అంబానీ ఇంట పెళ్లి : స్పెషల్‌ చెఫ్‌లు, ఆహా..అనిపించే విందు! | Anant Ambani-Radhika Merchant wedding super dishes, vegan options, midnight snacks | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంట పెళ్లి : స్పెషల్‌ చెఫ్‌లు, ఆహా..అనిపించే విందు!

Published Wed, Feb 28 2024 11:28 AM | Last Updated on Wed, Feb 28 2024 11:52 AM

Anant Ambani Radhika wedding super dishes vegan options midnight snacks - Sakshi

అనంత్‌ అంబానీ ​​‍-రాధికా మర్చంట్‌  పెళ్లి, పసందైన విందు

2500 రకాల వంటకాలు, అదిరిపోయే చెఫ్‌లు

బిలియనీర్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు, వ్యాపారేత్త అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంటే ఆ సందడి వేరుంటుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత  పీట..ఇలా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ పెళ్లి సన్నాహాలు, వధూవరుల దుస్తులు, అతిధులు, ముఖ్యంగా  ఎలాంటి విందు భోజనం అందించబోతున్నారనేది చర్చనీయాంశం. దీనికి సంబంధించి  ఇప్పటికే సోషల్‌ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ అంచనాలకు  తగ్గట్టుగానే వంటకాల విషయంలో ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలను రిచ్‌గా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట. దేశం నలుమూలలనుంచి సిద్ధహస్తులైన, నలభీముల్లాంటి  వంటగాళ్లను  నియమించారట.  దాదాపు 25 -30 మంది బెస్ట్ షెఫ్‌ల ఆధ్వర్యంలో  ఒక్కో టీమ్ ఒక్కో రకంగా విందుభోజనం అందించేందుకు కసరత్తు చేస్తున్నారట.

ఆసియన్, పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ వంటకాలు రడీ కాబోతున్నాయి. బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాలు, లంచ్ కోసం 250 రకాలు, రాత్రి భోజనం కోసం  మరో 250 రకాల వంటల్ని అతిథులకు వడ్డించ బోతున్నారు. అంతేకాదు మూడు రోజుల పాటు సాగే వేడుకల్లో ఏ ఒక్క వంటకం రిపీట్ కాకుండా ఆహా అనిపించేలా మెనూ సిద్ధం చేశారట. అలాగే  శాకాహార వంటకాలు, అర్ధరాత్రి స్నాక్స్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లున్నాయట. 

కాగా అనంత్ అంబానీ, ప్రియురాలురాధికా మర్చంట్‌తో ఏడడుగులు వేసేందుకు జులై 12వ  తేదీని ముహూర్తం దాదాపు ఖాయమైనట్టే. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1,2,3 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేడుకలకు  మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, బిల్ గేట్స్, మెలిండా గేట్స్‌తో సహా  పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందినట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement