పానీ పూరీ, గోల్ గప్పా, ఫుచ్కాస్ పేరేదైనా ఈ మాట వివగానే నోట్లో ‘పానీ’ ఊరాల్సిందే కదా? దేశ వ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది పానీ పూరీకి. భారతదేశం అంతటా పలు ప్రాంతాల్లో రకరకాలుగా పిలుచుకున్నప్పటికీ స్ట్రీట్ ఫుడ్‌లో ఇదే రారాణి. అందుకే సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ కూడా ప్రాధాన్యత ఇచ్చింది.
ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్ పానీ పూరీని వేడుక జరుపుతోంది.ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో, ప్రత్యేకమైన గేమ్‌తో 'పానీ పూరీ' వేడుక జరుపుతోంది. 2015, జూలై 12న మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ 51 రకాల పానీ పూరీ రుచులను అందించి ప్రపంచ రికార్డ్‌ను సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎనిమిదో వార్షికోత్సవంగా ఈ విశేషమైన రికార్డును సెలబ్రేట్ చేస్తోంది. ఇందుకోసం ఇంటరాక్టివ్ గేమ్‌ను ఆడే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తోంది.
ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో పానీ పూరీ ఆర్డర్ ఇవ్వొచ్చు. తద్వారా వీధి వ్యాపారులకు సాయం చేయడంతోపాటు, ప్రతి కస్టమర్‌ను సంతోషంగా ఉంచాలనేది ప్రధాన లక్ష్యంమని గూగుల్ తెలిపింది. వినియోగదారులు వారి రుచి , పరిమాణం ప్రాధాన్యతకు సరిపోయే పూరీలను ఎంచుకోవాల్సి ఉంది.
ఈ ఇంటర్‌యాక్టివ్ గేమ్ ఆడాలంటే
గూగుల్ డాట్ కామ్‌కు లాగిన్ చేయండి
పైన ఉన్నడూడుల్‌పై క్లిక్ చేయండి
టైమ్, లేదా రిలాక్స్‌డ్ తింటారా అనే మోడ్ ఎంచుకోవాలి?
సరైన పానీ పూరీ ఫ్లేవర్‌పై క్లిక్ చేయడమే..
ద్రౌపది క్రియేటివిటీకి ప్రతి రూపమే పానీ పూరీ
అంతేకాదు ఈ పానీ పూరీకి పెద్ద చరిత్రే ఉందట, పురాణ మహాభారత కాలంలో కొత్తగా పెళ్లయిన ద్రౌపదికి తన ఐదుగురు భర్తలకు ఉన్న కొద్ది వస్తువులతోనే ఏదైనా కొత్తగా వండి పెట్టాలనే చాలెంజ్ వచ్చిందంట. ముఖ్యంగా కొద్దిగా మిగిలిన బంగాళదుంపలు, ఇతర కూరగాయలు, చాలా కొంచెం గోధుమ పిండితోనే చేయాలి. ఇక్కడే ద్రౌపది తన క్రియేటివిటీని ప్రదర్శించింద. ఆలూ,ఇతర కూరలతో స్టఫింగ్ తయారు చేసి, ఉన్న కొద్దిపాటి పిండితోనే పూరీలు చేసి పెట్టిందట. అలా పానీ పూరీ తయారైందని గూగుల్ పేర్కొంది.
ఆహా అనరా మైమరచి
కాగా మహారాష్ట్ర , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉడికించిన ఆలూ, చిక్‌పీస్ మిశ్రమాన్ని పూరీలో స్టఫ్ చేసి, పుదీనా, చాట్ మలాసా యాడ్ చేసి, కారం కారంగా, వేడి వేడిగా ఉండే పానీలో ముంచి, పైన అలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్రిస్పీ పూరీని అలా అమాంతం నోట్లో వేసుకుని, కర కర మంటూ నమిలి మింగుతూ ఉంటే ఆహా.. అనరా మైమరచి అంటారు.
ఉత్తర భారతంలో పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్, న్యూ ఢిల్లీలలో, బంగాళాదుంపలు చిక్‌పీలను మిశ్రమం, జల్జీర నీటిలో ముంచిన ట్రీట్‌నే గోల్ గప్పే లేదా గోల్ గప్పా అంటారు. దీన్నే పుచ్కాస్ లేదా ఫుచ్కాస్ అని పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో పిలుస్తారు. అన్నట్టు దీనికి చింతపండు గుజ్జు, బెల్లంతో చేసిన ‘స్వీట్’ కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment