chat
-
'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!
ఎన్నో రకాల వీధి చాట్ భండార్ దుకాణాలు చూసుంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే చాట్ బండార్ మన భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన సంగ్రామాన్ని గుర్తుచేస్తుంది. స్వతంత్ర్య భారతవని పోరుకి చిహ్నం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అది ఆధునికంగా విస్తరించి మంచి లాభాదాయకమైన వ్యాపారంగా నిరాంటకంగా కొనసాగుతోంది. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీనికి యూపీఎస్సీ అనే పేరు ఎందుకు పెట్టారంటే..ఈ చాట్ భండార్ న్యూఢిల్లీలో(Delhi) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(UPSC) భవనం ఎదురుగా ఉంది. నిజానికి ఈ చాట్ దుకాణం పేరు "ప్రభు చాట్ భండార్" కానీ అందరూ యూపీఎస్సీ చాట్(UPSC Chaat Bhandar) అనే పిలుస్తారు. 1935లో బ్రిటిష్ పాలనా కాలం నుంచి నడుస్తున్న దుకాణం. దీని యజమాని నాథూ. ఆయన ఆ కాలంలో బ్రిటిష్ పోలీసుల చేత అనేక బెదిరింపులకు, వేధింపులకు గురయ్యేవాడు. అయినా ఇది నాదేశం.. అందుకోసం తన వంతుగా చేస్తున్న జీవన పోరాటంగా అని భావించేవాడు నాథూ. మంచి రోజులు రాకపోతాయనే అతడి ఆశ నెరవేరే రోజు రానే వచ్చింది. భారతదేశానికి స్వతంత్య్రం(Independence) రావడందాంతోపాటు తన దుకాణం కూడా కొంగొత్తగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. అతడి దుకాణం ప్రభుత్వాధికారులు పనిచేసే సమీపంలో ఉండటంతో..వారే అతడి కస్టమర్లుగా ఉండేవారు. పైగా అనతికాలంలో ఆదాయ పన్ను చెల్లించే దుకాణాల లిస్ట్‌లో చేరిపోయింది. అంతలా లాభాలార్జిస్తూ దూసుకోపోతుంది. ప్రస్తుతం దీన్ని నాథూ మనవడు, కుమారుడు విజయవంతంగా నడుపుతున్నారు. ఈ దుకాణం గొప్పతనం దశాబ్దాల నుంచి అదే రుచి, నాణ్యతతో చాట్‌ని అందించడమే. అదీగాక ఇప్పుడు మరిన్ని విభిన్న రకాల చాట్లను కూడా జోడించారు. ఢిల్లీ ఎలా ఆధునికరించబడిందో.. అలానే ఈ దుకాణం కూడా కొద్దికొద్దీ మార్పులతో ఆధునిక దుకాణంలా రూపుదాల్చుతూ ఉంది. అందువల్లే ఢిల్లీలో ఈ దుకాణం సిటీ ఐకానిక్ ల్యాండ్‌మార్క్(Landmark)గా స్థిరపడిపోయింది. ఏవ్యాపారమైన కస్టమర్ నమ్మకాన్ని బలపర్చేలా నాణ్యతతో రాజీ పడకుండా చేస్తే దానికి తిరుగుండదు అనడానికి ఏళ్ల నాటి ఈ ఐకానిక్ చాట్ భండారే ఉదాహరణ కదూ..!.(చదవండి: Sudoku: ‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..) -
అరటి కాండంతో చాట్..! ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఇటీవల అరటి పండుతో బజ్జీల గురించి విన్నాం. తాజగా అరటి కాండం లేదా అరటి డొప్ప చేసిన చాట్ రెసిపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ అరటి కాండం లేదా అరటి డొప్పలను కార్తీక మాసం పూజల్లో ఉపయోగిస్తుంటారు. అయ్యప్ప భక్తులు కూడా పూజల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అరటి డొప్పతో స్నాక్స్ వంటకమా..? అని ఆశ్యర్యంగా అనిపిస్తోంది కదా..! ఎలా చేశారంటే..అరటి కాండం లేదా డొప్ప భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానికి దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మసాలా వేసి, చిటికెడు ఉప్పుని జోడిస్తారు. దీన్ని స్పూసీ గ్రీన్ చట్నీ, పుల్లని సాస్, స్పైసీ ఆలు భుజియాతో అలంకరిస్తాడు. చివరిగా నిమకాయ రసంతో సర్వ్ చేస్తాడు. అంతే అరటి కాండం చాట్ రెడీ. దీన్ని అరటి ఆకులోనే అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ చాట్‌ని బెంగళూరులో ఎక్కువగా వినియోగిస్తారట. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తాము అరటి కాండంలను పచ్చిగా తింటామని, ఇవి కిడ్నీలో రాళ్లు, ప్రేగు సమస్యలను నివారిస్తుందని చెప్పగా, మరొకరు ఇది చాలా టేస్టీగా ఉంటుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చెయ్యండి. View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate) (చదవండి: సచిన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు దిగ్గజ క్రికెటర్లు ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!) -
నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్‌ను ఆస్వాదించిన వీడియో వైరల్ అయింది. అంతేకాదు భర్త ముఖేష్ అంబానీకి చాట్లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.After temple visit and the sacred Ganga Aarti, Smt. Nita Ambani savored a variety of dishes at the famous Kashi Chat Bhandaar in Varanasi today#KasiViswanathan #Varanasi #RelianceFoundation #AnantRadhikaWedding #KashiVishwanathTemple #HarHarMahadev #NitaAmbani pic.twitter.com/RzZ8uHWNV1— AkashMAmbani (@AkashMAmbani) June 25, 2024 కాశీలో నీతా అంబానీ మనసు దోచుకున్న స్నాక్ బనారస్ టమాటా చాట్. పాపులర్ కాశీ చాట్ భండార్‌లో చాట్‌ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్‌లో ఇది పాపులర్. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తారట. దాదాపు పదేళ్ల తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి -
ప్రపంచ యుద్ధంపై చాట్ జీపీటీ హెచ్చరిక?
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల తరువాత మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తన చాట్ జీపీటీలో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంచనాలను వెల్లడించింది. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఆరు దేశాలు ఇవేనంటూ తన భవిష్యవాణి వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ పాట్రిక్ సాండర్స్, నాటో జనరల్‌లు పౌరులను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌరులు ఆయుధాలు చేతబట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ కోరారు. ప్రతి దేశం ‘పౌర సైన్యం’ మాదిరిగా శిక్షణ పొందాలని, యుద్ధం అంటూ ప్రారంభమైతే, రిజర్వ్ దళాల సామర్థ్యం సరిపోదని వారు పేర్కొన్నారు. ఈ ప్రకటనలతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ నేపధ్యంలో అమెరికా, నాటో దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని పలు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల గురించి తెలియజేయాలని చాట్ జీటీపీని అడగగా, అది ఆరు హాట్స్పాట్లను వెల్లడించింది. ‘డైలీ స్టార్’ నివేదిక ప్రకారం, ఈ ఆరు ప్రదేశాలు ప్రపంచ యుద్ధం తలెత్తే ఘర్షణ పాయింట్లు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొరియా ద్వీపకల్పం: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ వివాదంలో అమెరికా ప్రమేయంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఉత్తర కొరియా తరచూ నూతన క్షిపణులను పరీక్షిస్తోంది. ఉత్తర కొరియాకు చైనా తదితర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే ఇక్కడ నుండి ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కానుంది. మిడిల్ ఈస్ట్: కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఇంకా ఒక గట్టున పడలేదు. ఇంతలో ఇరాన్‌తో పాటు పొరుగు దేశాల ప్రమేయం ఈ దేశాల ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. తైవాన్ జలసంధి: చైనా, తైవాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత మరిన్ని మలుపులు తిరుగుతోంది. దీనిపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితిని మరింత దిగజారుతోంది. ఆసియా-పసిఫిక్‌కు చెందిన ఈ ప్రాంతంలో ఏ సమయంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తవచ్చు. తూర్పు ఐరోపా: ఈ జాబితాలో తూర్పు ఐరోపా ప్రాంతాలు నాల్గవ స్థానంలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, నాటోకు సంబంధించిన ఘర్షణల కారణంగా తూర్పు ఐరోపాలో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఎప్పుడైనా తీవ్ర ఘర్షణలకు దారితీయవచ్చు. దక్షిణ చైనా సముద్రం: దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా, దాని పొరుగు దేశాల మధ్య నిరంతర వివాదాలు నడుస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇక్కడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా తీవ్రస్థాయికి చేరుకోవచ్చు. మూడవ ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. భారత్-పాక్ సరిహద్దు: భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండుసార్లు యుద్ధం జరిగింది. అయితే అది ఇతర దేశాలను ప్రభావితం చేయలేదు. గత నాలుగు సంవత్సరాలుగా సరిహద్దులో శాంతియుత వాతావరణ ఉంది. అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని చాట్ జీపీటీ అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం ఉందని కూడా చాట్ జీపీటీ గుర్తు చేస్తోంది. -
మ్యాగీ కటోరీ చాట్ ట్రై చేయండిలా!
రోజుకో రకం వెరైటీ రెసీపీలనే మనం చూస్తూనే ఉన్నాం. ఇది అత్యంత విభిన్నమైన రెసిపీ. మ్యాగీ న్యూడిల్స్‌తో ఇప్పటి వరకు రకరకాల వంటకాలు చూసుంటారు. ఈ రెసీపి చూస్తే చాట్ ఇలా కూడా చెయొచ్చా!అని అంటారు. అంత ఆకర్షణీయంగా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట పెద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇంతకీ ఆ రెసిపీ ఎలా చేశారంటే?.. న్యూడీల్స్ని ఉడబెట్టి ఓ గిన్నెల తీసుకున్నారు. దానీ టీ వడకట్టే చిక్కంలో కొద్దిగా న్యూడిల్స్ తీసుకుని దాన్ని ఆ చిక్కానికి సరిపడగా సర్ధి నేరుగా మరిగే నూనెల వేయించారు. అది ఒక్కసారిగా బౌల్ మాదిరిగా రాగానే ఈ చిక్కం తీసి కాస్త డీప్ ఫ్రై చేశారు. ఆ తర్వాత ఆ న్యూడిల్స్ బౌల్లో కొద్దిగా ఉల్లిపాయలు, టమోట ముక్కలు కాస్త, గ్రీన్ చట్నీ కలిపి గార్నీష్ చేశారు. చివరిగా పెరుగ వేసి గార్నిషీ చేశారు. అంతే మ్యాగీ కటోరీ చాట్ రెడీ. అందుకు సంబంధించిన వీడియోని తన్విగోర్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 62 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Tanvi Gor (@golus_kitchen_by_tanvigor) (చదవండి: కాఫీ రుచి బెటర్‌గా ఉండేందుకు ట్రిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!) -
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ మధ్య చాట్ జీపీటీ చిచ్చు..
-
మహిళతో మంత్రి వీడియో చాట్.. బీజేపీ రాజీనామా డిమాండ్
జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ ఓ మహిళతో చేసిన వీడియో చాట్ పెను దుమారం రేపుతోంది. ఇదే అదనుగా బీజేపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా ఓ మహిళతో చేసిన వీడియో చాట్ తీవ్ర కలకలం సృష్టించింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ వీడియో కాంగ్రెస్ ఒరిజినాల్టిని బట్టబయలు చేసిందని విమర్శించారు.అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేయో కూడా ఈ అసభ్యకరమైన వీడియోపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గంలోని సభ్యుడు కాబట్టి ఆ వీడియో క్లిప్ నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. దీనిపై దర్యాప్తు చేసేలా సీఎం ఆదేశించాలని పట్టుబట్టారు షాదేయో. ఆ మంత్రికి సంబంధించిన వీడియో వాస్తవమని తేలితే వెంటనే అతను మంత్రి పదవి నుంచి వైదొలగాలన్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమే ఆ వీడియో క్లిప్ అంటూ మండిపడ్డారు. అదంతా ఫేక్ అని, అది ఎడిట్ చేసిన వీడియో అని వివరణ ఇచ్చారు. దీనిపై తాను ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు కూడా చెప్పారు. ఎవరో కావలనే ఉద్దేశపూర్వకంగానే ఆ ఎడిట్ చేసిన ఫేక్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీని వెనుకు ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ నేత బన్నా గుప్తా అన్నారు. (చదవండి: యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం..) -
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
కవితతో జరిపిన వాట్సాప్ చాట్ విడుదల
-
యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు!
చాట్ జీపీటీ! పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు గుబులు పుట్టించేలా వినియోగించడానికి అందుబాటులోకి రాకుండానే కేవలం రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. యూజర్లు వినియోగిస్తే రెండేళ్లలో గూగుల్‌ను దాటేస్తుందని టెక్ నిపుణుల అంచనా. ఈ తరుణంలో చాట్ జీపీటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, భారీగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల్ని అర్జించేందుకు ట్విటర్ తరహాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చాట్ జీపీటీ సంస్థ కాదు సాఫ్ట్వేర్ శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఓపెన్ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. ఈ సంస్థ కోఫౌండర్, సీఈవో సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. చాట్‌జీపీటీ నిర్వహణ ఖర్చులు కంటి నీరు (eye-watering) తెప్పిస్తున్నాయి. యూజర్లు చేసే ఒక్కో చాట్‌కు కొన్ని సెంట్స్ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని భద్రంగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేస్తున్నాం. ఇది సరిపోదన్నట్లుగా మైక్రోసాఫ్ట్ మరో 10 బిలియన్ల పెట్టుబడులు పెట్టబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెరసీ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ట్విటర్ తరహాలో యూజర్లకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆల్ట్ మాన్ తెలిపారు. చాట్‌జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో చాట్‌జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో పెయిడ్ వెర్షన్ సర్వీసుల్ని యూజర్లకు అందించనుంది. 'ప్రో' వెర్షన్‌తో చాట్‌జీపీటీ సేవల్ని యూజర్లకు అందిస్తే తద్వారా మాతృసంస్థ ఓపెన్ఏఐకి ఆదాయాన్ని అర్జించవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం పెయిడ్ వెర్షన్ ప్రారంభ దశలో ఉండగా..పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చిన వెంటనే పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందించనుంది. -
గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ‘చాట్‌జీపీటీ’ యాప్స్ కలకలం
చాట్‌జీపీటీ పరిచయం అక్కర్లేని పేరు. కాలంతో పాటు ఉరుకులు పరుగుల జీవితాన్ని టెక్నాలజీ పరంగా మరింత సులభతరం చేసేందుకు వెలుగులోకి వచ్చిందే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆధారిత చాట్‌బోట్ ‘చాట్‌జీపీటీ’. గూగుల్‌లో మనకు కావాల్సిన సమాచారాన్ని ఎలా సేకరిస్తామో.. లేటెస్ట్ టెక్నాలజీ చాట్‌జీపీటీలో సైతం అలాగే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ప్రస్తుతం చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ సర్వీసుల్ని యూజర్లనకు ఉచితంగా అందిస్తుంది. దీన్ని అదునుగా భావించిన సైబర్ నేరస్తులు చాట్ జీపీటీ ఫేక్ యాప్స్‌ను క్రియేట్ చేశారు. వాటి సాయంతో యూజర్ల సొమ్మును కాజేసేందుకు యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌ల్లో కూడా పెట్టేశారు. అదనపు ఫీచర్లు పేరుతో యూజర్ల నుంచి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో పాటు పాజిటీవ్ రివ్యూలు సైతం వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఫేక్ యాప్స్‌పై కన్నేసిన యాపిల్, గూగుల్ సంస్థలు ప్లే స్టోర్ల నుంచి యాప్స్‌ను తొలగించాయి. అంతేకాదు చాట్‌జీపీటీ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని యూజర్లకు హెచ్చరికలు జారీ చేశాయి. పొరపాటు చాట్‌జీపీటీ పేరుతో యాప్స్ కనిపిస్తే వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, అలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. -
Viral Video: రైడ్ చేస్తూ చాట్ చేస్తే ఇలానే అవుతుంది
-
అన్నింటికీ సమాధానాలు.. ‘ఛాట్‌బోట్‌జీపీటీ’ ఎందుకు? ఏమిటి? ఎలా?
శోధించి సాధించు... అన్నారు. ఆ సాధనలో అద్భుతాలు సాధిస్తే ఎంత బాగుంటుంది! కృత్రిమ మేధస్సుతో కూడిన రకరకాల ఛాట్బోట్లు ఆ అద్భుతాలకు నిలయం కానున్నాయి. యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్న ఛాట్‌బోట్ ‘ఛాట్‌బోట్‌జీపీటీ’ ఎందుకు? ఏమిటి? ఎలా? జనరేటివ్ ప్రీ–ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ జనరల్ నాలెడ్జ్ నుంచి జటిలమైన ప్రశ్నలకు సమాధానం వరకు, మ్యూజిక్ కంపోజింగ్ నుంచి పాటలు రాయడం వరకు ఎన్నో విషయాలలో ఉపకరించే ఏఐ ఆధారిత ఛాట్బోట్ల గురించి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇటీవల కాలంలో యూత్ ‘చాట్‌జీపీటీ’ (జనరేటివ్ ప్రీ–ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) గురించి అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. దిగ్గజ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ను ఈ ‘ఛాట్‌జీపీటీ’ సవాలు చేయగలదని కొందరు, అధిగమించి అగ్రస్థానంలో నిలవనుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ‘ఆసక్తి’ మాత్రం నిజం. ఇంతకీ ఏమిటి దీని ప్రత్యేకత? కంటెంట్ క్రియేషన్‌లో ఉపయోగపడుతుంది. ఏదైనా క్రియేటివ్ ఆర్టికల్ రఫ్‌గా రాస్తే మంచి మంచి పదాలు, శైలితో సొబగులు అద్దగలదు. ఏదైనా అంశానికి సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నా డేటాను క్రమపద్ధతిలోకి తీసుకురాగలదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయగలదు. మనుషుల సంభాషణ శైలిని సహజంగా అనుకరించగలదు. తనదైన శైలిలో ఏదైనా విషయం గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు ‘ఇదిగో ఈ లింకులు ఉన్నాయి’ అన్నట్లుగా చూపుతుంది. ‘ఛాట్‌జీపీటీ’ మాత్రం లింక్‌లతో పాటు తనదైన శైలిలో విషయ వివరణ ఇస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జాత్యహంకార, సెక్సిస్ట్ ప్రాంప్ట్‌లను ‘చాట్‌జీపీటీ’ డిస్మిస్ చేస్తుంది. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ‘ఛాట్‌జీపీటీ’ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించింది. కంప్యూటర్ సైంటిస్టు శామ్ఆల్ట్మన్, ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెస్టర్, ప్రోగ్రామర్ ఇల్యా సట్స్‌కెర్వర్, ఎలాన్ మస్క్... లాంటివారు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రముఖులు. ఆ తర్వాత కాలంలో మస్క్ తప్పుకున్నారు. ‘ఫ్రెండ్లీ ఏఐ’ మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థ దీనిలో పెట్టుబడి పెట్టడం విశేషంగా మారి అంచనాలు మరింతగా పెంచింది. ‘ఫ్రెండ్లీ ఏఐ’ ని దృష్టిలో పెట్టుకొని ఏఐ రంగంలో లోతైన పరిశోధనలు చేస్తోంది ఛాట్‌జీపీటీ. వ్యక్తిగత సంభాషణ, సోషల్‌మీడియాలో అభిప్రాయాల కలబోత అనేది ఒక ఎత్తు అయితే, ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది గార్డియన్’లాంటి పత్రికలు ‘ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాట్‌బోట్’ అంటూ ‘ఛాట్‌జీపీటీ’ని ప్రశంసించడం మరో ఎత్తు. మరోవైపు టెక్నాటజీ రైటర్ డాన్ గ్లిమోర్ ప్రయోగాత్మకంగా పరీక్షించి ‘ఛాట్‌జీపీటీ’ని ప్రశంసించారు. అంతా బాగానే ఉందిగానీ, ‘ఛాట్‌జీపీటీ’కి పరిమితులు, లోపాలు లేవా? అనే ప్రశ్నకు ‘నో’ అనే జవాబు మాత్రం వినిపించదు. అప్పుడప్పుడూ తప్పుడు సమన్వయాలు, పునరావృతం అయ్యే పదాలు, తప్పుడు సమాధానాలు కనిపించవచ్చు. కొన్ని సంఘటనల గురించి పరిమిత సమాచారానికి మాత్రమే పరిమితం కావచ్చు. గూగుల్‌ను పక్కకు తప్పించగలదా? కొందరు ప్రముఖుల గురించి ఏమీ చెప్పలేకపోవచ్చు... ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ‘ఓపెన్ ఏఐ’ ఈ పరిమితులు, లోపాలను దాచాలనుకోవడం లేదు. యూజర్లు లోపాలను ఎత్తిచూపవచ్చు. సూచనలు ఇవ్వవచ్చు. వాటిని ఆహ్వానిస్తోంది ఛాట్‌జీపీటీ. ప్రయోగదశ కాలంలో పది లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ‘ఛాట్‌జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్‌ను పక్కకు తప్పించగలదా? యువతరం అంచనాలకు న్యాయం చేయగలదా?... మొదలైన ప్రశ్నలకు స్పష్టత వచ్చేందుకు ఎంతో కాలం పట్టేటట్లు లేదు. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత -
వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరో బంపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లకు యాండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్టఫోన్లలో 'పోల్స్' ఫీచర్‌ను జోడించింది. ఇంతకు ముందు, వినియోగదారులు ప్రత్యక్ష చాట్లు, గ్రూపు సంభాషణలలో పోల్‌లను నిర్వహించడానికి థర్డ్ పార్ట్ యాప్‌ల ద్వారా క్రియేట్ చేసిన పోల్ లింక్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండానే ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్ మెసేజెస్‌లో పోల్ నిర్వహించేందుకు అనుమతినిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోఉన్న వాట్సాప్‌లో పోల్‌లను ఎలా సృష్టించాలో ఒకసారి చూద్దాం. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) ఇదీ చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే? ఐఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్ బాక్స్‌కు ఎడమ వైపున ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కండి ♦ 'పోల్' ఎంపికపై నొక్కండి. పోల్‌కు సంబంధించిన ♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను టైప్ చేసి, ఆ తర్వాత ఆప్షన్స్‌ను టైప్ చేయండి ♦ ఆ తరువాత చాట్‌లో పోల్‌ను షేర్ చేయడానికి సెండ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఎంపికపై నొక్కండి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్బాక్స్కు కుడి వైపున ఉన్న పేపర్ క్లిప్ ఐకాన్‌ను ఎంచుకోవాలి. ♦ 'పోల్' ఎంపికపై క్లిక్ చేయండి. ♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను, ఆప్షన్స్‌ను టైప్ చేయాలి. ♦ ఆ తర్వాత, చాట్‌లో పోల్ సెండ్ చేస్తే సరిపోతుంది. (దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్) యూజర్లు పోల్‌లో గరిష్టంగా 12 ఆప్షన్స్‌ను జోడించవచ్చు. రైట్ సైడ్‌లో ఉన్న హాంబర్గర్ సహాయంతో, వినియోగదారులు ప్రతిస్పందనల క్రమాన్ని మార్చు కోవచ్చు. అంతేకాదు ఇతర పోల్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, వాట్సాప్ పోల్స్ క్రియేట్ అయితన తర్వాత వినియోగదారులు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు. ఎపుడు ఓటు వేస్తే అపుడు ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతుంది. గ్రూపు సభ్యులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయవచ్చు. అలాగే వ్యూ వోట్స్ ఆప్షన్ ద్వారా ఎవరు ఎన్ని ఓట్లు వేసింది, ఎవరు ఏయే ఆప్షన్‌ను ఎంచుకున్నారు అనేది కూడా చూడవచ్చు. పాస్వర్డ్ లేదా పిన్ స్క్రీన్ లాక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప పరీక్షిస్తోంది. డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసి మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ మీద వాట్సాప్ యాప్‌ను ఓపన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిందే. తద్వారా యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కల్పిస్తోంది సంస్థ, త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది. -
లవ్‌చాట్.. మేడ్ ఇన్ ఆంధ్రా
సాక్షి, అనంతపురం: వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్.. ఇవన్నీ యువతకు సుపరిచితమే. ఇదే తరహాలో ఇప్పుడు కొత్తగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటారా? ఇది మేడ్ ఇన్ ఆంధ్రా. ఇంకా చెప్పాలంటే.. మేడ్ ఇన్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి ఈ ‘లవ్‌చాట్’ మెసేజింగ్ యాప్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం విలేకరులకు వెల్లడించాడు. సాయికుమార్ నాన్న శేఖర్, అమ్మ నాగలక్ష్మి. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతను శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాళసముద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై సాయికుమార్‌కు ఆసక్తి ఎక్కువ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటేషనల్ థింకింగ్ ఉపాధ్యాయుడు త్యాగేశ్వర్ నాయక్ మార్గదర్శకత్వంలో appinventor.mit.edu అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని యువతకు ఆకర్షణగా ‘లవ్‌చాట్’ అనే యాప్‌ను సాయికుమార్ రూపొందించాడు. 5 సార్లు ప్రయత్నించి విఫలమైన తర్వాత 6వ సారి యాప్ రూపకల్పనలో విజయవంతమయ్యాడు. ఇది మెసెంజర్ యాప్‌గా పని చేస్తుంది. వాట్సాప్ మాదిరిగానే లవ్చాట్లోనూ స్నేహితులు, బంధువులతో చాటింగ్, ఫొటో షేరింగ్, ఫోన్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు లవ్‌చాట్ యాప్‌ను 150 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. https://appsgeyser. com/15260267 అనే లింకు ద్వారా గూగుల్ క్రోమ్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
Recipe: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్ తయారీ ఇలా!
చామ దుంపతో తయారు చేసే కశ్మీరీ వంటకం కచ్లు చాట్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి. కావలసినవి: చామ దుంపలు – కేజీ ఉప్పు – రుచికి సరిపడా చింతపండు – అరకప్పు వాము – టీస్పూను ఆమ్చూర్ పొడి – టీస్పూను బ్లాక్ సాల్ట్ – టీస్పూను కారం – టీస్పూను పచ్చిమిర్చి – ఐదు (మెత్తగా దంచాలి), నిమ్మకాయ – ఒకటి. తయారీ.. ►చామదుంపలను శుభ్రంగా కడిగి కుకర్గిన్నెలో వేసి, టీస్పూను ఉప్పు, ఏడుకప్పులు నీళ్లుపోసి మూడు విజిల్స్ రానివ్వాలి. ►మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ►చింతపండుని శుభ్రంగా కడిగి కప్పు వేడినీటిలో నానబెట్టాలి. ►నానిన చింతపండుని బాగా పిసికి గుజ్జుని వేరుచేసి రసాన్ని విడిగా తీసుకోవాలి. ►ఇప్పుడు ఉడికిన చామదుంపల తొక్కతీసి చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. ►దీనిలో చింతపడు రసం, ఆమ్చూర్ పొడి, టీస్పూను ఉప్పు, బ్లాక్ సాల్ట్, కారం, దంచిన పచ్చిమిర్చి, నిమ్మరసం పిండాలి. ►చివరిగా వాముని నల్లగా వేయించి వేయాలి. ►ఇవన్నీ చక్కగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన కచ్లు చాట్ రెడీ. ఇది కూడా ట్రై చేయండి: Mushroom Popcorn: మష్రూమ్ పాప్ కార్న్.. ఇంట్లోనే ఇలా ఈజీగా! Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్! -
Samantha : తల్లితో సమంత చేసిన వాట్సాప్ చాట్ రివీల్..
Samantha Conversation With Her Mother Post Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ విషయంలో దూకుడు పెంచింది. వరుస సినిమాలు సైన్ చేస్తూ తనను తాను కొత్తగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా సామ్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే చైతూతో విడాకుల తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్న సామ్ గత కొన్నాళ్లుగా ''మై.. మమ్మా సెయిడ్''(మా అమ్మ చెప్పింది) ..అనే హ్యాష్‌ట్యాగ్‌తో వరుస పోస్టులు షేర్ చేస్తుంది. తాజాగా తన తల్లితో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టింది.'నాలోని కొత్తదనం నీకు తెలియదు.. నా ముక్కలను తిరిగి పేరుస్తా'.. అంటూ ఉన్న కొటేషన్‌ను సామ్‌కు ఆమె తల్లి వాట్సాప్‌లో షేర్ చేసింది. గాడ్ బ్లెస్ యూ మై బేబీ (ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి) అంటూ మెసేజ్‌ను కూడా పంపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. విడాకుల అనంతరం కూతురు డిప్రెషన్లోకి వెళ్లకుండా సామ్ తల్లి ఇలా మోటివేట్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
సింపుల్, డిలీటైన వాట్సాప్ డేటాను ఇలా బ్యాకప్ తీసుకోండి
వాట్సాప్ చాట్ డిలీట్ అయ్యిందా? లేదంటే పొరపాటున డిలీట్ చేశారా? మరేం పర్లేదు. సింపుల్ టెక్నిక్‌తో మీ ఫోన్లో డిలీట్ అయిన వాట్సాప్ చాట్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. అదెలా అంటే..! వాట్సాప్ పరిచయం అక్కర్లేని పేరు. ఫేస్బుక్ కు చెందిన ఈ వాట్సాప్ యాప్‌లో వరల్డ్ వైడ్‌గా ఉన్న యూజర్లు ప్రతి రోజు ఇమేజెస్, ఆడియా, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు యూజర్లను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిస్తుంటారు. ఆ డేటాను వాట్సాప్ సంస్థ తన సర్వర్లలో నుంచి తొలగిస్తుంది. అయితే ఈ సింపుల్ హ్యాక్‌తో వాట్సాప్‌లో డిలీటైన డేటాను కలెక్ట్ చేసుకోవచ్చు. ముందు చాట్‌ను బ్యాకప్ తీసుకోవాలి డిలీటైన డేటాను రీస్టోర్ చేసుకోవాలి' అంటే ముందుగా మీ వాట్సాప్‌లో వాట్సాప్ డేటా బ్యాకప్ తీసుకోవాలి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వాట్సాప్ ఓపెన్ చేసి>>సెట్టింగ్‌లోకి వెళ్లాలి>>అందులో చాట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చాట్‌ను బ్యాకప్‌ను తీసుకోవాలి. అనంతరం ఆ డేటాను బ్యాకప్ తీసుకోవాలంటే గూగుల్ డ్రైవ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో ఫైల్ క్రియేట్ చేసుకొని బ్యాక్ అప్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ డేటా అంతా మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. గూగుల్ డ్రైవ్‌లో మీ వాట్సాప్ డేటా స్టోర్ అవ్వాలంటే గూగుల్ డ్రైవ్‌లో మీ వాట్సాప్ డేటా డీఫాల్ట్‌గా స్టోర్ అవ్వాలి అంటే మీరు ఆటోమెటిక్ బ్యాకప్ ఫీచర్ ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాకప్‌ని పునరుద్ధరించడానికి మీరు బ్యాకప్ తీసుకున్న వాట్సాప్ డేటాను చూడాలంటే మీ కంప్యూటర్ లో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ లేదా ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి ఫైల్‌లను ఫోన్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి. ఫైల్ మేనేజర్ యాప్‌లో, మీ లోకల్ స్టోరేజ్ లేదా ఎస్డీకార్డ్ >> వాట్సాప్ >> డేటాబేస్‌లోకి నావిగేట్ చేయండి. మీ డేటా ఎస్డీ కార్డ్‌లో స్టోరేజ్ కాలేదంటే బదులుగా మీరు "ఇంటర్నల్‌స్టోరేజ్ " లేదా "మెయిన్ స్టోరేజ్"లో చూడొచ్చు. చదవండి: వాట్సాప్ మెస్సేజ్‌లతో జర జాగ్రత్త.. లేకపోతే మీ ఖాతా ఖాళీ! -
వృద్దుడు చేసిన వెరైటీ చాట్
మీరు ఇప్పటి వరకూ చాలా రకాలైన చాట్లు గురించి విని ఉంటారు. కానీ ఈ మొలకల చాట్ గురించి ఎప్పుడైనా విన్నారా. అయితే కాన్పూర్‌కి చెందిన ఓ వృద్ధుడు చేసిన మొలకల చాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) ఈ వీడియోలో ఆ వృద్ధుడు మొలకలతో ఒక చిరుతిండి తయారుచేస్తున్నట్లు ఉంటుంది. ఆ వీడియోలా అతను ఆకులతో తయారు చేసిన ఒక గిన్నెలో వివిధ రకాల మొలకలు వేస్తాడు. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, గ్రీన్ చట్నీ, ముల్లంగి తరుగుతో అలంకరించి సర్వ్ చేస్తాడు. అయితే ఆ వృద్ధుడు ఈ చాట్ తయారు చేస్తున్నంత సేపు చక్కగా నవ్వుతూ టకటక చేసేస్తాడు. దీంతో నెటిజన్లు అంతా ఎంత మంచి చిరునవ్వు , దేవుడు అతన్నెప్పుడూ చల్లగా చూడాలంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!) View this post on Instagram A post shared by Gaurav Wasan (@youtubeswadofficial) -
వార్నీ... వీక్లీ ఆఫ్ రోజు తాగొద్దన్నందుకు జాబ్ మానేశాడు
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్‌కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. (చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...) రెడిట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్‌లో బాస్ తన బార్ అటెండర్‌కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్. అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు. (చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!) అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్‌ని దులిపిపారేస్తాడు. ‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్‌కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్‌లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్‌గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు. (చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..) అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్‌బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే..
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారని అంటుంటారు. ఈ విషయంలో సాధారణ ప్రజలకు డూపుల కన్నా సెలబ్రిటీల డూపుల ఫోటోలు మాత్రం సోషల్‌మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లా ఉన్న వ్యక్తి ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే....! వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఫూల్ బాగ్ ఏరియాలో మోతీ మహల్ ముందు గుప్తా చాట్ పేరుతో ఓ వ్యక్తి స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు.ప్రస్తుతం అతను సెలబ్రిటీలా మారిపోయాడు. ఎందుకుంటే అతను అచ్చం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పోలి ఉన్నాడు కాబట్టి. తన స్టాల్లో.. రుచికరమైన చాట్‌తో పాటు స్వీట్లకు అది ఫేమస్. ఇటీవల ఫుడ్ బ్లాగర్ నడుపుతున్న ఓ వ్యక్తి ఈ గుప్తా చాట్ నిర్వాహకుడిని వద్దకు వస్తాడు. చాట్ నిర్వాహకుడు సీఎం కేజ్రీవాల్‌లా ఉండటంతో చూసి అతను ఆశ్చర్యపోతాడు.(చదవండి: Viral Video: బాబోయ్ ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. తల్లి మెడకు సైకిల్ లాక్ వేసి..) ఇంకేముంది షాక్ నుంచి తేరుకుని అతన్ని సంప్రదించి తను చేసే వంటని వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. సెలబ్రిటీ అందులోనా దేశరాజధానికి సీఎంను పోలి ఉండడంతో అది వైరల్‌గా మారి నెట్టింట దూసుకుపోతుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు సడెన్‌గా చూసి కేజ్రీవాల్ చాట్ అమ్మడమేంటని అనుకున్నా..తీరా చూస్తే తెలిసింది అతను డూప్లికేట్ కేజ్రీవాల్ అంటూ కామెంట్స్ చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ డూప్లికేట్ కేజ్రీవాల్‌ను ఒక్కసారైనా కలవాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి: Funny Video: ఏయ్ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు -
వాట్సాప్‌లో రూపాయి సింబల్ ఫీచర్..ఎందుకంటే
న్యూఢిల్లీ: చాట్ కంపోజర్‌కు రూపాయి గుర్తును జోడించినట్టు వాట్సాప్ ప్రకటించింది. చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వినియోగదార్లకు అందరికీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ తోడవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాగే కంపోజర్లో ఉన్న కెమెరాతో 2 కోట్లకుపైగా స్టోర్లలో క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేయవచ్చు. 1.5 కోట్ల మంది చిన్న వర్తకులు వాట్సాప్ బిజినెస్ యాప్ వాడుతున్నారు. వీరంతా వాట్సాప్ యూజర్ల నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. పేమెంట్స్ సేవలను కంపెనీ భారత్‌లో గతేడాది నవంబర్‌లో ప్రారంభించింది. చదవండి: వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ఫర్ ఇలా చేయండి.. -
వాట్సాప్ మరో ఫీచర్, పాస్ వర్డ్ మరిచిపోతే అంతే సంగతులు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. 2.21.1.5.5 ఆండ్రాయిడ్ యూజర్లు హెచ్డీ ఇమేజ్‌లను సెండ్ చేయడంతో పాటు, వాట్సాప్ చాట్‌ను స్టోర్ చేసుకునేలా డిజైన్ చేసింది. అతి తక్కువ టైంలో మిలియన్ యుజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్ వినియోదారులకు కోసం రోజురోజుకు ఫీచర్ అప్డేట్స్తో యూజర్లను మరింతగా ఆకర్షిస్తుంది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది.. అయితే తాజాగా వాట్సాప్ హెచ్డీ ఇమేజెస్ సెండ్ చేయడంతో పాటు స్నేహితులతో చేసిన చాట్‌ను థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకునే సదుపాయం కల్పిచ్చింది. వీ బీటా ఇన్ఫో ప్రకారం.. గతంలో మనం వాట్సాప్‌లో చేసే మెసేజెస్, చాట్ స్టోర్ అయ్యేది కాదు. అయితే తాజాగా వాట్సాప్ ఈ చాట్ ను స్టోర్ చేసేందుకు బీటా వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఎవరైనా చాట్ ను గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? వాట్సాప్ తెచ్చిన ఫీచర్ సాయంతో మీ వాట్సాప్ చాట్ ను స్టోర్ చేసేందుకు పాస్ వర్డ్ ను క్రియేట్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు పాస్వర్డ్ సాయంతో స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ మెసేజ్‌లను చదువుకోవచ్చు. అయితే పొరపాటున మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మరిచి పోతే స్టోర్ చేసుకున్న చాట్ ను ఓపెన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోతే స్టోర్ చేసుకున్న వాట్సాప్ చాట్‌కు పాస్వర్డ్ ఉండేలా డిజైన్ చేసింది. పాస్ వర్డ్ మరిచిపోతే 64 అంకెలతో వాట్సాప్ encrypts చేసింది. ఈ కీ సాయంతో మీరు పాస్ వర్డ్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. పొరపాటున అప్ డేట్ చేసుకున్న పాస్వర్డ్ మిస్ అయితే స్టోర్ చేసుకున్న డేటాను చూసే యాక్సెస్ ను మిస్ అవుతారు. చదవండి : కోట్ల ఆస్తిని కేవలం ఒక్కడాలర్‌కే అమ్మాడు,కారణం ఇదేనా.! -
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా 2బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో చాట్ చేసేటప్పుడు ప్రతి ఛాట్ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. దీనికోసం కొత్తగా వాల్‌పేపర్ గ్యాలరీ అప్డేట్ చేశారు. అలాగే వినియోగదారులు స్టిక్కర్లను టెక్స్ట్ లేదా ఎమోజీలతో సహాయంతో శోధించడానికి ఒక ఫీచర్ ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క “టుగెదర్ ఎట్ హోమ్” స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు యానిమేటెడ్ స్టిక్కర్లుగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.(చదవండి: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే) కస్టమ్ వాల్‌పేపర్ ఫీచర్లో భాగంగా కొత్తగా 32 బ్రైట్ వాల్‌పేపర్స్, 30 డార్క్ వాల్‌పేపర్స్ ఇస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్ లో తెలిపింది. మీ ఫోన్ లో లైట్ మరియు డార్క్ మోడ్ సెట్టింగుల కోసం ప్రత్యేక వాల్పేపర్లను కూడా ఎంచుకోవచ్చు. మీ ఫోన్ లో డార్క్ మోడ్ మారినప్పుడు మీ చాట్ యొక్క వాల్‌పేపర్ దానంతట అదే మారనుంది అని పేర్కొంది. వాట్సాప్ డిఫాల్ట్ డూడుల్ వాల్‌పేపర్‌ను మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. మీకు నచ్చిన వాల్‌పేపర్ ఎంచుకొని దానికి తగినట్లుగా బ్రైట్ నెస్, ఓపెసిటీలో మార్పులు చేసుకోవచ్చు. ఒక వేళ మీకు ఇది నచ్చకపొతే పాత వాల్‌పేపర్ ఎంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది అని ఫేసుబుక్ తెలిపింది. త్వరలో దీనిని అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. -
‘షారుక్‌లా అవ్వాలంటే ఏం తినాలి?’
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి.. అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి.. వారిని ఖుషి చేశారు. మంగళవారం సాయంత్రం షారుక్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో ట్విట్టర్ చాట్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలతో పాటు ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ ‘మీ సాధారణ స్నేహితులతో కలిసి డిన్నర్‌కి వెళితే బిల్‌ని అందరూ షేర్ చేసుకుంటారా.. లేక మీరే పే చేస్తారా’ అని అడిగారు. అందుకు షారుక్ చాలా ఫన్నీ ఆన్సర్ చెప్పారు.‘ ఫేమస్, నాన్ ఫేమస్ కాదు.. వారే పే చేస్తారు. ఎందుకంటే నేను అసలు డబ్బులే తీసుకెళ్లను’ అన్నారు. మరో యూజర్‘ మీరు నవ్విన ప్రతిసారి ఆకాశంలో ఓ కొత్త నక్షత్రం పుడుతుంది. ఆ విషయం మీకు తెలుసా ’అని ప్రశ్నిస్తే.. అందుకు బాద్ షా ‘నిజమా.. అలా అయితే నేను ఇంకా ఎక్కువ నవ్వుతా. అలా ఓ చిన్న ఫ్లూటోని తయారు చేసి విశ్వంలోకి పంపుతా’ అంటూ సమాధానమిచ్చారు. (చదవండి: ట్రోలింగ్; నువ్వు అసహ్యంగా ఉన్నావ్) మరొక అభిమాని ‘షారుక్ ఖాన్‌లాగా మారాలంటే నేను ఏం తినాలి’ అని ప్రశ్నించాడు. అందుకు ఎస్ఆర్కే ‘ఇది ఒక జోక్. నేను కొంతకాలం క్రితం చదివాను. నా ఉద్దేశ్యం కాదు. ఒక జోక్ మాత్రమే. ఏంటంటే ప్రజలు తినాలని చెప్తారు.. కానీ నేను మాత్రం ఎప్పుడు భారీగా తినలేదు’ అన్నారు. ఇక త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తానని తెలిపారు. కోవిడ్ పరిస్థితులు కంట్రోల్ కాగానే కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తాను అన్నారు. ఇక నవంబర్ 2న షారుక్ పుట్టిన రోజు. ఈ క్రమంలో ఈ ఏడాది తనను విష్ చేయడానికి అభిమానులు తన ఇంటి వద్ద గుమి కూడవద్దని కోరారు. ప్రతి ఏడాది షారుక్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన నివాసం మన్నత్ వద్దకు చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతారు. కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అలా చేయవద్దని కోరారు. -
నీలమాధవుడు
ఆదివాసీలుండే ఆ ప్రాంతంలో జటిలుడు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ తల్లికి అతడొక్కగానొక్క బిడ్డ. వాడికి నాలుగు అక్షఱం ముక్కలు చెప్పించాలన్న తపనతో ఆ తల్లి అతడిని రోజూ బడికి పంపించేది. బడికి వెళ్లాలంటే ఆ బుడతడు రోజూ సమీపంలోని చిట్టడివిగుండా ప్రయాణించాల్సిందే. ఒక్కణ్ణే రోజూ అంతదూరం నడిచి వెళ్లాలంటే తనకు భయంగా ఉంటోందని తల్లితో అన్నాడొక రోజు. అందుకు ఆ తల్లి ‘‘నువ్వు ఒంటరిగా ఏమీ వెళ్లడం లేదు. నీకు తోడుగా నీ అన్న నీలమాధవుడున్నాడు. నీకు భయం వేస్తే అతడిని పిలువు. తప్పక వస్తాడు’’ అని ధైర్యం చెప్పి, భగవంతుడిపై భారం వేసి, అతడిని బడికి పంపింది. తల్లిమాటపై నమ్మకం, అన్న ఉన్నాడనే ధీమా అతడిని రోజూ విడవకుండా బడికెళ్లేలా చేశాయి. ఒకరోజు బడిలో ఏదో ఆటల కార్యక్రమం ఉండడంతో అక్కడే బాగా ఆలస్యమైంది. దాంతో భయం భయంగానే ఇంటికి బయల్దేరాడు. అడవి మధ్యలోకి రాగానే ఆ జటిలుడికి భయం వేసింది. దాంతో ‘‘అన్నా! నీల మాధవా! ఎక్కడున్నావు, తొందరగా రా! నాకు భయంగా ఉంది’’ అని ఆర్తిగా పిలిచాడు. ఇంతలో నల్లగా, అందంగా ఉన్న ఓ పది పన్నెండేళ్ల కుర్రాడొకడు పరుగు పరుగున వచ్చాడక్కడికి. ‘‘తమ్ముడూ, నేనున్నాను. నీకేం భయం లేదు’’ అంటూ రకరకాల కబుర్లు చెబుతూ ఆ పిల్లాడి చెయ్యి పట్టుకుని అడవి దాటించాడు. ‘‘తమ్ముడూ, ఇక వెళ్తాను’’ అంటున్న ఆ నల్లపిల్లాడితో ‘‘అన్నా, నాకు భయంగా ఉంటోంది. రోజూ వస్తావా’’ అనడిగాడు. ‘‘ఓ! తప్పకుండా ’’ అంటూ చేతిలో చెయ్యేశాడతను. అప్పటినుంచి అడవిలోకి రాగానే ‘అన్నా’ అని ఇతడు పిలవడం, ‘ఇదుగో వస్తున్నాను తమ్ముడూ’ అంటూ అతగాడు వచ్చి మెడమీద, భుజాల మీద, ఒకోసారి నెత్తిమీద కూచోబెట్టుకుని ఇతన్ని అడవి దాటించడం.. ఇలా ప్రతిరోజూ జరిగింది.. ఆ పిల్లాడికి కాస్త మంచీ చెడూ తెలిసేదాకా. తర్వాత్తర్వాత అడవికి వచ్చినా జటిలుడికి భయం వేసేదీ కాదూ, అన్నను పిలిచేవాడూ కాదు. నేను పిలిచినా అన్న వస్తాడో రాడో, అసలు తనకు అన్నంటూ ఉంటేగా రావడానికి అనే అనుమానం ఇతని మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పట్నుంచీ ఇతను పిలవడం, అన్న రావడం రెండూ జరగలేదు! అందుకే అన్నారు భయం అనేది నిజం. భక్తి అనేది నమ్మకం. భయం ఉంటేనే భక్తి కలుగుతుంది. మనసు స్వచ్ఛంగా ఉంటేనే భయభక్తులు ఉంటాయి. చిన్నారులు నవ్వినంత స్వచ్ఛంగా, అందంగా మనం నవ్వగలమా మరి! కల్లాకపటం తెలియని వయసులో ‘‘అన్నా... రావా! భయంగా ఉంది’ అని పిలిచినట్టు ఆ తర్వాత అతను పిలవగలిగాడా? – డి.వి.ఆర్. -
చాట్ చేద్దామా
మాట్లాడే అవకాశం అస్సలు లేదు. అయినా తింటూ మాట్లాడటం తప్పు కదా! ఇంట్లో ఈ చాట్ చేసుకుంటే బాగుంది... బహు బాగుంది... అని చెప్పుకోవడానికి మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్! చాట్ చేసుకుందాం! స్వీట్ పొటాటో చాట్ కావలసినవి : చిలగడ దుంపలు – పావు కేజీ; మిరియాల పొడి – పావు టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ : చిలగడదుంపలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, ఉప్పు జత చేయాలి (ఇష్టపడేవారు మిరపకారం, చాట్ మసాలా కూడా జత చేసుకోవచ్చు) ♦ నిమ్మరసం జత చేసి జాగ్రత్తగా కలిపి వెంటనే అందించాలి. ఫ్రూట్ చాట్ కావలసినవి : ఆపిల్ ముక్కలు – అర కప్పు; అరటి పండు ముక్కలు – ఒక కప్పు; సపోటా పండు ముక్కలు – ఒక కప్పు; బొప్పాయి ముక్కలు – ఒక కప్పు; డ్రైఫ్రూట్స్ – పావు కప్పు (జీడిపప్పు, వాల్నట్, బాదం పప్పులు...); పుదీనా ఆకులు – అలంకరణకు తగినన్ని; చాట్ మసాలా – టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; స్వీట్ చట్నీ – టేబుల్ స్పూను తయారీ : ఒక పాత్రలో ఆపిల్ ముక్కలు, అరటి పండు ముక్కలు, సపోటా ముక్కలు, బొప్పాయి ముక్కలు వేసి కలపాలి ♦ స్టౌ మీద బాణలిలో డ్రైఫ్రూట్స్‌ను నూనె లేకుండా వేయించి తీసి, పండ్ల ముక్కల మీద వేశాక, చాట్ మసాలా, జీలకర్ర పొడి, స్వీట్ చట్నీ వేయాలి చివరగా పుదీనా ఆకులతో అలంకరించి వెంటనే అందించాలి. పాలక్ చాట్ కావలసినవి : పాలకూర – 3 కప్పులు; సెనగ పిండి – అర కప్పు; పసుపు – చిటికెడు; ఇంగువ – చిటికెడు; మిరప కారం – చిటికెడు; సోంపు – చిటికెడు; వాము – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూను; నీరు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా చాట్ కోసం ఉల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – చిన్న కప్పు; గ్రీన్ చట్నీ – చిన్న కప్పు; స్వీట్ చట్నీ – చిన్న కప్పు; సేవ్ – తగినంత; మెత్తగా పొడి చేసిన పూరీలు లేదా పాపడ్ – అర కప్పు; దానిమ్మ గింజలు – పావు కప్పు; చాట్ మసాలా – తగినంత; గసగసాలు – కొద్దిగా; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు తయారీ : పాలకూరను శుభ్రంగా కడిగి, తడి పోయే వరకు పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ♦ ఒక పాత్రలో సెనగ పిండి, పసుపు, ఇంగువ, మిరప కారం, జీలకర్ర పొడి, గసగసాలు, ఉప్పు వేసి బాగా కలపాలి ♦ తగినన్ని నీళ్లు జత చేసి మిశ్రమాన్ని బజ్జీల పిండిలా కలపాలి ♦ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పాలకూరను సెనగపిండి మిశ్రమం లో ముంచి బజ్జీల మాదిరిగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. పాలక్ చాట్ తయారీ ♦ సర్వింగ్ ప్లేట్లలో పాలక్ పకోడీలు వేసి, వాటి మీద గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేయాలి ♦ పైన ఉల్లితరుగు, పెరుగు వేయాలి ♦ తగినంత చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు పైన చల్లాలి ♦ చివరగా సేవ్, పాపడ్ పొడి వేసి, కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలతో అలంకరించి ఆలస్యం చేయకుండా అందించాలి. ఇడ్లీ చాట్ కావలసినవి : ఇడ్లీలు – 10; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; పుదీనా + కొత్తిమీర చట్నీ – 2 టేబుల్‌స్పూన్లు; స్వీట్ చట్నీ – 2 టేబుల్ స్పూన్లు; బూందీ – ఒక టేబుల్ స్పూను; మిరప కారం – చిటికెడు; చాట్ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – కొద్దిగా; సన్నటి సేవ్ – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – పావు కప్పు తయారీ : ఇడ్లీలను కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ♦ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇడ్లీ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి ♦ ఉల్లి తరుగు, టొమాటో తరుగు జత చేయాలి ♦ ఇడ్లీ ముక్కల మీదుగా పడేలా పెరుగు వేయాలి ♦ పుదీనా + కొత్తిమీర చట్నీ, స్వీట్ ^è ట్నీలను వీటి మీద వేయాలి ♦ సేవ్, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా పైన చల్లాలి ♦ కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. కార్న్ చాట్ కావలసినవి : మొక్కజొన్న గింజలు – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; చాట్ మసాలా – టీ స్పూను; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; సేవ్ (సన్న కారప్పూస) – తగినంత తయారీ: మొక్కజొన్న గింజలను కుకర్‌లో ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ గింజలు చల్లారాక ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, మిరపకారం, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు జత చేసి బాగా కలపాలి ♦ మిశ్రమాన్ని చిన్న పాత్రలలోకి తీసుకుని, పైన సేవ్ వేసి వేడివేడిగా అందించాలి. మూంగ్ స్ప్రౌట్స్ చాట్ కావలసినవి: పెసర మొలకలు – 2 కప్పులు; ఉల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; టొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు టీ స్పూను; చాట్ మసాలా – టీ స్పూను; నిమ్మరసం – టీ స్పూను; ఉడికించిన బంగాళదుంప పెద్దది – 1; స్వీట్ చట్నీ – 2 టేబుల్ స్పూన్లు; గ్రీన్ చట్నీ – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – అలంకరించడానికి తగినంత; నల్ల ఉప్పు – తగినంత; సేవ్ – 4 టేబుల్ స్పూన్లు; అప్పడాలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి) తయారీ:పెసలను ముందురోజు రాత్రి నానబెట్టి, ఉదయాన్నే నీళ్లన్నీ ఒంపేసి, గాలి తగిలేలా ఉంచితే మరుసటి రోజుకి మొలకలు వస్తాయి ♦ పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, పెసలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ♦ పైన చెప్పిన పదార్థాలను (అప్పడాలు, నిమ్మరసం, సేవ్ మినహా) పెసలకు జత చేయాలి ♦ నిమ్మరసం వేసి కలపాలి కొత్తిమీర తరుగు, సేవ్ వేసి, చివరగా పైన అప్పడాల ముక్కలతో అలంకరించి అందించాలి. చైనీస్ భేల్ కావలసినవి : నూడుల్స్ – 75 గ్రా.; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నూనె – 2 టీ స్పూన్లు; క్యాబేజీ తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – పావు కప్పు; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల తరుగు – పావు కప్పు; గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూను; స్వీట్ చట్నీ – 2 టేబుల్ స్పూన్లు; సోయా సాస్ – అర టేబుల్ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; టొమాటో తరుగు – పావు కప్పు; వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; చాట్ మసాలా – పావు టీ స్పూను; ఉప్పు – కొద్దిగా; కొత్తిమీర – టేబుల్ స్పూను గార్నిషింగ్ కోసం.. ఉల్లికాడల తరుగు – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌స్పూను తయారీ : వెడల్పాటి పాత్రలో మూడు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ♦ రెండు మూడు చుక్కల నూనె జత చేయాలి ♦ నీళ్లు బాగా మరిగాక, నూడుల్స్ జత చేసి ఫోర్క్‌తో కలిపి, కొద్దిగా ఉడికిన తరవాత దింపేసి, నీళ్లు ఒంపేసి, నూడుల్స్‌ను చన్నీళ్లలో రెండు మూడు సార్లు జాడించినట్లుగా కడిగి, పెద్ద పళ్లెంలో ఆరబోసి, సమానంగా పరిచి రెండు గంటలపాటు ఆరనివ్వాలి ♦ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ను నూడుల్స్ మీద వేసి బాగా కలపాలి ♦ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక నూడుల్స్‌ను కొద్దికొద్దిగా వేస్తూ డీప్‌ఫ్రై చేసి, బంగారు వర్ణంలోకి వచ్చాక, ప్లేట్లోకి తీసుకోవాలి ♦ ఒక పెద్ద పాత్రలో వేయించిన నూడుల్స్‌ను ముక్కలు చేసి వేసుకోవాలి ♦ బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె కాగాక, పావు కప్పు ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి ♦ అర కప్పు క్యాబేజీ తరుగు, పావు కప్పు క్యారట్ తరుగు, పావు కప్పు క్యాప్సికమ్ తరుగు జత చేసి వేయించాలి ♦ గ్రీన్ చిల్లీ సాస్, స్వీట్ చట్నీ, సోయా సాస్ వేసి బాగా కలపాలి ♦ మిరియాల పొడి, ఉప్పు జత చే సి బాగా కలిపి దింపేయాలి ♦ ఉల్లికాడల తరుగు వేసి కలపాలి ♦ అన్ని రకాల కూరగాయ ముక్కలు జత చేయాలి ♦ టొమాటో తరుగు, వేయించిన పల్లీలు జత చేసి కలపాలి ♦ చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు జత చేయాలి కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను ఉల్లికాడల తరుగు జత చేసి కలపాలి ♦ కొద్దిగా నిమ్మరసం జత చేసి, అన్నీ బాగా కలిపి అందించాలి. -
సమంతతో నెటిజన్ల చాట్
సాక్షి, ప్రత్యేకం : మరికొద్ది గంటల్లో ప్రేమికులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకునేందుకు గోవా వెళ్లిన పెళ్లి కూతురు సమంత నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు అలానే సమాధానాలూ ఇచ్చారు. నెటిజన్లు శామ్‌ను ఏమడిగారో చూడండి.. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను కూడా నా చెయ్‌ను త్వరలో కలవాలనుకుంటున్నాను. నా కోసం మీరేం చేస్తారు? నీ చెయ్‌ను నువ్వు త్వరగా మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చెయ్ మీ స్పెషల్ పర్సన్ అని ఎలా తెలిసింది? తొలిచూపులోనే.. మీ బేబీకి గౌతమ్ మీనన్ అని పేరు పెడతారా? నవ్వు పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారా? నేను అసలు ఆపలేదు. మీ పెళ్లి వీడియోను మాతో పంచుకుంటారా? కచ్చితంగా షేర్ చేస్తాను. మీరు ప్రస్తుతం ఎలా ఉన్నారు? కొంచెం భయంగా, ఎక్సైటింగ్‌గా ఉంది. చెయ్కు నేను తనను ప్రేమిస్తున్నానని చెప్పండి అలానే చెప్తాను. నాగ చైతన్య ఏమైనా ఇబ్బందిపెడితే చెప్పు శామ్ మన 'శామ్ ఆర్మీ' మొత్తం వస్తుంది సో క్యూట్.. తొలి చూపులోనే ప్రేమ.. కరెక్ట్ లేదా రాంగ్? ఆ సమయంలో మీకే తెలుస్తుంది. -
ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో?
‘‘ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది చెప్పలేను. ఎందుకంటే.. నేనింకా ఎవర్నీ ప్రేమించలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. పెళ్లి ఘడియలు వచ్చినప్పుడు సంతోషంగా అందరికీ చెబుతా’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ప్రేమ, పెళ్లి, చెల్లి.. ఇలా వ్యక్తిగత జీవితం గురించి కాజల్ బోలెడు కబుర్లు చెప్పారు. ♦ మేజర్ (18 ఏళ్లు నిండిన) అయిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. జీవితాన్ని చూసే విధానంలో మార్పొచ్చింది. ‘మనం చిన్న పిల్లలం కాదు.. పెద్దవా ళ్లలా వ్యవహరించాలి’ అనుకుని ఏదో ఆరిందాలా బిహేవ్ చేయడం మొదలుపెట్టా. ♦ బాధ్యతతో మెలగడం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం ఉండడం నా బలం. ఎక్కువగా ఎమోషనల్ కావడం నా బలహీనత. ♦ ఇంట్లో ముద్దుగా కాజూ, గుడియా.. అని పిలుస్తుంటారు. నిషాని నేను చెల్లెలిలా మాత్రమే కాదు.. బెస్ట్ ఫ్రెండ్‌లా భావిస్తా. షూటింగ్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటా. ఫ్యామిలీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడమంటే ఇష్టం. రాజ్మా చావల్, పన్నీర్ నా ఫేవరేట్ ఐటమ్స్. పక్కన ఎవరూ లేరంటే పుస్తకాలతో దోస్తీ చేస్తా. నేనిష్టపడిన వ్యక్తులతో గడిపిన క్షణాలన్నీ మధురమైన జ్ఞాపకాలే. ♦ మల్టీ హీరోయిన్ ఉన్న సినిమాలు చాలా చేశా. వర్క్ పరంగా ఏ హీరోయిన్‌తోనూ సమస్యలు లేవు. బయటి హీరోయిన్లతో చేశాన కానీ నా చెల్లెలితో కలసి ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. తనతో కలసి నటించాలనుంది. ♦ హీరోయిన్ కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. బహుశా.. ఫొటోగ్రాఫర్ లేదా ట్రావెలర్ లేదా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేదాన్నేమో! నా డ్రీమ్ జాబ్ అంటే గరిటె తిప్పడమే. షెఫ్ (స్టార్ హోటల్లో వంట చేసేవారు) అయ్యేదాన్ని. సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేసేదాన్ని. ♦ నా ఫేవరెట్ హాలిడే స్పాట్ లండన్. అయితే.. నేనెక్కువసార్లు వెళ్లిన దేశం స్విట్జర్లాండ్. ఇండోనేషియా బాగా నచ్చింది. తూర్పు ఐరోపా, నార్వే, ఐస్‌ల్యాండ్ దేశాల్లో సీనరీలు బాగుంటాయి. ♦ సినిమాలకు వస్తే.. ఇప్పటివరకూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. కంప్లీట్ యాక్షన్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో? -
స్థానిక భాషలో సామాజిక మాధ్యమం!
♦ మాతృభాషలో వినియోగించుకునే వీలుండే షేర్‌చాట్ ♦ ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో.. ♦ నెల రోజుల్లో తమిళం, గుజరాతీ భాషలకు విస్తరణ ♦ రూ.10 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో షేర్ చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 30 కోట్ల లోపే. ఇందులో సామాజిక మాధ్యమాల యూజర్లు 15 కోట్ల కిందే. మరి ఇంత గ్యాప్ ఎందుకుంది? ఏ సోషల్ నెట్వర్కింగ్నైనా ఆంగ్లంలో వినియోగించాలనేది ఒక కారణమైతే! మెట్రో యువతతో పోల్చుకుంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువత ఇంగ్లిష్‌లో వెనకబడి ఉండటం మరో కారణం!! మరి రోజూ మనం మాట్లాడుకునే భాషల్లో సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వీలుంటే? ఎంచక్కా మాతృ భాషలో స్పందిస్తూ.. ఎప్పుడూ ఇతరులతో టచ్‌లో ఉంటూ ఎంజాయ్ చేయొచ్చు కదూ!! ఇదిగో ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ యాపే ‘షేర్‌చాట్’! యాప్ విశేషాలు, విస్తరణ ప్రణాళికల గురించి షేర్‌చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ మాటల్లోనే.. నాతో పాటూ అంకుష్ సచ్దేవ్, భాను సింగ్‌లు ముగ్గురం ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్స్. ఇంగ్లిష్‌లో కంటే స్థానిక భాషలో సామాజిక మాధ్యమాలను వినియోగించే వీలుంటే చాలా మందికి చేరుతుందని అనుకున్నాం. అందుకే లక్ష రూపాయల పెట్టుబడితో ఆరు నెలలపాటు యాప్, సాఫ్ట్వేర్, ఫీచర్లను అభివృద్ధి చేసి గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షేర్‌చాట్ సోషల్ నెట్వర్కింగ్ యాప్‌ను విడుదల చేశాం. షేర్ ప్రత్యేకత ఏంటంటే.. యూజర్లు తమ స్థానిక భాషలోనే కంటెంట్ పొందొచ్చు. పోస్ట్ చేయవచ్చు కూడా. ఫొటోలు, వీడియోలు, ఆడియోలు అన్నీ మీ భాషలోనే చేసుకునే వీలుంది. వీటికి తోడు న్యూస్, విషెస్, ఇతరుల కంటెంట్, ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు ఫాలో కావొచ్చు. నెలాఖరుకల్లా తమిళం, గుజరాతీలో.. ప్రస్తుతం తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం భాషల్లో షేర్‌చాట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి బెంగాళీ, కన్నడ, పంజాబీ, ఒడియా భాషలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి విడత ఈ నెలాఖరుకల్లా గుజరాతీ, తమిళ భాషలకు విస్తరించనున్నాం. ఫీచర్ల విషయానికొస్తే.. చాటింగ్, కామెంట్ ఫీచర్లనూ అందుబాటులోకి తెస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ లాంచ్‌ప్యాడ్ యాక్సలేటర్ కార్యక్రమానికి ఎంపికయ్యాం. మన దేశం తరపున ఎంకికైన ఏకైక యాప్ మాదే. ఇందులో 50,000 డాలర్ల నగదు బహుమతితో పాటూ 6 నెలల మెంటార్షిప్ కూడా ఇస్తారు. ఇటీవలే సైఫ్ పార్టనర్స్ నుంచి రూ.10 కోట్లు నిధులను సమీకరించాం. మరో మూడు నెలల్లో కొత్త ఇన్వెస్టర్ల నుంచి మరికొంత నిధుల సమీకరణ కూడా చేయనున్నామని ఫరీద్ వివరించారు. రోజుకు 2 లక్షల షేరింగ్స్ ప్రస్తుతం షేర్‌చాట్‌కు 12 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో సగానికి పైగా యాక్టివ్ యూజర్లే. నెలకు 4 లక్షల మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. రోజుకు 2 లక్షల కంటెంట్స్ షేరింగ్ అవుతున్నాయి. మొత్తం యూజర్లలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 5 లక్షల యూజర్లున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే అందుబాటులో ఉంది. నెల రోజుల్లో ఐఓఎస్ యాప్‌నూ అందుబాటులోకి తీసుకొస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఎంద చాటా... మనిషిని తినేస్తున్న చాటింగ్ వ్యసనం
చాటలు దేనికి వాడతారు? బియ్యంలో రాళ్లేరుకోవడానికి... ఏమీ తోచకపోతే విసనకర్రలా విసురుకోవడానికి ఈ రెండు కార్యక్రమాల వల్ల వ్యక్తికి, కుటుంబానికి ప్రయోజనాలుండేవి. కాని ఇప్పుడు ఇంకో కొత్త చాటొచ్చి పడింది. అదేనండీ చాట్... వాట్సప్ చాట్.రాళ్లల్లో బియ్యం ఏరుకున్నట్టుంది. ఈ చాట్లలో పనికొచ్చేవి తక్కువ, పనికి రానివి ఎక్కువా కాబట్టి. రాళ్లల్లో బియ్యం ఏరుకోవడమే ఎక్కువ. భార్య: హాయ్... భర్త: హలో.. భార్య: ఏం చేస్తున్నారు... భర్త: పెద్దగా ఏం లేదు... భార్య: టైమ్ రెండయ్యింది. భర్త: రెండయ్యిందా.. అరె.. చూడలేదే. భార్య: ఇక కిందకు దిగొచ్చుగా భోజనానికి. భర్త: ఇదిగో ఇప్పుడే వస్తున్నా. వాట్సప్‌లో భార్యభర్తల సంభాషణ ఇది. డ్యూప్లేలో నివాసం. పైన భర్త ఉంటే కింద నుంచి భార్య సాగించిన సంభాషణ ఇది. అతి మొదలు పూర్వం మనుషులు మాట్లాడుకునేవారు. ఒకరి ఇళ్లకు మరొకరు పోయి. ఒకరి పెళ్లికి మరొకరు పోయి. శుభకార్యం, చావు, కచ్చేరి దగ్గర, టీ స్టాళ్ల వద్ద, స్కూళ్లూ కాలేజీలలో, ఆఫీసుల్లో... ఒకరికొకరు ఎదురుపడితే మాట్లాడుకునేవారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకునేవారు. ఒకరి గురించి మరొకరు మాట్లాడుకునేవారు. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. కాని పక్కనున్న మనిషితో కాదు. ఎక్కడో ఉన్న మనిషితో. ఇంటికొచ్చిన మనిషితో కాదు ‘ఆన్లైన్’లో ఉన్న మనిషితో. ఎదురుగా ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న మనిషి కోసం తాపత్రయ పడే వింత మనస్తత్వం ఇప్పుడు ‘వాట్సప్’ వల్ల వచ్చి పడింది. ఫోన్‌కు ఖర్చవుతుందని, మెసేజ్‌లు చేస్తే బిల్లు పడుతుందని భయం ఉండేది. వాట్సప్ ఉంటే ఆ భయం ఏమీ లేదు. ఎన్ని గంటలైనా చాట్ చేసుకోవచ్చు. ఎంత మందితోనైనా చాట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చాట్ చేసుకోవచ్చు. నెట్‌కు పే చేయాలి. చాట్‌కు కాదు. కనుక ప్రతి ఒక్కరూ వాట్సప్‌కు ఆదరణ చూపారు. సమాచారం, ఫొటోలు, సంభాషణ సత్వరమే జరుపుకోవడానికి వీలు చూపే ఈ యాప్ మితంగా వాడుకుంటే మేలు. కాని శృతిమించితే ఇప్పుడది భయంకరమైన వ్యసనంగా మారే పరిస్థితి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్... స్మార్ట్ఫోన్లు చేతికొచ్చి వాట్సప్ యాప్ పెట్టుకున్నాక మొదట చేసేపని అందరికీ హాయ్ చెప్పడం. ఆ తర్వాత చేసే పనంతా చెవులు రిక్కించడమే. మనం చెప్పిన హాయ్‌కు బదులుగా ఎవరైనా హాయ్ చెప్తే బీప్ వస్తుంది. బీప్ వచ్చిన వెంటనే సెల్ చేతిలోకి తీసుకొని వాట్సప్‌లోకి వెళ్లి ఆ సమాధానం చెప్పిందెవరో చూడాలి. వెంటనే ఒక స్మైలీని రెస్పాన్స్‌గా పడేయాలి. మళ్లీ ఎవరు సమాధానం ఇస్తారా ఎదురు చూడాలి. గుడ్‌మార్నింగ్ చెప్పడం అలవాటవుతుంది. అందరికీ ‘గుడ్మార్నింగ్స్ ఫ్రెండ్స్’ అని చెప్తే ఒక ఆనందం. ఒట్టి గుడ్ మార్నింగ్ కాకుండా ఏదైనా కొటేషన్ ఉన్న కార్డ్ పోస్ట్ చేయడం నెమ్మదిగా అలవాటవుతుంది. ‘లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు హేట్ ఆన్ పీపుల్... గుడ్ మార్నింగ్’ అనే కొటేషన్‌తో ఉదయాన్నే వాట్సప్‌లో పోస్ట్ చేశాక మళ్లీ దానికి సమాధానం కోసం ఎదురు చూపు. ‘అబ్బ... చాలా మంచి కోట్ పెట్టావ్’ అని ఆ ఫ్రెండ్ రెస్పాండ్ అయితే ఆనందం... ఆ వెంటనే స్మైలీ పోస్టింగ్. ఇలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి... వాళ్ల సమాధానాలు... ప్రత్యుత్తరాలు... ఎంత టైమ్ వేస్ట్. డిస్ప్లే పిక్చర్... వాట్సప్ వ్యసనంలో పడ్డాక దానిని సజీవంగా ఉంచే వ్యసనం ‘డిస్ప్లే పిక్చర్’. వాట్సప్ మన ఫొటోను పెట్టుకునే ఏర్పాటు చేయడంతో కొందరికి రోజుకొక ఫొటో పెట్టడం అలవాటవుతుంది. ఇవాళ పడుకునే ముందు రేపేం ఫొటో పెట్టాలా అనే ఆలోచన. ఆ డిస్ప్లే ఫొటో చూసి ఫ్రెండ్స్ స్పందించి చాలా బాగున్నావ్... ఎక్కడ దిగావ్ అని అడిగితే ఆనందం. ఈ డిస్ప్లే కోసం సెల్ఫీల వలయంలో దిగాలి. గుడి దగ్గర సెల్ఫీ, మార్కెట్ దగ్గర సెల్ఫీ, భార్య/భర్తతో సెల్ఫీ, పిల్లలతో... తెలిసిన స్నేహితులకు తెలిసిన ముఖాలు... కాని మళ్లీ మళ్లీ పెట్టే వ్యసనం అలవాటవుతుంది. వీటి కోసం బట్టలు, కంటి అద్దాలు, అలంకరణ నగలు... ఇవి అదనంగా అవసరమవుతాయి. ఇతరులు పెట్టే ఫొటోలతో పోల్చి చూసుకోవడం... పోటీ పడటం... ఫలితంగా ఆశాంతిని కొని తెచ్చుకోవడం వాట్సప్ వల్ల వచ్చే అదనపు అనారోగ్యాలు. గ్రూపుల తలనొప్పి... పూర్వం కుటుంబాలు కలిసి మాట్లాడుకునేవి. కాని ‘మై ఫ్యామిలీ’ అని వాట్సప్ గ్రూప్ ఒకటి పెట్టుకుంటే చాలు. అందులోనే అన్ని పలకరింపులు అయిపోతాయి. మళ్లీ ఇక్కడ స్త్రీలకు రెండు ‘మై ఫ్యామిలీ’లు ఉంటాయి. భర్త తరఫు ఫ్యామిలీ ఒకటి. పుట్టింటి ఫ్యామిలీ ఒకటి. ఇక్కడి పోస్టింగులు వేరే. అక్కడి పోస్టింగులు వేరే. ఇక భర్త/భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక ఆ ఉద్యోగస్తులతో ఒక వాట్సప్ గ్రూప్. పాత కాలేజీ మిత్రులతో ఒక గ్రూప్. అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఉన్నవారందరితో ఒక గ్రూప్. ఆధ్యాత్మికత ఉంటే ఆధ్యాత్మిక ఆలోచనలు పంచుకునేవారితో ఒక గ్రూప్. జోక్స్ ఇష్టపడుతుంటే జోక్స్ షేర్ చేసేవారందరితో ఒక గ్రూప్... ఈ గ్రూప్‌లో రెగ్యులర్‌గా ఎవరో ఒకరు పోస్టింగులు చేస్తూ ఉంటారు. బీప్స్ మోగుతూ ఉంటాయి. ప్రతి దానికీ తెరిచి చూడాలనే తాపత్రయం. ఇక దేని మీదా ధ్యాస నిలవదు. ఒక్క నిమిషం చేతిలో నుంచి ఫోన్ దూరమైతే ప్రాణం పోతున్నంత పని. ఇవన్నీ మనుషులకు కొత్త సతమతాలు తీసుకొస్తున్నాయి. ఏకాంతంలో అంతరాయం... రోజంతా భర్త పని చేసి ఇంటికొస్తాడు. రోజంతా ఇంటి పని పిల్లల బాగోగులతో భార్య రాత్రికి కొంత తీరుబడి చేసుకుంటుంది. ఇద్దరూ రిలాక్స్ అయ్యి మాట్లాడుకునే సమయంలో దొరికిన ఆ కాస్త సమయాన్ని వాట్సప్ మెసేజస్ చెక్ చేసుకోవడానికి ఇటీవల భార్యాభర్తలు ఉపయోగిస్తున్నారని పరిశీలనల్లో తేలుతోంది. ఎవరో పంపిన వీడియోను చూసి భార్య నవ్వుతుంటే ఎవరో షేర్ చేసిన అడల్ట్ జోక్‌లో భర్త తల మునకలుగా ఉంటాడు. ఈ వ్యవహారం కాలక్రమంలో ఇరువురి మధ్యా దూరం పెంచుతోంది. ఒకరు అటెన్షన్ కోరుతున్నప్పుడు మరొకరు అది భార్య కాని భర్త కాని వాట్సప్‌లో మునిగి ఉంటే ఎదుటివారికి చిర్రెత్తుకొచ్చి కొట్లాటలు జరుగుతున్న పుణ్యం వాట్సప్‌కే దక్కుతోంది. అతిథులకు అమర్యాద... ఇంతకుముందు ఇంటికి ఎవరైనా వస్తే వారిని కూచోబెట్టి టీవీ చూస్తూ మాట్లాడటం ఒక అమర్యాదగా ఉండేది. కాని ఇప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా వారితో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేయడం చాలా మందికి నిత్యానుభవంగా మారింది. దీనివల్ల ఎదుటివారు మనసు కష్టపెట్టుకొని మెల్లగా బంధాలు అనుబంధాలు స్నేహాలు దూరమయ్యి తెలియని సాంఘిక బహిష్కరణ వాట్సప్ వల్ల జరుగుతోంది. అనవసరపు ఆందోళన... వాట్సప్‌లో మెసేజ్ చేస్తే అది అవతలి వారు చూస్తే వెంటనే ‘టిక్’ మార్క్ వస్తుంది. మరి వారు చూసి కూడా సమాధానం చెప్పకపోతే? ఎందుకు చెప్పలేదు అనే ఆందోళన. మనం మధ్యాహ్నం రెండింటికి మెసేజ్ పెడితే వాళ్ల వాట్సప్ స్టేటస్‌లో లాస్ట్ సీన్ (ఆఖరున ఎన్నింటికి వాడింది) మధ్యాహ్నం నాలుగున్నర అని చూపిస్తుంది. అంటే మన మెసేజ్ చూసి కూడా సమాధానం చెప్పట్లేదంటే ఏమని? ఈ అశాంతి ఒకటైతే మూడు నాలుగు రోజులుగా వాట్సప్‌లో ఫలానావారు ఎటువంటి మెసేజూ పెట్టకపోతే అదొక అశాంతి. కొందరు ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు. అంటే రాత్రి పదకొండు గంటలకు కూడా ఆన్లైన్లో ఉంటారు. ఈ సమయంలో కూడా ఆన్లైన్లో ఉన్నారంటే ఏం చేస్తున్నట్టు అని మరో ఆందోళన. ఇవన్నీ వాట్సప్ వ్యసనపరుల జీవితాలను కొరికి తినేస్తున్నాయి. దారి మళ్లించాలి వాట్సప్‌ను మితంగా వాడటం, కొన్ని సమయాల్లోనే వాడటం, మిగిలిన సమయాన్ని ఇష్టమైన వ్యాపకాలలోకి మళ్లించడం మంచిదని నిపుణులు అంటున్నారు. మద్యం, డ్రగ్స్ వలే మెదడు ఈ వ్యసనానికి అలవాటు పడటం ప్రమాదం అని సూచిస్తున్నారు. ముందు మనం ఈ వ్యసనానికి లోనయ్యాం అని గ్రహించి అటు పిమ్మట దానిని వదలించుకునే ప్రయత్నం గట్టిగా చేయకపోతే చాటింగ్ చేటుకు చిత్తయిపోక తప్పదు. - శశి వెన్నిరాడై సోషల్ మీడియా దుష్ర్పభావాలు ఫేస్బుక్, వాట్సప్.. ఏదైనాసరే మొదట తినేసేది మన సమయాన్ని! కొత్తలో ఉత్సాహంగా మొదలై తర్వాత వ్యసనంగా మారి టైమ్‌ను బలితీసుకుంటుంది. సోషల్ నెట్వర్కింగ్ అంతా స్మార్ట్ ఫోన్లోనే ఆపరేట్ చేసుకునే వీలుండడం వల్ల రకరకాల సైట్లు అరచేతిలో కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం టీనేజర్స్ మీద ఎక్కువగా ఉండి క్రైమ్‌రేట్ పెరిగే ప్రమాదం ఉంటోందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి. వీటివల్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ గందరగోళంలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని మానసిక నిపుణులు చెప్తున్న సత్యం. అలాగే ఫేస్బుక్, వాట్సప్‌లలో వ్యక్తిగత సమాచారం అంతా ఉంచడం వల్ల సైబర్ బుల్లీయింగ్ జరిగే ప్రమాదాలు ఎక్కువ అంటున్నారు సాంకేతిక నిపుణులు. అంతేకాదు వాట్సప్ గ్రూపులు, ఫేస్బుక్ పోస్టింగ్‌ల వల్ల ఎన్నో విషయాలు చర్చకు రావడం ఎంత నిజమో రచ్చకావడమూ అంతే వాస్తవం అంటున్నారు. వీటివల్ల అనవసరపు కవ్వింపులు, జోక్యాలు ఎక్కువై మనుషుల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతింటున్నాయట. -
'తండ్రి ప్రేమను మాటల్లో చెప్పలేము'
-
'నాన్నకు ప్రేమతో' టీమ్‌తో స్పెషల్ చిట్‌చాట్
-
'డిక్టేటర్' బాలయ్యతో చిట్ చాట్
-
రెండుసార్లు మిస్సయ్యా!
హీరోయిన్ అంజలి... పదహారణాల తెలుగమ్మాయి. తమిళ సినిమా వాకిట్లో... తెలుగు సిరిమల్లె చెట్టు. ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’తో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన అభినయాంజలి. బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’తో ఈ 14న సంక్రాంతి వేళ... మన వాకిళ్ళలో బాక్సాఫీస్ ముగ్గు వేస్తున్న సౌందర్యాంజలి. ఆమె ‘డిక్టేటర్’ అనుభవాలు... మనసులోని ముచ్చట్లలో మచ్చుకు కొన్ని... బాలకృష్ణ గారితో ఇది నా మొదటి సినిమా. నిజానికి, గతంలో రెండుసార్లు ఆయనతో కలసి నటించే ఛాన్స్‌లు మిస్సయ్యా. ‘లెజెండ్’లో రాధికా ఆప్టే నటించిన పాత్రకు అడిగారు. కుదరలేదు. అలాగే, ‘లయన్’లో హీరోయిన్గా అడిగినప్పుడు డేట్స్ప్రాబ్లమ్. చివరికి ‘డిక్టేటర్’తో కుదిరింది. మొదట భయపడ్డా! బాలకృష్ణ గారితో సినిమా అనగానే, ‘ఆయన పెద్ద హీరో. సెట్స్‌పై ఎలా ఉంటారో ఏమిటో’ అని భయపడిన మాట నిజం. అలాగే, బయట చాలామంది దగ్గర ఆయన గురించి విన్న మాటలతో టెన్షన్‌పడుతూ వెళ్ళాను. కానీ, బయట అనుకొనేదానికీ, నిజానికీ చాలా తేడా ఉంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. తోటి నటీనటులకు చాలా స్పేస్ ఇస్తారు. సెట్స్‌లో నటిస్తున్నప్పుడు మనకు మంచి టిప్స్ ఇస్తారు. మనం ఒకటికి రెండు టేక్‌లు తీసుకున్నా, విసుక్కోకుండా సహకరిస్తారు. హీరోయిన్ దగ్గర నుంచి లైట్‌మెన్ దాకా ప్రతి ఒక్కరితో బాగుంటారు. స్నేహంగా, జోవియల్‌గా ఉంటారు. ఆయన దగ్గర అది నేర్చుకున్నా! కెమేరా ముందు ఎలా ఉండాలి, ఎమోషన్స్‌లో ఖాళీ వచ్చినప్పుడు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలి లాంటి చాలా టిప్స్ ఆయన చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి పంక్చువాలిటీ నేర్చుకున్నా. ఫలానా టైమ్‌కి షూటింగంటే, ఆయన షాట్ ఉందా, లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఆయన రెడీ అయి, కూర్చొనేవారు. పెద్ద హీరో ఆయనే రెడీగా ఉంటారని, దానికి భయపడి మిగిలినవాళ్ళందరం ఆ టైమ్‌కి సిద్ధంగా ఉండేవాళ్ళం. ♦ నేను ఒక డాక్టర్‌ను చేసుకొని, పిల్లను కనేశానని పుకారొచ్చింది. తాజాగా టీవీ యాంకర్ ఓంకార్ ‘రాజుగారి గది’ సీక్వెల్లో చేస్తున్నా ననీ, ఆయనతో సన్నిహితంగా ఉన్నాననీ నెట్లో రాశారు. అవన్నీ వట్టి పుకార్లే. ♦ నా సహ నటీనటులందరూ నాకు స్నేహితులే. సినిమాలు తెగ చూస్తాను. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా నటీనటులకు మెసేజ్‌లు కూడా పెడతాను. అలా పిలవాలంటే కంగారుపడ్డా! తోటి నటీనటుల్ని బాలాగారెంత కంఫర్ట్‌గా ఉంచుతారంటే, నేను ‘బాలకృష్ణ గారూ, సార్’ అని పిలుస్తుంటే నన్ను పిలిచి, ‘కాల్ మి బాలా’ అన్నారు. నేను కంగారుపడిపోయి, అలా పిలవలేనన్నా. చివరికి ‘బాలా గారూ అని పిలుస్తా’ అన్నా. సరే అన్నారు. అలా సాన్నిహిత్యం పెరిగింది. ఆయన అలా పోల్చడం నా అదృష్టం! ‘డిక్టేటర్’ చాలా మంచి స్క్రిప్ట్. రచయిత కోన వెంకట్ గారు కథ వినిపిస్తున్నప్పుడే అది అర్థమైంది. కథ రాస్తున్నప్పుడే ఈ పాత్రకు నేను బాగుంటానని పేరు రాసుకున్నారట. ఢిల్లీలో వర్కింగ్ గర్ల్‌గా నా పాత్ర యూత్‌ఫుల్‌గా, చలాకీగా బాగుంటుంది. పాత్ర పేరు విచిత్రంగా ఉంటుంది. బయటపెట్టలేను కానీ, సినిమాలో ప్రధాన భాగమంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పైగా, నాలోని నటనను హైలైట్ చేసే సీన్లు ఉన్నాయి. ఎడిటింగ్‌లో, ఆ తరువాత డబ్బింగ్లో అవి చూసిన బాలకృష్ణ గారు నన్ను ‘మహానటి సావిత్రి’తో పోల్చడం, అంత లెజండరీ యాక్టర్‌తో ఆ ప్రశంస అందుకోడం నా అదృష్టం! ఫస్ట్ రోజే టెన్త్ ఎగ్జామ్! ఈ సినిమా సెట్స్‌కు వెళ్ళిన మొదటి రోజే పాట షూటింగ్. పైగా ‘గణ...గణ’ అనే మాస్ బీట్ పాట. అంతే! బాలా గారు మంచి ఎనర్జీతో స్టెప్స్ వేస్తున్నారు. నాకు టెన్ష నొచ్చింది. ఫస్ట్‌రోజే టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నట్లనిపించింది. ‘ప్రాక్టీస్ చెయ్. నువ్వు రెడీ అయ్యాక చేద్దా’మని బాలా ప్రోత్సహించారు. అయిదున్నర కిలోలు తగ్గా! ‘డిక్టేటర్’లో వర్కింగ్ గర్ల్ పాత్ర కాబట్టి, ఈ సినిమా అనుకున్నప్పుడే కొంచెం సన్నగా ఉండాలని దర్శక - నిర్మాత శ్రీవాస్ చెప్పారు. అందుకని ప్రత్యేకించి అయిదున్నర కిలోలు తగ్గా. హెయిర్‌స్టైల్, లుక్, శ్యామ్ కె. నాయుడు కెమేరా పనితనంతో తెరపై వేరే కొత్త అంజలిని చూడవచ్చు. ఫ్రెష్‌గా, యంగ్‌గా కనిపిస్తా. ట్రాన్సజెండరూ కాదు... వేశ్యా కాదు..! ఇప్పుడు నా బేస్ హైదరాబాద్. ఇక్కడే ఉంటున్నా. తమిళ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా కాబట్టి, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. తెలుగు-తమిళాల్లో ‘చిత్రాంగద’, తమిళంలో కార్తీక్ సుబ్బ రాజు ‘ఇరైవి’ లాంటివి రిలీజ్‌కు సిద్ధమవుతు న్నాయి. మమ్ముట్టి గారితో తమిళ చిత్రం ‘పేరన్బు’ షూటింగ్ మంగళవారం నుంచి. అందులో నాది ట్రాన్సజెండర్ పాత్ర అనీ, వేశ్య పాత్ర అనీ రాస్తు న్నారు. అది నిజం కాదు. కొత్తగా రెండు తెలుగు స్క్రిప్ట్స్ విన్నా. వాటికి సైన్ చేయాలి. -
గ్లామర్ పోస్తే గ్రామర్ రాదు!
ఇంటర్వ్యూ ‘జన్నత్’ సినిమాతో బాలీవుడ్లో, ‘రెయిన్బో’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. వచ్చిన అవకాశాన్నల్లా అంది పుచ్చుకుంటూ సాగిపోతోంది. కదిపితే బోలెడు కబుర్లు చెబుతుంది. ఏం ఇష్టపడుతుందో, ఎలాంటి వాడిని ప్రేమిస్తుందో, ఎవరంటే పడి చస్తుందో కూడా మొహమాటం లేకుండా చెబుతుంది. స్టార్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, గ్లామర్ ఉన్నంత మాత్రాన నటనలో గ్రామర్ రాదు అంటూ ఆమె చెబుతోన్న సంగతులు చదవండి! * కెరీర్ ఎలా మొదలైంది? అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన నన్ను ఇంత దూరం నడిపించింది. పదిహేడేళ్ల వయసులో ఓ కాఫీ షాపుకి వెళ్లాను. అక్కడ ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ నన్ను ఫొటో తీసి ఓ పేపర్లో వేశాడు. దానికి చాలా రెస్పాన్స వచ్చింది. దాంతో మలేసియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం పోటీల్లో పాల్గొన్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ పోటీలో గెలిచిన మొదటి భారతీయురాలిని నేనే. ఆ తర్వాత మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. పాండ్స్, నోకియా, లేస్, పెప్సీ, హీరో హోండా లాంటి ఫేమస్ కంపెనీల యాడ్స్ చేశాను. మెల్లగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. * టాలీవుడ్‌కి ఎలా వచ్చారు? బాలీవుడ్లో ‘జన్నత్’ సినిమా చేశాక దర్శకుడు వీఎన్ ఆదిత్య ఫోన్ చేసి ‘రెయిన్బో’ చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. తర్వాత లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో చిత్రాలు చేశాను. * ‘రెయిన్బో’కి ‘లెజెండ్’కి మధ్య అంత గ్యాప్ ఎందుకు? ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగు తుంది. ఏ అవకాశం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అది వచ్చేవరకూ ఎదురు చూడాలి, చూశాను. కాబట్టి ఆ గ్యాప్ గురించి పనిగట్టుకుని చర్చించడానికి ఏమీ లేదు. * నటిగా ఫాలో అయ్యే ఫార్ములా? ఎప్పుడు ఏ సినిమా చేసినా, అదే నాకు ఫస్ట్ సినిమా అని అనుకుం టాను. మొదటిసారి కెమెరా ముందు నిల బడినట్టు ఫీలవుతాను. దాంతో నాకు నేనే ఒకలాంటి ఫ్రెష్‌నెస్ ఫీలవుతాను. బాగా చేయాలి అన్న పట్టుదల కూడా కలుగుతుంది. * డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ మళ్లీ తీస్తే, కాజోల్ పాత్ర నన్నే వరించాలని కోరుకుంటా. అంత ఇష్టం నాకా రోల్! * మీ డ్రీమ్ హీరో? షారుఖ్. ఆయనంటే పిచ్చి. సినిమాల్లో ఆయన ఏడిస్తే నేనూ ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో నటించే చాన్స్గానీ వచ్చిందంటే నా జీవితం ధన్యమైనట్టే. * మరి రియల్ లైఫ్ హీరో? ఆ విషయంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడప్పుడే ఎవరినీ నా జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశం నాకు లేదు. * పోనీ ఎలాంటివాడు వస్తే ఓకే చెప్తారు? మాట మర్యాదగా ఉండాలి. ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉండాలి. ఫుడ్ లవర్ అయివుండాలి. నాలాగా ఫాస్ట్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకూ ఏదైనా లాగించేయాలి. * గ్లామర్ రోల్స్ చేయడం ఇష్టమేనా? ప్రతి పాత్రలోనూ గ్లామర్ ఉంటుంది. అంతే తప్ప గ్లామర్ కోసమే పాత్రలుండవు. టాలెంటే ఎవరినైనా స్టార్‌ని చేస్తుంది. గ్లామర్ నటనలో గ్రామర్ నేర్పదు. కాబట్టి అందాలు ఒలకబోసినంత మాత్రాన స్టార్డమ్ వచ్చేయదు. వస్తుందనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. * మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి? పెద్ద పెద్ద కోరికలు, ఇష్టాలూ ఉండవు నాకు. అన్ని రంగుల్నీ ఇష్టపడతాను. సింపుల్‌గా జీన్స్, టీషర్టులు వేసుకుంటాను. నచ్చింది తింటాను. నచ్చినట్టు ఉంటాను. పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేసుకోవడం, వాటి గురించి టెన్షన్ పడిపోవడం నాకు నచ్చదు. అందుకే ఓ పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతాను. వీలైనంత కూల్‌గా ఉంటాను. * మీ లైఫ్ ఫిలాసఫీ? జీవితం చాలా అందమైనది. కాకపోతే దాన్ని జీవించడం రావాలి. మనం నవ్వాలి. ఎదుటివారిని నవ్వించాలి. మంచి చేయక పోయినా ఫర్లేదు కానీ, ఎవరికీ చెడు మాత్రం చేయకూడదు. * ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడిప్పుడే కెరీర్ వేగాన్ని పుంజు కుంటోంది. మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. కాబట్టి కొన్నేళ్ల వరకూ నటన గురించి మాత్రమే ఆలోచిస్తాను. అయితే నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. యువత రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నేను ఏదో ఒకరోజు పాలిటిక్స్‌లోకి వెళ్లి తీరతా! -
సంప్రదాయ వేడుక ‘ఛట్’
గాజులరామారం: నగరంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు వారి సంప్రదాయ వేడుక ‘ఛట్’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, అస్సాం, బెంగాలీలతో పాటు నేపాల్‌లో కూడా ఈ వేడుక జరుపుకుంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులు తమ పండుగల్లో ప్రధాన పండుగగా కుటుంబ సంక్షేమంతో పాటు భగవంతుడికి కృతజ్ఞతగా ఈ వేడుక జరుపుకుంటారు. బుధవారం నుంచి ఈ వేడుక జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. సూర్య భగవానుడికి ప్రసాదం కార్తీక మాసంలో ఆరో రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతికి సంబంధించిన పూజ. సూర్య భగవానుడిని పూజిస్తారు. మోకాలి లోతు నీటిలో నిలబడి సూర్యుడికి ప్రసాదాలను సమర్పించడం ఈ వేడుక విశిష్టత. వెదురు చాటలో పూలు, పళ్లు ఉంచి నదిలో వదిలిపెట్టి ప్రకృతికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా విధానం... ఛట్ పూజలు ప్రధానంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఇష్టమైన వారు ఈ పూజ చేసుకోవచ్చు. వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాస దీక్షతో పాటు తీసుకునే ఆహారంలో నియమాలు పాటిస్తారు. మొదటి రోజును సహాయ్ కాయ్, రెండో రోజును ఖర్న, మూడోరోజును పేహలా ఆర్గ్య్, నాల్గో రోజును పార్నాగా వ్యవహరిస్తారు. మూడు, నాలుగో రోజు నది వద్ద పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదం పంచుతారు. పూజతో లాభాలు... హిందూ పురాణాలు, ఆచారాల ప్రకారం ఛట్ పూజలతో భగవంతుని ఆశీస్సులు లభిస్తాయనేది నమ్మకం. వ్రతంలో ఆచరించే పద్ధతులతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, సూర్యోదయం, సంధ్యా సమయంలో నదిలో స్నానం ఆచరించడం వల్ల చర్మ సంబంధిత బాధలు తొలగిపోతాయి. చారిత్రక కథనం వ్రతానికి సంబంధించి పురాణాల్లో అనేక కథనాలున్నాయి. పూర్వం ప్రియాబ్రత్ అనే రాజుకు సంతానం లేకపోతే కశ్యప మహర్షి ఆశీస్సులతో యజ్ఞం చేయగా రాజు భార్య మాలినికి మృత శిశువు జన్మించడంతో ఆత్మహత్యకు సిద్ధమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై ఛట్ వ్రతం ఆచరించమంటాడు. రాజు వ్రతాన్ని ఆచరించి తిరిగి సంతానం పొందాడు అనేది కథనం. ద్వాపర యుగంలో పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కురుక్షేత్రంలో గెలుపొందారనేది మరో కథనం. -
చనిపోయిన వారితో ఛాటింగ్!
‘ఒరేయ్ అశోక్...నువ్వు చనిపోయి అప్పుడే అయిదు సంవత్సరాలవుతుందా?’ ‘స్పీక్ ఆర్ టైప్ టు రిప్లై టు రఘు’ చనిపోయిన మనిషి రిప్లై ఎలా ఇస్తాడు?! అనేది కదా మీ డౌటు. మసాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలిసి eterni.me పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఒక వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు, హావభావాలతో పాటు సోషల్-నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్, చాట్ లాగ్స్, ఇ-మెయిల్స్...ఈ సైట్లో భద్రపరిచి నిజమని భ్రమింపచేసే ‘వర్చ్యువల్ అవతార్’ను సృష్టిస్తారు. బతికి ఉన్న వ్యక్తితో చేసినట్లే ఈ సరికొత్త అవతారంతో మనం వీడియో ఛాటింగ్ చేయవచ్చు. చనిపోయిన వ్యక్తిని వారి వ్యక్తిత్వం ఆధారంగా డిజిటల్ రూపంలో పునఃసృష్టి చేయబోతున్న eterni.me గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా ఇప్పటికే అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఒక్కరోజులోనే పదమూడు వందలమంది ఈ సైటులో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు!