అనంత్‌ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రిక | Anant Ambani-Radhika Merchant's Wedding Invitation Goes Viral | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రిక

Published Thu, Jun 27 2024 12:09 PM | Last Updated on Thu, Jun 27 2024 1:53 PM

Anant Ambani-Radhika Merchant's Wedding Invitation Goes Viral

బిలియనీర్‌ పారిశ్రామిక‌వేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ ఏడడుగుల వేడుకకు ముహూర్తం సమీపిస్తోంది. అపరకుబేరుడు, రిలయన్స్‌ అధినేత అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. అంబానీ కుటుంబం పెళ్లి పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. వివాహ పత్రికను కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంత్‌ తల్లి నీతాఅంబానీ.  ఆ తరువాత హితులు, సన్నిహితులు, సెలబ్రిటీలకు పెళ్లి ఆహ్వానాలను అందిస్తున్నారు కూడా. ఈ క్రమంలో అనంత్‌ -రాధిక వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రపంచంలోనే అతి ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది అనంత్‌-రాధిక పెళ్లి ముచ్చట. ఇక  వివాహ ఆహ్వానం ప్ర‌త్యేకంగా ఒక పెట్టెలో ఒక కళాఖండంగా తీర్చిదిద్దిన వైనం విశేషంగా నిలుస్తోంది. అనంత్-రాధిక పేర్లలోని తొలి అక్షరాలు,  లైట్లు, ఎర్రని రంగుతో ఇన్విటేషన్ కార్డును అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయ‌గానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది.  దీన్ని ఓపెన్‌ చేయగానే వెండితో చేసిన ఆల‌యం, ఈ ఆలయం లోప‌ల వెండితోనే చేసిన‌ వినాయ‌కుడు, దుర్గామాత‌, రాధాకృష్ణ విగ్ర‌హాలు ముచ్చటగా ఉన్నాయి. అంతేకాదు  వివాహ ఆహ్వాన అతిథుల‌కు ఈ వెండి కార్డుతో పాటు ప‌లు బహుమతులు కూడా  ఇస్తున్నారని తెలుస్తోంది.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12న అంగరంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. దేశ, విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజ‌రుకానున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement