భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే నేడు బాలికల ఎదుగుదల బాగుండాలి. అందుకు తగిన పోషకాహారాన్ని అందించడంతో పాటు, అవగాహన కలిగించడం ముఖ్యమని యునిసెఫ్ తన నివేదికల ద్వారా స్పష్టం చేస్తోంది. 2025లో పిల్లల్లో ఎదుగుదల లోపాలను 60 శాతానికి పైగా తగ్గించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం. అందుకు అనుగుణంగా మనం పని చేయడానికి కొన్ని మార్గదర్శకాలు...
ఎదిగే వయసులో అమ్మాయిల ఎముకల బలానికి క్యాల్షియం, రక్తవృద్ధికి ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం అవసరం. ఎదుగుదల ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. చంటిపిల్లల వయసులో, ప్యూబర్టీకి ముందు, ప్యూబర్టీ తర్వాత అంటూ దశలను విభజించుకోవాలి. 21 సంవత్సరాల వరకు ఐరన్,ప్రొటీన్లు, విటమిన్లు గల సమతుల ఆహారం ఉండాలి. అయితే, అమ్మాయిలు సన్నగా ఉండాలనే ఆలోచన ప్యూబర్టీకి ముందు నుంచే ఆలోచన చేస్తున్నారు. చాలా సన్నగా ఉండటమే ఆరోగ్యం, అందం అని కూడా అనుకుంటున్నారు. దీంతో ఆహారాన్ని సరిగా తీసుకోక΄ోవడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటప్పుడు అమ్మాయిలను వారి తల్లిదండ్రులు గైడ్ చేయాలి.
అవగాహన పాఠాలు...
∙వయసుకు తగిన విధంగా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేదానిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టి, పిల్లల ఆలోచనలను ఉన్నతంగా మార్చగలగాలి.
చైల్డ్ ఫుడ్‌కు సంబంధించిన క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి. అవి పిల్లలను ఆకట్టుకునేలా వినోదంగా కూడా పిల్లలకు పరిచయం చేయవచ్చు.
పిల్లల ప్రపంచంలోకి సోషల్ మీడియా అమితంగా వచ్చేసింది. వీడియోల్లో వచ్చే జంక్ ఫుడ్, యాడ్స్, ఇతర ఫుడ్స్‌కు సంబంధించిన సమాచారం కూడా వారిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఇలాంటప్పుడు మంచి–చెడులను ఇంట్లో వారు, స్కూల్‌లో టీచర్లూ చెబుతూ ఉండాలి.
ఆహారంలో ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు, సమృద్ధిగా లభించే నువ్వులు, నట్స్, గుడ్లు, ఆకుకూరలు, బొప్పాయి, పప్పుదినుసులు, చేపలు, మాంసం వంటివి చేర్చాలి.
గ్రోత్ చార్ట్స్ మార్కెట్లో లభిస్తాయి. పుట్టిన నాటి నుంచి వయసును బట్టి ఎత్తుకు తగిన బరువు ఎలా ఉందో చెక్ చేసుకుని ఈ గ్రోత్ చార్ట్‌ను అనుసరిస్తూ వారి ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావచ్చు.
డా.జానకి,
న్యూట్రిషనిస్ట్
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment