కలుపు మొక్కలను నాశనం చేసేందుకు వాడే మందులు.. పంటకు బలం చేకూరిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క కలుపు సమస్య పోవడమే కాకుండా.. పంట ఏపుగా పెరుగుతుంది. ఈ అద్భుతాన్ని సాధించేందుకు టెక్సస్ ఏ అండ్ ఎం అగ్రిలైఫ్ శాస్త్రవేత్తలు సరికొత్త ఎరువుల వ్యవస్థను సిద్ధం చేశారు. నిర్దుష్ట జన్యువునొకదాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా పత్తి మొక్క ఫాస్పీట్ కలుపు నాశనిని పోషకంగా మార్చుకోగలదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ కీర్తీ రాథోర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కలుపు మొక్కలు రసాయన మందుల విషయంలో నిరోధకత పెంచుకుంటున్నాయని కీర్తి తెలిపారు. మొక్కలు తమ ఎదుగుదలకు ఫాస్పరస్‌ను వాడుకుంటాయని మనకు తెలుసు.
ఫాస్పీట్‌ను మాత్రం మొక్కలు నేరుగా వాడుకోలేవు. కాబట్టి ఇది వాటికి విషంగా మారుతుంది. కాబట్టి.. ఫాస్పేట్‌ను నేరుగా వాడితే పత్తి మొక్కలు నాశనమయ్యే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో పత్తి మొక్కలోని పీటీఎక్స్/డీ అనే జన్యువును చైతన్యవంతం చేస్తే.. అది కాస్తా ఫాస్పీట్‌ను ఫాస్ఫరస్‌గా మార్చుకుని ఎదుగుదలకు వాడుకుంటాయి. మిగిలిన మొక్కలకు ఆ శక్తి లేకపోవడం వల్ల నాశనమైపోతాయి. ఫాస్పేట్‌తో పోలిస్తే ఫాస్పీట్ నేలలో వేగంగా కరిగిపోయి, కలిసిపోతుందని ఫలితంగా తగినంత ఫాస్పీట్‌ను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఇస్తుందని కీర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment