ఎన్నో రకాల వీధి చాట్ భండార్ దుకాణాలు చూసుంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే చాట్ బండార్ మన భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన సంగ్రామాన్ని గుర్తుచేస్తుంది. స్వతంత్ర్య భారతవని పోరుకి చిహ్నం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అది ఆధునికంగా విస్తరించి మంచి లాభాదాయకమైన వ్యాపారంగా నిరాంటకంగా కొనసాగుతోంది. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీనికి యూపీఎస్సీ అనే పేరు ఎందుకు పెట్టారంటే..
ఈ చాట్ భండార్ న్యూఢిల్లీలో(Delhi) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(UPSC) భవనం ఎదురుగా ఉంది. నిజానికి ఈ చాట్ దుకాణం పేరు "ప్రభు చాట్ భండార్" కానీ అందరూ యూపీఎస్సీ చాట్(UPSC Chaat Bhandar) అనే పిలుస్తారు. 1935లో బ్రిటిష్ పాలనా కాలం నుంచి నడుస్తున్న దుకాణం.
దీని యజమాని నాథూ. ఆయన ఆ కాలంలో బ్రిటిష్ పోలీసుల చేత అనేక బెదిరింపులకు, వేధింపులకు గురయ్యేవాడు. అయినా ఇది నాదేశం.. అందుకోసం తన వంతుగా చేస్తున్న జీవన పోరాటంగా అని భావించేవాడు నాథూ. మంచి రోజులు రాకపోతాయనే అతడి ఆశ నెరవేరే రోజు రానే వచ్చింది. భారతదేశానికి స్వతంత్య్రం(Independence) రావడందాంతోపాటు తన దుకాణం కూడా కొంగొత్తగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది.
అతడి దుకాణం ప్రభుత్వాధికారులు పనిచేసే సమీపంలో ఉండటంతో..వారే అతడి కస్టమర్లుగా ఉండేవారు. పైగా అనతికాలంలో ఆదాయ పన్ను చెల్లించే దుకాణాల లిస్ట్‌లో చేరిపోయింది. అంతలా లాభాలార్జిస్తూ దూసుకోపోతుంది. ప్రస్తుతం దీన్ని నాథూ మనవడు, కుమారుడు విజయవంతంగా నడుపుతున్నారు. ఈ దుకాణం గొప్పతనం దశాబ్దాల నుంచి అదే రుచి, నాణ్యతతో చాట్‌ని అందించడమే. అదీగాక ఇప్పుడు మరిన్ని విభిన్న రకాల చాట్‌లను కూడా జోడించారు.
ఢిల్లీ ఎలా ఆధునికరించబడిందో.. అలానే ఈ దుకాణం కూడా కొద్దికొద్దీ మార్పులతో ఆధునిక దుకాణంలా రూపుదాల్చుతూ ఉంది. అందువల్లే ఢిల్లీలో ఈ దుకాణం సిటీ ఐకానిక్ ల్యాండ్‌మార్క్(Landmark)గా స్థిరపడిపోయింది. ఏవ్యాపారమైన కస్టమర్ నమ్మకాన్ని బలపర్చేలా నాణ్యతతో రాజీ పడకుండా చేస్తే దానికి తిరుగుండదు అనడానికి ఏళ్ల నాటి ఈ ఐకానిక్ చాట్ భండారే ఉదాహరణ కదూ..!.
(చదవండి: Sudoku: ‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..)
Comments
Please login to add a commentAdd a comment