cotton
-
చిరుధాన్యాలపై రైతుల అనాసక్తి
రామన్నపేట: గడ్డిజాతి పంటలైన చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఏటేటా పడిపోతోంది. ఆహారం, పశుగ్రాసం కోసం సాగుచేసే చిరుధాన్యా లను సిరిధాన్యాలు అని కూడా అంటారు. మంచిపోషకాలు కలిగిన చిరుధాన్యాలు వర్షా ధార పంటలు. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలు గోధు మలతో సరితూగుతాయి. యాదాద్రి భువన గిరి జిల్లాలో సాగునీటి వనరులు పెరగడంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆ తరువాత వాణిజ్య పంట అయిన పత్తిని పెద్దమొత్తంలో సాగు చేస్తున్నారు.గతంలో సగం చిరుధాన్యాలేచిరుధాన్యాలను సాధారణంగా వానాకాలంలోనే సాగు చేస్తారు. స్వల్ప ఖర్చుతో సేంద్రియ పద్ధతుల్లో రసాయనాలు వాడకుండా పండించేవారు. 10–15 సంవత్సరాల క్రితం వరకు సాగులో సగం వరకు చిరుధాన్యాలపంటలే ఉండేవి. వీటిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు, నాణ్యమైన విత్తనాలు లేకపో వడం.. ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో సాగు విస్తీర్ణం ఏటా పడిపో తోంది. పిట్టల నుంచి కాపాడుకోవడం కష్టత రంగా మారడం, ఇటీవలి కాలంలో కోతుల బెడద ఎక్కువ అవడం, సాగునీటి వనరులు మెరుగు పడడం కూడా చిరుధాన్యాల సాగు తగ్గడానికి కారణంగా మారాయి. ఆరోగ్యానికి మేలుదశాబ్దం క్రితంవరకు సామాన్యుడి ఆహారంలో చిరుధాన్యాలతో వండే సజ్జగట్క, జొన్నగట్క, రొట్టెలు, రాగిజావను ఎక్కువగా ఉండేవి. వీటిలో అధిక పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. విటమిన్ బీ 12, బీ 17, బీ 6ను కలిగి ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇటీవ చిరుధాన్యాలను భుజించడం సర్వసాధారణమైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెరగడం లేదు. పైగా ప్రతి ఏటా తగ్గుతూ వస్తుంది. -
పత్తి తీసే యంత్రం రెడీ!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత ముఖ్యమైనది పత్తి. వర్షాధారంగా గానీ, ఆరుతడి పంటగా గానీ దాదాపు 113 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నప్పటికీ పత్తి తీయటానికి ఉపయోగపడే యంత్రం లేదు. మార్కెట్లో కనీసం ఒక్క హార్వెస్టర్ కూడా అందుబాటులో లేని ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది పత్తి మాత్రమే. రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపైనే ఆధారపడాల్సి రావటం, సీజన్లో రైతులందరికీ ఒకేసారి పత్తి తీసే అవసరం ఉండటంతో వారు అనేక కష్టాలు ఎదుర్కోక తప్పటం లేదు.కాటన్ హార్వెస్టర్ రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (సీఐఏఈ)లో వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి తీపి కబురు చెప్పారు. ట్రాక్టర్‌కు జోడించి పత్తి తీసే యంత్రంపై తమ పరిశోధన కొలిక్కి వస్తోందని, త్వరలో ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌదరి ‘సాక్షి సాగుబడి’ తో చెప్పారు.పత్తి తీతలో 95% సామర్థ్యంట్రాక్టర్కు జోడించి నడిపించే బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ పొలంలోని 95 శాతం పత్తిని సమర్థవంతంగా తీయగలుగుతోందని చౌదరి చెప్పారు. ఒక హెక్టారు పత్తి పొలంలో దూదిని పూర్తిగా తీయటానికి 1,560 గంటల మానవ శ్రమ అవసరమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఒక మనిషి నిమిషానికి ఒకటిన్నర (1.58) మొక్కల నుంచి దూదిని తీస్తుంటే, తాము రూపొందించిన యంత్రం 70 మొక్కల నుంచి దూదిని తీస్తోందన్నారు.మనిషి గంటకు 4.92 కిలోల గింజల పత్తిని తీస్తుంటే, ఈ యంత్రం 150–217 కిలోలు తీస్తోందని తెలిపారు. అయితే పత్తి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో 28 శాతం వరకు ఆకులు, రెమ్మలు తదితర చెత్త కూడా పత్తికి అంటుకొని వస్తోందన్నారు. ఈ యంత్రానికి ప్రీ క్లీనర్లను అమర్చటం ద్వారా చెత్తను 10–12 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ప్రొటోటైప్ యంత్రాన్ని సిద్ధం చేసి టెక్నాలజీని కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని చౌదరి వెల్లడించారు. దీని ధర మార్కెట్లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.అనువైన వంగడాల లేమి!పత్తి తీసే యంత్రం సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మిషీన్ హార్వెస్టింగ్‌కు అనువైన పత్తి వంగడాలు మన దగ్గర లేకపోవటం మరో ప్రధాన ప్రతిబంధకం. విదేశాల్లో పండించే పత్తి రకాలు యంత్రం వినియోగానికి అనువుగా ఉంటాయని చౌదరి వివరించారు. మొక్కకు ఒకే కొమ్మ (సింగిల్ షూట్) పెరుగుతుందని, అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయన్నారు. అయితే, దేశంలో సాగయ్యే పత్తి మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయని తెలిపారు.కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు.. పగలవని, అందుకే నాలుగైదు దఫాలుగా పత్తి తీయాల్సి వస్తోందని వివరించారు. కాయలన్నీ ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాన్ని రూపొందించడానికి నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. యంత్రంతో పత్తి తీయటానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కల ఆకులను రాల్చేందుకు డీఫోలియంట్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. దూదితో పాటు వచ్చే చెత్త శాతాన్ని తగ్గించటంలో ఇది కూడా కీలకమని చౌదరి చెప్పారు. -
తెలంగాణ వ్యాప్తంగా ఆగిన పత్తి కొనుగోళ్లు.. రైతులు ఆగ్రహం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. గత రెండ ోరోజులుగా సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) సర్వర్ పని చేయడం లేదని పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు తెలంగాణ రాష్ట్రంలో. దాంతో మార్కెట్ యార్డులలో వేల ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీనిపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ ఔన్ అంటూ సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట/ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు సర్వర్ డౌన్ పేరుతో పత్తి కొనుగోలు ఆపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందంధి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,ఖమ్మంజిల్లా: ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం(జనవరి15) అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ షెడ్డులో పత్తిబస్తాలు తగలబడ్డాయి. ఓ లాట్ పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి దగ్ధంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంటలను తక్షణమే అదుపులోకి తేవాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్,మార్కెట్ అధికారులతో మాట్లాడి తుమ్మల వివరాలు తెలుసుకున్నారు. -
పత్తి పండు!
అవును. దీని పేరు పత్తి పండే! వేసవి తాపాన్ని తీర్చే అద్భుతమైన తినదగిన పత్తి పండు ఇది. మధ్యకు కోస్తే దీంట్లో తెల్లని రూది మాదిరిగా కనిపించే గుజ్జు ఉంటుంది. విలక్షణమైన ఈ పండుకు ‘సెంతొల్’, ‘కాటన్ ఫ్రూట్’తో పాటు చాలా మారు పేర్లున్నాయి. కెచపి, లాల్లీ ఫ్రూట్, వైల్డ్ మాంగోస్టీన్, రెడ్ సెంతొల్, సెంతుల్, సౖయె, వైసయన్.. ఇలా అనేక పేర్లుతో పిలుస్తారు.ఆగ్నేయాసియా ప్రాంతమే పత్తి పండు పుట్టిల్లు. దీని శాస్త్రీయ నామం ‘సండోరికం కోయెట్జాపే’. మెనియాసీ లేదా మహోగని కుటుంబానికి చెందినది. ఈ పండు గుజ్జు తీపి, వగరు కలిసిన చిత్రమైన రుచి కలిగి ఉంటుంది. ఆగ్నేసియా దేశాల్లోని ఉష్ణమండల లోతట్టు భూముల్లో విస్తృతంగా సాగవుతున్న పండ్ల చెట్టు ఇది. తాజా పండ్ల వాడకమే ఎక్కువ. సంతొల్ చెట్లు లోయర్ ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో చాలా ఎత్తుగా, వేగంగా పెరుగుతాయి. సాధారణంగా 15–40 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా 4–10 అంగుళాల పొడవు పెరుగుతాయి. పూలు 1 సెం.మీ. పొడవున ఆకుపచ్చ, పసుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. పత్తి పండు గుండ్రంగా, ఆపిల్ సైజులో ఉంటుంది. పండు లోపల రసంతో కూడిన ఐదు దూది తొనల మాదిరిగా ఉంటాయి. 3–4 విత్తనాలుంటాయి. దీని గుజ్జు వగరగా ఉంటుంది. పండు పండిన తర్వాత తియ్యగా మారుతుంది. కొన్ని రకాల సంతొల్ పండ్లు తక్కువ తీపిగా, మరికొన్ని రకాలు మరింత తీపిగా ఉంటాయి. బాగా తియ్యగా ఉండే పండ్లు ఆపిల్ రుచికి దగ్గరగా ఉంటాయి.రెండు రకాలుసంతొల్ పండుకు సంబంధించి ప్రధానంగా రెండు వంగడాలు ఎరుపు (ఎస్.కోయెట్జాపే), పసుపు (ఎస్. నెర్వోసమ్) రంగుల్లో ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే రకం పత్తి పండ్లను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. మార్కెట్లలో ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కొమ్మకు కాయకు మధ్య ఉండే కాడలు, తొక్క, పండు రుచిలో ఈ రెండు రకాల పండ్లకు స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పసుపు సంతొల్ పండు తొడిమెలు 15 సెం.మీ. పొడవున ఉంటాయి. పండు కోతకు వచ్చే సమయానికి తొడిమలు కూడా పసుపు రంగులోకి మారతాయి. ఎరుపు సంతొల్ పండ్ల తొడిమెలు 30 సెం.మీ. వరకు పెరిగి, ఎరుపుగా మారతాయి. పసుపు పండు తొక్క పల్చగా, రుచి తియ్యగా ఉంటుంది. ఎర్ర పండు తొక్క మందంగా, రుచి కొంచెం వగరుగా ఉంటుంది.ఆరోగ్య ప్రయోజనాలు1. కేన్సర్ నివారణ: సంతొల్ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ కణాల వ్యాప్తిని ఇవి అరికడతాయి. ఈ పండు నుంచి సంగ్రహించే సెకోట్రిటెర్పెన్, కోయెట్జాపిక్ ఆసిడ్ అనే రెండు బయోయాక్టివ్ కెమికల్స్ కేన్సర్ కణాలపై సైటోటాక్సిక్ ప్రభావం చూపుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకల స్తన గ్రంధుల్లో గడ్డల సైజును, సంఖ్యను తగ్గించగలిగాయి. మనుషుల్లో కేన్సర్ కణాలను ఇవి హరిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.2. ఆరోగ్యకరమైన దంతాలు: పత్తి పండ్లు లాలాజలానికి సంబంధించిన గ్రంధులను ఉత్తేజపరచటం ద్వారా మరింత లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. నోట్లో హానికారక క్రిములను నశింపజేయటం ద్వారా దంతాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.3. ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తాయి: సంతొల్ పండులో పెక్టిన్ అనే జీర్ణమయ్యే పీచు ఉంటుంది. లో డెన్సిటీ లిపో్రపొటీన్ (ఎల్డిఎల్) రక్తంలో ఎక్కువగా ఉంటే రక్తపోటు, గుండెపోటు తదితర గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పెక్టిన్, హెచ్డిఎల్లు కలసి ఎల్‌డిఎల్‌ను రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరకుండా చూస్తాయి. తద్వారా సంతొల్ పండు గుండె జబ్బుల్ని నివారిస్తుంది.4. బరువు తగ్గిస్తుంది: శరీరపు అధిక బరువు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, హార్మోన్ అసమతుల్యత వంటి అనేక సమస్యలకు కారణం. ఈ పండ్లలో జీర్ణమయ్యే, కాని పీచు పదార్థాలు ఉంటాయి. తిండి యావ తగ్గించటం ద్వారా ఊబకాయం తగ్గటానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది.5. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: పత్తి పండులోని క్వెర్సెటిన్ అనే యాంటాఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కణాలను బాగు చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పీచు పదార్థం ్రపోబయాటిక్ మైక్రోఆర్గానిజమ్స్ని ఉత్తేజపరచి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.6. రక్తహీనత, అల్జిమర్స్‌ను తగ్గిస్తుంది: దేహంలో సరిపోయినంతగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేకపోతే రక్తహీనత కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ చలనానికి ఐరన్ అవసరం. ఈ పండ్లలోని విటమిన్ సి వల్ల ఐరన్‌ను ఇముడ్చుకోగల శక్తిని జీర్ణవ్యవస్థ పెంచుకుంటుంది. ఇందులో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ ల్జిమర్స్ ముప్పు నుంచి తప్పిస్తాయి.7. రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి గ్లూకోజ్‌ను నెమ్మదిగా రక్తంలో కలిసేందుకు దోహదం చేస్తుంది. తద్వారా బ్లడ్ సుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.8. చర్మ సౌందర్యం: చర్మంలోని కణాల మధ్య కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉపయోగపడుతుంది. ఇది ఏర్పరడడానికి ఈ పండ్లలోని విటమిన్ సి దోహదపడుతుంది. ఈ పండ్లలోని శాండ్రోనిక్ ఆసిడ్, బ్రయోనోటికాసిడ్లు అలెర్జీలను నివారిస్తాయి. చర్మంపై పొక్కులు, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధమైన సమస్యలకు చేసే చికిత్సలో ఈ పండ్లలోని సహజ స్టెరాయిడల్ సపోజెనిన్, అల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడులో సపోజెనిన్ ఉంటుంది. తామర, తదితర ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించే చికిత్సకు ఇది ఉపకరిస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిని చర్మంపై లేపనం చేస్తే ఇన్షెక్షన్లు తగ్గుతాయి.9. స్త్రీ వ్యాధుల్ని తగ్గిస్తుంది: స్త్రీ జననాంగంలో ఇన్షెక్షన్ల చికిత్సకు ఈ పండుతో పాటు చెట్టు బెరడు కూడా ఉపయోగపడుతుంది. ఈ బెరడు వేసి ఉడికించిన కషాయంతో యోనిని రోజూ శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.విలువ ఆధారిత ఉత్పత్తులు...థాయ్ వంటకాల్లో, సలాడ్లలో సంతొల్ పండ్ల ముక్కలను వాడుతుంటారు. ఈ పండ్లతో తయారు చేసే సోం టామ్ అనే ఉత్పత్తిని రొయ్యల కూరల్లో వాడతారు. ఈ పండ్ల తరుగుతో తయారు చేసే సినటొలన్ అప్పెటైజర్గా వాడతారు. అనేక వంటకాల్లో వగరు రుచి కోసం కూడా పత్తి పండు తరుగును వాడుతూ ఉంటారు. -
యాదాద్రిలో భారీ అగ్నిప్రమాదం
-
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి నిల్వ చేసిన గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయ్నతం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్ కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
పత్తి చేనులో పప్పులు,కూరగాయలు : ఇలా పండించుకోవచ్చు!
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది. పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు. మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్‌లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్‌తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు. విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు. ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,దోర్నాలపల్లి, దోమ మండలం, వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు. ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు. మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు. పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు. -
ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు: విజయసాయిరెడ్డి
-
మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆలోచన మారుతోంది. కష్టంతో కూడుకున్న వాణిజ్య పంటల కంటే సంప్రదాయ వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో పెరిగిన సాగునీటి వనరులతోపాటు కష్టం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో వరి వైపు మళ్లుతున్నారు. దీనితో ఏటేటా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరితోపాటు పత్తి కూడా ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ పత్తి ధరలు పడిపోతుండటం, దాని సాగు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ రైతులు మెల్లగా వరి సాగు చేపడుతున్నారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా పత్తిసాగు చేసేవారు. ఇప్పుడీ ప్రాంతాల్లో పత్తి తగ్గిపోయి, వరి పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా.. ఖమ్మం, వరంగల్‌లలో ఓ మోస్తరుగా పత్తి సాగు జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ జిల్లాల్లోనూ సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి మాత్రమేకాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు పట్ల కూడా రైతుల్లో ఆసక్తి తగ్గుతోందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మునిగిన పత్తి రైతు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 7 లక్షల ఎకరాల మేర తక్కువ. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్ధతు ధర రూ.7,521గా నిర్ణయించింది. కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి కూడా తగ్గింది. పైగా పత్తి ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లలో పత్తి క్వింటాల్‌కు రూ.5,300 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలికింది. దేశంలోనే మూడో స్థానం ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అత్యధిక సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇన్నాళ్లూ ఒక ఏడాది ధర గిట్టుబాటు కాకపోయినా.. మరుసటి ఏడాదైనా అందుతుందన్న ఆశతో రైతులు పత్తి సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు, మూడేళ్లుగా తెలంగాణ రైతులు పత్తికి బదులు ఇతర పంటల వైపు చూస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.వరి దిగుబడి పెరగడంతో ఆనందం ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు వాతావరణం కూడా కలసి వచ్చి0ది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల ఎకరాల్లో వరిసాగవగా.. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు వేశారు. వరి కోతకు వచ్చే వరకు అకాల వర్షాల బాధలేకపోవడం, గతంతో పోలిస్తే చీడ, పీడలు, తెగుళ్లు తక్కువగా ఉండటంతో ఈసారి వరి దిగుబడి భారీగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వరి దిగుబడి 150 లక్షల మెట్రిక్ టన్నులకుపైనే. వరికి మద్దతు ధర రూ.2,320కాగా... నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మేలు రకం సన్న ధాన్యాన్ని రూ.2,500 నుంచి రూ.3,000 ధరతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బియ్యానికి పెరిగిన డిమాండ్‌తో ధరలు పెరిగాయి. ఇక 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు తీసుకుంటుండటం, గతంలో కన్నా దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనడంపైనా హర్షం వ్యక్తమవుతోంది. -
పత్తి తీతకు పట్నం కూలీలు
రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పత్తితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని జాతీయ రహదారి వెంటగల గ్రామాల్లో పత్తి తీయడానికి కూలీలు హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నుంచి వస్తున్నారు. సోమవారం చద్దిమూటలు పట్టుకొని చౌటుప్పల్ బస్టాండ్‌లో బస్సు దిగిన కూలీలను ‘సాక్షి’పలకరించగా.. పత్తి తీయడానికి వచ్చామని చెప్పారు. కిలోకు రూ.16 చొప్పున రైతులు కూలీ చెల్లిస్తున్నారని, రోజుకు 50 నుంచి 80 కిలోల వరకు పత్తి తీయడం ద్వారా రూ.800 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటవుతుందని వారు తెలిపారు. బస్టాండ్ నుంచి పత్తి చేను వరకు రైతులే ఆటోలలో తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారని వారు తెలిపారు. -
పత్తిపై తేమ, ధరల కత్తి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం, తక్కువ ధర ఖరారుపై వివాదం ఏర్పడటంతో కొనుగోళ్లు జరగలేదు. తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలంటూ రైతులు రాత్రివరకు తమ ఆందోళన కొనసాగించారు. వివరాలిలా ఉన్నాయి.. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సీసీఐ క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మొదట క్వింటాల్ పత్తికి రూ.6,700 ధర వేలం ద్వారా నిర్ణయించి, ఆ తర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.7,150 వరకు చేరుకున్నారు.ఆ తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ అధికారులు ధర పెంచాలని ప్రైవేట్ వ్యాపారులకు సూచించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీసీఐతో పోలి్చతే ప్రైవేట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వారికి నచ్చజెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.ప్రైవేట్ వ్యాపారులు రూ.7,200కు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. మరోవైపు సీసీఐ అధికారులు కూడా నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలిపారు. 8 నుంచి 12 మధ్య శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అది దాటితే క్వింటాలుకు రూ.75.21 చొప్పున కోత విధిస్తామని పేర్కొనడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు. కలెక్టర్ ఘెరావ్..ఉద్రిక్తత ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు, రైతులతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కలెక్టర్ పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ రూ.7,200కు కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాత వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు ఘెరావ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద రాత్రి వరకు తేమ పేచీ తేలలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టారు. కానీ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడం, ధర పెంచేందుకు ప్రైవేట్ వ్యాపారులు ఒప్పుకోక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.దీంతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెటింగ్ అధికారులు మరోసారి సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో చర్చించినా ఎటూ తేలలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు నుంచి పంజాబ్ చౌక్ చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాత్రి వరకు ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్.. చివరకు మొదటి రోజు తీసుకొచ్చిన పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్ రూ.6,696 చొప్పున శనివారం కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు. -
పత్తి తీతకు కూలీల కొరత
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. స్థానికంగా కూలీల కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో కూలీలు ఏటా పత్తితీత కోసం ఇక్కడకు వస్తారు. కిన్వట్ తాలుకా యేందా అనే గ్రామం నుంచే సుమారు 500 మంది కూలీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఇలా మహారాష్ట్రలోని అనేక గ్రామాల నుంచి ఈ సమయంలో కూలి పనుల కోసం ఇక్కడకు వస్తారు. 40 రోజుల పాటు ఇక్కడే ఉండి పత్తి ఏరుతున్నారు. ఈ సమయంలో దంపతులిద్దరూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్నట్టు కూలి పనులకు వచ్చిన గణేశ్ చెప్పాడు. పెరిగిన కూలి పత్తితీతకు కూలి పెరిగింది. గతేడాది కిలో ఏరితే రూ.7 చెల్లించేవారు. ఈ ఏడాది రూ.8కు పెంచారు. కొన్ని పరిస్థితుల్లో కూలీలు దొరకకపోతే రూ.9 కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం పత్తి పంటకు సంబంధించి మొదటి తీత మొదలైంది. పంట విస్తీర్ణం బట్టి రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కో కూలీ రోజు సుమారు 60 నుంచి 70 కిలోల వరకు పత్తి ఏరుతారని జామిడికి చెందిన రైతు నాగిరెడ్డి చెప్పాడు. స్థానిక కూలీలకు రోజువారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, మహారాష్ట్ర కూలీలకైతే వారంవారం లేనిపక్షంలో మొత్తం పని అయిపోయిన తర్వాత వారు ఊరికి వెళ్లే సమయంలో తీసుకుంటారన్నాడు. తాంసి మండలం పొన్నారి గ్రామం వద్ద ఓ రైతు రోడ్డు పక్కన నిల్చుండి ఆదిలాబాద్ నుంచి ఆటోలో రావాల్సిన కూలీల కోసం ఎదురుచూస్తున్నాడు. పత్తితీత కోసం ముందుగానే కూలీలను మాట్లాడుకున్నాడు. ఉదయం వారి కోసం ఎదురుచూస్తుండగా ఓ ఆటో ఆ గ్రామం దాటుకొని వెళుతోంది. దాంట్లో తాను మాట్లాడిన కూలీలే ఉండటంతో ఆటోను నిలిపాడు. కూలీలను ఆటో దిగి తన చేనులోకి రావాలని పిలిచాడు. అయితే ఆ కూలీలు మరో ఊరిలో కూలి డబ్బు ఎక్కువ ఇస్తున్నారని, అక్కడకు వెళుతున్నామని చెప్పారు. అంతే కూలి తానే ఇస్తానని చెప్పి వారిని ఆటో దింపి తన చేనులోకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం పత్తితీత కొనసాగుతుండగా, ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో కూలీల కోసం రైతులు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. ఆటోలను నిలిపి మరీ కూలీలను చేనులోకి తీసుకెళ్లేందుకు ఇలా పలువురు పడరాని పాట్లు పడుతున్నారు. ‘సాక్షి’బుధవారం పత్తి చేల పరిశీలనకు వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. నల్లరేగడి భూముల్లో 8 నుంచి 10 క్వింటాళ్లు, చెలక భూముల్లో 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా స్వల్పంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల్లో మద్దతు ధరపై బెంగ నెలకొంది. నాణ్యమైన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.7,521 ఉంది. ప్రైవేట్‌లో మాత్రం రూ.7వేల లోపే పలుకుతోంది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించింది. ఆదిలాబాద్‌లో శుక్రవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించనుంది. అయితే పత్తిలో తేమ కారణంగా మద్దతు ధరలో కోత పెడతారన్న బెంగ ప్రస్తుతం పత్తి రైతుల్లో కనిపిస్తోంది. దీంతో గిట్టుబాటు ధర వస్తుందో.. లేదోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. -
Cotton Day : పత్తి ఉత్పత్తుల ప్రాముఖ్యత తెలిపేందుకు..
పురాతన కాలం నుంచి పత్తిని దుస్తుల తయారీతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో పత్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని తొలిసారిగా 2019లో ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ పత్తి సలహా కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంటారు. పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం. పత్తిని ఫైబర్ దుస్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాల తయారీలో కూడా పత్తిని వినియోగిస్తారు.2019లో సహజ ఫైబర్ పత్తి ఉత్పత్తి, వాణిజ్యం, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పత్తి ఉత్పత్తికి సంబంధించిన పలు విషయాలను చర్చించేదుకు పరిశోధకులు, రైతులు, బడా వ్యాపారవేత్తలు ఒక చోట సమావేశం అవుతుంటారు. ఇది కూడా చదవండి: నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు -
సాగు ఢమాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రమంతా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం, చెరువులు, కుంటలు నిండకపోవడం, ఇటీవలి కాలం వరకు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం..తదితర కారణాలతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి సాగైన పంటలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 15.30 లక్షల ఎకరాల మేరకు సాగు తగ్గిపోయింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలో వ్యవసాయశాఖ అంచనా వేసింది.అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు కూడా సాగు తగ్గడానికి కారణాలుగా రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కొందరు రైతులు భూముల్ని కౌలుకు ఇవ్వకుండా వదిలేశారన్న చర్చ కూడా జరుగుతోంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, తమకు రైతు భరోసా రాదని కొందరు రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 8.79 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి గతేడాది వానాకాలం సీజన్ ఇదే సమయానికి అన్ని పంటలు కలిపి 99.89 లక్షల (దాదాపు కోటి) ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 84.59 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాగు విస్తీర్ణం ఏకంగా 15.29 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది.గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే గతేడాదితో పోలిస్తే 8.79 లక్షల ఎకరాలు తగ్గింది. దీనిని బట్టి చూస్తే పంటల ప్రణాళిక ప్రకారం ఈ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యమయ్యేలా కని్పంచడం లేదు. వరికి రూ.500 బోనస్ కేవలం సన్నాలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, ఆ వరి రకాల పేర్లను మొన్నమొన్నటి వరకు బహిరంగపరచకపోవడం, ఇప్పుడు వాటిని రైతులకు అందుబాటులో ఉంచకపోవడం తదితర కారణాలు ఏమైనా రైతులను గందరగోళపరిచాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతేడాది వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం గమనార్హం. పత్తి సాగూ తగ్గింది.. పత్తి విషయానికొస్తే.. గతేడాది ఇదే సమయానికి 44.32 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి కేవలం 41.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 2.67 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందన్నమాట. వాస్తవానికి పత్తి సాగును 60 లక్షల ఎకరాలకు పెంచాలని, వీలైతే 70 లక్షల ఎకరాలకు పెంచినా మంచిదేనన్న అభిప్రాయంతో వ్యవసాయ శాఖ ఉంది. ఆ మేరకు ప్రణాళికలు వేసుకుంది.కానీ కీలకమైన సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనేకమంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గతేడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న సాగు 93,635 ఎకరాల్లో, కంది 35,176 ఎకరాల్లో, సోయాబీన్ 72,744 ఎకరాల్లో తగ్గింది. వనపర్తి జిల్లాలో 20.59 శాతమే సాగు రాష్ట్రంలో అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 20.59 శాతమే పంటలు సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 32.02 శాతం, ములుగు జిల్లాలో 32.57 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 44.89 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యంత ఎక్కువగా పంటల సాగు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,62,098 ఎకరాలు కాగా, 5,63,481 ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా వరి, పత్తి సాగు ఇలా.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకోలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 2.54 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 79,085 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 1.87 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, 97,087 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెదక్ జిల్లాలో గతేడాది 2.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.22 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి.ఇదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నాట్లు గణనీయంగా తగ్గాయి. ఇక పత్తి నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 5.22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గతేడాది 2.41 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 1.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2.02 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 1.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జనగామలో గతేడాది ఇదే సమయానికి 1.35 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు కేవలం 97,225 ఎకరాల్లోనే సాగైంది. సంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ పత్తి సాగు తగ్గింది. వర్షాల కోసం చూస్తున్నా.. నాకు నాలుగున్నర ఎకరాల సొంత పొలం ఉంది. ఏటా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటా. నాలుగున్నర ఎకరాల్లో మెట్ట పంటలు వేసి మిగతా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తా. అయితే ముసురు వర్షాలకు కారణంగా ఇప్పటివరకు మూడెకరాల్లోనే వరి నాట్లు వేశా. మిగిలిన 17 ఎకరాల సాగుపై ఎటూ తోచడం లేదు. ప్రస్తుతానికైతే మరో పదెకరాల వరకు నారుమడి సిద్ధం చేసుకున్నా. కానీ ఇదే పరిస్థితి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటే వేసిన మూడెకరాల వరి కూడా పండదు. అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా 15,131చెరువులు ఖాళీరాష్ట్రంలో 34,716 చెరువులు, కుంటలున్నాయి. అందులో 3,247 చెరువులు ఇటీవలి వర్షాలతో అలుగు పోస్తున్నాయి. 6,735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. 3,438 చెరువుల్లో 50 నుంచి 75% నీటి నిల్వలున్నాయి. 6,165 చెరువుల్లో మాత్రం 25 నుంచి 50% మాత్రమే నీరు చేరింది. 15,131 చెరువుల్లో నీటి నిల్వలు ఇంకా 25% లోపలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 61.34 శాతం చెరువుల్లో 50% కంటే తక్కువగానే నీటినిల్వలున్నాయి. -
జీరో వేస్ట్ : పల్లె నుంచి పట్నానికి ఫ్యాషన్ (ఫోటోలు)
-
సీజనల్ స్పెషల్ : ఈ స్పెషల్ జ్యూయల్లరీ చూశారా!
వేసవిలో కాటన్ డ్రెస్సుల ప్రాముఖ్యత గురించి తెలిసిందే. అలాగే, ఈ సీజన్‌కి టెక్స్టైల్ జ్యువెలరీ అంతే స్పెషల్‌గా ఉంటుంది. ఎంచుకునే ఫ్యాబ్రిక్ ఏదైనా చేతితో రూపొందించే ఈ జ్యువెలరీ కొనుగోలు ఖర్చూ తక్కువే. అలాగే, ఎవరికి వారు నచ్చినట్టు ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. యువతను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచే ఈ స్పెషల్ జ్యువెలరీ అంతే తాజాదనపు అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రకృతికి దగ్గరగా.. ఫ్యాబ్రిక్ ఎంపిక! పువ్వులంటేనే ప్రకృతి తెలియపరిచే ప్రేమ భాష. డిజైనర్ స్టూడియోలలో వాడగా ఉపయోగించిన మెటీరియల్‌తో అందమైన పూలను తయారుచేయవచ్చు. వాటిని పూసలు, జరీ దారాలతో ఆభరణాలుగా మార్చవచ్చు.ఈ పువ్వుల ఆభరణాలు దుస్తుల అందాన్ని మరింతగా పెంచుతాయి. పాదం నుంచి తల వరకు ప్రతి ఆభరణాన్ని వస్త్రాలంకరణతో మెప్పించవచ్చు. చందేరీ, సిల్క్, నెటెడ్, కాటన్ వంటి ఏ మెటీరియల్ అయినా ఈ ఆభరణాల తయారీలో ఉపయోగించవచ్చు. గార్మెంట్స్, బీడ్స్, జరీ లేదా కాటన్ దారాలను ఉపయోగించి చేసిన నెక్‌పీస్‌లు సంప్రదాయ చీరల మీదకే కాదు వెస్ట్రన్ డ్రెస్సుల మీదకూ ప్రత్యేక హంగుగా నిలుస్తున్నాయి. కాటన్ దారాలు, క్లాత్‌తో తయారుచేసిన పువ్వులను ఉపయోగించి చేసిన బన్ క్లిప్స్ వేసవి సీజన్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్‌కి కాంబినేషన్‌గా సిల్వర్ లేదా ఇతర లోహాలతో తయారైన మువ్వలు, గవ్వలు, జూకాలను జత చేయవచ్చు. దీని వల్ల ఈ జ్యువెలరీకి మరిన్ని హంగులు అమరుతాయి. -
అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి,రీ యూజబుల్ న్యాప్కిన్స్ తయారీ
‘ఎంత పెద్ద చదువులు చదివినా.. ఆర్థికంగా ఎంత ఎదిగినా మనసుకు తృప్తిగా లేకపోతే అందులో సహజత్వం లోపిస్తుంది. చేసే పనుల్లో నైపుణ్యం రాదు..’ అంటున్నారు హేమ. పర్యావరణహితంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండే రీ యూజబుల్ క్లాత్‌తో ప్యాడ్స్, పిల్లలకు డైపర్లు తయారు చేస్తూ, గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.తమిళనాడు, చిత్తూరు బార్డర్లో ఉన్న అతిమంజరీ పేట్లో ఉన్న హేమ తన ఉత్పత్తులతో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్‌లోని ప్రదర్శనశాలలో తన స్టాల్ ద్వారా పరిచయం అయ్యారు. అత్యంత నిరాడంబరంగా కనిపిస్తున్న ఆమె... అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసి, స్వదేశానికి వచ్చి తనను తాను పర్యావరణ ప్రేమికగా ఎలా మలచుకున్నారో, మరికొందరి మహిళలను ఎలా భాగస్వాములను చేస్తున్నారో వివరించారు. ‘‘మా ఊరిలో పన్నెండేళ్లుగా ఉంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వాడకంలో ఉన్న వస్తువులకు ప్రత్యామ్నాయ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. చాలా ఆలోచనలు చేశాక మహిళల రుతుక్రమ సమయంలో వాడే ప్యాడ్స్‌కు సంబంధించిన పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. అందులో భాగంగా 2020లో ‘కొన్నై’ పేరుతో మా ఉత్పత్తులన్నీ గ్రామంలోని మహిళలు, యువతతో కలిసి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసి, వారితో తయారుచేస్తున్నాను. మహిళలు, చంటిపిల్లలకు ఉపయోగపడే రీ యూజబుల్ ఉత్పత్తుల తయారీకి కొంతమందిని గ్రూప్‌గా చేసి వారి ఇళ్ల నుంచే, సౌకర్యవంతమైన సమయంలో తయారుచేసిచ్చేలా ప్రణాళిక చేశాను. చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది ఒక పార్ట్‌టైమ్ ఉపాధి లాగా కూడా ఉపయోగపడుతుంది. వాడకం సులువు..మృదువుగా, మన్నికగా ఉండటమే కాకుండా వాడిన తర్వాత రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఎండలో ఆరవేయవచ్చు. తిరిగి వీటిని వాడుకోవచ్చు. వెదురు కాటన్‌ను వాటర్‌ఫ్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో జత చేసి వీటిని తయారుచేస్తుంటాం. ఇవి సురక్షితంగానూ, అనుకూలంగానూ ఉంటాయి. తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్నీ నివారించవచ్చు. డిస్పోజబుల్ ప్యాడ్లలో రసాయనాల కారణంగా చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. మహిళలకు రీ యూజబుల్ క్లాత్ ప్యాడ్స్ మాత్రమే కాదు పిల్లలకు డైపర్లు, మ్యాట్లు, వైప్స్.. అన్నీ ఎకో ఫ్రెండ్లీవే తయారుచేస్తున్నాం. ఇవి మృదువుగా ఉంటాయి. కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. స్మాల్, మీడియమ్.. సైజులను బట్టి డిజైన్ల బట్టి ధరలు ఉన్నాయి.ఆర్డర్లను బట్టి ఒక్కొరికి రూ.5,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో ఇప్పుడు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. నేను ఆదాయం, రాబడి గురించి ఆలోచించడం లేదు. మునుముందు అందరూ పర్యావరణహితంగా మారాల్సిందే. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సొంత ఊరికి... మేం పన్నెండేళ్లు అమెరికాలో ఉన్నాం. నేనూ, మా వారు దేవ్ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేశాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక దశలో మాకు అక్కడ ఉండాలనిపించలేదు. మొత్తం కుటుంబంతో సొంత ఊరికి వచ్చేశాం. ఇక్కడే ఊళ్లో ఏడెకరాల భూమి కొనుగోలు చేశాం. అందులో ఎక్కువ శాతం రాగులు పండిస్తాం. ఆ పని అంతా మా వారు చూసుకుంటారు. ఎవరికి నచ్చిన పని వాళ్లు...అమెరికన్ సంస్కృతిలో పిల్లల మీద చదువుల ఒత్తిడి ఉండదు. పిల్లలకు ఏది ఇష్టమో, ఏ కళలో నైపుణ్యం సాధించాలనుకుంటారో దానిని వారే కనిపెట్టేలా, నైపుణ్యాలు సాధించేలా చూస్తారు. మేం కూడా పిల్లలను స్కూళ్లను, కాలేజీకి పంపించలేదు. హోమ్ స్కూలింగ్ అని మాకు గ్రూప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పిల్లలకు నచ్చినవి చదువుకుంటారు. తప్పనిసరిగా చదవాలనే నిబంధన పెడితే, మనసుకు ఇష్టంలేని దానిమీద వారెప్పటికీ ప్రావీణ్యులు కాలేరు. ఇవన్నీ ఆలోచించాం. పిల్లలకు ఏది ఇష్టమో అదే చేయమన్నాం. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఇరవై ఏళ్ల మా అబ్బాయికి శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. పద్దె నిమిదేళ్ల మా అమ్మాయి ఉడెన్ ఫర్నీచర్‌లో తన నైపుణ్యాలను చూపుతుంటుంది. నేను పర్యావరణ హితంగా ఉండే పనులు చేయాలనే ఆలోచనతో రీ యూజబుల్ న్యాపికిన్స్ పై దృష్టి పెట్టాను. మా విధానాలు మా ఇతర కుటుంబాల వారికి నచ్చుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టేవారే. తమకేది నచ్చుతుందో, ఏం చేయగలమో, ఎందులో సంతృప్తి లభిస్తుందో దానిని కనుక్కోలేరు. ప్రకృతి నీడన, నచ్చిన పనుల్లో భాగస్వాములం అవుతూ పర్యావరణహితగా జీవిస్తున్నాం. నా ఈ ఆలోచనను విరివిగా మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా రకరకాల క్రాఫ్ట్స్ మేళాలో పెడుతూ సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళుతున్నాను’ అని వివరించారు హేమ. – నిర్మలారెడ్డి -
TN: పీచు మిఠాయి విక్రయాలు.. తమిళనాడు సంచలన నిర్ణయం
చెన్నై: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే కాటన్ క్యాండీ(పీచు మిఠాయిల)పై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలున్నందునే నిషేదం విధించినట్లు తెలిపారు. రాజధాని నగరం చెన్నై వ్యాప్తంగా ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిల నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలించగా కాటన్ క్యాండీల్లో రోడమైన్-బి అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది. రోడమైన్-బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఆహారంలో రంగు కోసం దీన్ని వాడరు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి.. జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ప్రయోగం సక్సెస్ -
కాటన్ క్యాండీలపై నిషేధం.. వీడియో విడుదల చేసిన తమిళిసై!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు. ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్ క్యాండీలలోని విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. குழந்தைகளின் உடல்நலத்தை பாதிக்கும் ரசாயனம் கலந்த பஞ்சு மிட்டாயை குழந்தைகளுக்கு வாங்கி கொடுக்காதீர்கள்.#CottonCandy #PanchuMittai #Puducherry pic.twitter.com/VJR451Y403 — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 8, 2024 లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. -
ఇక కాటన్స్తో ఆరంభం..
చలి ప్రభావం తగ్గుతూ ఎండ ప్రతాపం చూపడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది ప్రస్తుత వాతావరణం. మనం కూడా అందుకు రెడీగా ఉండకతప్పదు. ఈ రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఫాస్ట్ ఫ్యాషన్‌ను వదిలేసి మనవైన దేశీయ కాటన్ దుస్తులతో వార్డ్రోబ్ను సిద్ధం చేసుకుంటే రాబోయే వేసవి రోజులను ఫ్యాషనబుల్‌గానూ.. హాయి హాయిగా, కులాసాగానూ గడిపేయచ్చు. సీజన్‌కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్‌ను కూడా మార్చుకుంటాం. అందులోనూ వేసవి కంఫర్ట్‌తో గడిపేయాలనుకుంటాం. కాటన్స్ అయితే డల్‌గా ఉంటాయి అనే మాటలు పక్కన పెట్టేసి మోడర్న్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా వైభవంగా వెలిగి΄ోవచ్చు. మనవైన చేనేతలు కాటన్ అనగానే మనకు ముందుగా ఖాదీ గుర్తుకు వస్తుంది. ఖాదీ చీరలు, షర్ట్లే కాదు ఇండో వెస్ట్రన్ స్టైల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. దీనితో పాటు నారాయణ్‌పేట్, ఇక్కత్, గద్వాల.. వంటి చేనేతలు సంప్రదాయ వేడుకల సందర్భాల్లోనూ ధరించడానికి బాగుంటాయి. ఇండోవెస్ట్రన్ జంప్‌సూట్స్, ష్రగ్స్, గౌన్లు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్ డిజైన్స్ ఎన్నో ఇప్పుడు మనకు కాటన్ మెటీరియల్‌తో తయారైన డిజైన్స్ కనిపిస్తున్నాయి. క్యాజువల్ లేదా కాక్టెయిల్ పార్టీ ఏదైనా సందర్భానికి తగినట్టు వీటిని ఎంచుకోవచ్చు. ఆభరణాల ఊసు కాటన్ మెటీరియిరల్ పైగా వేసవి టైమ్ కాబట్టి ఉడెన్, టెర్రకోట జ్యువెలరీతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎక్కువ అలంకరణ హంగామా లేకుండా సింపుల్ అండ్ ఎలిగేంట్ లుక్స్ అనిపించేలా రెడీ అవడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు. బ్లాక్ ప్రింట్ గౌన్స్ కాటన్‌పై వేసిన బ్లాక్ ప్రింట్ మెటీరియల్‌తో ఏ స్టైల్ డ్రెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడానికి సౌకర్యంగానే కాదు, ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. ఇవి చదవండి: అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్ -
పత్తి రైతుల ఆందోళన
సాక్షి, ఆదిలాబాద్: సీసీఐ, వ్యాపారులు పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో కొన్ని గంటలపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ స్తంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో స్థలం లేకపోవడంతో తాము పత్తి కొనలేమంటూ వారు చేతులెత్తారు. దీనిపై రైతులకు ఏ సమాచారం లేకపోవడంతో శుక్రవారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున రైతులు పత్తి బండ్లతో వచ్చారు. ఉదయం కొద్దిమంది నుంచి పత్తి కొనుగోలు చేసి, ఆపై నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులతో అధికారులు సమావేశమై సయోధ్య కుదర్చడంతో మధ్యాహ్నం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సమ్మెను సాకుగా చూపుతూ ఆదిలాబాద్‌లో ఇప్పటివరకు వ్యాపారులు 3 లక్షల క్వింటాళ్లకు పైగా, సీసీఐ 8 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా మార్చి భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అయితే ఆదిలాబాద్‌లో నాలుగు రోజులుగా ట్రాన్స్పోర్టర్లు పత్తి బేళ్లు లిఫ్ట్ చేయడం లేదని సీసీఐ, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ సమ్మెలో భాగంగా తాము ట్రాన్స్పోర్ట్ చేయడం లేదని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడమే రైతుల ఆందోళనకు దారితీసింది. సయోధ్య కుదిర్చినా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులను చర్చలకు పిలిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు పత్తి కొనుగోళ్లు చేయమని సీసీఐ ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతోనే తాము కొనుగోలు చేయలేమని మార్కెటింగ్ అధికారులకు వారు స్పష్టం చేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పత్తి తూకంలో ‘రిమోట్’ మోసం! ఓ దళారీ రెడ్ హ్యాండెడ్‌గా..
సాక్షి, వరంగల్: కాంటాలో సాంకేతిక పరికరాన్ని ఉపయోగించి రిమోట్ ఆపరేషన్ సహాయంతో తూకంలో మోసం చేస్తున్న ఓ దళారీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తమను మోసం చేశాడని ఆగ్రహంతో రైతులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన హసన్‌పర్తి మండలం నాగారంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధి అంబాలకు చెందిన ప్రైవేట్‌గా వ్యాపారి గడ్డం వెంకటేశ్వర్లు పరకాల, సూదన్‌పల్లి, పెంబర్తి, అంబాల, కమలాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి అక్కడే పత్తి తూకం వేసి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నాడు. మార్కెట్ ధర కంటే మరో రూ.100 అదనంగా చెల్లిస్తుండడంతో రైతులు ఆసక్తితో ముందుకు వచ్చారు. వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న అంబాలకు చెందిన కర్ణాకర్ తన యజమాని సూచన మేరకు రెండు నెలలుగా ఆయా గ్రామాలకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. అయితే వచ్చిన దిగుబడికి.. తూకం వేసిన తర్వాత వ్యత్యాసం కనిపించినా రైతులకు ఏం జరుగుతున్నదో అర్థం కావడంలేదు. మోసాన్ని గుర్తించింది ఇలా.. సోమవారం ఉదయం నాగారంలోని రాజిరెడ్డి ఇంటికి కర్ణాకర్ వచ్చి పత్తి కాంటా వేశాడు. తొలుత 92.6 కిలోల తూకం వచ్చిన పత్తి.. సెకండ్ల వ్యవధిలోనే 74.1 కిలోలకు చేరింది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గుమస్తా చేతులను పరిశీలించారు. ఏదో జరుగుతున్నదని గమనించి వెంటనే అతడి జేబులను తనిఖీ చేయగా రిమోట్ దొరికింది. దీంతో భయపడిన గుమస్తా ఆ రిమోట్‌ను బయటికి విసరగా.. రాజిరెడ్డి కుటుంబ సభ్యులు వెతికి తీసుకుని వచ్చారు. ఎలక్ట్రానిక్ కాంటాకు రిమోట్ కనెక్షన్.. సదరు దళారీ ఎలక్ట్రానిక్ కాంటాను రిమోట్ కనెక్షన్ ఇచ్చాడు. పత్తి తూకం వేసినప్పుడు జేబులో నుంచి ఒకసారి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తే 15 కిలోలు, రెండుసార్లు చేస్తే 30 కిలోలు తక్కువ తూకం వచ్చేలా కాంటాలో సాంకేతిక పరికరాన్ని బిగించి రిమోట్‌కు అనుసంధానం చేశాడు. ఓవైపు రైతులు తూకం నమోదు చేస్తుండగా.. మరో వైపు దళారీ రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో క్వింటాకు 15 కిలో ల నుంచి 30 కిలోల పత్తి తగ్గుతోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కర్ణాకర్‌ను రైతులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తన యజమాని వెంకటేశ్వర్లు సూచన మేరకు రిమోట్ వాడుతున్నట్లు తెలిపారు. అప్పుడే అక్కడికి చేరిన వెంకటేశ్వర్ల్లును రైతులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియనట్లుగా నటించడంతో రైతులు అతడికి కూడా దేహశుద్ధి చేశారు. గుర్తించకుంటే.. పత్తి తూకం వేయగా 92.6 కిలోలు వచ్చింది. ఆ వెంటనే 74.1 కిలోలకు తగ్గింది. అనుమానం వచ్చి అతని జేబులు పరిశీలించగా రిమోట్ కనిపించింది. గుర్తించకుంటే మూడు క్వింటాళ్ల పత్తి మాయమయ్యేది. – రాజిరెడ్డి, రైతు మూడు క్వింటాళ్లు మాయం.. ఇటీవల మార్కెట్ ధర కంటే వంద రూపాయలు అదనంగా ఇస్తామంటే ఇంటి వద్ద పత్తి అమ్మిన. అయితే 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. తూకంలో 12 క్వింటాళ్లు వచ్చింది. తూకంలో మోసం చేసి మూడు క్వింటాళ్ల పత్తి మాయం చేశాడు. – లింగారెడ్డి, రైతు -
పత్తి రైతుకు ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 12.85 లక్షల టన్నుల దిగుబడులు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్‌కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది. అప్రమత్తమైన ఫ్రభుత్వం కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఇవీ తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్‌కు రూ.25 తగ్గిస్తారు. పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు. ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్‌లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. తొందరపడి అమ్ముకోవద్దు మార్కెట్లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!
నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!మన దేశంలో పత్తి సాగులో వాడుతున్నది 95% వరకు జన్యుమార్పిడి చేసిన పత్తి విత్తనాలే. నాన్‌బీటీ దేశీ పత్తి రకాలు దాదాపు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో నాన్‌బీటీ దేశీ, అమెరికన్ పత్తి రకాలను తిరిగి రైతులకు అందించే కృషికి అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు శ్రీకారం చుట్టాయి. వచ్చే ఖరీఫ్ నుంచే తెలుగు రాష్ట్రాల్లో 3 వేల ఎకరాల్లో రైతులకు ఈ విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ పత్తి దినోత్సవం (అక్టోబర్ 7) సందర్భంగా ప్రత్యేక కథనం... సేంద్రియ పత్తి సాగు వల్ల భూతాపం పెరుగుదలను దీటుగా ఎదుర్కోవటం, ఆరోగ్యదాయకమైన దూది ఉత్పత్తిని పెంపొదించటం వంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయి. సేంద్రియ పత్తి విస్తీర్ణాన్ని పెంపొందించాలంటే మొదట జన్యుమార్పిడి చేయని (నాన్ బీటీ) దేశీ, హైబ్రిడ్ రకాల పత్తి విత్తనాలను తొలుత స్థానికంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. ఈ అసరాన్ని గుర్తించిన అనేక అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువైన నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాలను ఈ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్గానిక్ కాటన్ యాక్సలరేటర్(ఒసిఎ), స్విట్జర్లాండ్‌కు చెందిన స్వతంత్ర సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎఫ్ఐబిఎల్) శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థల తోడ్పాటుతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి ఈ ఖరీఫ్ నుంచి కృషి ప్రారంభించింది. 30 నాన్ బీటీ పత్తి రకాల ప్రయోగాత్మక సాగు మన దేశంలో నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి సంబంధించి గత ఆరేళ్లుగా క్షేత్రస్థాయిలో వంగడాల ఎంపిక ప్రక్రియ స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పిఓ)ల స్థాయిలో సాగుతోంది. ఈ క్రమంలో 30 నాన్ బీటీ రకాలు రైతులకు నచ్చే విధంగా ఫలితాలనిస్తున్నాయని గుర్తించారు. వీటిలో దేశీ పత్తి సూటి రకాలు, అమెరికన్ పత్తి సూటి రకాల తోపాటు అమెరికన్ హైబ్రిడ్ పత్తి రకాలు ఉన్నాయి. అయితే, ఈ 30 నాన్ బీటీ సూటి/హైబ్రిడ్ రకాల్లో ఏయే రకాలు ఏయే రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలనిస్తున్నాయన్న క్షేత్ర స్థాయి అధ్యయనం ఈ ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి సాగయ్యే ఆరు రాష్ట్రాల్లో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక జాగ్రత్తలతో సాగు చేస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా వెలమజాల గ్రామంలో నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఒక ఎకరంలో 30 రకాల నాన్‌బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తోంది. అదేవిధంగా, ఏపీలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో గల కృష్ణ సుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఒక ఎకరంలో 30 నాన్ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జన్యు స్వచ్ఛత కోసం ఒక్కో రకానికి మధ్య జొన్న వరుసలు విత్తారు. ఈ రెండు క్షేత్రాలను సిఎస్ఎ శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. ఈ 30 రకాల్లో ఏ రకాలు మెరుగైన ఫలితాలనిస్తాయో పరిశీలించి, వచ్చే సంవత్సరాల్లో ఆయా రకాలను విస్తృతంగా సాగులోకి తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించనున్నాయని సిఎస్ఎ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ చెప్పారు. వచ్చే ఖరీఫ్ నాటికి 3 వేల ఎకరాలకు అందుబాటులోకి నాన్‌బీటీ పత్తి విత్తనాలు ఇదిలా ఉండగా, 5 రకాల నాన్‌బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తి ఆరు రాష్ట్రాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా ఈ ఖరీఫ్‌లో మొత్తం 25 ఎకరాల్లో ్ర΄ారంభమైంది. ఇందులో భాగంగా, తెలంగాణలోని రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు 5 నాన్ బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తిని 5 ఎకరాల్లో చేపట్టాయి. వీటిల్లో ఆర్విజెకె–ఎస్జిఎఫ్1 అనే దేశీ పత్తి (అర్బోరియం) సూటి రకం ఒకటి. ఆర్విజెకె–ఎస్జిఎఫ్2, ఎన్డిఎల్హెచ్, సురక్ష అనే 3 రకాల అమెరికన్ (హిర్సుటం) సూటి రకాలతో΄ాటు.. వసుధ గోల్డ్ అనే హైబ్రిడ్ పత్తి రకాలను ఒక్కో రకాన్ని ఒక్కో ఎకరంలో జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలిలోని రాజోలి ఎఫ్పిఓ, జనగామ జిల్లాలోని ఆరద్శ ఎనబావి ఎఫ్పిఓలు సాగు చేస్తున్నాయి. ఈ విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని సిఎస్ఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ పర్యవేక్షిస్తున్నారు. రైతులకు నచ్చే లక్షణాల తోపాటు మేలైన దిగుబడినిచ్చే ఈ నాన్ బీటీ రకాల సామర్ధ్యాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించే లక్ష్యంతో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నామని, వచ్చే ఖరీఫ్‌కు 3 వేల ఎకరాల్లో సాగుకు ఈ విత్తనాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ నాన్ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే ఆసక్తి ఉన్న రైతులు ఈ విత్తన క్షేత్రాలను దసరా తర్వాత కాయ దశలో స్వయంగా సందర్శించి, విత్తనాలను బుక్ చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని డా. రాజశేఖర్ (83329 45368) తెలిపారు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
పత్తి ఆహార పంట కూడా! కొన్ని దేశాల్లో ఏకంగా..
పత్తి పంటను కేవలం నూలు వస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని వాణిజ్య పంటగానే సాధారణంగా మనం పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీన్ని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురు పంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నూనెను వంట నూనెగా వాడుతున్నాం. పత్తి గింజల చక్కను పశు దాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్న దేశం భారత్. 23% పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షల మంది పత్తి సాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళా రైతులే. వీరిలో ఎక్కువ మంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. మన దేశంలో 65 శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐసిఎసి) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధిని కల్పిస్తోంది. కిలో పత్తిని పండించడానికి 20 వేల లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఏసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో సాగు చేయదగిన అతి కొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఏసీ వాదన. పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఏసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తి సాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని అంచనా. అయితే, దూదిలో 97% సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఏసీ లెక్క చెబుతోంది. సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసిఎసి అంటోంది. సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులను, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఏసీ సూచిస్తోంది. పంట కాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3% తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఏసీ అంటోంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబ పోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అదిరేటి వంగడాలు ‘అంతరిక్షం’ నుంచి? చైనా మాదిరి స్పేస్ బ్రీడింగ్) -
పత్తి ఆహారపంట కూడా!
‘పత్తి’ కేవలం నూలువస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని అందించే వాణిజ్యపంటగానే సాధారణంగా పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీనిని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురుపంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయసంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంటనూనెగా వాడుతున్నాం. పత్తిగింజల చక్కను పశుదాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తిగింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ♦ ప్రపంచంలో అత్యధికంగా పత్తిసాగు చేస్తున్న దేశం భారత్. 23శాతం పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షలమంది పత్తిసాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళారైతులే. వీరిలో ఎక్కువమంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే. మన దేశంలో 65శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. ♦ 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ♦ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మికసంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. ♦ అంతర్జాతీయ పత్తి సలహామండలి (ఐసీఎసీ) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తోంది. ♦ కిలో పత్తి పండించడానికి 20,000 లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఎసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికాదేశాల్లో సాగు చేయదగిన అతికొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఎసీ వాదన. ♦ పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఎసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తిసాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతు న్నాయని అంచనా. అయితే, దూదిలో 97శాతం సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఎసీ లెక్క చెబుతోంది. ♦సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసీఎసీ అంటోంది. ♦సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించొచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులు, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఎసీ సూచిస్తోంది. ♦పంటకాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3శాతం తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఎసీ అంటోంది. ♦ పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబపోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులు తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. ♦మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95శాతం జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – సాక్షి సాగుబడి డెస్క్ -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు కష్టం
మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 24న ఓ మహిళకు ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బంది కాటన్ ప్యాడ్‌ను అమర్చి డిశ్చార్జి సమయంలో తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలు కీర్తిలయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయకు ఈ నెల 24న పురిటి నొప్పులు రావడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించగా.. కొంత క్రిటికల్ కావడంతో ఫోర్సెప్ డెలివరీ (బలవంతపు సాధారణ ప్రసవం) చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. కీర్తిలయకు రక్తస్రావం కాకుండా ఉండేందుకు కాటన్ ప్యాడ్ అమర్చారు. అనంతరం తల్లీబిడ్డలను వార్డులోకి మార్చారు. మూడు రోజుల తర్వాత 27న సాయంత్రం కాటన్‌ప్యాడ్‌ను తొలగించకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన బాలింత 28న సాయంత్రం అస్వస్థతకు గురికాగా 108లో చెన్నూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది విషయాన్ని గమనించి కాటన్‌ప్యాడ్‌ను తొలగించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాటన్ప్యాడ్ తొలగించకుండానే డిశ్చార్జి చేయడంపై బాలింత, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలింత పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పూర్తిస్థాయి చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చందర్రెడ్డిని సంప్రదించగా.. కాటన్‌ప్యాడ్‌ను తొలగించడంలో సిబ్బంది తప్పిదం ఉందని, బాధ్యులైన వైద్యులు, సిబ్బంది వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలిపి, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసి.. కడుపులో కాటన్ పాడ్ వదిలేశారు వైద్యులు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది. ఐదురోజుల కిందట.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాటన్ ప్యాడ్‌ను వైద్యులు ఆమె కడుపులో వదిలేశారు. ఈ క్రమంలో ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత దిగజారండంతో.. చెన్నూర్ అసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు కీర్తి లయను పరిశీలించి.. ఆపై ఆపరేషన్ చేసి కాటన్ పాడ్‌ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
రికార్డుస్థాయిలో పత్తికి భారీ లాభాలు
-
అధిక వర్షాలతో పత్తికి విపత్తు
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు. 38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు. రైతులు ఏం చేయాలంటే? ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి. వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి. పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి. మే జూన్లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది. వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి. -
ఖమ్మం: అగ్గికి ఆహుతైన 1500 పత్తి బస్తాలు
సాక్షి, ఖమ్మం: జిల్లా మార్కెట్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని 1500 పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేశాయి. అయితే పత్తి కావడం, మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో బస్తాలు నిమిషాల్లోనే ఆహుతి అయిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: భర్త లేడు.. ఇప్పుడు చేతికందొచ్చిన బిడ్డలు కూడా! -
రైతులకు గుడ్‌న్యూస్.. పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది. పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇది కూడా చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన -
TS: క్వింటాల్ పత్తి రూ.8 వేలు!.. వరి, కంది ధరలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతోంది. త్వరలో రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సీజన్లో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోతుంటారు. కొందరు సరైన అవగాహన, ప్రణాళికతో మంచి లాభాలు పొందుతుంటారు. కోతలు ముగిసే సమయానికి ఏ పంటకు ఎంత ధర ఉండే అవకాశం ఉందో ముందుగా అంచనా వేయగలిగితే.. రైతులు ఆ ప్రకారం పంటలు సాగు చేసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో 15 నుంచి 21 ఏళ్ల నెలవారీ ధరలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఫలితాలు, మార్కెట్ సర్వేలను పరిశీలించి 2023–24 వానాకాలం (ఖరీఫ్) పంటల ధరలు ఏ విధంగా ఉండవచ్చో అంచనా వేసింది. వరంగల్ ప్రధాన మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,550 నుంచి రూ.8,000 వరకు ఉంటుందని తెలిపింది. దీనితో పాటు వరి, మిర్చి, కంది తదితర పంటల ధరలను కూడా అంచనా వేసింది. అయితే పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులపై ఆధారపడి అంచనా ధరల్లో మార్పు ఉండొచ్చని పేర్కొంది. కాగా వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అంచనాల ప్రకారం..ఏయే పంటలు వేయాలో నిర్ణ యం తీసుకుని రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవ సాయ విశ్వవిద్యాలయం సూచించింది. మద్దతు ధరల కంటే ఎక్కువే.. ఈ ఏడాది రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు రైతులకు సూచిస్తున్నారు. ఆ తర్వాత వరి ఎలాగూ భారీగానే సాగవుతుంది. కాబట్టి పత్తి తర్వాత కంది సాగును కూడా పెంచాలనేది సర్కారు ఉద్దేశం. కాగా ఖరీఫ్‌లో పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధరకంటే ఎక్కువ ధరలే లభిస్తాయని వ్యవసాయ మార్కెట్ ఇంటిలిజెన్స్ కేంద్రం అంచనా వేయడం గమనార్హం. పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,380గా ఉంది. అయితే 2021–22 వానాకాలం సీజన్లో పత్తి ధర మార్కెట్లో ఏకంగా రూ.12 వేల వరకు పలికింది. దీంతో రైతులు గత సీజన్లో అంత ధర వస్తుందని భావించారు. కానీ రూ. 7–8 వేలకు మించలేదు. దీంతో చాలామంది రైతులు మంచి ధర కోసం ఎదురుచూస్తూ పత్తిని ఇళ్లల్లోనే దాచుకున్నారు. అందులో చాలావరకు పాడైపోయింది. ఇక ఈసారి కూడా పత్తి ధర రూ.8 వేల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రకటించడంతో రైతులు పత్తి సాగుకు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: నైరుతి రాక.. జూన్ రెండో వారం నుంచి వానలు! -
అప్పుడు అమ్మక.. ఇప్పుడు అమ్ముకోలేక
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తుమ్మిడే వెంకన్న. కుము రం భీం జిల్లా దహేగంకు చెందిన ఈయన పత్తి సాగు చేశాడు. ధర పెరుగుతుందనే ఆశతో ఇంట్లో 50 క్వింటాళ్ళ వరకు నిల్వ చేశాడు. ఆరు నెలల పాటు ఎదురుచూసినా పెరగకపోవడంతో క్వింటాల్ రూ.7,500 చొప్పున 20 క్వింటాళ్లు అమ్మేశాడు. మరో 30 క్వింటాళ్ళు ఇంట్లోనే నిల్వ ఉంది. అయితే ఎక్కువ రోజులు కావడంతో పురుగులు వస్తున్నాయని, పత్తి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మలేక, ఇంట్లో నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది పత్తికి పలికిన ధర రైతుల్ని ఊరించింది. దీంతో ఈ ఏడాది పండించిన పంటను చాలామంది రైతులు అమ్మకుండా రాబోయే రోజుల్లో మంచి ధర పలుకుతుందనే ఆశతో వివిధ రకాలుగా నిల్వ చేశారు. కొందరు దళారుల మాట నమ్మి అమ్మలేదు. మరికొందరు సొంతంగానే వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. కొందరు క్వింటాళ్ల కొద్దీ పత్తి ని ఇళ్లలోనే దాచుకున్నారు. ఎలుకలు, పురుగులు, దుర్వాసన సమస్యను ఎదుర్కొంటూ నెలల తరబడి ఎదురుచూశారు. కానీ ధర పెరగలేదు సరికదా.. సీజన్ మొదట్లో ఉన్న ధర కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో పత్తిని నిల్వ చేసిన రైతులు పంటను మరింత కాలం నిల్వ చేయలేక, అలాగని అమ్ముకోలేక లబోదిబోమంటున్నారు. చెడిపోయిన 20 శాతం పత్తి రాష్ట్రంలో గత ఏడాది 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే.. ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో పండించారు. మొత్తం 28.41 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో ప్రైవేటు సంస్థలు 9.86 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, కొంతమంది పత్తి రైతులు మహారాష్ట్రలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అమ్ముకున్నారు. దాదాపు సగం పత్తిని రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందనే ఆశతో దాచిపెట్టారు. అయితే వారి ఆశ అడియాసే అయ్యింది. ప్రస్తుతం అమ్మకుండా నిల్వ ఉన్న 14 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పత్తిలో 20 శాతం మేర నల్లబడి, చెడిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలుపు నుంచి నలుపులోకి.. పత్తిని నిల్వ చేసేందుకు కొందరు గోడౌన్లు అద్దెకు తీసుకుంటే మరికొందరు సొంత ఇళ్లల్లో దాచారు. కొందరు ఆరు బయటే కల్లాల్లో టార్పాలిన్ కవర్ల కింద కప్పిపెట్టారు. అయితే అమ్మకుండా ఎక్కువరోజులు కావడంతో పత్తి నుంచి వివిధ రకాల పురుగులు బయటకొస్తున్నాయి. ఎలుకల బెడదా పెరిగింది. ముఖ్యంగా ఇళ్లల్లో దాచినవారికి ఇబ్బందులెదురవుతున్నాయి. ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన కూడా వ్యాపిస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఆరుబయట వర్షాలు, ఎండల తాకిడితో పత్తి రంగు నల్లగా మారుతోంది. పత్తికి సరైన ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే తెలుపు రంగు దెబ్బతినకుండా ఉంటుంది. అలాంటి పత్తికే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. కానీ దిగుబడి వచ్చిన తర్వాత మూడు నెలలుగా నిల్వ చేయడంతో సరైన ఉష్ణోగ్రత లేక నల్లగా మారిపోతోంది. పత్తి గింజల నుంచి బంక లాంటిది బయటకొస్తోంది. ఈ పరిస్థితుల్లో కొందరు పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు ప్రయత్ని స్తున్నారు. కానీ అక్కడికి రవాణా, దళారులకు కమీషన్, ఇతరత్రా ఖర్చులు కలిపితే క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమయ్యే పరిస్థితి ఉంది. అయినా రాష్ట్ర సరిహద్దులో ఉన్న రైతులు అక్కడే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. మరొకొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరకే అమ్ముకుంటున్నారు. పెరుగుతున్న వడ్డీ భారం ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు పత్తి సాగు కోసం ఖర్చు చేశాడు. కొందరు అప్పులు చేసి మరీ పంట వేశారు. సకాలంలో అమ్ముకుంటే అప్పు తీరిపోయేది. మిత్తి డబ్బులు కూడా మిగిలేవి. కానీ ప్రస్తుతం వడ్డీ భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీర్చాలంటూ తీవ్రంగా వత్తిడి చేస్తున్నారు. దీంతో కొందరు కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నట్లు సమాచారం. -
పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు'
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. కొన్ని కొత్త రకాల పంటలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. రానున్న వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి 2022–23లో రూ.36 వేల నుంచి రూ.40 వేల పంట రుణాలను ఇవ్వగా ఈసారి రూ. 42 వేల నుంచి రూ. 45 వేలకు పెంచింది. అలాగే శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ. 36 వేల నుంచి రూ. 38 వేలుగా ఖరారు చేసింది. ఇక వరి విత్తనోత్పత్తికి కూడా రూ.5 వేలు అదనంగా పెంచింది. 2022–23లో రూ. 45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ. 38 వేల నుంచి రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 42 వేల నుంచి రూ. 45 వేల వరకు పెంచింది. ఆయిల్‌పాంకు ఎకరానికి రూ. 42 వేల రుణం... ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఆయిల్‌పాం పంటలు సాగు చేసే రైతులకు రుణ పరిమితి ఖరారు చేసింది. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి కూడా అంతే ఖరారు చేసింది. ఇక కీలకమైన మిర్చికి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల వరకు పెంచింది. సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో పండించే మినుముకు రూ. 18–21 వేలు ఖరారు చేశారు. శనగకు రూ. 24 నుంచి రూ. 26 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 30–34 వేలుగా, నీటి వసతి లేనిచోట రూ. 26–28 వేలు ఖరారైంది. కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ. 21–24 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 18–21 వేలు ఖరారు చేశారు. సోయాబీన్‌కు రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల వరకు ఇస్తారు. ఉల్లి సాగుకు రూ.45 వేలు ఉల్లిగడ్డ సాగుకు గతంలో ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ. 40 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. పట్టుకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలుగా ఖరారు చేశారు. ఇక పత్తి విత్తనాన్ని సాగు చేసే రైతులకు గణనీయంగా పెంచారు. గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 80 వేల నుంచి రూ. 85 వేల వరకు ఇస్తారు. టస్సర్ కల్చర్ (ఒకరకమైన పట్టు) సాగుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు. -
ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదంటే నమ్ముతారా?
ముల్లు.. అది గులాబీ ముల్లైనా, పిచ్చి పొదల్లో ముల్లైనా.. చివరికి చేప ముల్లైనా గుచ్చుకుంటుందని భయపడతాం. గులాబీని వాడేటప్పుడు, చేపలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. కానీ పొందూరు ఖాదీ నేతకార్మికులు ఆ ముల్లు లభించక తల్లడిల్లుతున్నారు. వారికి అవసరమైన కృత్రిమ ముళ్ల తయారీకి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఆఫ్ట్రాల్ ఒక ముల్లు కోసం ఇన్ని మల్లగుల్లాలా! ఏమిటి దాని గొప్ప? అని వెటకారం చేయకండి.. చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదు. ఖాదీ వస్త్రాలు ఆ నునుపు, మెరుపు సంతరించుకోలేవు మరి! అలాగని అన్ని చేపల ముళ్లు పనికిరావు. ఖాదీ వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడి కొండపత్తిలోని పొల్లు తీసి శుభ్రం చేసేందుకు వాలుగ చేప ముల్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ చేప దవడ పలువరుసతో ఉండే ప్రత్యేకమైన ముల్లు లభించక దాని ప్రభావం ఖాదీ నేతపై పడుతోంది. అందుకే వాలుగ చేప ముల్లును పోలి ఉండేలా కృత్రిమ పరికరం తయారీకి ఒక సీనియర్ సైంటిస్ట్, ఒక యువజన సంఘం, ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖాదీ తయారీలో కీలకమైన.. పత్తిని శుభ్రం చేసేందుకు వినియోగించే.. వాలుగ చేప దవడ భాగం అవసరానికి తగినంతగా లభ్యం కావడం లేదా? ఆ చేప ముల్లును సేకరించడం కష్టతరంగా మారిందా..? ఆ ముల్లుకు ప్రత్యామ్నాయాలను రూపొందించే పనిలో సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏమిటీ వాలుగ.. ఎందుకీ వెలుగు.. వాలుగు చేప.. శాసీ్త్రయ నామం వల్లగో అట్టు. మంచినీటిలో పెరిగే చేప. మిగతా చేపల మాదిరిగా కాకుండా దవడ భాగం విభిన్నంగా ఉంటుంది. దవడలోని ఉండే మృదువైన పళ్లవరసే ఖాదీ వస్త్రం రూపొందించడంలో కీలకం. ఖాదీకి అంత తెలుపు రంగు తీసుకురావడంతో కూడా కీలక పాత్ర దీనిదే. వినియోగం ఎలా.. వాలుగ చేప దవడ భాగాన్ని మత్స్యకారుల నుంచి సేకరిస్తారు. పైదవడను రెండు ముక్కలుగా, కింది దవడను రెండు ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కను ఓ చిన్న కర్రకు దువ్వెన మాదిరిగా కడతారు. దాని సాయంతో పత్తిని శుభ్ర పరుస్తారు. ఈ క్రమంలో పత్తి మృదువుగా తయారవడంతో పాటు మరింత తెలుపుగా మారుతుంది. ఎడమ చేతి వా టం ఉన్న నేత కారులు ఎడమ దవడను, కుడి చేతి వాటం ఉన్న వారు కుడి దవడను వినియోగించి పత్తిని శుభ్రపరిచేందుకు వినియోగించడం మరో విశేషం. గతంలో రాజమండ్రి నుంచి.. తొలినాళ్లలో రాజమండ్రి ధవళేశ్వరం నుంచి కరకు సత్యమ్మ అనే మహిళ పొందూరు ఖాదీ కార్యాలయానికి వాలుగ చేప దవడల్ని సరఫరా చేసేవారు. ఆమె మరణాంతరం అక్కడ్నుంచి ముల్లు రావడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం పరిసరాల్లోని మత్స్యకారులు అడపాదడపా తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రత్యామ్నాయాల రూపకల్పనలో.. ఖాదీ తయారీలో వాలుగ చేప దవడ కీలకం కావడం.. అవసరమైన మేర లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మహరాష్ట్ర వార్ధాలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్(ఎంజీఐఆర్ఐ) సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ఓ బృందం స్టీల్‌తో వాలుగ చేప దవడ మాదిరిగా ఓ పరికరాన్ని రూపొందించింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎంఈ సంస్థ తయారుచేసింది. ఆ పరికరం పనితీరును పొందూరు ఖాదీ తయారీలో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కానీ వాలుగ చేప దవడతో వచ్చేంత మృదుత్వం ఈ పరికరంతో రాలేదు. నేతన్నల చేతులకు గాయాలవ్వడం.. ఇతర అంశాల కారణంగా ఆ పరికరం వినియోగంలోకి రాలేదు. ●అయినా సీనియర్ సైంటిస్ట్ మహేష్ కుమార్ ప్రత్యామ్నాయాలపై పట్టువిడవలేదు. చేప దవడ మాదిరిగానే ఉండేలా సన్నని ప్లాస్టిక్ సూదుల్ని స్విట్జర్లాండ్‌లో, దవడ భాగాన్ని థాయ్‌లాండ్‌లో రూపొందించి మరో కొత్త పరికరాన్ని రూపొందించారు. కానీ ఈ పరికరం ఖర్చు ఎక్కువగా ఉండడంతో.. ఖాదీ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపించారు. ● జిల్లాకు చెందిన పొగిరి జశ్వంత్‌నాయుడు (చైన్నె ట్రిపుల్ ఐటీ, ఐఐఎం అమృత్సర్ పూర్వ విద్యార్థి) బృందం కూడా ప్రత్యామ్నాయ పరికరంపై దృష్టిసారించింది. ఐఐఎం అమృత్సర్ వేదికగా ఐదుగురు సభ్యుల బృందం త్రీడీ టెక్నాలజీ సాయంతో మోడల్‌ను రూపొందించింది. ప్లాస్టిక్‌ది కావడం.. ఇతర అంశాల వల్ల ఇదీ సఫలీకృతం కాలేదు. ఈ బృందం మరిన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ● పొందూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం(ఏఎఫ్‌కేకే) వాలుగ చేప సేకరణకోసం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. వాలుగ సేకరణ కష్టంగా మారడంతో దానిని పోలి ఉండే మరో రకం చేపపై దృష్టిసారించారు. హిరమండలం రిజర్వాయర్‌లో వీటిని సేకరించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దీని వినియోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. త్వరగా విరిగిపోవడం, అరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీనిని వినియోగిస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం.. పొందూరు ఖాదీలో కీలకమైన వాలుగ చేప దవడ భాగం సేకరణ కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయాల దిశగా ఐఐఎం అమృత్సర్ వేదికగా మా టీమ్ దృష్టి సారించింది. ప్రాఫెసర్తో సహా ఐదుగురు సభ్యులు ఓ పరికరాన్ని రూపొందించాం. కొన్ని ఇబ్బందులు గమనించాం. పూర్తి పర్యావరణ హితమైన మెటీరియల్‌తో తయారు చేసేందుకు మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. – పొగిరి జశ్వంత్ నాయుడు, స్టేటజీ కన్సల్టెంట్, ఈవై శిక్షణ తీసుకున్నాం.. కృత్రిమ చేప ముల్లుతో పత్తిని శుభ్రం చేసే ప్రక్రియను నేర్చుకునేందుకు హైదరాబాదుకు వెళ్లాం. దీని వినియోగంతో నాణ్యమైన 100 కౌంటు దారం రాదు. ఈ కృత్రిమ ముల్లుతో చేయడం వల్ల చేతి వేళ్లకు గాయాలై రక్తం వచ్చేది. అందుకే దీనిని వినియోగించలేదు. –కాపల కుమారి, చేనేత కార్మికురాలు ఆ రిజర్వాయర్‌లో గుర్తించాం.. విదేశీ సాంకేతికతతో తయారు చేసిన ప్రత్యామ్నాయ పరికరం ఖరీదు రూ.750 వరకు ఉంది. అదే వాలుగ చేప దవడ అయితే కేవలం రూ.25 నుంచి రూ.50 వరకు ఉంది.వాలుగ చేప శాస్త్రీయ నామం వల్లగో అట్టు. ఇది మంచి నీటి చేప. మా అధ్యయానాల్లో వాలు గు చేపలు మడ్డువలస రిజర్వాయర్‌లో విస్తృతంగా ఉన్నాయి. చాలా పెద్ద సైజుల్లోనే లభ్యమవుతున్నాయి. –డాక్టర్ కర్రి రామారావు,జీవవైవిధ్య శాస్త్రవేత్త, డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం కొరత వాస్తవమే.. పొందూరు ఖాదీకి కీలకమైన వాలుగ చేప దవడ కొరత వాస్తవమే. చాలా మంది ప్రత్యామ్నాయాల వేటలో ఉన్నారు. కానీ అవి సఫలీకృతం కాలేదు. మా వంతుగా ఇటీవలే హిరమండలం రిజర్వాయర్‌లో వేరే రకం చేపను వినియోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. వాలుగుకు ఏదీ సాటి రాదు. –డి.వెంకటరమణ, సెక్రటరీ, ఏఎఫ్‌కేకే, పొందూరు వాలుగుకు ఏదీ సాటిరాదు. పత్తిని శుభ్రం చేసేందుకు వాలుగ చేప దవడకు ప్రత్యామ్నాయం లేదనే చెబుతున్నారు నిపుణులు. ఆ సున్నితత్వం.. ఆ శ్వేతవర్ణం వాలుగుకు ఏదీ సాటిరాదంటున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో వాలుగ చేపలు ఉన్నాయని జీవవైవిధ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులకు దీని వినియోగంపై విస్తృతమైన అవగాహన కల్పించి వారితో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా కూడా ఖాదీ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందంటున్నారు. -
పత్తిలో దాక్కుని.. ఊపిరందక..
కౌటాల: దాగుడుమూతలు ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా పత్తిలో దాక్కునే ప్రయత్నంలో ఊపిరి ఆగిపోయింది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాష్, రుమలకు ముగ్గు రు సంతానం అభిషేక్, హర్షిత్, అవంతిక ఉన్నారు. అభిషేక్ (12) కౌటాలలోని ప్రైవేటు పాఠశాల్లో 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కౌటాల వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అభిషేక్ తమ్ముడు, చెల్లితో దాగుడుమూతలు ఆడుతూ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తిలో దాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరాడు. ఇంట్లోకి వచ్చిన హర్షిత్ పత్తిలో తన అన్న తలదూర్చి కాళ్లు పైకి ఉండటం గమనించాడు. భయపడి కేకలు వేయడంతో బంధువులు వచ్చి బయటకు తీశారు. కౌటాలలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూ చన మేరకు కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌కు తరలించారు. అప్పటికే అభిషేక్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
పత్తి @ రూ.9,150..
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవ సాయ పత్తి మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో సోమవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి రూ.9,150 పలికింది. మార్కెట్‌కు 115 వాహనాల్లో 997 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.9,150, మోడల్ ధర రూ.9,000, కనిష్ట ధర రూ.8,000 పలికింది. గన్నీ సంచుల్లో 60 మంది రైతులు 107 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.8,800, మోడల్ ధర రూ.8,500, కనిష్ట ధర రూ.6,000తో ఖరీదు చేశారు. -
పత్తి ధర అదుర్స్
గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ధర దూకుడు ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ–నామ్ కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటా రూ.9,040 పలకగా.. తాజాగా అదే వేగం కొనసాగుతోంది. శనివారం జరిగిన కొనుగోళ్లలోనూ క్వింటా గరిష్టంగా రూ.9,055 పలికింది. 13 మంది రైతులు 31.32 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా ఈ ధర పలికింది. కనిష్టంగా రూ.8,771 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. సీజన్ ఆరంభం నుంచి ఈ–నామ్ ద్వారా ఇప్పటివరకు 77 మంది రైతులు 170.72 క్వింటాళ్ల పత్తిని విక్రయించారని ఆయన పేర్కొన్నారు. -
బ్రౌన్ కాటన్ సాగు.. పర్యావరణానికి ఎంతో మేలు
కృత్రిమ రంగులద్దే అవసరం లేనందున బ్రౌన్ కాటన్ సాగుతో పర్యావరణానికి మేలు. జన్యుమార్పిడి చేయని బ్రౌన్ కాటన్ సూటి వంగడాలకు సిఐసిఆర్ రూపకల్పన. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడినిచ్చే బ్రౌన్ కాటన్ వంగడాలు 3 రకాల్లో రెండు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి సేంద్రియ, ప్రకృతి సేద్యానికి.. తిరిగి విత్తుకోవడానికి కూడా అనువైనవి అక్టోబర్ 7న ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ జరుపుకోనున్న సందర్భంగా ప్రత్యేక కథనం పత్తి అంటే ఎవరికైనా చప్పున గుర్తొచ్చేది తెల్ల బంగారమే. వేరే రంగులో ఉండే దూది కనిపిస్తే దానికి కృత్రిమంగా రంగులద్ది ఉంటారనే భావిస్తాం. అయితే, గోధుమ రంగు దూదిని పండించే పత్తి రకాలు సహజసిద్ధంగానే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీటినే నాచురల్లీ కలర్డ్ కాటన్ రకాలు అని, బ్రౌన్ కాటన్ రకాలు అని పిలుస్తుంటారు. సహజసిద్ధమైన బ్రౌన్ కాటన అటవీ రకాలను అభివృద్ధి పరచి మహారాష్ట్ర నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం (ఐసిఏఆర్– సిఐసిఆర్) శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే 3 సరికొత్త బ్రౌన్ కాటన్ సూటి వంగడాలను అభివృద్ధి చేశారు. వైదేహి–1, సిఎన్హెచ్ 17395 అనే రకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు మహారాష్ట్ర తదితర సెంట్రల్ జోన్ రాష్ట్రాలకు ఉపయోగపడే మరో రకాన్ని కూడా అధికారికంగా విడుదల చేశారు. జన్యుమార్పిడి చేయకుండా రూపొందించిన నాన్‌బీటీ రకాలు ఈ బ్రౌన్ పత్తి సూటి రకాలు. ఇతర పత్తితో కలిసిపోకుండా దూరం పాటిస్తూ సాగు చేసుకుంటే.. ఈ పత్తి నుంచి వేరు చేసిన గింజలనే తదుపరి పంటకు విత్తనాలుగా వాడుకోవచ్చు. విత్తనాన్ని ప్రతి ఏటా కొనాల్సిన అవసరం ఉండదు. ప్రధాన శాస్త్రవేత్త డా. వినితా గొట్మరె తదితర శాస్త్రవేత్తలు 15 ఏళ్ల పాటు కొనసాగించిన పరిశోధనల ఫలితంగా రూపుదాల్చిన ఈ వంగడాలు చీడపీడలకు తట్టుకొని రైతులకు మంచి దిగుబడులనివ్వగలవని సిఐసిఆర్ సంచాలకులు డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బ్రౌన్ కాటన్‌తో ప్రయోజనాలేమిటి? బ్రౌన్ కాటన్ రకాలు అనేక చీడ పీడలను తట్టుకొని వర్షాధారంగా కూడా మంచి దిగుబడులను ఇవ్వగలవు. కాబట్టి ఈ రకం పత్తి సాగు వల్ల ప్రకృతి వనరులపై, పర్యావరణంపై దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా చైతన్యవంతులైన వినియోగదారులు ఆర్గానిక్ కాటన్ మాదిరే బ్రౌన్ కాటన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెల్ల దూదితో రంగు వస్త్రాలను ఉత్పత్తి చేసే క్రమంలో జౌళి పరిశ్రమదారులు కృత్రిమ రసాయన రంగులద్దుతూ ఉంటారు. వాషింగ్, బ్లీచింగ్, డైయింగ్ ప్రక్రియల కారణంగా భారీగా మురుగు నీరు విడుదలవుతుంది. చాలా సందర్భాల్లో పూర్తిగా శుద్ధి చేయకుండానే విడుదల చేసే ఈ కలుషిత జలాల వల్ల పర్యావరణంతో పాటు భూమిని, నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా మనుషులతోపాటు పశువులకు, జలచరాలకు తీరని హాని జరుగుతోంది. పర్యవసానంగా ఆ పరిసర ప్రాంత ప్రజలు కేన్సర్, చర్మవ్యాధులు, పనిసంబంధమైన ఆస్మా లేదా అలర్జీలు, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ జబ్బుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగులద్దే ప్రక్రియలో రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి సహజసిద్ధమైన గోధుమ రంగు పత్తి ఉత్పత్తి ఉపకరిస్తుంది. గతంలో అందుబాటులో ఉన్న దేశవాళీ బ్రౌన్ కాటన్ రకాల్లో దూది పటుత్వ లోపం తదితర సమస్యలను అధిగమించే విధంగా ఈ వంగడాలను సిఐసిఆర్ అభివృద్ధి పరచటం విశేషం. సిఐసిఆర్–హెచ్ కాటన్ 58 సిఐసిఆర్–హెచ్ కాటన్ 58 (సిఎన్హెచ్ 17395) రకం బ్రౌన్ కాటన్ వంగడం ఈ ఏడాదే విడుదలైంది. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు అనువైనది. ఈ రకం కూడా హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడినివ్వగలదు. పింజ పొడవు 23.7 ఎం.ఎం. ఉంటుంది. బ్యాక్టీరియా తెగులుతోపాటు ఆల్టెర్నేరియా ఆకు మచ్చ, గ్రే మిల్డ్యూ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. సెర్కోస్పొర ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లను మోస్తరుగా తట్టుకుంటుంది. మొలక శాతం బాగుంటుంది. చీడపీడలను దీటుగా తట్టుకునే ఈ సూటి రకం బ్రౌన్ కాటన్ సాగు దక్షిణాది రైతులకు మంచి ఆదాయాన్ని ఇవ్వగలుగుతుందని సిఐసిఆర్ ఆశిస్తోంది. వైదేహి–1 రకం సిఐసిఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బ్రౌన్ కాటన్ రకాల వరుసలో వైదేహి–1 మొదటిది. దక్షిణాది రాష్ట్రాల్లో వాణిజ్యస్థాయి లో సాగుకు అనువైనది. ప్రభుత్వ ఆమోదంతో గత ఏడాది నోటిఫై అయ్యింది. ముదురు గోధుమ రంగు దూదిని అందిస్తుంది. 3 అటవీ రకాల్లోని సుగుణాలతో రూపొందిన అమెరికన్ కాటన్ (గాస్పిం హిర్సుటం) సూటి రకం వంగడం ఇది. బెట్టను తట్టుకునే లక్షణం ఉండటం వల్ల ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే వర్షాధారంగా హెక్టారుకు 14–15 క్వింటాళ్ల వరకు, నీటిపారుదలతో 20 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుందని సిఐసిఆర్ చెబుతోంది. వైదేహి–1 రకం ముదురు గోదుమ రంగు దూది పింజ పొడవు 22.5 ఎం.ఎం. ఉంటుంది. పటుత్వం 3.95. సూర్యరశ్మి బాగా సోకే విధంగా మొక్క నిర్మాణం ఉంటుంది. కాబట్టి, కాయతొలిచే పురుగు ను తట్టుకుంటుంది. పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక వంటి రసంపీల్చే పురుగులను తట్టుకుంటుంది. అటవీ రకాల మాదిరిగా బాక్టీరియా తెగులుతో పాటు అల్టర్నేరియా ఆకుమచ్చ, గ్రే మిల్డ్యూ, సెర్కోస్పొర ఆకుమచ్చ, తుప్పు తెగులు వంటి శిలీంద్రపు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. విత్తన మొలక శాతం బాగుంటుంది. స్పిన్నింగ్‌కు అనువైన రకం. అధిక దిగుబడినిచ్చే ఈ ముదురు గోధుమ రంగు పత్తి రకం రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని డా. ప్రసాద్ తెలిపారు. సాధారణంగా బీటీ పత్తిరకాల పింజ 28–31 ఎం.ఎం. మధ్యలో ఉంటుంది. ఈ రెండు మధ్యస్థ పింజ రకాలు. పింజ పొడవు 22.8–23.7 ఎం.ఎం. ఉంటుంది. అయినా, వీటి జిన్నింగ్‌కు సమస్యలు ఉండవని డా. ప్రసాద్ తెలిపారు. సహజమైన రంగు పత్తి కావటం వల్ల ఒనగూడే పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో బ్రౌన్ కాటన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు బ్రౌన్ కాటన్ ఒప్పంద సాగుకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో సిఐసిఆర్ నాన్‌బీటీ రకాలు రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిద్దాం. ఇతర పత్తి రకాలతో ఈ విలక్షణ వంగడాలు కలుషితం కాకుండా రైతులు జాగ్రత్తపడాలి. పత్తి కోసం సాగు చేసినా, విత్తనం కోసం సాగు చేసినా ఇతర రకాల పత్తి పొలాల నుంచి 50 మీటర్ల దూరం పాటించటం తప్పనిసరి. కంచె పంటగా జొన్న/ సజ్జ/ మొక్కజొన్నను పొలం చుట్టూ 4 సాళ్లు వేసుకోవటం ద్వారా తెల్ల బీటీ పత్తితో బ్రౌన్ కాటన్ కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బ్రౌన్ కాటన్ నాన్–బీటీ రకాలు సేంద్రియ సేద్యానికి అనువైనవి గోధుమ రంగు పత్తి(బ్రౌన్ కాటన్)ని ఉత్పత్తి చేసే నాన్‌బీటీ (జన్యుమార్పిడి చేసినవి కాదు) సూటి వంగడాలను 15 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించాం. సాధారణ పద్ధతితో పాటు సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువైన సూటి రకాలు ఇవి. పత్తి నుంచి విత్తనాలు తీసి తిరిగి మళ్లీ విత్తుకోవచ్చు. అయితే, ఇతర తెల్ల రకం పత్తి పొలాలకు కనీసం 50 మీటర్ల దూరంలో బ్రౌన్ కాటన్ రకాలను సాగు చెయ్యాల్సి ఉంటుంది. రైతులు ఈ జాగ్రత్త పాటించాలి. ఈ రకం పత్తి కాయలు పగిలిన మొదట్లో కాయ లోపలి దూది తెల్లగానే ఉంటుంది. అయితే, ఎండ తగిలిన తర్వాత దూది క్రమంగా గోధుమ లేదా ముదురు గోధుమ రంగులోకి మారుతుందని రైతులు గమనించాలి. 60/75“30 సెం.మీ. దూరంలో (అంటే.. సాళ్ల మధ్య 2/రెండున్నర అడుగుల దూరం, మొక్కల మధ్య అడుగు దూరంలో) విత్తుకోవచ్చు. ఎకరానికి 2 నుంచి 2.5 కేజీల విత్తనం అవసరమవుతుంది. బ్రౌన్ కాటన్ నాన్‌బీటీ రకాల విత్తనాల కోసం రైతులు ఈ క్రింది ఈ–మెయిల్ ద్వారా సంప్రదింవచచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్, నాగపూర్–440010, మహారాష్ట్ర. CICRNAGAPUR@gmail.com చదవండి: పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి! -
కాటన్ మరిచారు.. కుట్లు వేశారు!
వర్ధన్నపేట: ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణికి శస్త్రచికిత్స చేసి అందులోనే కాటన్ (దూది) మరిచి కుట్లు వేసి పంపించిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి శివారు బావనికుంట తండాకు చెందిన నూనావత్ దేవేందర్ భార్య సౌజన్య జూన్ 16న పురిటి నొప్పులతో బాధపడగా.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సాధారణ ప్రసవమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తల్లీ, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, రక్తస్రావం అవుతుండటంతో చిన్న శస్త్రచికిత్స చేసి రెండు కుట్లు వేస్తే సరిపోతుందని కుట్లు వేశారు. ఆరోజు నుంచి సౌజన్య అనారోగ్యంతో బాధపడుతోంది. కడుపు నొప్పి తోపాటు మంట తదితర సమస్యలతో బాధపడుతుండగా దేవేందర్ వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేసిన చోట లోపల కాటన్ మరిచి కుట్లు వేశారని తేల్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన దేవేందర్.. సౌజన్యను శుక్రవారం ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులను నిలదీశాడు. కుట్లు వేసినప్పుడు పొరపాటున కాటన్ మరిచి కుట్లు వేశామని, తమను క్షమించమని కోరారన్నారు. వెంటనే మళ్లీ శస్త్రచికిత్స చేసి కాటన్‌ను తొలగించి సౌజన్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
‘పట్టు’న్న జిల్లా.. శ్రీసత్యసాయి
హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ ఆసియాలోనే పేరు గాంచింది. ఇక్కడి చింతపండు, మిర్చి యార్డ్ నుంచి దేశ విదేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ రైతులు కూడా హిందూపురం మార్కెట్లకు ఉత్పత్తులు తెచ్చి విక్రయించుకుంటున్నారు. హిందూపురం: పట్టు...చింతపండు విక్రయాలకు హిందూపురం మార్కెట్లు ఆసియాలోనే పేరుగాంచాయి. ఇక్కడి నుంచి పట్టుగూళ్లు, చింతపండు కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మిగతా మార్కెట్లతో పోలిస్తే ధర ఎక్కువగా దక్కడం వల్ల అనంతపురం, కర్నూలు, నంద్యాల, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రైతులు ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చి విక్రయించుకుంటున్నారు. మార్కెట్ ఫీజుతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతోంది. ‘పట్టు’న్న జిల్లా.. శ్రీసత్యసాయి జిల్లా మల్బరీ సాగులో అగ్రస్థానంలో ఉంది. అలాగే జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్లు పేరుగాంచాయి. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ ఆసియాలోనే పేరుగాంచింది. ఇక దేశంలోని పట్టుగూళ్ల మార్కెట్లలో కర్ణాటకలోని రామనగర్ తర్వాత స్థానం హిందూపురం మార్కెట్‌దే. జిల్లాలో ఏడాదికి 30 వేల మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి అవుతాయి. ఒక్క హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్లోనే ఏటా వెయ్యి టన్నుల పట్టుగూళ్ల విక్రయాలు సాగుతాయి. ఈ మార్కెట్లో బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఏడాది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కిలో బైవోల్టిన్ గూళ్లు గరిష్టంగా రూ.1,000పైనే పలికాయి. దేశ విదేశాలకు చింత ఎగుమతి.. హిందూపురం చింతపండు, మిర్చి మార్కెట్ ఆసియాలోనే పెద్ద మార్కెట్లలో ఒకటి. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రైతులు చింతపండును ఎక్కువగా ఈ మార్కెట్‌కే తెస్తారు. అందువల్లే ఇక్కడ ఏటా రూ.కోట్లల్లో టర్నోవర్ జరుగుతోంది. అధికారికంగా ఏటా లక్ష క్వింటాళ్ల చింతపండు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అనధికారికంగా మరో 50 వేల క్వింటాళ్ల వ్యాపారం జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి చింతపండును వ్యాపారులు విజయవాడ, తమిళనాడులోని చెన్నై, సేలం, కోయంబత్తూర్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ కంపెనీలు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తాయి. రైతులకు నమ్మకం హిందూపురం మార్కెట్‌యార్డు చింతపండు, మిర్చి క్రయవిక్రయాలకు పేరుగాంచింది. రైతులకు ఈ మార్కెట్‌పై నమ్మకం ఎక్కువ. గిట్టుబాటు ధర లభించడంతో పాటు లావాదేవీలు కచ్చితంగా ఉంటాయి. అందువల్లే ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడి తీసుకువచ్చి విక్రయించుకుంటారు. ఏడాదిలో ఆరునెలలు చింతపండు మార్కెట్ బాగా ఉంటుంది. మిర్చి మార్కెట్ నిరంతం సాగుతుంది. – నారాయణ మూర్తి, స్పెషల్‌గ్రేడ్ కార్యదర్శి, హిందూపురం మార్కెట్‌యార్డు మోసం ఉండదు హిందూపురం మార్కెట్లో మోసం ఉండదు. అధికారులు, వ్యాపారులు నిక్కచ్చిగా ఉంటారు. అందుకే రైతులు చింతపండును ఎక్కువగా ఈ మార్కెట్‌కే తెస్తారు. ఈసారి ధర బాగానే ఉంది. నాణ్యమైన చింతపండు విదేశాలకు ఎగుమతి అవుతుంది కాబట్టి వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే రైతుకు మంచి ధర లభిస్తోంది. – నాగప్ప, జూలకుంట. గిట్టుబాటు ధర హిందూపురం మార్కెట్‌పై రైతులకు ఎక్కువ గురి ఉంటుంది. మిగతా మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ గిట్టుబాటు ధర దక్కుతుంది. ప్రస్తుతం కిలో బైవోల్టిన్ గూళ్లు రూ.750 నుంచి రూ.900పైగా∙పలుకుతున్నాయి. గతంలో రూ.350 మించి పలికేవి కావు. అందుకే రైతులు హిందూపురం మార్కెట్‌కు వచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. – తిమ్మేగౌడ్, బక్తరహళ్లి, మడకశిర. -
పత్తి ధర క్వింటా రూ.12 వేలు
ఖమ్మం వ్యవసాయం: పత్తికి రికార్డు ధర పలుకుతోంది. పంట ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పత్తి ధరకు రెక్కలొచ్చాయి. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్వింటా రూ.12,001గా నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు మొత్తం 506 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన గోకినపల్లి సైదులు అనే రైతు తీసుకొచ్చిన 29 బస్తాల పత్తికి వ్యాపారి రామా శ్రీను గరిష్టంగా రూ.12,001 ధర పెట్టారు. మిగిలిన లాట్లకు నాణ్యత ఆధారంగా మోడల్ ధర రూ.10,500 పలకగా, కనిష్ట ధర రూ.9,000 వచ్చింది. 15 రోజుల వ్యవధిలో పత్తి ధర క్వింటాకు రూ.2 వేలు పెరిగింది. -
ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం ఉంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుం టోందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరం జన్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాల ను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావే శంలో మంత్రి మాట్లాడారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనాకేంద్రాలలో పరిశోధనలు జరగాలని సూచించారు. అంతర్జాతీ యంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పంట కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకున్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగులో మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నారు నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా బీచుపల్లి ఫ్యాక్టరీ అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం స్థలసేకరణకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబాబాద్‌లో 84 ఎకరాల్లో ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆలుగడ్డ విత్తన సమస్యను అధిగమించడానికి విత్తన నిల్వకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ సోనా వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశనగ, నిజామాబాద్ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీబాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మెరిసిన ‘తెల్ల బంగారం’.. కిలో ఎంతంటే
సాక్షి, జడ్చర్ల (మహబూబ్‌నగర్): బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల బంగారం ఒక్కసారిగా మెరిసిపోయింది. యార్డు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బుధవారం రికార్డు స్థాయి ధర లభించింది. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.6,025 మద్దతు ధర ప్రకటించగా.. ఏకంగా గరిష్టంగా రూ.8,829 పలికింది. కనిష్టంగా రూ.6,830 ధర లభించింది. కనిష్ట ధరలు కూడా మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడం విశేషం. బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన రైతు శ్రీను తీసుకొచ్చిన పత్తికి అత్యధిక ధర వచ్చింది. ఇక మిగిలిన పంట ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఆర్ఎన్ఆర్ ధాన్యానికి గరిష్టంగా రూ.2,009 ధర రాగా, కనిష్టంగా రూ.1,409 పలికింది. హంసకు గరిష్టంగా రూ.1,679, కనిష్టంగా రూ.1,409, మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,810, కనిష్టంగా రూ.1,552, రాగులకు రూ.2,562, కందులకు గరిష్టంగా రూ.5,829, కనిష్టంగా రూ.5,014, ఆముదాలకు గరిష్టంగా రూ.5,400, కనిష్టంగా రూ.5,249 ధరలు కేటాయించారు. కిటకిటలాడిన మార్కెట్ పంట దిగుబడుల క్రయవిక్రయాలతో బాదేపల్లి మార్కెట్ కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి 1,922 బస్తాల పత్తి యార్డుకు విక్రయానికి వచ్చింది. అదేవిధంగా 2,200 బస్తాల ధాన్యం, 881 బస్తాల మొక్కజొన్న, 365 బస్తాల వేరుశనగ, 271 బస్తాల కందులు విక్రయానికి వచ్చింది. మరోవైపు రైతులకు ఆశించిన ధరలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల యార్డుకు 1,180 క్వింటాళ్ల వేరుశనగ గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 1180 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టం రూ. 8174, కనిష్టం రూ. 4866, సరాసరి రూ.7200 ధరలు వచ్చాయి. 3 క్వింటాళ్ల ఆముదం రాగా, క్వింటాలుకు గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4510 ధరలు పలికాయి. 512 క్వింటాళ్ల వరి (సోన) రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 1929, కనిష్టం రూ. 1406, సరాసరి రూ. 1914 పలికింది. 41 క్వింటాళ్ల కంది రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 5266, కనిష్టం రూ. 4506, సరాసరి రూ. 5206 ధరలు లభించాయి. చదవండి: జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్ పత్తి ధర రూ.7,800
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడ్డారు. నాణ్యంగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.7,800 గరిష్ట ధర పలికింది. అలాగే కనిష్టంగా రూ.6,000 వరకు వేలం పాటలో రైతులకు చెల్లించారు. నారాయణపేట జిల్లాలో కూడా మంచి ధర వచ్చింది. ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి సమీపంలోని విజయ్ కాటన్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,300 ధర చెల్లించారు. అలాగే కనిష్టంగా రూ.6,500 చెల్లించారు. – జమ్మికుంట/నారాయణపేట -
రాష్ట్రంలో దాడుల నేపథ్యంలో విత్తన మాఫియా అలర్ట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ విత్తనాల దందాపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుండడంతో అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నకిలీ పత్తి విత్తుకు కేరాఫ్‌గా నిలిచిన గద్వాల జిల్లా సీడ్ ఆర్గనైజర్ల మా ఫియా అలర్ట్ అయ్యింది. ఇటీవల సుమారు 1,500 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను రాష్ట్ర సరిహద్దు దాటించేసి వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచినట్లు సమాచా రం. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ఎత్తుగడ ధనార్జనే ధ్యేయంగా పలువురు సీడ్ ఆర్గనైజర్లు ప్రతి ఏటా సీజన్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఫెయిల్యూర్ విత్తనాలతో పాటు నాసిరకం సీడ్స్‌ను సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేవారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల టాస్క్‌ఫోర్స్ దాడులు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుంటూ వ్యాపారులపై పీడీ యాక్ట్ సైతం ప్రయోగిస్తున్నారు. దీంతో గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంత మేర నిల్వ ఉన్న నకిలీ విత్తనాలను పలువురు సీడ్ ఆర్గనైజర్లు దహనం చేశారు. గద్వాల పట్టణ శివారులోని పలు మిల్లులు, మల్దకల్, ధరూర్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న నకిలీ విత్తనాలను ఎవరికి వారే స్వయంగా కాల్చివేశారు. ఆ తర్వాత కొత్త ఎత్తుగడ వేశారు. పక్కా ప్రణాళికతో సుమారు 1,500 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను రాష్ట్ర సరిహద్దు దాటించారు. గద్వాల జిల్లా సరిహద్దు అయిన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని ఆర్డీఎస్ పరివాహకంలో లింగ్సుగుర్, మట్మారి, అమరేశ్వర వంటి తదితర క్యాంప్‌లలో పెద్ద ఎత్తున నిల్వ చేసినట్లు తెలిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ సరిహద్దులో కర్ణాటకకు చెందిన ఆదులాపూర్‌లో సైతం డంప్ చేసినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల నుంచి రాయచూర్, మాన్వి, సింధనూర్‌తో పాటు పలు ప్రాంతాల రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. రంగంలోకి ప్రత్యేక బృందాలు గద్వాల జిల్లాలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించిన సందర్భంగా పట్టుబడిన నకిలీ విత్తనాలకు సంబంధించిన నింది తులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సీడ్ ఆర్గనైజర్ల మాఫియా జిల్లా నుంచి పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు తరలించి నిల్వ చేసినట్లు బయటపడింది. గద్వాల జిల్లా గట్టు మండలంలోని బల్గెర చెక్‌పోస్టు గుండా 1,500 క్వింటాళ్ల వరకు నకిలీ విత్తనాలను రాయచూర్ జిల్లాకు తరలించి వివిధ ప్రాంతాల్లో డంప్ చేశారని వారు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు దృష్టి సారించిన జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగం లోకి దింపింది. కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారం తో నకిలీ విత్తన నిల్వ కేంద్రాలపై ఆరా తీస్తోంది. ఎవరినీ వదిలిపెట్టం జిల్లాలో ఇప్పటివరకు 180.71 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటికి సంబంధించి 74 మంది నిందితులపై 54 కేసులు నమోదయ్యాయి. నకిలీ దందాపై డేగ కళ్లతో నిఘా పెట్టాం. అక్రమార్కులు ఎక్కడ ఉన్నా, ఎవరైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
Fashion: ఇకత్ స్టైల్.. ఎవర్గ్రీన్
ఇకత్ కాటన్ వేసవి ఉక్కపోతను తట్టుకుంటుంది. సంప్రదాయకతను కళ్లకు కడుతుంది. ఆధునికతనూ సింగారించుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కలనేతలోనే ఎవర్గ్రీన్ అనిపించే గొప్పదనం దాగుంటుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్‌తో డ్రెస్సులను సందర్భానికి తగినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఒకప్పుడు బెడ్షీట్స్గానే పేరొందిన ఇకత్ ఆ తర్వాత చీరలు, డ్రెస్సుల రూపంలోకి మారి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ, అఫిషియల్ వేర్‌గానూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇండోవెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేసిన ఇకత్ డ్రెస్సులు ఈ తరం అమ్మాయిలను, అమ్మలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయిలకు కుర్తీలు, అమ్మాయిలకు ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్తో పాటు వీటికి ఈ కాలానికి తగినట్టు మ్యాచింగ్‌గా ఇకత్ మాస్క్‌లను కూడా జత చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఇకత్ సింగిల్, డబుల్, పట్టులో లభిస్తుంది. కాటన్లో అయితే యంగ్‌స్టర్స్‌కి ఫ్రాక్స్. మోడలింగ్‌కి ప్యాంట్–క్రాప్‌టాప్ విత్ ఓవర్ కోట్, లాంగ్గౌన్స్ చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలకు హ్యాపీగా ధరించవ్చు. ఇది చేనేతకారులను ప్రోత్సహించాల్సిన సమయం. ఇకత్ క్లాత్‌తో ఎన్ని డిజైన్లు చేసుకోగలిగితే అన్నీ ప్రయత్నించవచ్చు. అందుకు కొన్ని మోడల్స్ ఇవి. – రజితారాజ్, డిజైనర్, హైదరాబాద్ -
భారత్‌పై ఆక్రోశం? చక్కెర, పత్తికి పాకిస్తాన్లో తిప్పలు
ఇస్లామాబాద్: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. భారత్ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది. భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
మన పత్తికి బ్రాండ్ ఇమేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇక్కడి దూది పింజ పొడవు దేశంలో కెల్లా పొడవుగా వస్తోందని, గట్టితనం కూడా ఎక్కువని పేర్కొన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో చర్చించాలని సూచించారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తిని శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం వంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ విస్తరణపై ప్రగతిభవన్‌లో సోమవారం సీఎం సమీక్షించారు. ‘దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. సాగునీటి ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది’అని సీఎం అన్నారు. ‘పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య 60 మాత్రమే ఉంటే, వాటిని 300కు పెంచేలా చర్యలు తీసుకుంది. పత్తి ఎక్కువ పండే ప్రాంతా ల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది’అని వివరించారు. ‘పత్తి సాగులో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి’అని సీఎం సూచించారు. ‘రైతులు లాభసాటి పంటలనే పండిం చేలా చర్యలు ప్రారంభించాం. రైతులు కూడా ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. వాటిని ఎక్కువగా పండించాలి. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి. ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలి’అని కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు ‘అగ్రికల్చర్ టుడే’అవార్డులు వచ్చినందుకు ఆ సంస్థ ఎండీ కేశవులును ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. రూ. 4,800 కోట్లతో ఆయిల్ పామ్ సాగు ప్రణాళిక రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఆమోదించారు. రైతులకు 50% సబ్సిడీ ఇచ్చి ఆయిల్ పామ్ సాగు చేయించనున్నట్లు సీఎం వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయాన్ని రైతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు–ముఖ్యాంశాలు ► దేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి. కానీ దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ఏటా 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ఏటా రూ.70 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ► దేశంలో 8 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి. ► రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, నిరం తర విద్యుత్ సరఫరా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయిల్ పామ్ సాగు చేయడానికి రాష్ట్రం అనువైందిగా గుర్తించాయి. ► రాష్ట్రంలోని నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచి ర్యా ల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్లగొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించారు. ► మూడేళ్ల పాటు అంతర పంట వేసుకోవచ్చు. నాలుగో ఏడాది నుంచి ఆయిల్ పామ్ పంట వస్తుంది. 30 ఏళ్ల పాటు పంట వస్తుంది. ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా కొకొవా కూడా పండించవచ్చు. తోట చుట్టూ టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు చేయొచ్చు. ► ఎకరానికి 10–12 టన్నుల గెలలు వస్తాయి. ► ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. ► ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,800 ఉంది. ► రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సొంత ఖర్చులతో నర్స రీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టబోతున్నాయి. ప్రతీ కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి, వారికి అప్పగిస్తారు. -
‘కాటన్ ఉత్పత్తికి సరిపోను గొర్రెలు లేవు’
సింగపూర్: సింగపూర్ మినిస్టర్ ఒకరు తప్పులో కాలేశారు. కాటన్ ఉత్పత్తికి తగినన్ని గొర్రెలు లేవంటూ నవ్వుల పాలయ్యారు. అది కూడా ఓ వీడియో ఇంటర్వ్యూలో. ఇంకేముంది జనాలు సదరు మినిస్టర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వివరాలు.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి చాన్ చున్ సింగ్ ఓ వీడియో ఇంటర్వ్యూలో విదేశీ వాణిజ్యం మీద సింగపూర్ ఎలా ఆధారపడిందో వివరిస్తూ.. ‘ఫేస్ మాస్క్‌లు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. కానీ వాటి తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదు. కాటన్‌ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్‌లో లేవు’ అన్నారు. తర్వాత తన పొరపాటును గ్రహించి తనలో తానే నవ్వుకున్నారు చాన్. కానీ ఈ లోపే నెటిజనులు ఆయనను ఓ ఆట ఆడుకున్నారు. ‘బాబా బ్లాక్ షీప్ రైం గుర్తు పెట్టుకుంటే సరి’.. ‘ఈ వీడియో చేసే వారేవరైనా.. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం కాటన్, పత్తి చెట్ల నుంచి వస్తుంది కానీ గొర్రెల నుంచి రాదని చెప్పగలరు’.. ‘నేను గొర్రెలను లెక్కిస్తున్నాను’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. అయితే చాన్ ఇలా నోరు జారడం ఇదే ప్రథమం కాదు. గతంలో లాక్డౌన్ నేపథ్యంలో మాల్స్ ముందు క్యూ కట్టిన జనాలను ఉద్దేశిస్తూ.. ‘ఇడియట్స్’ అని కామెంట్ చేశాడు. -
పత్తికి ‘పట్టు’ చేరితే మాస్కు భేష్!
అవసరం అన్నీ నేర్పిస్తుందని అంటారు. కరోనా వైరస్ విషయంలో ఇది అక్షరాలా నిజమని ఈ మహమ్మారి కట్టడికి జరుగుతున్న అనేకానేక ప్రయోగాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటా రెండా.. వ్యాక్సిన్ల కోసం వందల సంఖ్యలో ప్రయత్నాలు జరుగుతుంటే.. మందుల తయారీకి, కరోనా గుట్టుమట్లను కనిపెట్టేందుకు బోలెడంత మంది పరిశోధనలు చేస్తున్నారు. మనిషికి సవాల్ విసిరిన కరోనాను ఎదుర్కొనేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్లో మచ్చుకు కొన్ని.. కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడిక ముఖానికి ఓ తొడుగు తప్పనిసరి కానుంది. మరి, ఏ రకమైన వస్త్రంతో తయారైన మాస్కు ధరిస్తే మేలు? అమెరికాలోని షికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై కొన్ని ప్రయోగాలు చేశారు. కరోనా కట్టడికి ఇంట్లో తయారుచేసిన మాస్కు ధరించినా పర్వాలేదు కానీ, అది కాటన్, సిల్క్ లేదా షిఫాన్‌తో తయారైనదైతే మెరుగైన రక్షణ లభిస్తుందని ఈ ప్రయోగం చెబుతోంది. వైద్య సిబ్బందికి అవసరమైన ఎన్95 మాస్కులకు ఇప్పటికే కొరత ఉన్న విషయం తెలిసిందే. దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడే శరీర ద్రవాల నుంచి కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందన్నది ఇప్పటికే తెలిసిన విషయం. ఈ తుంపర్లు ఏకరీతిన ఉండవు. పత్తి, పట్టుల మిశ్రమంతో తయారైన మాస్కు కరోనా రోగుల నుంచి వెలువడే ద్రవాలను మెరుగ్గా అడ్డుకోగలదని షికాగో వర్సిటీకి చెందిన సుప్రాతిక్ గుహా తెలిపారు. దీన్ని నిర్ధారించేందుకు వీరు తుంపర్లను మిశ్రమంచేసే ఓ యంత్రాన్ని ఉపయోగించారు. పది నానోమీటర్ల నుంచి ఆరు మిల్లీమీటర్ల వ్యాసంతో కూడిన తుంపర్లను సృష్టించి ఓ ఫ్యాన్ సాయంతో వీటిని వేర్వేరు వస్త్రాలపై ప్రయోగించి చూశారు. ఊపిరితీసుకునే వేగం, దగ్గు, తుమ్ముల వల్ల తుంపర్లు ప్రయాణించే వేగాలకు అనుగుణంగా చేసిన ప్రయోగాల్లో బాగా గట్టిగా నేసిన ఒక పొర కాటన్, రెండు పొరల పాలిస్టర్ స్పాండెక్స్ షిఫాన్ 80–90 శాతం తుంపర్లను అడ్డుకున్నట్టు స్పష్టమైంది. ఇది ఎన్95 మాస్కు పనితీరు కు దగ్గరగా ఉండటం గమనార్హం. షిఫాన్ స్థానంలో పట్టు వస్త్రాలను ఉపయోగించినప్పుడు కూడా ఫలితాల్లో పెద్దగా మార్పు లేదు. బాగా గట్టిగా నేసిన పట్టు తుంపర్లను బాగా అడ్డుకుంటాయని, షిఫాన్, పట్టులాంటి వస్త్రాల ఉపరితలంపై ఉండే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వైరస్‌కు నిరోధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే మాస్కులు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ లభించడం కష్టమవుతుందని, ముఖానికి, మాస్కుకు మధ్య ఖాళీ ప్రదేశం ఉంటే వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం సగానికిపైగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. చదవండి: సెప్టెంబర్‌లో కొత్త విద్యా సంవత్సరం -
పోటెత్తిన పత్తి
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పత్తి పోటెత్తింది. రైతులు విక్రయించడానికి 30 వేల బస్తాలకు పైగా పత్తిని తీసుకురావడంతో యార్డు కిటకిటలాడింది. ఈ సీజన్లో ఇంత సరుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా 2 రోజులు సెలవులు, పత్తిలో కొంత తేమ తగ్గడంతో భారీగా పత్తి వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే సరుకు అధికంగా రావడం తో ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న క్వింటాలుకు గరిష్ట ధర రూ.5,000 ఉండగా రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గరిష్ట ధర నిర్ణయించినప్పటికీ ఎక్కువ పత్తిని రూ.4,400 నుంచి రూ.3,500 ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘ఎక్కువ ధర పెట్టలే సీసీఐ దగ్గరకు పోండి’ అని వ్యాపారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5,555తో కొనుగోలు చేయడానికి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఈనెల 7 నుంచి 23 వరకు 9340.55 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. తేమ శాతాన్ని బట్టి ధర చెల్లిస్తున్నారు. -
అమ్మకు తెలియదా!
ఒకరోజున ఆరుగురు వ్యాపారస్థులు నెత్తిన దూది బస్తాలు పెట్టుకొని వ్యాపార నిమిత్తం సమీప పట్టణానికి బయలు దేరారు. ప్రయాణం అడవిమార్గం గుండా సాగుతుంది. ఆ మార్గం కాస్త భయంకరమైనదని, క్రూరమృగాలతోపాటు దోపిడీదారులున్నారని కూడా తెలుసు. దాంతో వీలైనంత తొందరగా భయం భయంగా అడవి దాటాలని చూస్తున్నారు. నిజంగానే ఒక అడవిదొంగ దారికాచి వీరిని గమనించాడు. ఇప్పుడు వీరిని అడ్డగించి దోచుకోవడంవల్ల ప్రయోజనముండదు. వీరు వ్యాపారం ముగించుకొని తిరిగి వచ్చేటపుడు వీరి దగ్గర ధనముంటుంది. అప్పుడు దోచుకోవచ్చనుకున్నాడు. అతని దగ్గర తుపాకి వుంది. తూటాలు వేరుగా దాచుకున్నాడు. అవి తను స్వయంగా పేలుడు మందు, రవ్వలు దట్టించి, తూటా మూసి మైనపు పూతతో కప్పి తయారు చేసుకున్నాడు. వ్యాపారస్థులు అడవి దాటి మైదానం చేరుకున్నారు. ముందుకు సాగుతున్నారు. కనుచూపు మేరలో నీడలేదు. ఎండ మెండుగా వుంది. వేడికి తట్టుకోలేకపోతున్నారు. అటూ ఇటూ చూస్తే కొద్ది దూరంలో ఓ చెట్టు కనబడింది. ఆ నీడ చాల చిన్నది. ఆరుగురు నిలబడితే మాత్రం నీడ పడుతుంది. బస్తాలు నీడన పెట్టలేరు. సరే కాసేపు సేదదీరుదామని ఆరుగురూ చెట్టు నీడన చేరి, పత్తిబస్తాలు ఎండలోనే చుట్టూ పెట్టుకొని నిలుచున్నారు. కొంచెం సాంత్వన కలిగింది. ఇంతలో చూస్తుండగనే ఎండ వేడికి పత్తిబస్తాలు అంటుకున్నాయి. గమనించే లోపే ఆరు పత్తిబస్తాలు కాలి బూడిదయిపోయాయి. ‘‘అమ్మా! నిన్ను తలచి వ్యాపారానికి బయలుదేరాను. కానీ నువ్వు చేసిందేమిటి? నా సరుకును సర్వనాశనం చేశావు. నేను బతికేదెలా? నిన్ను ప్రార్థించడం, పూజించడం వృథా’’ అంటూ నిందించడం మొదలుపెట్టాడు వారిలోని ఓ వ్యాపారి. మిగతా వారు అతన్ని ఓదార్చారు. కాసేపయ్యాక చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యారు. అడవిదొంగ వీరి రాకను గమనించి వారివద్ద ధనం దోచుకుందామని, తుపాకీ పేల్చి భయపెట్టాలనుకున్నాడు. తుపాకీ పేలలేదు. ఎండవేడిమికి తూటాలపై పూసిన మైనం కరిగిపోవడంవల్ల, తూటాలో మందు పట్టుతగ్గడంవల్ల తూటా పేలలేదు. అతను ఒక్కడు... వీరు ఆరుగురు. లాభం లేదనుకొని దొంగ పారిపోయాడు. ఐదుగురు బతుకుజీవుడా అనుకున్నారు. అమ్మను నిందించిన వాడు మాత్రం భూమిపై పడి, భూమికి నమస్కరించి ఏడుస్తున్నాడు. ‘‘అమ్మా! నీ కరుణను తెలుసుకోలేకపోయాను. మన్నించు. నిన్ను నమ్మినవారికి నాశనమేముంటుంది? బతుకునిచ్చావమ్మా. క్షమించు’’ అంటూ చింతిస్తున్నాడు. పశ్చాత్తాపపడుతున్నాడు. అమ్మకు తెలియదా... తన బిడ్డలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో!– విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
పాస్వర్డ్ చెప్పకుండా మృతి.. 1,000 కోట్లు మటాష్!
ఒక వ్యక్తి మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టేసింది. ఏకంగా 19 కోట్ల కెనడా డాలర్ల (రూ.1,030 కోట్లు) సొమ్ము ఫ్రీజ్ అయిపోయింది. ఈ డబ్బును ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక టెక్ దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే క్రిప్టో కరెన్సీ అంటే తెలుసు కదా. కేవలం ఆన్లైన్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే డిజిటల్ కరెన్సీ. దీనిలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఈ మధ్య కాలంలో చాలామంది దానివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఆహ్వానించే ఒక కంపెనీయే కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్. సంస్థ ప్రస్తుత సీఈవో అయిన కెనడాకు చెందిన గెరాల్డ్ కాటన్ 5 ఏళ్ల కిందట నోవా స్కాటియాలో దీనిని స్థాపించారు. దీంతో ఈ కంపెనీలో ఎందరో ఇన్వెస్టర్లు తమ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో డిపాజిట్లు చేశారు. భారత్‌లోనే మరణం.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు చిక్కల్లా గతేడాది డిసెంబర్లో మొదలైంది. గత డిసెంబర్లో ఏదో పనుల నిమిత్తం కాటన్ భారత్‌కు వచ్చారు. 30 ఏళ్ల వయసున్న ఆయనకి అప్పటికే జీర్ణకోశ వ్యాధి బాగా ముదిరిపోయింది. మన దేశంలో పర్యటిస్తుండగానే ఆకస్మికంగా కాటన్ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా క్వాడ్రిగాసీఎక్స్‌లో పెట్టుబడి పెట్టినవారిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ వాలెట్ పాస్వర్డ్లు, రికవరీ కీలు కాటన్‌కు తప్ప మరెవరికీ తెలీదు. ఆయన వాటిని ఎక్కడా రాసి పెట్టి కూడా ఉంచలేదు. దీంతో కోట్లాది డాలర్లను ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక ఇన్వెస్టర్లంతా లబోదిబోమంటున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడానికి సాంకేతిక నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం శూన్యం. అతి భద్రతే కొంప ముంచింది డిజిటల్ కరెన్సీ అంటే అన్నీ ఆన్లైన్ లావాదేవీలే కాబట్టి గెరాల్డ్ కాటన్ భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. తాను వాడే ల్యాప్‌టాప్‌లు, ఈ మెయిల్, మొబైల్ ఫోన్లు, మెసేజింగ్ వ్యవస్థలన్నింటినీ ఎన్‌క్రిప్ట్ చేసేశారు. దీంతో ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడంలో ఐటీ దిగ్గజాలు కూడా చేతులెత్తేశారు. డిజిటల్ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా, ఎవరూ వాటిని హ్యాక్ చేయకుండా కాటన్ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతటి పకడ్బందీ భద్రతా చర్యల కారణంగా తాము ఆ సొమ్మును రికవరీ చేసే పరిస్థితుల్లో లేమంటూ ఆయన భార్య జెన్నిఫర్ రాబర్ట్సన్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు మాత్రం చేసేదేమీలేక న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అయితే కొందరు ఇన్వెస్టర్లేమో ఈ కంపెనీ కుట్ర పన్ని తమను మోసం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో క్వాడ్రిగాసీఎక్స్ డిపాజిట్లు ఆన్లైన్లో చేతులు మారుతున్నాయని, పాస్వర్డ్లు తెలీకుండా అదెలా జరుగుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తి మరణంతో రూ.1,000 కోట్లకు పైగా సొమ్ముకి అతీగతీ లేకపోవడం విస్మయం కలిగించే విషయమే. -
‘సీసీఐ’ ముసుగు వ్యాపారులదే లొసుగు
సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోళ్లలో వ్యాపారుల హవా నడుస్తోంది. మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నా రైతులు వ్యాపారులకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అనేకచోట్ల సీసీఐ కేంద్రాలు సరిగా పనిచేయకపోవడం, కొన్నిచోట్ల వ్యాపారులు, సీసీఐ ప్రతినిధులు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చైనా వైపు సర్కారు చూపు... ఇక పత్తి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. దేశంలో పండించే పత్తిలో దాదాపు 20 శాతం వరకు చైనానే ఏటా దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ కొన్న పత్తితో బట్టలు తయారుచేసి అమెరికాకు చైనా ఎగుమతి చేస్తోంది.ఈ ఏడాది అమెరికా–చైనాల మధ్య వ్యాపార యుద్ధం జరుగుతుండటంతో ఏమేరకు చైనా బట్టలను అమెరికా కొంటుందో అంతుబట్టడంలేదు. దీనివల్ల ఇప్పటివరకు మన పత్తిని కొనుగోలు చేసే విషయంపై చైనా ఇప్పటివరకు ఎలాంటి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. భారత్ నుంచి చైనా ఏటా దాదాపు 70 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేస్తుంది. అంటే మన రాష్ట్రంలో పండించే పత్తిలో దాదాపు రెట్టింపు దేశం నుంచి కొనుగోలు చేస్తోందన్నమాట. చైనా కొనుగోలుకు అనుమతి ఇచ్చే దానిపైనే పత్తి ధర ఆధారపడి ఉందని అంటున్నారు. వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వ్యాపారులు ధర పెంచాలా వద్దా నిర్ణయిస్తారని చెబుతున్నారు. కంది వ్యాపారుల దందా... ఇక పత్తి అమ్మకాల పరిస్థితి ఇలా ఉంటే కంది ధర మార్కెట్లో భారీగా పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 5,675 రూపాయలు ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో కేవలం నాలుగు వేల రూపాయల నుంచి రూ. 4,500 మాత్రమే పలుకుతోంది. దాదాపు 130 వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్‌ఫెడ్ భావించగా, ఇప్పటివరకు కేవలం 12 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న కందిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో అనేకచోట్ల రైతులు నష్టానికి అమ్ముకుం టున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల నుంచి విన్నపాలు వస్తున్నా పట్టించుకోవడంలేదు.మరోవైపు రూ.712 కోట్ల విలువైన 41.93 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఇంకా పలుచోట్ల మొక్కజొన్న అందుబాటులో ఉన్నా కొనుగోలు కేంద్రాలను కొనసాగించడానికి మార్క్‌ఫెడ్ ఆసక్తి చూపించడంలేదని తెలిసింది.దీంతో అక్కడక్కడా రైతులు అసంతృప్తితో ఉన్నారు. కొనుగోళ్లపై వివరణ కోరేందుకు మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కరాచారిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ప్రైవేటులోనే అధికంగా కొనుగోలు... ఈ ఏడాది పత్తికి మద్దతు ధర భారీగా పెరిగింది. పత్తి క్వింటాలుకు రూ. 5,450 పలుకుతోంది. దీంతో వ్యాపారుల్లోనూ ఆశ పెరిగింది. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు సీసీఐ వద్దే అమ్ముకునేందుకు పన్నాగం పన్నారు. వారి కుట్ర ఫలించింది. రైతుల వద్ద క్వింటాలుకు రూ. 4,500 నుంచి రూ. 5 వేల వరకు కొని, సీసీఐ వద్ద రూ. 5,450కు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశముందన్న భావనతోనూ వారు కొంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు రాష్ట్రంలో రైతుల నుంచి 44.04 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. కానీ సీసీఐ మాత్రం కేవలం 7.09 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులు పత్తి పండిస్తే ఇప్పటివరకు సీసీఐ కొన్నది 28,947 మంది రైతుల నుంచేనని అర్థమవుతోంది. ఈ ఏడాది 3.5 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. పత్తిని గులాబీ పురుగు పట్టి పీడించడం, ఇటీవల కురిసిన వర్షాలు తదితర కారణాల వల్ల అనుకున్నస్థాయిలో దిగుబడి ఉండకపోవచ్చని అంటున్నారు. -
చేతికందని చేను
సాక్షి, ఖమ్మంరూరల్: సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు.. ప్రస్తుతం తెగుళ్ల బెడద.. వెరశి పత్తి, మిర్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పండిస్తున్న పంటలకు చీడపీడలు సోకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. చేలన్నీ ఎర్రబారి.. మొక్కలు ఎండిపోయి.. ఎదుగుదల ఆగిపోయి.. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చేలా కనిపించడంలేదు. ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో మిర్చి, 1.40లక్షల హెక్టార్లలో పత్తి పంటలను ఈ ఏడాది రైతులు సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేకపోవడంతో నాటిన పత్తి గింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు కొనుగోలు చేసి నాటిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొద్దోగొప్పో ఆదాయం రాకపోదా అనే ఉద్దేశంతో వర్షాభావ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా పత్తిని అత్యధికంగా సాగు చేశారు. పూత దశలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తిని పేనుబంక, పచ్చదోమ తెగుళ్లు ఆశించాయి. సరైన మందులను పిచికారీ చేయకుంటే ఈ పురుగులు పంట చివరి దశ వరకు ఉండి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. ఈ క్రమంలో వాటి నివారణకు ఏం పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయానికి గురయ్యారు. ఈ సమయంలోనే ఆ తెగుళ్లు చేయాల్సిన నష్టాన్ని చేశాయి. దీనికి తోడు పైరు పిందె, కాయ దశల్లో తెల్లదోమ, పిండి పురుగు, నల్లి, కాయ తొలిచే పురుగులైన నల్ల మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మొదటి కాపులో దిగుబడి గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల ఇప్పటికే రెండో కాపు వచ్చినా.. తెగుళ్ల ఉధృతి పెరిగి ఈసారి దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. ఇదిలా ఉంటే.. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో ప్రస్తుతం భక్త రామదాసు నీళ్లు చేలల్లో పారుతున్నాయి. దీంతో రైతులు పత్తికి తడులు కట్టారు. అయితే పత్తి చేలు కొద్దిగా పచ్చబడ్డాయి. కానీ.. ఈ ప్రాంతంలో రెండో కాపునకు పేనుబంక, పచ్చదోమ ఉధృతి విపరీతంగా పెరిగింది. దీంతో రెండో కాపులో ఎకరానికి క్వింటా దిగుబడి కూడా వచ్చేలా లేదు. ఆ పంట అమ్మితే వచ్చే డబ్బులు కూలీలకు కూడా సరిపోవని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి జిల్లా మొత్తం ఉంది. మిర్చి రైతు దిగాలు.. జిల్లాలో మిరప తోటల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తెగుళ్ల బారినపడి మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం తోటలు పూత, కాపు దశలో ఉండగా.. వేరుకుళ్లు, ముడుత, గుబ్బరోగం, ఎండు తెగులు లాంటివి సోకడంతో మొక్కలు చనిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మిరప సాగు చేసిన తమకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లు ఆశించి పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. పదెకరాల్లో పత్తి పంట సాగు చేశా. మొదట వర్షాలు లేక మూడుసార్లు పత్తి విత్తనాలు వేశాం. మొక్కల ఎదుగుదల సమయంలో వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. తిరిగి నీళ్లు పెడితే కొంతమేర పచ్చబడింది. తర్వాత పంటను చీడపీడలు ఆశించాయి. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల చొప్పున పెట్టుబడి పెట్టా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వమే పత్తి క్వింటాకు రూ.8వేలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి. – యాట శ్రీను, రైతు, కామంచికల్, రూరల్ మండలం ఎదుగుదల ఆగిపోయింది.. నాటిన కొద్దిరోజుల వరకు మిర్చి పంట బాగానే ఉంది. నెలరోజుల క్రితం గుబ్బరోగం వచ్చింది. దీంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. వచ్చిన కొద్ది కాయలు కూడా గిడసబారి సైజు తక్కువగా ఉన్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా రోగం తగ్గడం లేదు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాణోత్ నరేష్, రైతు, రావిచెట్టుతండా, రూరల్ మండలం పసుపు రంగు అట్టలతో నివారణ మిర్చిలో గుబ్బరోగం అనేది తెల్లదోమ ఆశించడం వల్ల వస్తుంది. ఇది వచ్చిన తర్వాత పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండదు. గుబ్బరోగం నివారణకు ఎకరాకు 20 నుంచి 30 వరకు పసుపు రంగు అట్టలు పెట్టుకోవాలి. అట్టలకు జిగురు పూసి పంట చేనులో పెట్టడం వల్ల దోమలు ఆ అట్టలకు అతికి చనిపోతాయి. దీంతో గుబ్బరోగం కొంతవరకు తగ్గుతుంది. – ఝాన్సీలక్ష్మీకుమారి,జేడీఏ -
యార్డుకు కళొచ్చింది.
జైనథ్: మండలకేంద్రంలో మార్కెట్‌యార్డు ప్రా రంభమై మూడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పత్తి కొనుగోలు చేయలేదు. గడిచిన నాలుగైదేళ్ల వరకూ కనీసం సోయా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సోయాతోపాటు శనగలు, కందులు కూడా మార్కెట్లో కొనుగోలు చేస్తుండడంతో మార్కెట్‌కు ఓ కళ వచ్చింది. గతంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ అంతగా విజయవంతం కాలేదు. మండలకేంద్రంలో జిన్నింగ్‌లు లేకపోవడం, ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతో కొనుగోలు జరగలేదు. ప్రస్తుతం చిన్న, సన్నకారు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్లు.. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం(పీఏసీఎస్), మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం సన్నకారు, చిన్నకారు రైతులను ఉద్దేశించి మాత్రమే ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. చిన్న రైతులు తమ పత్తిని రోడ్ల వెంబడి ఉండే వ్యాపారుల వద్ద అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు మార్కెట్ ధర లభించడమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గడంతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇక్కడ పత్తి అమ్మేందుకు వచ్చిన రైతుల హమాలీ, దళారీ, రవాణా ఖర్చుల పేరిట ఎలాంటి అదనపు వసూళ్లు ఏవీ లేకపోవడంతో కలిసొస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ నిబంధనలు.. రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ జిరాక్స్ పత్రాలు తీసుకు రావాలి. ఒక రోజు ఒక రైతు నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. రోజువారీగా 100 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయబడుతుంది. చిన్న, సన్నకారు రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయబడును. కౌలు రైతులు సంబంధిత ఏఈవో నుంచి పంట ధ్రువీకరణపత్రం తీసుకు రావాలి. తేమ 8శాతానికి మించకుండా ఉండాలి. -
పత్తి ‘పాయే’
ఇచ్చోడ(బోథ్): తెల్ల బంగారం రైతుకు ఈసారి కూడా నిరాశ తప్పడం లేదు. కీలక దశలో భారీ వర్షాలు పడడంతో పత్తి చెట్టు ఎదగలేదు. దీంతో ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. ఈ నేపథ్యంలో గతేడాది కష్టాలే ఇప్పుడు కూడా పునరావృతమయ్యాయి. చేనంత చూస్తే ఎక్కడా పత్తి బుగ్గ కనిపిస్తుండకపోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఒకేసారి పత్తి ఏరడంతోనే చేను మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. చెట్టుకు ఒక్క కాయ కూడా కానరాకపోవడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి పత్తి క్వింటాల్ ధర రూ.5450 ఉంది. అయినా దిగుబడి లేనిది ఏం లాభం అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 3.5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 5 లక్షలు కాగా ఇందులో పత్తిదే అధిక భాగం. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడంతో గత ఐదు, ఆరు సంవత్సరాల నుంచి జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోంది. ఈసారైనా ఆశించిన స్థాయిలో లాభం రాకపోతుందా అని పత్తి సాగు చేసిన రైతన్నకు ప్రతిసారి నష్టాలే ఎదురవుతున్నాయి. అయినా పత్తి పంటనే.. జిల్లాలో సాగులో ఉన్న భూముల్లో 80 శాతానికి నీటి సౌకర్యం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోయాబీన్, ఇతర ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. పప్పు దినుసుల సాగు చేపట్టాలని ప్రభుత్వం 2016– 17 సీజన్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఆ ఏడాది పత్తి సాగు కాస్త తగ్గింది. 2.70లక్షల ఎకరాలకే పరిమితమైంది. కంది, పెసర సాగు కూడా కొంత పెరిగింది. అయితే పప్పు దినుసుల ధరలు కూడా అమాంతం తగ్గాయి. 2015– 16లో క్వింటాల్ కందులకు రూ.9వేలు పలికింది. కాని ఆ తర్వాత ఏడాది ధర ఏకంగా రూ.5వేలకు పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంచెం అటు, ఇటుగా పత్తి ధరలు ఉంటుండడంతో రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నా రైతులు లాభాల బాట పట్టడం లేదు. గతేడాది ఓ మోస్తారులో పత్తి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేదు. ఈసారి గిట్టుబాటు ధర ఉన్నా దిగుబడి లేదు. ఈ పరిస్థితులకు తోడు ప్రతి ఏటా కీలక దశలో వర్షాలు పడి పంట ఎదగకపోవడం, గులాబీ రంగు పురుగు సోకడం వంటి వాటితో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సగానికి పడిపోయిన దిగుబడులు.. ఈఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడి అమాంతం పడిపోయింది. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో పూత, కాత లేకుండా పోయింది. అనంతరం వర్షాలు కానరాకుండా పోయాయి. ఈ ప్రభావంతో చెట్టు ఎదుగుదల లోపించింది. రెండు, మూడు సార్లు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు తల పట్టుకుంటున్నారు. పరిస్థితి తారుమారు.. పత్తి ధర విషయంలో ప్రతిఏడాది పరిస్థితి తారుమారు అవుతోంది. దిగుబడులు ఉన్న సమయంలో మద్ధతు ధర ఉండడం లేదు. మద్ధతు ధర ఉన్న సమయంలో దిగుబడి ఉండడం లేదు. గతేడాది ఓ మోస్తారులో దిగుబడులు ఉన్నాయి. అయినా క్వింటాల్ ధర రూ.4320లు మాత్రమే పలికింది. ఈసారి దిగుబడి పూర్తిగా తగ్గింది. కాని మద్ధతు ధర మాత్రం రూ.5450 పలుకుతోంది. ఈ పరిస్థితులు అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈసారి ధర ఉండడంతో ఇలాగే ఉంటుందని భావించి వచ్చే ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కాని మద్ధతు ధర పెరుగుతుందో, తగ్గుతుందో తెలియదు. మొత్తంగా ఈఏడాది పత్తి రైతుకు నష్టాలు తప్పడం లేదు. దిగుబడి అమాంతం తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని వాపోతున్నారు. -
కొను‘గోల’!
సాక్షి, కొడంగల్: నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మోసపోతున్నారు. దళారులకు పత్తి విక్రయించి ధరలోనూ, తూకంలోనూ నష్టాలపాలవుతున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. వికారాబాద్ జిల్లా మారిన తర్వాత కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఇక్కడి రైతులు ఆశించారు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది వికారాబాద్, పరిగి, తాండూరు పట్టణాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొడంగల్‌ను మాత్రం విస్మరించారు. రైతులకు సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆరుగాలం కష్టించి పండిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గంలోని నల్లరేగడి భూముల్లో పత్తి మంచి దిగుబడి వస్తుంది. ఇప్పటికే రైతులు పత్తిని ఏరుతున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో దిగుబడి అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ అధికారులు ఈ ప్రాంతంలో కంది, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రూ.3 కోట్ల వ్యయంతో గోదాం నిర్మించారు. ఈ గోదాంలో 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రభుత్వం ఈ గోదాములో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. సెంటర్ ఏర్పాటుచేయాలి మార్కెటింగ్ అధికారులు కొడంగల్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చే యాలి. ప్రభుత్వం పత్తిని కొంటే రైతులకు మేలవుతుంది. ధరలోనూ, తూకంలోనూ మోసం జరగదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కొడంగల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. – బస్వరాజ్, పీఏసీఎస్ చైర్మన్, కొడంగల్ -
పత్తి.. సూటి రకాలే మేటి!
ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట పత్తి. గత ఐదారేళ్లుగా పత్తి పంటలో దిగుబడి తగ్గిపోతున్నది. తెగుళ్లు, గులాబీ రంగు పురుగు దాడి కారణంగా ఏటికేడు దిగుబడి పడిపోతోంది. బీటీ రకాలు తెల్లబోతున్నాయి. ఇక బీటీ మాయలో పడిన రైతులు పాత రకాలను సాగు చేయడమే మరచిపోయారు. సరైన విత్తనం ఎంపిక చేసుకొని మెలకువలు పాటిస్తే నాన్ బీటీ హైబ్రిడ్ రకాలు తీసిపోవని చాటుతోంది ‘రైతు రక్షణ వేదిక’. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ వేణుగోపాల్, రైతు శాస్త్రవేత్త జొన్నలగడ్డ రామారావు, రైతు నేత డాక్టర్ కొల్లా రాజమోహనరావు, రైతు సంఘాల నేతలు, కొందరు అభ్యుదయ రైతులు కలిసి గుంటూరు కేంద్రంగా రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా సూటి రకాల ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ పాత రకాల ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. బిటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సూటి రకాలను ప్రోత్సహిస్తున్నారు. ‘రైతు రక్షణ వేదిక నిర్వహిస్తున్న ప్రదర్శన క్షేత్రాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎన్. దామోదర నాయుడు ఇటీవల సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సూటి రకం విత్తనాలతో ఖర్చు తగ్గుతోందని, ఇతర పంటల రైతులతో పాటు పత్తి రైతులు కూడా తమ విత్తనాలను తామే తయారు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. పత్తిలో సమగ్ర సస్య పోషణ, రక్షణల ద్వారా కాయతొలిచే పురుగులతో పాటు అత్యంత బెడదగా మారిన పచ్చదోమ, తెల్లదోమల బెడద కూడా లేకుండా పోయింది. రైతులు పండించిన పత్తిలో నుంచే సేకరించిన విత్తనాలతోనే ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని కూడా ఇతర పంటల మాదిరిగానే సాగు చేయటంలో గుంటూరుకు చెందిన రైతు రక్షణ వేదిక విజయం సాధించింది. అనేక ఏళ్ల నుంచి ఈ దిశగా కృషి చేస్తున్న వేదిక సభ్యులైన రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు, రైతు సంఘాల కార్యకర్తలు ఈ ఖరీఫ్‌లో మరింత విస్తృతంగా నాన్ బీటీ సూటి రకం పత్తి సాగును చేపట్టడం విశేషం. సూటి రకం పత్తి విత్తనాలతో రైతుకు ఖర్చు తక్కువ, నాణ్యమైన దిగుబడి, వివిధ పురుగులను నిరోధించే అవకాశం ఉంది. 15 చోట్ల రైతుల ప్రదర్శనా క్షేత్రాలు 2018–19 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 15 ప్రదేశాల్లో సూటి రకం నాన్ బీటీ పత్తి పంటను సాగు చేస్తూ నమూనా (ప్రదర్శనా) క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన విత్తనాలనే వినియోగించి సఫలీకృతులయ్యారు. రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ డా. దామోదర నాయుడు, లాం ఫాం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎన్వీ నాయుడు, లాంఫాం శాస్త్రవేత్త డా. దుర్గాప్రసాద్ చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలోని తియ్యగూర శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల ప్రదర్శనా క్షేత్రాలను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులను అభినందించారు. సూటి రకం పత్తితో 30% తగ్గిన ఖర్చు రైతులు బీటీ విత్తనాలకు బదులుగా సూటి విత్తనాలు (నాన్ బీటీ) సాగు చేస్తే 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఆశించిన దిగుబడి లభిస్తుంది. రైతులు సూటీ పత్తిని సాగు చేయటంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతు రక్షణ వేదిక నేతలు తెలిపారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, కొర్నెపాడు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేట, ఫిరంగిపురం, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని 650 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రైతులు నంద్యాల నుంచి ఎన్‌డీఎల్‌హెచ్–1938, రైతు రక్షణ–02 నాన్‌బీటీ సూటి రకాల పత్తిని సాగు చేస్తున్నారు. లాంఫాం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్ సెంటర్లకు చెందిన శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు అందిస్తారన్నారు. సూటి రకాల సేంద్రియ సాగు ఇలా.. దుక్కిలో పశువుల ఎరువుతో కలిపిన వామ్(జీవన ఎరువు) ఎకరానికి ఐదు కేజీలు వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి వేప పిండి రెండు క్వింటాళ్ళు వేయాలి. నాన్ బీటీ సూటి రకం పత్తి విత్తనాలు విత్తుకోవాలి. నాన్‌బీటీ విత్తనాలు సాగులో ఉన్న పొలం చుట్టూ జొన్న, కొర్ర, ఆముదం మొక్కలు రెండు – మూడు సాళ్ళు(వరుసలు) రక్షక పంటగా వేయాలి. పత్తి మొక్క దశలో రెండు విడతలు వేపనూనె, మోనోక్రోటోఫాస్, మిథైల్ ఆల్కాహాల్ కలిపిన ద్రావణాన్ని కాండానికి కుంచెతో పూయాలి. వేప కషాయాన్ని మరగబెట్టగా వచ్చిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే జల్లెడ పురుగు, తెల్లదోమ గూడ పురుగులను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. సూటి పత్తిలో కొర్ర, అలసంద, మినుము తదితర అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. నీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు నెలకు ఒక విడత చొప్పున ఆరుతడులు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా చేస్తే పత్తి దిగుబడులు హైబ్రిడ్ పత్తికి దీటుగానే వస్తాయని రైతు రక్షణ వేదిక రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఈ సూటి రకాల పత్తి పింజ పొడవు, నాణ్యత బాగానే ఉంటుంది. అధిక శాతం రైతులు ఈ పత్తిని సాగు చేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వారు అంటున్నారు. దిగుబడుల్లో రాజీ పడకుండానే కంపెనీల విత్తనాలను పక్కన పెట్టి సొంత సూటి రకం పత్తి విత్తనం వాడుకునే సత్సాంప్రదాయానికి బాటలు వేస్తున్న రైతు రక్షణ వేదిక సభ్యులైన రైతులు అభినందనీయులు. వర్షం తక్కువైనా ఏపుగా పెరిగింది! నంద్యాల నుంచి తీసుకు వచ్చిన సాధారణ విత్తనాలతో 2.50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాం. పత్తి పొలం చుట్టూ ఇతర పురుగులు రాకుండా జొన్న విత్తనాలు నాటాం. గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ తదితర క్రిమి కీటకాలు రాలేదు. వర్షం తక్కువగా పడినా పంట ఏపుగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పూత ఉంది. బీటీ తరహాలోనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. శాస్త్రవేత్తలు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. --తియ్యగూర వెంకటేశ్వరరెడ్డి (97044 97442), రైతు, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట రూరల్ రసాయనాల్లేని సాగులో బీటీకి మించిన దిగుబడి రైతులు పండించిన పత్తి పంట ద్వారా వచ్చిన విత్తనాలనే వినియోగించి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. పంట ఆశాజనకంగా ఉంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించలేదు. అయినా, పంట ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది. బీటీకి మించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా క్షేత్రోత్సవాలను నిర్వహించి ప్రచారం కల్పిస్తాం. ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు చేయూతనందిస్తాం. – డాక్టర్ కొల్లా రాజమోహనరావు (90006 57799), సమన్వయకర్త, రైతు రక్షణ వేదిక, గుంటూరు సూటి రకాలు గులాబీ పురుగునూ తట్టుకున్నాయి! పక్కపక్కన పొలాల్లో సాగు చేసిన సూటి రకం, బీటీ రకం పత్తి పంటల్లో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కంపెనీ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు ప్రత్యామ్నాయంగా సూటి రకం నాన్ బీటీ విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల–1938 రకం, రైతు రక్షణ–02 అనే నాన్ బీటీ సూటి రకాల విత్తనాలు రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగుల బెడదను తట్టుకున్నాయి. దీంతో పాటు రైతు రక్షణ వేదిక ద్వారా తయారైన హైబ్రిడ్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. రైతు రక్షణ వేదిక ద్వారా తయారుచేసే హైబ్రిడ్ ప్రత్యామ్నాయ రకం వెరైటీని ప్రోత్సహిస్తే రైతుకు స్వావలంబన కలుగుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు ఎక్కువై నష్టం జరుగతోంది. జీవన ఎరువులు, పశువుల ఎరువును వాడుకుంటే రసాయన ఎరువులను ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. – ప్రొఫెసర్ వేణుగోపాల రావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు రక్షణ వేదిక మానుకొండవారిపాలెంలో పూత దశకు చేరుకున్న సూటిరకం పత్తి పొలం – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు : లీలానంద్, చిలకలూరిపేట రూరల్ -
తెల్ల బంగారమే!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పత్తికి ఆశాజనకమైన మద్దతు ధర లభిస్తుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450గా ఉందని..మార్కెట్లో వ్యాపారులు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చి.. రూ.5,550కి మించి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన అవసరం రైతులకు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దిగుబడులు తగ్గుతుండటంతోనే.. పత్తికి డిమాండ్ పెరిగిందని.. అందుకే మంచి ధర వస్తుందని వెల్లడించారు. ‘ఈసారి పత్తికి కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా.. మంచి ధర వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల దళారులు మాయమాటలు చెప్పినా.. రైతులు పత్తిని ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. తేమ శాతం సరిగా చూసుకుని అమ్ముకుంటే ఎక్కడా నష్టాలు రావు’అని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ‘ఒకవేళ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రండి’అని రైతులకు హరీశ్ పేర్కొన్నారు. గతేడాది ఎమ్మెస్పీ రూ. 4,320 ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దీన్ని రూ.5,450 పెంచడంతో రైతులకు మేలు జరుగుతుందని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే లక్ష క్వింటాళ్లు.. ఈ ఏడాది తెలంగాణలో 35.92 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల ప్రకారం అంతకన్నా తక్కువ దిగుబడి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 30 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆశించకూడదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొందని వారు వెల్లడించారు. దిగుబడి తగ్గనున్నందునే.. మంచి ధర వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పత్తి తీతలు మొదలయ్యాయి. ముందస్తుగా పంటలు వేసినచోట్ల మొదటి తీత పూర్తయిన రైతులు పత్తిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష క్వింటాళ్ల వరకు పత్తి మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా గతేడాది 241 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 342 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో జిన్నింగ్ మిల్లుల ద్వారా 275, మార్కెటింగ్‌శాఖ ద్వారా 67 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు 7 కేంద్రాలను ప్రారంభించారు. -
గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం!
పత్తి, మొక్కజొన్న పంటల్లో గులాబీ/ కత్తెర పురుగులకు ముష్టి ద్రావణంతో చెక్. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంటకు ఇప్పుడు అంతో ఇంతో ఆశించిన మద్దతు ధరలు ఉండటంతో రైతులు ఈ ఏడాది బోరుబావుల కింద, నదీ తీరా ప్రాంతాల్లో అధికంగా సాగు చేశారు. అయితే ఈ పంటను మూడు నాలుగేళ్లుగా గులాబీ రంగు పురుగు నాశనం చేస్తోంది. పంట పూత దశలో ఈ పురుగు ఆశించి పూత, పిందెలను తినేసి ఏ మాత్రం దిగుబడి రాకుండా చేస్తోంది. ఈ పంటను రక్షించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు రకరకాల మందులు పిచికారీ చేసినా ఆయా పురుగులు, తెగుళ్లు అదుపులోకి రాక పంటలను వదిలేయడం లేదా దున్నేయడం రైతుకు ఆనవాయితీగా మారింది. పత్తి, మొక్కజొన్న రైతులను కష్టనష్టాల నుంచి గట్టెక్కించే ‘ముష్టి ద్రావణా’న్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, సేంద్రియ వ్యవసాయ నిపుణుడు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు సూచిస్తున్నారు. పొలాల గట్లపైన, బంజరు భూముల్లో లభించే కొన్ని మొక్కలను, కాయలు, పండ్లు తీసుకుని పలు రకాల ద్రావణాలను తయారు చేసి, పంటలపై పిచికారీ చేయించి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. ఈ కోవలోనే పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు(కత్తెర పురుగు) నివారణకు ‘ముష్టి ద్రావణం’ తయారు చేసి మంచి ఫలితాలు సాధించారు. ముష్టి పండ్లను అత్యధిక మోతాదులో వాడి దీన్ని తయారు చేస్తున్నందున దీన్ని ముష్టి ద్రావణం అని పిలుస్తున్నారు. ఆ ద్రావణం తయారీ, వినియోగం, పనితీరు విజయకుమార్ మాటల్లో తెలుసుకుందాం.. పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ఆశించే కత్తెర పురుగుల నివారణకు ముష్టికాయలు, వెర్రి పుచ్చ, జముడు, నల్లేరు, సునాముఖి ఆకులు.. ఇవి పొలాల గట్ల మీద ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ముష్టి పండ్లు : గుట్టలు, కొండలపై ముష్టి చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్ల పండ్లు జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకూ దొరుకుతాయి. బాగా మాగి పక్వానికి వచ్చిన ముష్టి కాయలు తీసుకుంటేనే రసం, గుజ్జు బాగా వస్తుంది. ఈ పండ్లు 10 కిలోలు తీసుకుని ప్లాస్టిక్ సంచిలో వేసి చితగ్గొట్టి ఒక పాత్రలో ఉంచుకోవాలి. వెర్రి పుచ్చకాయలు: చెరువులు, నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద వెర్రిపుచ్చ కాయలు లభిస్తాయి. ఈ కాయలు పండుబారినవి 5 కిలోలు తీసుకుని బాగా దంచి నిల్వ చేయాలి. జముడు : జముడు చెట్టు అన్నీ ముళ్లతో కొమ్ములు కలిగి ఉంటుంది. ఈ కొమ్ములు రెండున్నర కిలోలు తీసుకొని ఆ కొమ్ములను కొడవలితో చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి. నల్లేరు: నీటి పారుదల సదుపాయం ఉండే ఉద్యాన తోటల గట్లపైన, గుట్టల్లో, పొలాల వద్ద నల్లేరు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. నల్లేరు కనుపులను రెండున్నర కిలోలు తీసుకొని ప్లాస్టిక్ సంచిలో వేసి దంచాలి. సునాముఖి : ఈ మొక్కలు రోడ్ల వెంట ఉంటాయి. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. సునాముఖి ఆకులను, పూలను రెండున్నర కిలోలు తీసుకొని గ్రైండర్లో గానీ, రోలులో గానీ వేసి రుబ్బి నిల్వ చేసుకోవాలి. ద్రావణం తయారీ విధానం: 200 లీటర్ల డ్రమ్మును తీసుకుని ఆ డ్రమ్ములో దంచి ఉంచుకున్న ఆయా పదార్థాలు పోయాలి. ఇలా పోసిన వాటిని 12 రోజుల పాటు మురగబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకే కర్రతోనే కలియబెట్టాలి. ద్రావణం డ్రమ్మును నీడలోనే ఉంచి, గోనె సంచిని కప్పి ఉంచాలి. పత్తి చేలలో పిచికారీ విధానం పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నిర్మూలన కోసం పత్తి మొక్కలకు మొగ్గలు రాక ముందు రెండుసార్లు, మొగ్గ దశలో రెండుసార్లు, పూత నుంచి కాయలు తయారయ్యే సమయంలో ఒకసారి చెట్టు అంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి. మొదటిసారి పిచికారీకి ద్రావణం లీటరు తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకోవాలి. రెండోసారి.. 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, మూడోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, నాలుగోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం కలుపుకొని పిచికారీ చేస్తే పురుగు నిర్మూలన జరగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. మొక్కజొన్నకు నాలుగైదు సార్లు.. మొక్కజొన్న పంట విత్తిన 15 రోజుల పంట నుంచి మొదళ్లు బాగా తడిచేలా.. నాలుగైదు సార్లు పిచికారీ చేస్తే కత్తెర పురుగు(మక్క లద్దె పురుగు) రానే రాదు. కర్ర చేదెక్కుతుంది కాబట్టి గుడ్లు పెట్టే పరిస్థితే ఉండదు. వరిలోనూ.. వరిలో కాండం తొలిచే పురుగుతోపాటు అగ్గి, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం పారదోలుతుంది. తీగజాతి, కూరగాయ, పండ్ల తోటలను పట్టి పీడించే పండుఈగ (బంగారు ఈగ)ను కూడా ఈ ముష్టి ద్రావణం మట్టుబెడుతుంది. రసం పీల్చే పురుగులను, రెక్కల పురుగులను, తెలుపు, పసుపు పచ్చ పురుగులను ఈ ద్రావణంతో నివారించవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. మత్తు వచ్చి.. విరేచనాలై.. ముష్టి ద్రావణం పిచికారీతో పంటలపై పురుగులకు మత్తు రావటంతోపాటు విరేచనాలు అవుతాయని, బలహీనమైన పురుగులు మొక్క మీద నుంచి నేల రాలుతుందని, నేల రాలిన పురుగులను చీమలు తినేస్తాయని.. ఈ విధంగా విష రసాయనాలను వాడకుండానే పురుగులను ముష్టి ద్రావణంతో నివారించుకోవచ్చని, నిర్మూలించుకోవచ్చని విజయకుమార్ వివరించారు. పూత దశలో పవర్ స్ప్రేయర్లు వాడొద్దు ద్రావణాలను ఎండ వేళల్లో పిచికారీ చేయొద్దని చెబుతూ.. ఉదయం 5 గం. నుంచి 8 గం.లోగానే పిచికారీని పూర్తి చేయాలని విజయకుమార్(98496 48498) అన్నారు. పూత దశలో ద్రావణాలు పిచికారీ చేయకుండా ఉంటే పూత రాలకుండా ఉంటుందని రైతులు ముఖ్యంగా గమనించాలన్నారు. పూత దశలోనూ పిచికారీ అవసరమైతే.. పవర్ స్ప్రేయర్ల ద్వారా కాకుండా సాధారణ స్ప్రేయర్లను వినియోగించి నెమ్మదిగా పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా ఉంటుందన్నారు. రైతులు గత ఏడాది నుంచి దోమ నివారణకు వివిధ పంటలపై వాడుతున్న ‘బమావె’ ద్రావణం వంటి ఏ ఇతర ద్రావణాలతోనైనా ముష్టి ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేయవచ్చునని ఆయన తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి (అగ్రికల్చర్), వైఎస్సార్ జిల్లా -
పత్తి కొనుగోలుకు 386 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి 386 కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు భారత పత్తి సంస్థ (సీసీఐ)ను ఆదేశించారు. అందులో 98 మార్కెట్ యార్డుల్లో, 288 కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయాలన్నారు. 25 ముఖ్య మార్కెట్ యార్డు కేంద్రాల్లో వచ్చే నెల 10లోగా, మిగిలిన కేంద్రాలను 20వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం మార్కెటింగ్, వ్యవసాయశాఖలు, మార్క్‌ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుముల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెండర్లలో పాల్గొన్న 288 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసేలా జిల్లా కలెక్టర్లు, సీసీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనకపోవడంపై హరీశ్ అధికారులను ప్రశ్నించారు. ఆ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని సీసీఐ సీఎండీని ఫోన్లో కోరారు. అలాగే సీసీఐ సంచాలకులు అల్లిరాణితో ఫోన్లో చర్చించి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత శాతం తేమ ఉండేలా చూసుకోండి... రైతులు పత్తిని మార్కెట్ యార్డులకు తెచ్చేటప్పుడు శుభ్రపరిచి, ఆరబెట్టి తేమ 8% నుంచి 12% మా త్రమే ఉండేటట్లు చూసుకొని తెస్తే సరైన ధర వస్తుం దని దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను హరీశ్ ఆదేశించారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.5,450గా కేంద్రం నిర్ణయించిందని, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా పత్తిని తెచ్చి ఆ మేరకు లబ్ధి పొందాలని రైతులను కోరారు. మొక్కజొన్నల కొనుగోలుకు 259 కేంద్రాలను తెరవాలని మార్క్‌ఫెడ్ ఎం డీని కోరారు. పెసర కొనుగోలుకు 9 కేంద్రాలను ప్రా రంభించాల్సిందిగా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కందులు, మినుములు, వేరుశనగ మద్దతు ధర కొనుగోలుకు ముందస్తు అనుమతి తీçసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకాల ఎండీ సురేందర్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, మార్క్‌ఫెడ్ పంట ఉత్పత్తుల సేకరణ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
19న కొర్నెపాడులో పత్తి, మిరప సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడు రైతు శిక్షణా శిబిరంలో ఈనెల 19(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతులకు నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్య శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. పత్తిలో గులాబీరంగు పురుగు నివారణ మార్గాలపై విజయవాడకు చెందిన రహమతుల్లా అవగాహన కల్పిస్తారన్నారు. లింగాకర్షక బుట్టల పాత్ర.. కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 83675 35439, 0863–2286255. -
పావు శాతం బీజీ–3 విషం!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఇటీవలి అంచనా ప్రకారం రాష్ట్రంలో 15 శాతం విస్తీర్ణంలో నిషేధిత బీజీ–3 పత్తి సాగైంది. తాజాగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ లేబొరేటరీ జరిపిన పరీక్షల్లో 25 శాతం బీజీ–3 పత్తి పంట ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా ప్రకారమే ఈ స్థాయిలో అనుమతిలేని బీజీ–3 పత్తి సాగైనట్లు తేలడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత పత్తి విత్తనంపై ఉక్కుపాదం మోపుతామని బీరాలు పలికిన వ్యవసాయ యంత్రాంగం కనీసం తుప్పును కూడా వదిలించలేకపోయింది. విత్తన కంపెనీలు రైతులకు బీజీ–3ని అంటగడుతుంటే, ‘సొరకాయ కోతల’కే అధికారులు పరిమితమయ్యారంటున్నారు. ఇప్పటివరకు 36 లక్షల ఎకరాలకు మించి పత్తి సాగైతే, దాదాపు 8 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి విత్తనం వేసినట్లు అంచనా. గ్లైపోసేట్‌ను నిషేధించడంతో ఇప్పుడు వేసిన బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఏ మందు వేయాలో రైతులకు తెలియక కలవరపడుతున్నారు. ల్యాబ్‌పై దుష్ప్రచారం వ్యవసాయ శాఖ దాని అనుబంధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు పనిగట్టుకొని విత్తన కంపెనీలకు వంతపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మొదట్లో బీజీ–2 విత్తనంలో బీజీ–3 విత్తనాలను ఐదు శాతం కలిపేందుకు కేంద్రానికి విన్నవించేలా ప్రయత్నించారు. ఆ పాచిక పారలేదు. చివరకు బీజీ–3 విత్తనాలను అంటగట్టే కంపెనీలకు అనుగుణంగా కుట్ర చేసినట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ‘మలక్‌పేటలోని డీఎన్ఏ లేబొరేటరీకి బీజీ–3ని నిర్ధారించే సామర్థ్యం అంతగా లేదు’అని నమ్మించేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన సమావేశానికి తయా రు చేసిన నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ‘హైదరాబాద్ మలక్‌పేట డీఎన్ఏ లేబరేటరీకి బీజీ–3ని నిర్ధారించే పటిష్టమైన అత్యాధునిక వసతులున్నాయి’అని కేంద్రం ఇచ్చిన ప్రశంసాపూర్వకమైన లేఖను వ్యవసాయ శాఖ వర్గాలు బయటపెట్టాయి. అంటే కావాలనే డీఎన్ఏ లేబొరేటరీపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజీ–3 నిర్ధారణ పరీక్షలను సవాల్ చేసేలా విత్తన కంపెనీలను పురికొల్పడమే ఇందులో ప్రధాన కుట్ర అని వ్యవసాయ శాఖలోని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. రహస్య భేటీ బీజీ–3ని సరఫరా చేసిన కంపెనీలు ఇటీవల హైదరాబాద్‌లో ఒక రహస్య భేటీ నిర్వహించాయి. కొందరు వ్యవసాయ అనుబంధ అధికారులు ఆ రహస్య భేటీకి హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీలను గట్టెక్కించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. ఇలా వ్యవసాయ శాఖ, దాని అనుబంధ విభాగాలకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కొందరు రైతులకు మద్దతు తెలుపుతుంటే, కొందరు కంపెనీలకు బాసటగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. డీఎన్ఏ లేబొరేటరీ పరీక్షలపై చర్చ హైదరాబాద్ మలక్‌పేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ లేబొరేటరీకి ఈ ఏడాది 200 పత్తి నమూనాలను పరీక్షలకు పంపారు. వాటిని పరీక్షించగా అందులో 50 నమూనాలు బీజీ–3గా నిర్ధారించారు. అవన్నీ కూడా ప్రముఖ విత్తన కంపెనీలవే కావడం గమనార్హం. ఆయా కంపెనీలన్నీ రాష్ట్రంలో బీజీ–2 విత్తనాన్ని సరఫరా చేయడానికి అనుమతి పొందినవే. కానీ అవే నిషేధిత బీజీ–3ని కూడా రైతులకు సరఫరా చేశాయి. వాస్తవంగా బీజీ–3 నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేసింది. మొదట్లో బీజీ–2లో బీజీ–3 విత్తనాలను ఐదు శాతం కలుపుకునేందుకు అవకాశం కల్పించాలన్న కంపెనీలకు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖలో కొందరు ప్రయత్నాలు చేశారు. కానీ వ్యవహారం బయటపడటంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత బీజీ–3పై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విన్నవించారు. బీజీ–3ని నియంత్రించాలంటే దానికి వాడే గ్లైపోసేట్ పురుగు మందును ముందు నిషేధించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ కీలకమైన పత్తి సాగు ప్రారంభ సమయంలో నిషేధించకుండా, దాదాపు 70 శాతం సాగయ్యాక ఆలస్యంగా నిషేధమో, నియంత్రణో అర్థంగాకుండా ఆదేశాలిచ్చారు. దీం తో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు బాగుపడింది బీజీ–3ని రైతులకు అంటగట్టిన కంపెనీలే. -
పంటల బీమాకు కంపెనీల తూట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులను పంటల బీమా పరిధిలోకి తీసుకురావడంలో బీమా కంపెనీలు విఫలం అవుతున్నాయి. ఇప్పటివరకు 50 లక్షల ఎకరాలకు పైనే ఖరీఫ్ పంటలు సాగైతే కనీసం ఐదు లక్షల ఎకరాల రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద పత్తి పంట వస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైగా ఇదే సాగవుతోంది. ఇప్పటికే 37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అటువంటి పత్తికి పంటల బీమా ప్రీమియం గడువు ఈ నెల 15తో ముగిసింది. కానీ పత్తి బీమా ప్రీమియం చెల్లించని రైతులు లక్షలాది మంది ఉన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా రైతులు పత్తి సాగు చేస్తే, లక్షన్నర మందిని కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలున్నాయి. అన్ని పంటలకు కలిపి ఇప్పటివరకు కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. పైగా ఈ నెలలో వరుసగా 14, 15వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ విషయంలో ముందే మేల్కొనాల్సిన వ్యవసాయశాఖ గడువు ముగిసిన తరువాత బీమా కంపెనీలకు రెండు రోజులు పెంచాలని కోరింది. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ, జాతీయ వ్యవసాయ బీమా కంపెనీలు ఈ నెల 17 వరకు పెంచేందుకు అంగీకరించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ రాసిన లేఖకు ఏఐసీ సుముఖత వ్యక్తం చేసినా మిగతా రెండు కంపెనీలు గడువు పెంచేందుకు ససేమిరా అన్నాయి. ఇలా బీమా కంపెనీలు రైతుతో ఆడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాంకుల సహకారం సున్నా... మన రాష్ట్రంలో మొత్తం ఆరు క్లస్టర్లుగా పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇందులో ఈ వానాకాలం బీమాను రెండు క్లస్టర్లను వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) అమలు చేస్తుండగా, ఎన్ఐసీ మూడు, టాటా ఒక క్లస్టర్లో అమలు చేస్తున్నాయి. ఏఐసీ పత్తికి రెండ్రోజుల పొడిగింపునకు అంగీకరించినప్పటికీ ఆ పరిధిలోని రైతులకు తెలియజేయడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది. ఫలితంగా ఆ క్లస్టర్ పరిధిలో 10 జిల్లాల్లోని రైతులు నష్టపోయారుఇటు బ్యాంకులపై ఒత్తిడి పెంచి రుణాలు ఇప్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించగా, రుణం తీసుకోని రైతులను ప్రీమియం కట్టేలా అవగాహన కూడా కల్పించలేకపోయారు. వాస్తవంగా ఖరీఫ్‌లో పంట రుణాలు రూ.25 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.6 వేల కోట్లలోపే ఇచ్చాయి. వాస్తవంగా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు సగంపైనే సాగైతే, రుణాలు మాత్రం నాలుగో వంతు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో బ్యాంకు రుణాల ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా జూన్‌లోపే రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు రైతులను సతాయిస్తున్నాయి. అటు బీమా కంపెనీలు, ఇటు బ్యాంకులు రైతులను బీమా పరిధిలోకి తీసుకు రానీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. 50 శాతం బీమా లక్ష్యానికి సమస్యలు.. మన రాష్ట్రంలో సాగయ్యే భూమిలో బీమా పరిధిలోకి వచ్చే భూమి కేవలం 20 శాతం వరకే ఉంటుంది. ఒక్కోసారి అది 15 శాతానికే పరిమితమవుతోంది. అయితే కేంద్రం ఈ ఏడాది బీమా పరిధిలోకి 50 శాతం భూమిని తీసుకురావాలన్న నిబంధన పెట్టింది. కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మన రాష్ట్రంలో 2016లో వానాకాలం, యాసంగిలతో కలిపి 1.39 కోట్ల ఎకరాలు సాగు కాగా, కేవలం 20.95 లక్షలు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. అంటే సాగులో 15 శాతమే. అలాగే 2017లో వానాకాలం, యాసంగిలతో కలిపి మొత్తం 1.41 కోట్ల ఎకరాలలో సాగు కాగా 30 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చింది. అంటే 21 శాతం. ఈసారి అంత మొత్తంలో రావడం కష్టమేనని అధికారులే పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ ఏడాది 50 శాతమైనా బీమా పరిధిలోకి తీసుకు రావాలన్న లక్ష్యం నీరుగారే ప్రమాదముంది. పరిహారం చెల్లింపుల్లో నిబంధనలు పక్కాగా పాటించని బీమా కంపెనీలు, గడువు తేదీల విషయంలో మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే పత్తి పంటకు గులాబీ పురుగు సోకితే పరిహారం రావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. -
చే'నేత'
మల్కా దారాల అల్లిక, చేనేత మగ్గాల విప్లవం. ఈ విప్లవానికి నాంది పలికింది ఉజ్రమ్మ. పత్తి రైతు, స్పిన్నింగ్ మిల్లు, చేనేతకారుడు... పరస్పర ఆధారితమై మనుగడ సాగించాలి. ఎవరూ ఎవరి మీదా పెత్తనం చేయరాదు... ఎవరూ ఎవరి ముందూ చేతులు కట్టుకోరాదు. నేతకారులను సంఘటితం చేస్తోందీ ఉక్కుమహిళ చేనేతను ప్రగతిబాట పట్టిస్తోందీ నేత. మీరు హైదరాబాదీనా? నార్త్ ఇండియనా? పుట్టింది హైదరాబాద్‌లోనే. పెరిగింది నార్త్‌లో. నాన్న రైల్వే ఆఫీసర్ కావడంతో నార్త్‌లో చాలా నగరాల్లో పెరిగాను. స్కూలు, కాలేజ్ కూడా నార్త్‌లోనే. మీరేం చదివారు? ఇంగ్లిష్ లిటరేచర్ మీ తరంలో అమ్మాయిల చదువుకి పెద్ద ఆంక్షలే ఉండేవేమో! ముఖ్యంగా ఇస్లాం సంప్రదాయ కుటుంబాల్లో...! మాది అభ్యుదయ కుటుంబం, మా నానమ్మ ఆ రోజుల్లోనే బురఖాకు వ్యతిరేకంగా పోరాడింది. అలాంటి నేపథ్యంలో ఆడపిల్లల చదువు మీద ఆంక్షలు ఎందుకుంటాయి? మీ చదువుకీ, మీరు చేస్తున్న సామాజిక ఉద్యమానికి సంబంధమే కనిపించడం లేదు? మా చిన్నాన్న సజ్జద్ జహీర్ ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. పర్సన్‌గా నా వికాసంలో చిన్నాన్నదే మెయిన్ రోల్. ఆయన నాకు రోల్‌మోడల్ కూడా. ఇంగ్లిష్ లిటరేచర్‌లో కెరీర్ ప్లాన్ చేయనేలేదా? నాలాగ సోషల్ ఇష్యూస్ మీద స్పందించే వ్యక్తికి లిటరేచర్ ప్రొఫెషన్‌గా ఉపయోగపడదనిపించింది. పత్తి మీద, చేనేత మీద నేను చేసిన పనిని అక్షరీకరించడానికి ఆ చదువు ఉపయోగపడింది. చేనేత రంగం మీద ప్రత్యేక ఆసక్తి ఎందుకు? బ్రిటిష్ పాలన కాలంలో మనదేశపు పత్తి బ్రిటన్‌కు ఎగుమతి కావడం మొదలైంది. ఎగుమతికి అవకాశాలు పెరిగాయి సంతోషమే. అక్కడ మన ఉనికిని మనమే పణంగా పెట్టాల్సిన కుట్ర ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది. బ్రిటన్‌లోని స్పిన్నింగ్ మిల్లులకు అనువుగా ఉండే పత్తి రకాలను పండించడానికి మన రైతుల్ని సిద్ధం చేసేశారు. దాంతో మనదేశంలో ఉన్న వైవిధ్యతను కోల్పోయాం. దానికి తోడు మన చేనేతకారులకు దారం అవసరమైనంతగా అందడం లేదు. ఇటు పత్తి రైతు, అటు వస్త్రాన్ని నేసే నేతకారుడు ఇద్దరూ స్పిన్నింగ్ మిల్లు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇద్దరినీ నియంత్రించే స్థాయికి, నిర్దేశించే స్థాయికి చేరిపోయింది స్పిన్నింగ్ పరిశ్రమ. ఈ ఉద్యమంలో మీ లక్ష్యం ఏమిటి? సమన్యాయం. రైతు, చేనేత కారుడు, స్పిన్నింగ్ మిల్లు యజమాని... ముగ్గురూ సమాజంలో ఒకే రకమైన గౌరవాలను అందుకోగలగాలి. స్పిన్నింగ్ పరిశ్రమ ఉక్కు కౌగిలి నుంచి పత్తి రైతులు, చేనేత కారులు బయటపడాలి. ఇంతకీ మల్కా అంటే ఏమిటి? ఇది ఒకరకమైన ఫ్యాబ్రిక్. ఖాదీ వంటిదే. దారం నునుపుగా, మృదువుగా ఉంటుంది. మన్నిక కూడా ఎక్కువే. ఈ దారంతో చేసిన వస్త్రం చేతికి కొంచెం గరుకుగా తగులుతూ ఒంటికి హాయినిస్తూంటుంది. మన భారతీయ సంప్రదాయ నేత విధానానికి ఆధునిక టెక్నాలజీని మేళవించి రూపొందుతున్న వస్త్రం. మల్కా చీర కడితే కుచ్చిళ్లు చక్కగా అమరుతాయి. నార్మల్ కాటన్కీ దీనికీ తేడా ఉంటుందా? పాశ్చాత్య కంపెనీలు మన పత్తిని వాళ్ల దేశాలకు రవాణా చేయడానికి బేలింగ్ విధానం పాటిస్తాయి. పత్తిని గట్టిగా ఒత్తిడికి గురిచేసి నలుచదరంగా డబ్బాలాగ ప్యాక్ చేస్తారు. వాటినే మనం పత్తి బేళ్లు అంటాం. బేలింగ్లో కంప్రెస్ చేసినప్పుడు, తిరిగి స్పిన్నింగ్ మిల్లులో ఏకినప్పుడు పత్తి పోగుల్లో సహజంగా ఉండే సున్నితత్వం, మెరుపు తగ్గుతుంది. మల్కా నేత కోసం పత్తిని బేల్ చేయరు. వదులుగా ప్యాక్ చేసి రవాణా చేస్తారు. చిన్న చిన్న నూలు మిల్లులు ఏర్పాటు చేసి, పత్తి రైతులు, చేనేత కారులకు అందుబాటులోకి ఉండేట్టు చూస్తున్నాం. వాటిని చేనేతకారులే సహకార సంఘాలుగా ఏర్పడి నడిపించుకుంటున్నారు. సిరిసిల్లలో 70 చేనేత కుటుంబాలు మల్కా ప్రోత్సాహక, పరిరక్షణ ఉద్యమంలో పని చేస్తున్నాయి. వాళ్లు పత్తిని రైతుల నుంచి కొని దారం తీస్తారు, వారే దుస్తులు నేస్తారు. మన పత్తి పాశ్చాత్య కంపెనీల్లో దారంగా మారడం తప్పంటారా? తప్పా ఒప్పా అనేది కాదిక్కడ. నాలుగు వేల ఏళ్ల మన వస్త్ర పరిశ్రమ మనది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పత్తి పండేది. వాటి నుంచి వచ్చే దారంలోనూ తేడా ఉంటుంది. దానిని బట్టి అక్కడ తయారయ్యే వస్త్రాల్లో వైవిధ్యత ఉండేది. పాశ్చాత్య కంపెనీలు... వాళ్ల మిషన్లకు అనువుగా ఉండే పత్తినే ప్రమోట్ చేస్తున్నాయి. దాంతో ఒకే రకమైన దారంతో ఒకటే రకం కాటన్ తయారవుతోంది. మనకు పెద్ద ఆస్తిలాంటి వైవిధ్యత పోతోంది. అలాగే వాళ్లు సూచించే పత్తి వంగడాలకు మన వాతావరణంలో తెగుళ్లు ఎక్కువ. దాంతో మందులు ఎక్కువ చల్లాలి, రైతుకి ఖర్చు పెరుగుతుంది. ఈ నేలలో జీవం పోసుకున్న పత్తి వంగడం ఇక్కడి వాతావరణంలో తెగుళ్లను కూడా ఎదుర్కోగలుగుతుంది. దేశీయ పత్తి, చేనేత గురించి ఇన్ని విషయాలు చెబుతున్నారు, చాలా స్టడీ చేసినట్లున్నారు! స్టడీ కాదు, రీసెర్చ్ చేశాను. ‘పేట్రియాటిక్ అండ్ పీపుల్ ఓరియెంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(పిపిఎస్టి)’లో పరిశోధన చేశాను. యూరప్, అమెరికాలు... అవి పాటిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అనే పేరు పెట్టి మూడవ ప్రపంచదేశాల మీద ఆధిపత్యం చెలాయించడం, ఆయా దేశాల్లో అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న సైన్స్‌ను తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం మీద మనదేశంలోని యువశాస్త్రవేత్తలు కొంతమంది డెబ్బైలలో ఒక ఫౌండేషన్‌గా ఏర్పడ్డారు. ఇండియాలో విస్తరించిన సైన్స్‌ను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అది. మల్కా ఉద్యమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? పదేళ్ల కిందట, 2008లో. అంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో చేనేతకారుల కోసం పనిచేశాను. దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ అసోసియేషన్ స్థాపన కోసం పని చేశాను. రాష్ట్రంలోని చేనేతకారులు సంఘటితంగా స్వయంగా మార్కెట్ చేసుకోవడానికి వేదిక అది. మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ కూడా అలాంటిదే. తెలంగాణలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు కనుమరుగవుతున్న డిజైన్లతో మల్కానేతలో ప్రయోగాలు చేస్తున్నాం. వస్త్రాన్ని మచిలీపట్నం పంపించి వాటి మీద సహజరంగులతో కలంకారీ అద్దకం చేయిస్తున్నాం. మన దేశీయ పత్తి, చేనేతకు మన అద్దకం మేళవింపు అన్నమాట. మల్కాను ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీ అంబాసిడర్లున్నారా? మల్కా చీరను ధరించిన ప్రతి మహిళా మల్కాకు బ్రాండ్ అంబాసిడరే. ఒకసారి వీటిలో సౌకర్యాన్ని ఆస్వాదిస్తే ఇక వదిలిపెట్టరు. మల్కా దుస్తుల ధర చాలా ఎక్కువ కదా? కొంత వరకు నిజమే, కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. చెమటను పీల్చుకునే వస్త్రం ఒంటికి చేసే మేలు గురించి ఒకరు చెప్పాల్సి రావడం బాధాకరమే. «ధరే కాదు, మన్నిక కూడా ఎక్కువే. మీ ప్రయత్నంలో విజయం సాధించారా? ఇది ముందు తరాలకు కొనసాగే అవకాశముందా? ఇది విస్త్రృతమైన ప్రపంచం. నేను వేసిన అడుగులు కొన్నే. నేను చైతన్యపరిచిన చేనేతకారుల కుటుంబాల్లో ఈ వృత్తి జీవితాన్ని నిలబెడుతుందనే నమ్మకమైతే కుదిరింది. ఈ జర్నీ కొనసాగాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వాలు చేనేత రంగాన్ని సన్‌సెట్ ఇండస్ట్రీగా చూస్తున్నాయి. ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలు ఉన్న కళను పరిరక్షించడానికే అరకొర అవుతున్నాయి. భవిష్యత్తు నిర్మాణానికి సరిపోవడం లేదు. నిజానికి ఇది భవిష్యత్తు ఉన్న గ్రీన్ ఇండస్ట్రీ. ప్రపంచంలో అత్యధికంగా చేనేతకారులున్న దేశం మనది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే చైనాను మించిపోతుంది ఇండియా. మన పత్తి నుంచి దాని నాణ్యత కోల్పోకుండా దారం తీయడానికి అనువైన యంత్రాల కోసం రీసెర్చ్ జరగాలి. మనకోసం మనమే యంత్రాలను తయారు చేసుకోవాలి. చేనేత ఉద్యమంతోపాటు మీ హాబీలేంటి? హాబీ కాదు కానీ, నా మరో ప్రొఫెషన్ జువెలరీ మేకింగ్. ఆభరణాల తయారీ కోర్సు చేశాను. ఇంట్లో వర్క్‌షాప్ ఉంది. బ్రాస్లెట్, నెక్లెస్, చెవిరింగులు, ఉంగరాల వంటివి కొత్త డిజైన్లు చేస్తుంటాను. మరి... రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు? నాకిప్పుడు 75 ఏళ్లు. ఈ వయసులో ఎన్ని గంటలు చేయగలను. మల్కా కోసం నాలుగు గంటలు, ఆభరణాల వర్క్‌షాప్‌లో రెండు గంటలు. టూర్లను ఇష్టపడతారా? ఇండియాలో, విదేశాల్లో ప్రదేశాలకు వెళ్లాను. కానీ నేను టూరిస్ట్‌ను కాదు. అక్కడి మనుషులను కలవడానికే వెళ్లాను తప్ప ప్రదేశాలను చూడడానికి కాదు. రాష్ట్రీయ చేనేత జనసమాఖ్యను కలవడానికి చీరాలకు వెళ్లాను. ఒరిస్సా, కర్ణాటక, కేరళలోని హ్యాండ్లూమ్ వీవర్స్‌ను కలిశాను. లూమింగ్ రివల్యూషన్లో భాగంగా విస్తృతంగా పర్యటించాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పత్తి చరిత్ర మట్టి నుంచి పత్తిని పండించే రైతు, పత్తి నుంచి దారం తీసే యంత్రం, దారంతో వస్త్రాన్ని రూపొందించే హస్తకళా నైపుణ్యం... ఈ మూడూ తోడుగా ఉండడమే ఆధునిక మానవుడి ఆహార్య రహస్యం. ఈ మూడింటిలో మొదటి అడుగే తప్పటడుగు అవుతుంటే... మిగిలినవి తప్పుటడుగులే అవుతాయి. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా పడిన తప్పటడుగులను సరిచేయడమే మల్కా ఉద్యమం ఉద్దేశం. దేశమంతటా పర్యటించి పరిశోధించిన సమాచారాన్ని ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ : ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’ పేరుతో పుస్తకం రాశాను. ఈ పుస్తకంలో పత్తి చరిత్ర, పత్తిలో రకాలు, సాగు పద్ధతులు, దారం తీసే నైపుణ్యాలు, వస్త్రాన్ని నేయడంలో వివిధ ప్రాంతాల్లో అవలంబించే పద్ధతుల గురించి సమగ్రంగా చర్చించాను. నా తర్వాత ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు వచ్చే వాళ్లకి ఇది పనికొస్తుంది. నేను చేసిన పనినే మళ్లీ వాళ్లు కూడా మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేకుండా ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తుంది. – ఉజ్రమ్మ, మల్కా ఉద్యమకారిణి -
కాన్పుకు వస్తే కడుపులో కాటన్ వేసి..
షాద్‌నగర్‌టౌన్ : వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైన సంఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఎనిమిది నెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత(25)ను ఏడాదిన్నర కిత్రం అదే మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాజుతో వివాహం చేశారు. హరితకు తొలి కాన్పు సమయం దగ్గర పడడంతో గతేడాది అక్టోబర్ 3న షాద్‌నగర్ పట్టణంలోని విజయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. హరితను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబీకుల అంగీకారంతో అక్టోబర్ 5న ఆపరేషన్ చేయడంతో హరిత తొలికాన్పులో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాపను చూసి మురిసిపోయిన ఆ కుటుంబ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆపరేషన్ అయిన కొన్ని నెలల్లోనే హరిత అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరితకు స్కానింగ్ చేసి ఆమె కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఉస్మానియా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడలేదు. కొన్ని నెలలుగా మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హరిత మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట పసిపాపతో ధర్నా మృతురాలి కుటుంబీకులు శనివారం సాయంత్రం షాద్‌నగర్‌లోని విజయ ఆస్పత్రి ఎదుట ధర్నా చేప ట్టారు. హరిత కూతురు పసిపాపతో ఆస్పత్రి ఎదు ట బైఠాయించారు. పసిపాపకు న్యాయం చేయాల ని, నిర్లక్ష్యంగా వ్యహరించి ఆపరేషన్ చేసిన వైద్యులను వెంటనే అరెçస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ పట్టణ సీఐ అశోక్‌కుమార్ గట్టి బందోబస్తు చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి హరిత మృతదేహాన్ని పోలీసులు నేరుగా ఆమె స్వగ్రామైన షాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి తరలించారు. రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలి హరిత మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బాధిత కుటుంబ సభ్యులు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిన్నారి పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు, స్ధానిక నాయకులు జోక్యం చేసుకొని విజయ ఆస్పత్రి వైద్యులతో చర్చించినట్లు సమాచారం. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. -
విద్యుత్ వైర్లు తగిలి అగ్నికి ఆహుతైన పత్తి
-
కలుపు నాశని పోషకంగా కొత్త పత్తి వంగడం!
కలుపు మొక్కలను నాశనం చేసేందుకు వాడే మందులు.. పంటకు బలం చేకూరిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క కలుపు సమస్య పోవడమే కాకుండా.. పంట ఏపుగా పెరుగుతుంది. ఈ అద్భుతాన్ని సాధించేందుకు టెక్సస్ ఏ అండ్ ఎం అగ్రిలైఫ్ శాస్త్రవేత్తలు సరికొత్త ఎరువుల వ్యవస్థను సిద్ధం చేశారు. నిర్దుష్ట జన్యువునొకదాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా పత్తి మొక్క ఫాస్పీట్ కలుపు నాశనిని పోషకంగా మార్చుకోగలదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ కీర్తీ రాథోర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కలుపు మొక్కలు రసాయన మందుల విషయంలో నిరోధకత పెంచుకుంటున్నాయని కీర్తి తెలిపారు. మొక్కలు తమ ఎదుగుదలకు ఫాస్పరస్‌ను వాడుకుంటాయని మనకు తెలుసు. ఫాస్పీట్‌ను మాత్రం మొక్కలు నేరుగా వాడుకోలేవు. కాబట్టి ఇది వాటికి విషంగా మారుతుంది. కాబట్టి.. ఫాస్పేట్ను నేరుగా వాడితే పత్తి మొక్కలు నాశనమయ్యే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో పత్తి మొక్కలోని పీటీఎక్స్/డీ అనే జన్యువును చైతన్యవంతం చేస్తే.. అది కాస్తా ఫాస్పీట్‌ను ఫాస్ఫరస్గా మార్చుకుని ఎదుగుదలకు వాడుకుంటాయి. మిగిలిన మొక్కలకు ఆ శక్తి లేకపోవడం వల్ల నాశనమైపోతాయి. ఫాస్పేట్‌తో పోలిస్తే ఫాస్పీట్ నేలలో వేగంగా కరిగిపోయి, కలిసిపోతుందని ఫలితంగా తగినంత ఫాస్పీట్‌ను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఇస్తుందని కీర్తి తెలిపారు. -
‘గ్లైపోసెట్’పై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: అనుమతిలేని బీజీ–3 పత్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. అందుకోసం బీజీ–3కి ఉపయోగించే గ్లైపోసెట్ అనే కలుపు మందును నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రధానంగా పత్తి సాగు చేసే ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి నవంబర్ వరకు ఈ కలుపు మందును నిషేధించాలని విజ్ఞప్తి చేసింది. గ్లైపోసెట్‌ను నిషేధిస్తే సాధారణంగా బీజీ–3 పత్తి సాగును నిలువరించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. అయితే గ్లైపోసెట్‌ను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, లేకుంటే కేంద్రానికి సిఫార్సు చేయాలా అన్న దానిపై స్పష్టత లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తేడా గుర్తించడం కష్టం.. రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటలకంటే పత్తి సాగే అధికంగా ఉంటుంది. గతేడాది 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. దేశంలో అనుమతి కలిగిన బీజీ–1, 2 విత్తనాలనే విక్రయిస్తారు. దానికే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే బీజీ–2ని గులాబీరంగు పురుగు పట్టి పీడిస్తుండటంతో అనేకమంది రైతులు గతేడాది ఖరీఫ్‌లో అనుమతిలేని బీజీ–3 విత్తనాన్ని ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన అనేక కంపెనీలు బీజీ–3ని రైతులకు రహస్యంగా అంటగట్టాయి. ఒక అంచనా ప్రకారం పత్తి సాగులో 20 శాతం వరకు రైతులు బీజీ–3ని సాగు చేశారు. బీజీ–2కు, బీజీ–3కి తేడా కనిపించదు. రెండు రకాల మొక్కలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వాటిని నేరుగా చూసి గుర్తించడం కష్టం. కాబట్టి బీజీ–3కి అడ్డుకట్ట గ్లైపోసెట్ కలుపు మందు నిషేధంతోనే సాధ్యమని భావిస్తున్నారు. గ్లైపోసెట్‌ను నిషేధిస్తే..? బీజీ–3 పత్తి విత్తనాలను నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కానీ అది విచ్చలవిడిగా రైతులకు అందుబాటులోనే ఉంటోంది. మోన్శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మహికో కంపెనీ ఆర్ఆర్ఎఫ్ కారకం గల బీటీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపింది. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోంది. బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు గ్లైపోసెట్‌ను వాడతారు. ఆ మందు లేకుంటే బీజీ–3లో కలుపు నివారణ సాధ్యంకాదు. దీనిని బీజీ–3 పత్తికి వేస్తే, పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవీ విషపూరితమవుతాయి. బీజీ–3 విక్రయాలు రహస్యంగానైనా అమ్ముడుకాకుండా చూడాలంటే గ్లైపోసెట్ నిషేధమే సరైన పద్ధతిగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తేనే బీజీ–3పై ఉక్కుపాదం మోపడానికి వీలవుతుందని అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఇంట్లో పత్తి.. ఒంట్లో అలర్జీ
సాక్షి, హైదరాబాద్: రైతు కుటుంబాలను పత్తి వేధిస్తోంది. నిల్వ చేసిన పత్తి రోగాలకు కారణమవుతోంది. ఇళ్లలో నిల్వ చేసిన పత్తి చర్మ సమస్యలకు కారణమవుతోంది. పత్తి సాగు చేసే ప్రతి ఊరిలోనూ ఇప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉంది. నిల్వ పత్తిలో ఉండే సూక్ష్మక్రిములు గ్రామస్తులను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరిగి పొడిగాలి ఉండటంతో అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యుల దగ్గర పత్తి బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. అలర్జీ కారణంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పత్తి రైతులు ఉన్నారు. ప్రతి ఏటా సగటున 47 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఎక్కువమంది రైతులు పత్తి నిల్వవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలేదు. గతంలో పత్తిని బస్తాల్లో నింపి నిల్వ చేసేవారు. ప్రత్యేక గదుల్లో పెట్టేవారు. ఇప్పుడు ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వచేసిన పత్తిలో ఉండే సూక్ష్మ క్రిములు బయటికి రాకుండా చర్యలు తీసుకోవడంలేదు. దీంతో సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపించి మనుషులను తాకుతున్నాయి. ఫలితంగా చర్మరోగాలు పెరుగుతున్నాయి. పత్తిలోని సూక్ష్మక్రిముల వల్ల అలర్జీ వస్తుందనే అవగాహన లేకపోవడంతో కొందరు వైద్యుల దగ్గరికి వెళ్లడంలేదు. మందులు వాడడంలేదు. చర్మవ్యాధులు తీవ్రమైతే ఆస్తమాకు దారి తీస్తుంది. పిల్లలలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. అనారోగ్య కారకం... పత్తి పురుగులతో అలర్జీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితులు రోజూ పదుల సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. పత్తిలో అలర్జీ కారక ఆనవాళ్లు ఉన్నాయి. పత్తిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వల్ల అందులోని సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తున్నాయి. సూక్ష్మక్రిములతో చర్మం ఎర్రబారడం, దురద, మంట వంటివి వస్తాయి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దురద వచ్చిన వెంటనే మందులు వాడాలి. లేకుంటే ఇతరులకు వ్యాపిస్తుంది. – డాక్టర్ రాంచందర్ ధరక్, చర్మవ్యాధి నిపుణులు,కాకతీయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ -
పంట ఇవ్వని విత్తనానికి రేటు పెంచడంలో ‘బీజీ’!
సాక్షి, హైదరాబాద్: బీజీ–2 పత్తి విత్తన ధరలు పెంచేందుకు పలు కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచా యి. ఆయా పత్తి విత్తన కంపెనీలు చేస్తున్న ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 22న కేంద్ర పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నందున ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. గతేడాది కంటే ఈసారి బీజీ–2 విత్తన ధరను రూ.170 అదనంగా పెంచాలని కంపెనీలు కేంద్రానికి విన్నవించాయి. ఇదిగాక రాయల్టీని వేరుగా వేస్తే రైతులకు అదనపు భారమే కానుంది. వాస్తవానికి గులాబీ రంగు పురుగుతో పత్తి నాశనం అవుతున్నా మళ్లీ బీజీ–2నే అదీ అధిక ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. రూ.169 కోట్ల భారం రాష్ట్రంలో అన్ని పంటల కంటే పత్తినే అధికంగా సాగవుతోంది. గత ఖరీఫ్‌లో ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో సగం పత్తి పంటే ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలో కోటి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. గతేడాది బీజీ–2 విత్తన ప్యాకెట్ (450 గ్రాములు) ధర రూ.781, కాగా దానికి రాయల్టీ రూ.49 కలిపి గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) రూ.830గా ఖరారు చేశారు. ఈసారి కంపెనీలు రాయల్టీ కాకుండా రూ.950గా ప్రతిపాదించాయి. గతేడాదితో పోలిస్తే రూ.169 అదనంగా విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. రాయల్టీ విషయాన్ని ఎక్కడా ప్రతిపాదించకున్నా గతేడాది ప్రకారం రాయల్టీ ఇచ్చినా ఒక్కో ప్యాకెట్ రూ.999 కానుంది. ఇలా రాష్ట్ర రైతాంగాన్ని దోపిడీ చేసేందుకు పత్తి కంపెనీలు కుట్రలు పన్నాయి. ధరలు పెంచడం ద్వారా ఏకంగా రూ.169 కోట్లు అదనంగా రాబట్టాలని నిర్ణయించుకున్నాయి. రైతుకు గత్యంతరం లేదనేనా? రైతుకు గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. జీవ వైవిధ్యానికి ముప్పు కారణంగా బీజీ–3కి అనుమతి లేదు. బీజీ–2 వేసినా గులాబీ రంగు పురుగు సోకి రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట సర్వనాశనమైంది. అయినా వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అదే విత్తనాన్ని రైతులకు అంటగట్టేందుకు విత్తన కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. రానున్న ఖరీఫ్‌లో రైతులు పత్తి వేయాలంటే విఫలమైన ఈ విత్తనాలే గత్యంతరమయ్యాయి. వాటికి ప్రత్యామ్నాయంగా ఏ విత్తనమూ రాలేదు. ఏ విత్తనం వేయాలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడంలేదు. -
పడిపోతున్న పత్తి ధర
జమ్మికుంట(హుజూరాబాద్): కొత్త సంవత్సరం తెల్లబంగారం ధర పడిపోతోంది. డిసెంబర్ చివరి వారం పలికిన ధరలకు భిన్నంగా ధరలు పడిపోతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5 వేల ధర పలుకగా రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. పత్తి మార్కెట్లో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి లూజ్ పత్తి 1073 క్వింటాళ్లు అమ్మకానికి రాగా వ్యాపారులు ఉదయం వేలం పాట నిర్వహించి క్వింటాల్ పత్తికి రూ.5వేల ధర గరిష్టంగా చెల్లించారు. కనిష్ట ధర రూ.4300, మోడల్ ధర రూ.4900 నిర్ణయించారు. దీంతో గత వారం పలి కిన క్వింటాల్‌కు రూ.5230కి సోమవారం పలికిన ధరలో రూ.203 తగ్గడంతో రైతులు ఆందోళన చెందారు. పతనానికి కారణం ఇదే దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి ఎక్కువగానే ఉందని వారంక్రితం ముంబాయిలో కాటన్ అడ్వజర్ బోర్డులో వెల్లడికావడంతో దేశంలో పత్తి కొనుగోళ్లపై భారంపడింది. కేవలం దేశంలో తెలంగాణ, మహారాష్ట్రల్లో తప్పా అన్నిరాష్ట్రాల్లో పత్తి అధికంగా పండిందని సీఏబీలో చర్చించడంతో పత్తి కొనుగోళ్లపై ప్రభావం పడినట్లు వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వారంక్రితం క్యాండి ధర రూ.43 వేల 500 వరకు పలుకగా శుక్రవారం అదే క్యాండి రూ.41 వేల 500 పడిపోయింది. రూ.2 వేలు డిమాండ్ పడిపోవడంతో క్వింటాల్ పత్తి రూ.5230 నుంచి రూ.5వేలకు పతనమైంది. అదే విధంగా పత్తి గింజల ధర సైతం క్వింటాల్‌కు రూ.2200 వరకు పలుకగా ప్రస్తుతం 2 వేలకు పడిపోయినట్లు వ్యాపారవర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగానే మార్కెట్లో పత్తికి డిమాండ్ తగ్గిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతిదారులు బేళ్ల ధరలు తగ్గిస్తున్నారనే వివరిస్తున్నారు. కమర్షియల్‌కు స్టెబుల్ మెలిక సీసీఐ రంగ సంస్థ ఈ సీజన్లో రైతుల నుంచి పత్తిని కమర్షియల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జమ్మికుంట పత్తి మార్కెట్లో ఈ విధానంతో కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆసక్తి చూపే పరిస్థితి లేదు. వ్యాపారులతో వేలం పాటకు సీసీఐ పాట పాడే అవకాశం ఉన్నా స్టెబుల్, మైక్ నిబంధనలతో కొనుగోలుకు దూరంగా ఉంటుంది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వచ్చే పత్తిలో స్టెబుల్ 30 ఎంఎం ఉంటేనే సీసీఐ కమర్షియల్ పర్చేస్ చేస్తుంది. అయితే జమ్మికుంటకు వచ్చే పత్తిలో స్టెబుల్ 28 ఎంఎం నుంచి 29, 29.5 మాత్రమే ఉంటుంది. 30 ఎంఎం ఉంటేనే సీసీఐ కొనుగోలు చేయాలని సంస్థ నిబంధనలు విధించడంతో జమ్మికుంట పత్తి మార్కెట్లో ఈసారి సీసీఐ కమర్షియల్ కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పత్తి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న క్రమంలో సీసీఐ వ్యాపారులతో పోటీపడి ధరలు నిర్ణయిస్తే రైతులకు లబ్ధి జరిగే అవకాశాలు ఉండగా స్టెబుల్ నిబంధనలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. -
గులాబీ పురుగు సోకిన పత్తికి పరిహారం
సాక్షి, హైదరాబాద్: గులాబీ రంగు కాయతొలుచు పురుగు సోకిన పత్తికి బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వానికి విన్నవిం చింది. దీనికి అనుగుణంగా పంటల బీమా పథకంలో సమూల మార్పులు చేయాలని విన్నవించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) అమలు మార్గదర్శక ముసాయిదాపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి రెండ్రోజుల కిందట నివేదిక పంపింది. అందు లో కీలకంగా పత్తి రైతులను ఆదుకునేలా బీమా పథకాన్ని సమూలంగా మార్చాలని సూచించింది. పీఎంఎఫ్‌బీవై, ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను కలిపి కొత్తగా మరో పథకాన్ని తీసుకురావాలని పేర్కొంది. తెలంగాణలో పత్తి కీలకమైన పంటని, ఏటా దాని విస్తీర్ణం పెరుగుతోందని, అయితే గులాబీ పురుగుతో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ కేంద్రానికి విన్నవించింది. తెలంగాణలో పత్తి పంటను ఆర్‌డబ్ల్యూబీసీఐ ఎస్ పథకం పరిధిలో ఉంచారు. దానికి అను గుణంగానే పరిహారం చెల్లిస్తున్నారు. అయితే గులాబీ పురుగు సోకితే అది ఆర్‌డబ్ల్యూబీసీఐ ఎస్ పథకం కిందికి రాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపో తారని, ఈ నేపథ్యంలో గులాబీ పురుగు సోకి న నేపథ్యంలో దిగుబడి, వాతావరణం రెండింటినీ లెక్కలోకి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ శాఖ కేంద్రాన్ని కోరింది. 2 కోట్ల క్వింటాళ్లకు పడిపోయిన పత్తి దిగుబడి? రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఈ ఖరీఫ్‌లో 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టిందని అంచనా. దీంతో పురుగు సోకిన పంటంతా సర్వనాశనమైంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక అంచనాలు రూపొందించలేదు. కానీ కేంద్రానికి పంపిన నివేదికలో మాత్రం ఉధృతంగా గులాబీ పురుగు సోకిందని, ఆ ప్రకారం నష్టం వాటిల్లిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గులాబీ పురుగు, ఇతరత్రా కారణాలతో 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని ఆ తర్వాత పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు 88.03 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే రైతులు విక్రయించారు. ఇది కోటి క్వింటాళ్ల వరకు చేరుకుంటుందని అనుకున్నా భారీ తేడా కనిపిస్తోంది. మొదటి అంచనా ప్రకారం చూస్తే ఏకంగా 2 కోట్ల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి పడిపోయే అవకాశముందని చెబుతున్నారు. సాధారణంగా ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాలి. గులాబీ పురుగు కారణంగా అనేక చోట్ల 6–7 క్వింటాళ్లకు మించిలేదంటున్నారు. ఇంత నష్టం జరిగినా రైతుకు నష్టపరిహారం అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించినట్లు తెలిసింది. పీఎంఎఫ్‌బీవైలో మార్పులపై రాష్ట్రం చేసిన మరికొన్ని సూచనలివీ.. - బీమా చేసిన ఆయా పంటలకు ప్రస్తుతం 70%, 80%, 90% నష్టపరిహారం ఇస్తున్నారు. మున్ముందు అన్నింటికీ 90% నష్టపరిహారం ఇవ్వాలి. - రైతు యూనిట్‌గా పంటల బీమాను అమలు చేయాలి. - ప్రస్తుతం ప్రీమియం చెల్లించే గడువు ఖరీఫ్ పంటలకు జూలై వరకు, రబీ పంటలకు డిసెంబర్ వరకు ఉంది. ఇది సమంజసంగా లేదు. స్థానిక పంట కేలండర్ ప్రకారం రాష్ట్రాలే గడువు తేదీలను ఖరారు చేసుకునే అవకాశం ఇవ్వాలి. - బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటా భారీగా పెంచుతున్నాయి. ఈ పద్ధతి మార్చాలి. - పంటల బీమాను అమలు చేసే కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడంలేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటంలేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడు వారాల్లోగా రైతులకు పరిహారాన్ని ఖరారు చేయాలి. ప్రస్తుతం నెలల తరబడి ఆలస్యం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. - రైతుల ఫిర్యాదులను వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్ర స్థాయిలో నెలకొల్పాలి. - రైతులు చెల్లించిన ప్రీమియం సొమ్మును బ్యాంకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీమా కంపెనీలకు బదిలీ చేయాలి. - వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా రైతులు బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. -
పత్తికి మద్దతు ధర పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి క్రమంగా మద్దతు ధర పెరుగుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ. 4,320కాగా ఆదిలాబాద్ వంటి చోట్ల రూ. 4,450 నుంచి రూ. 4,500 ధర లభిస్తున్నట్లు చెప్పారు. తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్నప్పటికీ పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ధర ఉందన్నారు. ఇప్పటికే భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా 3.50 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా ప్రైవేటు వ్యాపారులు 26.03 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారన్నారు. చివరి గింజ వరకు కొంటాం... వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేలా ఏర్పాట్లు జరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటివరకు 4.73 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించామని, ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు 1,732 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. 96,348 మంది రైతుల నుంచి రూ. 752 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. కొన్నిచోట్ల సెర్ప్, ఐకేపీ సిబ్బంది సమ్మె చేస్తున్నందున ధాన్యం కొనుగోళ్లకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఏర్పడితే సహకార, పంచాయతీరాజ్ వంటి ప్రభుత్వశాఖల సహకారం తీసుకొని ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు లేవని భూపాలపల్లి జయశంకర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. గ్రేడ్–1 బీపీటీ తదితర రకాల సన్న రకం బియ్యానికి మద్దతు ధర లభిస్తోందని, కేసముద్రం, సూర్యాపేట, నిజామాబాద్ తదితర మార్కెట్లలో రూ. 1,600 నుంచి రూ. 1,800కుపైగా రేటు వస్తోందని హరీశ్‌రావు తెలిపారు. నిర్మల్ జిల్లాలో 44, నిజామాబాద్‌లో 214, కామారెడ్డిలో 186, మెదక్‌లో 178, సిద్దిపేటలో 104, కరీంనగర్లో 181, జగిత్యాలలో 248, సిరిసిల్లలో 145, పెద్దపల్లిలో 67, వరంగల్ రూరల్‌లో 84, వరంగల్ అర్బన్‌లో 41, జనగామలో 40, నల్లగొండలో 54, సూర్యాపేటలో 16, యాదాద్రిలో 106, మహబూబ్‌నగర్‌లో 7, వనపర్తిలో 3, మేడ్చెల్‌లో 5, శంషాబాద్ జిల్లాలో 7 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. -
వేలం పాట గోవిందా?
జమ్మికుంట(హుజూరాబాద్): ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ జమ్మికుంటలో నిబంధనలకు నీళ్లు వదిలారు. పత్తి కొనుగోలు వేలంలో పోటీపడుతున్న వ్యాపారులు చివరి బండి వరకు మాత్రం మద్దతు ధర చెల్లించడం లేదు. మొదటి ఒక్కటి, రెండు వాహనాల్లోని పత్తికి మాత్రమే వేలంలో పాడిన ధర చెల్లిస్తూ..తర్వాత వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిగా ధర నిర్ణయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పత్తి కొనేదిలేదంటూ మొండికేస్తున్నారు. వారి చెప్పిందే ధరగా చెల్లుబాటు అవుతుంది. పేరుకే వేలం! జమ్మికుంట మార్కెట్లో ప్రతి రోజు పత్తి కొనేందుకు వ్యాపారులు పోటీపడి వేలంపాట పాడుతున్నారే తప్ప అన్ని వాహనాల్లోని పత్తికి అదే ధర చెల్లించడం లేదు. ఇదంతా అధికారుల సాక్షిగానే జరుగుతున్నా స్పందించినా పాపానపోవడం లేదు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 184 వాహనాల్లో 1,899 క్వింటాళ్ల లూజ్ పత్తి వచ్చింది. పాలకవర్గం, అధికారుల సమక్షంలో రెండు వాహనాలకే వ్యాపారులు వేలం పాడారు. మొదటి వాహనానికి క్వింటాల్‌కు రూ.4,400 ధర పెట్టిన వ్యాపారులు, రెండో వాహనానికి రూ.4,510 చెల్లించారు. తర్వాత వాహనాలకు మాత్రం వ్యాపారులకు ఎవరికి నచ్చిన ధరలు వారు చెల్లించారు. సేటు చెప్పిందే ధరగా పరిస్థితులు మారిపోయాయి. వేలం అన్ని వాహనాలకు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తే పట్టించుకునే వారు కరువయ్యారు. ఇష్టారీతిన కొనుగోళ్లు మొదటి ఒకట్రెండు వాహనాలకే వేలం పాట పాడుతున్న వ్యాపారులు తర్వాత ఇష్టారీతిన కొనుగోళ్లు చేస్తున్నారు. నాణ్యమైన పత్తికి సైతం క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4,200 చెల్లించారు. గతంలో ప్రతీ వాహనానికి వేలం పాడిన వ్యాపారులు ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.