రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్‌ను ఆస్వాదించిన వీడియో వైరల్ అయింది. అంతేకాదు భర్త ముఖేష్ అంబానీకి చాట్‌లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.
After temple visit and the sacred Ganga Aarti, Smt. Nita Ambani savored a variety of dishes at the famous Kashi Chat Bhandaar in Varanasi today#KasiViswanathan #Varanasi #RelianceFoundation #AnantRadhikaWedding #KashiVishwanathTemple #HarHarMahadev #NitaAmbani pic.twitter.com/RzZ8uHWNV1
— AkashMAmbani (@AkashMAmbani) June 25, 2024
కాశీలో నీతా అంబానీ మనసు దోచుకున్న స్నాక్ బనారస్ టమాటా చాట్. పాపులర్ కాశీ చాట్ భండార్‌లో చాట్‌ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్‌లో ఇది పాపులర్. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తారట.
దాదాపు పదేళ్ల తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.
కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి
Comments
Please login to add a commentAdd a comment