street vendors
-
కొత్త చట్టాలు.. దేశంలోనే తొలి కేసు నమోదు!
న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)గా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ్ సంహిత క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్ పట్నాకు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు. -
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్
పానీ పూరీ, గోల్ గప్పా, ఫుచ్కాస్ పేరేదైనా ఈ మాట వివగానే నోట్లో ‘పానీ’ ఊరాల్సిందే కదా? దేశ వ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది పానీ పూరీకి. భారతదేశం అంతటా పలు ప్రాంతాల్లో రకరకాలుగా పిలుచుకున్నప్పటికీ స్ట్రీట్ ఫుడ్‌లో ఇదే రారాణి. అందుకే సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్ పానీ పూరీని వేడుక జరుపుతోంది.ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో, ప్రత్యేకమైన గేమ్‌తో 'పానీ పూరీ' వేడుక జరుపుతోంది. 2015, జూలై 12న మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ 51 రకాల పానీ పూరీ రుచులను అందించి ప్రపంచ రికార్డ్‌ను సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎనిమిదో వార్షికోత్సవంగా ఈ విశేషమైన రికార్డును సెలబ్రేట్ చేస్తోంది. ఇందుకోసం ఇంటరాక్టివ్ గేమ్‌ను ఆడే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో పానీ పూరీ ఆర్డర్ ఇవ్వొచ్చు. తద్వారా వీధి వ్యాపారులకు సాయం చేయడంతోపాటు, ప్రతి కస్టమర్‌ను సంతోషంగా ఉంచాలనేది ప్రధాన లక్ష్యంమని గూగుల్ తెలిపింది. వినియోగదారులు వారి రుచి , పరిమాణం ప్రాధాన్యతకు సరిపోయే పూరీలను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఇంటర్యాక్టివ్ గేమ్ ఆడాలంటే గూగుల్ డాట్ కామ్‌కు లాగిన్ చేయండి పైన ఉన్నడూడుల్పై క్లిక్ చేయండి టైమ్, లేదా రిలాక్స్డ్ తింటారా అనే మోడ్ ఎంచుకోవాలి? సరైన పానీ పూరీ ఫ్లేవర్‌పై క్లిక్ చేయడమే.. ద్రౌపది క్రియేటివిటీకి ప్రతి రూపమే పానీ పూరీ అంతేకాదు ఈ పానీ పూరీకి పెద్ద చరిత్రే ఉందట, పురాణ మహాభారత కాలంలో కొత్తగా పెళ్లయిన ద్రౌపదికి తన ఐదుగురు భర్తలకు ఉన్న కొద్ది వస్తువులతోనే ఏదైనా కొత్తగా వండి పెట్టాలనే చాలెంజ్ వచ్చిందంట. ముఖ్యంగా కొద్దిగా మిగిలిన బంగాళదుంపలు, ఇతర కూరగాయలు, చాలా కొంచెం గోధుమ పిండితోనే చేయాలి. ఇక్కడే ద్రౌపది తన క్రియేటివిటీని ప్రదర్శించింద. ఆలూ,ఇతర కూరలతో స్టఫింగ్ తయారు చేసి, ఉన్న కొద్దిపాటి పిండితోనే పూరీలు చేసి పెట్టిందట. అలా పానీ పూరీ తయారైందని గూగుల్ పేర్కొంది. ఆహా అనరా మైమరచి కాగా మహారాష్ట్ర , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉడికించిన ఆలూ, చిక్పీస్ మిశ్రమాన్ని పూరీలో స్టఫ్ చేసి, పుదీనా, చాట్ మలాసా యాడ్ చేసి, కారం కారంగా, వేడి వేడిగా ఉండే పానీలో ముంచి, పైన అలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్రిస్పీ పూరీని అలా అమాంతం నోట్లో వేసుకుని, కర కర మంటూ నమిలి మింగుతూ ఉంటే ఆహా.. అనరా మైమరచి అంటారు. ఉత్తర భారతంలో పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్, న్యూ ఢిల్లీలలో, బంగాళాదుంపలు చిక్‌పీలను మిశ్రమం, జల్జీర నీటిలో ముంచిన ట్రీట్‌నే గోల్ గప్పే లేదా గోల్ గప్పా అంటారు. దీన్నే పుచ్‌కాస్ లేదా ఫుచ్కాస్ అని పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో పిలుస్తారు. అన్నట్టు దీనికి చింతపండు గుజ్జు, బెల్లంతో చేసిన ‘స్వీట్’ కొసమెరుపు. -
డాన్సింగ్ పానీపూరి.. ఎగబడితింటున్న జనం.. ఇదేం పనంటూ నెటిజన్స్ ఫైర్!
కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత అందరికి తెలసిందే. రుచి, శుచితో కూడిన ఆహారానికి దేశంలో యమ డిమాండ్ ఉంది. అందుకే ఫుడ్ బిజినెస్‌లోకి ప్రజలు అడుగుపెడుతున్నారు. ఈ వ్యాపారంలో పిల్లలు నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిరుతిండి టేస్ట్ ఉంటే చాలు ప్రజలు అక్కడవాలిపోతారు. అందుకే వీధి వ్యాపారులు కేవలం రుచితో మాత్రమే కాకుండా అనేక వైవిధ్యాలతో ముందుకు వస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రుచితో పాటు కాస్త భిన్నంగా పానీపూరి అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక వీధి వ్యాపారీ సందడిగా ఉండే ట్రిపోలియా బజార్లో తోపుడు బండి మీద పానీపూరి అమ్ముతున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్‌తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, వీధి వ్యాపారి తన ఒట్టి చేతులతో పానీ పూరీని కలపడం, పూరీలను నింపడం డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. అతను తన ముక్కును గీసుకున్న తర్వాత పానీ పూరి నీటిలో తన చేతులను ఉంచడం కూడా అందులో కనిపిస్తుంది. అనంతరం అదే చేతితో వినియోగదారులకు గోల్గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ, రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) చదవండి: Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. అందరిముందే హగ్‌లతో రెచ్చిపోయిన జంట -
‘చిరు’ రుణాల్లో ఏపీ ఫస్ట్.. దేశ చరిత్రలోనే రాష్ట్రం రికార్డు
చిరు వ్యాపారులందరూ వాళ్ల కష్టం మీదే ఆధార పడుతున్నారు. పెట్టుబడి సాయం కింద మనం వాళ్ల వ్యాపారం కోసం రూ.10 వేలు సాయం చేస్తున్నాం. వాళ్లు మరొకరి దగ్గర వస్తువులు, పండ్లు, కూరగాయలు తదితరాలు కొనుగోలు చేసి.. ప్రజలకు విక్రయిస్తున్నారు. తద్వారా వాళ్ల బతుకు వారు బతకడమే కాకుండా.. స్వయం ఉపాధి రంగంలో గొప్ప మార్పు తీసుకొస్తున్నారు. అందువల్లే వారికి తోడుగా నిలిచాం. ఇప్పటి వరకు 15,31,347 మంది చిరు వ్యాపారులుకు రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణం అందించాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంలో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేశం మొత్తం మీద చిరు వ్యాపారులకు 24.06 లక్షల మందికి రుణాలు ఇస్తే, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జగనన్న తోడు పథకం కింద 15.31 లక్షల మందికి రుణాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రుణాలను సంఖ్యాపరంగా తీసుకుంటే దేశ వ్యాప్తంగా 39.21 లక్షల రుణాలకు గాను, ఒక్క మన ఏపీలో మాత్రమే 24.06 లక్షల రుణాలు ఇచ్చామన్నారు. తద్వారా స్వయం ఉపాధి వ్యవస్థలో గొప్ప మార్పు వస్తోందన్నారు. చిరు వ్యాపారులందరూ వాళ్లంతట వారే ఉపాధి కల్పించుకోవడమే కాకుండా సమాజానికి కూడా గొప్ప మేలు చేస్తున్నారని కొనియాడారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఆరవ విడత రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంక్‌ల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నడ్డి విరిగే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లె్లమ్మలు, అన్నదమ్ములకు ‘జగనన్న తోడు’ అందుతోందన్నారు. 3.95 లక్షల మందిలో 3.67 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి, మళ్లీ రెండోసారి రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. వీరు కాక మరో 28 వేల మందికి ఇవాళ రుణాలు ఇస్తూ కొత్తగా ఈ పథకంలోకి తీసుకొచ్చామన్నారు. మొత్తంమ్మీద జగనన్న తోడు ద్వారా దాదాపు 15.31 లక్షల చిరు వ్యాపారుల కుటుంబాలకు మంచి జరుగుతోందన్నారు. వీరంతా ఇతరులపై ఆధార పడకుండా.. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రూ.10 వేలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. ‘ఎవరికి అవసరమైతే వాళ్లు రుణాలు తీసుకుంటున్నారు. తిరిగి చెల్లిస్తున్నారు. వాళ్లకు సహాయంగా బ్యాంక్‌లు తిరిగి రుణాలు ఇస్తున్నాయి. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి వెనక్కు తిరిగి ఇస్తోంది. తద్వారా వ్యవస్థలో గొప్ప మార్పు కనిí³స్తోంది’ అని అన్నారు. సీఎం ఏమన్నారంటే.. ఆ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ► ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు.. గంపలు, బుట్టల్లో పెట్టుకుని వస్తువులు అమ్మేవారు.. సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారితో పాటు చేనేతలు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారికి. బొబ్బిలి వీణ వంటివి తయారు చేసే వారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలు బొమ్మలు, లేస్ వర్కర్స్ అందరికీ ఈ రోజు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నాం. ► బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వమే బ్యాంకులను ఒప్పించి వీరందరికీ సున్నా వడ్డీ పథకం కింద రూ.10 వేలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రుణాలు సకాలంలో చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు వారికి తిరిగి రుణాలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. వారి కష్టాలు, బాధలు చూసినందుకే.. ► నా సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల బా«దలు, కష్టాలు నా కళ్లతో చూశాను. ప్రతి చోటా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇవన్నీ సా«దారణంగా కనిపించే విషయాలు. ఇటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు పెట్టుబడి సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ► రూ.1,000 అప్పు కావాలంటే ముందే రూ.100 తీసుకుని, రూ.900 చేతిలో పెట్టి.. నెల నాటికి మళ్లీ ఆ డబ్బులు కట్టించుకుంటూ.. తిరిగి ఈ చిరు వ్యాపారులతోనే వ్యాపారం చేసే అధ్వాన్నమైన పరిస్థితుల్లో సమాజం ఉంది. అలాంటి సమాజంలో మార్పులు తీసుకొచ్చి, వాళ్ల బాధలకు, ఆ రోజు నేను చూసిన వాళ్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలన్న తపన, తాపత్రయంతోనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చాం. ► ఇప్పటి వరకు రుణాలు పొందిన 15,31,347 మందిలో 8,74,745 మంది బ్యాంకులకు రుణం చెల్లించి.. మళ్లీ రెండోసారి రుణాలు పొందారు. ఇలా వీరంతా ఏడాది సైకిల్ పూర్తి చేసుకుని బ్యాంకులతో భేష్ అనిపించుకున్నారు. సకాలంలో చెల్లిస్తే రూ.13 వేల వరకు రుణాలు ► సకాలంలో రుణాలు కడితే రూ.10 వేల నుంచి మరో రూ.వెయ్యి పెంచి రూ.11వేలు, రూ.11 వేల నుంచి రూ.వెయ్యి పెంచి రూ.12 వేలు అందించే కార్యక్రమం చేస్తూ.. రూ.13 వేల వరకు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించాం. వీళ్లందరికీ జగనన్నతోడుతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, విద్యాదీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ ,ఆరోగ్య ఆసరా, రైతు భరోసా అన్ని పథకాలతో మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో వీరందరికీ మంచి జరగాలి. జీవనప్రమాణాలు మారాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావాలి. ► ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు ఆదిమూలపు, బొత్స, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాల్గొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ ► 6 నెలలకు ఒకమారు వడ్డీ లేని రుణాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. 2020 నవంబర్‌లో ఈ దిశగా తొలిసారి అడుగులు పడ్డాయి. ప్రస్తుతం 6వ దశ కార్యక్రమం జరుగుతోంది. సకాలంలో వడ్డీ కట్టిన వారికి తిరిగి వెనక్కు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇచ్చే రూ.15.17 కోట్ల వడ్డీతో కలుపుకుని, సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున రూ.63.65 కోట్లు చెల్లించాం. ► అర్హత ఉండీ కూడా ఎవరైనా ఈ పథకాన్ని అందుకోలేకపోయి ఉంటే ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. అలాంటి వారంతా గ్రామ సచివాలయంలోకి వెళ్లి దరఖాస్తు చేసినా, వలంటీర్‌కు చెప్పడంతో పాటు 1902 నంబరుకు ఫోన్ చేస్తే చాలు. వాళ్లతో దరఖాస్తు నింపించడం మొదలు బ్యాంకులతో టై అప్ చేయించి వాళ్ల వ్యాపారాలకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం దగ్గరుండి చేస్తుంది. ఇది నిరంతరం జరుగుతుంది. ఈ పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్లకు సూచిస్తున్నాను. ► సకాలంలో డబ్బులు కడుతున్న వారి కోసం ఒక బ్యాంకును రెండు సచివాలయాలకు టైఅప్ చేశాం. ఈ రెండు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటూ పనిచేస్తారు. ఎవరైనా రుణాలు చెల్లించలేకపోతే.. మిగిలిన వారి మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి.. సకాలంలో చెల్లించాలి. ఈరోజే సంక్రాంతి చిరు వ్యాపారులందరూ ఈరోజే సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. నాది కూరగాయల అంగడి. నా భర్త కూలి పనులకు వెళ్తాడు. ఇది వరకు పెట్టుబడి కోసం రూ.1,000 అప్పు తీసుకుంటే వడ్డీ కింద ముందుగానే రూ.100 పట్టుకుని ఇచ్చే వారు. రూ.500 వడ్డీ కట్టి రూ.4,500 చొప్పున ఎన్నోసార్లు తీసుకున్నాను. తర్వాత రూ.5 వేలు చెల్లించాను. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో జగనన్న తోడు కింద రూ.10,000 వడ్డీ లేని రుణం ఇచ్చారు. వ్యాపారం చేసుకుని, సకాలంలో రుణం చెల్లించాను. నాకు మీరు వడ్డీ కూడా జమ చేశారు. తర్వాత రూ.11 వేలు.. ఇప్పుడు రూ.12 వేల రుణం అందజేశారు. – పి.కోటేశ్వరి, కొడవలూరు, నెల్లూరు జిల్లా. ఆత్మగౌరవం కాపాడుతున్నారు.. మీరు మా ఆత్మగౌరవం కాపాడుతున్నారు. నేను టైలరింగ్ చేస్తాను. నాకు ముగ్గురు పిల్లలు. టైలరింగ్ మెటీరియల్ కోసం ఫైనాన్షియర్ దగ్గరకు రూ.10 వేల కోçÜం వెళ్తే.. రూ.1,000 మినహాయించుకుని రూ.9 వేలు చేతిలో పెట్టేవారు. ప్రతిరోజూ సాయంత్రం రూ.200 చొప్పున అప్పు తీరే వరకు కట్టేదాన్ని. మీరు వచ్చిన తర్వాత 2020లో నవరత్నాలతో పాటు మీరు అందించిన జగనన్న తోడు మాకు చాలా ఉపయోగపడింది. మా అమ్మ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నప్పుడల్లా నా పెద్ద కొడుకు డబ్బులు పంపించాడని ఆనందంగా చెబుతూ ఉంటుంది. – మాధురి, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా అడగకుండానే వరాలు అన్నా.. మీరు అడగకుండానే వరాలు ఇచ్చిన దేవుడు. నేను టైలరింగ్ చేస్తాను. రూ.10 వేలు వడ్డీకి తీసుకుంటే రూ.2 వేలు వడ్డీ తీసుకుని రూ.8 వేలే ఇచ్చేవారు. ఇలా ఎన్నాళ్లుగానో నా కష్టం వడ్డీ వ్యాపారుల పాలయ్యేది. మీరు వచ్చాక ఆ దుస్థితి పోయింది. మాకు మేలు జరిగింది. వలంటీర్ రెండు రోజుల్లోనే నాకు లోన్ మంజూరు చేయించారు. మేం నలుగురు అమ్మాయిలం. మాకు మగబిడ్డ లేడని అమ్మానాన్నలు బాధ పడేవాళ్లు. మా అమ్మానాన్నలకు ఉన్న ఏకైక మగబిడ్డ మీరే అన్నా. మీ పథకాల వల్ల మేం హాయిగా జీవిస్తున్నాం. – శశికళ, కడప, వైఎస్సార్ జిల్లా జగనన్నే వన్స్ మోర్ అంటున్న జనం మీ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసి చలించిపోయారు. ఆ రోజు వారందరికీ నేను తోడుగా ఉంటానని మీరు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఇప్పటివరకు 15 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రూ.2,400 కోట్లకు పైగా రుణాలు అందించారు. చిరు వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందుకే జగనన్నే వన్స్ మోర్.. అంటున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చిరు వ్యాపారుల కుటుంబాల్లో వెలుగు చిరు వ్యాపారులు, కుల వృత్తుల వారు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకుని.. రోజు వడ్డీలు, వారపు వడ్డీలు, నెల వడ్డీల కోసం వారు సంపాదించిన దాంట్లో 90 శాతం చెల్లించే దుస్థితిని మీరు (సీఎం) మార్చేశారు. ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల్లో రూ.10 వేలు రుణాలిచ్చే విధంగా మీరు తీసుకున్న చర్యలు లక్షలాది కుటుంబాల్లో వెలుగు నింపాయి. వారందరూ కూడా మీరే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి -
Jagananna Thodu: ఆ కష్టం రావొద్దనే ఈ పథకం తీసుకొచ్చాం
సాక్షి, తాడేపల్లి: చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకంలో భాగంగా.. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల నగదు జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారాయన. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్మెంట్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని ఉద్ఘాటించారాయన. ‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్. ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్ సంతోషించారు. ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ (ఏపీ) నవనీత్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరు అయ్యారు. -
అదిరిందయ్యా.. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణం
నిజాయితీగా బతకాలన్న ఆకాంక్ష ఉంటే చాలు.. కోటి ఉపాయాలు తన్నుకొస్తాయి. అందులో ఏదో ఒకదానిని ఆచరణలో పెడితే బతుకు సాఫీగా సాగిపోతుంది. ఇందుకు నిదర్శనమే ఖాదర్. అనంతపురంలోని నందమూరి నగర్‌కు చెందిన ఖాదర్ చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. అద్దె గది కోసం వెదికాడు. రూ. వేలల్లో అడ్వాన్స్, అదే స్థాయిలో నెలవారీ అద్దె చెల్లించడం భారంగా భావించిన అతను తనకొచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టాడు. తన వద్ద ఉన్న పాత మోపెడ్‌కు వెనుక తోపుడుబండిని అమర్చుకుని, అందులో గుండుసూది మొదలు.. వివిధ రకాల గృహోపకరణాలు, వంట సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, జ్యువెలరీ, గొడుగులు, లేడీస్ బ్యాగ్‌లు... ఇలా ప్రతి ఒక్క వస్తువునూ తీసుకెళ్లి వీధుల్లో విక్రయించడం మొదలు పెట్టాడు. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అదిరిందయ్యా ఖాదరూ అంటూ అభినందిస్తున్నారు. చూసేందుకు చిత్రంగా ఉన్న ఈ దుకాణంలో వస్తు, సామగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కింద రూ.50వేల వరకు రుణాలు!
కరోనా మహమ్మారి వల్ల లక్షల మంది మృతి చెందడంతో పాటు కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా చిరు వ్యాపారులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకంపై అవగాహన లేక చిరు వ్యాపారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. రూ.50 వేల వరకు లోన్ భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు చిరు వ్యాపారులుగా జీవనం కొనసాగిస్తున్నారు. కోవిడ్ రాక వారికి ఆర్థిక నష్టాలను మిగిల్చి వెళ్లింది. దీంతో వ్యాపారులకు ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం కొలేటరల్ ఫ్రీ లోన్ పథకాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన మంత్రి స్వానిధి పథకం (PM SVANidhi). ఈ పథకం కింద ప్రభుత్వం చిరు వ్యాపారులకు రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు రుణాలను అందిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రారంభ రుణ మొత్తాన్ని 10,000 నుంచి 20,000కి పెంచాలని భావిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం, బ్యాంకుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. 2020 సంవత్సరంలో, బ్యాంకులు దాదాపు 20 లక్షల మందికి మొత్తం రూ. 10,000 రుణాలు మంజూరు చేయగా, 2021లో PM స్వానిధి పథకం ద్వారా మొత్తం 9 లక్షల మంది రుణాలు పొందారు. అదే సమయంలో, సెప్టెంబర్ 2022 వరకు మొత్తం 2 లక్షల మంది రూ. 10,000 రుణాలు పొందారు. లోన్ వివరాలు ఇవే "పీఎం స్వానిధి యోజన" ద్వారా లోన్ కోసం అప్లై చేయడానికి, మీకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఈ లోన్ ముఖ్య ఉద్దేశ్యం చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత అందివ్వడమే. ఈ పథకం కింద దరఖాస్తుకు మొదటిసారిగా సంవత్సరానికి రూ. 10,000 రుణం మంజూరు చేస్తారు. సదరు వ్యక్తి ఒక సంవత్సరంలో దీనిని తిరిగి చెల్లిస్తే 20,000 రెండో సారి రుణాన్ని తీసుకోవచ్చు. అదే సమయంలో వ్యాపారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా మూడోసారి రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ లోన్‌పై, 7% వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ నెలవారీ చెల్లింపులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేస్తే, మీరు వడ్డీ రాయితీని కూడా అందుకుంటారు. ఇలా అప్లై చేయండి ► ముందుగా http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లండి ► తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి I am not a robot పైన క్లిక్ చేయాలి. ► ఆపై అక్కడ ఉన్న Request OTP బటన్ పైన క్లిక్ చేయండి. ► తర్వాత మీ మొబైల్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ (Verify OTP) పైన క్లిక్ చేయాలి. ► ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత రెండో కేటగిరీ ఉంటుంది. ► రెండో కేటగిరిలో ఉన్న స్ట్రీట్ వెండర్ ( street vendor) కేటగిరీ ఎంపిక చేసుకోండి. ► ఆ తర్వాత అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ నింపి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు లోన్ రూల్స్ ప్రకారం మీ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఆపై మీ లోన్ ఆమెదించిన తర్వాత మీ ఖాతా నగదుని జమ చేస్తుంది. చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ -
రోడ్డుపై రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. క్రికెట్ బ్యాట్‌తో దుకాణాలపై దాడి
-
రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. రోడ్డుపై క్రికెట్ బ్యాట్‌తో రచ్చ..
లక్నో: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయి ప్రవర్తించింది. ఇంటి ముందు ఉన్న దుకాణాలపై దాడి చేసింది. పెద్ద కర్రతో అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో స్థానిక వ్యాపారులు దీపావళి సందర్భంగా ఓ కాలనీలోని రోడ్డు మీద పండగ సామాగ్రి అమ్ముకుంటున్నారు. అయితే తన ఇంటి ముందు దుకాణాలు పెట్టుకున్నారని ఓ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారులు అక్కడ షాప్‌లు పెట్టవద్దని, వెంటనే తొలగించాలని వారితో వాగ్వాదానికి దిగింది. పండగ వేళ దుకాణాలు పెట్టవద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా షాప్‌లు పెట్టి వస్తువులు అమ్ముకుంటున్నారని వారిపై చిర్రుబుర్రులాడింది. అంతటితో ఆగకుండా పట్టరాని కోపంతో క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి దుకాణాలపై తీవ్రంగా దాడి చేసింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మట్టి దీపాలు, కుండీలు, ఇతర వస్తువులను కర్రతో పగలకొట్టింది. చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే? కాగా దాడికి పాల్పడిన యువతి మాజీ ఐఏఎస్ కూతురుగా గుర్తించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో యువతిపై పోలీసులు చర్యలు చేపట్టారు. దుకాణాలు ధ్వంసం చేసినందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆమెపై 427, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఒక మాజీ ఐఏఎస్ కూతురు అయి ఉండి ఇలా వీధి వ్యాపారులపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Uttar Pradesh | Police registered a Non-Cognizable Offence against a woman after a video of her went viral on social media in which she can be seen destroying the shops of roadside Diya sellers in Gomti Nagar's Patrakarpuram yesterday. (Screengrabs from viral video) pic.twitter.com/nwuMQ4Vq42 — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 25, 2022 అయితే ప్రతి ఏటా ఇక్కడే మార్కెట్ జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై దుకాణాదారుడు మాట్లాడుతూ.. ‘మేడమ్ ఉదయం వచ్చి మా దుకాణాలను తొలగించమని అడిగారు. మాకు కొంత సమయం ఇవ్వమని చెప్పాము. వస్తువులను వాహనంలో ఎక్కించుకొని మరో చోటుకు వెళ్తామని చెప్పాము. అయినా ఆమె వినలేదు. దీపాలంకరణ, ఇతర వస్తువలపై నీరు పోశారు. అంతటితో ఆగకుండా బ్యాట్ తీసుకొచ్చి స్టాళ్లను ధ్వంసం చేశారు. అంతా పాడైపోయాయి. ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ’అని పేర్కొన్నారు. -
Free Chhole Bhature: బూస్టర్ డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్!
చండీగఢ్: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్‌కు చెందిన స్ట్రీట్ వెండర్ ఉచితంగా ఛోల్ భతుర్(సెనగ మసాల పూరీ) టిఫిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. ఉత్తర భారతంలో చోల్ భతురే చాలా ఫేమస్. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్‌లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్. ఈ విషయాన్ని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్ రాణాపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు షాక్.. లైసెన్స్ లేకపోతే జైలుకే!
సాక్షి,విజయనగరం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్‌లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్‌లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా విక్రయ కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఆహర పదార్థాల విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి జంక్షన్లో కూడా నాలుగైదు తోపుడు బళ్లపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒకింత పెద్ద జంక్షన్ అయితే ఏకంగా పదుల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహణ కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని మరీ పకోడీ, టిఫిన్ షాపులు, నూడిల్స్, పానీపూరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే వేల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఏటా లైసెన్స్ రెన్యువల్.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదిలో రూ.12 లక్షల ఆదాయం వచ్చే హోటళ్లు, రెస్టారెంట్లు రూ.2 వేలు చెల్లించి తమ లైసెన్స్‌లను ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 270 మంది మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లెసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఏడాదిలో రూ.12 లక్షల లోపు ఆదాయం సంపాదించే చిన్నపాటి దుకాణాలు నిర్వహించే వారు ఏడాదికి రూ.500 మాత్రమే చెల్లించి, లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1,477 మంది మాత్రమే ఆ తరహా లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఈ లెక్కన అధికారికంగా నిర్వహించే దుకాణాల కన్నా అనధికారికంగా నిర్వహించే దుకాణాలే ఎక్కువన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వాటిపై సర్కారు ఆదేశాల మేరకు చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 100 కేసుల నమోదు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండగా, కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కేసులు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని జేసీ కోర్టుకు, మరికొన్నింటిని జిల్లా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వీటితో ఇప్పటివరకు రూ.2.50 లక్షల ఆదాయం అపరాద రుసుం కింద వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసె న్స్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం జిల్లా చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
పర్సు మర్చిపోయిన మోహన్.. శనక్కాయల సత్తియ్య... ఎక్కడున్నావ్...!
ఆ చిన్న పిల్లల పట్ల ఆ పేదోడు చూపించిన ‘పెద్ద మనస్సు’ 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది. చేసేది చిరువ్యాపారమైనా చిన్నారులను చూసి ఆత్మీయతకనబరిచిన అతని తీరుకు ముగ్థుడైన ఓ ఎన్ఆర్ఐ దశాబ్ధాం తరువాత సదరు చిరువ్యాపారి కుటుంబాన్ని వెతికిపట్టుకుని రూ.25వేలు బహుమానంగా ఇచ్చి తన విజ్ఞతను, ఔదార్యాన్ని చాటుకున్నారు. సాక్షి, కాకినాడ: గింజాల పెదసత్తియ్య కాకినాడ బీచ్‌లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అమెరికాలో స్థిరపడ్డ మోహన్ నేమాని తన పిల్లలతో 2010లో కాకినాడ బీచ్‌కు వెళ్ళారు. అక్కడ పిల్లలు అడగడంతో శనక్కాయలు కొనిచ్చారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి పర్సు మర్చిపోయిన విషయాన్ని మోహన్ గుర్తించారు. విషయాన్ని గమనించిన పెదసత్తియ్య... పర్వాలేదు సార్, పిల్లలే కదా మరోసారి వచ్చినప్పుడు ఇద్దరుగాని లెండి అంటూ పంపించేశాడు. ఆ తరువాత మోహన్‌కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. అయితే మోహన్‌కుమారుడు ప్రణవ్ బీచ్‌రోడ్డులో ‘శనక్కాయల’ జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తుచేస్తూ సదరు చిరువ్యాపారి సత్తియ్యతో దిగిన ఫొటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నారు. పెదసత్తియ్య కుటుంబానికి సహాయం అందిస్తున్న ప్రణవ్, అతని సోదరి సుచిత 12 ఏళ్ళ తరువాత... సదరు చిరువ్యాపారికి ఎంతోకొంత సొమ్ము ఇవ్వాలనుకున్నా అతడు ఎక్కడున్నాడో మోహన్ నేమానికి ఆచూకీ చిక్కలేదు. దీంతో తనకు బాగాప రిచయుస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకురాగా, అతని కుటుంబం నాగులాపల్లిలో ఉంటుందని, రెండేళ్ళ క్రితమే సత్తియ్య చనిపోయాడని తెలుసుకున్నారు. సోంతూరుకు వచ్చిన మోహన్‌నేమాని కుటుంబం గురువారం అతని భార్య గంగ, ఇద్దరు పిల్లలను పిలిపించి నాటి విషయాన్ని జ్జాప్తికి తెచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం వద్ద పెదసత్తియ్య కుటుంబం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో ఆయన నివాసం వద్ద రూ.25వేలు బహుమానంగా ఇచ్చారు. మోహన్కుటుంబాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అభినందించారు. మోహన్ నేమాని మాట్లాడుతూ తరచూ తన కుమారుడు ప్రణవ్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కాకినాడ వెళ్ళినప్పుడు అతనికి కొంత సొమ్ము ఇద్దామని చెప్పేవాడని, ఈ క్రమంలోనే సొమ్ము అందజేశామని తెలిపారు. -
ఆధిపత్య భావాల అభి‘రుచి’!
ఏ నిర్ణయానికైనా సహేతుక కారణాలుంటే సమస్య లేదు. కుంటిసాకులతో అనుకున్నది అమలు చేయాలనుకుంటేనే అసలు సమస్య. మాంసాహారం అమ్మే వీధి బండ్లపై బీజేపీ పాలిత గుజరాత్లో నాలుగు పట్టణాల స్థానిక అధికారులు ఇటీవల ఆంక్షలు విధించడం, అందుకు వాసన – పరిశుభ్రత – ట్రాఫిక్ లాంటి అన్యాయమైన కారణాలు చెప్పడం చూస్తే అదే అనిపిస్తుంది. ప్రజల ఆహారపుటలవాట్లు, రుచులు – అభిరుచులపై పాలకుల పెత్తనం ఏమిటి? ఎవరు ఏం తినాలో కూడా పాలకులే నిర్ణయించాలనుకుంటే అది ప్రజాస్వామ్యమా? సాంస్కృతిక నియంతృత్వమా? ఇప్పటికే అనేక అసహనాలు రగులుతున్న దేశంలో ఆహారంపై ముద్రతో మరో అసహనం చెలరేగితే? వెల్లువెత్తిన విమర్శలతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వెనక్కి తగ్గి, నిర్దేశిత మార్గదర్శకాలు పాటించినంత వరకు ప్రజల ఆహారంపై ప్రభుత్వ విధానాల జోక్యమే ఉండబోదని వివరణ ఇచ్చారు. కానీ, మాంసాహారంపై గుజరాత్లో వివాదం ఇదేమీ తొలిసారి కాదు. 2014 ఆగస్టులో జైన క్షేత్రమైన పాలీతానాలో జంతువధ, మాంసాన్ని అమ్మడం, తినడం శిక్షార్హమని చట్టం చేశారు. పట్నంలోని మాంసం దుకాణాలను మూసివేయాలన్న జైన సన్న్యాసుల నిరసన దానికి కారణం. అలా ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి శాకాహార పట్నమని పాలీతానా ప్రకటించుకుంది. ఇప్పుడు ఏడేళ్ళ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, ధార్మిక స్థలాలకు 100 మీటర్ల పరిధిలో కానీ, వీధుల్లో కానీ మాంసాహారం అమ్మే బండ్లు ఉండరాదంటూ రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలిచ్చింది. అదే బాటలో వడోదర, భావ్‌నగర్, అహ్మదాబాద్‌లు పయనించాయి. బాహాట మాంస ప్రదర్శన తమ మనోభావాలను దెబ్బతీస్తోందనీ, జనంపై, ముఖ్యంగా పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందనీ మాంసాహార వ్యతిరేకుల వాదన. గుజరాత్ సీఎం మరో అడుగు ముందుకేసి, ట్రాఫిక్ ఇక్కట్లకు ఈ వీధి ఆహారబండ్లే కారణమనేశారు. ఆ వాదనలు ఎంత అసంబద్ధమో చెప్పనక్కర్లేదు. 2017లో బడ్జెట్ ప్రసంగంలో నాటి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సైతం గుజరాత్‌ను ‘శాకాహార రాష్ట్రం’గా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా గోవధ నిషేధ చట్టానికి పదును పెట్టి, లాభం పొందారు. కానీ, సగానికి పైగా మాంసాహారులున్న యూపీలో ఎన్నికల వేళ ఇప్పుడీ మాంసాహార వాదన బీజేపీకి ఇబ్బందికరమే. పైగా, ఓబీసీలను దగ్గరకు తీసుకోవాలని ప్రధాని తన క్యాబినెట్లో వారికి పెద్ద పీట వేశాక, ఇప్పుడీ మాటలు ఎదురుతంతాయి. అందుకే, బీజేపీ నాయకులు తక్షణ నష్టనివారణకు దిగారు. 2014లో కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 40 శాతం గుజరాతీలు మాంసాహారులు. సత్యం, అహింసలే ఆయుధాలుగా పోరాడిన గుజరాతీ బిడ్డ గాంధీ సైతం శాకాహారాన్ని ప్రబోధించినా, చిన్నతనంలో మాంసం తిన్నవారే. వైష్ణవాన్ని పాటించే తల్లితండ్రులపై గౌరవంతో, అదీ విదేశాలకు వెళ్ళే ముందు తల్లికిచ్చిన మాట కోసం మాంసం, మద్యాలకు దూరంగా గడిపారు. భారత మానవ పరిణామశాస్త్ర సర్వే ప్రకారం ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన వర్గాల ఆలిండియా సగటు 60 శాతమే. ఏకంగా 70 శాతం వలస జీవులున్న గుజరాత్ విభిన్న వర్గాల సమ్మేళనం. ఆ రాష్ట్రంలో 15 శాతం మంది గిరిజనులు, 8 శాతం దళితులు, దాదాపు 20 శాతం మంది ఓబీసీలని సామాజిక శాస్త్రవేత్తల మాట. మతపరంగా గుజరాత్లో 88.5 శాతం హిందువులు, ఒక శాతం జైనులు, దాదాపు 10 శాతం ముస్లిములు, క్రైస్తవులని లెక్క. శాకాహారాన్ని బోధించే వైష్ణవం అక్కడ ఎక్కువైనా, దేశంలో అత్యంత శాకాహార రాష్ట్రం గుజరాత్ కాదు. ‘పూర్తి శాకాహార’ జనావాసం లెక్కల్లో రాజస్థాన్, హర్యానా, చివరకు పంజాబ్ తరువాతే గుజరాత్. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం గుజరాత్లో మాంసోత్పత్తి 2004–05లో 13 వేల టన్నులుంటే, 2018–19 కల్లా అది రెట్టింపు దాటింది. అందులో అధిక భాగం గుజరాత్‌లోనే వినియోగమవుతోంది. ఇక, దేశ మత్స్య ఉత్పత్తిలో 17 శాతం గుజరాత్ వాటానే. వీధి ఆహార బండ్లు మన దేశంలో, ముఖ్యంగా పట్టణాల్లో సర్వసాధారణం. అది భారత ప్రభుత్వానికీ తెలుసు. అందుకే, ఆ వ్యాపారాలకు నిర్వహణ మూలధనంలో సాయం చేసేందుకు ప్రత్యేకమైన సూక్ష్మ రుణ పథకాన్ని 2020 జూన్‌లో కేంద్రమే సిద్ధం చేసింది. తీరా ఇప్పుడు గుజరాత్ మునిసిపల్ అధికారులకు ఈ వీధి బండ్లే అడ్డం అనిపించడం విడ్డూరం. మద్యం లాగా మాంసంపై గుజరాత్లో అధికారిక నిషేధం లేదు. కానీ, ఆధిపత్య సామాజిక, సాంస్కృతిక ఆచారవిచారాల వల్ల గుజరాత్లో మాంసం తినడం తప్పు అనే భావన ప్రచలితమైంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ఆదేశాలతో దాన్ని పునరుద్ఘాటిస్తే ప్రయోజనం ఏమిటి? మాంసాహారం ధార్మికంగా తప్పు అన్నట్టు ముద్ర వేసి, సాంప్రదాయికంగా మాంసాహారులైన వర్గాల పట్ల ద్వేషం రెచ్చగొడితే ఆ పాపం ఎవరిది? రాష్ట్ర స్థాయి ఆదేశాలు లేవన్న మాటే కానీ, హర్యానా లాంటి రాష్ట్రాల్లోని పట్నాల్లో పండుగల వేళ మాంసం షాపులపై స్థానికంగా నిషేధం సాగుతోంది. ఐఐఎం–అహ్మదాబాద్ బయట మాంసాహార స్టాల్స్‌పై 2003 నుంచి అప్రకటిత నిషేధమే. ఈ ధోరణులు ప్రబలితే, సామరస్య సహజీవనానికే గొడ్డలిపెట్టు. అణగారిన వర్గాలైన ముస్లిమ్‌లు, దళితుల ప్రధాన ఆహారంపై ఇలాంటి ముద్రలు వారిని సమాజంలో మరింత దూరం నెట్టే ప్రమాదం ఉంది. సామాన్యులు ఏది తింటే సామాజికంగా అంగీకారయోగ్యమో చెప్పేందుకు పాలకులు పూనుకొంటే, అంతకన్నా దుర్మార్గం ఉండదు. చివరకు తినే తిండిపైనా జోక్యం ఏమిటన్న ఆగ్రహం జనంలో కలిగితే ఆ తప్పు... ప్రభుత్వాలది, పాలకులదే! -
Viral Video: ‘వాట్ ఏ టైమింగ్.. ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్ అయ్యింది’
స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే.. పానీపూరి, సమోసా, ఫాస్ట్‌ఫుడ్, బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఫుడ్ ఏదైనా అన్నీంటిని ఆవురావురని లాగించేస్తుంటాం. ఇవి ఆర్యోగ్యానికి అంతగా హెల్దీ కావని తెలిసిన వారానికి ఒకసారైన నాలుకకు వీటి రుచి తాగాలాల్సిందే. స్ట్రీట్ వెండర్స్‌కు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంతమంది ఆ ఫుడ్‌ను ఇష్టపడి అక్కడికి వెళ్లి తింటే మరికొంత వాళ్లు స్టైల్‌గా చేసే కుకింగ్ విధానానికే ఫిదా అయిపోయి వెళ్తుంటారు. చేతులతో గరిటెలను, గిన్నేలను అటు ఇటు తిప్పుతూ రఫ్ఫాడిస్తుంటారు. చదవండి: ఇది కదా ఫిట్నెస్: ఈ ముగ్గురు భామలకు ఫిదా అవ్వాల్సిందే తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ స్ట్రీట్ వెండర్ తన బాణీలో కుక్ చేసిన గ్రీన్ బీన్స్‌ను అలా స్టైల్‌గా ఆడిస్తూ ఒక్కసారిగా పైకి గాల్లోకి విసిరేశాడు. అవి నేరుగా రోడ్డు పక్క వీధి వద్ద నిల్చున్న వ్యక్తి ప్లేట్లో పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 22 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. చదవండి: ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే దీనిని చూసిన నెటిజన్లు అసలు ఇది నిజమేనా? అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది ఆ వ్యక్తి నైపుణ్యాలను మెచ్చకుంటున్నారు. ‘వావ్.. వాట్ ఏ స్టైల్.. టైమింగ్ అదిరింది గురూ. ఇక్కడ విసిరితే అక్కడ సరిగ్గా ల్యాండ్ అయింది చూడు. అది గ్రేట్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Travel • Nature • wildlife 🌍 (@beutefullplacee) -
గుజరాత్లో ‘నాన్–వెజ్’ గొడవ!
అహ్మదాబాద్: మాంసాహారాన్ని విక్రయించే తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలపై గుజరాత్‌లోని పలు నగరపాలికలు ఆంక్షల కొరడా విధించాయి. అశుభ్రమైన పదార్థాలు విక్రయిస్తున్నారంటూ అహ్మదాబాద్, భావ్‌నగర్, రాజ్‌కోట్‌లోని పలు ప్రముఖ వ్యాపార కూడళ్లలోని వీధి వ్యాపారుల బండ్లను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. అయితే, దీనిపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. నాన్–వెజ్‌కు మేం వ్యతిరేకం కాదని, అశుభ్రమైన, కాలుష్యమయ రోడ్లపై బహిరంగంగా ఆహారపదార్థాల విక్రయాలపైనే తాము దృష్టిపెట్టామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. పౌరుల ఆహారపు అభిరుచులపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులు లేవని, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పష్టంచేశారు. మరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం రోడ్లపై అక్రమ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అహ్మదాబాద్‌లో వీధి వ్యాపారాలతో రద్దీగా ఉండే ప్రఖ్యాత వస్త్రపూర్ లేక్ ప్రాంతంలోని స్ట్రీట్‌ఫుడ్‌కు నో చెప్పింది. పాఠశాలలు, కళాశాలలు, గార్డెన్లు, మతసంబంధ ప్రాంతాలకు 100 మీటర్ల దూరంలోపు వీధి వ్యాపారాలపై నిషేధం విధించారు. బిజీ రోడ్లపై నాన్–వెజ్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని బీజేపీ పాలిత అహ్మదాబాద్, భావ్‌నగర్, రాజ్‌కోట్, జునాగఢ్, వడోదర మున్సిపల్ కార్పొరేషన్లు గత వారం ప్రకటించడంతో వీధి వ్యాపారుల్లో ఆందోళనలు పెరిగాయి. -
వీధి వ్యాపారులకు రుణాల్లో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణాల పంపిణీలో తెలంగాణ దేశంలోనే నంబర్ స్థానంలో నిలిచింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 3.4 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా, 3.57 లక్షల మంది (105 శాతం)కి రూ.357.61 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ పథకం అమలుపై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్ర.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, డైరెక్టర్ ఎన్.సత్యనారాయణలను అభినందించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని వీధి వ్యాపారులు ఇప్పటి వరకు రూ.35.03 లక్షల క్యాష్ బ్యాక్‌ను పొందారు. మొత్తం దేశంలో పంపిణీ చేసిన క్యాష్ బ్యాక్‌లో 37 శాతాన్ని తెలంగాణ వీధి వ్యాపారులు దక్కించుకున్నారు. -
బజ్జీల బండి.. కోట్ల ఆస్తులండీ!
ఓ చిన్న పాన్‌షాపు.. పక్కనే ఓ బజ్జీలు, మిర్చీల దుకాణం.. ఆ పక్కన ఓ కిరాణా.. చూస్తే ఏదో మధ్య తరగతి బతుకుల్లా కనిపిస్తాయి. కానీ ఇంటికెళ్లి చూస్తే వైభోగమే. పెద్ద పెద్ద ఇళ్లు, కార్లు, కోట్ల విలువైన భూములు, ఆస్తులు.. ఇలా ఏదో ఒకరిద్దరు కాదు.. వందలాది మంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేసిన దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే ఇలాంటివెన్నో వెలుగుచూశాయి. ఆ వివరాలు తెలుసుకుందామా? చిన్న దుకాణాలు.. వీధి వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నా పన్ను కట్టకుండా ఎగ్గొడుతున్నవారిపై కన్నేసిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇటీవల కాన్పూర్‌లో నిఘా పెట్టింది. పలు ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా, మందులు, కూరగాయల దుకాణాలు నడుపుతున్నవారు, వీధి వ్యాపారులు కూడా లక్షలు, కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నట్టు గుర్తించింది. అలాంటి 250 మందిపై దాడులు చేసిన అధికారులు.. వారి ఆస్తులు చూసి బిత్తరపోవడం గమనార్హం. ఈ 250 మంది గత నాలుగేళ్లలోనే ఏకంగా రూ.375 కోట్ల మేర వెనకేసినట్టు ఐటీ అధికారులు తేల్చారు. వారు కాన్పూర్‌లోని స్వరూప్ నగర్, ఆర్యనగర్, హులాగంజ్, బిర్హానారోడ్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములు, స్థలాలు కొన్నట్టు గుర్తించారు. కొందరు పాన్ షాపుల ఓనర్లు గత ఏడాది లాక్డౌన్ నాటి నుంచి ఏకంగా రూ.5 కోట్ల మేర ఆస్తులు సంపాదించుకున్నారు. బికాన్గంజ్కు చెందిన ఇద్దరు, లాల్‌బంగ్లా ప్రాంతానికి చెందిన ఒక శానిటేషన్ వర్కర్లు గత రెండేళ్లలో రూ.10 కోట్ల విలువైన ఇళ్లు, స్థలాలు కొన్నారు. రెండు, మూడు కార్లు.. కాన్పూర్‌లో గుర్తించిన సీక్రెట్ మిలియనీర్స్ (రహస్య కోటీశ్వరులు)లో చాలా మందికి రెండు, మూడు కార్లు ఉన్నాయి. మాల్‌రోడ్‌లో ఓ స్నాక్స్ (పానీపూరీ, వడాపావ్ వంటివి) షాపు యజమాని తాను కిరాయికి తీసుకున్న కార్లు, ఇతర వాహనాల కోసం ప్రతినెలా లక్షా 25 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. లక్షలు, కోట్లలో వ్యాపారం చేస్తున్నా.. ఐటీ అధికారులు దాడులు చేసిన 250 మంది కూడా లక్షలు, కోట్లలో వ్యాపారం చేస్తున్నా ఎలాంటి పన్నులూ కట్టడం లేదని గుర్తించారు. బిగ్‌డేటా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వారి వ్యాపారాలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇతర లెక్కలు తేల్చారు. 65 మంది అసలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదని గుర్తించారు. ఏటా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా బయటపడకుండా వివిధ మార్గాలు అనుసరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఆస్తులు కొన్నారు. జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో కాకుండా సహకార బ్యాంకుల్లో, ఆర్థిక పథకాల్లో, ప్రైవేటు చిట్టీలు, ఫైనాన్స్ సంస్థల్లో డిపాజిట్లు చేశారు. ఎలా బయటపడ్డారు? సొమ్ము ట్రాన్స్ఫర్ల సమయంలో, కొన్ని ప్రభుత్వ పత్రాలకు సంబంధించి కొందరు వ్యాపారులు పాన్‌కార్డు వివరాలను ఇచ్చారు. వీటితోపాటు ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ఆధార్ వినియోగించారు. పాన్ కార్డు, ఆధార్ రెండింటినీ లింక్‌చేసి ఉండటంతో భారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు అధికారులకు అందాయి. దీనిపైవారు కూపీ లాగడంతో లక్షలు, కోట్లలో వ్యాపారం,సంపాదన బయటపడ్డాయి. ఇదే మొదటిసారేం కాదు.. మన దేశంలో ఇలా చిన్న దుకాణాలు, వీధి వ్యాపారం చేసే ‘రహస్య కోటీశ్వరుల’ను గుర్తించడం ఇదే మొదటిసారేం కాదు. 2016లో కాన్పూర్‌లోనే సుమారు 12 మంది వీధి వ్యాపారుల దగ్గర రూ.60 కోట్ల లెక్కలు చూపని ఆస్తులను గుర్తించారు. 2019లో అలీగఢ్‌లో ఓ చిన్న స్నాక్స్ బండి యజమాని ఏటా 60 లక్షలకుపైగా టర్నోవర్ చేస్తున్నట్టు తేల్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
తండ్రి కూరగాయాల వ్యాపారి.. కొడుకు కోరుకున్న కొలువు సాధించాడు
పూణె (ముంబై): కలలు కనండి, వాటిని నిజం చేసుకోండనే మాట వినే ఉంటాం. కాకపోతే కలలను నిజం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఓ వ్యక్తి తన కలల కోసం పట్టువదలకుండా శ్రమించి చివరికి సాధించాడు మహరాష్ట్రలోని ఓ కూరగాయల వ్యాపారి కుమారుడు. వివరాల్లోకి వెళితే.. పూణెలోని కూరగాయల వ్యాపారి కుమారుడు హృషీకేష్ రస్కర్ తన కలలను నిజం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తాను కోరుకున్న జాబ్ కొట్టేశాడు. కాగా ఈ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డ రస్కర్ చివరకు ఎన్నో వ్యయప్రయాసలు దాటుకుని సాధించాడు. అతను.. ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. మొదట తాను ఆశించిన ఉద్యోగం లభించకపోవడంతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పలు ఉద్యోగాలను వదిలేశాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్ధితి తెలుసుకాబట్టి ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో తన ఉన్నత విద్యను అభ్యసించి ఆపై తన కల నెరవేర్చుకున్నాడు. బ్యాకెండ్ ఇంజనీర్లో నైపుణ్యాలు సాధించిన రస్కర్ తాను కలలను నిజం చేసుకోవడానికి రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. తన విజయానికి మొదట నుంచి మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. తాను అభ్యసించిన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్‌ను మెరుగ్గా తిరిగి నేర్చుకోవడం కూడా తనకు బాగా ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలో రస్కర్ ఉద్యోగం సాధించడంతో తమ కష్టాలు తీరనున్నాయని అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బతుకు చిత్రం 14 june 2021
-
బతుకు దెరువుబాటలో.. చదువు చెప్పిన సారు
బన్సీలాల్‌పేట్: కరోనా కాటుకు ఎన్నో జీవితాలు కకావికలం అయ్యాయి. పలువురు ఉపాధి కోల్పోయి వీధి పాలయ్యారు. ఇదే కోవలో ప్రైవేటు టీచర్ల పరిస్ధితి దయనీయంగా మారింది. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బడి పంతుళ్లు రోడ్ల పాలయ్యారు. కొందరు కూరగాయలు అమ్ముతుంటే.. మరికొందరు చిరు వ్యాపారులుగా మారి పొట్టపోసుకుంటున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోలక్పూర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ స్కూల్ అధినేత శివరామకృష్ణ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. బతుకు దెరువు కోసం తప్పనిసరి అయిందని బోలక్పూర్ సెయింట్ సాయి హైస్కూల్ అధినేత శివరామకృష్ణ్ణ సాక్షితో వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు) -
సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
వీధి వ్యాపారులకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్
భోపాల్: వీధుల్లో తోపుడు బండ్లపై, ఇతర మార్గాల్లో చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం పెద్ద రెస్టారెంట్ల తరహాలో ఒక ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన పథకం ఒకటి రూపకల్పన దశలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎంస్వనిధి) లబ్ధిదారులను ఉద్దేశించి ఆన్లైన్లో మోదీ మాట్లాడారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకోకుండా, డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. పీఎం స్వనిధి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పీఎం స్వనిధి లబ్ధిదారులైన ఇండోర్ జిల్లాకు చెందిన చగన్‌లాల్, గ్వాలియర్‌కు చెందిన అర్చన, రాయిసెన్ జిల్లాకు చెందిన దాల్ చంద్ తదితరులతో ప్రధాని మాట్లాడారు. చీపురు కట్టల వ్యాపారంలో మరింత లాభం ఆర్జించేందుకు చగన్‌లాల్‌కు ప్రధాని ఒక సూచన చేశారు. చీపురు కట్టలోని ప్లాస్టిక్ పైప్‌ను తిరిగివ్వాల్సిందిగా వినియోగదారులను కోరాలని, ఆ పైప్‌లను మళ్లీ వాడడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించారు. పీఎం మత్స్యసంపద యోజన మత్స్యకారులకు ఉపయోగపడే ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)’ పథకాన్ని నేడు మోదీ ప్రారంభించనున్నారు. ‘ఈ–గోపాల’ అనే యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. బిహార్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. -
మూడు రెక్కల దేవత
దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్‌లోని లైబి ఓయినమ్‌కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్ను ఇప్పుడు మణిపూర్‌లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు. జూన్ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని తూర్పు ప్రాంతం డ్యూలాలాండ్లో ఒక అంబులెన్స్ ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయిని, ఆమె తండ్రిని దించేసి వెళ్లిపోయింది. ‘మమ్మల్ని ఇంటి దాకా దించుతామన్నారు కదా’ అన్నారు తండ్రీ కూతుళ్లు. ‘ఇక్కడ నుంచి జిల్లా మారిపోతుంది. జిల్లా లోపలి వరకే దించాలి. దాటకూడదని రూలు’ అని వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. తండ్రీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు. ఒకవైపు చూస్తే చీకటి పడుతోంది. అమ్మాయి పేషెంట్. కోవిడ్ బారిన పడి పద్నాలుగు రోజులు ఇంఫాల్‌లోని ప్రసిద్ధ వైద్య సంస్థ జె.ఎన్.ఐ.ఎమ్.ఎస్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యింది. తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. వాళ్లది ఇంఫాల్ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న కాంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామం. అక్కడకు వెళ్లాలి. ఎలా? తండ్రి తన కూతురిని రోడ్డు పక్కన నిలబెట్టి టాక్సీల కోసం పరిగెత్తాడు. మొదట అందరూ వస్తామన్నారు. బేరం చేశారు. తీరా తీసుకెళ్లాల్సింది పేషెంట్‌ని అని తెలిశాక వెనక్కు తగ్గారు. ‘మా అమ్మాయికి కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు లేదు. భయపడకండి’ అని తండ్రి చెప్పినా ఎవరూ వినలేదు. ‘అమ్మో.. మేము రాలేం’ అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ల బాధ చూసిన ఎవరో లైబి ఓయినమ్‌కు ఫోన్ చేశారు. లైబి ఓయినమ్ ఇంఫాల్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్. అంతకు ముందు ఆమె స్ట్రీట్ వెండర్‌గా అవీ ఇవీ రోడ్డు పక్కన అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త ఉన్నా కుటుంబానికి తన సంపాదన ఆధారం. ‘కోవిడ్ పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు వాళ్లు. ‘వారికి అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను’ అంది లైబి. కాని ఆమెకు ఉన్నది ఆటో మాత్రమే. వెళ్లాల్సిన దూరం పెద్దది. అంత దూరం ఆటోలో వెళ్లడం సాధ్యమా? పైగా చీకటి పడిపోయింది. తోడు కోవిడ్ నుంచి బయటపడ్డ అమ్మాయి. రకరకాల ఆలోచనలు వచ్చినా లైబి ధైర్యం చేసి భర్తకు ఫోన్ చేసింది. ‘నాతో తోడురా. బేరం వచ్చింది’ అని చెప్పింది. భర్త ఆమెను చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ తండ్రీ కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ‘పదండి పోదాం’ అన్నారు. లైబి, ఆమె భర్త ముందు కూర్చుంటే వెనుక బాధితురాలు, ఆమె తండ్రి కూచున్నారు. ప్రయాణం మొదలైంది. గంట కాదు... రెండు గంటలు కాదు... ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ఆటోను నడిపింది లైబి. రాత్రి రెండున్నర ప్రాంతంలో పేషెంట్‌ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. ఆమె చేసిన పనికి ఆ కుటుంబం శతకోటి నమస్కారాలు పెట్టింది. లైబి భర్తతో అప్పటికప్పుడు తిరిగి వచ్చేసింది. కాని ఈ విషయం వెంటనే పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. లైబి చేసిన పనిని ఇంఫాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న చాలామంది, ముఖ్యంగా మణిపూర్ వాసులు మెచ్చుకున్నారు. ఆమెకు కానుకగా ఇవ్వడానికి అందరూ డబ్బు పంపారు. అవన్నీ లక్షా పది వేల రూపాయలు అయ్యాయి. వాటిని జూన్ 11న మణిపూర్ సి.ఎం. ఎన్.బిరేన్ సింగ్ ఆమెకు అందజేశాడు. ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు. లైబి ఆ పేషెంట్‌ను దింపి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సూచనల ప్రకారం తన భర్తతో కలిసి క్వారంటైన్లో ఉంటోంది. డిశ్చార్జ్ అయిన కోవిడ్ పేషెంట్‌తో అంత సేపు ఉన్నందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది. మణిపూర్‌లో తొలి మహిళా ఆటో డ్రైవర్ అయిన లైబి మీద రెండేళ్ల క్రితం ‘ఆటో డ్రైవర్’ పేరుతో డాక్యుమెంటరీ తయారైంది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘స్త్రీలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఆమె జీవితం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీ చూసినవాళ్లంతా అన్నారు. ఇప్పుడు తన సేవాభావంతో కూడా ఆమె చాలామందికి స్ఫూర్తి కలిగిస్తోంది. దేవతలు తెల్లటి బట్టల్లో ఉండరని, సాదాసీదా ఖాకీ యూనిఫామ్ వేసుకు తిరుగుతుంటారు లైబిని చూస్తే మనకు అర్థమవుతుంది. శాలువాతో సత్కరిస్తున్న సీఎం. ఎన్.బిరేన్ తనను ఇంటికి చేర్చిన లైబీతో ప్రయాణికురాలు -
వీధి వ్యాపారుల గుర్తింపునకు సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులను గుర్తించేందుకు సర్వేను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ప్రాజెక్టు (మెప్మా)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. సర్వే చేయాల్సిన తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మంగళవారం సమీక్ష జరిగిన నేపథ్యంలో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీధి వ్యాపారుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ‘పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి’పథకంలో లబ్ది దారులను ఎంపిక చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ జనాభాలో కనీసం రెండు శాతం మంది వీధి వ్యాపారులను గుర్తించాలి. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 0.58శాతం మందినే గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తింపునకు నోచుకోని వీధి వ్యాపారులతో పాటు పట్టణ పరిసరాల్లోని వారిని కూడా గుర్తించి ఈ నెల 25వ తేదీలోగా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. వీధి వ్యాపారుల సర్వే కోసం ప్రత్యేక యాప్‌ను ఇప్పటికే రూపొందించారు. వారు లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వేను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో పాటు, మెప్మా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు రోజూవారీగా పర్యవేక్షించాలని ఆదేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ కార్పోరేషన్లను మినహాయించి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో 1.46కోట్ల జనాభా ఉంది. వీరిలో 2,92లక్షల మందిని వీధి వ్యాపారులుగా గుర్తించాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 85వేల మందిని మాత్రమే గుర్తించారు. మరో 2.06లక్షల మందిని వీధి వ్యాపారులుగా గుర్తించేందుకు ప్రస్తుత సర్వేను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది.