nutrient
-
డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా
బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లేదా రాత్రికి అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇడ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా. రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇలాగే ఓట్స్తోగానీ, గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు. ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్ చేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. -
ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం!
మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, స్థూల పోషకాలు ఉండాలని చెబుతుంటారు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మన ఆహారంలో అత్యంత కీలకమైన పోషకాలను కోల్పోతున్నామట. ఇటీవల పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మన తీసుకునే ఆహారంలో అత్యంత కీలకమైన, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను కోల్పోతున్నామని పరిశోధకులు చెప్పారు. ఇంతకీ ఏంటా నాలుగు కీలక పోషకాలంటే..!హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాంటా బార్బరా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు కాల్షియం, ఐరన్, విటమిన్ సీ, ఈతో సహా శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను సరిపోని స్థాయిలో వినయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇలా మొత్తం 31 దేశాలలోని ప్రజల డేటాను సర్వే చేసి మరీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అందులో పురుషుల, స్త్రీల డేటాను వేరు చేసి మరి అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరిపై దాదాపు 15 విటమిన్లు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. అందులో నాలుగు కీలక పోషకాలను ఆహారం నుంచి చాల తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని తేలింది. ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ తగినంతగా తీసుకోవడం లేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక సగానికి పైగా ప్రజల్లో రిబోఫ్లావిన్, ఫోలేట్, విటమిన్ సీ, బీ6, నియాసిన్ తదితరాలను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ప్రపంచ జనాబాలో దాదాపు 22% మంది చాలా తక్కువ స్థాయిలో ఈ పోషకాలను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించేవని తెలిపారు. (చదవండి: పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!) -
చిన్న గింజలే కదాని లైట్ తీసుకోవద్దు : చికెన్ కూడా దిగదుడుపే!
పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు భారత దేశంలో చాలామందే ఉన్నారు. పేదరికం, అవగాహన లేక పోవడం, ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తదితరాలను దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు. పోషకాహారం అంటే అదేదో ఖరీదైన వ్యవహారంగా చాలా మంది అపోహపడతారు. బ్రెజిల్ నట్స్,హాజిల్ నట్స్, బాదం, పిస్తా, జీడి పప్పు లాంటివే అనుకుంటారు. కానీ భారతదేశంలో చక్కటి పోషకాలందించే గింజలు ఇంకా చాలా ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి అనేక పోషకాలంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సులభంగా, తక్కువ ధరలో దొరికే వీటిని తీసుకోవడం వల్ల లాభాలేంటి? తెలుసుకుందాం!సులభంగా లభించే ఎక్కువ పోషకాలు లభించేవాటిలో వేరుశనగలునువ్వులు, గుమ్మడి గింజలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు.పల్లీలు, వేరుశనగలువేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి,. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా అధిక బరువుపెరగకుండా నియంత్రిస్తాయి. వేరుశనగల్లో పుష్కలంగా లభించే కాల్షియం, మెగ్నీషియంఎదిగే పిల్లల్లో ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఎముకలకు బలాన్నిస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. వేరుశనగల్లో ఉండే మాంగనీస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.ఎలా తీసుకోవాలిఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచితోపాటు, పోషకాలు అందుతాయి. పచ్చిగా తీసుకోవచ్చు. వేయించి తినవవచ్చు. నాన బెట్టి మొలకలు వచ్చిన తరువాత తింటే ఇంకా శ్రేష్టం.బెల్లంతో కలిపి చేసిన వేరుశనగ ఉండల్ని, అచ్చులను తినిపిస్తే రక్త హీనత నుంచి కాపాడుకోవచ్చు.వంటల్లో వేరుశనగ నూనెను వాడవచ్చు. ఇది. ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.దక్షిణ భారతదేశంలో కరకర లాడే కారం మాసాలా పల్లీలు, పల్నీ చట్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇడ్లీ, దోసలతో కలిపి తింటే పోషకాలు అందుతాయి. గుమ్మడి గింజలుగుమ్మడి గింజల్లో అత్యధిక స్థాయిలో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిళ్ల నియంత్రణ, జుట్టు పెరుగుదలలో గుమ్మడి గుంజలు బాగా పనిచేస్తాయి. ఆధునిక జీవన శైలి పురుషుల్లో కనిపిస్తున్న సంతానోత్పత్తి సమస్యలకు చెక్ చెబుతుంది. స్పెర్మ్ నాణ్యత మంచి పరిష్కారం. ఐరన్ తగిన స్థాయిలో ఉండేందుకు గుమ్మడి గింజలు తోడ్పడుతాయి.ఎలా తీసుకోవాలిగుమ్మడి గింజల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలను భాగం చేసుకోవచ్చు. పెరుగు, పండ్లు, సలాడ్లు సూప్‌లో కొన్ని గుమ్మడి గింజలను వేసుకోవచ్చు.కుకీలు, బ్రెడ్, తీపి పదార్థాల్లో గుమ్మడి గింజల్ని చక్కగా అమరుతాయి.నువ్వులు, లడ్డూలునువ్వుల గింజలు కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఇనుము అధికంగా లభిస్తాయి. పిల్లల్లో పోషకాహార లోపానికి నువ్వులు, బెల్లం లడ్డూలను తినపించవచ్చు. ఆడపిల్లల్లో అనేక గైనిక్సమస్యలకు చక్కటి పరిష్కారంగా నువ్వుల గురించి పెద్దలు చెబుతారు. -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్‌ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్‌పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్‌ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్‌లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్‌కు ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్‌లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్‌లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్‌ను సూపర్‌ఫుడ్‌గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్‌లో 500కి పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్‌లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్‌లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి ఈడు పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్ధ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది. జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో... పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్ డే మీల్స్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్షించి... వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు. బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనపథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ... జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు రాగిజావను మిడ్ డే మీల్స్‌లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మిడ్ డే మీల్స్‌లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఇందులో భాగంగానే ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు మీకు ధన్యవాదాలు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుంది. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మూడున్నరేళ్ల క్రితం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగింది. విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే.. నాడు– నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్ స్క్రీన్ ఐఎఫ్పి ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పి)లను ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్ 6వతరగతి ఆపై తరగతులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నాం. పిల్లల కరిక్యులమ్‌ను బైజూస్ కంటెంట్‌తో అనుసంధానం చేస్తూ.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. మరోవైపు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యాదీవెన– 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, రూ.20 వేల వరకు వసతి దీవెనను అమలు చేస్తున్నాం. తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. మరోవైపు విదేశీ విద్యా దీవెనను కూడా అమలు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ –50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన వారికి రూ.1 కోటి వరకు అందిస్తుంది. రేపు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్ కావాలనే నిబంధన విధించాం. ఇవన్నీ విద్యాంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చే అడుగులు. గోరుముద్ద మెనూలో రాగిజావను అమలు చేసే ప్రయత్నంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం మంచి పరిణామం. సత్యసాయి ట్రస్టు భాగస్తులు కావడం ద్వారా.. భగవాన్ సత్యసాయి కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మెరుగైన సమాజం దిశగా ఉపయోగపడుతుంది. అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ జే. రత్నాకర్‌లు మాట్లాడారు. బొత్స సత్యనారాయణ, విద్యాశాఖమంత్రి మీ ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 వ తేదీ నుంచి రాగిజావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించాలని నిర్ణయించారు. దీనికి రూ.86 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో సత్యసాయి ట్రస్టును ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి సత్యసాయి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం. వారికి కృతజ్ఞతలు. భారతదేశంలో మిడ్ డే మీల్స్‌ను ఇంత సమర్ధవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రత్నాకర్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి సేవా సంస్ధలు సేవానిరతితో పనిచేస్తున్నాయి. బాబా గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి, అధికారులు మిడ్ డే మీల్స్‌లో రాగిజావ అందించే కార్యక్రమం గురించి చెప్పినప్పుడు .... ట్రస్టు బృందం సభ్యులందరూ దీనిని చాలా మంచి కార్యక్రమమని ప్రోత్సహించారు. అందుకే ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాం. ముఖ్యమంత్రిగా మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాంలో చేస్తున్న కృషి కచ్చితంగా విద్యకు పునరుజ్జీవనం తీసుకొస్తుంది. మీరు చెప్తున్న ప్రతి మాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు. విద్యా రంగంలో మీరు అమలు చేస్తున్న పథకాలు వింటున్నాం.. చూస్తున్నాం. మీరు మధ్యాహ్న భోజనానికి పెట్టిన జగనన్న గోరుముద్ద పేరు చాలా బాగుంది. అమ్మ చేతి గోరు ముద్ద గుర్తుకు వచ్చేలా మంచి పేరు ఎంపిక చేశారు. మీరు అమలు చేస్తున్న అమ్మఒడి, ఆసరా ఇలా అన్నీ మంచి పథకాలు. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అన్నింటి కంటే నాడు–నేడు కార్యక్రమం అందరి కళ్లకూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మంచి, గొప్ప కార్యక్రమం. ఈ దేశం, రాష్ట్రం సురక్షితమైన భవిష్యత్తుకు పిల్లల చదువులు చాలా ముఖ్యం. పేద పిల్లలను చదువుకునే ప్రభుత్వ బడులను.. మీరు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారు. చివరిగా.. నూతనంగా ఏర్పడిన జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయడంపై మీకు ఈ రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్‌రెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్ట్రాబెర్రీలతో ఎన్నో మేళ్లు!
కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలి. ఫోలిక్ యాసిడ్ కోసం గర్భవతులు పాలకూర తినాలి. ఇలా వేర్వేరుగా తినకుండా అన్ని ప్రయోజనాలూ ఒకేదానిలో ఉండాలంటే... స్ట్రాబెర్రీ తినాలి. ఇటీవల స్ట్రాబెర్రీల వల్ల కలిగే అనేక ప్రయోజనాలపై నిర్వహించిన అధ్యయనంలో తెలిసిన అంశాలివి... మంచి చూపు కోసం: వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుంది. ఈ సమస్యను ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ అంటుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీల్లోని విటమిన్–సి బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు. క్యాన్సర్ నివారణ : స్ట్రాబెర్రీల్లోని యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లతో చాలా క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఈ విషయం ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురితమైంది. గర్భవతుల కోసం: గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు... ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్‌ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం వీటి నుంచి దూరంగా ఉండాలి. -
కలుపు నాశని పోషకంగా కొత్త పత్తి వంగడం!
కలుపు మొక్కలను నాశనం చేసేందుకు వాడే మందులు.. పంటకు బలం చేకూరిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క కలుపు సమస్య పోవడమే కాకుండా.. పంట ఏపుగా పెరుగుతుంది. ఈ అద్భుతాన్ని సాధించేందుకు టెక్సస్ ఏ అండ్ ఎం అగ్రిలైఫ్ శాస్త్రవేత్తలు సరికొత్త ఎరువుల వ్యవస్థను సిద్ధం చేశారు. నిర్దుష్ట జన్యువునొకదాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా పత్తి మొక్క ఫాస్పీట్ కలుపు నాశనిని పోషకంగా మార్చుకోగలదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ కీర్తీ రాథోర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కలుపు మొక్కలు రసాయన మందుల విషయంలో నిరోధకత పెంచుకుంటున్నాయని కీర్తి తెలిపారు. మొక్కలు తమ ఎదుగుదలకు ఫాస్పరస్‌ను వాడుకుంటాయని మనకు తెలుసు. ఫాస్పీట్‌ను మాత్రం మొక్కలు నేరుగా వాడుకోలేవు. కాబట్టి ఇది వాటికి విషంగా మారుతుంది. కాబట్టి.. ఫాస్పేట్ను నేరుగా వాడితే పత్తి మొక్కలు నాశనమయ్యే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో పత్తి మొక్కలోని పీటీఎక్స్/డీ అనే జన్యువును చైతన్యవంతం చేస్తే.. అది కాస్తా ఫాస్పీట్‌ను ఫాస్ఫరస్గా మార్చుకుని ఎదుగుదలకు వాడుకుంటాయి. మిగిలిన మొక్కలకు ఆ శక్తి లేకపోవడం వల్ల నాశనమైపోతాయి. ఫాస్పేట్‌తో పోలిస్తే ఫాస్పీట్ నేలలో వేగంగా కరిగిపోయి, కలిసిపోతుందని ఫలితంగా తగినంత ఫాస్పీట్‌ను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఇస్తుందని కీర్తి తెలిపారు. -
సరైన యాజమాన్య పద్ధతులతో శ్రీవరి సాగు లాభదాయకం
ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది ఎరువుల ఖర్చు తక్కువ 40 నుంచి 45 బస్తాల దిగుబడి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చు, నీటితో శ్రీవరి సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులు నిరూపిస్తున్నారు. పీలేరు మండలం మొరవవడ్డిపల్లెకు చెందిన ఏ.చంద్రశేఖర్ (9440959227) ఐదేళ్లుగా శ్రీవరి సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.. - పీలేరు శ్రీవరి సాగు పద్ధతి భూమిలోని సూక్ష్మ జీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగానే పైరుకు కావాల్సిన పోషక పదార్థాలను అందజేస్తుంది. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడినిస్తుంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు నీరు చాలా అవసరమవుతుంది. శ్రీవరి సాగుకు ఇందులో మూడో వంతు నీరు సరిపోతుంది. ఈ పంటలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమైతే ఇందులో రెండు కిలోలు సరిపోతాయి. పైగా వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోయి భూమి లోపల పోషక పదార్థాలను తీసుకుని ఏపుగా పెరుగుతుంది. ఒక్కో మొక్కకు 50 నుంచి 100కు పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు (400 వరకు) బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతి కన్నా ‘శ్రీ’ పద్ధతిలో వరిపంట సాగు చేయడం ద్వారా 20 నుంచి 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 30 నుంచి 32 బస్తాలు (75 కేజీలు) పండిస్తే శ్రీ పద్ధతిలో 40 నుంచి 45 బస్తాలు దిగుబడి వస్తుంది. కలుపు నివారణ.. పొలంలో నీరు నిల్వకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు నాటిన 10 రోజులకోసారి రోటరీ, కోనోవీడర్‌తో నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. పంటకాలం లోపు ఇలాగే మరో రెండుసార్లు రోటరీ- కోనోవీడర్‌తో పనిచేసినపుడు అధిక దిగుబడి వస్తుంది. నీటి యాజమాన్యం.. నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండాలి. నీరు నిల్వకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 5 సెంటీమీటర్లకూ ఒక కాలు వ చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. తద్వారా వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. సేంద్రియ ఎరువులు.. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూసారం పెరగడమేగాక ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తడి దశలో వాడవచ్చు. కానీ ముందు సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. లేత నారు నాటుకోవాలి.. 8 నుంచి 12 రోజుల వయసు గల రెండు ఆకుల నారు మాత్ర మే నాటాలి. తద్వారా వేర్లు బాగా వ్యాపించి 30 నుంచి 100 పిలకలు వేస్తుంది. నారుమడి నుంచి మొక్క ను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. తద్వారా పీకేటపుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురికాకుండా బతుకుతుంది. త్వరగా అధిక సంఖ్యలో పిలకలు వేస్తుంది. మొక్కకు మొక్కకు ఎటుచూసినా 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూడాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు.