మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్‌ పత్తి ధర రూ.7,800  | Karimnagar Jammikunta Cotton Rs 7800 For Quintal | Sakshi
Sakshi News home page

మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్‌ పత్తి ధర రూ.7,800 

Published Thu, Sep 23 2021 8:16 AM | Last Updated on Thu, Sep 23 2021 9:13 AM

Karimnagar Jammikunta Cotton Rs 7800 For Quintal - Sakshi

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడ్డారు. నాణ్యంగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.7,800 గరిష్ట ధర పలికింది. అలాగే కనిష్టంగా రూ.6,000 వరకు వేలం పాటలో రైతులకు చెల్లించారు.

నారాయణపేట జిల్లాలో కూడా మంచి ధర వచ్చింది. ఊట్కూర్‌ మండలం తిప్రాస్‌పల్లి సమీపంలోని విజయ్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌ నిర్వాహకులు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,300 ధర చెల్లించారు. అలాగే కనిష్టంగా రూ.6,500 చెల్లించారు.     – జమ్మికుంట/నారాయణపేట 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement