‘ఒరేయ్ అశోక్...నువ్వు చనిపోయి అప్పుడే అయిదు సంవత్సరాలవుతుందా?’
‘స్పీక్ ఆర్ టైప్ టు రిప్లై టు రఘు’
చనిపోయిన మనిషి రిప్లై ఎలా ఇస్తాడు?! అనేది కదా మీ డౌటు. మసాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలిసి eterni.me పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు.
ఒక వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు, హావభావాలతో పాటు సోషల్-నెట్‌వర్కింగ్ ఇన్‌ఫర్‌మేషన్, చాట్ లాగ్స్, ఇ-మెయిల్స్...ఈ సైట్‌లో భద్రపరిచి నిజమని భ్రమింపచేసే ‘వర్చ్యువల్ అవతార్’ను సృష్టిస్తారు.
బతికి ఉన్న వ్యక్తితో చేసినట్లే ఈ సరికొత్త అవతారంతో మనం వీడియో ఛాటింగ్ చేయవచ్చు.
చనిపోయిన వ్యక్తిని వారి వ్యక్తిత్వం ఆధారంగా డిజిటల్ రూపంలో పునఃసృష్టి చేయబోతున్న eterni.me గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా ఇప్పటికే అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఒక్కరోజులోనే పదమూడు వందలమంది ఈ సైటులో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు!
చనిపోయిన వారితో ఛాటింగ్!
Published Mon, Feb 17 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
Advertisement