుకు అనుగుణంగా తేడాలు వేస్తారు. మార్కెట్లో ధరలు పతనమైతే మద్దతు ధరల కల్పనకు సీసీఐ రంగంలోకి దిగుతుంది. సరకుల నాణ్యత పరీక్షించి నాలుగు గ్రేడ్లుగా విభజిస్తుంది. తేమశాతం 8 నుంచి 12 లోపు ఉన్న విడిపత్తినే కొంటుంది. నిబంధనల మేరకు ధరలు నిర్ణయించి రొక్కాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగితే వాణిజ్య కొనుగోళ్లూ చేపడుతుంది. ఇలా వివిధ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన సరకులను సమీపంలోని జిన్నింగు మిల్లులకు తరలించి దూదిగా మారుస్తుంది. బేళ్ల రూపంలో దూదిని నిల్వ చేసి, సమయానుకూలంగా వ్యాపారం నిర్వహిస్తుంది. బేళ్ల ఎగుమతిలోనూ సీసీఐ పాత్ర కీలకం. టెండర్లకు దూరంగా మిల్లర్లు.. సీజన్‌కు ముందే సీసీఐ అధికారులు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేస్తారు. సేకరించే పత్తిని జిన్నింగు, ప్రెస్సింగు చేసి బేళ్లుగా మార్చేందుకు సమీపంలోని పత్తి మిల్లుల నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానిస్తారు. నిబంధనల ప్రకారం కోట్‌చేసిన వ్యాపారులకు పనులు అప్పగిస్తారు. ఈ తంతు ఏటా నిర్వహిస్తారు. కాగా.. గతంలో పత్తి జిన్నింగు, ప్రెస్సింగు కలుపుకొని బేలు తయారీకి రూ.1050 చొప్పున మిల్లర్లకు చార్జీ ఇచ్చేవారు. 2013–14 సంవత్సరం నుంచి 2017–18 వరకు ఈ ధరనే వర్తింపజేశారు. 2018–19 నుంచి సీసీఐ అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. బేలు తయారీ చార్జీని రూ.1104 దాకా పెంచారు. దీనికితోడు మిల్లర్లకు లింట్, ట్రాష్, షార్టేజీ లింకు పెట్టారు. క్వింటాలు పత్తి నుంచి తీసే లింట్ (దూది) శాతాన్ని ఒకే సీజన్లో 30.9 నుంచి 33 కిలోలకు పెంచుతూ(నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు) పోయారు. క్వింటాలు పత్తిలో షార్టేజీని 3.25 నుంచి 2.25 శాతం వరకు, దూదిలో ట్రాష్(దుమ్ము)ను 3.5 నుంచి 2.5 శాతం వరకు తగ్గిస్తూ వచ్చారు. వ్యతాస్యం ఏర్పడితే మిల్లర్లకు ఇచ్చే చార్జీల్లో కోత విధించారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించినా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ జోక్యంతో అమలుపర్చారు. ఈ విధానం నష్టాలు కలిగించడంతో బేళ్ల తయారీకి మిల్లర్లు వెనకడుగు వేశారు. సీజన్లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చివరికి తలొగ్గారు. ఈ క్రమంలో 2019–20 సీజన్ కోసం జూలై 26న సీసీఐ టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న టెండర్లు తెరిచిన సీసీఐ అధికారులు విస్తుపోయారు. రాష్ట్రంలో 350 పత్తిమిల్లులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 పత్తి మిల్లులు ఉండగా.. ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. సీసీఐ షరతులపై విముఖంగా ఉన్న వ్యాపారులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేళ్ల తయారీకి ఇస్తున్న చార్జీని మరింత పెంచాలని, లింట్, ట్రాష్, షార్జేజీ శాతాన్ని సడలించాలనే పట్టుతో ఉన్నారు. దీనిపై పునరాలోచనలో పడిన భారత పత్తి సంస్థ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. సర్కారు దరికి సమస్య.. సీసీఐకి వ్యాపారులకు మధ్య తలెత్తే వివాదాలపై రాష్ట్ర సర్కారే చొరవ చూపుతోంది. నిరుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు కూడా మార్కెటింగ్‌శాఖ జోక్యం చేసుకుని సమస్యకు తెరదింపింది. ఈయేడు మిల్లర్లు టెండర్లకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 లక్షల హెక్టార్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 18 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. మరో నెలన్నరలో పత్తి క్రయవిక్రయాల సీజన్ మొదలు కానుండగా.. రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం నెలకొంది. మద్దతు ధరల కల్పనకూ ఇది అనివార్యం. రాష్ట్రంలో సీసీఐ ఏటా సుమారు 150 కేంద్రాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 కేంద్రాలను నెలకొల్పుతోంది. జిన్నింగు మిల్లుల సమస్య తీర్చకుంటే పత్తి కొనుగోళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతారు. రైతుల శ్రమఫలాన్ని గద్దల్లా తన్నుకుపోతారు. మార్కెట్లోనూ ధరలు పతనం అవుతాయి. సీసీఐ, మిల్లర్లకు మద్య నడుస్తున్న కోల్డ్‌వార్ ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ దరికి చేరింది. రేపోమాపో ఇరువర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. -
ఈ మిర్చిని అమ్మేదెలా..?
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిర్చి పంట విక్రయానికి మార్కెట్ సౌకర్యం కరువైంది. ఫలితంగా దళారులకు విక్రయించి రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు ఐదు వేల హెక్టార్ల(12,500 ఎకరాలు)లో రైతులు మిర్చి పంట సాగు చేస్తున్నారు. హెక్టారుకు రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి అవుతుండగా.. 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏటా లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండగా.. విక్రయించడానికి జిల్లాలో ఎక్కడా మార్కెట్ సదుపాయం లేదు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.15 వేల వరకు పలికే మిర్చి పంటను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో అక్రమంగా సేకరిస్తూ వరంగల్, గుంటూరు, నాగపూర్ మార్కెట్లకు తరలించడం పరిపాటిగా మారింది. కళ్లెదుటే రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగుతున్నా.. రెక్కల కష్టాన్ని రైతులు తెగనమ్ముకుంటున్నా పట్టించుకునే దిక్కేలేకుండా పోయింది. సర్కారు సంకల్పిస్తే సాధ్యమే.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో జిల్లాలోనే అగ్రగామిగా ఉన్న జమ్మికుంట యార్డులో మిర్చి మార్కెట్ నెలకొల్పాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. స్థానికంగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రెండు విశాలమైన యార్డులు, సరిపడా గోదాములు, రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడంతో వ్యాపారులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ.. సరుకుల నిల్వకు కోల్డ్ స్టోరేజీలు అనివార్యం. సర్కారు సంకల్పిస్తే వాటి నిర్మాణం పెద్ద కష్టమేం కాదు. రూ.10 కోట్ల లోపే నిధులు సరిపోతాయని అంచనా. ఇది సాకారమైతే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, భూపాలపల్లి జిల్లాలోని రైతులకూ ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి లేక విలవిల్లాడుతున్న హమాలీలు, దడ్వాయిలు, కూలీలు, చాటవాలీలకు చేతినిండా పని దొరుకుతుంది. తీరిన పసుపు రైతుల కష్టాలు పత్తి, ధాన్యం, మొక్కజొన్నల వ్యాపారానికి జమ్మికుంట మార్కెట్ పెట్టింది పేరు. సర్కారు తాజాగా ఇక్కడ పసుపు కొనుగోళ్లకు సైతం శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడిగా రైతులు ఎదుర్కొంటున్న విక్రయ కష్టాలకు తెరపడింది. సమీప జిల్లాల రైతులకూ మేలు చేకూరింది. మిర్చి రైతులకూ అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వం వసతులు సమకూరిస్తే స్థానికంగా మిర్చి వ్యాపారానికి మార్గం సుగమం కానుంది. ఫలితంగా మార్కెట్ దశ తిగరడంతోపాటు కర్షక, కార్మిక, వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలగనుంది. విస్తరిస్తున్న పచ్చబంగారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. గతంలో వీటి సాగుకే పరిమితమైన రైతులు కొన్నేళ్లుగా పసుపు సాగుకు మొగ్గుతున్నారు. ఏటా 17 వేల హెక్టార్ల(42 వేల ఎకరాలు)లో పండిస్తున్నారు. హెక్టారుకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, ఏటా ఏడు లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు అమ్మకానికి సిద్ధంగా ఉంటోంది. కానీ మార్కెటింగ్ సదుపాయం సక్రమంగా లేక రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. రంగంలోకి జమ్మికుంట మార్కెట్.. గతంలో పసుపు అమ్మాలంటే వరంగల్, ఆర్మూర్ మార్కె ట్లకు వెళ్లాల్సి వచ్చేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగి త్యాల, కోరుట్ల, మెట్పల్లి, గొల్లపల్లి యార్డుల్లో పసుపు కొనుగోళ్లు ఆరంభించడంతో కర్షకుల కష్టాలు దాదాపు తీరాయి. ప్రభుత్వం ఈ సీజన్ నుంచి జమ్మికుంట మార్కెట్లోనూ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో ఈ ప్రాంత రైతులతోపాటు సమీపంలోని వరంగల్ అర్బన్, భూపాలపల్లి, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. స్థానిక మార్కెట్ కమిటీ చొరవతో వరంగల్ వ్యాపారులు రంగంలోకి దిగడంతో పసుపు క్రయవిక్రయాల్లో ఇబ్బందులకు తావేలేకుండా పోయింది. వచ్చే సీజన్ నాటికి కొనుగోళ్లను విస్తృతం చేసేందుకు కమిటీ కసరత్తు సాగిస్తోంది. కాగా, పసుపు విషయంలో చూపిన చొరవను మంత్రి ఈటల రాజేందర్ మిర్చి కొనుగోళ్లపైనా చూపాలని, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రైతులు కోరుతున్నారు. -
పతులా.. సతులా..!
జమ్మికుంటటౌన్(హుజూరాబాద్): వార్డుల విభజన ముగిసింది. ఓటర్ల లెక్కతేలింది. ఇక మిగిలింది రిజర్వేషన్ల ప్రక్రియ. దీంతో ఆశావహుల భవితవ్యం తేలనుంది. రిజర్వేషన్లు అనుకూలిస్తే బరిలోకి దిగేందుకు నాయకులు, అవసమైతే భార్యలను పోటీలో నిలిపేందుకు సన్నద్ధమవుతున్నారు. టికెట్లు దక్కకుంటే రెబెల్స్‌గానైనా పోటీ చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. విభజనతో మారిన రూపురేఖలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 14 పురపాలక సంఘాలున్నాయి. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్, వేములవాడ బల్దియాలు పాతవే కాగా చొప్పదండి, కొత్తపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, మంథని, రాయికల్ మున్సిపాల్టీలు కొత్తగా ఏర్పడ్డాయి. అన్ని పార్టీల నాయకులు రిజర్వేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా ఎవరు బరిలోకి దిగాలనే విషయమై ఎవరి సామాజికవర్గానికి వారు సమాలోచనలు సాగిస్తున్నారు. సంఘాలతో మంతనాలు మున్సిపాల్టీ పదవులను ఆశిస్తున్న ఆశావహులు ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే వివిధ సంఘాల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. ప్రధానంగా కుల, మహిళా సంఘాల నాయకులతో టచ్‌లో ఉంటున్నారు. ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెబెల్స్ బెడద తప్పదని భావిస్తున్నారు. అన్ని పార్టీలలో ఇప్పటి నుంచే ఆశావహులు బడానేతల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడితే రాజకీయం రసవత్తరం కానుంది. -
ప్రాణాలకు తెగించడం అంటే ఇదే : హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాలకు తెగించి ఇద్దరిని సురక్షితంగా కాపాడాడిన సీఐ సృజన్‌రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలతో ముంచెత్తారు. 'ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్మల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్ముల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్ pic.twitter.com/TcB7hNoTzT — Harish Rao Thanneeru (@trsharish) May 29, 2019 సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో మట్టి పూడిక తీత పనులకు మంగళవారం అదే గ్రామానికి చెందిన ఒల్లాల మల్లయ్య, మారపల్లి రవీందర్ వెళ్లారు. బావిలోకి దిగి కాసేపు పనులు చేసిన అనంతరం ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి చడీచప్పుడు రాలేదు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్పందించిన జమ్మికుంట టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. చేదబావిలో ఉన్న మల్లయ్య, రవీందర్‌లకు ఊపిరాడకపోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 108 వెంట ఉన్న ఆక్సిజన్‌ను పైపు ద్వారా బావిలోకి పంపించారు. ఈ సమయంలో చేదబావిలోకి దిగడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన నిచ్చెన సహాయంతో సీఐ సృజన్‌రెడ్డి చేదబావిలోకి దిగి, అందులో ఉన్న ఇద్దరి నడుముకు తాడు కట్టి గ్రామస్తుల సహకారంతో పైకి తీశారు. వెంటనే మల్లయ్య, రవీందర్‌లకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయట పడ్డారు. ఈ క్రమంలో సీఐకి స్వల్ప గాయాలు కావడంతో 108 సిబ్బంది చికిత్స చేశారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ సృజన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఐ సృజన్ రెడ్డి చూపించిన తెగువకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
సాహస పోలీసు
జమ్మికుంట రూరల్: ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను సంరక్షించడమే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వెనుకాడబోమని కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి నిరూపించారు. తాడు సాయంతో చేదబావిలోకి దిగి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో మట్టి పూడిక తీత పనులకు మంగళవారం అదే గ్రామానికి చెందిన ఒల్లాల మల్లయ్య, మారపల్లి రవీందర్ వెళ్లారు. బావిలోకి దిగి కాసేపు పనులు చేసిన అనంతరం ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి చడీచప్పుడు రాలేదు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్పందించిన జమ్మికుంట టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. చేదబావిలో ఉన్న మల్లయ్య, రవీందర్‌లకు ఊపిరాడకపోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 108 వెంట ఉన్న ఆక్సిజన్‌ను పైపు ద్వారా బావిలోకి పంపించారు. ఈ సమయంలో చేదబావిలోకి దిగడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన నిచ్చెన సహాయంతో సీఐ సృజన్‌రెడ్డి చేదబావిలోకి దిగి, అందులో ఉన్న ఇద్దరి నడుముకు తాడు కట్టి గ్రామస్తుల సహకారంతో పైకి తీశారు. వెంటనే మల్లయ్య, రవీందర్‌లకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయట పడ్డారు. ఈ క్రమంలో సీఐకి స్వల్ప గాయాలు కావడంతో 108 సిబ్బంది చికిత్స చేశారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ సృజన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఐ ప్రాణాలకు తెగించి సాహసం..
-
సీఐ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ సీఐ ప్రాణాలకు తెగించి ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మడిపల్లి గ్రామంలో చేపలు పట్టడానికి బావిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్ అందక బావిలోనే పడిపోయారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. ఆక్సిజన్ సహాయం లేకుండానే పోలీస్ డ్రెస్‌లోనే తాళ్ల సహాయంతో బావిలోకి దిగారు. అనంతరం నిచ్చెన సహాయంతో వారిద్దరిని పైకి తీసుకువచ్చారు. ఇద్దరిని 108లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఐ సృజన్ రెడ్డి చూపించిన తెగువకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సీఐ ప్రాణాలకు తెగించి సాహసం.. -
కొత్త పంచాయతీలకు నిధుల కొరత!
సాక్షి, జమ్మికుంట రూరల్: నూతన గ్రామపంచాయతీలు కొలువుదీరి 40రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధిలో మాత్రం ఖాతా తెరవలేదు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ అధికారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరుచుకోలేదు. దీంతో పల్లెల్లోని ఏచిన్న అభివృద్ధి పనికాని, మౌళిక వసతుల కల్పనకు గాని నోచుకోవ డం లేదు. మరోవైపు వేసవి సమీపించడంతో గ్రా మాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో కనీసం తాగునీటి కొరత అధిగమించేందుకు కనీసచర్యలు చేపట్టాలన్నా, బ్యాంకు లా వాదేవీలు ఖాతాలు తెరవడం అనివార్యమైంది. ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటుచేసిన కొత్త పం చాయతీలకు విధులే తప్ప నిధులు లేని పరిస్థితి. గత అక్టోబర్‌లో పెద్ద పంచాయతీలను వీడదీసి నూతన పంచాయతీలను ఏర్పాటుచేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా ఇందులో నుంచి కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి గ్రామా లు జమ్మికుంట మున్సిపాలిటీలో విలీనం కాగా నూతనంగా నాగారం, పాపక్కపల్లి, నాగంపేట, పాపయ్యపల్లి,వెంకటేశ్వర్లపల్లి, శంభునిపల్లి గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త, పాత పం చాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాం ట్ రూపంలో నిధులు వస్తున్పప్పటికీ, కొత్త పం చాయతీలు నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. జిల్లాలో మూడు విడుతలుగా నిర్వహించిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనవరి 30న ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త పాలకవర్గాలు కొ లువు దీరినప్పటికీ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంతవర కు సంబంధిత రికార్డులు కూడా అందుబాటులో లేవు. పాత పంచాయతీలను వీడదీసి నూతన పం చాయతీలు ఏర్పాటుచేసే సమయంలో కేవలం ఇంటిపన్నుల రిజిస్టర్ మాత్రమే ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. పాలకవర్గాలు గ్రామాల్లో సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి కొంత నిధులు అందుబాటు లో ఉండాలి. కాని నేటివరకు కొత్త పంచాయతీల్లో బ్యాంకు ఖాతాలు తెరవలేదు. జాప్యం చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వం పంచాయతీ నిధులకు సంబంధించి ఎ లాంటి ఏర్పాటుచేయకపోవడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏం అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ప్రతి పంచాయతీలో నిధులు ఏర్పాటు చే యాలని తెలంగాణ పంచాయతీ రాజ్‌చట్టం స్ప ష్టంగా పేర్కొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో అధికార పార్టీలో ఉన్న సర్పంచ్‌లు ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెప్పకనే చెబుతున్నారు. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు మంజూరు అవుతాయి. దీంతో పాటు గ్రామపంచాయాతీల్లో వసూలయ్యే అన్నిరకాల పన్నులను ప్రభుత్వ ట్రేజరీలో జమచేయాల్సి ఉంటుంది. కా నీ బ్యాంకు అకౌంట్లు ఉంటేనే నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. ఆడిట్ తప్పితే అంతే... గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి పంచా యతీ రాజ్‌చట్టం ప్రకారం నిధులు ఆదాయ, వ్యవ యాలకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చే యాల్సిందే. ఒకవేళ సకాలంలో ఆడిట్ చేయకపో తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చ ట్టంలో స్పష్టంగా పేర్కొంది. నిధులు విడుదల చేయాలి నూతన గ్రామపంచాయతీలకు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, నిధులు విడుదల చేయాలి. గ్రామంలో ఏ చిన్నపని చేయాలన్న నిధులు అవసరం. ఇప్పటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నేడో, రేపో గ్రామసభలు ఉంటాయని అధికారులు తెలిపారు. గ్రామసభలో ఏం జరుగుతుందో చూస్తాం. – మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, శంభునిపల్లి -
రైస్ మిల్లులకు జీవం పోశా
జమ్మికుంట (హుజూరాబాద్): తమ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లులకు జీవం పోశామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతుల, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైస్ మిల్లులు దుర్భర స్థితిలో ఉన్నాయని తెలిపారు. మిల్లింగ్ చార్జీలు పెంచి వ్యాపారులను ఆదుకున్నామని తెలిపారు. కస్టమ్ బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి అప్పగించాలనే షరతులతో మిల్లింగ్ చార్జీలు పెంచామని వివరించారు. మిల్లులను కాపాడుకుంటేనే రైతులకు, కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. రేషన్ బియ్యం దందాకు స్వస్తి పలకాలని, కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో వ్యాపారం చేయొద్దని చెప్పారు. రైతులు తెచ్చే ధాన్యానికి ధర కల్పించాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ తన వద్ద ఉండటం వల్ల వ్యాపారులకు లాభం చేశానని, ఇందుకు రూ.రెండు వేల కోట్లు లబ్ధి పొందినట్లు హుజూరాబాద్‌లో ఓ నేత ఆరోపణలు చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘నాకు గొలుసులు లేకపోవచ్చు.. నేను బ్రాస్లేట్లు పెట్టుకోకపోవచ్చు.. ఆరు ఫీట్ల ఎత్తులేక పోవచ్చు. ఈటల అనే వ్యక్తి మచ్చలేని మనిషిగా ఉన్నా..’అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందే శ్రమను నమ్ముకున్న వ్యక్తిననిపేర్కొన్నారు. ఏ మిల్లర్ వద్ద నయా పైసా తీసుకోలేదని స్పష్టం చేశారు., ఒక్క ఓటరుకు కూడా రూ.50 చేతిలోపెట్టలేదని, ప్రజలు ఆదరించి గెలిపించుకున్నారని ఈటల పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏనాడూ మచ్చ తేలేదని, గౌరవాన్ని తీసుకొస్తానని చెప్పారు. వ్యాపారులు రైతులను, కార్మికులను మంచిగా చూసుకుంటే చాలని, వ్యాపారవర్గాలకు తాను నిత్యం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైస్‌మిల్లర్లు ముందుకు వచ్చి తనకు మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు అయిత యుగేందర్, దేసుకేదారి, పలువురు టీఎన్‌ఎస్‌ఫ్ నాయకులు ఈటల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
చీకటిపూట.. నీటివేట
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పురపాలక పరిధిలో 23రోజులుగా తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. మానేరు ఏడారిగా మారింది. నీటిసరఫరాకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలిసిన మంత్రి ఈటల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. జమ్మికుంటకు నీటిసరఫరా చేస్తున్న పైప్‌లైన్‌ను శనివారం సాయంత్రం పరిశీలించారు. ముత్తారం టు మానేరు.. శంకరపట్నం మండలం ముత్తారం చెరువులో నీటిని కల్వల ప్రాజెక్ట్‌లోకి మళ్లించి, అక్కడి నుంచి వీణవంక, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, కల్లుపల్లి వాగు నుంచి మానేరులోని చెక్‌డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం నీళ్లు శివారుకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ విలాసాగర్‌లోని మానేరు వాగును సందర్శించారు. కాలినడకన.. నీరు చేరుకున్న చోటికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో మంత్రి ఈటల కాలినడకన వెళ్లా రు. మానేరు సంప్‌హౌస్‌లోకి నీరు నింపేలా చర్య తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్ఈకి ఫోన్లో సూచించారు. ముత్తారం చెరువు నుంచి కల్వల ప్రాజెక్ట్ లోకి మరింత నీరు వదలాలని ఆదేశించారు. ఆదివారం వరకు వాగులో నీటిప్రవాహవేగం పెరిగేలా చూడాలని తెలిపారు.అనంతరం జమ్మికుంటకు సరఫరా అయ్యే మంచినీటి బావులను పరిశీలించారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేలా చూడాలని మున్సిపాల్ చైర్మన్ పొడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేష్, పురపాలక కమిషనర్ అనిసూర్ రషీద్‌ను అదేశించారు. పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలి జమ్మికుంటరూరల్: వేసవి కాలం పూర్తయ్యే నాటికి చెక్‌డ్యాం పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ అధికారులను, గుత్తేదారును ఆదేశించారు. శనివారం మండలంలోని విలాసాగర్ మానేరు వా గుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించా రు. పదిహేను రోజుల్లో చెక్‌డ్యాం పనులు పూర్తయితే రబీలో రైతుల పంటలకు నీటికి కొదవ ఉండదని తెలిపారు. -
కిడ్నాపర్ కాదు.. బాధితుడే..
జమ్మికుంటరూరల్(హుజూరాబాద్) : జమ్మికుంట మండలం కొత్తపల్లిలో చిన్నారులను ఎత్తుకెళ్తున్నాడని పోలీసులకు అప్పగించిన యువకుడు కిడ్నాపర్‌కాదు.. తానూ బాధితుడే అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆ యువకుడిని తండ్రికి అప్పగించారు. జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గండు సౌమ్య– చంద్రశేఖర్‌ల ఇద్దరు కవల పిల్లలైన రిత్విక్‌రెడ్డి, సాత్విక్‌రెడ్డి ఈ నెల 23న ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు. వారిని ఎత్తుకెళ్లేందుకు యత్ని ంచిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు కూడా ఆ రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం టౌన్ సీఐ కార్యాలయంలో సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పిల్లలను కిడ్నాప్‌కు యత్నించిన యువకుడిని విచారించగా.. అతడి పేరు శీతల్‌బౌలి అలియాస్ సొత్తు అని, స్వగ్రామం పశ్చిమబెంగాల్ రాష్ట్రం బీర్బూమ్ జిల్లా రాంపూర్ హట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేల్‌పహారీని తెలిసిందన్నారు. దీంతో అక్కడి పోలీసుకు సమాచారం ఇవ్వగా పలు విషయాలు వెల్లడయ్యాయని వివరించారు. బేల్ పహారీ గ్రామానికి చెందిన జితేనా అనే యువకుడు హైదరాబాద్‌లో పని కల్పిస్తానని శీతల్‌బౌలిని 2017లో తన వెంట తీసుకెళ్లాడని చెప్పారు. అప్పటి నుంచి జితేన్‌తో పాటు శీతల్‌బౌలి అడ్రస్‌లేకుండా పోయారన్నారు. వారి తల్లి, దండ్రులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని, చివరికి తన కొడుకును జితేన్ కిడ్నాప్ చేశాడంటూ శీతల్‌బౌలి తండ్రి సపన్‌బౌలి ఈ ఏడాది ఏప్రిల్ 1న రాంపూర్ హట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా ఇక్కడి పోలీసులు రాంపూర్ హట్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ వివేకానంద ముఖర్జి, యువకుడి తండ్రి సపన్‌బౌలి జమ్మికుంట స్టేషన్‌కు వచ్చారు. సదరు యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకు సంబంధించిన వైద్య పత్రాలు చూపించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాలతో శీతల్‌బౌలిపై కేసు కొట్టివేసి తన తండ్రికి అప్పగించారు. -
దారుణం: కన్నకొడుకునే చంపేసిన తల్లి
-
అన్నం పెట్టిన దుకాణానికే కన్నం వేశాడు
జమ్మికుంట(హుజూరాబాద్): అన్నంపెట్టిన దుకాణానికే కన్నం వేశాడు ఓ ఘనుడు. సాయంగా ఉంటాడని గుమాస్తాను పెట్టుకుంటే డమ్మీతాళం చెవి సృష్టించి రెండు నెలలుగా బంగారం, నగదు అపహరిస్తున్నాడు. బుధవారం యజమాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాసుల శేషు బంగారం దుకాణం ఉంది. యాజమాని శేషు పట్టణంలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణను నాలుగు మాసాల క్రితం గుమాస్తాగా పెట్టుకున్నాడు. రామకృష్ణ షాపు కౌంటర్ తాళాలను పరిశీలించి యాజమాని లేని సమయంలో దొంగతనం చేసేందుకు కౌంటర్ తాళానికి డమ్మీ తాళం చెవిని తయారుచేశాడు. యాజమాని కౌంటర్‌కు తాళం వేసుకొని వెళ్లిన సమయంలో డమ్మీ తాళంచెవితో కౌంటర్ తాళాలు తీస్తూ్త అందులోని నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరించేవాడు. ఈ విషయమై అనుమానం వచ్చిన శేషు అతడి కదలికలపై నిఘా పెట్టాడు. బుధవారం సాయం త్రం శేషు బయటకు వెళ్లినట్లు నటించి దుకాణంలో ఉన్న గుమాస్తాను పరిశీలించాడు. ఇదే సమయంలో రామకృష్ణ జేబులో ఉన్న డమ్మీతాళం చెవితో కౌంటర్ తీసి అందులో రూ. 6వేల నగదు, కొంత బంగారాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు. గమనించిన వ్యాపారి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు అప్పగించాడు. ఇప్పటి వరకు రూ. 50 వేల నగదు, రెండు కిలోల వెండి, 12జతల బంగారు కమ్మలు పోయినట్లు శేషు పోలీసులకు వెల్లడించాడు. -
‘జనగణమన’కు వంద రోజులు
జమ్మికుంట: దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసులు ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలిపించడం ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అయింది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంటవాసులు ప్రతిరోజు జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించడం ప్రారంభించారు. బుధవారానికి వందరోజులు కావడంతో జమ్మికుంటవాసులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జమ్మికుంటలో ప్రతిరోజూ ఉదయం 8 గం.లకు ఊరు మొత్తం స్పీకర్లలో జనగణమన వినిపిస్తుంది. జాతీయ గీతం వినపడగానే ఎక్కడి వారు అక్కడే తమ పనులను ఆపేసి, గీతం పూర్తయ్యే వరకు నిల్చొని సెల్యూట్ చేస్తారు. ఆగస్టు 15 నుంచి ఇలా ప్రతిరోజూ జాతీయ గీతాన్ని గౌరవించుకోవాలని ఆ పట్టణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పోలీసులు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో స్పీకర్లను ఏర్పాటు చేశారు. జాతీయ గీతం ప్రారంభమవడానికి ఐదు నిమిషాల ముందు ఒక ప్రకటన వస్తుంది. దాంతో ప్రజలంతా సిద్ధమవుతారు. తర్వాత జనగణమన వస్తున్న 52 సెకన్ల పాటు వారు నిల్చునే ఉంటారు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో: నలుగురికి గాయాలు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం ట్రాక్టర్‌ను ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా జొంగంపల్లి, రెడ్డిపల్లివాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జమ్మికుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు తెలిపారు. -
నీటికోసం రైలు దిగితే పోయిన ప్రాణం
• జమ్మికుంటలో రైలు కిందపడి మహారాష్ట వాసి మృతి • బంధువులు, స్నేహితులు చూస్తుండగానే ఘోరం • మృతుడు మాజీ ఆర్మీ పోలీసు ఉద్యోగి జమ్మికుంట(హుజూరాబాద్) : నీటికోసం రైలు దిగిన మాజీ ఆర్మీ జవాన్ తిరిగి ఎక్కుతుండగా ప్రమాదశాత్తు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైల్వేస్టేషన్లో జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చముర్సీ తాలుకా పరిధిలోని అస్టీ పోలీసు పరిధిలోని కనరాగావ్ గ్రామానికి చెందిన ప్రకాశ్ తాతాజీ కోవే (51) ఆర్మీలో ఉద్యోగం చేశాడు. మధ్యలోనే బయటకు వచ్చాడు. కుటుంబ పోషణకోసం తెలంగాణలోని పలుచోట్ల కాంట్రాక్టర్ల వద్ద సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. గత నెల26న గ్రామానికి చెందిన బాబేన్ బిష్ణు మండల్, విజయ్ మగమ్, నారయన్ సర్కార్‌తో కలిసి సిద్దపేట జిల్లాకు ఉపాధికోసం వచ్చాడు. గురువారం రాత్రి కూలీ డబ్బు తీసుకొని నలుగురు నాగపూర్–అజ్మీర్ ప్యాసింజర్ రైలలో స్వగ్రామానికి వెళ్లేందుకు రైలుఎక్కారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు వచ్చే సరికి మంచినీళ్ల బాటల్ కొనేందుకు ప్రకాశ్ తాతాజీ కోవే రైలు దిగాడు. కొనుగోలు చేసి వెళ్లే సరికి రైలు కదిలింది. రైలు ఎక్కవద్దని కోరుతున్నా పరుగెత్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోయాడు. ఘటనలో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. వెంటనై బంధువులు చైన్‌లాగి రైలును ఆపారు. వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రకాశ్ తాతాజీ మృతి చెందాడు. తాతాజీ భార్య చంద్రకళ అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది. కుమారుడు ప్రదీప్ ఉన్నత చదువులు చదువుతున్నాడు. కళ్లముందే తోటి మిత్రుడు చనిపోవడంతో కన్నీరుపెట్టారు. రైల్వే జీఆర్పీ సత్తయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంటి స్థలం కోసం ఆత్మహత్యాయత్నం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా తన ఇంటి స్థలం తనకు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి జమ్మికుంట నగరపంచాయతీ కార్యాయలం ఎదుట ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోవడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు.. జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు స్థానిక కూరగాయల మార్కెట్లో హమాలీ పని చేస్తున్నాడు. ఆయన తాతకు జమ్మికుంట మండలకేంద్రంలోని వర్తకసంఘం సమీపంలో 4 గుంటల భూమి ఉంది. దీనిని 15 ఏళ్ల క్రితం రాజు బావ , ఇద్దరు వ్యక్తులకు అమ్మేశాడు. తన స్థలం తనకు ఇప్పించాలంటూ రాజు ఇప్పుడు ఆందోళనకు దిగాడు. -
జమ్మికుంటలో కార్డన్ సెర్చ్
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మోతుకులగూడెంలో బుధవారం తెల్లవారు జామున కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని అణువుణవూ తనిఖీ చేశారు. ఎలాంటి లైసెన్స్ లేని 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే సమాచారం అందించాలని ప్రజలను కమిషనర్ కోరారు. -
ఉద్యోగం రాదేమోనని..
జమ్మికుంట: తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాలి జమ్మికుంట గ్రామానికి చెందిన మంత్రిరాజు(23)అనే యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నాడు. హమాలీపని చేసుకునే సమ్మయ్య, రాజమ్మ దంపతులకు మంత్రి రాజు అనే కుమారుడున్నాడు. ఎంబీఏ పూర్తయిన మంత్రిరాజు గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు ఆదరువుగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
జమ్మికుంటలో కార్డన్ సెర్చ్
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
పోటెత్తిన పత్తి.. తగ్గిన ధర
జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్లో తెల్లబంగారానికి ధర తగ్గడంతో రైతులు తెల్లబోయారు. వారం వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.400 ధర పడిపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు దాదాపు ఆరువేల బస్తాల్లో మూడు వేల క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. అలాగే రెండు వందల పైగా వాహనాల్లో 2131 క్వింటాళ్లు లూజ్ పత్తి వచ్చింది. మొదట బస్తాల వద్ద మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్, వైస్‌చైర్మన్ రాజేశ్వర్‌రావు, కార్యదర్శి వెంకట్‌రెడ్డి సమక్షంలో వేలంపాట ప్రారంభించారు. నాణ్యమైన పత్తికి గరిష్ట ధర రూ.4960 పలుకడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. పత్తి ఎక్కువగా రావడంతో వ్యాపారులు, అడ్తిదారులు ధరలు తగ్గించి కొనుగోళ్లు చేపట్టారని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5370 వరకు ధరలు పలికారుు. మున్ముందు ధరలు పెరుగుతాయని రైతులు ఆశించగా.. వారం రోజుల్లోనే అంతా తారుమారైంది. లూజ్ పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5వేలు, కనిష్టంగా రూ.4560 వరకు ధరలు చెల్లించారు. బస్తాల్లో వచ్చిన పత్తి క్వింటాల్ రూ.3800 నుంచి రూ.4200 వరకు కోనుగోలు చేశారు. వారం రోజుల్లోనే క్వింటాల్‌కు ఏకంగా రూ.400 వరకు తగ్గడంతో పత్తి అమ్మలా... వద్దా అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. దీపావళి పండగ సమయంలో పత్తికి మంచి ధరలు పలుకుతున్నాయని సంతోషపడ్డ రైతులు ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. పత్తి మార్కెట్లో సోమవారం నుంచి కచ్చితంగా ఈ-నామ్ కొనుగోళ్లు అమలు చేస్తామని ప్రకటించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ విషయూన్ని మరిచిపోయారు. ఆన్లైన్ కొనుగోళ్లపై అధికారులు ఊసెత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఆన్లైన్ కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. వ్యాపారులు నేరుగా వేలంపాడటం కంటే ఆన్లైన్లో బిడ్డింగ్ చేయడం పత్తికి ఎక్కువ ధర పలుకుతుందని, ఈ-నామ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయూలని రైతులు కోరారు. -
'ఆన్లైన్'లో ఇంత మోసమా!
-
'ఆన్లైన్'లో ఇంత మోసమా!
జమ్మికుంట: పండుగ సంబురానికి అదనంగా డెలివరీ బాయ్ తెచ్చిన ల్యాప్‌టాప్ పార్సిల్‌ను చూసి ఆ కుటుంబం ఎగిరి గంతేసింది. ఉత్సుకతతో పార్సిల్ తెరిచిచూసి ఒక్కసారిగా దిగ్భాంతికి గురైంది! ఆన్లైన్ షాపింగ్ ద్వారా బుక్ చేసిన లాప్టాప్కు బదులు ఫ్లైవుడ్(చెక్క) ముక్క కనిపించిందా పార్సిల్లో! కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటోన్న మామిడాల శ్రీధర్.. నవంబర్ 2న స్నాప్‌డీల్ అప్లికేషన్ ద్వారా రూ.34 వేల విలువచేసే హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకున్నారు. మంగళవారం(దసరా పండుగనాడు) ఆ బుకింగ్‌కు సంబంధించిన పార్సిల్‌ను డెలివరీ బాయ్ తీసుకొచ్చాడు. పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిన శ్రీధర్ తీరా దాన్ని తెరిచి చూశాక.. ల్యాప్‌టాప్‌కు బదులు ఫ్లైవుడ్ ఉండటంతో కంగుతిన్నాడు. పార్సిల్ తెరిచే టప్పుడు వీడియో తీసిన బాధితుడు తాను మోసపోయిన తీరును మీడియాకు వెల్లడించాడు. (ఆ దృశ్యాలను వీడియోలో చూడొచ్చు) మోసం తెలుసుకున్న తర్వాత డెలివరీ బాయ్‌కి ఫోన్ చేయగా.. 'నాకేమీ తెలియదని, ఏం చేసుకుంటావో చేసుకోమని' అన్నట్లు శ్రీధర్ చెప్పారు. ఈ వ్యవహారంపై స్నాప్‌డీల్ కంపెనీకి కూడా ఫిర్యాదుచేశామని, వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు మెయిల్ చేసిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదుచేశానని పేర్కొన్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి మోసాలు చోటుచేసుకున్నప్పుడు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్ లాంటి పెద్ద ఆన్లైన్ వ్యాపార సంస్థలు.. ఆయా డెలివరీ బాయ్స్తోపాటు స్థానిక డిస్ట్రిబ్యూటర్లపైనా చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. -
జమ్మికుంటలో పత్తి ధర రూ. 4700
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ. 4700 గరిష్ట ధర పలికింది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు 800 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. కనిష్ట ధర రూ.4500 చెల్లించగా.. మోడల్ ధర రూ.4600 నిర్ణయించారు. ఇద్దరు వ్యాపారులు మార్కెట్లో కొనుగోళ్లకు రావడంతో బీటైపు వ్యాపారులు ధరలు కొంత పెంచి కొనుగోళ్లు జరిపారు. తేమ అధికంగా ఉన్న కొత్త పత్తికి రూ. 3200 నుంచి 3800 వరకు చెల్లించారు. నాణ్యమైన పత్తికి గరిష్ట ధర రూ. 4700 చెల్లించారు. -
జీవో 59లో అవకతవకలపై ఏసీబీ విచారణ
జమ్మికుంట రూరల్ : గతంలో జమ్మికుంట తహసీల్దార్‌గా పని చేసిన రజిని పదవీ కాలంలో 59 జీవోలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు క్రమబద్ధీకరణ ద్వారా లబ్ధి చేకూర్చడంతో భారీగా ముడుపులు అందాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సీఐ సుందరగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం కబ్జాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 59ని అనుకూలంగా మార్చుకున్న కొందరు తహసీల్దార్ సహకారంతో అక్రమంగా లబ్ధి పొందారని ఆరోపణలున్నాయి. వేలాది గజాల విలువైన భూములను అప్పటి తహసీల్దార్ రజిని అనర్హులకు కట్టబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కార్యాలయంలో సుదీర్ఘ విచారణ జరిపారు. దరఖాస్తులు, లబ్ధిదారుల జాబితా పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలో మొత్తం 180 దరఖాస్తులు అందగా.. 30 మంది దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. వారిలో పదిమందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు. విచారణలో భాగంగా ఎంత భూమిని కేటాయించారంటూ కొందరు లబ్ధిదారులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే.. తమ వద్ద సంబంధిత దస్తావేజులు లేవని వారు సమాధానం చెప్పడంతో రెవెన్యూ సిబ్బందిపై ఏసీబీ అధికారులు మండిపడ్డారు. -
జమ్మికుంటలో ఇద్దరు చిన్నారులకు డెంగీ?
అపరిశుభ్రంగా పట్టణం వ్యాప్తి చెందుతున్న దోమలు జమ్మికుంట : పట్టణంలోని ఐదో వార్డుకు చెందిన రాజేశం (మండల సర్వేయర్) పిల్లలు అఖిల్, నేహకు డెంగీ సోకినట్లు ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధరించారు. వీరు నాలుగురోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు వారికి డెంగీ ప్రబలినట్లు వైద్యులు పేర్కొన్నారని రాజేశం తెలిపారు. పట్టణంలోని ఏ వార్డు చూసినా.. అపరిశుభ్రత రాజ్యమేలుతోందని కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు. మురుగుకాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. నగర పంచాయతీ పరిధిలోని 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డుల్లో మురుగుకాలువలు అపరిశుభ్రంగా మారాయి. చెత్తాచెదారం పేరుకపోవడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వ్యాప్తి చెంది రోగాలు సోకుతున్నాయి. కూరగాయల మార్కెట్ ఏరియా, అంబేద్కర్ కాలనీ, దుర్గకాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ, పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డు, పీఏసీఎస్ ఏరియా, వర్తక సంఘం ఏరియాల్లో మురుగు కాలువల్లో చెత్తచెదారం నిండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారే అధికంగా రోగాల పాలవుతున్నట్లు ఆసుపత్రుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. రోగాల నియంత్రణకు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విడిపోతున్న బంధం!
వీణవంక : జిల్లాల పునర్విభజనలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం మాత్రమే ఇక కరీంనగర్ జిల్లాలోనే కొనసాగనుంది. కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మికుంట మండలంతో పాటు హుజూరాబాద్, కమలాపూర్ మండలాలు కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోకి చేరనున్నాయి. వీణవంక–జమ్మికుంట మండలాల మధ్య 30 ఏళ్ల అనుబంధం కొనసాగింది. విద్య, వ్యాపార రంగాలతో పాటు, బస్సు, రైల్వే సౌకర్యం, బ్యాంకు లావాదేవీలు జమ్మికుంటలో ఉండడంతో వీణవంక మండల ప్రజలు సుమారు 90 శాతం వరకు నిత్యం అక్కడికే వెళుతుంటారు. వీణవంక–కరీంనగర్ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న జమ్మికుంటనే ఈ ప్రాంతవాసులకు పెద్ద దిక్కుగా ఉండేది. పునర్విభజనలో భాగంగా జమ్మికుంటను హన్మకొండలో కలపడం ప్రస్తుతం ఇబ్బందిగా మారనుందని మండల ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలంలో 20గ్రామ పంచాయతీలు, ఐదు అనుబంధ గ్రామాలున్నాయి. 48వేల జనాభా ఉండగా 18వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కవగా వ్యవసాయం మీద ఆధారపడుతారు. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలు దాదాపు అన్ని గ్రామాలకు విస్తరించి ఉండటంతో వరి పంటపైనే ఎక్కవగా మొగ్గు చూపుతారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని జమ్మికుంటకే తరలిస్తుంటారు. చల్లూరు, మామిడాలపల్లి, ఎల్భాక, గంగారం గ్రామాల ప్రజలు మాత్రమే వ్యాపార నిమిత్తం కరీంనగర్‌కు వెళుతుంటారు. ఇటీవల జరిగిన సమావేశంలో అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని తీర్మాణం చేశారు. అయితే జమ్మికుంట కూడా వీణవంకతోనే ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెరపైకి ‘బేతిగల్’ మండలంలోని బేతిగల్ గ్రామాన్ని జమ్మికుంటలో కలపాలనే ప్రతిపాదనను ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం గ్రామ సభ నిర్వహించగా ఎక్కవ మంది జమ్మికుంట మండలంలో కలుపాలని ప్రతిపాదించారు. బేతిగల్‌కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జమ్మికుంట ఉంది. అదే కరీంనగర్‌కు వెళ్లాలంటే 40 కిలోమీటర్ల ప్రయాణం తప్పనిసరి. ఈ మేరకు గ్రామం నుంచి 120 మంది వరకు జమ్మికుంటలో కలుపాలని వెబ్సైట్లో ఫిర్యాదు చేశారు. అయితే దాదాపుగా వీణవంకతో జమ్మికుంటకు ఉన్న అనుబంధానికి త్వరలో తెరపడనున్నట్లు తెలిసింది. -
వేటు పడింది
జమ్మికుంట మాజీ తహసీల్దార్, వీఆర్వో సస్పెన్షన్ జమ్మికుంట రూరల్ : ఏసీబీ కేసులో ఇటీవల అరెస్టయిన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజని, పట్టణ వీఆర్వో శ్రీనివాస్‌లపై సస్పెన్షన్ వేటుపడింది. జమ్మికుంట తహసీల్దార్‌గా 18 నెలల పాటు పని చేసిన రజని, పట్టణ వీఆర్వోగా పనిచేసిన శ్రీనివాస్ భూ రికార్డుల సవరణ, పేరు మార్పిడి, పట్టాదారు పాసుపుస్తకాల జారీలో అడ్డగోలు అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి మే 30న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జూన్ 13న ఏసీబీ డీజీ ఏకే.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. ఏకే.ఖాన్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు రెండు దఫాలుగా లోతుగా విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుని గతనెల 22న రజని, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వారికి ఇప్పటికీ బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ3గా పేర్కొన్న రజని డ్రైవర్ పరారీలో ఉన్న కారణంగా అతడికి సైతం బెయిల్ మంజూరు కాలేదని తెలిసింది. -
ఈసారైనా తేలేనా..?
సీసీఐ అక్రమాలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న సీబీఐ విచారణ తాజాగా మళ్లీ జమ్మికుంటలో సీబీఐ అధికారుల విచారణ షురూ.. ఇప్పటికే మూడుసార్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సీబీఐ అధికారుల తనిఖీలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జమ్మికుంట : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై గత రెండేళ్లుగా సెంట్రల్ బ్యూరో ఇఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు కొనసాగిస్తున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. సీబీఐ డీఎస్పీ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో అధికారులు గత రెండ్రోజులుగా జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మార్కెట్ కార్యాలయంలో రికార్డులున్న బీరువాను సీజ్ చేశారు. 2004–2015 మధ్య కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారులను పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. పత్తి కొనుగోళ్లు, రికార్డులకు సంబంధించి మార్కెట్ కార్యాలయ అధికారులను పలు ప్రశ్నలు వేసి ఆరా తీశారు. హైకోర్టు ఆదేశాలతో 2015 ఫిబ్రవరిలో ప్రారంభమైన సీబీఐ విచారణ దఫదఫాలుగా కొనసాగుతుండటంతో ఇప్పట్లో కొలిక్కి వచ్చేనా? అక్రమాలు వెలుగు చూసేనా? దోషులెవరనేది ఇప్పట్లో తేలేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ మొదలైంది ఇలా.... సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జమ్మికుంటకు చెందిన రాజేశ్వర్‌రావు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన హైకోర్టు సీసీఐ పత్తి కొనుగోళ్లపై విచారణ జరపాలని 2015 ఫిబ్రవరిలో సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సీసీఐ లావాదేవిలపై సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఫిబ్రవరి 13న జమ్మికుంటలో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 12 సీబీఐ బృందాలు సీసీఐ కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ సెంటర్ ఇన్చార్జీల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. జమ్మికుంట సెంటర్లో పనిచేసిన సీసీఐ అధికారి ఇంటిపై వరంగల్‌లో సీబీఐ అధికారులు తనిఖీలు చేయగా భారీగా ఆస్తులు, బంగారు అభరణాలు, లక్షల్లో నగదు లభ్యమయ్యాయి. జమ్మికుంటలో సైతం ఆడ్తిదారులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారుల ఇళ్లపై డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. పాత వ్యవసాయ మార్కెట్లో సీసీఐకి సంబంధించిన రైతుల తక్‌పట్టీలు, పట్టదారు పాసుపుస్తకాలు, రికార్డులను అప్పట్లో సీజ్ చేశారు. మళ్లీ అక్టోబర్‌లో తనిఖీలు 2015 ఫిబ్రవరిలో సీసీఐ పత్తి కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేసిన అధికారులు మళ్లీ అదే ఏడాది అక్టోబర్‌లో జమ్మికుంటలో విచారణ చేపట్టారు. 2004 నుంచి 2015 వరకు మార్కెట్లో సీసీఐకి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి అమ్మిన రైతుల వివరాలను గ్రామాల్లోకి వెళ్లి వివరాలు సేకరించారు. పట్టణంలోని పలు బ్యాంకుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులను పరిశీలించారు. తక్‌పట్టీల వారీగా రైతుల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించారు. సీసీఐ కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నవంబర్‌లో సైతం సీబీఐ అధికారులు సీసీఐ కొనుగోళ్లపై అనేక కోణాల్లో విచారణ జరిపి నివేదిక తయారు చేశారు. చార్జీషీట్ దాఖాలు చేస్తున్నారనే ప్రచారం నాడే జరిగింది. అప్పటినుంచి మౌనంగా ఉన్న సీబీఐ అధికారులు తాజాగా మళ్లీ జమ్మికుంటలో విచారణ చేపట్టడం చర్చనీయాంశమైంది. నాడు విచారణ చేపట్టిన సీబీఐ అధికారుల్లో పలువురు బదిలీ అయినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణలో చిట్టా ఇదే... సీబీఐ విచారణలో అనేక అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. సీసీఐ ఎంత మంది వద్ద పత్తి కొనుగోళ్లు చేసింది? అందులో బినామీ రైతులెందురున్నారు? రెతుల పేరుతో సీసీఐకి పత్తిని విక్రయించిన దళారులు ఎవరు? మొత్తం ఎన్నికోట్ల అక్రమ దందా సాగింది? అక్రమాలకు సూత్రధారులెరు? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యముంది? అనే అంశాలపై సీబీఐ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. వరంగల్‌లో నివాసముంటూ జమ్మికుంటలో దందా కొనసాగిస్తున్న పలువురు వ్యాపారులను, ఆడ్తిదారులను సీబీఐ అధికారులు రహస్యంగా విచారించారు. పలువురు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. అప్పట్లో విచారణ పూర్తయిందని భావించిన రైతులు.. తాజాగా మళ్లీ సీబీఐ విచారణ చేపట్టడంతో ఇప్పట్లో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశాల్లేవనే భావనకు వచ్చారు. -
ఆరో రోజుకు చేరిన రెండో ఏఎన్ఎంల సమ్మె
కళ్లకు గంతలతో నిరసన జమ్మికుంట : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండో ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ముందుగా ప్రభుత్వ ఆస్పత్రి నుంచిగాంధీ చౌక్ వద్దకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇల్లందకుంట, వావిలాల, వీణవంక, ^è ల్లూరు పీహెచ్సీ పరిధిలోని ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
జమ్మికుంటలో రేషన్ బియ్యం పట్టివేత
జమ్మికుంట : జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి రాత్రి సమయంలో రైళ్లలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి నాగ్‌పూర్ ప్యాసింజర్‌లో రేషన్ బియ్యాన్ని తరలించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు మొదటి ప్లాట్‌ఫాం 32 సంచుల్లో 20 క్వింటాళ్లు ఉంచారు. ఇదే సమయంలో జమ్మికుంట ఎస్సై సంజయ్‌కుమార్ తన సిబ్బందితో రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టగా ప్లాట్‌ఫాంపై 32 సంచులు కనిపించాయి. వెంటనే పోలీసులు సంచులను తెరిచి చూడగా అందులో రేషన్ బియ్యం కనిపించాయి. పోలీసులను గమనించి రవాణాదారులు అక్కడి నుంచి జారుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఠాణాకు తరలించారు. -
జమ్మికుంట రోడ్లకు మహర్దశ
- పట్టణంలో ఫోర్‌లేన్, డబుల్ రోడ్ల నిర్మాణం - రూ.55 కోట్లు విడుదల, త్వరలో టెండర్లు జమ్మికుంట : జమ్మికుంట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి ఈటల రాజేందర్ రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల క్రితం మంత్రి ఈటల రాష్ట్ర ప్రణాళిక నిధుల నుంచి రూ.55 కోట్లు మంజూరు చేశారు. జమ్మికుంట గాంధీచౌక్ నుంచి కొండపాక రహదారి వరకు, గాంధీచౌక్ నుంచి వీణవంక రోడ్డు వరకు ఫోర్‌లైన్ పనులకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాంధీ చౌక్ నుంచి కోరపల్లి వైపు రహదారి 30 నుంచి 35 అడుగుల వరకు ఉండగా... ఎఫ్‌సీఐ వరకు ఫోర్‌లైన్‌గా విస్తరించనున్నారు. కోరపల్లి - కొండపాక జంక్షన్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. అక్కడి నుంచి బిజిగిరిషరీఫ్ దర్గా వరకు డబుల్ రోడ్డు పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. గాంధీచౌక్ నుంచి వీణవంక రహదారిలోని డిగ్రీ కళాశాల వరకు...గాంధీ చౌక్ నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు వ్యాపార దుకాణాలు, ఇళ్లు రోడ్డు పక్కనే ఉండడంతో వ్యాపారులు 60 అడుగుల నుంచి 70 అడుగుల వరకు సెట్‌బ్యాక్ అవుతారా అనే సందేహాలు మొదలయ్యాయి. వ్యాపారులు సహకరిస్తేనే పట్టణంలో ఫోర్‌లైన్ పనులు జరిగే అవకాశం ఉంది. తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు జమ్మికుంట గాంధీ చౌక్ నుంచి నగర పంచాయతీ వరకు రోజూ ఎఫ్‌సీఐకి బియ్యం లారీలు, పత్తి వాహనాలు వస్తుంటారుు. ఆర్టీసీ బస్సులు వచ్చిన సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. వీణవంక రహదారిలో స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, లారీల రాకపోకలతో పాటు ప్రతి మంగళవారం జరిగే వారసంత వల్ల ట్రాఫిక్ గందరగోళంగా తయారవుతుంది.ఈ రోడ్లను వెడల్పు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నారుు. త్వరలో పనులు ప్రారంభం రూ.55 కోట్లతో చేపట్టే రోడ్ల పనులను రెండు నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. ఇందుకు సంబంధించి టెక్నికల్ ప్రణాళికలు సిద్ధం చేసి డీపీఆర్ తయూరు చేయనున్నట్లు వారు తెలిపారు. నెల రోజుల్లో పనులకు ఆన్లైన్ టెండర్లను పిలుస్తామని రోడ్లు భవనాల శాఖ ఈఈ రాఘవాచార్యులు పేర్కొన్నారు. -
జమ్మికుంటలో 'ఓసీ' మహాగర్జన
జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంటలోని ఎంటీఆర్ గార్డెన్స్‌లో సోమవారం 'ఓసీ' మహాగర్జన జరుగుతోంది. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో వెలమ, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్యతో పాటు పలు ఓసీ కులాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓసీల సమస్యలు, రిజర్వేషన్ల అంశంపై ఈ సభలో ఏకరువు పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భాస్కర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం బిజిగిరిషరీప్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న పంజాల ధనుష్(12) అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మూత్ర విసర్జనకని ఉపాధ్యాయులకు చెప్పి ఇద్దరు స్నేహితులతో కలసి దగ్గర్లో ఉన్న యాగాని కుంట చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
జమ్మికుంట : కరీంనగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంట రైల్వేస్టేషన్లో సోదాలు నిర్వహించిన రైల్వేపోలీసులు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బోగీల్లోని సీట్ల కింద పెట్టి మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. -
కల్తీ మద్యం.. వైన్ షాప్ సీజ్
జమ్మికుంట (కరీంనగర్) : కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. గాంధీ చౌరస్తా వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నారని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దుకాణాన్ని సీజ్ చేసి షాప్ యాజమని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో కూడా మద్యం కల్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
పనిచేస్తున్న చోటే చేతివాటం చూపిన గుమస్తా
జమ్మికుంట (కరీంనగర్) : ఉద్యోగం చేస్తున్న చోటే చేతివాటం చూపి అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...జమ్మికుంటలోని ధనలక్ష్మి జ్యుయెలర్స్‌లో కటుకోజు సురేశ్ గుమస్తాగా కుదిరాడు. ఆరు నెలలుగా నమ్మకంగా పనిచేస్తూ యజమాని కందుకూరి వెంకటేశ్వర్లు నమ్మకాన్ని చూరగొన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా దుకాణంలోని చిన్ని చిన్న ఆభరణాలు మాయమవుతున్నాయి. యజమాని వెంకటేశ్వర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన జమ్మికుంట పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో నిందితుడు సురేశ్ అని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దుకాణం నుంచి 10 తులాల చెవి కమ్మలతోపాటు రెండు కిలోల వెండిని తస్కరించినట్లు అతడు ఒప్పుకున్నాడు. సోదరుడు రవీందర్ సాయంతో వాటిని విక్రయించినట్లు వెల్లడించాడు. దీంతో దొంగసొత్తుతోపాటు సురేశ్, రవీందర్ సహా కొనుగోలు చేసిన నలుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. -
కరెంటు షాక్‌తో ఉపసర్పంచ్ మృతి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం శాయంపేట గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ రావు(32) మంగళవారం కరెంటు షాక్‌తో మృతిచెందాడు. తన వ్యవసాయబావి వద్ద మోటారు ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోపాల్ రావుకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. -
'రైతులకు అన్యాయం జరగనివ్వం'
జమ్మికుంట రూరల్: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డులో కొనుగోళ్ల తీరును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. మార్కెట్ లో పత్తి కొనుగోళ్లలో జాప్యం, మోసాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు బస్తాల్లో తీసుకొచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి బస్తాల్లో తేమ ఉంటుందంటూ వాటిని కొనుగోలు చేయడానికి నిరాకరించడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్కెట్లో జరుగుతున్నకొనుగోళ్ల వ్యవహారంపై వివరాలు కావాలంటూ భాస్కర్‌రెడ్డి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు. -
తుపాకీ నీడలో పత్తి కొనుగోళ్లు
సమ్మెలోకి ఎడ్ల బండ్లకార్మికులు తక్‌పట్టీలు ఇవ్వని అధికారులు జమ్మికుంట పత్తి మార్కెట్లో ఎడ్ల బండ్ల కార్మికుల సమ్మె పిలుపుతో కొనుగోళ్లలో అనిశ్చితి ఏర్పడింది. పత్తి కొనుగోళ్లను కార్మికులు అడ్డుకుంటారనే అనుమానంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కరీంనగర్ నుం చి ఏఆర్ పోలీసులను ఉదయమే మార్కెట్లో దించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో పత్తి కొనుగోళ్లకు ఆటంకాలు కలగకుండా తుపాకీ నీడలో మార్కెట్ పహారా కా శారు. ఉదయం 10 గంటలకు వివిధ ప్రాం తాల నుంచి రైతులు లూజ్ పత్తిని వాహనాల్లో మార్కెట్‌కు అమ్మకానికి తీసుకురాగా.. సీసీఐ 400 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసింది. క్విం టాల్‌కు రూ.4050, రూ. 3,969 ధరలు పెట్టా రు. ప్రైవేట్ వ్యాపారులు 275 క్వింటాళ్ల పత్తిని రూ.3,980 నుంచి 3880 వరకు కొనుగోళ్లు చే పట్టారు. అరగంటలో లూజ్ పత్తి అమ్మకాలు పూర్తి కాగా.. వాహనాలు సైతం మిల్లులకు తరలిపోయాయి. తుపాకీ నీడలో కొనుగోళ్లు షూరు కావడంతో మార్కెట్లో ఏం జరుగుతుందోననే రైతులు భయంతో గడిపారు. బస్తాల్లో వచ్చిన పత్తిని సీసీఐ కొనుగోళ్లు చేసినా తక్‌పట్టీలు ఇవ్వలేదు. దీంతో రైతులు ఏం చేయలో తోచక ఎదురుచూపులు చూస్తున్నారు.కొందరు ఆరుబయట నుంచే నేరుగా మిల్లుల్లోకి తీసుకెళ్లి అమ్ముకున్నారు. సమ్మె ప్రారంభం జమ్మికుంట పత్తి మార్కెట్లోకి లూజ్పత్తి వాహనాలు రావడంతో ఉపాధి కోల్పోతున్నామని మార్కెట్ అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చామని ఎడ్ల బండ్ల కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె సాగుతుందని కార్మికులు ప్రకటించారు. మొదటి రోజు కార్మికులు మార్కెట్ గేట్ వద్ద సమ్మె చేపట్టారు. వారు రవాణాకు దూరంగా ఉన్నారు. -
పత్తి మార్కెట్లో ధర దగా
క్వింటాల్‌కు రూ.500 కోత - అధికారులను నిలదీసిన రైతులు - ఒక్కరోజే రూ.2.50లక్షల దోపిడీ జమ్మికుంట: పత్తి ధరల్లో వ్యాపారుల దగాకోరుతనం ఆగడంలేదు. గరిష్ట ధర చెల్లిస్తామని చెప్పి కనిష్ట ధర కూడా పెట్టక రైతులను నిలువునా ముంచుతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సోమవారం ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వరంగల్ జిల్లా నుంచి రైతులు దాదాపు రెండు వేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తెచ్చారు. సుమారు వంద వాహనాల్లో లూజ్ పత్తి తెచ్చారు. బస్తాల్లో వచ్చిన పత్తికి వ్యాపారులు పోటీ పడి జెండా పాటలో క్వింటాల్‌కు రూ.5వేలు గరిష్ట ధర పలికారు. లూజ్ పత్తికి రూ.5180 ధర పెట్టారు. మార్కెటింగ్ శాఖ అధికారులు బస్తాల్లో వచ్చిన పత్తికి క్వింటాల్‌కు రూ.5వేలు ధర పలికిందని వెల్లడించడంతో రైతులు ఒక్కసారిగా బిత్తరపోయారు. మార్కెట్లో ఎక్కడా రైతులకు రూ.5వేల ధర రాలేదని, కేవలం రూ.4350 నుంచి రూ.4500 వరకే ధరలు చెల్లించారని వందలాది మంది రైతులు అసిస్టెంట్ కార్యదర్శికి చెప్పారు. వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తున్నామని చెబుతూ రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోవడంలేదెందుకని ఆయనను నిలదీశారు. చెల్లించే ధరలు ఒకలా ఉంటే అధికారులు ప్రకటించే ధరలు మరోలా ఉన్నాయని మండి పడ్డారు. అందరూ కలిసి రైతులను ముంచుతున్నారన్నారు. రైతుల పక్షాన నిలువాల్సిన అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఒక్క రోజే దాదాపు 500 క్వింటాళ్ల పత్తికి రూ.4500 ధర చెల్లించి రూ.2.50 లక్షల దోపిడీ చేశారన్నారు. మార్కెట్లో జెండా పాట ఒకటి, చెల్లించే ధర మరొకటి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. 17 బస్తాల పత్తి తీసుకువస్తే రూ.5వేలు ధర పెట్టి, రూ.4500 ఇచ్చారని వరంగల్ జిల్లా రాఘవరెడ్డిపేటకు చెందిన జగదీశ్ వాపోయాడు. ఎడ్లబండ్ల కార్మికుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు మార్కెట్‌కు లూజ్ పత్తి వస్తుండడంతో తమకు పని లేకుండా పోతోందని ఎడ్లబండ్ల కార్మికులు విధులు బహిష్కరించడంతో పత్తి కొనుగోళ్లు ఐదు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఎండలో అరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్‌ను నిలదీశారు. ధరల నిర్ణయం అనంతరం మార్కెట్‌కు వాహనాల్లో లూజ్ పత్తి వస్తుండడంతో తమ ఉపాధిపై దెబ్బ పడుతుందని పత్తి రవాణా చేసే ఎడ్ల బండ్ల కార్మికులు నిరసనకు దిగారు. దీంతో బస్తాల్లో వచ్చిన పత్తి తూకాలు నిలిచి పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట కావస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు విసుగెత్తిపోయారు. సహనం కోల్పోయి అసిస్టెంట్ కార్యదర్శి వద్దకు వెళ్లి నిలదీశారు. తాను కార్మికులతో మాట్లాడుతున్నానని, వెంటనే తూకం వేయిస్తానని సముదాయించినా రైతులు వినిపించుకోలేదు. మార్కెట్‌కు సెలవు ప్రకటించి కార్మికుల సమస్యలపై చర్చించుకోవాలి గానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఐదు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు సాయంత్రం పత్తిని తూకం వేయించారు.