Menu
-
గోల్డెన్ గ్లోబ్స్ 2025 వేడుక: 24 క్యారెట్ల బంగారంతో వంటలా..!
82వ గోల్డెన్ గ్లోబ్స్(Golden Globes) ఈ నెల జనవరి 6, 2025న లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో అట్టహాసంగా జరిగింది. ఇది స్టార్ స్టడ్స్ అవార్డుల ప్రధానోత్సవం. ఏదైన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) గతేడాది సినిమా, టెలివిజన్లలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో వడ్డించే విందు కూడా అత్యంత గ్రాండ్‌గానే ఉంటుంది. సాదాసీదా చెఫ్‌లు తయారు చేయరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ మెనూలో ఉండే వెరైటీ వంటకాలెంటో చూద్దామా..!.ఈ వేడుకలో వంటకాలను తయారు చేసేది పాక ప్రపంచంలో ప్రముఖ లెజెండ్ అయిన నోబు మత్సుహిసా(Chef Nobu Matsuhisa). ఆయన సాంప్రదాయ జపనీస్ రుచులకు వివిధ పద్ధతుల మిళితం చేసి అందించడంలో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రెస్టారెంట్లో నోబు తన పాక నైపుణ్యాన్ని రుచి చూపించారు ఆహారప్రియులకు. ఇలాటి లగ్జరీయస్ ఈవెంట్‌లోని మెనూ బాధ్యతను చెఫ్ నోబు తీసుకోవడం రెండోసారి. ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2025లోని అతిథులకు చెఫ్ నోబు ..ఎల్లోటైల్ జలపెనో, సిగ్నేచర్ మాట్సుహిసా డ్రెస్సింగ్‌తో సాషిమి సలాడ్, మిసో బ్లాక్ కాడ్, సీవీడ్ టాకోస్ విత్ కేవియర్, సాల్మన్, ట్యూనా, తాయ్ వంటి వాటితో రకరకాల డిష్‌లు తయారు చేశారు. ఈ రుచికరమైన పదార్థాలన్నింటిలో అత్యంత లగ్జరీయస్ రెసిపీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ మెనూలో హైలెట్‌గా గోల్డ్ స్టాండర్డ్ రోల్(Gold Standard Roll) నిలిచింది. దీన్ని ఈ గోల్డెన్ గ్లోబ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారట చెఫ్ నోబు. ఈ అద్భుతమైన రోల్‌ని కింగ్ క్రాబ్, సాల్మన్ ఉపయోగించి తయారు చేశారట. అలాగే 24-క్యారెట్ బంగారు రేకులు(24-karat gold ), కేవియర్తో అలంకరించి సర్వ్ చేశామని తెలిపారు చెఫ్ నోబు. అంతేకాదండోయ్ ఈ వేడుకలో ప్రీమియం షాంపైన్, వైన్‌ను హాయిగా సిప్ చేయొచ్చట. View this post on Instagram A post shared by Golden Globes (@goldenglobes) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
నెలలో ఆరుసార్లు నాన్‌వెజ్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా డైట్ చార్జీలను ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలకు తగినట్లుగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేలా సరికొత్త మెనూ రూపొందించింది. ప్రతి నెలను నాలుగు వారాలుగా విభజిస్తూ... ఒక్కో వారానికి ఓ విధంగా మెనూను తయారు చేసింది. అదేవిధంగా రోజువారీగా ఇవ్వాల్సిన ఆహారపదార్థాలపైనా మెనూలో స్పష్టత ఇచ్చిoది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, స్వల్పకాల విరామంలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించే విధంగా మెనూ పొందుపర్చింది. నెలలలో ఆరుసార్లు నాన్‌వెజ్ వడ్డిస్తారు. ప్రతి నెలా మొదటి బుధవారం, నాలుగో బుధవారం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం మాంసాహారాన్ని వడ్డిస్తారు. ఇక ప్రతి రెండో బుధవారం, నాల్గో బుధవారం మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ బిర్యానీ ఇస్తారు. మాంసాహారం లేని రోజుల్లో నిత్యం ఉడికించిన గుడ్డు లేదా గుడ్డు కూరను అందించనున్నారు. శాకాహారులకు మాత్రం మాంసాహారం ఉన్న రోజుల్లో మెనూలో కాస్త మార్పులు చేసి వారికి మీల్మేకర్ ఫ్రై లేదా కర్రీ అందిస్తారు. నూతన మెనూను వసతిగృహాలు, గురుకులాల్లోని డైనింగ్ హాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం సంక్షేమ శాఖలను ఆదేశించింది. నిర్దేశించిన ప్రకారం భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త మెనూను సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో శనివారం నుంచే అమలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా కామన్డైట్ను ప్రారంభించడంతోపాటు ఆయా హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. 40 శాతం పెరిగిన డైట్ చార్జీలు సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చివరిసారిగా డైట్ చార్జీలు 2017లో అప్పటి ప్రభుత్వం పెంచింది. కోవిడ్–19 తర్వాత మారిన పరిస్థితులు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సంక్షేమ విద్యార్థులకు ఆహారం అందించడంలో నాణ్యత తగ్గుతూ వచ్చిoది. ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు. కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా డైట్ చార్జీలను 40శాతం పెంచారు. అలాగే, కాస్మెటిక్ చార్జీలనూ పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.సంక్షేమ వసతి గృహాల్లో 3 నుంచి 7వ తరగతి వరకున్న విద్యార్థులు : 2,77,877 8 నుంచి 10వ తరగతి వరకున్న విద్యార్థులు: 2,59,328 ఇంటర్ నుంచి పీజీ వరకున్న విద్యార్థులు: 2,28,500 -
అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!
బాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ జంట అలియా రణబీర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఏ ఈవెంట్లో సందడి చేసిన ఫోటోగ్రాఫర్లకు తమ కెమెరాలని క్లిక్‌మనిపించకుండా ఉండరు. అలాగే ఆ వేడుకలు కూడా మరింత అందంగా కోలహాలంగా మారిపోతుంది. అంతలా ఈ జంట వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ..కొత్త సందడిని తీసుకొస్తారు. వీరిద్దరూ తమ గ్లామర్, అభినయంతో వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే డైట్ పరంగా ఇద్దరు చాలా స్ట్రిట్. ఇరువురు ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈ అందమైన జంట ఇష్టంగా వంటకాల గురించి వారి వ్యక్తిగత చెఫ్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ జంట వ్యక్తిగత చెప్ సూర్యన్ష్ సింగ్ కున్వర్ అలియా-రణబీర్‌లు ఇష్టమైన వంటకాల గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వీడియోలో వాళ్లు కూడా మనలాగానే దోస, ఆమ్లెట్, గుడ్డు అప్పం, హమ్ముస్, మీట్ బాల్స్, స్పెఘెట్టి, ఫ్రైడ్ రైస్, సిన్నమోన్ టోస్ట్, కొబ్బరి చట్నీ, తదితరాలనే ఇష్టంగా తింటారని వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీరిద్దరు రుచికరంగా ఉండే పోషకాహారానికి ప్రాధ్యాన్యత ఇస్తారని తెలిపాడు. అంతేగాదు అలియా, రణబీర్ గ్రిల్డ్ సాల్మన్, డ్రైఫూట్స్‌తో నింపిన సూప్, బ్లాక్ బీన్ సాస్ తోకూడిన టోపు, టోర్టెల్లిని పాస్తా, కలమారి, కుడుములు, ఖీర్, కస్టర్డ్ వంటి ఆకర్ణణీయమెన డెజర్ట్ ఇష్టంగా తింటారని చెప్పారు. అంతేగాదు గత కొద్ది రోజులగా తాను వాళ్ల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తున్నట్లు తెలిపాడు. ఈ అందమైన జంట కోసం వడంటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వంటకాలను ఆహారప్రియులు కూడా తమ మెనూలో చేర్చుకోవచ్చనేలా ఉన్నాయి ఆ రెసిపీలు. కాగా, అలియా భట్ రణబీర్ కపూర్లు తమ డైట్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటారు. షూటింగ్, సినిమాల మధ్య కూడా, రణబీర్ తన డైట్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. View this post on Instagram A post shared by Suryansh Singh Kanwar (@suryansh.singh.kanwar) (చదవండి: స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా పీహెచ్డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!) -
బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనే పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుల్తాన్ హస్సనల్ బోల్కివయా మోదీకి ఘటన స్వాగతం పలికారు. ఇరువురి మద్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. రెండు రోజులు పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశ సుల్తాన్ బోల్కియా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. సుల్తాన్ తన నివాసం ఇస్తానా నూరుల్ ఇమాన్‌లో ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మోదీకి అందించిన లంచ్ మెనూలో.. మన భారతీయ ప్రసిద్ధ వంటకాల తోపాటు మన జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను ఆకర్షణీయంగా తయారు చేయడం విశేషం. మొదటి కోర్సులో అవోకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పికిల్ వడ్డించారు. ఆ తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్ సూప్ అందించారు. మూడవ కోర్సులో వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్ పురీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పీస్ పూరీలో భారత త్రివర్ణ పతకాన్ని గుర్తుకు తెచ్చేలా ఆకర్షణీయమైన రంగులతో సర్వ్ చేశారు. Quiche, Truffle at the Istana Nurual Iman 🙏🌸🙏 pic.twitter.com/noCRlMJKCn— India in Brunei (@HCIBrunei) September 4, 2024అంతేగాదు ఈ మెనూలో జీరా రైస్, చన్నా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ వంటి రెసిపీలు కూడా ఉన్నాయి. ఈ మెనూ భారతీయ ప్రసిద్ధ స్వీట్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. అవి వరుసగా.. మామిడితో చేసిన పేడా, మోతీచూర్ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితరాలు. ఈ వంటకాలన్నీ అందమైన మెరూన్ కలర్, గోల్డ్ డిజైన్‌తో ఉన్న ప్లేట్లలో అందించారు. కాగా ఇరు దేశాల దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల బ్రూనే పర్యటన జరిగింది. అదీగాక మోదీకి ఈ పర్యటన తొలిసారి కావడం విశేషం.Official Luncheon by His Majesty in honour of Prime Minister Shri Narendra Modi Ji in Brunei Darussalam 🇮🇳 🇧🇳 🙏@narendramodi @PMOIndia @borneo_bulletin @MediaPermata pic.twitter.com/A0o6UwX5zf— India in Brunei (@HCIBrunei) September 4, 2024 (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం. గరడు చాట్ అంటే..?కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్‌లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్‌లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్లో మరింత గ్రాండ్‌గా వివాహ మెనూ ఉండొచ్చు.(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్..!) -
ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!
క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గొనాలంటే మాత్రం ఆటగాళ్లు పలు సమస్యలు ఎదర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం తోపాటు ఫుడ్‌కి అలవాటు పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరూ త్వరగా ఆ పరిస్థితులకు సెట్ అయినా మరికొందరు ఆటగాళ్లు నానాపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన భారతీయ వంటకాలకు చోటు ఉండదు. అలాంటిది ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో మాత్రం భారతీయ వంటకాలతో కూడిన మెను పెట్టనున్నారు. చక్కగా పప్పు అన్నం, కోడి కూర, గోబీ, ఆలు వంటి రుచికరమైన వంటకాలను క్రీడకారులకు పెట్టనన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఈ ఫుడ్ సమస్యను ఎన్నేళ్లుగానో ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు చెక్ పెడుతూ..ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ అంగీకరించడం విశేషం. ఈ ఏడాది ఒలింపిక్స్ పారిస్‌లో వేదికగా జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ఇక ఫుడ్ సమస్య ఉండదు. చక్కగా అథ్లెట్ల గ్రామంలో మన క్రీడాకారులకు భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంచక్కా మన ఆటగాళ్లు పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాదించవచ్చు. అంతేగాదు భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహార మెనుకి సంబంధించిన లిస్ట్‌ని ఓలింపిక్స్ నిర్వాహకులకు పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. ఇంతవరకు దక్షిణాసియా వంటకాలే.. భారత వంటకాలతో కూడిన మెనూ ఉండాలని చేసిన ప్రతిపాదనలకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెఫ్ శివ తెలిపారు. ఇక ఈ జాబితాను పోషకాహార నిపుణుడి సూచనల మేరకే రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ఆహారం విషయంలోనే పెద్ద సమస్య ఉందన్నారు చెప్పాలంటే..ఒలింపిక్స్‌లో క్రీడాకారుల భోజన మెనులో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటాయి. కేవలం మనవాళ్లకి మినహా. అందువల్లే మన భారతీయ అథ్లెట్లకు దక్షిణాసియా వంటకాలు ఉండాలని పట్టుబట్టడం జరిందన్నారు శివ. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ మండలి అంగీకరించిందని చెప్పారు. కాగా, ఈ అథ్లెట్ల గ్రామంలోనే డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు చికిత్స అందించింది దిన్‌షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
అంబానీ ఇంట పెళ్లి : స్పెషల్ చెఫ్‌లు, ఆహా..అనిపించే విందు!
బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు, వ్యాపారేత్త అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంటే ఆ సందడి వేరుంటుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట..ఇలా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ పెళ్లి సన్నాహాలు, వధూవరుల దుస్తులు, అతిధులు, ముఖ్యంగా ఎలాంటి విందు భోజనం అందించబోతున్నారనేది చర్చనీయాంశం. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే వంటకాల విషయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను రిచ్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట. దేశం నలుమూలలనుంచి సిద్ధహస్తులైన, నలభీముల్లాంటి వంటగాళ్లను నియమించారట. దాదాపు 25 -30 మంది బెస్ట్ షెఫ్‌ల ఆధ్వర్యంలో ఒక్కో టీమ్ ఒక్కో రకంగా విందుభోజనం అందించేందుకు కసరత్తు చేస్తున్నారట. ఆసియన్, పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ వంటకాలు రడీ కాబోతున్నాయి. బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాలు, లంచ్ కోసం 250 రకాలు, రాత్రి భోజనం కోసం మరో 250 రకాల వంటల్ని అతిథులకు వడ్డించ బోతున్నారు. అంతేకాదు మూడు రోజుల పాటు సాగే వేడుకల్లో ఏ ఒక్క వంటకం రిపీట్ కాకుండా ఆహా అనిపించేలా మెనూ సిద్ధం చేశారట. అలాగే శాకాహార వంటకాలు, అర్ధరాత్రి స్నాక్స్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లున్నాయట. కాగా అనంత్ అంబానీ, ప్రియురాలురాధికా మర్చంట్‌తో ఏడడుగులు వేసేందుకు జులై 12వ తేదీని ముహూర్తం దాదాపు ఖాయమైనట్టే. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1,2,3 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేడుకలకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, మెలిండా గేట్స్‌తో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందినట్టు సమాచారం. -
‘టైటానిక్’ ఆఖరి డిన్నర్ మెనూ వేలం.. ఎంత పలికిందో తెలుసా?
Titanic Dinner Menu: టైటానిక్ ఓడ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. సుమారు 110 ఏళ్ల క్రితం మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిందీ భారీ ఓడ. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. ఈ ఓడ ప్రమాద ఉదంతం గురించి పాతికేళ్ల క్రితమే హాలీవుడ్లో ఓ సినిమా సైతం వచ్చింది. అది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలిసిందే. ఆఖరి విందు టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూను ఇంగ్లండ్‌లో శనివారం (నవంబర్11) వేలం వేయగా 83,000 పౌండ్లు (రూ. 84.5 లక్షలు) పలికినట్లు యూకేకి చెందిన వార్తాపత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. టైటానిక్ ఓడలో ఫస్ట్-క్లాస్ ప్రయాణికుల కోసం తయారు చేసిన ఆఖరి విందు ఇది. ఈ ఓడ తన తొలి అట్లాంటిక్ సముద్రయానంలో 1912 ఏప్రిల్ 14న మంచుకొండను ఢీకొట్టి మునిగిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు నాటిది. ఈ చారిత్రక మెనూ ఐర్లాండ్‌లోని క్వీన్స్టౌన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ మరుసటి రోజు ప్రయాణికులకు అందించిన వంటకాల గురించి తెలియజేస్తోంది. విల్ట్‌షైర్‌కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ అనే సంస్థ ఈ మెనూను వేలం వేసింది. రకరకాల వంటకాలు వేలానికి వచ్చిన టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూలో వివిధ దేశాలకు చెందిన రకరకాల వంటకాలు ఉన్నాయి. ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్‌క్రీమ్ వంటి డెసర్ట్లతోపాటు ఆయిస్టర్లు, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు, చికెన్ వంటి నాన్‌వెజ్ రుచులతో పాటు నోరూరించే వెజిటేరియన్ వంటరాలు ఇందులో ఉన్నాయి. ఈ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
గాజా గాయాలు.. పార్లమెంట్ మెనూ నుంచి వాటి తొలగింపు!
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒకవైపు భారీ ప్రాణ నష్టం.. మరోవైపు భారీ మానవతా సంక్షోభం దిశగా ముందుకెళ్తోంది. గాజాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో పాశ్చాత్య, మిడిల్ ఈస్ట్ దేశాల నడుమ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తుర్కియే(పూర్వపు టర్కీ) ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ మెనూ నుంచి కోకాకోలా, నెస్లే ఉత్పత్తులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌కు ఆ కంపెనీలు మద్దతు ప్రకటించాయని, అందుకే వాటిని తమ పార్లమెంట్ క్యాంటీన్ నుంచి తొలగిస్తున్నట్లు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ప్రాంగణంలోని రెస్టారెంట్లలో, కఫేటేరియాల్లో, టీ హౌజ్‌లలో ఇకపై ఆయా ఉత్పత్తులను అమ్మకూడదని పార్లమెంట్ స్పీకర్ నుమాన్ కుర్తుల్మస్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. మరోవైపు ఈ పరిణామంపై ఆ కంపెనీలు స్పందించాల్సి ఉంది. గాజాకు సంఘీభావంగా.. తమ దేశ ప్రజల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ఆ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు గాజా దాడుల నేపథ్యంగా.. సోషల్ మీడియాలోనూ ఇజ్రాయెల్ ఉత్పత్తులను, పాశ్చాత్య దేశాల కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో టర్కీ-ఇజ్రాయెల్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్నాయి. -
పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? వెజ్, నాన్ వెజ్ ధరలు ఎంత?
నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇకపై ఇక్కడే పార్లమెంట్ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. అయితే పార్లమెంటు గురించి మాట్లాడినప్పుడల్లా అక్కడి క్యాంటీన్ గురించిన ప్రస్తావన వస్తుంది. పార్లమెంటు క్యాంటీన్లో అతి చౌక ధరలకు లభించే ఆహార పదార్థాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంటుంది. పార్లమెంటు క్యాంటీన్లో ఏ ఆహారం ఎంత ధరకు దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2021వ సంవత్సరంలో పార్లమెంట్ క్యాంటీన్ రేట్ లిస్ట్‌లో మార్పులు చేశారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో క్యాంటీన్ రేట్లను సవరించింది. దీంతో పలు ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. ఉదాహరణకు గతంలో చపాతీ రేటు రూ.2 ఉండగా, తర్వాత దానిని రూ.3కి పెంచారు. అలాగే చికెన్, మటన్ వంటకాల రేట్లు కూడా పెంచారు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి. ఆలూ బోండా రూ.10, చపాతీ రూ.3, పెరుగు రూ.10, దోశ రూ.30, లెమన్ రైస్ రూ.30, మటన్ బిర్యానీ రూ.150, మటన్ కర్రీ రూ.125, ఆమ్లెట్ రూ.20, ఖీర్ రూ.30, ఉప్మా రూ.25, సూప్ రూ.25, సమోసా రూ.10, కచోరీ రూ. 15, పనీర్ పకోడా రూ. 50కు దొరుకుతుంది. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
2వ రోజు జైల్లో... చంద్రబాబు ఫుడ్ మెనూ ఇదే..!
-
జీ20లో అదిరిపోయే వంటకాలు ఇవే..ఏకంగా 500కిపైగా..
జీ20 సదస్సు కోసం దేశాధినేతలంతా ఢిల్లీకి తరలి వచ్చారు. సదస్సు కూడా జయపద్రంగా జరిగింది కూడా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన నాయకులకు అదిరిపోయే ఆతిధ్యం ఇచ్చింది భారత్. సెప్టెంబర్ 9న మల్టీ ఫంకన్ హాల్ ప్రగతి మైదాన్‌లో ఆల్ వెజిటేరియన్ మెనుతో కూడిన వివిధ వైరైటితో ఆహో అనిపించేలా విందు ఇచ్చింది. ఈ ఈవెంట్లో కీలకమైన వంటకంగా మిల్లెట్ ఉంది. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి తన 75వ సెషన్లో అంతర్జాతీయి మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన ఫలితంగా వాటితో తయారు చేసిన వంటకాలు ప్రధాన భాగంగా ఉన్నాయి. ఈ మెనూలో మాంసాహారం కూడా ఉంటుంది. ప్రముఖ చెఫ్‌లు సుమారు 120 మంది తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని వెలికితీసి మరీ అతిరథమహారంథులందరికి మన భారతీయ వంటకాలను రుచి చూపించారు. ఇక ఈ మెనూలో ఉండే వంటకాలు.. గుడ్ ఔర్ అమరాంత్ కే లడ్డూ, మామిడి ట్రఫుల్, కాజు పిస్తా రోల్, రాగి బాదం పిన్ని, బలజ్రే కి బర్ఫీ, రాగి పనియారం, కాకుమ్ మాత్రి (చిడియా దానా), నిగెల్లా కన్నోలి, బజ్రే కి ఖీర్, మేక చీజ్ రావియోలీ, భాపా డోయి, కాజు మటర్ మఖానా, లాంబ్ అండ్ మిల్లెట్ సూప్, ముర్గ్-బాదం-అమరాంత్ కోర్మా, మిల్లెట్ నర్గీసి కోఫ్తా, ఆరెంజ్-క్వినోవా-మిల్లెట్ ఖీర్, అవోకాడో సలాడ్ తదితర రకాల వంటకాలతో అత్యంత వైభోవోపేతంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ వంటకాలను పర్యవేక్షించే వారిలో తాజ్ ప్యాలెస్‌కు చెందిన చెఫ్ సురేంద్ర నేగి కూడా ఉన్నారు. గత మూడు నెలలుగా వంటకాలను ప్రతీరోజు పరీక్షించడం తోపాటు మెనులో దేశం మొత్తం కవర్ అయ్యేలా ఆయా ప్రాంతాల వివిధ రుచులను అందించేందుకు ప్రయత్నం చేసినట్లు వివరించారు. కాగా, భారతదేశం తమకు అపూర్వమైన ఆతిథ్యం ఇచ్చిందని దేశధినేతలు ప్రశంసించారు. ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అంటూ భారత్ ఇస్తున్న సందేశాన్ని వారంతా ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమను ఒకే వేదికపై తీసుకొచ్చిన మోదీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక మోదీ కూడా జీ20 సదస్సు ముగిసినట్లు పేర్కొన్నారు. (చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..) -
జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో!
జై సియా రాం భారత మూలాలున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు శుక్రవారం ఉదయం పాలం విమానాశ్రయంలో.. కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే జై సియా రాం(జై శ్రీరాం) అంటూ స్వాగతం పలికారు. వారికి మంత్రి చౌబే రుద్రాక్షను, భగవద్గీత, హనుమాన్ చాలీసా ప్రతులను కానుకలుగా అందజేశారు. వ్యాపారవేత్తలకు ఆహ్వానాల్లేవ్.. జీ20 ప్రత్యేక విందు కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు వెళ్లాయన్న వార్తలపై కేంద్రం స్పందించింది. జీ20 స్పెషల్ డిన్నర్‌కు రావాలంటూ వ్యాపారవేత్తలను ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. శనివారం జరిగే విందుకు బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి 500 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరవనున్నారంటూ వస్తున్న వార్తలను తప్పుదోవపట్టించేవిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్యవేత్తలెవరినీ ఆహ్వానించలేదని తెలిపింది. యూపీఐని పరిచయం చేసేందుకు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంపై జీ20 ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ ప్రతినిధులు ఢిల్లీలో ఉండగా జరిపే కొనుగోళ్లకు గాను యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లింపులపై ఆసక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంది. దేశీయంగా రూపకల్పన చేసిన ఈ విధానంలో చెల్లింపులు ఎంత సులువో వారికి తెలియజేయడమే ఉద్దేశం. ఇందులోభాగంగా సుమారు వెయ్యి మంది విదేశీ ప్రతినిధుల ఫోన్ వ్యాలెట్లలో రూ.500 నుంచి రూ.1000 వరకు బ్యాలెన్స్ జమ చేయనుంది. ఇందుకోసం రూ.10 లక్షల వరకు ప్రత్యేకించింది. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం జీ20 సమావేశాలు జరిగే ప్రగతి మైదాన్‌కు సమీపంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అదనంగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నేతలు పాల్గొంటున్న కార్యక్రమం అయినందున ఈ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకు ఇది నిర్విరామంగా వాతావరణాన్ని పరిశీలిస్తుంటుంది. ఐఎండీకి చెందిన వెబ్‌పేజీ mausam.imd.gov.in/g20 ద్వారా వాతావరణ సూచనల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చదవండి: G20 Summit: బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు స్ట్రీట్ ఫుడ్, మిల్లెట్స్‌తో ప్రత్యేక మెనూ భారత్‌లో ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంటకాలతో ప్రత్యేకంగా మెనూ సిద్ధమైంది. భారతీయ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్‌తోపాటు మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలకు ఇందులో స్థానం కల్పించారు. ఇంకా గులాబ్ జామ్, రసమలై, జిలేబీ వంటి స్వీట్లు కూడా అతిథులకు వడ్డిస్తారు. వడ్డించే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం రూపొందించారు. మెనూలో ఫలానావి ఉంటాయని అధికారులెవరూ స్పష్టంగా చెప్పనప్పటికీ, భారతీయ వంటకాల్లో వైవిధ్యాన్ని చాటేలా మెనూ ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేక టేబుల్ వేర్ ప్రపంచనేతలకు ఇచ్చే విందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారికి మరిచిపోలేని ఆతిథ్య అనుభూతి కల్పించేందుకు ఆహారపదార్థాలను వెండి, బంగారు పూత కలిగిన పాత్రల్లో వడ్డిస్తారు. విదేశీ నేతలు వివిధ హోటళ్లలో బస చేసినప్పుడు, రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యే సమయంలో ఉపయోగించేందుకు 200 మంది కళాకారులతో 15 వేల వరకు సామగ్రిని తయారు చేయించారు. ఇందులో స్టీల్, ఇత్తడి లేదా రెండింటి మిశ్రమంతో తయారైన టేబుల్ సామగ్రికి వెండిపూత వేయించారు. విందు సమయంలో అతిథులకు బంగారు పూత వేసిన గ్లాస్‌లలో డ్రింక్స్‌ను సర్వ్ చేస్తారు. ప్లేట్లు, స్పూన్లు తదితర వస్తువులను భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసిలతోపాటు కర్ణాటకలో వీటిని తయారు చేయించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం జీ20 దృష్ట్యా ఈ నెల 8, 9, 10వ తేదీల్లో న్యూఢిల్లీలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. క్లౌడ్ కిచెన్, ఫుడ్ డెలివరీలు, అమెజాన్ డెలివరీ వంటి వాణిజ్య సేవలపై ఎన్డీఎంసీ ప్రాంతంలో నిషేధం విధిస్తున్నట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ చెప్పారు. ఈ ప్రాంతంలో లాక్డౌన్ విధిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదన్నారు. బియెన్‌వెన్యూ నుంచి బియెన్‌వెనిడో దాకా.. జీ20 శిఖరాగ్రానికి హాజరయ్యే జీ20 ప్రతినిధులు, విదేశీ అతిథులకు వారివారి భాషల్లోనే స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జీ20 ఇతివృత్తం ‘వసుధైక కుటుంబకమ్’ను జీ20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల భాషల్లో ముద్రించారు. దీంతోపాటు ఫ్రెంచిలో బియెన్‌వెన్యూ, టర్కిష్‌లో హాస్గెల్డినిజ్, జర్మన్లో విల్కోమెన్, ఇండోనేసియన్‌లో సెలామట్ దతంగ్, స్పానిష్‌లో బియెన్‌వెనిడో అంటూ స్వాగతాన్ని రష్యన్, మాండరిన్ భాషల్లో సైతం ముద్రించారు. దేశాల ప్రతినిధుల కోసం భారత్ మండపం కాంప్లెక్స్ 14వ నంబర్ హాలు ప్రవేశద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఖర్గేకు రాని విందు పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: జీ 20సదస్సులో భాగంగా శనివారం రాత్రి అతిథులకు ఇస్తున్న విందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పిలుపు రాలేదు. ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవ్వనున్న ఈ విందుకు ఖర్గేకు పిలుపు రాలేదని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. మాజీ ప్రధానులు దేవెగౌడ. మన్మోహన్ సింగ్. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఆహ్వానితుల్లో ఉన్నారు. అయితే కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు ఆహా్వనం పంపకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎంలు నితీశ్‌కుమార్ , మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, హేమంత్ సోరెన్‌లు విందుకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణంగా విందుకు హాజరుకావడంలేదని మాజీ ప్రధాని దేవెగౌడ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా అనారోగ్య కారణాలతో విందుకు హాజరుకావడం లేదని సమాచారం. నేతల బస సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలందరికీ సెంట్రల్ ఢిల్లీలోని స్టార్‌హోటళ్లు, గురుగ్రామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సుమారు 35 వేల గదులు బుక్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐటీసీ మౌర్య 14వ అంతస్తులో, చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్‌లో చైనా ప్రధాని లీ క్వియాంగ్, బ్రెజిల్ ప్రతినిధులు, షాంగ్రీలాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్, క్లారిడ్జ్ హోటల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇంపీరియర్ హోటల్లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంటొనీ అల్బనీస్, ఒబెరాయ్ హోటల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, గురుగ్రామ్‌లోని ఒబెరాయ్ హోటల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, జేడబ్ల్యూ మారియట్, హయత్ రెసిడెన్సీల్లో ఇటలీ ప్రతినిధులు, లీ మెరిడియన్‌లో నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, లలిత్ హోటల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, గురుగ్రామ్ లీలీ హోటల్లో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బృందం బస చేయనుంది. -
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్‌కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్‌లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్‌కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్‌లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్‌లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్‌లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్‌ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్‌ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ దాని 'ఈట్స్ ఆన్-బోర్డ్' క్యాటరింగ్ సర్వీస్‌లో మార్పులు చేసింది. ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన మెనూ నుంచి ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ప్రత్యేక మెనూను తమ అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రవేశపెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో మొదలుకొని స్ట్రీట్ ఫుడ్స్ వరకూ సరికొత్త ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. “ఇండియా ప్రముఖ క్యారియర్‌గా మా కస్టమర్ల కోసం సేవలను మెరుగుపరిచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. కస్టమర్లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్టనర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మా కొత్త 6ఈ ఈట్స్ మెనూ కొత్త ఆప్షన్లను అందిస్తుంది” అని ఇండిగో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ అన్నారు. ఇదీ చదవండి: పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా? -
మెనూ మారినా.. భోజనం మారలే..!
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ మార్చినప్పటికీ పాఠశాలల్లో మాత్రం తీరు మారలేదు. వారికి నాసిరకం భోజనమే దిక్కవుతుంది. దీంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా రు. గతంలో పలుమార్లు చిన్నారులు ఆస్పత్రి పా లైన ఘటనలు ఉన్నా మేమింతే.. మా తీరు మారద న్న విధంగా అధికారులు, కొంత మంది ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల కు అవస్థలు తప్పడం లేదు. ఉడకని అన్నం, నీళ్లప ప్పు పెడుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణంగా తెలుస్తోంది.సంఘటనలు జరిగినప్పుడు మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్పా శాశ్వ త పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి. గుడ్డు మింగేస్తున్నారు.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారానికి మూడు రోజులు కోడిగుడ్ల ను అందజేస్తోంది. ఇందు కోసం ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పున కేటాయిస్తుంది. ప్రాథమిక విద్యార్థులకు కుగింగ్ కాస్ట్ కోసం రూ.5.45, 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.8.17లతో పాటు 9,10 త రగతుల విద్యార్థుల కోసం రూ.10.67లను కేటాయిస్తుంది. అయితే చాలా పాఠశాలల్లో వారానికి ఒక రోజు మాత్రమే గుడ్డు పెడుతున్నారు. మిగతా రోజుల్లో మామూలు భోజనం అందిస్తున్నారు. పర్యవేక్షణ కరువు.. అధికారుల పర్యవేక్ష లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, కోడిగుడ్డుతో భోజనం వండి పెట్టాల్సి ఉండగా, చాలా పాఠశాలల్లో నాసిరకం భోజనమే అందిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేస్తుండగా, మరికొంత మంది టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఎంఈవోలు రోజుకు మూడు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితం కావడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం కేవలం పప్పు, అన్నం మాత్రమే వడ్డించారు. కోడిగుడ్డు ఇవ్వలేదు. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో భోజనం పెట్టాల్సి ఉండగా, కేవలం నీళ్ల పప్పే దిక్కయ్యింది. నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకులంలో గత మార్చిలో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. ఇదివరకు ఆదిలాబాద్ పట్టణంలోని రూరల్ కేజీబీవీలో, అలాగే జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న భీంపూర్ కేజీబీవీలో, నేరడిగొండ కేజీబీవీలో, తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలల్లో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయినా జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం భోజనమే దిక్కవుతుంది. మెనూ ఇది.. వారం పెట్టాల్సిన భోజనం, సోమ కిచిడీ, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, మంగళ అన్నం, పప్పు, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, బుధ అన్నం, ఆకుకూరలతో పప్పు, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, గురు వెజిటెబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, శుక్ర అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, శని అన్నం, ఆకుకూరలు, వెజిటెబుల్ కర్రి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం పెట్టాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు మఽ ద్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. వంట గదులు శుభ్రంగా ఉంచాలి. వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందించాలి. – ప్రణీత, డీఈవో -
బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి..
జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది. బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు. అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు! -
State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైట్ హౌస్‌లో పసందైన విందు ఇచ్చారు బైడెన్ దంపతులు. మోదీ శాకాహారీ కావడంతో వైట్ హౌస్ చెఫ్ నీనా కర్టిస్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీంతో మోదీ కోసం తొలిసారిగా వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును ఏర్పాటు చేశారు. విందులో మోదీకి ఇష్టమైన వంటలకాలకు అమెరికన్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. మోదీ వెజెటేరియన్ కావడంతో ఆయనకు వడ్డించే మెనూపై అందరి దృష్టి పడింది. ఫుడ్ మెనూలో ఏమేం ఐటెమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మోదీకి ఇచ్చిన డిన్నర్ మెనూలో ప్రత్యేకమైంది మిల్లెట్స్. తృణధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న మోదీ కోసం ప్రత్యేకంగా మేరినేటెడ్ మిల్లెట్స్‌ను డిన్నర్ మెనూలో చేర్చారు. ఫస్ట్కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్ట్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, టాంగీ అవకాడో సాస్ అందించారు. ఆ తర్వాత మెయిన్ కోర్సులో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డించారు. చివరగా స్ట్రాబెర్రీ కేక్‌తో వైట్ హౌస్‌లో డిన్నర్ విందును ముగించారు. -
అంగన్వాడీల్లో ‘మునగ’ మెనూ
సాక్షి, అమరావతి: పోషక విలువలు అత్యధికంగా ఉండే మునగను ఆహారంలో తీసుకోవడం ద్వారా చేకూరే లాభాలను వివరిస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఆవరణలో, ఇళ్ల వద్ద మునగ చెట్ల పెంపకం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. మునగ చెట్లను పెంచి వాటి నుంచి సేకరించిన ఆకును వారంలో రెండు రోజులపాటు అంగన్వాడీ మెనూలో చేర్చారు. మునగ ఆకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో ఒక రూపంలో అందిస్తుండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విలువైన పౌష్టికాహారం అందుతోంది. మునగాకుతో మేలు ఇలా.. మునగ ఆకు ద్వారా లభించే ఐరన్ గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత నివారించేందుకు దోహదం చేస్తుంది. మునగ ఆకులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే మునగ ఆకు గర్భిణుల్లో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేయడంతోపాటు సుఖ ప్రసవం జరిగేలా ఉపకరిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మునగ ఆకును ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి కొవ్వు పెరుగుతుంది. థైరాయిడ్ లాంటి అనేక సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా.. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు కలిపి దాదాపు 36 లక్షల మందికి అంగన్వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ తల్లులకు 200 మిల్లీ లీటర్లు, పిల్లలకు 100 మిల్లీ లీటర్ల చొప్పున పాలు అందిస్తున్నారు. మునగ పొడితో మొదటి ముద్ద అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా 1,475 అంగన్వాడీల్లో మునగ చెట్ల పెంపకం చేపట్టాం. వారంలో రెండు రోజులపాటు మునగ ఆకుతో చేసిన కూర, పప్పు అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు ప్రతి రోజూ ఆహారంలో మొదటి ముద్ద మునగ ఆకు పొడితో తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. –ఉమాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా. -
జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి ఈడు పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్ధ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది. జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో... పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్ డే మీల్స్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్షించి... వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు. బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనపథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ... జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు రాగిజావను మిడ్ డే మీల్స్‌లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మిడ్ డే మీల్స్‌లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఇందులో భాగంగానే ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు మీకు ధన్యవాదాలు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుంది. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మూడున్నరేళ్ల క్రితం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగింది. విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే.. నాడు– నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్ స్క్రీన్ ఐఎఫ్పి ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పి)లను ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్ 6వతరగతి ఆపై తరగతులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నాం. పిల్లల కరిక్యులమ్‌ను బైజూస్ కంటెంట్‌తో అనుసంధానం చేస్తూ.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. మరోవైపు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యాదీవెన– 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, రూ.20 వేల వరకు వసతి దీవెనను అమలు చేస్తున్నాం. తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. మరోవైపు విదేశీ విద్యా దీవెనను కూడా అమలు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ –50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన వారికి రూ.1 కోటి వరకు అందిస్తుంది. రేపు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్ కావాలనే నిబంధన విధించాం. ఇవన్నీ విద్యాంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చే అడుగులు. గోరుముద్ద మెనూలో రాగిజావను అమలు చేసే ప్రయత్నంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం మంచి పరిణామం. సత్యసాయి ట్రస్టు భాగస్తులు కావడం ద్వారా.. భగవాన్ సత్యసాయి కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మెరుగైన సమాజం దిశగా ఉపయోగపడుతుంది. అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ జే. రత్నాకర్‌లు మాట్లాడారు. బొత్స సత్యనారాయణ, విద్యాశాఖమంత్రి మీ ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 వ తేదీ నుంచి రాగిజావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించాలని నిర్ణయించారు. దీనికి రూ.86 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో సత్యసాయి ట్రస్టును ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి సత్యసాయి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం. వారికి కృతజ్ఞతలు. భారతదేశంలో మిడ్ డే మీల్స్‌ను ఇంత సమర్ధవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రత్నాకర్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి సేవా సంస్ధలు సేవానిరతితో పనిచేస్తున్నాయి. బాబా గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి, అధికారులు మిడ్ డే మీల్స్‌లో రాగిజావ అందించే కార్యక్రమం గురించి చెప్పినప్పుడు .... ట్రస్టు బృందం సభ్యులందరూ దీనిని చాలా మంచి కార్యక్రమమని ప్రోత్సహించారు. అందుకే ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాం. ముఖ్యమంత్రిగా మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాంలో చేస్తున్న కృషి కచ్చితంగా విద్యకు పునరుజ్జీవనం తీసుకొస్తుంది. మీరు చెప్తున్న ప్రతి మాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు. విద్యా రంగంలో మీరు అమలు చేస్తున్న పథకాలు వింటున్నాం.. చూస్తున్నాం. మీరు మధ్యాహ్న భోజనానికి పెట్టిన జగనన్న గోరుముద్ద పేరు చాలా బాగుంది. అమ్మ చేతి గోరు ముద్ద గుర్తుకు వచ్చేలా మంచి పేరు ఎంపిక చేశారు. మీరు అమలు చేస్తున్న అమ్మఒడి, ఆసరా ఇలా అన్నీ మంచి పథకాలు. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అన్నింటి కంటే నాడు–నేడు కార్యక్రమం అందరి కళ్లకూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మంచి, గొప్ప కార్యక్రమం. ఈ దేశం, రాష్ట్రం సురక్షితమైన భవిష్యత్తుకు పిల్లల చదువులు చాలా ముఖ్యం. పేద పిల్లలను చదువుకునే ప్రభుత్వ బడులను.. మీరు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారు. చివరిగా.. నూతనంగా ఏర్పడిన జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయడంపై మీకు ఈ రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్‌రెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు
సీతంపేట: సర్కారు బడుల్లో ఈ నెల 21 నుంచి కొత్త మెనూ అమలుకానుంది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘గోరుముద్ద’ను ప్రభు త్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిదీమీనా ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మెనూ అమలు ఇలా... సోమవారం: ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ కొత్తమెనూ: హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ మంగళవారం: ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు బుధవారం: ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ గురువారం: ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు శుక్రవారం: ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ శనివారం: ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి -
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్‌కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్‌ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్‌లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్‌గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్‌లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్‌ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్‌కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్‌గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్‌ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్‌లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
Viral: కేరళను తాకిన యుద్ధం సెగ.. మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. కీలక పట్టణాలను కైవసం చేసుకునే దిశగా రష్యా దాడులు జరుపుతోంది. ఐదార్, చెర్నిహివ్ పట్టణాలపై రష్యా మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది సైనికులు, వందలాది మంది పౌరులు మృత్యువాతపడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ అనేక దేశాలు, కంపెనీలు ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో సహా యూరోప్ దేశాలు రష్యాలో తయారైన ఆహార పదార్థాలను, డ్రింక్స్‌ను బ్యాన్ చేశాయి. తాజాగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం సెగ కేరళను తాకింది. కేరళలోని ఓ కేష్ తమ మెను నుంచి రష్యా సలాడ్‌ను తీసేసింది. ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలపై రష్యా చేస్తున్న దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెస్టారెంట్ యజమాని తెలిపారు. ఈ మేరకు ఫోర్ట్ కొచ్చిలోని కా కషీ ఆర్ట్ కేఫ్ అండ్ గ్యాలరీరెస్టారెంట్కు బయట ఒక బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. దానిపై "ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా, మేము మా మెనూ నుంచి 'రష్యన్ సలాడ్'ని తీసివేశాము" అని రాసి పెట్టారు. ఈ బోర్డును సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చు.. జెలెన్ స్కీ భావోద్వేగం.. Russian salad off the menu too. This appears to be from the Kashi art cafe in Kochi, Kerala. A really nice place that I've been to many times over the years. Sincere, perhaps, but totally ridiculous. (via @VJ290481) pic.twitter.com/6TgBy1xhOj — Edward Anderson (@edanderson101) March 3, 2022 కాగా దీనిపై స్పందించిన కేఫ్ యజమాని పింటో తాము తీసుకున్న నిర్ణయానికి ఇంత స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. రష్కన్లకు తాము విరుద్ధం కాదని కేవలం యుద్ధాన్ని ఆపాలంటూ చెప్పాలనుకునేందుకు ఇదొక సందేశం అన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రజలకు తమ మద్దతును చూపేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మెనూ నుంచి రష్యా సలాడ్‌ను తొలగించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది కేఫ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే! -
ప్లేట్లో మెనూ మారింది
కర్నూలు: నగరంలోని బుధవారపేటకు చెందిన రామాంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. ఆయన పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాడు. గతంలో మెనూలో అన్నాన్ని తప్పకుండా తీసుకునేవాడు. కానీ షుగర్ తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు అన్నాన్ని పూర్తిగా మానేశాడు. దాని స్థానంలో రాగులు, జొన్నలతో చేసిన ఆహారాన్ని తింటున్నాడు. నెలరోజుల్లోనే ఆయన షుగర్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్యకూ ఇలాగే ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఇద్దరికీ షుగర్ సాధారణ స్థితికి రావడంతో వైద్యులు ఆ రిపోర్ట్లు పరిశీలించి మందుల డోసు తగ్గించాడు. నంద్యాలకు చెందిన రఘురామయ్యకు ఎంతకూ షుగర్ నియంత్రణలోకి రాకపోవడంతో ఆహారంలో సిరిధ్యానాలు చేర్చుకున్నాడు. మూడురోజులకు ఒక సిరిధాన్యాన్ని మార్చి మార్చి వివిధ వంటకాలు తయారు చేయించుకుని తినసాగాడు. కొన్ని రోజులకే అతని షుగర్ నియంత్రణలోకి వచ్చేసింది. వీరే కాదు జిల్లాలో అనేక మంది మెనూలో అన్నాన్ని తగ్గించడమో లేదా పూర్తిగా మానేయడమో చేస్తున్నారు. కాఫీ, టీలు తాగినా చక్కెర లేకుండా తాగుతున్నారు. తమ అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటున్నారు. పాతకాలం నాటి ఆహార పద్దతులైన కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు, గోదుమలతో చేసిన వంటకాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చిన జబ్బులకు ఆహారంలో మార్పులే విరుగుడని ప్రజలు భావించి ప్లేట్లో మెనూనే మార్చుకుంటున్నారు. బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, ఊబకాయం, గ్యాస్ట్రబుల్, గుండెజబ్బులు వంటివన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే జబ్బులే. జిల్లా జనాభా 45లక్షలకుపైగానే ఉంది. ఇందులో 20శాతం ప్రజలు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లునొప్పులు, నీరసం, మూత్రం ఎక్కువసార్లు వెళ్లడం వంటి లక్షణాలుండి వైద్యుల వద్దకు వెళ్లే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్దారిస్తున్నారు. విజ్ఞతగల వైద్యులు ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే మందులకు వెళ్తున్నారు. కానీ జిహ్వాచాపల్యాన్ని చంపుకోలేని వారు మందులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం వారు వాడే మందుల డోసు పెరుగుతుందే గానీ వ్యాధి నయం కావడం లేదు. దీనికంతటికీ విరుగుడు మళ్లీ పాత రోజుల్లోని ఆహారపు అలవాట్లకు వెళ్లాల్సిందేనని అధిక శాతం భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. బజార్లో రొట్టెలకు భలే గిరాకీ ఇటీవల కాలంలో కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని లాంటి పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం కాగానే జొన్నరొట్టెలు, పుల్కాలు, చపాతీలు, కర్రీలు విక్రయించే వ్యాపార కేంద్రాలు తెరుచకుంటున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడ జొన్నరొట్టెలు కొడుతూనే ఉంటారు. వేడివేడిగా రొట్టెలు ఇలా వస్తూనే అలా విక్రయాలు జరిగిపోతున్నాయి. కర్నూలులోని గాంధినగర్, వెంకటరమణ కాలని, నరసింహారెడ్డి నగర్, రైల్వేస్టేషన్ రోడ్, అశోక్‌నగర్, మద్దూర్‌నగర్, నంద్యాల రోడ్డు, గణేష్‌నగర్, సి.క్యాంపు, నాగిరెడ్డి రెవిన్యూ కాలని, బుధవారపేట, శ్రీరామనగర్ ఇలా దాదాపు అన్ని కాలనీల్లో రొట్టెలు విక్రయించే దుకాణాలు విస్తృతంగా వెలిశాయి. ఒక జొన్న రొట్టె, చపాతీలు ఒక్కోటి రూ.12ల నుంచి రూ.15ల వరకు విక్రయిస్తున్నారు. వీటిలోకి కర్రీలు కావాలంటే అదనంగా రూ.10 నుంచి రూ.15లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు తక్కువ సమయంలో లాభార్జన చేసేందుకు గాను జొన్న పిండిలో బియ్యం పిండి కలిపి రొట్టెలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు తమ ఆహారాన్ని మార్చుకున్నా ఉపయోగం ఉండటం లేదు. రెస్టారెంట్లలోనూ మారిన మెనూలు ప్రజల ఆహారపు అలవాట్లు మారడంతో రెస్టారెంట్లలోనూ మెనూలో మార్పులు తీసుకొచ్చారు. నగరంలో 30కి పైగా చిన్నా, పెద్దా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో అధిక శాతం తందూరి రోటీ, చపాతి, పుల్కాలు, జొన్న రొట్టెలు ఆర్డర్ ఇస్తున్నారు. అందులో ఏదో ఒక కర్రీని ఆహారంగా తీసుకుంటున్నారు. చివరగా ఒక బిర్యానిని ముగ్గురు కలిసి ఆర్డర్ ఇచ్చి తింటున్నారు. గతంలో ఒక్కో బిర్యానిని ఒక్కొక్కరు తినేవారు. ఇప్పుడు బిర్యాని స్థానంలో రొట్టెలు వచ్చి చేరాయి. దీంతో పాటు రెస్టారెంట్లలో రాగి ముద్ద, రాగిసంకటి, కొర్ర అన్నం కూడా వండి పెడుతున్నారు. ఐదురోడ్ల కూడలిలో కేవలం సిరిధాన్యాలతో వండిన ఆహారపదార్థాలను విక్రయించడం విశేషం. సిరిదాన్యాలకు భలే గిరాకి జీవనశైలి వ్యాధులకు సిరిదాన్యాలే మందు అని ఇటీవల పలు సామాజిక మాధ్యమాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజలు కొర్రలు, సామలు, అరికెలు, సజ్జలు కొనేందుకు ముందుకు వస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఇవి పేదల ఆహారంగా ఉండేవి. అప్పట్లో ధనవంతులు మాత్రమే వరి అన్నాన్ని భుజించేవారు. ఈ కారణంగా అప్పట్లో బీపీ, షుగర్ జబ్బులు అధిక శాతం ధనవంతులకు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు వరి అన్నం అందరికీ అందుబాటులోకి రావడంతో 30 ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారంగా మారింది. అయితే వరిదాన్యాన్ని తెల్లగా పాలిష్ పట్టడంతో దానిపై ఉన్న పోషకాలు పోయి పిప్పిగా మారుతోంది. దీన్ని వండుకుని తినడంతో నేరుగా గ్లూకోజ్ మన శరీరంలోకి వెళ్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పుడు ఆహారంపై అవగాహన పెంచుకుని అలవాట్లను మార్చుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జొన్నలు(రాయచూరు) రూ.55లు, కొర్రలు రూ.60లు, సామలు, అరికెలు రూ.80లకు పైగానే విక్రయిస్తున్నారు. ఇక సేంద్రీయ ఎరువులతో పండించిన సిరిదాన్యాలు కిలో రూ.110లకు పైగానే పలుకుతున్నాయి. గతంలో వీటిని కొనేవారు లేక పశువులకు పెట్టేవారంటే అతిశయోక్తి కాదు. ఆహారపు అలవాట్లతో వ్యాధులు దూరం –డాక్టర్ జి.రమాదేవి,డైటీషియన్, కర్నూలు గతంలో ప్రతి ఒక్కరి ఆహారంగా జొన్నరొట్టెలు, కొర్ర అన్నం ఉండేది. కూరల్లో నూనె శాతం కూడా తక్కువగా ఉండేది. పండుగల సమయంలో మాత్రమే బజ్జీలు తినేవారు. ఇప్పుడు బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయడంలో వల్ల అందులోని విటమిన్స్ పోతున్నాయి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువ కావడం వల్ల స్థూలకాయం వస్తోంది. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల కొవ్వు శాతం అధికమైపోయి గుండెపోటుకు దారి తీస్తోంది. పలుమార్లు కాచిన నూనెలో చేసిన బజ్జీలు తినడం, కూల్‌డ్రింక్స్, నిల్వ ఉంచిన బిస్కట్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తోంది. వీటన్నింటికీ విరుగుడూ ఆహారంలో మార్పులే. ఈ దిశగా ప్రస్తుతం ప్రజలు ముందుకు వెళ్లడం శుభపరిమాణం. సిరిదాన్యాలతో వ్యాధులకు చెక్ –డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు కొర్రలు, అంటుకొర్రలు, రాగులు, సజ్జలు, సామలు, అరికెలు, వరిగెలు లాంటి సిరిదాన్యాలను సక్రమంగా వినియోగిస్తే చాలా జబ్బులకు పరిష్కారం దొరుకుతుంది. స్థూలకాయం, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ వంటి జబ్బులకు ఇదే మందు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి, గోదుమల్లో 2 శాతంలోపే పీచు ఉంటుంది, సిరిదాన్యాల్లో 6 నుంచి 8 శాతం వరకు పీచు ఉంటుంది. దీనివల్ల త్వరగా జీర్ణం గాక నిదానంగా శరీరంలోకి గ్లూకోజు విడుదల అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మలబద్దకం పోతుంది. సిరిదాన్యాలతో తయారు చేసిన కషాయాలు సేవించడం వల్ల చాలా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. సిరిదాన్యాలు తక్కువ వర్షపాతంలోనూ పండుతాయి. క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. అధికారులు వీటిని ప్రోత్సహిస్తే వారికి ఉపయోగం ఉంటుంది. అన్నం పూర్తిగా మానేశాను –వి. ప్రసాద్, కర్నూలు నాకు 12 ఏళ్లుగా షుగర్ జబ్బు ఉంది. ఈ వ్యాధి వల్ల నేను అనేక ఇబ్బందులు పడ్డాను. చివరకు వైద్యుల సలహా మేరకు నా మెనూలో మార్పులు చేసుకున్నాను. ఇప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటున్నాను. తెల్ల అన్నాన్ని పూర్తిగా మానేశాను. జొన్నరొట్టెలు, పుల్కాలు, రాగి సంకటి వంటివి తింటున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం షుగర్ కంట్రోల్లో ఉంటోంది.