![Video Of Locals In US Enjoying Pani Puri Goes Viral Internet Reacts](/styles/webp/s3/article_images/2024/06/10/PaniPuri_America.jpg.webp?itok=QMjPeBmg)
భారతదేశంలో అత్యంత ఇష్టమైన,అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పానీ పూరీ. ఖట్టా-మీఠా ఇలా వివిధ రకాల రుచులు, స్టఫ్ఫింగ్స్‌తో .. అసలు ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్ చాలామందికి. అలాంటి పానీ పూరీ తాజాగా, అమెరికావాసులను కూడా ఫిదా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
మిన్నియాపాలిస్ వాసులు అక్కడి భారతీయ రెస్టారెంట్ , కర్రీ కార్నర్ వద్ద పానీ పూరీ తెగ లాగించేస్తూ మురిసిపోతున్నారు. ‘ఆహా తినరా మై మైరచి అంటున్నారు. మరికొందరైతే మాటల్లేవు.. అంటూ పానీ పూరీని ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. పానీపూరి ప్యూర్ లవ్ అని అని ఒక ఇన్‌స్టా యూజర్ కామెంట్ చేశాడు. మినిమం 30 పూరీలు ఏగబిగిన లాగించేయాల్సిందే.. 20కి పైగా పానీ పూరీలు తింటూ ఉంటే.. అలా కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోతే ఉంటే అప్పుడు గానీ పానీ పూరీ తినడంలోని మజా అర్థం కాదు.. ఇలా పలు కామెంట్లు సందడి చేస్తున్నాయి.
పాపులర్ పానీ పూరీని మిన్నియాపాలిస్ వాసులకు పరిచయం చేశాము అంటూ సదరు రెస్టారెంట్ ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఈ రీల్ ఏకంగా 3.9 మిలియన్ల వీక్షణలు, 90వేలకు పైగా లైక్స్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment