చామ దుంపతో తయారు చేసే కశ్మీరీ వంటకం కచ్లు చాట్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి.
కావలసినవి:
చామ దుంపలు – కేజీ
ఉప్పు – రుచికి సరిపడా
చింతపండు – అరకప్పు
వాము – టీస్పూను
ఆమ్‌చూర్ పొడి – టీస్పూను
బ్లాక్ సాల్ట్ – టీస్పూను
కారం – టీస్పూను
పచ్చిమిర్చి – ఐదు (మెత్తగా దంచాలి), నిమ్మకాయ – ఒకటి.
తయారీ..
►చామదుంపలను శుభ్రంగా కడిగి కుకర్‌గిన్నెలో వేసి, టీస్పూను ఉప్పు, ఏడుకప్పులు నీళ్లుపోసి మూడు విజిల్స్ రానివ్వాలి.
►మరీ ఎక్కువగా ఉడికించకూడదు.
►చింతపండుని శుభ్రంగా కడిగి కప్పు వేడినీటిలో నానబెట్టాలి.
►నానిన చింతపండుని బాగా పిసికి గుజ్జుని వేరుచేసి రసాన్ని విడిగా తీసుకోవాలి.
►ఇప్పుడు ఉడికిన చామదుంపల తొక్కతీసి చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేయాలి.
►దీనిలో చింతపడు రసం, ఆమ్‌చూర్ పొడి, టీస్పూను ఉప్పు, బ్లాక్ సాల్ట్, కారం, దంచిన పచ్చిమిర్చి, నిమ్మరసం పిండాలి.
►చివరిగా వాముని నల్లగా వేయించి వేయాలి.
►ఇవన్నీ చక్కగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన కచ్లు చాట్ రెడీ.
ఇది కూడా ట్రై చేయండి: Mushroom Popcorn: మష్రూమ్ పాప్ కార్న్.. ఇంట్లోనే ఇలా ఈజీగా!
Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్!
Comments
Please login to add a commentAdd a comment