తగ్గినా.. పెరిగినా.. అనారోగ‍్యమే..  | Calorie count off the menu in Hyderabad eateries | Sakshi
Sakshi News home page

తగ్గినా.. పెరిగినా.. అనారోగ‍్యమే.. 

Published Sat, Apr 19 2025 1:26 PM | Last Updated on Sat, Apr 19 2025 1:26 PM

Calorie count off the menu in Hyderabad eateries

మెనూలో కేలరీల సమాచారం అందిస్తున్న రెస్టారెంట్లు 

కేలరీస్‌ కౌంటింగ్‌ తెలిపే యాప్స్‌ వినియోగం  

అవగాహన అవసరం అంటున్న పోషకాహార నిపుణులు

వస్తువుల్ని తూకమేసి అమ్మడం తెలిసిందే.. కానీ కొలత వేసి తినడం ఇప్పుడు సిటీజనులు అలవాటు చేసుకుంటున్నారు. సుషు్టగా తినడానికి బోలెడన్ని అవకాశాలున్నా వాటిని సరిగ్గా జీరి్ణంచుకునేందుకు తగిన శారీరక శ్రమ లేని నేపథ్యంలో నగరవాసుల ‘పొట్ట’తిప్పలు కొత్త దారి పట్టాయి. అవసరాన్ని మించిన ఆహారం ఆరోగ్యానికి చేటు అని గుర్తిస్తూ.. తింటున్న ఆహారాన్ని కొలిచే పనిలో పడ్డారు.  వీరికి నగరంలో చెఫ్‌లు, న్యూట్రిషనిస్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన తరగతులు ఉపకరిస్తున్నాయి.    

ఎంత వరకూ యాప్‌్ట? 
పలు యాప్స్‌ సిటీజనుల ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తింటున్న ఆహారం ద్వారా వారికి అందుతున్న కేలరీలను అవి ఖర్చవుతున్న తీరూ చెబుతున్నాయి. అయితే కొన్ని యాప్స్‌ అమెరికన్‌/విదేశాల ఫుడ్‌ వాల్యూస్‌తో తయారైనవి కాబట్టి మనకి అవి పూర్తిగా కరెక్టా కాదా? అనేది ఖచి్చతంగా చెప్పలేమని న్యూట్రిషనిస్ట్‌లు అంటున్నారు.  

మెనూలోనూ సమాచారం.. 
నగరంలోని పలు స్టార్‌ హోటల్స్, టాప్‌క్లాస్‌ రెస్టారెంట్లు తమ వంటకాల మెనూలోనే కేలరీల సమాచారాన్ని కూడా పొందుపరుస్తున్నాయి. రెస్టారెంట్స్‌లో తినడం అనే అలవాటు నగరాల్లో పెరిగిపోయిన నేపథ్యంలో 2022లో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) రెస్టారెంట్లు తమ మెనూలోని వంటకాలు అందించే కేలరీల గణనను తప్పనిసరిగా పేర్కొనాలని ఆదేశించింది. దాంతో పలు స్టార్‌ హోటల్స్‌ ఈ ఆదేశాలను పాటిస్తుండటం వల్ల నగరవాసులకు తాము తీసుకుంటున్న ఆహారం అందించే కేలరీలపై అవగాహన ఏర్పడుతోంది.  

కేలరీస్‌.. కేర్‌ఫుల్‌ ప్లీజ్‌.. 
అధిక కేలరీల వల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్‌ తదితర వ్యాధులకు దారితీస్తుంది. తగినంత కేలరీలు పొందకపోవడం పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అంటువ్యాధులు, ఆందోళన ఏకాగ్రత లోపం పెంచుతుంది. అధిక కేలరీల భారం లేకుండా కీలకమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, లీన్‌ ప్రొటీన్లు తృణధాన్యాలు వంటి పూర్తి, ప్రాసెస్‌ చేయని ఆహారాలను తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారాన్ని ప్రోత్సహించడానికి చిన్న ప్లేట్లు గిన్నెలను ఉపయోగించడం ద్వారా అతిగా తినడం తగ్గించాలి. 

చక్కెర పానీయాలు, ప్రాసెస్‌ చేసిన స్నాక్స్‌ సాధారణంగా పోషకాలు లేనివిగా, అధిక కేలరీలు కలిగి ఉంటాయి. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్‌ ప్రోటీన్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాలను ఎంచుకోవాలి. ప్రతి భోజనం నిదానంగా చేయాలి.. నెమ్మదిగా నమలాలి, ప్రతి బైట్‌ను ఆస్వాదించడానికి పరధ్యానాన్ని వదలాలి. రెగ్యులర్‌ శారీరక శ్రమ శక్తిని ఖర్చు చేయడం ద్వారా కేలరీలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రతతో వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.

రుచికన్నా మన శరీరానికి కలిగే లాభం మిన్న అనే ఆరోగ్య స్పృహ నగరవాసుల్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన చెఫ్‌ కుమార్‌ 
అంటున్నారు. గతంలో అత్యంత రుచికరమైన వంటలు ఎలా చేయాలో అడిగిన మహిళలు ఇప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం గురించి అడుగుతున్నారని చెప్పారు. తరచూ తాము నిర్వహిస్తున్న స్మార్ట్‌ స్నాకింగ్‌ సెషన్స్‌లో ఒక్కోసారి ఒక్కో దినుసుతో ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో నేర్పుతున్నామని, ఈ క్లాసెస్‌కి ఆదరణ బాగుందన్నారు. 

అవగాహన తరగతులూ షురూ.. 
‘బాదం పప్పులు రోజువారీగా ఆహారంలో తీసుకోవడం మంచిది. కేవలం 4 పప్పులు తీసుకుంటే 29గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 322 మి.గ్రా కాల్షియం, 987 మి.గ్రా పొటాíÙయం, 322 మి.గ్రా కాల్షియం, 16.2 మి.గ్రా పీచు పదార్థాలు, 460 మి.గ్రా సోడియం.. వగైరాలు లభిస్తాయి’.. శ్రీనగర్‌కాలనీలో తన కుమార్తెకు వివరంగా చెబుతున్న మధ్యవయస్కురాలైన సుగుణ ఇటీవల తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోరి్నయా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరవడం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోగలిగారు. ఇదేవిధంగా నగరానికి చెందిన మరి కొందరు గృహిణులు సైతం పోషకాహారంపై అవగాహన పెంచుకుంటున్నారు.  

ఆచి తూచి.. ఆలోచించి..
ఆహారం మీద సిటిజనుల్లో అవగాహన పెరగడం మంచి పరిణామమే. కానీ ఇంకా చాలా విషయాల్లో సరిపడా లేదనే చెప్పాలి. 
ఉదాహరణకు టీలు, కాఫీలు తాగితే ఏమీ కాదనుకుంటారు. కానీ టీ లేదా కాఫీ కూడా రోజుకి 2 కప్పులు మించకూడదు. దానిలో ఉండే పంచదార, పాలు కేలరీలను పెద్ద సంఖ్యలోనే జమ చేస్తాయి. అలాగే ఆల్కహాల్‌ తాగితే ద్రవమే కదా కేలరీలు రావనుకుంటారు. కానీ 1ఎం.ఎల్‌

ఆల్కహాల్‌తో 7 కేలరీలు వస్తాయి. దానికి తోడు మంచింగ్‌ పేరుతో స్నాక్స్‌ అవీ జత చేస్తే మరింత హాని కలుగుతుంది. ఒకటే ఆహార పదార్థం ఇంట్లో వండిన దానికి బయట కొన్న దానికి కేలరీల్లో చాలా తేడా ఉంటుంది. బయట వండేవారు రుచి కోసం కలిపే నూనెలు, ఉప్పులు, దినుసుల వల్ల ఆ తేడా వస్తుంది. కూల్‌ డ్రింక్స్‌ కూడా అధికంగా కేలరీలను అందిస్తాయి. సగటున ఒక వ్యక్తి 1800 నుంచి 2200 వరకూ కేలరీలను తీసుకోవచ్చు. అయితే శారీరక శ్రమ, చేసే పని బట్టి ఇందులో కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. జాగ్రత్త పడినా బరువు పెరుగుతున్నామంటే మనం పాటిస్తున్న, అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లలో లోపం ఉన్నట్లే భావించి తగిన వైద్య సలహా తీసుకోవాలి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement