అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మోస్ట్ ఎవైటెడ్ వెడ్డింగ్ డేట్ వచ్చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సాంప్రదాయ హిందూ వైదిక పద్ధతిలో వివాహ వేడుక జరగనుంది. ఏఎన్‌ఐ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన కార్డును షేర్ చేసింది.
అంబానీ కుటుంబం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ 'సేవ్ ది డేట్' పేరుతో వీరి వెడ్డింగ్ ఆహ్వానాలు వైరల్‌గా మారాయి. మూడు రోజుల వేడుకకు సంబంధించిన వివరాలతో ఎరుపు, బంగారు రంగులో చూడముచ్చటగా ఉంది.
బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12, 13 , 14 తేదీల్లో మూడు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ప్రధాన వేడుకలు జూలై 12వ తేదీ శుక్రవారం శుభ వివాహ్ లేదా వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. జూలై 13న, శుభ్ ఆశీర్వాదం లేదా దైవిక ఆశీర్వాద వేడుక, జూలై 14న మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జరుగుతుంది.
కాగా లవ్ బర్డ్స్ అనంత్-రాధిక ఇప్పటికే నిశ్చితార్థాన్ని, తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా ముగించుకున్నారు. ఇక రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక లగ్జరీ క్రూయిజ్‌లో ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీరి వెళ్లి వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రముఖులు, దేశాధినేతలు, అలాగే పలువురు హాలీవుడ్ , బాలీవుడ్ తారలు హాజరుకానున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment