బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లేదా రాత్రికి అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇడ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా.
రాగి ఉప్మా
కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్‌లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్‌లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్‌లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).
తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.
ఇలాగే ఓట్స్‌తోగానీ, గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు. ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్ చేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.
Comments
Please login to add a commentAdd a comment